23-12-1985 అవ్యక్త మురళి

23-12-1985          ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా        మధువనము  

"కామజీతులు – అన్ని హద్దు యొక్క కామనల నుండి అతీతులు"

బాప్ దాదా తమ శ్రేష్ఠమైన చిన్న సుఖవంతమైన ప్రపంచాన్ని చూస్తున్నారు. ఒకవైపు చాలా పెద్ద సారములేని ప్రపంచము. మరో వైపు చిన్న సుఖవంతమైన ప్రపంచము. ఈ సుఖమయ ప్రపంచంలో సదా సుఖ-శాంతి సంపన్నమైన బ్రాహ్మణ ఆత్మలున్నారు, ఎందుకంటే పవిత్రత, స్వచ్ఛతలపై వీరి సుఖశాంతిమయ జీవితం ఆధారపడి ఉంది. ఎక్కడైతే పవిత్రత మరియు స్వచ్ఛత ఉంటుందో అక్కడ ఎటువంటి దుఃఖము, అశాంతి యొక్క నామ-రూపాలు ఉండవు. ఈ చిన్న సుఖమయ ప్రపంచము పవిత్రత అనే కోటలో ఉంది. ఒకవేళ పవిత్రత అనే కోటలో నుండి సంకల్పం ద్వారా అయినా బయటకు వచ్చారంటే దుఃఖము మరియు అశాంతి యొక్క ప్రభావాన్ని అనుభవం చేస్తారు. ఈ బుద్ధి రూపీ పాదము కోట లోపల ఉన్నట్లయితే సంకల్పములోనే కాదు, స్వప్నంలో కూడా దుఃఖము, అశాంతి యొక్క అల రాలేదు. దుఃఖము మరియు అశాంతి ఏ మాత్రం అనుభవం అవుతున్నా తప్పకుండా ఏదో ఒక అపవిత్రత యొక్క ప్రభావముంది. పవిత్రత కేవలం కామజీతులుగా, జగత్జీతులుగా అవ్వడం కాదు. కానీ కామ వికారం యొక్క వంశం అంటే సర్వ హద్దు యొక్క కామనలు. కామజీతులనగా అన్ని కామనలను జయించినవారు, ఎందుకంటే కామనలు అనేక విస్తార పూర్వకమైనవి. ఒకటి - వస్తువుల యొక్క కామన, రెండవది - వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తుల కామన. మూడవది - సంబంధాలు నిభాయించడంలో కూడా హద్దు కామనలు అనేక రకాలుగా ఉత్పన్నమవుతాయి. నాల్గవది - సేవా భావనలో కూడా హద్దు కామనల భావము ఉత్పన్నమవుతుంది. ఈ నాలుగు రకాల కామనలను సమాప్తం చెయ్యడమంటే సదా కొరకు దుఃఖము అశాంతులను జయించడం. ఇప్పుడు ఈ నాలుగు రకాల కామనలను సమాప్తం చేశానా అని తమను తాము ప్రశ్నించుకోండి. ఒకవేళ ఏదైనా వినాశీ వస్తువు బుద్ధిని తన వైపుకు ఆకర్షిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అది కామన రూపంలోని ఆకర్షణ అవుతుంది. అయితే పదాన్ని పరివర్తన చేసి రాయల్ రూపంలో కోరిక లేదు కానీ బాగా అనిపిస్తుందని అంటారు. వస్తువు అయినా, వ్యక్తి అయినా ఎవరి పట్లనైనా విశేషమైన ఆకర్షణ ఉన్నట్లయితే, ఆ వస్తువే బాగా అనిపిస్తుంది లేక ఆ వ్యక్తినే బాగా అనిపిస్తున్నారంటే, అది కామన. అది కోరిక. అన్నీ బాగా అనిపిస్తున్నాయి అంటే అది యథార్థము, ఇది మాత్రమే బాగుంది లేక వీరు మాత్రమే బాగున్నారు అని అంటే అది అయథార్థము.

ఇది కోరికకు రాయల్ రూపము. ఎవరి సేవ అయినా బాగా అనిపిస్తుంది, ఎవరి పాలనైనా బాగా అనిపిస్తుంది, ఎవరి గుణాలైనా బాగా అనిపిస్తాయి, ఎవరి శ్రమ అయినా బాగా అనిపిస్తుంది, ఎవరి త్యాగమైనా బాగా అనిపిస్తుంది, ఎవరి స్వభావమైనా బాగా అనిపిస్తుంది. ఈ మంచితనపు సుగంధమును తీసుకోవడం లేక ఈ మంచితనాన్ని స్వయం కూడా ధారణ చేయడం వేరే విషయం. కానీ ఈ మంచితనం వలన ‘వీరే మంచివారు’ - ఈ ‘మంచి’ అనడం కోరికలోకి మారిపోతుంది. ఇది కోరిక. అటువంటివారు దుఃఖము, అశాంతిని ఎదుర్కోలేరు. ఒకటేమో మంచితనము వెనుక స్వయాన్ని మంచిగా తయారుచేసుకోవడం నుండి వంచితులుగా చేసుకుంటారు, రెండవది - శత్రుత్వపు కోరిక కూడా క్రిందకు తీసుకొస్తుంది. ఒకటేమో ప్రభావితమయ్యేటువంటి కోరిక, రెండవది - ఎవరి పట్ల అయినా వైరము, ఈర్ష్య భావనల కామన. ఇవి కూడా సుఖ-శాంతులను సమాప్తం చేస్తాయి. సదా వారి మనస్సు అలజడిలోకి వస్తుంది. ప్రభావితమయ్యే వారి లక్షణం - లగావ్ మరియు ఝుకావ్ (ఆకర్షింపబడడం మరియు వంగిపోవడం). అలాగే ఈర్ష్య లేక వైర భావము, వారి గుర్తు - మొండిగా ఉండడం మరియు ఋజువు చేయడం. ఈ రెండు భావాలలో ఎంత శక్తిని, ఎంత సమయాన్ని సమాప్తం చేస్తారో అర్థమే కాదు. రెండూ చాలా నష్టం కలిగిస్తాయి. స్వయమూ విసిగిపోతారు, ఇతరులను కూడా విసిగిస్తూ ఉంటారు. అటువంటి స్థితి యొక్క సమయంలో, అటువంటి ఆత్మల నినాదము - దుఃఖం తీసుకోవాలి మరియు దుఃఖం ఇవ్వాల్సిందే అని అంటారు. ఏమైనా జరగనీ కాని చెయ్యాల్సిందే అని అంటారు. ఈ కోరిక ఆ సమయంలో మాట్లాడ్తుంది. బ్రాహ్మణాత్మ మాట్లాడదు, అందువలన ఏం జరుగుతుందంటే సుఖ శాంతుల ప్రపంచం నుండి బుద్ధి రూపీ పాదము బయటకు వెళ్ళిపోతుంది, అందుకే ఈ రాయల్ కోరికల పై కూడా విజయులుగా అవ్వండి. ఈ కోరికల నుండి కూడా ఇచ్ఛామాత్రం అవిద్యా స్థితిలోకి రండి.

