21-12-1983 అవ్యక్త మురళి

21-12-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

'' తక్షణ దానం (అనుకున్న వెంటనే దానం చేయడంలో ఉన్న) మహాపుణ్యం యొక్క రహస్యము ''

ఈరోజు విధాత, వరదాత అయిన తండ్రి తమ నలువైపులా ఉన్న అతి స్నేహీ సేవాధారులైన పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న సమర్థులైన పిల్లలు తమ స్నేహము యొక్క విశేషత ద్వారా దూరంగా ఉంటున్నా సమీపంగా ఉన్నారు. స్నేహ సంబంధము ద్వారా స్పష్టమైన, స్వచ్ఛమైన బుద్ధి ద్వారా సమీపంగా, సన్ముఖంగా అనుభవం చేస్తున్నారు. మూడవ నేత్రము అనగా దివ్యత ద్వారా వారి నయనాలు బుద్ధి రూపీ టి.వి ద్వారా దూరంగా ఉన్న దృశ్యాలను స్పష్టంగా అనుభవం చేసుకుంటున్నాయి. ఎలాగైతే ఈ వినాశీ ప్రపంచపు వినాశీ సాధనమైన టి.వి లో విశేష ప్రోగ్రాములు వచ్చే సమయంలో అందరూ స్విచ్ఆన్చేస్తారో అలా పిల్లలు కూడా విశేష సమయంలో (మిలన సమయంలో) స్మృతి రూపీ స్విచ్ను ఆన్చేసి కూర్చున్నారు. దూరదర్శన్ద్వారా దూర దృశ్యాలను సమీపంగా అనుభవం చేసే పిల్లలందరినీ బాప్దాదా చూసి చూసి హర్షితులవుతున్నారు. ఒకే సమయంలో డబల్సభను చూస్తున్నారు.

ఈరోజు విశేషంగా వతనంలో బ్రహ్మబాబా పిల్లలను స్మృతి చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ ఎప్పటి నుండి ఈ బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారో సమయానుసారంగా ఆ బ్రాహ్మణులందరూ వారి గమ్యము వరకు అనగా సంపూర్ణతా స్థితి వరకు ఎంత వేగంతో నడుస్తున్నారో ఆ రిజల్టును చూస్తున్నారు. అందరూ నడుస్తూనే ఉన్నారు. కాని ఎంత వేగంతో నడుస్తున్నారు? ఏమి చూశారు? వేగంలో ఒకటేమో సదా తీవ్రంగా ఉండాలి, అనగా సదా తీవ్ర వేగం ఉండాలి. ఈ విధంగా ఉండేవారిని చాలా కొద్దిమందినే చూశారు. బ్రహ్మబాబా పిల్లల వేగాన్ని చూసి పిల్లల తరపున బాబాను - ''నాలెడ్జ్ఫుల్గా ఉంటూ అనగా మూడుకాలాల గురించి తెలిసి ఉన్నా, పురుషార్థము మరియు పరిణామము గురించి తెలిసి ఉన్నా, విధి మరియు సిద్ధిని గురించి తెలిసినా సదాకాలము తీవ్రగతిని ఎందుకు తయారు చేసుకోలేక పోతున్నారు?'' అని ప్రశ్నంచారు. ఏం సమాధానమిచ్చి ఉంటారు. కారణమూ తెలుసు, నివారణ విధి కూడా తెలుసు. అయినా కారణాన్ని నివారణలోకి మార్చలేకున్నారు!

తండ్రి చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మబాబాతో అన్నారు - చాలామంది పిల్లలకు ఒక అలవాటు చాలా పాతదిగా, పక్కాగా ఉంది. అది ఏమిటి? ఏం చేస్తారు! తండ్రి, ప్రత్యక్ష ఫలాన్ని అనగా తాజా ఫలాన్ని తినేందుకు ఇస్తారు. కాని అలవాటుకు వశమైన కారణంగా విధిలేక ఆ తాజాఫలాన్ని కూడా ఎండబెట్టి స్వీకరిస్తారు. చేసేస్తాము, అయిపోతాము, తప్పకుండా అవ్వాల్సిందే, మొదటి నంబరువారిగానే అవ్వాలి, మాలలోకే రావాలి...... ఈ విధంగా ఆలోచిస్తూ - ఆలోచిస్తూ, ప్లాన్తయారుచేస్తూ చేస్తూ ప్రత్యక్ష ఫలాన్ని భవిష్య ఫలంగా తయారు చేసేస్తారు. చేద్దాము అనగా భవిష్య ఫలము. ఆలోచించగానే చేసేశారు అంటే ప్రత్యక్షఫలాన్ని తిన్నట్లు. స్వయం పట్ల గాని, సేవ పట్ల గాని ప్రత్యక్ష ఫలాన్ని లేక సేవ యొక్క తాజాఫలాన్ని తక్కువగా తింటున్నారు. శక్తి దేని ద్వారా వస్తుంది? తాజా ఫలంతోనా లేక ఎండిపోయిన దానితోనా? చాలామందికి తిందాములే.... అని అనుకుంటూ తాజాఫలాన్ని ఎండిపోయిన (చెడిపోయిన) ఫలంగా చేసే అలవాటు ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇది జరిగిన తర్వాత అది చేస్తాము అని ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచించారు, ఆదేశం లభించగానే వెంటనే చేసెయ్యాలి. అలా చేయకపోవడంతో ఆదేశాన్ని కూడా తాజా నుండి ఎండిపోయిన దానిగా తయారు చేసుకుంటారు. '' డైరక్షన్అనుసారంగానే చేశాము కాని అంతగా రిజల్టు ఎందుకు వెలువడలేదు'' అని ఆలోచిస్తారు. సమయం గడచిపోవడం వలన వేళ (సమయం) అనుసారంగా రేఖ కూడా మారిపోతుంది. ఏ భాగ్యరేఖ అయినా వేళ అనుసారంగానే వినిపిస్తారు, లేక తయారు చేస్తారు. ఈ కారణంగా వేళ మారడం వలన వాయుమండలం, వృత్తి, వైబ్రేషన్లు అన్నీ మారిపోతాయి. అందుకే తక్షణ దానం మహాపుణ్యమని (తురంత్దాన్మహాపుణ్య్) మహిమ చేయబడింది. డైరక్షన్లభించింది, ఆదేశం లభించింది, వెంటనే ఉత్సాహంతో చేశారు. అలాంటి సేవకు తాజాఫలం లభిస్తుంది. దానిని స్వీకరించడం అనగా శక్తిశాలి ఆత్మగా అయి స్వతహాగానే తీవ్రగతితో (వేగంగా) వెళ్తూ ఉంటారు. అందరూ ఫలాలను తింటున్నారు కాని ఏ ఫలాలను తింటున్నారో పరిశీలించుకోండి.

