24-04-1983 అవ్యక్త మురళి

24-04-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఆత్మిక పర్సనాలిటీ.

   ఈరోజు బాప్దాదా విశ్వంలోని సర్వ ఆత్మలకు ప్రత్యక్ష జీవితం యొక్క ప్రమాణమును ఇచ్చే పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. కుమారులు-బ్రహ్మాకుమారులు-తపస్వీ కుమారులు-రాజఋషి కుమారులు సర్వస్వ త్యాగం ద్వారా భాగ్యమును ప్రాప్తించుకునే కుమారులు... ఈరోజు ఇది ఇటువంటి శ్రేష్ఠ ఆత్మల విశేష సంగఠన. కుమార జీవితము శక్తిశాలీ జీవితంగా గాయనం చేయబడుతుంది, కాని బ్రహ్మాకుమారులు డబల్ శక్తిశాలీ కుమారులు. ఒకటేమో- శారీరక శక్తి, రెండవది- ఆత్మిక శక్తి. సాధారణ కుమారులు శారీరక శక్తి లేక వినాశీ వృత్తి యొక్క శక్తి కలవారు. బ్రహ్మాకుమారులు అవినాశి అయిన, ఉన్నతోన్నతమైన మాస్టర్ సర్వశక్తివంతుల వృత్తి కలిగిన శక్తిశాలురు. ఆత్మ పవిత్రత యొక్క శక్తితో ఏది కావాలనుకుంటే అది చేయగలుగుతుంది. బ్రహ్మాకుమారుల సంగఠన విశ్వపరివర్తక సంగఠన. అందరూ స్వయమును ఇటువంటి శక్తిశాలురుగా భావిస్తున్నారా? స్వయమును పవిత్రత యొక్క జన్మసిద్ధ అధికారము ప్రాప్తించిన అధికారీ ఆత్మగా భావిస్తున్నారా? బ్రహ్మాకుమారుల అర్థమే పవిత్ర కుమారులు అని. బ్రహ్మాబాబా దివ్యజన్మనిస్తూ పవిత్ర భవ, యోగీభవ అన్న వరదానమునే ఇచ్చారు. బ్రహ్మాబాబా జన్మించడంతోనే పెద్ద తల్లి రూపంలో పవిత్రత యొక్క ప్రేమతో పాలన చేసారు. తల్లి రూపంలో సదా పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి, శ్రేష్ఠంగా అవ్వండి, బాబా సమానంగా అవ్వండి, విశేష ఆత్మగా అవ్వండి, సర్వగుణమూర్తులుగా అవ్వండి, జ్ఞాన మూర్తులుగా అవ్వండి, సుఖశాంతి స్వరూపంగా అవ్వండి అంటూ ప్రతిరోజూ ఈ జోలపాట పాడారు. తండ్రి స్మృతి అనే ఒడిలో పాలన చేసారు. సదా సంతోషపు ఊయలలో ఊపారు. ఇటువంటి మాతాపితల శ్రేష్ఠ పిల్లలే బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు. ఇటువంటి స్మృతి యొక్క సమర్ధ నషా ఉంటుందా? బ్రహ్మాకుమారుల విశేష జీవితపు మహత్వమును సదా గుర్తుంచుకుటాంరా? కేవలం నామధారులైన బ్రహ్మాకుమారులుగా అయితే లేరు కదా! మిమ్మల్ని మీరు శ్రేష్ఠ జీవనధారులైన బ్రహ్మాకుమారులుగా భావిస్తున్నారా? విశ్వపు విశాల రంగస్థలంపై పాత్రను అభినయించే విశేష పాత్రధారులము అని మీకు సదా స్మృతి ఉంటుందా లేక కేవలం ఇంటో్ల లేక సేవా కేంద్రంలో లేక ఆఫీస్లో పాత్రను అభినయించేవారిగా ఉన్నారా? ప్రతి కర్మాచేస్తూ విశ్వంలోని ఆత్మలు మమ్మల్ని చూస్తున్నారు అని స్మృతిలో ఉంటుందా? విశ్వంలోని ఆత్మలు ఏ దృష్టితో మిమ్మల్నందరినీ చూస్తున్నారు! వీరే విశేష పాత్రధారులు అనగా హీరోపాత్రధారులు అని చూస్తున్నారు. దాని అనుసారంగానే ప్రతి కర్మను చేస్తున్నారా లేక సాధారణ రూపంతో పరస్పరంలో మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము అన్నది గుర్తుటోంందా!