ఈ రెండు భావాలున్నప్పుడు ఏవైతే సంకల్పాలు చేస్తారో “ఇలా మాట్లాడే చూపిస్తా” అని, అది ఎవరికి చూపిస్తారు? తండ్రికా లేక బ్రాహ్మణ పరివారానికా? ఎవరికి చూపిస్తారు? ఇది చేసి చూపించడం కాదు, క్రిందపడి చూపించడం అని భావించండి. అదేమైనా అద్భుతమా చూపించడానికి! క్రింద పడడం - ఇదేమైనా చూపించే విషయమా! ఈ హద్దు ప్రాప్తి యొక్క నషా - నేను సేవ చేసి చూపిస్తాను, పేరు ప్రఖ్యాతము చేసి చూపిస్తాను, ఇవి రాయల్ మాటలా? చెక్ చేసుకోండి. భాష అయితే సింహానిది అని అంటారు కానీ మేకగా అవుతున్నారు. ఉదాహరణకు ఈ రోజులలో కొందరు సింహాం, కొందరు ఏనుగు, కొందరు రావణుడు, కొందరు రాముడు యొక్క ముఖము పెట్టుకుంటారు కదా! అలా ఈ మాయ, సింహం ముఖాన్ని తగిలిస్తుంది. నేను ఇది చేసి చూపిస్తాను, ఇది చేస్తాను అని అంటారు, కాని మాయ తన వశం చేసుకొని మేకగా తయారుచేస్తుంది. మైపన్(నేను) రావడం అనగా ఏదో ఒక హద్దు కోరికకు వశీభూతులవ్వడం. ఈ భాష యుక్తియుక్తంగా మాట్లాడండి మరియు భావన కూడా యుక్తియుక్తంగా ఉంచుకోండి. ఇది తెలివి కాదు కాని ప్రతి కల్పములో - సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులుగా అయ్యే ఓటమిని పొందడం. కల్ప-కల్పము చంద్రవంశీయులుగా అవ్వవలసే ఉంటుంది. కనుక ఇది ఓడిపోవడమా? లేక నేర్పరితనమా? కనుక ఇటువంటి తెలివితేటలు చూపించకండి. అభిమానంలోకి రాకండి, అవమాన పరచకండి. ఈ రెండు భావనలు, శుభభావన శుభకామన నుండి దూరం చేస్తాయి. మరి పరిశీలించుకోండి - కొంచెం కూడా సంకల్ప మాత్రం కూడా అభిమానం లేక అవమాన భావన మిగిలిపోలేదు కదా? ఎక్కడైతే అభిమానం మరియు అవమాన భావన ఉంటుందో అక్కడ ఎప్పుడూ ఎవ్వరూ స్వమానం యొక్క స్థితిలో స్థితులవ్వలేరు. స్వమానం అన్ని కోరికల నుండి దూరం చేస్తుంది, అంతేకాక సదా సుఖమయ ప్రపంచంలో సుఖ-శాంతుల ఊయలలో ఊగుతూ ఉంటారు. వారినే సర్వ కామనాజీతులు, జగత్ జీతులని అంటారు. అయితే బాప్ దాదా చిన్న సుఖమయ ప్రపంచాన్ని చూస్తున్నారు. సుఖమయ ప్రపంచం నుండి, మీ స్వదేశం నుండి, పరాయి దేశంలోకి బుద్ధి రూపీ పాదము ద్వారా ఎందుకు వెళ్లిపోతున్నారు? పరధర్మము, పరదేశము దుఃఖమిచ్చేవి. స్వధర్మము, స్వదేశము సుఖమిచ్చేవి. కనుక సుఖసాగరుడైన తండ్రికి పిల్లలు, సుఖమయ ప్రపంచానికి అనుభవీ ఆత్మలు మీరు. అధికారీ ఆత్మలు, కనుక సదా సుఖంగా ఉండండి, శాంతిగా ఉండండి. అర్థమయిందా!

దేశ విదేశాలలోని స్నేహీ పిల్లలు తమ ఇంట్లో లేక తండ్రి ఇంట్లో తమ అధికారాన్ని తీసుకునేందుకు చేరుకున్నారు. కాబట్టి అధికారీ పిల్లలను చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు. ఎలాగైతే సంతోషంగా వచ్చారో అలా సదా సంతోషంగా ఉండేందుకు విధి ఏమంటే, ఈ రెండు విషయాలను సంకల్పం ద్వారా కూడా త్యాగం చేసి సదా కొరకు భాగ్యవంతులుగా అయి వెళ్ళండి. భాగ్యము తీసుకునేందుకు వచ్చారు, అయితే భాగ్యము తీసుకోవడంతో పాటు మీ ఎగిరేకళలో విఘ్నరూపంగా అయ్యే ఏదైనా బలహీనతను వదిలి వెళ్ళండి. ఈ వదలడమే తీసుకోవడం. అచ్ఛా.

