26-04-1982 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బాప్ దాదా హృదయ సింహాసనాధికారులుగా అయ్యేందుకు సర్వులకు సమాన అధికారము.
ఈరోజు జ్ఞాన గంగలు మరియు జ్ఞాన సాగరుని మిలన మేళ. ఈ మేళలో పిల్లలందరు బాబానుండి ఆత్మిక మిలనమును అనుభవము చేసుకుంటారు. బాబా కూడా ఆత్మిక పిల్లలను చూసి హర్షితులవుతారు మరియు పిల్లలు కూడా ఆత్మిక తండ్రిని కలిసి హర్షితులవుతారు ఎందుకంటే కల్పకల్పపు గుర్తించబడిన ఆత్మ తన బుద్ధి యోగము ద్వారా మేము కూడా కల్పపూర్వపు ఆ ఆత్మలమే మరియు ఆ బాబానే మరల పొందాము అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడు ఆనందము, సుఖము, ప్రేమ, సంతోషములకు చెందిన ఊయలలో ఊగే అనుభవము చేస్తుంది. అటువంటి అనుభవమును కల్పపూర్వపు పిల్లలు మరల చేసుకుంటున్నారు. అదే పాత పరిచయం మరల స్మృతిలోకి వచ్చింది. ఇటువంటి స్మృతి స్వరూప స్నేహీ ఆత్మలు, ఈ స్నేహ సాగరములో మునిగిపోయిన లవలీన ఆత్మలే ఈ విశేష అనుభవమును తెలుసుకోగలరు. పిల్లలందరూ స్నేహీ ఆత్మలే, స్నేహముయొక్క శుద్ధ సంబంధముద్వారా ఇక్కడివరకు చేరుకున్నారు. అయినా కూడా స్నేహములో కూడా నంబరువారీగా ఉన్నారు, కొందరు స్నేహములో మునిగిపోయి ఉన్న ఆత్మలు, మరికొందరు మిలనము చేసుకునే అనుభవమును యథాశక్తిగా అనుభవము చేసేవారు. ఇంకా మరికొందరు ఈ ఆత్మిక మిలనపు మేళయొక్క ఆనందమును తెలుసుకున్నవారు, తెలుసుకునే ప్రయత్నములో నిమగ్నమైయున్నారు. అయినా కూడా అందరినీ స్నేహీ ఆత్మలనే అంటారు. స్నేహ సంబంధ ఆధారముతో ముందుకు పోతూ ఇముడ్చుకునే స్వరూపము వరకు కూడా చేరుకుంటారు. తెలుసుకోవటము సమాప్తమై ఇముడ్చుకునే అనుభవము జరగనే జరుగుతుంది ఎందుకంటే ఇముడ్చుకునే ఆత్మలు సమాన ఆత్మలు. కనుక సమానంగా అవ్వటము అనగా స్నేహములో ఇమిడిపోవటము. కనుక మీకు మీరే, స్వయమే ఈ విషయాలగురించి తెలుసుకోగలరు - బాబా సమానంగా ఎంతవరకు అయ్యాను? బాబా సంకల్పము ఏంటి? ఆ సంకల్పము సమానంగా నా లవలీన ఆత్మ సంకల్పము ఉందా? వాణి, కర్మ, సేవ, సంబంధాలు అన్నింటిలో బాబా సమానంగా అయ్యానా? లేక ఇప్పటి వరకు చాలా అంతరము ఉండిపోయిందా లేక కొంచెము అంతరము ఉందా? అంతరము సమాప్తమైపోవటమే మన్మనాభవ యొక్క మహామంత్రము. ఈ మహామంత్రమును ప్రతి సంకల్పము మరియు ప్రతి క్షణములో స్వరూపములోకి తీసుకురావాలి, ఇటువంటివారినే సమానులు మరియు ఇమిడిపోయిన ఆత్మ అని అంటారు. పిల్లలందరూ బాబా సమానంగా అవ్వాలి అని అనంతమైన తండ్రి అనంతమైన