24-02-1983 అవ్యక్త మురళి

* 24-02-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

హృదయాభిరాముడైన తండ్రి తమ హృదయానికి ప్రియమైన పిల్లలతో మిలనం.

ఈరోజు విశేషంగా బాబాను కలుసుకోవాలని సదా ఉల్లాస-ఉత్సాహాలతో ఉండే పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలకు రాత్రింబవళ్ళు బాబాతో మిలనం చేయాలని ఒకే సంకల్పం ఉంటుంది. ఆకారీ రూపంలో కూడా మిలనం జరుపుకుంటారు. అయినా సాకార రూపం ద్వారా కలవాలనే ఆశ కూడా ఉంటుంది. మేము ఈ రోజు కలుసుకుంటామని రోజులన్నీ లెక్క పెడుతూ ఉంటారు. పిల్లల ప్రతి ఒక్కరి ఈ సంకల్పం బాప్ దాదా వద్దకు చేరుకుంటూ ఉంటుంది. బాప్ దాదా కూడా ఇందుకు బదులు ఇచ్చేందుకు పిల్లలు ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కావున ఈరోజు మురళి వినిపించేందుకు రాలేదు కాని కలుసుకోవాలనే పిల్లల సంకల్పాన్ని పూర్తి చేసేందుకు వచ్చారు. కొంతమంది పిల్లలు తమ మనసులోనే మిమ్ములనైతే మాటల ద్వారా పలకరించలేదని(కలుసుకోనివ్వలేదని) మధురాతి మధురమైన ఫిర్యాదులు కూడా చేస్తారు. బాప్ దాదా కూడా ప్రతి పుత్రునితో మనసు నిండేంత వరకు కలుసుకోవాలనుకుంటారు, కానీ సమయాన్ని, మాధ్యమాన్ని చూడవలసి ఉంటుంది. ఆకారీ రూపంలో అయితే ఒకే సమయంలో ఎంతమంది కావాలంటే, అంతమంది ఎంత సమయం కావాలంటే, అంత సమయం కలుసుకోవచ్చు. దాని కొరకు టర్న్ వచ్చే అవసరం ఉండదు. కాని సాకార సృష్టిలో సాకార తనువు ద్వారా కలిసేటప్పుడు సాకారీ ప్రపంచం మరియు సాకారీ శరీర లెక్కను కూడా చూడవలసి ఉంటుంది. ఆకారీ వతనంలో కూడా ఫలానా గ్రూపువారు ఫలానా రోజు కలుసుకోవాలని ఒక గంట తర్వాత, అరగంట తర్వాత కలుసుకునేందుకు రావాలని ఎప్పుడైనా రోజులను నిర్ణయించడం జరుగుతుందా? ఈ బంధనం మీకు గాని, తండ్రికి గాని సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరంతో ఉండదు. ఆకారీ రూపంతో మిలనం జరుపుకోవడంలో అనుభజ్ఞులే కదా! అక్కడ భలే రోజంతా కూర్చోండి, ఎవ్వరూ లేపరు. ఇక్కడైతే ఇప్పుడు వెనుకకు వెళ్ళండి, ఇప్పుడు ముందుకు వెళ్ళండి అని అంటారు. అయినా రెండు మిలనాలూ మధురమైనవే! డబుల్ విదేశీ పిల్లలైన మీరు లేక దేశంలో ఉండే పిల్లలెవరైతే సాకారంలో డ్రామా అనుసారంగా పాలనను లేదా ప్రాక్టికల్ స్వరూపాన్ని చూడలేకపోయారు. అటువంటి చాలా సమయం నుండి వెతుకుతూ మళ్ళీ వచ్చి కలుసుకున్న (అపురూపమైన) పిల్లల గుణగానం చేస్తారు. వారు వెనుక వచ్చినా ఆకార రూపం ద్వారా కూడా సాకార రూపాన్ని అనుభవం చేస్తారు. అటువంటి అనుభవం ఆధారంతో మేము సాకార బాబాను చూడలేదని మాకు అనిపపించడం లేదని అంటారు సాకారంలో పాలన తీసుకున్నారు మరియు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. కావున ఆకార రూపంలో సాకారుని అనుభవం చేయడం ఇది బుద్ధి యొక్క లగ్నానికి, స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం. ఆకారంలో కూడా సాకారుని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అటువంటి అనుభవం చేస్తున్నారు కదా! కావున ఇది పిల్లల బుద్ది యొక్క చమత్కారానికి ఋజువు. అయితే హృదయాభిరాముడైన తండ్రికి సమీపంగా ఉన్న హృదయాభి రాముని ప్రియమైన పిల్లలుగా ఉన్నారనే దానికి ఇదే ఋజువు. ప్రియమైన పిల్లలు కదా! ప్రియమైన వారి పైన సదా ఏ పాట మ్రోగుతూ ఉంటుంది? “వాహ్ బాబా, వాహ్ నా బాబా...”