బ్రహ్మబాబా పిల్లలందరిని తాజాఫలం ద్వారా శక్తిశాలి ఆత్మగా తయారుచేసి సదా తీవ్రగతితో

ముందుకు వెళ్లే సంకల్పాన్ని ఇస్తారు. సదా బ్రహ్మబాబా ఇచ్చిన ఈ సంకల్పాన్ని స్మృతిలో ఉంచుకొని ప్రతి సమయం, ప్రతి కర్మ వలన లభించే తాజా ఫలాన్ని తింటూ ఉండండి. అప్పుడిక ఎప్పుడూ ఏ విధమైన బలహీనత లేక వ్యాది రాజాలదు. బ్రహ్మబాబా చిరునవ్వు నవ్వుతున్నారు. ఎలాగైతే వర్తమాన సమయంలో వినాశీ డాక్టర్లు కూడా ఏ సలహాను ఇస్తారు? అన్నీ తాజాగానే తినండి, కాల్చి, వేయించినవి తినకండి, రూపాన్ని మార్చి తినకండి అని చెప్తారు కదా! కావున బ్రహ్మబాబా కూడా పిల్లలకు చెప్తున్నారు - సమయానుసారంగా ఏ శ్రీమతము, ఏ రూపంలో లభిస్తుందో ఆ శ్రీమతాన్ని అదే సమయంలో అదే రూపంలో ఆచరణలోకి తీసుకొచ్చినట్లైతే సదా బ్రహ్మబాబా సమానంగా వెంటనే దానం చేయడం ద్వారా మహాపుణ్యాత్మగా అయి నంబరువన్లోకి వచ్చేస్తారు. బ్రహ్మబాబా మరియు జగదంబ ప్రథమ రాజ్య అధికారులు. ఇరువురి ఆత్మల విశేషత ఏమి చూశారు? ఆలోచించగానే చేసేశారు. ఇది చేసిన తర్వాత అది చేస్త్తామని ఆలోచించలేదు. ఇదే వారి విశేషత. కావున మాత - పితలను అనుసరించే మహా పుణ్యాత్మలు పుణ్యం యొక్క శ్రేష్ఠ ఫలాన్ని తింటున్నారు. అంతేకాక సదా శక్తిశాలిగా ఉన్నారు. స్వప్నంలో కూడా సంకల్ప మాత్రంగా కూడా బలహీనత లేదు. అలాగే సదా తీవ్ర వేగంతో ముందుకు వెళ్తున్నారు. కాని అటువంటి వారు కొందరిలో కూడా కొందరే (చాలా కొద్దిమందే) ఉన్నారు.

బ్రహ్మబాబా సాకార సృష్టికి రచయిత అయిన కారణంగా సాకార రూపంలో పాలన పాత్రను అభినయించిన కారణంగా, సాకార రూపంలో పాత్రను అభినయించే పిల్లలతో విశేషమైన స్నేహం ఉంది. ఎవరితో విశేషమైన స్నేహముంటుందో వారి బలహీనత తన బలహీనతగా అనిపిస్తుంది. బ్రహ్మబాబాకు పిల్లల ఈ బలహీనతకు కారణాన్ని చూసి వీరు ఇక సదా శక్తిశాలిగా, సదా తీవ్ర పురుషార్థులుగా, సదా ఎగిరేకళ వారిగా అయిపోవాలి అన్న స్నేహం కలుగుతుంది. పదే పదే కలిగే శ్రమ నుండి విముక్తులైపోవాలని అనిపిస్తుంది. బ్రహ్మబాబా మాటలను విన్నారా! బ్రాహ్మబాబా నయనాలలో పిల్లలే ఇమిడిపోయి ఉన్నారు. బ్రహ్మబాబా యొక్క విశేషమైన భాష తెలుసా! ఏమనేవారు? పదే పదే నా పిల్లలు, నా పిల్లలు అని అనేవారు. తండ్రి చిరునవ్వు నవ్వుతున్నారు. మీరంతా బ్రహ్మకు కూడా పిల్లలే. అందుకే మీ సర్నేమ్(ఇంటి పేరు) కూడా బ్రహ్మకుమారులు - బ్రహ్మకుమారీలని చెప్తారు కదా! శివకుమారులు - శివకుమారీలు అని అనరు. తోడుగా కూడా బ్రహ్మయే వెళ్లాలి. భిన్న భిన్న నామ రూపాలతో ఎక్కువ సమయం బ్రహ్మబాబా తోడే ఉంటుంది కదా. మీరు బ్రహ్మముఖవంశావళి వారు. తండ్రి ఏమో జతలో ఉండనే ఉన్నారు. అయినా సాకారంలో బ్రహ్మ పాత్రయే ఉంది. మంచిది. మిగిలిన ఆత్మిక సంభాషణను తర్వాత వినిపిస్తాము. .

