23-05-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
వదిల్తే వదుల్తుంది
ఈరోజు బాప్దాదా తమ ఆది స్థాపనా కార్యములో నిమిత్తులుగా అయిన సహయోగీ పిల్లలను చూస్తున్నారు. సహయోగీ పిల్లలందరి భాగ్యమును చూసి హర్షితులవుతున్నారు. స్థాపనా పటమును చూసారు. ఆదికాలమునకు చెందిన ఈ శ్రేష్ఠ బ్రాహ్మణుల ప్రపంచపు హిస్టరీని మరియు జాగ్రఫీని చూస్తున్నారు. ఏ-ఏ శ్రేష్ఠ ఆత్మలు, ఏ సమయములో ఏ స్థానములో మరియు ఏ విధిపూర్వకంగా సహయోగీలుగా అయ్యారు అని చూస్తున్నారు. ఏం చూసారు? మూడు రకాలైన సహయోగీ పిల్లలను చూసారు. మొదటి వారు, బాప్దాదాయొక్క అలౌకికక కర్తవ్యమును చూసి, బాప్దాదా యొక్క మోహినీ మూర్తి, ఆత్మిక చరిత్రను చూసి ఆలోచించే శ్రమను కూడా చెయ్యలేదు, కేవలము చూసారు మరియు చూడటంతోనే కల్పపూర్వపు స్మృతియొక్క సంస్కారము ప్రత్యక్షమైపోయింది. రెండవవారు, వీరు నావారే అని హృదయమునుండి వెలువడింది. ఇలా కష్టపడకుండా సహజంగానే బాబా స్నేహములో ఇమిడిపోయే సహయోగులుగా అయ్యారు. సప్తాహపు (ఏడురోజుల) కోర్సుకూడా చెయ్యలేదు, కానీ ఈశ్వరీయ స్నేహపు ఫోర్స్తో బాబా మరియు పిల్లల మిలనము అయిపోయింది. ఒకే ఒక్క మాటతో జీవన సహచరులుగా అయిపోయారు. మీరే నావారు అని పిల్లలంటే, మీరే నావారు అని తండ్రి అన్నారు. కష్టముయొక్క ప్రశ్నే లేదు. ఇలా క్షణకాలపు వ్యాపారము చేసేవారు శ్రమ లేకుండానే ప్రేమలో మునిగిపోయారు. మరొకరు, నిమిత్తంగా అయిన శ్రేష్ఠ ఆత్మల త్యాగము-తపస్యలను మరియు సేవయొక్క శ్యాంపల్ను చూసి వ్యాపారము చేసేవారు. మొదటి గ్రూప్వారు బాబాను చూసారు. రెండవ గ్రూప్వారు జ్ఞాన గంగల శ్యాంపల్ను చూసారు. బుద్ధి బలముద్వారా సహజంగానే బాబాను తెలుసుకున్నారు మరియు సహయోగులుగా అయ్యారు. మరొక గ్రూప్కూడా పిల్లలద్వారా బాబాయొక్క సాకార సంబంధములోకి వచ్చారు. నిరాకారునికూడా సాకారములో సర్వ సంబంధాలలో పొందారు, కనుక సాకార రూపములో సాకారునిద్వారా సర్వ అనుభవాలను చేసుకున్న కారణంగా సాకార పాలనయొక్క లిఫ్ట్ అనే గిఫ్ట్ను తీసుకున్నారు. ఈ భాగ్యము కోట్లలో కొద్దిమందికి, కొద్దిమందిలో కూడా కొద్దిమందికి ప్రాప్తించింది. ఇలా లిఫ్ట్యొక్క గిఫ్ట్ను తీసుకునేవారు స్థాపనా కార్యములో, సేవాక్షేత్రములో నిమిత్తంగా అయిన ఆది ఆత్మలు, ఇఅటువంటి గ్రూప్కు నిమంత్రణను ఇచ్చి పిలిచారు. నిమిత్తంగా అయిన పిల్లలు ఇంకాకూడా ఉన్నారు కానీ విశేషంగా కొద్దిమందిని పిలిచారు. ఎందుకు