27-03-1983 అవ్యక్త మురళి

* 27-03-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

కుమారీల భట్టీలో ప్రాణ అవ్యక్త బాప్ దాదా మాట్లాడిన మహావాక్యాలు

ఈరోజు బాప్దాదా పిల్లలందరితోను ఎక్కడ కలుసుకుంటున్నారు? మీరు ఏ స్థానంలో కూర్చున్నారు? సాగరము మరియు నదుల మిలన స్థానంలో మిలనము జరుపుతున్నారు. సాగర తీరము అంటే మీకు ఇష్టము కదా! కేవలం సాగరం కాదు అనేక నదులతో సాగరము కలిసే ఆ మిలన స్థానము ఎంత శ్రేష్ఠంగా ఉంటుంది! సాగరమునకు కూడా నదుల యొక్క మిలనము ఎంత ప్రియముగా అనిపిస్తుంది! ఇటువంటి మిలనమేళ ఇంకే యుగములోనైనా జరుగుతుందా? ఈ యుగము యొక్క కలయిక మొత్తం కల్పంలో భిన్న భిన్న రూపాలు మరియు రీతులతో గానము చేయబడుతుంది మరియు జరుపుకోబడుతుంది. ఇటువంటి మేళాను జరుపుకునేందుకు వచ్చారు కదా! అనేక స్థానాల నుండి ఇందుకోసమే పరిగెత్తుకుంటూ వచ్చారు కదా! సాగరంలో ఇమిడిపోయి సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయిపోతారు అనగా బాబా సమానంగా బేహద్ స్వరూపంలో స్థితులవుతారు. ఇటువంటి బేహద్ అనుభవమును పొందుతారు కదా! బేహద్ వృత్తి అనగా సర్వాత్మలపట్ల కళ్యాణవృత్తి, మాస్టర్ విశ్వకళ్యాణకారి. కేవలం స్వయం యొక్క లేక తమ హద్దులో నిమిత్తులైన ఆత్మల యొక్క కళ్యాణార్థము కాదు సర్వులపై కళ్యాణవృత్తి ఉండాలి. నేనైతే బ్రహ్మాకుమారీగా అయిపోయాను, పవిత్ర ఆత్మగా అయిపోయాను, నా ఉన్నతిలో, నా ప్రాప్తిలో, నాపట్ల సంతుష్టతలో రాజీగా అయి నడుస్తున్నాను... ఇది బాబా సమానంగా బేహద్ వృత్తిని ఉంచే స్థితి కాదు. హద్దులోని వృత్తి అనగా కేవలం స్వయంపట్ల సంతుష్టత యొక్క వృత్తి. కేవలం ఇక్కడవరకే ఉండాలా లేక ఇంకా ముందుకువెళ్ళాలా? అనేకమంది పిల్లలు బేహద్ సేవ యొక్క సమయము, బేహద్ ప్రాప్తి యొక్క సమయము, బాబా సమానంగా అయ్యే స్వర్ణిమ అవకాశము లేక గోల్డ్మెడల్ను తీసుకునేందుకు బదులుగా నేను సరిగ్గానే నడుస్తున్నాను, ఎటువంటి పొరపాట్లు చేయడం లేదు, లౌకిక, అలౌకిక జీవితాలను రెండింటినీ మంచిగా నిర్వర్తిస్తున్నాను, ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి సంఘఠన యొక్క సంస్కారాల ఘర్షణా లేదు అన్న ఈ సిల్వర్ మెడల్లోనే సంతోషపడిపోతారు. బాబా సమానమైన బేహద్ వృత్తి అయితే లేదు కదా! బాబా విశ్వకళ్యాణకారి అయి పిల్లలు స్వకళ్యాణకారులై ఉంటే ఇటువంటి జోడి మంచిగా అనిపిస్తుందా? వినేందుకే మంచిగా అనిపించడం లేదు. మరి ఎప్పుడైతే అలా తయారై నడుచుకుంటారో అప్పుడు మంచిగా అనిపిస్తుందా? సర్వఖజానాల యజమానులైన పిల్లలు ఖజానాలలో మహాదానులుగా అవ్వకపోతే దాన్ని ఏమంటారు? బాబా