ఈ గ్రూపులో మూడు వైపుల నుండి విశేషమైన నదులు వచ్చాయి. డబల్విదేశీయులైతే ఇప్పుడు గుప్త గంగలు. ఎందుకంటే ఈ టర్నులో లేరు. ఇప్పుడిది ఢిల్లీ, కర్నాటక మరియు మహారాష్ట్ర ఈ మూడు నదుల విశేష మిలనము. మిగిలిన వారు తోడు తోడుగా కొసరుగా ఉన్నారు. ఎవరైతే టర్నులో వచ్చారో వారైతే తమ హక్కును తప్పకుండా తీసుకుంటారు. కాని డబల్విదేశీయులు కూడా తమ హక్కును ముందుగా తీసుకునేందుకు పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు. కావున వారు కూడా ప్రియంగా ఉంటారు కదా! డబల్విదేశీయులకు కూడా కొసరుగా సరుకు లభిస్తోంది. మళ్లీ తమ టర్నులో లభిస్తుంది. అన్ని వైపులా ఉన్న పిల్లలు బాప్దాదాకు ప్రియమైనవారే. ఎందుకంటే అన్ని వైపుల వారికి తమ తమ విశేషతలు ఉన్నాయి. ఢిల్లీ, సేవకు బీజ స్థానం. కర్నాటక మరియు మహారాష్ట్ర వారు వృక్షము యొక్క విస్తారము. ఎలాగైతే బీజం క్రింద ఉంటుందో మరియు వృక్షం యొక్క విస్తారం ఎక్కువగా ఉంటుందో అలా ఢిల్లీ బీజరూపంగా అయింది. అంతిమంలో బీజరూప ధరణి పైనే శబ్ధము వెలువడనున్నది. కాని ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర మరియు గుజరాత్మూడింటిలో విశేషమైన విస్తారముంది. విస్తారం వృక్షానికి శోభగా ఉంటుంది. కర్ణాటక మరియు మహారాష్ట్ర సేవా విస్తారంతో బ్రాహ్మణ వృక్షానికి శోభగా ఉన్నాయి. వృక్షం అలంకరింపబడుతోంది కదా! ప్రశ్నలు కూడా వీరిరువురే అడుగుతారు కదా! ఒకటేమో ఖర్చు విషయం గురించి అడుగుతారు. రెండవది, బ్రాహ్మణుల సంఖ్యను గురించి అడుగుతారు. కావున మహారాష్ట్ర మరియు కర్ణాటక రెండూ సంఖ్య లెక్కతో బ్రాహ్మణ పరివారానికి అలంకారంగా ఉన్నారు. విశేషత బీజానిది. బీజం లేకపోతే వృక్షం కూడా వెలువడదు. కాని బీజం ఇప్పుడు కొంచెం గుప్తంగా ఉంది. వృక్షం యొక్క విస్తారం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఢిల్లీలోకి మీరందరూ వెళ్లి ఉండకపోతే సేవా పునాది ఏర్పడి ఉండదు. సేవ చేసేందుకు మొదటి నిమంత్రణ (ఆహ్వానం) తీసుకున్నారా లేక లభించిందా! ఎలాగైనా సేవ ఢిల్లీ నుండే ప్రారంభమయింది. కావున సేవాస్థానంగా కూడా అదే తయారయింది. అంతేకాక రాజ్య స్థానంగా (రాజధానిగా) కూడా అదే అవుతుంది. ఎక్కడైతే మొదట బ్రాహ్మణుల పాదం పడిందో అదే తీర్థస్థానంగా కూడా తయారయింది. రాజ్య స్థానంగా కూడా అదే అవుతుంది. విదేశాలకు కూడా చాలా మహిమ ఉంది. విదేశాల నుండి విశేషంగా ప్రత్యక్షతా ఢంకాలు దేశం వరకు వస్తాయి. విదేశాలు లేకపోతే దేశంలో ప్రత్యక్షత ఎలా జరుగుతుంది? కావున విదేశాలకు కూడా మహత్వముంది. విదేశీయుల శబ్ధాన్ని విని భారతదేశంలోని వారు మేల్కొంటారు. ప్రత్యక్షతా శబ్ధం వెలువడే స్థానమైతే విదేశాలే అయ్యాయి కదా! కావున ఇది విదేశాల మహత్వం (గొప్పతనం). విదేశాలలో ఉండేవారు కూడా ఈ దేశానికి చెందినవారే. కాని నిమిత్త మాత్రంగా విదేశాలలో ఉండే శ్రేష్ఠ ఆత్మలను ఉత్సాహ - ఉల్లాసాలలో చూసి దేశం వారిలో కూడా ఇంకా ఎక్కువగా ఉత్సాహ ఉల్లాసాలు పెరుగుతాయి. ఇది కూడా వారు గుప్త సేవ చేసే పాత్ర. కావున అందరి విశేషత ఎవరిది వారిదే అయింది కదా.