పిలిచారో తెలుసా? మధ్య-మధ్యలో ఫౌండేషన్ను చెక్ చేసుకోవటం జరుగుతుంది. ఒకవేళ ఫౌండేషన్ ఏ కాస్తయినా బలహీనమైనట్లయితే ఫౌండేషన్యొక్క ప్రభావము అందరిపై పడుతుంది. సేవాక్షేత్రములో సేవకు నిమిత్తమైన ఫౌండేషన్ మీలాటిం రత్నాలు. మొదటి గ్రూప్వారు యజ్ఞ స్థాపనకు ఫౌండేషన్గా అయ్యారు. సేవకు నిమిత్తులుగా అయ్యారు. సేవకు ప్రత్యక్ష ఫలం మీలాటిం గ్రూప్. కనుక సేవయొక్క ప్రత్యక్ష ఫలమురూపములో లేక షోకేస్లోని మొదటి షో పీస్గా శ్రేష్ఠ ఆత్మలైన మీరు నిమిత్తులుగా అయ్యారు. ఇంతటి మీ మహత్వము తెలుసా? కొత్త ఆకుల తళుకు-బెళుకులు, కాంతి, ఉల్లాస-ఉత్సాహాల విస్తారములో ఆది శ్రేష్ఠ ఆత్మలు దాగిపోలేదు కదా! వెనుక ఉన్నవారిని ముందు ఉంచుతూ స్వయము ముందునుండి వెనుకకు అయిపోలేదు కదా! అసలైతే బాప్దాదాకూడా పిల్లలను తనకంటే ముందు ఉంచుతారు, కానీ వారిని ముందు ఉంచుతూ స్వయము వెనుక ఉండిపోరు. వెనుక ఉన్నవారికి మేము అవకాశాన్ని ఇస్తున్నాము అని చాలామంది పిల్లలు తెలివిగా సమాధానమిస్తారు. ఛాన్స్ ఇవ్వండి కానీ ఛాన్స్లర్లుగా అయితే ఉండండి కదా. ఇంత బాధ్యతగా భావిస్తారా? పురుషార్థపు అడుగునేదైతే మనము వేస్తామో మనల్ని చూసి ఇతరులుకూడా అలా ఉల్లాస-ఉత్సాహాలతో అడుగులు వేస్తారు... ఈ స్మృతి సదా ఉంటుందా? క్రొత్తవారు క్రొత్తవారే, కానీ పాతవారి విలువ పాతవారిదే. పాత ఆకులనుండి ఎన్ని మందులు తయారుచేస్తారు! తెలుసు కదా. పాత వస్తువులకు ఎంతో విలువ ఉంటుంది. పాత వస్తువులు విశేష స్మృతిచిహ్నాలుగా అవుతాయి. పాత వస్తువులకు విశేషంగా మ్యూజియంను తయారుచేస్తారు. పాతవారి విలువను తెలుసుకుంటూ ఆ విలువ ప్రమాణంగా అడుగులు వేస్తున్నారు కదా? మిమ్మల్ని మీరు ఇంతటి విలువైనవారిగా భావిస్తున్నారా? బాబా సమానంగా ఎగిరే పకక్షులేనా? బ్రహ్మాబాబా పాలనకు రిటర్న్ను ఇస్తున్నారా? ఈ సాకార పాలన సాధారణ పాలనేమీ కాదు. ఈ అమూల్య పాలనకు రిటర్న్గా అమూల్యంగా అవ్వాలి మరియు అమూల్యంగా తయారుచెయ్యాలి. విశేష పాలనకు రిటర్న్ - జీవితములో ప్రతి అడుగులో విశేషత నిండి ఉండాలి. అఅటువంటి రిటర్న్ను ఇస్తున్నారా? మొత్తము కల్పములో ఒక్కసారే ఈ పాలన లభిస్తుంది. ఆ పాలనకు అధికారులు విశేష ఆత్మలైన మీరే. ఇఅటువంటి మీ అధికారపు భాగ్యము గురించి తెలుసా? మరి ఈరోజు అఅటువంటి భాగ్యవంతులైన పిల్లలను కలిసేందుకు వచ్చారు. మరి ఎందుకు పిలిచారో అర్థమైందా? రిజల్టునైతే చూస్తారు కదా!