యొక్క సర్వఖజానాల వారసత్వానికి అధికారులేనా అని ఎవరిని అడిగినా అందరూ అవును అనే అంటారు కదా! ఖజానాలు ఎందుకు లభించాయి? కేవలం స్వయం తింటూ తాగుతూ మీ ఆనందంలో ఉండేందుకు లభించాయా? పంచండి మరియు పెంచండి అన్న డైరెక్షనే లభించింది కదా! మరి ఎలా పంచుతారు? గీతా పాఠశాలలు తెరిచారా లేక ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పంచి అందులోనే సంతుష్టులయ్యారా? బేహద్ తండ్రి నుండి బేహద్ ప్రాప్తి మరియు బేహద్ సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలలో ఉండాలి. కుమారీ జీవితము సంగమ యుగంలో సర్వ శ్రేష్ఠ వరదానీ జీవితము. ఇటువంటి వరదానీ జీవితము డ్రామా అనుసారంగా విశేష ఆత్మలైన మీకు స్వతహాగా ప్రాప్తమైంది. ఇటువంటి వరదానీ జీవితమును సర్వులకు వరదానమును, మహాదానమును ఇవ్వడంలో వినియోగిస్తున్నారా? స్వతహాగా ప్రాప్తమైన వరదానం యొక్క రేఖలు శ్రేష్ఠ కర్మల కలము ద్వారా ఎంత పెద్దగా తీర్చిదిద్దుకోవాలంటే అంత పెద్దగా తీర్చిదిద్దుకోవచ్చు. అది కూడా ఈ సమయం యొక్క వరదానమే. సమయం కూడా వరదానమే, కుమారీ జీవితం కూడా వరదానమే, బాబా కూడా వరదాతయే. కార్యము కూడా వరదానమును ఇచ్చే కార్యమే. మరి దీని పూర్తి లాభాన్ని పొందారా? 21 జన్మలవరకు భాగ్యరేఖను పొడుగ్గా గీసుకునే అవకాశం ఉంది. 21 తరాలు సదా సంపన్నంగా అయ్యే అవకాశమేదైతే లభించిందో అది తీసుకున్నారా? కుమారీ జీవితంలో ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. స్వతంత్ర ఆత్మ యొక్క భాగ్యము ప్రాప్తించింది. స్వతంత్రంగా ఉన్నానా లేక పరతంత్రంగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పరతంత్రత యొక్క బంధనము తమ మనస్సు యొక్క వ్యర్థమైన మరియు బలహీనమైన సంకల్పాల జాలము. ఆ రచించిన జాలములో స్వయమును పరతంత్రముగా అయితే చేసుకోవడం లేదు కదా! ప్రశ్నల జాలము ఉందా? ఏ జాలమునైతే రచిస్తారో దాని చిత్రమును తయారుచేసినట్లయితే అది ప్రశ్న రూపంగానే ఉంటుంది. ఎటువంటి ప్రశ్నలు వెలువడతాయి? అనుభవజ్ఞులే కదా! ఏమౌతుంది, ఎలా అవుతుంది, ఇలా జరగదు కదా!... ఇదే ఆ జాలము. సంగమయుగ బ్రాహ్మణులకు ఉన్న ఏకైక సదాకాలిక సంకల్పము- 'ఏది జరిగినా అది కళ్యాణకారియే, ఏది జరిగినా అది శ్రేష్ఠముగానే జరుగుతుంది, ఎంతో మంచిగానే జరుగుతుంది'. జాలమును సమాప్తం చేసే సంకల్పము ఇదే. చెడు రోజులు, అకళ్యాణపు రోజులు సమాప్తమైపోయాయి. సంగమ యుగపు ప్రతిరోజు గొప్పరోజే, చెడురోజు కానే కాదు. ప్రతిరోజూ మీ ఉత్సవపురోజే కదా! ప్రతిరోజును జరుపుకోవాలి.... ఈ సమర్థ సంకల్పంతో వ్యర్థ సంకల్పాల జాలమును సమాప్తం చేయండి.

కుమారీలు బాప్దాదా యొక్క, బ్రాహ్మణ కులము యొక్క శోభ. మొదటి అవకాశము కుమారీలకు లభిస్తుంది. చిన్న, చిన్న కుమారీలు టీచర్లుగా అయిపోతారు, దాదీలుగా అయిపోతారు, దీదీలుగా అయిపోతారు అని పాండవులు నవ్వుకుంటూ ఉంటారు. కావున ఇంతి అవకాశము లభిస్తుంది. అయినా అవకాశమును తీసుకోకపోతే దాన్ని ఏమంటారు? ఏమాంరో మీకు తెలుసు కదా! సహయోగులుగా ఉంటాము కాని సమర్పణ అవ్వము అని అంటారు. ఎవరైతే సమర్పణ అవ్వరో వారు సమానంగా ఎలా అవుతారు? బాబా ఏం చేశారు? సర్వస్వమును సమర్పణ చేశారు కదా! లేక కేవలం సహయోగిగా అయ్యారా? బ్రహ్మాబాబా ఏం చేశారు? సమర్పణ చేశారా లేక కేవలం సహయోగిగా ఉన్నారా? జగదాంబ ఏంచేశారు? తాను కూడా కన్యయే కదా! కావున మాతాపితలను అనుసరించాలా లేక పరస్పరంలో సిస్టర్లను ఫాలో చేస్తారా? 'వీరి జీవితమును చూసి నాకు కూడా ఇదే మంచిగా అనిపిస్తుంది'.... మరి అది సహోదరిని అనుసరించడం కదా! ఇప్పుడేం చేస్తారు? భయము కేవలం తమ బలహీనత పైనే ఉంటుంది కాని ఇంక దేనిపైనా ఉండదు. ఇప్పుడేం తీసుకుటాంరు? గోల్డెన్ మెడల్ తీసుకుటాంరా లేక సిల్వర్ మెడలే బాగుందా! బలహీనతలను చూడకండి, వాటిని చూసినట్లయితే భయపడతారు. స్వయము బలహీనంగా అవ్వకండి అలాగే ఇతరుల బలహీనతలను చూడకండి, ఏం చేయాలో అర్థమైందా?

బాప్దాదాకు కుమారీలను చూసి సంతోషం కలుగుతుంది. ఎవరి ఇంటో్లనైనా కుమారీ పుడితే వారు దు:ఖిస్తారు కాని బాప్దాదా వద్దకు ఎంతమంది కుమారీలు వస్తే అంత ఎక్కువగా సంతోషపడతారు ఎందుకంటే ప్రతి కుమారీ విశ్వకళ్యాణకారిగా, మహాదానిగా, వరదానిగా ఉంటుందని బాప్దాదాకు తెలుసు. కావున కుమారీ జీవిత మహత్వము ఎంతో మీకు అర్థమైందా? ఈరోజు విశేషంగా కుమారీల రోజు కదా! భారతదేశంలో అష్టమినాడు విశేషంగా కుమారీలను పిలుస్తారు. కావున బాప్దాదా కూడా అష్టమిని జరుపుతున్నారు. ప్రతి కన్య అష్టశక్తి స్వరూపమే. అచ్ఛా!

ఈ విధంగా సర్వ శ్రేష్ఠ వరదానీ జీవితపు అధికారులకు, స్వర్ణిమ అవకాశమును తీసుకునే అధికారులకు, 21 తరాల శ్రేష్ఠభాగ్యపు రేఖలను దిద్దుకునే అధికారులకు, స్వతంత్ర ఆత్మ యొక్క వరదానమును పొందిన అధికారులకు, ఇటువంటి శివవంశీ బ్రహ్మాకుమారీలకు, శ్రేష్ఠ కుమారీలకు, విశేష రూపంగా మిలనము జరిపే పదమా పదమ భాగ్యశాలీ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

కర్మభోగముపై కర్మయోగము యొక్క విజయము

మీరు కర్మభోగముపై విజయమును పొందే విజయీ రత్నాలే కదా! వారు కర్మ భోగమును అనుభవించేవారిగా ఉంటారు మరియు మీరు కర్మయోగులు. అనుభవించేవారు కాదు, సదాకాలికంగా భస్మము చేసేవారు. ఎలా భస్మము చేస్తారంటే 21 జన్మలు కర్మభోగపు నామరూపాలు కూడా ఉండవు. అవి వచ్చినప్పుడే భస్మము చేస్తారు కదా! అవి తప్పకుండా వస్తాయి, అవి భస్మమయ్యేందుకే వస్తాయి కాని అనుభవించేందుకు కాదు. వీడ్కోలు తీసుకునేందుకు వస్తాయి ఎందుకంటే తాము ఇప్పుడే రాగలమని, మరింకెప్పుడూ రాలేమని కర్మభోగానికి కూడా తెలుసు కావుననే కొద్ది కొద్దిగా మధ్యలో అవకాశాన్ని తీసుకుటాంయి. ఇక్కడ వాటి పప్పులు ఉడకవని గమనించినప్పుడు ఇక తిరిగి వెళ్ళిపోతాయి.

దాదీ, దీదీలను చూస్తూ- ఇంతమంది భుజాలను చూస్తూ సంతోషం కలుగుతోంది కదా! ఏ స్వప్నాలనైతే చూస్తున్నారో అవి సాకారమైపోయాయి కదా! ఇన్ని భుజాలు ఉండాలి, ఇన్ని సెంటర్లు పెరగాలి అన్న స్వప్నాన్ని చూశారు కదా! ఎందుకంటే భుజాలు తయారవ్వాలని దాదీ, దీదీలకు అందరికన్నా ఎక్కువ ఆశ ఉంటుంది. కావున ఇంతమంది తయారైన భుజాలను చూసి సంతోషిస్తున్నారు కదా! భారతదేశపు కుమారీలలో మరియు విదేశపు కుమారీలలో కూడా తేడా ఉంది. వీరికి సంపాదించవలసిన అవసరమేముంది (డిగ్రీ తీసుకుటాంము). అప్పటివరకైతే సేవచేసే అభ్యాసము చేయరో అప్పటివరకు డిగ్రీకి కూడా విలువ లేదు. డిగ్రీ యొక్క విలువ సేవతో ఉంది. చదువు చదివిన తర్వాత కార్యంలో వినియోగించకపోతే, చదువు తర్వాత కూడా గృహస్థంలోనే ఉన్నట్లయితే ఆ చదువువల్ల లాభమేమి అని లౌకికంలో కూడా అంటారు. చదువుకోనివారు కూడా పిల్లలను సంభాళిస్తారు, అలాగే వీరు కూడా సంభాళిస్తే తేడా ఏముంది అని అంటారు. అలాగే వీరు కూడా చదువుకొని స్టేజీ పైకి వచ్చినట్లయితే ఆ డిగ్రీకి కూడా విలువ. ఇక్కడ అవకాశం లభించినట్లయితే డిగ్రీ దానంతట అదే లభిస్తుంది. ఈ డిగ్రీ ఏమైనా తక్కువా! జగదాంబ సరస్వతికి ఎంత పెద్ద డిగ్రీ లభించింది! ఇక్కడ డిగ్రీని వర్ణన కూడా చేయజాలరు. మాస్టర్ జ్ఞానసాగరులు, మాస్టర్ సర్వశక్తివంతులు అంటూ ఎంత పెద్ద డిగ్రీలు లభించాయి! ఇందులో ఎం.ఎ., బి.ఎ., ఇంజనీర్, డాక్టర్ అన్నీ వచ్చేస్తాయి. అచ్ఛా!