సదా సుఖం యొక్క ప్రపంచంలో ఉండే సర్వ కామనాజీతులు, సదా సర్వాత్మల పట్ల శుభ భావన మరియు శుభకామనలు ఉంచుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వమానమనే సీటుపై స్థితులై ఉండే విశేష ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

12-04-2020 ప్రాతః మురళి ఓంశాంతి "అవ్యక్త బాప్ దాదా" రివైజ్: 25-12-1985 మధువనము

"మధురత ద్వారా చేదు భూమిని మధురంగా తయారుచేయండి"

ఈ రోజు అతి పెద్ద తండ్రి, గ్రాండ్ ఫాదర్ తమ గ్రాండ్ చిల్డ్రెన్, లవ్లీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బ్రహ్మాకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనే మహిమ ఉంది. నిరాకారుడైన తండ్రి సాకార సృష్టి యొక్క రచనకు బ్రహ్మాను నిమిత్తంగా చేశారు. మనుష్య సృష్టికి రచయిత అయిన కారణంగా మనుష్య సృష్టి యొక్క స్మృతి చిహ్నాన్ని వృక్షం రూపంలో చూపించారు. బీజము గుప్తంగా ఉంటుంది, మొదట రెండు ఆకులు వస్తాయి, వీటి ద్వారా కాండం వెలువడ్తుంది. వారే వృక్షానికి ఆదిదేవుడు మరియు ఆదిదేవి, మాత-పితల స్వరూపంలో వృక్షమునకు పునాదిగా బ్రహ్మా నిమిత్తంగా అవుతారు. వారి ద్వారా బ్రాహ్మణుల కాండము ప్రకటితమవుతుంది మరియు బ్రాహ్మణుల కాండము నుండి అనేక శాఖలు ఉత్పన్నమవుతాయి, అందువలన బ్రహ్మాకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనే గాయనముంది. బ్రహ్మా అవతరణ జరగడం అనగా చెడ్డ రోజులు సమాప్తమై గొప్ప రోజులు ప్రారంభమవ్వడం. రాత్రి సమాప్తమై బ్రహ్మా ముహూర్తము ప్రారంభమవుతుంది. వాస్తవానికి బ్రహ్మా ముహూర్తము కాని చెప్పినప్పుడు బ్రహ్మ ముహూర్తము అని అంటారు, అందువలన బ్రహ్మాను వృద్ధునిగా చూపిస్తారు. గ్రాండ్ ఫాదర్ నిరాకారుడైన తండ్రి, గ్రాండ్ చిల్డ్రన్కు (మనుమలకు) ఎన్ని బహుమతులిస్తారంటే 21 జన్మల కొరకు తింటూనే ఉంటారు. వారు దాత మరియు విధాత కూడా. జ్ఞాన రత్నాలతో పళ్ళాలను నింపి నింపి ఇస్తారు. శక్తుల యొక్క బంగారు కానుకను లెక్కలేనన్ని స్వరూపాలలో ఇచ్చేస్తారు. గుణాల ఆభరణాలను పెట్టె నింపుగా వేసి ఇస్తారు. మీ వద్ద ఎన్ని అలంకారాల పెట్టెలు ఉన్నాయి! ప్రతిరోజూ కొత్తగా అలంకరించుకున్నా లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ కానుకలు సదా తోడుగా వస్తాయి. ఆ స్థూల కానుకలు అయితే ఇక్కడే ఉండిపోతాయి. కాని ఇవి మీకు తోడుగా వస్తాయి. ఇన్ని ఈశ్వరీయ కానుకలతో ఎంత సంపన్నమవుతారంటే, ఇక సంపాదించాల్సిన అవసరమే ఉండదు. కానుకలతోనే తింటూ ఉంటారు. శ్రమ నుండి విడుదల అవుతారు.