ఈ మొత్తము గ్రూపైతే బ్రహ్మాబాబాను ప్రతి అడుగులో ఫాలో చేసేవారు కదా, ఎందుకంటే ఈ సాకార నేత్రాలద్వారా చూసారు. కేవలము దివ్యనేత్రముతో చూడలేదు. కండ్లు చూసిన విషయాన్ని ఫాలో చెయ్యటము సహజమౌతుంది కదా. అఅటువంటి సహజ పురుషార్థపు భాగ్యమునకు అధికారీ ఆత్మలు. మీరు ఎవరో అర్థమైందా? నేను ఎవరిని అన్నది తెలుసుకున్నారా? నేను ఎవరిని అన్న మొట్టమొదటి చిక్కు ప్రశ్న బాగా గుర్తుంది కదా! మర్చిపోలేదు కదా! బాప్దాదా వతనములో ఈ గ్రూప్ను చూసి ఆత్మిక సంభాషణను చేసారు. ఏ ఆత్మిక సంభాషణను చేసి ఉంటారు, తెలుసా? తమ భాగ్యపు విలువను గురించి ఎంత తెలుసుకున్నారు మరియు ఎంతమంది ఈ భాగ్యపు స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు అన్నదానిని చూసారు. స్మృతి స్వరూపులనుండి సమర్థ స్వరూపులు. మరి ఎంతమంది సమర్థ స్వరూపులుగా అయ్యారు అన్నదానిని చూస్తున్నారు. విస్మృతి మరియు స్మృతి అనే మెట్లను ఎక్కుతూ-దిగుతూ ఉన్నారా లేక సదా స్మృతి స్వరూపముద్వారా ఎగిరే కళలో వెళ్తున్నారా? పాతవారే విధిపూర్వకంగా నడుస్తున్నారు. కొందరు ఎగిరే కళకు బదులుగా ఇప్పటి వరకుకూడా మెట్లు ఎక్కుతూ-దిగుతూ ఉంటారు. పిల్లలందరి ఈ విధిని చూస్తున్నారు. బ్రహ్మాబాబా పిల్లలకు స్నేహపూర్వకంగా చెప్పారు, సదా ప్రతి అడుగులో సహజము మరియు శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారము తండ్రినైన నా సమానంగా అయ్యేందుకు ఒక విషయాన్ని సదా జీవితములో బ్రహ్మాబాబాయొక్క తాయత్తు రూపంలో గుర్తుంచుకోండి - ''వదిల్తే వదుల్తుంది''. తనువుయొక్క స్మృతిని మర్చిపోయి దేహీ అభిమానులుగా అయ్యే విషయంలోగానీ, సంబంధాల మోహమునుండి నష్టోమోహులుగా అవ్వటంలోగానీ, అలౌకిక సేవయొక్క సఫలతా క్షేత్రంలోగానీ, స్వభావ-సంస్కారాల సంపర్కములోగానీ - అన్ని విషయాలలో వదిల్తే వదుల్తుంది. మేరాపన్(నాది అన్న భావము) అన్న ఈ చెయ్యి కొమ్మలను పట్టుకుని, కొమ్మలను పట్టుకున్న పక్షిగా తయారుచేస్తుంది. నాది అన్న భావన రూపీ చేతిని వదిలేసినట్లయితే ఏమైపోతారు - ఎగిరే పక్షిలా! వదిలేది లేదు కాని అవ్వవలసింది అలాగే అని అనడం కాదు. కానీ, ఓ ఆధారమూర్త శ్రేష్ఠ ఆత్మలారా ''అయిపోయాము'' ఈ సెరిమనీ(ఉత్సవము)ను జరుపుకోండి. ఆలోచిస్తున్నాము, ప్లాన్ తయారుచేస్తాము, ఇలా అనకూడదు. ఆలోచించాము, ఏ సెరిమనీని జరుపుకుంటారు! ప్రతి గ్రూప్ ఫంక్షన్ చేసుకుంటుంది కదా. మీరు ఏ సెరిమనీని జరుపుకుంటారు?
మీరైతే బ్రహ్మాబాబాను అనుసరించే బ్రహ్మా సహచరులైన పిల్లలు కదా. ఈశ్వరీయ పరివారపు వృద్ధ ఆత్మలు. వీరే మా ఆది శ్యాంపల్ స్వరూపాలు అని మీ అందరిపై బాప్దాదా మరియు పరివారముయొక్క దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. మొత్తము పరివారానికి, బాబాకు అన్ని ఆశలదీపాలు మీరు. మరి ఏ సమారోహాన్ని(ఉత్సవాన్ని) చేస్తారు? బాబా సమానంగా అయ్యారు, జీవన్ముక్త ఆత్మలుగా అయ్యారు! నష్టోమోహా స్మృతి స్వరూపులనుండి సమర్థ స్వరూపులుగా అయ్యారు. సంకల్పము చేసారు మరియు అయిపోయారు. అఅటువంటి సమర్థ సమారోహాన్ని జరుపుకోండి. తయారుగా ఉన్నారు కదా! లేక ఇప్పుడుకూడా ఆలోచిస్తారా - చెయ్యాలనైతే అనుకుటాంము, అనుకోవటము కాదు కానీ బాబాయొక్క అన్ని కోరికలను పూర్తి చేసేవారమైన మేము ఆది శ్యాంపల్లము - ఇఅటువంటి నిశ్చయబుద్ధి విజయీరత్నాలు, విజయోత్సవాన్ని జరుపుకోండి. ఎందుకు పిలిచామో అర్థమైందా! స్పష్టమైంది కదా. వీరందరికీ కిరీన్ని ధరింపచెయ్యాలి. వీరితో బాధ్యత అనే ప్టాభిషేకాన్ని జరిపించాలి. అందుకనే వచ్చారు కదా! మాట్లాడరు. పెద్దవారైపోయారు. బ్రహ్మాబాబాలో ఏం చూసారు? ఇప్పుడిప్పుడే వృద్ధుడు మరియు ఇప్పుడిప్పుడే చిన్న కిశోరుడు. చూసారు కదా. ఫాలో ఫాదర్, సరేనండి అనటంలో పసిపిల్లలుగా అవ్వండి మరియు సేవలో వృద్ధులు. చిన్న పిల్లల ప్రకాశము చూసారు కదా - హా జీ, జీ హా అని ఎంత ఆనందంతో చెప్పేవారు.