బాప్ దాదా ప్రతి పుత్రుని గుర్తు చేస్తున్నారు. ఫలానా వారిని జ్ఞాపకం చేసుకున్నారు, నన్ను గుర్తు చేసుకున్నారో లేదోనని భావించకండి. వీరిపై ఎక్కువ ప్రేమ ఉంది, నాపై తక్కువ ప్రేమ ఉందని అనుకోకండి. మీరే ఆలోచించండి, 5 వేల సంవత్సరాల తర్వాత బాప్ దాదాకు తప్పిపోయిన పిల్లలు లభించినప్పుడు 5 వేల సంవత్సరాల ప్రేమ అంతా ఒకేసారి ప్రతి పుత్రునికి లభిస్తుంది కదా! కావున 5 వేల సంవత్సరాల ప్రేమ 5-6 సంవత్సరాలలో లేదా 10-12 సంవత్సరాలలో ఇవ్వవలసినప్పుడు పాత స్టాకును ఎంత కొద్ది సమయంలో ఇస్తారు! ఎక్కవలో ఎక్కువగా ఇచ్చినప్పుడే పూర్తవుతుంది. ఇంత ప్రేమ పూరితమైన స్టాకు ప్రతి ఒక్క పుత్రుని కోసం తండ్రి వద్ద ఉంది. ప్రేమ తక్కువ అవ్వజాలదు.

రెండవ విషయం - బాప్ దాదా సదా పిల్లల విశేషతలనే చూస్తారు. కొన్ని సమయాలలో పిల్లలు మాయా ప్రభావం కారణంగా కొంచెం చలించే ఆట కూడా ఆడతారు. అయినా బాప్ దాదా ఆ సమయంలో కూడా, ఈ పుత్రుడు, వచ్చిన విఘ్నాన్ని లగ్నంతో దాటి మళ్ళీ విశేషాత్మగా అయ్యి విశేష కార్యాన్ని చేసేవాడు అనే దృష్టితో చూస్తారు. విఘ్నంలో కూడా లగ్నం రూపాన్నే చూస్తారు. కనుక ప్రేమ ఎలా తగ్గిపోతుంది! ప్రతి పుత్రునిపై సదా అపారమైన ప్రేమ ఉంది మరియు ప్రతి పుత్రుడు సదా శ్రేష్ఠమే. అర్థమయిందా! 

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక న్యూయార్క్:- తండ్రికి చెందినవారుగా అవ్వడం అనగా విశేషాత్మలుగా అవ్వడం. ఎప్పటి నుండి తండ్రి వారిగా అయ్యారో, ఆ ఘడియ నుండి విశ్వంలో సర్వ శ్రేష్ఠమైన గాయన యోగ్యులుగా, పూజ్యనీయ ఆత్మలుగా అయ్యారు. మీకు లభించే గౌరవాన్ని మీకు జరిగే పూజలో మళ్ళీ చైతన్య రూపంలో చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా. ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఎక్కడ భారతదేశం, ఎక్కడ అమెరికా! కాని తండ్రి ఆ మూల నుండి ఎన్నుకొని ఒకే తోటలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరంతా ఎవరు? అల్లా పూలతోటలోని ఆత్మిక గులాబీ పుష్పాలు. ఫలానా దేశం, ఫలానా దేశము అని ఇక్కడ పేర్లు చెప్పవలసి వస్తుంది. వాస్తవానికి మీరంతా ఒకే తోటకు చెందినవారు. ఒకే తండ్రి పాలనలోకి వచ్చే ఆత్మిక గులాబీ పుష్పాలు. మేమంతా ఒక్కరికి చెందిన వారమని, మేమంతా ఒకే దారిలో నడిచి ఒకే గమ్యానికి వెళ్ళేవారమని ఇప్పుడు అనుభవం అవుతోంది కదా! తండ్రి కూడా ప్రతి ఒక్కరిని చూసి హర్షిస్తున్నారు. అందరి శుభ భావన, అందరి సేవలో అలసిపోని లగ్నము, దృఢ సంకల్పము ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చింది. నలువైపులా ఉత్సాహ-ఉల్లాసాల సహయోగం మంచి ఫలితాన్ని చూపించింది. బయట నుండి వచ్చిన శబ్దము భారతవాసులను మేల్కొల్పుతుంది, కావున బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. 