బ్రహ్మాకుమారుల అర్థమే సదా పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీలో ఉండడము. ఈ పవిత్రత యొక్క పర్సనాలిటీ విశ్వంలోని ఆత్మలను పవిత్రతవైపుకు ఆకర్షితము చేస్తుంది మరియు మరియు ఇదే ప్యూరిటీ యొక్క రాయల్టీ ధర్మరాజపురిలో రాయల్టీని ఇవ్వడం నుండి విముక్తులను చేస్తుంది. రాయల్టీకి రెండు అర్థాలు ఉంటాయి. ఇదే రాయల్టీ యొక్క ఆధారంపై భవిష్య రాయల్ ఫామిలీలోకి రాగలుగుతారు. కావున ఇటువంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ జీవితంలో ధారణచేసారా అని పరిశీలించుకోండి. యూత్ గ్రూప్వారు పర్సనాలిటీని ఎక్కువగా తయారుచేసుకుంటారు కదా! మరి మీ ఆత్మిక పర్సనాలిటీని, అవినాశీ పర్సనాలిటీని ధారణ చేసారా? ఎవరు చూసినా బ్రహ్మాకుమారీ కుమారుల నుండి ఈ పర్సనాలిటీని అనుభవం చేసుకోవాలి. శారీరక పర్సనాలిటీ ఆత్మలను దేహభానములోకి తీసుకువస్తుంది మరియు ఫ్యూరిటీ యొక్క పర్సనాలిటీ దేహీఅభిమానులుగా తయారుచేసి బాబాకు సమీపంగా తీసుకువస్తుంది. కావున విశేషంగా కుమార్ గ్రూప్వారు ఇప్పుడు ఏమి సేవ చేయాలి? ఒకటేమో- తమ జీవితపు పరివర్తన ద్వారా ఆత్మల సేవను చేయాలి, తమ జీవితం ద్వారా ఆత్మలకు ప్రాణదానమును ఇవ్వాలి. స్వపరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చేయాలి. బ్రహ్మాకుమారులు అనగా వృత్తి, దృష్టి, కృతి మరియు వాణిలో పరివర్తన అని అనుభవం చేయించండి. దానితోపాటు పవిత్రత యొక్క పర్సనాలిటీని, ఆత్మిక రాయల్టీ యొక్క అనుభవమును చేయించండి. రావడంతోనే, కలుసుకోవడంతోనే ఈ పర్సనాలిటీవైపుకు ఆకర్షితులవ్వాలి. సదా తండ్రి పరిచయమును ఇచ్చేవారిగా లేక తండ్రి సాక్షాత్కారమును చేయించే ఆత్మిక దర్పణంగా అయిపోండి. ఆ చిత్రము మరియు చరిత్ర ద్వారా సర్వులకు బాబాయే కనిపించాలి. అలా ఎవరు తయారుచేసారో తయారుచేసేవారు సదా కన్పించాలి. ఎప్పుడు ఏ అద్భుతమైన వస్తువును చూసినా, అద్భుతమైన పరివర్తనను చూసినా అందరి మనస్సుల నుండి, ముఖము నుండి ఇది ఎవరు తయారుచేసారు లేక ఈ పరివర్తన ఎలా జరిగింది, ఇది ఎవరి ద్వారా జరిగింది అన్నదే వెలువడుతుంది. ఇదైతే మీకు తెలుసు కదా! గవ్వ నుండి వజ్రంగా అయిపోయే ఇంత పెద్ద పరివర్తన ఉన్నప్పుడు మరి అందరి మనస్సు నుండి అలా తయారుచేసేవారు స్వతహాగానే గుర్తుకువస్తారు కదా! కుమార్ గ్రూప్ పరుగులుపెడుతూ ఉంటారు. సేవలో కూడా ఎంతగానో పరుగులు తీస్తూ ఉంటారు కదా! కాని సేవా క్షేత్రంలో పరుగులు తీస్తూ బ్యాలెన్స్ను ఉంచుతున్నారా? స్వసేవ మరియు సర్వులసేవ రెండింటి యొక్క బ్యాలెన్స్ సదా ఉంటుందా? బ్యాలెన్స్ లేకపోతే సేవ యొక్క పరుగులలో మాయ కూడా బుద్ధిని పరుగులు పెట్టిస్తుంది.