సదా తక్షణ దానం చేసే మహాపుణ్యాత్మలకు, ఆలోచించడం మరియు చేయడంలో సదా తీవ్ర పురుషార్థులకు, ప్రతి సంకల్పం, ప్రతి సెకండు సేవాఫలాన్ని తినేవారికి, ఇటువంటి శక్తిశాలురకు, ఫాలో ఫాదర్మరియు ఫాలో మదర్చేసేవారికి, సదా బ్రహ్మబాబా సంకల్పాన్ని సాకారంలోకి తీసుకొచ్చే వారికి, ఇటువంటి దేశ విదేశాలలో నలువైపులా ఉన్న సమర్థమైన పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

సేవాధారులతో అవ్యక్త బాప్దాదా కలయిక - ఎవరైతే సేవ చేస్తారో వారు ఫలాన్ని తింటారు. ఫలాన్ని తినేవారు సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎండిన ఫలాలను తినేవారు కాదు, తాజా ఫలాలను తినేవారు. సేవాధారులే భాగ్యానికి అధికారులుగా అవుతారు. ఎంత గొప్ప భాగ్యము! స్మృతిచిహ్న చిత్రాల వద్దకు (మందిరాలకు) వెళ్లి భక్తులు సేవ చేస్తారు. ఆ సేవను మహా పుణ్యంగా భావిస్తారు. కాని మీరు ఎక్కడ సేవ చేస్తారు? చైతన్య మహా తీర్థస్థానములో. వారు కేవలం తీర్థస్థానాలకు వెళ్లి భ్రమణం చేసి వచ్చినా, వారు మహాన్ఆత్మలుగా మహిమ చేయబడ్తారు. మీరైతే మహాన్తీర్థస్థానంలో సేవ చేసి మహాన్భాగ్యశాలురుగా అయిపోయారు. సేవలో తత్పరులై ఉండేవారి వద్దకు మాయ రాజాలదు. సేవాధారి అనగా మనసుతో కూడా సేవాధారి, తనువుతో కూడా సేవలో బిజీగా ఉండేవారు. తనువుతో పాటు మనసు కూడా బిజీగా ఉంటే మాయ రాదు. తనువుతో స్థూలమైన సేవ చేయండి, మనసుతో వాతావరణాన్ని, వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసే సేవ చేయండి. డబల్సేవ చేయండి. ఒక్కటే (సింగిల్) కాదు. ఎవరైతే డబల్సేవాధారులుగా ఉంటారో వారికి ప్రాప్తి కూడా అంత ఉంటుంది. మనసుకూ లాభం, తనువుకూ లాభం, ధనమైతే అపారంగా లభించాల్శిందే. ఈ సమయంలో కూడా సత్యమైన సేవాధారులు ఎప్పుడూ ఆకలితో ఉండజాలరు. రెండు రొట్టెలు తప్పకుండా లభిస్తాయి. కనుక అందరూ సేవా లాటరీలో తమ నంబరు తీసేసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఎప్పుడు వెళ్లినా ఈ సంతోషం సదా తోడుగా ఉండాలి. ఎందుకంటే తండ్రి అయితే సదా తోడుగా ఉన్నారు, సంతోషంగా నృత్యం చేస్తూ చేస్తూ సేవా పాత్రను అభినయిస్తూ నడవండి. మంచిది.