బార్బడోస్ :- బాప్ దాదా సదా పిల్లలకు నంబర్ వన్ గా అయ్యే సాధనాన్ని తెలియజేస్తారు. ఎవరు ఎంత వెనకాల వచ్చినా, ముందుకు వెళ్ళి మొదటి నంబరు తీసుకోవచ్చు. మాకు ఉన్నతమైన పాత్ర ఉంటుందో ఉండదో, మేము ఎలా ముందుకు వెళ్తాము అని ఆలోచించడం లేదు కదా! బాప్ దాదా వద్దకు చివరిలో వచ్చిన వారికైనా, ఏ దేశానికి చెందిన వారికైనా, ఏ ధర్మానికి చెందిన వారికైనా ఎటువంటి మాన్యతకు చెందినవారైనా అందరికి ఒకే పూర్తి అధికారం ఉంది. తండ్రి ఒక్కరే అయినప్పుడు హక్కు కూడా అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కేవలం ధైర్యం మరియు లగ్నానికి చెందిన విషయము. ఎప్పుడూ ధైర్య విహీనులుగా అవ్వకండి. ఎవరు ఎంత నిరుత్సాహ పరిచినా, మీకేమయిందో తెలియదు... ఎక్కడికి వెళ్ళిపోయారు అని అన్నా మీరు వారి మాటలను పట్టించుకోకండి. పూర్తిగా గుర్తించి తెలుసుకునే వ్యాపారం చేశారు కదా! మేము బాబావారము, బాబా మావారు. బాబా ప్రతి పుత్రుని అధికారీ ఆత్మగా భావిస్తారు. ఎవరు ఎంత తీసుకున్నా అందుకు ఎటువంటి ఆటంకము లేదు. ఇప్పుడింకా ఏ సీట్లూ బుక్ అవ్వలేదు. ఇప్పుడు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఈల మోగనే లేదు. అందువలన ధైర్యం చేస్తూ ఉంటే తండ్రి కూడా పదమాల రెట్లు(కోటాను కోట్లు) సహాయం చేస్తూ ఉంటారు.

కెనడా :- సదా ఎగిరే కళలోకి వెళ్ళేందుకు ఆధారమేది? డబల్ లైట్ గా అవ్వడం కావున సదా ఎగరే పక్షులుగా ఉన్నారు కదా! ఎగిరే పక్షి ఎప్పుడూ ఎవరి బంధనంలోకి రాదు. క్రిందకు వచ్చినట్లయితే బంధనంలో బంధింపబడుంది. కావున సదా ఎగురుతూ ఉండండి. ఎగిరే పక్షి అనగా సర్వ బంధనాల నుండి ముక్తులుగా, జీవన్ముక్తులుగా ఉండడం. కెనడాలో సైన్స్ కూడా ఎగిరే కళను నేర్పిస్తుంది కదా! కావున కెనడా నివాసులు సదా ఎగిరే పక్షులు. 

శాన్ ఫ్రాన్సిస్కో :- అందరూ స్వయాన్ని విశ్వంలో విశేష పాత్రను అభినయించే హీరో యాక్టర్లుగా భావిస్తూ పాత్రను అభినయిస్తున్నారా? (అప్పుడప్పుడు). బాప్ దాదాకు అప్పుడప్పుడు అనే పిల్లల మాట విన్నప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది. సదా బాబా తోడుగా ఉన్నప్పుడు సదా వారి స్మృతే ఉంటుంది కదా! స్మృతి చేసేందుకు బాబా తప్ప ఇంకెవరు ఉన్నారు? ఎవరిని స్మృతి చేస్తారు? ఇతరులను స్మృతి చేస్తూ చేస్తూ ఏమి పొందారు? ఎక్కడికి చేరుకున్నారో దీని అనుభవం కూడా ఉంది కదా. ఇది కూడా అనుభవం చేసిన తర్వాత ఇప్పుడు తండ్రి తప్ప ఇతరుల స్మృతి ఎలా రాగలదు? సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో అనుభవం చేశారా? లేక ఇంకా ఏమైనా మిగిలిపోయాయా? ఒక్కరి ద్వారా సర్వ సంబంధాలను అనుభవం చేయగలిగినప్పుడు అనేక వైపులకు వెళ్ళే అవసరమే లేదు. దీనినే "ఒకే బలం, ఒకే విశ్వాసము” అని అంటారు. మంచిది.

అందరూ బాగా శ్రమ చేసి విశేషాత్మలను సంపర్కములోకి తీసుకొచ్చారు. ఎవరైతే సేవలో సహయోగమిచ్చారో ఆ సహయోగానికి ప్రతిఫలం అనేక జన్మల వరకు సహయోగం ప్రాప్తమవుతూ ఉంటుంది. ఈ ఒక్క జన్మలో చేసిన శ్రమ ద్వారా అనేక జన్మల శ్రమ నుండి విడుదలయ్యారు. సత్యయుగంలో ఏమైనా శ్రమ చేస్తారా! బాప్ దాదా పిల్లల ధైర్యం మరియు నిమిత్త భావాన్ని చూసి సంతోషిస్తారు. ఒకవేళ నిమిత్త భావంతో చేయకపోతే ఫలితం కూడా వెలువడదు. మంచిది. 

Comments