బ్యాలెన్స్ ద్వారా అద్భుతము జరుగుతుంది. బ్యాలెన్స్ను ఉంచేవారి పరిణామంగా సేవలో కూడా అద్భుతము జరుగుతుంది లేకపోతే బాహ్యముఖత కారణంగా అద్భుతానికి బదులుగా తమ యొక్క లేక ఇతరుల యొక్క భావ స్వభావాల ఘర్షణలోకి వచ్చేస్తారు. కావున సదా సర్వుల సేవతోపాటు మొదట స్వసేవ అవసరము. ఈ బ్యాలెన్స్ సదా స్వయంలో మరియు సేవలో ఉన్నతిని ప్రాప్తింపజేయిస్తూ ఉంటుంది. కుమారులు ఎంతో అద్భుతం చేయగలుగుతారు. కుమార జీవితపు పరివర్తన యొక్క ప్రభావము ప్రపంచంపై ఎంతగా పడుతుందో అంతగా పెద్దవారిదిపడదు. కుమార్ గ్రూపు గవర్నమెంటుకు కూడా తమ పరివర్తన ద్వారా ప్రభు పరిచయమును ఇవ్వగలదు. గవర్నమెంటువారిని కూడా మేల్కొల్పవచ్చు కాని వారు పరీక్ష తీసుకుంటారు. ఏదో అలా ఒప్పేసుకోరు. మరి ఇటువంటి కుమారులు సిద్ధంగా ఉన్నారా? గుప్తమైన సి.ఐ.డి.లు వీరు ఎంతవరకు వికారాలపై విజయులుగా అయ్యారు అని మీ పరీక్ష తీసుకుంటారు. మీ అందరి పేర్లను గవర్నమెంటుకు పంపించమంటారా? 500 మంది కుమారులు కూడా తక్కువేమీ కాదు. అందరూ పుస్తకంలో మీ పేరు మరియు చిరునామా నింపారు కదా! మరి మీ లిస్టును పంపమంటారా? ఏ సి.ఐ.డి.లు వస్తారో తెలియదంటూ అందరూ ఆలోచనలోపడ్డారు. కావాలనే క్రోధం తెప్పిస్తారు. పరీక్షనైతే ప్రాక్టికల్గా తీసుకుంటారు కదా! ప్రాక్టికల్ పరీక్షను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? బాప్దాదా వద్ద అందరి అవును లేక కాదు అన్న జవాబు ఒక ఫిల్మ్లాగా వచ్చేస్తుంది. ఇటువంటి ఆత్మికమైన శక్తిశాలీ యూత్ గ్రూప్ను తయారుచేయాలి మరియు ఆత్మిక యూత్ గ్రూప్ అయిన మేము విశ్వశాంతి యొక్క స్థాపనా కార్యంలో సదా సహయోగులుగా ఉంటాము, ఈ సహయోగం ద్వారా విశ్వపరివర్తన చేసి చూపిస్తాము అని విశ్వమునకు ఛాలెంజ్ చేయాలి. మరి ఏంచేయాలో అర్థమైందా? ఇటువంటి పక్కా గ్రూప్ ఉండాలి. ఈరోజు ఛాలెంజ్ చేసి మళ్ళీ రేపు స్వయమే మానుకోకూడదు. కావున ఇటువంటి సంగఠనను సిద్ధం చేయండి. మెజారిటీ క్రొత్త క్రొత్త కుమారులు ఉన్నారు కాని చివరిలో వచ్చినా వేగంగా ముందుకువెళ్ళి చూపించండి. బ్యాలెన్స్ యొక్క అద్భుతం ద్వారా విశ్వమునకు అద్భుతమును చూపించండి. అచ్ఛా!

ఇలా సదా స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తనను చేసేవారికి 'యోగీభవ, పవిత్రభవ' అన్న తమ జన్మసిద్ధ వరదానమును లేక అధికారమును సదా జీవితంలో అనుభవం చేసుకునేవారికి, సదా పవిత్రత యొక్క పర్సనాలిటీ ద్వారా అన్య ఆత్మలను బాబావైపుకు ఆకర్షింపజేసేవారికి, అవినాశీ వృత్తి యొక్క నషాలో ఉండేవారికి, మాతాపితల శ్రేష్ఠ పాలనకు పరివర్తన ద్వారా రిటర్న్ ఇచ్చే ఇటువంటి ఆత్మిక రాయల్టీ కలిగిన విశేష ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో:-

1. సదా స్వయమును డబల్ లైట్ గా అనగా సర్వబంధనాల నుండి ముక్తులుగా, తేలికగా భావిస్తున్నారా? తేలికతనపు గుర్తులు ఏమిటి? తేలికగా ఉండేది పైకి ఎగురుతూ ఉంటుంది, భారము క్రిందకు తీసుకువస్తుంది. సదా స్వయమును బాబాకు అప్పజెప్పుకునేవారు సదా తేలికగా ఉంటారు. మీ బాధ్యతను బాబాకు ఇచ్చేయండి అనగా మీ భారమును బాబాకు అప్పజెప్పినట్లయితే స్వయం తేలికగా అయిపోతారు. బుద్ధి ద్వారా సరెండర్ అయిపోండి. బుద్ధి ద్వారా సరెండర్ అయినట్లయితే ఇంకేదీ బుద్ధిలోకి రాదు. అంతా బాబాదే. అంతా బాబాలోనే ఉన్నట్లయితే ఇంకేదీ మిగిలి ఉండదు. ఇంకేదీ మిగిలి లేకపోతే బుద్ధి ఇంక ఎటు వెళుతుంది? ఏవైనా పాత వీధులు, పాత దారులు మిగిలి లేవు కదా! కేవలం ఒక్క బాబా, ఒకే స్మృతి యొక్క మార్గము. ఇదే దారిలో లక్ష్యంవైపుకు చేరుకోండి.

2. సదా సంతోషపు ఊయలలో ఊగేవారే కదా! ఎంత అద్భుతమైన ఊయల బాప్దాదా నుండి ప్రాప్తించింది! ఈ ఊయల ఎప్పుడూ తెగిపడిపోవడంలేదు కదా! స్మృతి మరియు సేవ అనే రెండు తాళ్ళు గ్టిగా ఉన్నట్లయితే ఊయల సదా ఏకరసముగా ఉంటుంది. అలా కాక ఒక తాడు వదులుగా మరొకటి ట్ౖట్గా ఉన్నట్లయితే ఊయల ఊగుతూ ఉంటుంది. ఊయల అలా ఊగుతూ ఉంటే దానిపై ఊగేవారు పడిపోతారు. రెండు తాళ్ళు దృఢంగా ఉన్నట్లయితే ఊగడంలో మనోరంజన కలుగుతుంది. ఒకవేళ పడిపోయినట్లయితే మనోరంజనకు బదులుగా దు:ఖము కలుగుతుంది. కావున స్మృతి మరియు సేవ రూపీ రెండు తాళ్ళు సమానంగా ఉండాలి, అప్పుడు చూడండి బ్రాహ్మణ జీవితపు ఆనందమును ఎంతగా అనుభవం చేసుకుంటారో! సర్వశక్తివంతుడైన తండ్రి తోడు, సంతోషపు ఊయల ఉంటే ఇంకేం కావాలి!

