25-12-1982 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
విధి-విధాత-వరదానం.
విశ్వ అధికారి, విశ్వ నిర్మాత, వరదానమూర్తి అవ్యక్త బాప్ దాదా క్రిస్మస్ సందర్భంగా తన యొక్క పిల్లలతో మాట్లాడుతున్నారు -
ఈరోజు సర్వ స్నేహి పిల్లలకు స్నేహం యొక్క జవాబు ఇవ్వడానికి బాప్ దాదా కలుసుకోవడానికి రావలసి వచ్చింది. మొత్తం విశ్వంలో పిల్లల స్నేహం యొక్క, స్మృతి యొక్క ధ్వని బాప్ దాదాకి వతనంలో మధురాతి మధురమైన పాట రూపంలో చేరుకుంది. పిల్లలు ఎలా అయితే బాబా స్నేహం యొక్క పాటలు పాడుకుంటారో అదేవిధంగా బాప్ దాదా పిల్లలు గుణాల యొక్క పాటలు పాడుతున్నారు. ఏవిధంగా అయితే పిల్లలు బాప్ దాదాని చూసి ఇటువంటి బాప్ దాదా కల్పంలో మరలా లభించరు అంటున్నారో అదేవిధంగా బాప్ దాదా కూడా పిల్లలను చూసి ఇటువంటి పిల్లలు కల్పంలో ఇంకెప్పుడూ లభించరు అంటున్నారు. ఈ విధంగా బాబా మరియు పిల్లల యొక్క ఆత్మిక సంభాషణ వింటున్నారా? బాబా మరియు మీరు కంబైండ్ రూపం కదా! ఈ స్వరూపాన్నే సహజయోగం అంటారు. యోగం జోడించేవారు కాదు కానీ సదా కంబైండ్ అంటే వెంట ఉండేవారు. ఈ విధమైన స్థితిని అనుభవం చేసుకుంటున్నారా లేక చాలా శ్రమ చేయవలసి వస్తుందా? చిన్నతనంలో ఏమి ప్రతిజ్ఞ చేసారు? వెంట ఉంటాము, వెంట జీవిస్తాము, వెంట నడుస్తాము అని. ఈ ప్రతిజ్ఞ పక్కాగా చేసారా? సాకార బాబా యొక్క పాలనకి అధికారి ఆత్మలు. మీ యొక్క భాగ్యం గురించి బాగా ఆలోచించుకోండి మరియు అర్ధం చేసుకోండి.
ఈరోజు విశేషంగా ఒక స్లోగన్ స్మృతిలోకి ఉంచుకోవాలి. మూడు శబ్దాలు స్మృతిలో ఉంచుకోవాలి - విధి, విధానం మరియు వరదానం. విధి ద్వారా సహజంగా సిద్ధిస్వరూపంగా అవుతారు. విధానం ద్వారా విశ్వ నిర్మాతగా, వరదానం ద్వారా వరదానమూర్తిగా అవుతారు. ఈ మూడు మాటలతో సదా సమర్ధంగా అవుతారు.
నలువైపుల ఉన్న ప్రియమైన పిల్లలకు ఉన్నతోన్నతమైన బాబా యొక్క ఉన్నతోన్నతమైన పిల్లలకు, సర్వులను సంపన్నంగా చేసేవారికి ఈ విధంగా మాష్టర్ విధాత, వరదాని పిల్లలకు, మాయకు వీడ్కోలు ఇచ్చేవారికి శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలతో పాటు వెనువెంట ఈరోజు విశేషంగా పిల్లల యొక్క ఉత్సాహ, ఉల్లాసాలకు శుభాకాంక్షలు, సర్వ ఆత్మలకు, సాకారంలో మరియు ఆకారంలో సన్ముఖంగా ఉండే వారికి ప్రియ స్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment