* 27-02-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంగమ యుగంలో అలంకరించబడిన మధురమైన అలౌకిక మేళా (కలయిక).
ఈరోజు తండ్రి మరియు పిల్లల మిలన మేళాను జరుపుకుంటున్నారు. మేళాలో చాలా వెరైటీ (భిన్నమైన) మరియు చాలా సుందరమైన వస్తువులు, చాలా సుందరమైన అలంకరణ ఉంటుంది. అంతేకాక ఒకరినొకరు కలుసుకోవడం జరుగుతుంది. బాప్ దాదా ఈ మధురమైన మేళాలో ఏమి చూస్తున్నారు? ఇటువంటి అలౌకికంగా శృంగారించబడిన మేళా సంగమ యుగంలో తప్ప ఇంకెప్పుడూ, ఎవరూ జరుపుకోలేరు. ప్రతి ఒక్కరు ఒకరికన్నా ఒకరు విశేషంగా శృంగారించబడిన అమూల్య రత్నాలుగా ఉన్నారు. మీ శృంగారం గురించి తెలుసు కదా! అందరి శిరస్సు పైన ఎంతో సుందరమైన లైట్ (ప్రకాశం) కిరీటం మెరుస్తోంది. తమ కిరీటధారీ స్వరూపాన్ని చూసుకుంటున్నారా? ప్రతి ఒక్కరు దివ్య గుణాల శృంగారంతో ఎంతో సుందరంగా అలంకరింపబడిన మూర్తులుగా ఉన్నారు. ఎటువంటి సుందరమైన శృంగారమంటే దీని ద్వారా విశ్వంలోని సర్వాత్మలు వద్దనుకున్నా స్వతహాగానే ఆకర్షితులవుతారు. అలాంటి శ్రేష్ఠమైన అవినాశీ శృంగారాన్ని చేసుకున్నారా? ఈ సమయంలోని మీ శృంగారానికి స్మృతి చిహ్నంగా, మీ జడ చిత్రాలను కూడా భక్తులు చాలా సుందరాతి సుందరంగా అలంకరిస్తూ ఉంటారు. ఇప్పటి శృంగారం ద్వారా అర్ధకల్పం జడచిత్రాల రూపంలో అలంకరించబడ్డారు. ఇటువంటి శ్రేష్ఠమైన అవినాశీ శృంగారం బాప్ దాదా ద్వారా పిల్లలందరికి ఇప్పుడు జరిగింది. బాప్ దాదా ఈ రోజు ప్రతి పుత్రుని మూడు స్వరూపాలు అనగా వర్తమానం మరియు తమ రాజ్యానికి చెందిన దేవాత్మ స్వరూపాలు మరియు భక్తి మార్గంలోని స్మృతి చిహ్నమైన చిత్రాలు ప్రతి ఒక్కరి ఈ మూడు స్వరూపాలను చూసి హర్షిస్తున్నారు. మీరంతా మీ మూడు స్వరూపాలను గురించి తెలుసుకున్నారు కదా! మీ మూడు రూపాలను జ్ఞాన నేత్రంతో చూశారు కదా!
ఈరోజైతే బాప్ దాదా మిలనానికి సంబంధించిన ఫిర్యాదులను పూర్తి చేసేందుకు వచ్చారు. ఎవరైతే నిర్బంధనుడిని కూడా బంధనంలో బంధిస్తారో ఆ పిల్లలదే అద్భుతమంతా. ఈ లెక్క ప్రకారం కలవండి అని బాప్ దాదాకు కూడా లెక్కలు నేర్పిస్తారు. కావున ఇంద్రజాలికులుగా ఎవరయ్యారు? పిల్లలా లేక తండ్రియా? ఇటువంటి స్నేహమనే ఇంద్రజాలాన్ని పిల్లలు తండ్రికి అంటిస్తారు. దీనితో తండ్రికి పిల్లలు లేకపోతే తోచదు. నిరంతరం పిల్లలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. మీరందరూ తింటున్నప్పుడు ఒక్కరినే ఆహ్వానిస్తారు, అయితే ఎంతమంది పిల్లలతో కలిసి తినవలసి ఉంటుంది? ఎన్నిసార్లు భోజనానికి పిలుస్తారు? తింటారు, నడుస్తారు, నడుస్తున్నప్పుడు కూడా చేతిలో చేయి వేసి నడుస్తారు. నిద్రపోతున్నా తోడుగానే నిదురిస్తారు. కావున ఇంతగా అనేకమంది పిల్లలతో కలిసి తింటూ, నిద్రిస్తూ, నడుస్తూ ఉంటే తీరికేమి ఉంటుంది? కొంతమంది ఏ కర్మను చేస్తున్నా కార్యం మీద మేము నిమిత్తంగా ఉన్నామనే అంటారు. మీరు చేసి చేయించండి. నిమిత్తంగా చేతులను మేము నడిపిస్తామని అంటారు. కావున ఇది కూడా చేయవలసి ఉంటుంది కదా? అంతేకాక మళ్ళీ ఏ సమయంలోనైనా చిన్న-పెద్ద తుఫానులు వచ్చినా మీకే తెలియాలి అని అంటారు. తుఫానులను తొలగించే కార్యాన్ని కూడా తండ్రికే ఇస్తారు. కర్మల భారాన్ని కూడా తండ్రికే ఇస్తారు. సదా తోడుగా కూడా ఉంచుకుంటారు. కావున గొప్ప ఇంద్రజాలికులుగా ఎవరయ్యారు? భుజాల సహయోగం లేకుండా ఏమీ జరగజాలదు. అందుకే సదా మాలను జపిస్తారు!