విశేష ఆహ్వానముపై విశేష ఆత్మలు వచ్చారు. ఇప్పుడు విశేష సేవల బాధ్యతల ఉత్సవాన్ని మళ్ళీ జరుపుకోవాలి. మధ్యమధ్యలో కిరీన్ని తీసేస్తారు. ఇప్పుడు కిరీన్ని ఎంత ట్ైగా పెట్టుకోవాలంటే దాన్ని ఇక తీసెయ్యకూడదు. అచ్ఛా, సమారోహపు రిజల్టు ఏమెచ్చింది అన్నది తరువాత విందాము. అచ్ఛా.
సదా సర్వ ఆత్మల నిమిత్తంగా ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పించేవారు, సదా ప్రతి పురుషార్థపు అడుగుద్వారా ఇతరులను తీవ్ర పురుషార్థులుగా తయారుచేసేవారు, వ్యర్థమును క్షణములో ''వదిల్తే వదుల్తుంది'' అని భావించి వదిలేవారు, సదా బ్రహ్మాబాబాను ఫాలో చేసేవారు అయిన ఇఅటువంటి సేవ ఆదిరత్నాలకు, పాలనయొక్క భాగ్యవాన్ విశేష ఆత్మలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవాధారులతో - సేవాధారులైతే ఎల్లప్పుడూ ఎగురుతూ ఉండాలి, ఎందుకంటే యజ్ఞ సేవయొక్క బలము చాలా గొప్పది. కనుక సేవాధారులు శక్తివంతముగా అయిపోయారు కదా. యజ్ఞ సేవకు ఎంత గాయనము ఉంది! ఒకవేళ యజ్ఞ సేవను సత్యమైన హృదయంతో చేసినట్లయితే ఒక్క క్షణకాలమునకు కూడా చాలా ఫలము ఉంటుంది. మీరైతే ఎన్ని రోజులు సేవలో ఉన్నారు, మరి ఫలాల భండారము ఒకచోటకు చేర్చబడింది, ఎన్ని ఫలాలు జమ అయ్యాయంటే 21 తరాలు ఆ ఫలాలను తింటూ ఉంటారు. సేవాధారులు అక్కడకు వెళ్ళి మాయకు వశమైపోకూడదు. సదా సేవలో బిజీగా ఉండాలి. మనసుద్వారా శుద్ధ సంకల్పాల సేవ మరియు సంపర్క సంబంధాలు మరియు వాణిద్వారా పరిచయాన్ని ఇచ్చే సేవ. ఎల్లప్పుడూ సేవలో బిజీగా ఉండాలి. సేవపాత్ర అవినాశి అయినది. ఇక్కడ ఉన్నాగానీ లేక మరెక్కడకు వెళ్ళినాగానీ సేవాధారితోటి ఎల్లప్పుడూ సేవ ఉంటుంది. సదా సేవాధారులు. సేవలో బిజీగా ఉన్నట్లయితే మాయ రాదు. ఖాళీ స్థానము ఉన్నప్పుడే ఇతరులు వస్తారు. దోమలు కూడా వస్తాయి, నల్లులు కూడా వస్తాయి. కనుక సదా బిజీగా ఉన్నట్లయితే మాయ రానే రాదు. కష్టపడవలసిన అవసరము ఉండదు. మాయ నమస్కారము చేసి వెళ్ళిపోతుంది. అఅటువంటి వీరులుగా అయ్యి వెళ్తున్నారు. ఈరోజు క్రోధమొచ్చింది, ఈరోజు లోభమొచ్చింది, మోహము వచ్చింది...... అని అక్కడకు వెళ్ళి ఇలా అనకూడదు. మాయ పరీక్ష పెట్తుంది, వీరు ప్రమాణము చేస్తున్నారు అని అది కూడా వింటూ ఉంది. బాబా ఉన్నచోట ఇక మాయ ఏం చేస్తుంది! బాబా సదా తోడుగా ఉన్నారా లేక వేరుగా ఉన్నారా? కుమారులు ఒంటరివారుగా అయితే భావించటం లేదు కదా! వినేవారు ఎవరూ లేరు, మాట్లాడేవారు ఎవరూ లేరు.....