అందరూ విశేషంగా క్రిస్మస్ డే జరుపుకునేందుకు వచ్చారు కదా! బాప్ దాదా కిస్ మిస్ డే అని అంటారు. కిస్మిస్ డే అనగా మధురత యొక్క రోజు. సదా మధురంగా అయ్యే రోజు. తీపినే ఎక్కువగా తింటూ మరియు తినిపిస్తూ ఉంటారు కదా! నోరైతే కొంత సమయం కొరకే తియ్యగా అవుతుంది, కానీ స్వయమే మధురంగా అయినట్లయితే, సదా నోట్లో మధురమైన మాటలు ఉంటాయి. ఎలాగైతే తీపిని తినడం మరియు తినిపించడంలో సంతోషిస్తారు కదా! అలా మధురమైన మాటలు స్వయాన్ని కూడా సంతోషపరుస్తాయి, ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. కనుక దీనితో సదా అందరి నోటిని మధురంగా చేస్తూ ఉండండి. సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధరమైన కర్మలు. ఇదే కిస్మిస్ రోజును జరుపుకోవడం. జరుపుకోవడం అనగా తయారుచెయ్యడం. ఎవరికైనా రెండు ఘడియలు మధురమైన దృష్టిని ఇచ్చి, మధురమైన మాటలను మాట్లాడినట్లయితే ఆ ఆత్మను సదా కొరకు నిండుగా చేస్తారు. ఈ రెండు ఘడియల మధురమైన దృష్టి, మాటలు ఆ ఆత్మ యొక్క సృష్టిని మార్చేస్తాయి. ఈ రెండు మధురమైన మాటలు సదా కొరకు పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అవుతాయి. మధురత ఎటువంటి విశేష ధారణ అంటే ఇది చేదు భూమిని కూడా మధురంగా చేస్తుంది. మీ అందరినీ మార్చేందుకు ఆధారము తండ్రి యొక్క రెండు మధురమైన మాటలే కదా! మధురమైన పిల్లలూ, మీరు మధురమైన శుద్ధమైన ఆత్మలు. ఈ రెండు మధురమైన మాటలు మార్చేసాయి కదా! మధురమైన దృష్టి మార్చేసింది. ఇలానే మధురత ద్వారా ఇతరులను కూడా మధురంగా చేయండి. ఈ నోటిని మధురంగా చేయండి. అర్థమయిందా - క్రిస్మస్ డే ను జరుపుకున్నారు కదా! సదా ఈ కానుకలతో మీ ఒడిని నింపుకున్నారా? సదా మధురత అనే కానుకను తోడుగా ఉంచుకోండి. దీని ద్వారా సదా మధురంగా ఉండండి మరియు మధురంగా చెయ్యండి. అచ్ఛా.

సదా జ్ఞాన రత్నాలతో బుద్ధి రూపి ఒడిని నింపుకునేవారు, సదా సర్వ శక్తులతో శక్తిశాలి ఆత్మలుగా అయి శక్తులతో సదా సంపన్నంగా అయ్యేవారు, సర్వ గుణాలనే ఆభరణాలతో సదా అలంకరింపబడిన శ్రేష్ఠ ఆత్మలకు, సదా మధురతతో నోటిని తీపిగా చేసే మధురమైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