ప్రశ్న - సంగమయుగంలోని ఏ విశేషత కల్పమంతటిలో ఉండజాలదు?

జవాబు - సంగమయుగంలోనే ప్రతి ఒక్కరికి మేరాబాబా (నా తండ్రి) అనే అధికారముంది. ఒక్కరినే అందరూ 'మేరాబాబా (నా తండ్రి)' అని అంటారు. 'నా వారు' అని అనడం అనగా అధికారిగా అవ్వడం. సంగమయుగములోనే ప్రతి ఒక్కరికి ఒక్క తండ్రితో నా వారనే అనుభవమవుతుంది. ఎక్కడైతే మేరాబాబా అని అన్నారో అక్కడ వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. సర్వస్వం నాదైపోయింది. హద్దులోని నాది కాదు, బేహద్లోని నాది. కావున బేహద్(అనంతమైన) నాది అనే సంతోషంలో ఉండండి.

ప్రశ్న - సమీప ఆత్మల ముఖ్యమైన గుర్తులేమిటి?

జవాబు - సమీప ఆత్మలు అనగా సదా తండ్రి సమానంగా ప్రతి సంకల్పం, ప్రతి మాట మరియు ప్రతి కర్మ చేసేవారు. ఎవరైతే సమీపంగా ఉంటారో వారు తప్పకుండా సమానంగా కూడా ఉంటారు. దూరంగా ఉన్న ఆత్మలు పూర్తి అధికారాన్ని తీసుకునేవారిగా ఉంటారు. కావున తండ్రి సంకల్పాలు, మాటలు ఏవైతే ఉన్నాయో అవే మీవి. వీరినే సమానంగా ఉన్నారని అంటారు.

ప్రశ్న - సదా ఏ స్మృతి ఉంటే ఎప్పుడూ టైమ్వేస్ట్చెయ్యరు?

జవాబు - ఇప్పుడు సంగమయుగ సమయమని, చాలా ఉన్నతమైన లాటరీ లభించిందని, తండ్రి మనల్ని వజ్రం లాంటి దేవతలుగా చేస్తున్నారని సదా స్మృతిలో ఉండాలి. ఎవరికి ఈ స్మృతి ఉంటుందో వారు ఎప్పుడూ టైమ్వేస్ట్చెయ్యరు. ఈ జ్ఞానమే 'సోర్స్ఆఫ్ఇన్కమ్(సంపాదనకు ఆధారము)'. కావున చదువును ఎప్పుడూ మిస్అవ్వరాదు.

ప్రశ్న - ఆత్మకు అన్నిటికంటే ప్రియమైన వస్తువు ఏది? ప్రేమకు గుర్తు ఏమిటి?

జవాబు - ఆత్మకు అన్నిటికంటే ప్రియమైనది ఈ శరీరము. శరీరం పైన ఎంత ప్రేమ అంటే దానిని వదలాలనుకోదు. రక్షించుకునేందుకు అనేక ఏర్పాట్లను రచిస్తుంది. పిల్లలూ! ఇది తమోప్రధానమైన ఛీ ఛీ శరీరమని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు కొత్త శరీరాన్ని తీసుకోవాలి. కావున ఈ పాత శరీరంతో మహత్వాన్ని తొలగించుకోండి. ఈ శరీర భావం ఉండరాదు. ఇదే గమ్యము.

ప్రశ్న - ఏదైనా ప్లానును ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు విశేషంగా ఏ శక్తి కావాలి ?

జవాబు - పరివర్తన చేసుకునే శక్తి ఎంత వరకు ఉండదో అంతవరకు నిర్ణయాన్ని కూడా ఆచరణలోకి తీసుకు రాజాలరు. ఎందుకంటే ప్రతి స్థానంలో, ప్రతి స్థితిలో స్వయం పట్ల గాని, సేవ పట్ల గాని తప్పకుండా పరివర్తన చేసుకోవలసి ఉంటుంది.

Comments