3. సదా బాబాను మరియు సేవను రెండింటినీ గుర్తుంచుకుంటారు కదా! స్మృతి మరియు సేవ ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ను సదా ఉంచుతున్నారా? ఎందుకంటే స్మృతి లేకుండా సేవ సఫలం అవ్వదు మరియు సేవ లేకుండా మాయాజీతులుగా అవ్వజాలరు ఎందుకంటే సేవలో బిజీగా ఉండడం ద్వారా, ఈ జ్ఞానమును మననం చేయడం ద్వారా మాయ సహజంగానే పక్కకు తప్పుకుంటుంది. స్మృతి లేకుండా సేవ చేసినట్లయితే సఫలత తక్కువగా, శ్రమ ఎక్కువగా చేయవలసి వస్తుంది. అదే స్మృతిలో ఉంటూ సేవ చేసినట్లయితే సఫలత ఎక్కువగా మరియు శ్రమ తక్కువగా ఉంటుంది. మరి ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉంటుందా? బ్యాలెన్స్ను ఉంచేవారికి సహజంగానే దీవెనలు లభిస్తూ ఉంటాయి, అడగవలసిన అవసరం ఉండదు. ఏ ఆత్మల సేవనైతే చేస్తారో ఆ ఆత్మల మనస్సు నుండి ఓహో వినిపించే శ్రేష్ఠ ఆత్మలారా ఓహో నా జీవితమే మారిపోయింది అని అంటూ ఉంటారు... ఇటువంటి ఓహో, ఓహో అనే శబ్దాలే ఆశీర్వాదాలుగా అయిపోతాయి. ఇటువంటి ఆశీర్వాదాలను అనుభవం చేసుకుంటున్నారా? ఏ రోజైతే స్మృతిలో ఉంటూ సేవ చేస్తారో ఆ రోజున ఎటువంటి శ్రమ లేకుండా సహజమైన సంతోషమును పొందుతున్నామని అనుభవం చేసుకుంటారు. ఇటువంటి సంతోషపు అనుభవము ఉంది కదా! ఇదే ఆధారంపై అందరూ ముందుకువెళుతూ ఉన్నారు. అన్నివేళలా మా స్వఉన్నతి మరియు విశ్వఉన్నతి జరుగుతూ ఉంది అని భావిస్తారు. స్వఉన్నతి లేకపోతే విశ్వఉన్నతికి కూడా నిమిత్తంగా అవ్వజాలరు. స్వఉన్నతికి సాధనము స్మృతి మరియు విశ్వఉన్నతికి సాధనము సేవ. సదా ఇందులోనే ముందుకువెళుతూ ఉండండి. సంగమ యుగంలో బాబా అన్నింకన్నా పెద్దదైన ఏ ఖజానాను ఇచ్చారు? సంతోషపు ఖజానా. ఎన్ని రకాలైన సంతోషపు ఖజానాలు ప్రాప్తించాయి? సంతోషపు వెరౖటీె పాయింట్లను వెలికితీస్తే అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? సంగమ యుగంలో అన్నింకన్నా పెద్దదైన కానుక, ఖజానా, పిక్నిక్ సామాను అంతా ఈ సంతోషమే. రోజూ అమృతవేళ సంతోషమును కలిగించే ఒక్క పాయ్టింను గూర్చి ఆలోచించండి, అప్పుడు రోజంతా సంతోషంలో ఉంటారు. చాలామంది పిల్లలు మరళిలో రోజూ అవే పాయింట్లు ఉంటాయి అని అంటారు. కాని ఏ పాయింట్లయితే పక్కా అవ్వలేదో వాటిని పక్కా చేసేందుకు రోజూ ఇవ్వవలసి ఉంటుంది. ఏ విధంగా స్కూల్లో కొందరు విద్యార్థులకు ఏదైనా విషయము పక్కాగా గుర్తుపెట్టుకోకపోతే 50సార్లు అయినా అదే విషయాన్ని రాస్తారు. కావున బాప్దాదా కూడా రోజూ- పిల్లలూ, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి మరియు నన్ను స్మృతి చేయండి అని చెబుతారు. ఎందుకంటే ఈ పాయింటు ఇప్పటికీ ఇంకా అపరిపక్వంగానే ఉంది. కావున రోజూ సంతోషపు క్రొత్త క్రొత్త పాయింట్లను బుద్ధిలో ఉంచుకోండి మరియు రోజంతా సంతోషంలో ఉంటూ ఇతరులకు కూడా సంతోషమును దానంచేస్తూ ఉండండి, ఇదే అన్నింకన్నా పెద్ద దానము. ప్రపంచంలో అనేక సాధనాలు ఉంటూ కూడా లోలోపలి అవినాశీ సంతోషము లేదు. మీ వద్ద ఆ సంతోషము ఉంది, కావున సంతోషపు దానమును ఇస్తూ ఉండండి.