కుమారులతో అవ్యక్త బాప్ దాదా కలయిక:- కుమారులు అనగా తీవ్రగతితో ముందుకు వెళ్ళేవారు. ఆగడం-నడవడం, ఆగడం-నడవడం కాదు. ఎటువంటి పరిస్థితులైనా స్వయాన్ని సదా శక్తిశాలి ఆత్మగా భావించి ముందుకు వెళుతూ ఉండండి. పరిస్థితి లేక వాయుమండలం యొక్క ప్రభావంలోకి వచ్చేవారు కాదు, కానీ తమ శ్రేష్ఠ ప్రభావాన్ని ఇతరులపై వేసేవారు. శ్రేష్ఠమైన ప్రభావం అనగా ఆత్మిక ప్రభావము. వేరే ప్రభావము కాదు. ఇటువంటి కుమారులే కదా! పరీక్ష వస్తే కదిలేవారైతే కాదు. పరీక్షలో పాస్ అయ్యేవారే కదా! సదా ధైర్యశాలురే కదా! ఎక్కడ ధైర్యముంటుందో అక్కడ తండ్రి సహాయం ఉండనే ఉంటుంది. పిల్లలు ధైర్యము చేస్తే, తండ్రి సహాయము చేస్తారు. ప్రతి కార్యములో స్వయాన్ని ముందు పెట్టి ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తూ ఉండండి.

కుమారులంటేనే ఎగిరేకళ వారు. ఎవరైతే సదా నిర్బంధనులుగా ఉంటారో, వారే ఎగిరేకళలో ఉండేవారు. కావున మీరు నిర్బంధన కుమారులు కదా! మానసిక బంధనం కూడా లేదు. కనుక సదా బంధనాలను సమాప్తం చేసి నిర్బంధనులుగా అయి ఎగిరేకళలో ఉండే కుమారులే కదా? కుమారులు తమ శారీరిక శక్తిని, బుద్ధి యొక్క శక్తిని రెండింటినీ సఫలం చేస్తున్నారా? లౌకిక జీవితంలో తమ శారీరిక శక్తిని, బుద్ధి యొక్క శక్తిని వినాశన కార్యములో ఉపయోగిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు శ్రేష్ఠ కార్యములో ఉపయోగించేవారు. అలజడి చేసేవారు కాదు కానీ శాంతి స్థాపన చేసేవారు. ఇటువంటి శ్రేష్ఠ కుమారులే కదా? ఎప్పుడూ లౌకిక జీవితం యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవ్వడం లేదు కదా? అలౌకిక జీవితం వారు అనగా కొత్త జన్మ తీసుకున్నవారు. కనుక కొత్త జన్మలో పాత విషయాలు ఉండవు. మీరందరూ కొత్త జన్మ యొక్క శ్రేష్ఠమైన ఆత్మలు. ఎప్పుడూ స్వయాన్ని సాధారణంగా భావించకుండా శక్తిశాలిగా భావించండి. సంకల్పంలో కూడా అలజడిలోకి రాకూడదు. వ్యర్థ సంకల్పాలు వస్తే ఏం చెయ్యాలి అని అయితే ప్రశ్నించరు కదా? భాగ్యశాలి కుమారులు. 21 జన్మల భాగ్యాన్ని తింటూ ఉంటారు. స్థూల సంపాదన, సూక్ష్మ సంపాదన రెండింటి నుండి ముక్తులవుతారు. అచ్ఛా.

వీడ్కోలుసమయంలో ప్రియస్మృతులు:- దేశ విదేశాల పిల్లలందరి నుండి ఈ విశేషమైన రోజు సందర్భంగా కార్డులు, పత్రాలు, స్మృతి కూడా లభించింది. బాప్ దాదా మధురాతి మధురమైన పిల్లలందరికీ ఈ గొప్ప రోజు సందర్భంగా సదా మధురత ద్వారా శ్రేష్ఠంగా అయి శ్రేష్ఠంగా చెయ్యండి అనే వరదానంతోపాటు స్వయం కూడా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ సేవను కూడా వృద్ధి చేస్తూ ఉండండి. పిల్లలందరికీ అతి పెద్ద తండ్రి యొక్క అతి గొప్ప ప్రియస్మృతులు మరియు తోడు-తోడుగా స్నేహభరిత శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్. సదా మధురంగా అయ్యేందుకు అభినందనలు.

Comments