కుమారీల వేరు వేరు గ్రూపులతో బాప్దాదాల మిలనము:-

1. మీరు వరదానీ కుమారీలు కదా! మీరు మెల్లమెల్లగా నడిచేవారా లేక ఎగిరేవారా? ఎగిరేవారు అనగా హద్దులోని ధరణిని వదిలివెళ్ళేవారు. ఎప్పుడైతే ధరణిని వదులుతారో అప్పుడే ఎగురుతారు కదా! క్రింద అయితే ఎగరరు కదా! క్రింద ఉండేవాటిని వేటగాళ్ళు పట్టుకుటాంరు. క్రిందకు వచ్చినట్లయితే పంజరంలో చిక్కుకుటాంరు. ఎగిరేవారు పంజరంలోకి రారు. కావున పంజరాన్ని వదిలేసారు ఇప్పుడిక ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తారా? కిరీటం ధరిస్తారా లేక నెత్తిపై ఉద్యోగమనే తట్టను ఎత్తుకుటాంరా? ఎక్కడైతే కిరీటం ఉంటుందో అక్కడ తట్ట నడవదు కదా! ఆ కిరీటమును దించితేనే తట్టను ఎత్తుకోగలరు. తట్టను ఎత్తినట్లయితే కిరీటము పడిపోతుంది. కావున కిరీటధారులుగా అవ్వాలా లేక తట్టధారులుగా అవ్వాలా? ఇప్పుడు విశ్వసేవ యొక్క బాధ్యతా కిరీటము మరియు భవిష్య రత్నజడిత కిరీటము. ఇప్పుడు విశ్వసేవ యొక్క కిరీటమును ధరించినట్లయితే విశ్వము మిమ్మల్ని ధన్య ఆత్మగా, మహాన్ ఆత్మగా భావించగలదు. ఇంత పెద్ద కిరీటమును ధరించేవారు తట్టను ఎలా ఎత్తుకోగలరు! 63 జన్మలు తట్టను ఎత్తుతూ వచ్చారు, ఇప్పుడు కిరీటము లభిస్తోంది కావున కిరీటమును ధరించాలి కదా! మీరు ఏం భావిస్తున్నారు? మాకు దానిపై మనస్సు అయితే లేదు కాని చేయవలసి వస్తోంది! మీకు అటువంటి పరిస్థితులు ఉన్నాయా! మెల్లమెల్లగా లౌకికమును సంతుష్టపరుస్తూ స్వయమును నిర్బంధనులుగా చేసుకోవచ్చు. నిర్బంధనులుగా అయ్యే పట్లానును తయారుచేయండి. బేహద్ సేవ యొక్క లక్ష్యమును ఉంచినట్లయితే హద్దులోని బంధనాలు స్వతహాగానే తెగిపోతాయి. లక్ష్యము రెండువైపులా ఉన్నట్లయితే లౌకికంలోను, అలౌకికంలోను రెండువైపుల సఫలురుగా అవ్వలేకపోతారు. లక్ష్యము స్పష్టంగా ఉన్నట్లయితే లౌకికంలో కూడా సహాయం లభిస్తుంది. నిమిత్తమాత్రం లౌకికంగా ఉంటూ బుద్ధిలో మాత్రం అలౌకిక సేవ ఉన్నట్లయితే ఈ తప్పని పరిస్థితి కూడా ప్రేమ ముందు మారిపోతుంది.