ఆస్ట్రేలియా నివాసులైన పిల్లలు చాలా మంచి త్యాగం చేశారు. అంతేకాక ప్రతిసారి త్యాగం చేస్తారు. సదా లాస్టు నుండి ఫాస్టుగా వెళ్ళి ఫస్టులో వస్తారు. ఎంతగా వారు త్యాగం చేస్తారో ఇతరులను ముందుంచుతారో అంతగానే ఎంతమంది కలుస్తూ ఉంటారో వారందరి షేర్ (భాగం) కొద్ది కొద్దిగా ఆస్ట్రేలియా వారికి కూడా లభిస్తుంది. కావున త్యాగం చేశారా లేక భాగ్యాన్ని తీసుకున్నారా? తోడు-తోడుగా యు.కె. ది కూడా పెద్ద గ్రూపే. ఇవి రెండూ మొట్టమొదట నిమిత్తంగా అయిన సెంటర్లు. చాలా విశాలమైన సెంటర్లు. ఒక సెంటరు ద్వారా అనేక సెంటర్లలో తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలున్నారు. అందువలన ఇరువురూ (ఆస్ట్రేలియా మరియు యు.కె.) పెద్దవారిని, ఇతరులను ముందుంచవలసి ఉంటుంది. ఇతరుల సంతోషంతోనే మీరు సంతోషంగా ఉంటారు కదా! ఈ రెండు స్థానాల్లోని సేవాధారులు సహయోగులు. స్నేహీ పిల్లలు అన్ని విషయాలలో ఎంత విశాల హృదయులుగా ఉన్నారో చూడడం జరిగింది. ఈ విషయంలో కూడా సహయోగులుగా అవ్వడంలో మహాదానీ పిల్లలున్నారు. బాప్ దాదాకు పిల్లలందరు గుర్తున్నారు. అందరితో కలుస్తారు. ఎంతో దూరదూరాల నుండి కలుసుకోవాలనే ఉత్సాహంతో పిల్లలు ఎగురుతూ ఎగురుతూ తమ మధురమైన ఇంటికి చేరుకోవడం చూసి బాప్ దాదాకు సంతోషమవుతుంది. భలే స్థూలంగా ఏ దేశానికి చెందినవారైనా అందరూ ఒకే దేశము వారే, అందరూ ఒక్కటే. ఒకే తండ్రి, ఒకే దేశం, ఒకే మతం మరియు ఏకరస స్థితిలో స్థితులై ఉండేవారు. ఇక్కడైతే కొద్ది సమయం కలవడానికి నిమిత్తమాత్రంగా దేశం పేరు చెప్తారు. అందరూ ఒక దేశము వారే. సాకార లెక్కలో కూడా అందరూ ఈ సమయంలో మధువన నివాసులుగా ఉన్నారు. తమను మధువన నివాసులుగా భావించుకోవడం బాగుందనిపిస్తోంది కదా!
క్రొత్త స్థానంలో సేవలో సఫలతకు ఆధారం :- ఎపుడైనా ఏ క్రొత్త స్థానంలోనైనా సేవ ప్రారంభించినట్లయితే ఒకే సమయంలో అన్ని రకాల సేవలు చేయండి. మనసులో శుభ భావన, వాణీలో తండ్రితో సంబంధాన్ని జోడింపజేసే మరియు శుభ కామనతో కూడిన శ్రేష్ఠమైన మాటలు మరియు సంబంధం - సంపర్కంలో వచ్చినప్పుడు స్నేహం మరియు శాంతి స్వరూపంలో ఆకర్షించండి. ఈ విధంగా అన్ని రకాల సేవల ద్వారా సఫలతను పొందుతారు. కేవలం వాణి ద్వారానే కాదు, ఒకే సమయంలో అన్ని సేవలు తోడు తోడుగా జరగాలి. అటువంటి ప్లాన్లు తయారు చేయండి. ఎందుకంటే ఎవరికైనా సేవ చేసేందుకు స్వయం స్థితిలో స్థితులవ్వవలసి ఉంటుంది. సేవలో ఫలితమెలా ఉన్నా సేవలోని ప్రతి అడుగులో కళ్యాణం నిండి ఉంది. ఒక్కరైనా ఇక్కడి వరకు చేరుకున్నా అందులో సఫలత అయితే ఇమిడిపోయి ఉంది. అనేక ఆత్మల భాగ్య రేఖను గీసేందుకు నిమిత్తంగా ఉన్నారు. అటువంటి విశేష ఆత్మలుగా భావించి సేవ చేస్తూ ఉండండి. మంచిది. ఓంశాంతి.
Comments
Post a Comment