సంకల్పం చేస్తారు. నేను గురువు కావాలి, వీరు శిష్యులుగా అవ్వాలి అని ఇలా అనుకోరు. బాబా సమానంగా అయ్యి బాబా హృదయ సింహాసనాధికారులుగా అవ్వాలి. ఇక్కడ ఎవరూ సింహాసనాధికారులుగా అవ్వకూడదు. అక్కడైతే ఒకరిద్దరు అవుతారు కానీ అనంతమైన తండ్రి అనంతమైన హృదయ సింహాసనాధికారిగా తయారుచేస్తారు, ఇందులో పిల్లలందరూ అధికారులుగా అవ్వవచ్చు. అందరికీ ఒకేవిధమైన సువర్ణావకాశం. ఆదిలో వచ్చేవారైనా, మధ్యలో వచ్చేవారైనా లేక ఇప్పుడు వచ్చేవారైనాగానీ సమానంగా అయ్యేందుకు అనగా హృదయసింహాసనాధికారులుగా అయ్యేందుకు అందరికీ పూర్తి అధికారము ఉంది. వెనక ఉన్నవారు ముందుకు పోలేరు అని కాదు, ఎవరైనా ముందుకు పోవచ్చు, ఎందుకంటే ఇది అనంతమైన ప్రాపర్టీ, కనుక ముందు వారు తీసేసుకున్నారు కనుక అయిపోయింది అని ఉండదు. ఎంత తరగని సంపద అంటే ఇచ్చిన తరువాత కూడా ఇంకా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కానీ అధికారము తీసుకునేవారిని బట్టి ఉంటుంది ఎందుకంటే అధికారమును తీసుకోవడంతోపాటుగా అధీనతా సంస్కారమును వదలవలసి ఉంటుంది. ఏమీ లేదు, కేవలము అధీనతను వదలాలి. కానీ ఈ వదిలే విషయము వచ్చినప్పుడు తమ బలహీనత కారణంగా ఈ విషయములో అలాగే ఉండిపోతారు మరియు వదలటం లేదు అని అంటారు. సంస్కారాలు వదలటం లేదు అని దోషాన్ని సంస్కారముపై పెడతారు కానీ స్వయము వదలరు. ఎందుకంటే చైతన్యమైన శక్తిశాలి స్వయం ఆత్మనా లేక సంస్కారమా? సంస్కారము ఆత్మను ధారణ చేసిందా లేక ఆత్మ సంస్కారాన్ని ధారణ చేసిందా? ఆత్మ చైతన్య శక్తి సంస్కారామా లేక సంస్కారము యొక్క శక్తి ఆత్మనా? ధారణ చేసే ఆత్మ అయినప్పుడు వదలటమును కూడా ఆత్మనే చెయ్యాలి, అంతేగానీ సంస్కారము దానికదే పోతుంది అని కాదు కదా. మళ్ళీ రకరకాల పేర్లను పెడుతుంటారు - సంస్కారము, స్వభావము, అలవాటు లేక నేచర్. కానీ చెప్పే శక్తి ఏది? అలవాటు మాట్లాడుతుందా లేక ఆత్మ మాట్లాడుతుందా? మరి యజమానులా లేక బానిసలా? కనుక అధికారమును అనగా యజమానత్వమును ధారణ చెయ్యటంలో అనంతమైన అవకాశము ఉన్నాకూడా యథాశక్తి తీసుకునేవారిగా అవుతారు. కారణమేమిటి? నా అలవాటు, నా సంస్కారము, నా నేచర్ అని అంటుటాంరు. కానీ, నాది అని అంటున్నాకూడా యజమానత్వము లేదు. ఒకవేళ నాది అని అన్నట్లైతే యజమాని అయ్యారు కదా. ఇటువంటి యజమాని ఏది కోరుకుంటే అది చెయ్యలేకపోతే, పరివర్తన చేసుకోలేకపోతే, అధికారమును ఉంచలేకపోతే, అటువంటివారిని ఏమంటారు ఇటువంటి బలహీన ఆత్మను అధికారీ ఆత్మ అని అంటారా? మరి అవకాశము ఒపెనుగా ఉన్నాకూడా బాబా నంబర్ వారీ ఇవ్వరు కానీ స్వయమే తయారుచేసుకుంటారు. బాబా హృదయ సింహాసనము అనంతమైనది, ఎంత పెద్దదంటే మొత్తము విశ్వములోని ఆత్మలందరూ అందులో ఇమిడిపోగలరు, అంతి విరాట స్వరూపము! కానీ కూర్చునేందుకు ధైర్యమును పెట్టే ఆత్మలుగా ఎంతమంది తయారవుతారు! ఎందుకంటే హృదయ సింహాసనాధికారులుగా అయ్యేందుకు హృదయమునకు చెందిన వృత్తిని చెయ్యవలసి ఉంటుంది కనుకనే బాబా పేరు దిల్ వాలా అని ఉంది. మరి దిల్(హృదయము)ను తీసుకుంటారు కూడా, హృదయమును ఇస్తారు కూడా. వ్యాపారము చేసేటప్పుడు చాలా చతురతను కూడా చూపిస్తారు. పూర్తి వ్యాపారము చెయ్యరు, కాస్త మిగుల్చుకుంటారు, మళ్ళీ ఏమంటారు? నెమ్మది-నెమ్మదిగా ఇస్తూ పోతుంటాము అని అంటారు. భాగాలలో వ్యాపారమును చెయ్యటము ఇష్టపడతారు. ఒక్క దెబ్బతో వ్యాపారము చేసేవారు ఒక్కరికి చెందినవారు అయిన కారణంగా సదా ఏకరసంగా ఉంటారు మరియు అన్నింటిలో నంబర్ వన్ గా అవుతారు. ఏదో కాస్త కాస్త చేస్తూ ఎవరైతే వ్యాపారము చేస్తారో - వారు ఒక్కటికి బదులుగా రెండు పడవలపై కాళ్ళు పెడతారు, ఎప్పుడూ ఏదో ఒక సమస్య అలజడితో ఏకరసులుగా అవ్వరు కనుక వ్యాపారము చెయ్యాలనుకుంటే క్షణములో చెయ్యండి. హృదయాన్ని ముక్కలు, ముక్కలు చెయ్యకండి. ఈరోజు స్వయము నుండి మనసును తొలగించుకుని బాబాపై పెట్టారు, అనగా ఒక ముక్కను ఇచ్చారు అనగా ఒక భాగమును ఇచ్చారు, మరల రేపు సంబంధీకులపై మనసును తొలగించి బాబాకు ఇచ్చారు, రెండో భాగమును ఇచ్చారు, మరో ముక్కను ఇచ్చారు, దీనివల్ల ఏమౌతుంది? బాబా ప్రాపర్టీపై అధికారములో కూడా ముక్కలకు చెందిన హక్కుదారుగానే అవుతారు. ప్రాప్తి అనుభవములో సర్వ అనుభూతుల అనుభవమును పొందలేకపోతారు. కాస్త-కాస్త అనుభవమును చేసారు, దీనివలన సదా సంపన్నంగా, సదా సంతుష్టులుగా అవ్వరు కనుకనే చాలామంది పిల్లలు ఇప్పటికి కూడా ఎంతగా ఎలాంటి అనుభవాలు పొందాలో అవి అంతగా లేవు అని వర్ణన చేస్తారు. కొందరికి పూర్తి అనుభవమవ్వడం లేదు, కొంచమే అవుతోంది అని అంటారు. మరికొందరు అవుతుంది కానీ సదా ఉండదు అని అంటారు ఎందుకంటే పూర్తిగా, ఫుల్ వ్యాపారము చెయ్యలేదు కనుక అనుభవము కూడా పూర్తిగా ఉండదు. ఒకేసారి వ్యాపారము చేసే సంకల్పము చెయ్యలేదు. అప్పుడప్పుడు చేస్తున్నట్లయితే అనుభవము కూడా అప్పుడప్పుడుగానే ఉంటుంది. సదా ఉండదు. మామూలుగా అయితే ఈ వ్యాపారము ఎంతో శ్రేష్ఠ ప్రాప్తిని