2. కుమారీలందరూ తమ భాగ్యపు నిర్ణయమును చేసుకున్నారా లేక చేసుకోవాలా? ఎంత సమయం అయితే మీ జీవితపు నిర్ణయంలో వినియోగిస్తారో అంతగా ప్రాప్తి యొక్క సమయము చేజారిపోతుంది. కావున నిర్ణయం తీసుకోవడంలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఆలోచించగానే చేసేవారిని నెంబర్ వన్ వ్యాపారస్థులు అని అంటారు. క్షణంలో నిర్ణయం తీసుకునేవారు గోల్డ్మెడల్ తీసుకుటాంరు. ఆలోచించి, ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు సిల్వర్ మెడల్ తీసుకుటాంరు, మరి ఎవరైతే ఆలోచించి కూడా నిర్ణయం తీసుకోలేరో వారు రాగివారిగా అయిపోతారు. మీరందరూ గోల్డ్మెడల్ తీసుకునేవారే కదా! గోల్డెన్ ఏజ్లోకి వెళ్ళాలన్నప్పుడు మరి గోల్డ్మెడల్ తీసుకోవాలి కదా! సీతారాములుగా అవ్వడంలో ఎవ్వరూ చేతులెత్తరు. లక్ష్మీనారాయణులు స్వర్ణయుగానికి చెందినవారు కదా! కావున అందరూ తమ భాగ్యరేఖను ఈ విధంగా దిద్దుకున్నారా లేక అప్పుడప్పుడు ధైర్యము కలుగదా! సదా ఉల్లాస ఉత్సాహాలలో ఎగిరేవారిగా ఉండండి, ఏమి జరిగినా కాని మీ ధైర్యమును వదలకండి. ఇతరుల బలహీనతను చూసి మాతో ఇలా జరగదు కదా అని స్వయం నిరుత్సాహులుగా అయిపోకండి. ఎవరైనా ఒక్కరు గుంతలో పడిపోతే రెండవవారు ఏం చేస్తారు? వారు స్వయము పడిపోతారా లేక వారిని రక్షించే ప్రయత్నం చేస్తారా? కావున ఎప్పుడూ నిరుత్సాహులుగా అవ్వకండి సదా ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగురుతూ ఉండండి, ఏ ఆకర్షణలోకి రాకండి. వేటగాళ్ళు పట్టుకోవాలనుకున్నప్పుడు మంచి మంచి దానా వేస్తారు. మాయ కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తుంది కావున సదా ఎగిరే కళలో ఉండండి అప్పుడు సురక్షితంగా ఉంటారు. గత విషయాలను గూర్చి ఆలోచించడం, బలహీన విషయాలను గూర్చి ఆలోచించడం, వెనుకకు చూడడం వంటిది. వెనుకకు చూడడం అనగా రావణుడు రావడము.

3. మీరు శక్తి సేన కదా! అందరి చేతిలోను విజయ ధ్వజము ఉంది కదా! విశ్వంపై విజయ ధ్వజము ఉందా లేక కేవలం స్టేజీపై ఉందా! విశ్వం యొక్క అధికారులుగా అయ్యేవారు విశ్వసేవాధారులుగా ఉంటారే కాని హద్దులోని సేవాధారులుగా ఉండరు, బేహద్ సేవాధారులుగా ఉంటారు. ఎక్కడకు వెళ్ళినా అక్కడ సేవ చేస్తారు. కావున ఇటువంటి బేహద్ సేవ కొరకు సిద్ధంగా ఉన్నారా? విశ్వం యొక్క శక్తులు మీరు, కావున స్వయమే ఆఫర్ చేయండి. 2 నెలలు, 6 నెలలు సెలవు తీసుకొని ప్రయత్నం చేయండి. ఒక్క అడుగు వేస్తే పది అడుగులు ముందుకువెళతాయి. ఒకటి, రెండు నెలలు సెలవు తీసుకొని అనుభవం చేసుకోండి. ఎప్పుడైనా ఏదైనా మంచి వస్తువుపై మనస్సు లగ్నమైతే తక్కువగా ఉన్నవి స్వతహాగానే వదిలిపోతాయి, ఇలా ప్రయత్నం చేయండి. సంగమయుగము ముందుకువెళ్ళే సమయము. బ్రహ్మాకుమారీలుగా అయిపోయారు, జ్ఞానస్వరూపులుగా అయిపోయారు, ఇదైతే ఎంతోకాలంగా జరుగుతోంది, ఇప్పుడిక ముందుకు వెళ్ళండి, కొంత అడుగులు ముందుకువేయండి, అక్కడే ఉండిపోకండి. బలహీనులను చూడకండి, శక్తులను చూడండి. మేకలను ఎందుకు చూస్తున్నారు, మేకలను చూసినట్లయితే మీ భుజాలు కూడా క్రిందకు వెళ్ళిపోతాయి, ఏమౌతుందో తెలియదు అని భయం వేస్తుంది. బలహీనులను చూస్తే భయం వేస్తుంది కావున వారిని చూడకండి, శక్తులను చూసినట్లయితే భయం వెళ్ళిపోతుంది.

Comments