4. సదా స్వయమును కమలపుష్ప సమానంగా పాత ప్రపంచపు వాతావరణం నుండి అతీతంగా మరియు ఒక్క బాబాకు ప్రియమైనవారిగా అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైతే అతీతంగా ఉంటారో వారే ప్రియముగా ఉంటారు మరియు ఎవరైతే ప్రియముగా ఉంటారో వారే అతీతంగా ఉంటారు. కావున కమల సమానంగా ఉన్నారా లేక వాతావరణంలో ఉంటూ దాని ప్రభావంలోకి వచ్చేస్తారా? ఎక్కడ ఏ పాత్రను అభినయిస్తున్నా అక్కడ ఆ పాత్రను అభినయిస్తూ ఆ పాత్ర నుండి అతీతంగా ఉంటున్నారా లేక ఆ పాత్రలో ప్రియమైనవారిగా అయిపోతున్నారా? ఏమౌతోంది? కాసేపు యోగము లగ్నమవుతూ మరికాసేపు లగనమవ్వకపోవడానికి కారణం ఏమిటి అతీతంగా ఉండడంలో లోటు ఉండడమే. అతీతంగా ఉండని కారణంగా ప్రేమ అనుభవమవ్వదు. ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ స్మృతి ఎలా కలుగుతుంది? ఎంత ఎక్కువగా ప్రేమ ఉంటుందో అంత ఎక్కువగా స్మృతి ఉంటుంది. బాబా ప్రేమకు బదులుగా ఇతరులకు ప్రియమైనవారిగా అయిపోయినట్లయితే బాబాను మర్చిపోతారు. పాత్ర నుండి అతీతంగా మరియు బాబాకు ప్రియమైనవారిగా అవ్వండి. ఇదే లక్ష్యము మరియు ప్రత్యక్ష జీవితంగాను ఉండాలి. లౌకికంలో పాత్రను అభినయిస్తూ ప్రియమైనవారిగా అయినట్లయితే ప్రేమకు ప్రతిఫలంగా ఏం లభించింది? ముళ్ళ పానుపే లభించింది కదా! బాబా ప్రేమలో ఉండడం ద్వారా క్షణంలో ఏం లభిస్తుంది? అనేక జన్మల అధికారము ప్రాప్తమవుతుంది. కావున సదా పాత్రను అభినయిస్తూ అతీతంగా ఉండండి. సేవ కారణంగా పాత్రను అభినయిస్తున్నారు అంతేకాని సంబంధం యొక్క అధికారంపై కాదు. సేవా సంబంధంతో పాత్రను అభినయిస్తున్నారు. దేహసంబంధంలో ఉండడం ద్వారా నష్టము ఉంది. సేవాపాత్రగా భావిస్తూ ఉన్నట్లయితే అతీతంగా ఉంటారు. ప్రేమ రెండువైపులా ఉన్నట్లయితే ఏకరస స్థితి అనుభవమవ్వజాలదు. అచ్ఛా!

Comments