కలిగిస్తుంది! భ్రమిస్తున్న హృదయాన్ని ఇవ్వటము మరియు హాృదయాభిరాముని హృదయ సింహాసనముపై చాలా హాయిగా అధికారమును పొందటము అయినా కూడా వ్యాపారము చేసేందుకు ధైర్యము ఉండదు. తెలుసుకూడా, అంటారు కూడా, అయినా కూడా మరల ధైర్యహీనులై భాగ్యమును పొందలేకపోతారు. ఉన్నదైతే చాలా సులువైన వ్యాపారము కదా లేక కష్టమనిపిస్తుందా? సులువైనది అని అనటమైతే అందరూ అంటారు కానీ చెయ్యటానికి వచ్చినప్పుడు కష్టంగా చేసుకుంటారు. వాస్తవానికి ఇవ్వటము, ఇవ్వటము కాదు. ఇనుమును ఇచ్చి వజ్రాన్ని తీసుకోవటము, మరి ఇది ఇవ్వటమైందా లేక తీసుకోవటమైందా? మరి తీసుకునేందుకు కూడా ధైర్యము లేదా? కనుకనే, అనంతమైన తండ్రి అందరికీ ఒకేలా ఇచ్చినా గానీ తీసుకునేవారు, అవకాశము తెరుచుకుని ఉన్నాకూడా నంబర్ వారీగా అవుతారు అని అనబడుతుంది. ఛాన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నేను చెయ్యగలిగి ఉండేవాడిని కానీ ఈ కారణము ఉండింది, ముందు వచ్చి ఉంటే ముందుకు పోయి ఉండేవాడిని, ఈ పరిస్థితి లేనట్లయితే ముందుకు వెళ్ళిపోయి ఉండేవాడిని... లాంటి సాకులు కూడా ఎవరూ వినరు. ఈ సాకులు స్వయములోని బలహీనతకు చెందిన విషయాలు. స్వస్థితి ముందు పరిస్థితి ఏమీ చెయ్యలేదు. విఘ్న వినాశక ఆత్మల ముందు విఘ్నము పురుషార్థములో ఆటంకములను వెయ్యలేదు. సమయపు లెక్క ప్రకారం తీవ్రత లెక్క లేదు. రెండు సంవత్సరాలు వారు కూడా ముందుకు పోగలరు, రెండు నెలల వారు ముందుకు పోలేరు అన్న ఈ లెక్క లేదు. ఇక్కడైతే క్షణకాలపు వ్యాపారము. రెండు మాసాలు కూడా ఎంత ఎక్కువ! కానీ ఎప్పడు వచ్చారో అప్పటి నుండి తీవ్రగతి ఉందా? కనుక సదా తీవ్రగతి కలిగినవారు నిర్లక్ష్యము కలిగిన ఆత్మలకంటే ముందుకు పోగలరు కనుక వర్తమాన సమయమునకు మరియు మాస్టర్ సర్వ శక్తివంతులైన ఆత్మలకొరకు వరదానము - మీ కొరకు ఎంత కావాలనుకుంటారో, ఎంత ముందుకు పోవాలనుకుంటారో, ఎంత అధికారులుగా అవ్వాలనుకుంటారో అంతగా సహజంగా అవ్వగలరు ఎందుకంటే వరదానీ సమయము. మీరు వరదానీ బాబా యొక్క వరదానీ ఆత్మలు. అర్థమైందా - వరదానులుగా అవ్వాలనుకుంటే ఇప్పుడే అవ్వండి, మళ్ళీ వరదాన సమయము కూడా సమాప్తమైపోతుంది. తరువాత ఎంత కష్టపడినాగానీ ఏమీ పొందలేకపోతారు కనుక ఏది పొందాలనుకుంటారో దానిని ఇప్పుడే పొందండి. ఏది చెయ్యాలనుకుంటే దానిని ఇప్పుడే చెయ్యండి. ఆలోచించకండి కానీ ఏది చెయ్యాలనుకుంటారో దానిని దృఢ సంకల్పముతో చెయ్యండి మరియు సఫలతను పొందండి. అచ్ఛా!