అని అనకూడదు. అనారోగ్యము వచ్చిందంటే ఏం చేస్తారు? ఇతర సహచరుల గుర్తైతే రాదు కదా? ఇతర సహచరులను తీసుకువచ్చినట్లయితే వారి మాటలను వినాల్సివస్తుంది, వారికి తినిపించాల్సి వస్తుంది, సంభాళించవలసి వస్తుంది. అఅటువంటి భారాన్ని తలకెత్తుకునే అవసరమేముంది? సదా తేలికగా ఉండండి. సదా యుగళరూపులు, వేరే యుగళ్ ఏం చేస్తుంది! అనారోగ్యము వచ్చినప్పుడు ఎప్పుడైనా సంకల్పము వస్తుందా? ఏ సంబంధము గుర్తుకు వస్తే ఆ సంబంధముతో బాబాను గుర్తు చేస్తే అనారోగ్యంలో తూగుతూ, తూగుతూ చేసినాగానీ ఎంత మంచిగా వండుతారంటే ఇతరులు చేసినట్లుగా ఉంటుంది. కనుక సదా తోడుగా ఉండాలి, ఒంటరిని కాను, కంబైండ్ను.
మీరు మరియు బాబా, ఇరువురూ కంబైండ్. మిమ్మల్ని ఎవ్వరూ వేరు చెయ్యలేరు, ఈ ఛాలెంజ్ను చెయ్యండి. ఛాలెంజ్ చేసేవారేగానీ గాభరా పడేవారు కారు, అచ్ఛా!
ప్రశ్న - సంగమయుగ బ్రాహ్మణుల జీవితపు లక్ష్యము ఏంటి? ఆ లక్ష్యమును ప్రాప్తి చేసుకునే విధి ఏమిటి?
జవాబు - సంగమయుగ బ్రాహ్మణుల జీవితపు లక్ష్యము - సదా సంతుష్టులుగా ఉండటము మరియు ఇతరులను సంతుష్టము చెయ్యటము, బ్రాహ్మణులు అనగా తెలివైనవారు, స్వయముకూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా ఉంచుతారు. ఒకవేళ ఇతరులను అసంతుష్టపరచటముద్వారా అసంతుష్టులుగా అయినట్లయితే సంగమయుగ బ్రాహ్మణ జీవితపు సుఖమును తీసుకోలేరు. శక్తిస్వరూపులై ఇతరుల వాయుమండలమునుండి స్వయమును దూరంగా ఉంచుకోవటము అనగా స్వయమును సురక్షితంగా ఉంచుకోవటము - ఈ లక్ష్యమును ప్రాప్తి చేసుకునేందుకు సాధనము ఇదే. ఇతరుల అసంతుష్టత వలన స్వయము అసంతుష్టులుగా అవ్వకూడదు. ఇతరులు ఏవిధంగానైనా అసంతుష్టపరిచేందుకు నిమిత్తులుగా అయినట్లయితే స్వయమును దూరంగా ఉంచుకుని ముందుకు వెళ్ళాలి, ఆగకూడదు.
ప్రశ్న - ఏ సంస్కారమును తమ అసలైన సంస్కారముగా చేసుకున్నట్లయితే సదా ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు?
జవాబు - ప్రతి విషయములో నేను ముందుకు వెళ్ళాలి - అన్నదానిని మీ అసలైన సంస్కారముగా చేసుకోండి. ఇతరులు ముందుకు వెళ్ళనియ్యండి, వెళ్ళకపోనియ్యండి. ఇతరుల మూలంగా స్వయమును కిందకు చేసుకోకూడదు. సహానుభూతి కారణంగా సహయోగమును ఇవ్వటము వేరే విషయము కానీ ఇతరుల కారణంగా స్వయము కిందకు రావటమనేది మంచిది కాదు. వ్యర్థాన్ని వినకండి, చూడకండి. సేవాభావముతో అతీతులై చూడండి. ఇతరుల కారణంగా మీ సమయము మరియు సంతోషాన్ని పోగొట్టుకోకుండా ఉన్నట్లయితే సదా ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు.
Comments
Post a Comment