ఇటువంటి సర్వ అధికారులు, క్షణములో వ్యాపారము చేసేవారు అనగా ఏది ఆలోచిస్తారో దానిని చేసేవారు అయిన ఇటువంటి సదా ధైర్యవంతులైన శ్రేష్ఠ ఆత్మలు, సదా యజమానులుగా అయ్యి పరివర్తన శక్తి ద్వారా బలహీనతలను తొలగించుకునేవారు, ఏ శ్రేష్ఠ కర్మను చెయ్యాలనుకుంటే దానిని చేసేవారు అయిన మాస్టర్ సర్వ శక్తివంతులు, హృదయ సింహాసనాధికారులకు, అధికారీ పిల్లలకు బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
టీచర్లతో - మిమ్మల్ని సదా సేవాధారులుగా భావించుకుని సేవలో ఉపస్థితులై ఉంటున్నారు కదా? సేవ సఫలతకు ఆధారము, సేవాధారుల కొరకు విశేషంగా ఏముంది? తెలుసా? సఫలత జరగాలి అని సేవాధారి సదా దీనినే కోరుకుంటాడు. కానీ సఫలత జరిగేందుకు ఆధారము ఏంటి? ఈరోజుల్లో విశేషంగా ఏ విషయముపై అటెన్షన్ పెడుతున్నారు? (త్యాగముపై) త్యాగము-తపస్య లేకుండా సఫలత లేదు. కనుక సేవాధారి అనగా త్యాగమూర్తి మరియు తపస్వీమూర్తి. తపస్య అంటే ఏంటి? ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు - ఇదే ప్రతి సమయములోని తపస్య. మరో త్యాగము ఏంటి? దీనిపై చాలా వినిపించాము కానీ సారరూపములో సేవాధారుల త్యాగము - ఎటువంటి సమయమో, ఎటువంటి సమస్యలో, ఎటువంటి వ్యక్తులో అలా దానికి తగినట్లుగా స్వయమును మోల్డ్ చేసుకుని స్వ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేసేందుకు సదా ఈజీగా ఉండటము. పరిస్థితికి తగినట్లుగా అనగా ఒక్కోసారి మీ పేరును త్యాగము చెయ్యవలసి ఉంటుంది, ఒక్కోసారి సంస్కారాలను, ఒక్కోసారి వ్యర్థ సంకల్పాలను, ఒక్కోసారి స్థూల అల్పకాలికమైన సాధనాలను.... కనుక ఆ పరిస్థితి మరియు సమయము అనుసారంగా మీ శ్రేష్ఠ స్థితిని తయారుచేసుకోగలగాలి, అందుకొరకు ఎటువంటి త్యాగమును చెయ్యవలసివచ్చినగానీ చెయ్యాలి, స్వయమును మోల్డ్ చేసుకోవాలి, ఇటువంటివారినే త్యాగమూర్తులు అంటారు. త్యాగము, తపస్య మరల సేవ. త్యాగము మరియు తపస్యలే సేవ సఫలతకు ఆధారము. కనుక నేను త్యాగము చేసాను అన్న త్యాగపు అభిమానము కూడా రానటువంటి త్యాగులు. ఒకవేళ ఈ సంకల్పము వచ్చినా అదికూడా త్యాగము అవ్వదు.
సేవాధారి అనగా పెద్దల డైరెక్షన్ వెంబడే అమలులోకి తీసుకువచ్చేవారు. లోక సంగ్రహణార్థము ఏదైనా డైరెక్షన్ లభించినాకూడా నేను కరెక్ట్ అని నిరూపించుకోకూడదు. మీరు రైట్ కావచ్చు కానీ లోకసంగ్రహణార్థము నిమిత్త ఆత్మలనుండి డైరెక్షన్ లభించినట్లయితే ఎల్లప్పుడూ - 'జీ హా, 'జీ హాజిర్ (సరేనండి, అలాగే) అని అనటము, ఇదే సేవాధారుల విశేషత. ఇది వంగి ఉండటము కాదు, కింద ఉండటము కాదు కానీ ఇంకా పైకి వెళ్ళటము. అప్పుడప్పుడు చాలామంది ఇలా భావిస్తారు - ఒకవేళ నేను చేసినట్లైతే నేను తక్కువైపోతాను, నా పేరు తక్కువైపోతుంది, నా పర్సనాలిటీ తక్కువైపోతుంది. కానీ ఇలా అనుకోకూడదు. గౌరవించటము అనగా గౌరవనీయులుగా అవ్వటము. పెద్దలకు గౌరవమును ఇవ్వటము అనగా స్వమానమును తీసుకోవటము. తమ పేరు ప్రతిష్ఠలను కూడా త్యాగము చేసే సేవాధారులు. అల్పకాలికమైన పేరు ప్రతిష్ఠలు ఏం చేస్తాయి? ఆజ్ఞాకారులుగా అవ్వటమే సదాకాలమునకు పేరు ప్రతిష్ఠలను తీసుకోవటము. మరి అవినాశి అయినది తీసుకోవాలా లేక ఇప్పటికిప్పుడే తీసుకోవాలా? కనుక సేవాధారి అనగా ఈ అన్ని విషయాల త్యాగములో సదా ఎవర్ రెడీలు. పెద్దలు చెప్పారు- మీరు చేసారు. ఇటువంటి విశేష సేవాధారులు సర్వులకు మరియు బాబాకు ప్రియమైనవారిగా ఉంటారు. వంగి ఉండటము అనగా సఫలతయొక్క ఫలదాయకులుగా అవ్వటము. ఇలా వంగి ఉండటము అనేది చిన్నవారిగా అవ్వటమని కాదు కానీ సఫలతా సంపన్నులుగా అవటము. నా పేరు కిందకు పోతుంది, వారు పెద్దగా అయ్యారు, నేను చిన్నగా అయిపోయాను, నన్ను కింద పెట్టేసారు, వాళ్ళను పైకెత్తారు అని ఆ సమయములో అనిపించినాగానీ ఉన్నదైతే క్షణకాలపు ఆట. క్షణములో ఓడిపోతారు మరియు క్షణములో గెలుస్తారు. క్షణకాలపు ఓటమి సదాకాలపు ఓటమి, ఇది చంద్రవంశీయులుగా తయారుచేస్తుంది మరియు క్షణకాలపు విజయము సదాకాలమునకు సంతోషమును కలిగింపచేస్తుంది, దీనికి గుర్తుగా శ్రీకృష్ణుని మురళి వాయిస్తున్నట్లుగా చూపిస్తారు. మరి ఎక్కడ చంద్రవంశీయుడు మరియు ఎక్కడ మురళిని వాయించేవాడు! కనుక ఇది క్షణకాలము విషయము కాదు కానీ క్షణముయొక్క ఆధారము సదాకాలముపై ఉంటుంది. కనుక ఈ రహస్యము తెలుసుకుని సదా ముందుకు పోతూ ఉండండి. బ్రహ్మాబాబాను చూసారు - బ్రహ్మాబాబా స్వయమును ఎంత కిందకు చేసుకున్నారు, ఎంతో నిర్మాణులై సేవాధారిగా అయ్యారు, పిల్లల కాళ్ళను వత్తానికికూడా సిద్ధమయ్యారు. పిల్లలు నాకంటే ముందుండాలి, పిల్లలు నాకంటే కూడా మంచిగా భాషణ చెయ్యగలరు. 'మొదట నేను' అని ఎప్పుడూ అనలేదు. ముందు పిల్లలు, మొదట పిల్లలు, పిల్లలను పెద్దగా చేసి, స్వయమును చిన్నగా చేసుకోవటము అంటే తక్కువవారుగా అవ్వటము కాదు, పైకి వెళ్ళటము. కనుక సత్యమైన నంబర్ వన్ యోగ్య సేవాధారి అని వీరినే అంటారు. అందరి లక్ష్యమైతే ఇలాటిందే కదా. గుజరాత్ నుండి చాలామంది సేవాధారులు తయారయ్యారు కానీ గుజరాతులోని నదులు గుజరాతులోనే ప్రవహిస్తున్నాయి, గుజరాత్ వారు కళ్యాణకారులుగా కాకుండా విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి. సదా ఎవర్ రెడీగా ఉండండి. ఇప్పుడు ఏ డైరెక్షన్ లభించినా 'సరేనండి' అని అనండి. ఏమవుతుంది, ఎలా అవుతుంది - ట్రస్టీలకు ఏంటి, ఎలా అన్నవాటి గురించి ఆలోచించేదేముంది! సదా స్వయమును ఆఫర్ చేసుకున్నట్లయితే సదా ఉపరామముగా ఉంటారు. ఆకర్షణ, లొంగి ఉండటములనుండి దూరమైపోతారు. ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు ఎక్కడకు పోయినాగానీ, ఉపరామమైపోతారు. ఒకవేళ ఇక్కడే ఉండాలని అనుకున్నట్లయితే కొద్దిగా తయారవ్వాలి. ఈరోజు ఇక్కడ-రేపు అక్కడ. పక్షులు, ఈరోజు ఒక కొమ్మపై, రేపు మరొక కొమ్మపై, కనుక స్థితి ఉపరామముగా ఉంటుంది, మానసిక స్థితి సదా ఉపరామముగా ఉండాలి. ఎక్కడైనా 20 సంవత్సరాలు ఉన్నాగానీ స్వయం సదా ఎవర్ రెడీగా ఉండండి. ఎలా అవుతుంది అని స్వయం ఆలోచించకండి. వీరినే మహా త్యాగులు అని అంటారు. అచ్ఛా!
Comments
Post a Comment