21-03-1983 అవ్యక్త మురళి

* 21-03-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

గీతాపాఠశాలలు నడిపించే అన్నయ్యలు, అక్కయ్యల సమక్షంలో అవ్యక్త  బాప్ దాదా మహావాక్యాలు.

                   ఈరోజు పరమాత్మ తన మహానాత్మలతో కలుసుకునేటందుకు వచ్చారు. బాప్ దాదా పిల్లలందరినీ మహానాత్మలుగా చూస్తున్నారు. ప్రపంచం వారు ఏ ఆత్మలను అయితే మహానాత్మలు అని అంటారో ఆ మహాత్ములు కూడా మీ ముందు ఎలా కనిపిస్తారు? అన్నింటికంటే గొప్ప మహానత ఏమిటి? దాని ద్వారానే మీరు మహాన్‌గా అయ్యారు. అది ఏమిటో తెలుసా? ఏ ఆత్మలను అయితే, విశేషంగా మాతలను ప్రతి విషయంలో అయోగ్యులుగా చేసేశారు. అటువంటి అయోగ్య ఆత్మలను యోగ్యంగా అంటే బాబాకి కూడా అధికారి ఆత్మలుగా తయారు చేశారు. ఎవరిని అయితే పాదాలకు ధరించే చెప్పులుగా చేసేశారో వారిని బాబా కంటి వెలుగుగా తయారుచేశారు. వెలుగు లేకపోతే ప్రపంచమే లేదు అని చెప్తారు కదా! అదేవిధంగా బాప్ దాదా కూడా భారతమాత శక్తి అవతారాలు లేకపోతే భారతదేశం యొక్క ఉద్దరణ లేదు అని ప్రపంచానికి చూపిస్తున్నారు. అటువంటి అయోగ్య ఆత్మలను యోగ్య ఆత్మలుగా తయారుచేశారు. మరయితే మహానాత్మలుగా అయిపోయారు కదా? ఎవరైతే బాబాని తెలుసుకున్నారో, తెలుసుకుని తమ వారిగా చేసుకున్నారో వారు మహానాత్మలు. పాండవులు కూడా తెలుసుకున్నారా మరియు మీవారిగా చేసుకున్నారా లేక కేవలం తెలుసుకున్నారు, అంతేనా? బాబాని మీవారిగా చేసుకునేవారే కదా! తెలుసుకున్న వారి జాబితాలో అయితే అందరు ఉన్నారు. కానీ తమవారిగా చేసుకోవటంలో నెంబరు వారీగా అవుతున్నారు. మీ వారిగా చేసుకోవటం అంటే మీ అధికారం అనుభవం అవ్వాలి. అధికారం అనుభవం అవ్వటం అంటే అన్ని రకాల ఆధీనత సమాప్తి అవ్వటం. ఆధీనత అనేక రకాలుగా ఉంటుంది. 1. స్వయం పట్ల స్వయం ఆధీనం 2. సర్వుల సంబంధంలోకి రావటంలో ఆధీనం. జ్ఞాని ఆత్మలైనా లేక అజ్ఞాని ఆత్మలైనా ఇద్దరి సంబంధ సంప్రదింపుల ద్వారా ఆధీనత 3. ప్రకృతి మరియు పరిస్థితుల ద్వారా ఆధీనత. మూడింటిలో ఏ ఆధీనతకు వశం అయినా సర్వాధికారిగా కాలేనట్లే. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూస్కోండి - మీవారిగా చేసుకోవటం అంటే అధికారిగా అయ్యే అనుభవం సదా మరియు అన్నింటిలో అవుతుందా? లేక అప్పుడప్పుడు మరియు ఒక విషయంలో అవుతూ మరో విషయంలో అవ్వకుండా ఉంటుందా? బాప్ దాదా పిల్లల యొక్క శ్రేష్ట అదృష్టాన్ని చూసి హర్షిస్తున్నారు. ఎందుకంటే ప్రాపంచిక అనేక రకాల అగ్నిల నుండి రక్షింపబడ్డారు. ఈనాటి మానవులు అనేక రకాల అగ్నిల్లో కాలిపోతూ ఉన్నారు. పిల్లలైన మీరు శీతల సాగరపు ఒడ్డున కూర్చున్నారు. అక్కడ సాగరుని శీతల అలలలో, అతీంద్రియ సుఖం, శాంతి యొక్క ప్రాప్తిలో లీనమై ఉన్నారు. ప్రపంచంలో అణుబాంబులు లేదా అనేక రకాల బాంబుల యొక్క అగ్ని జ్వాలలతో ప్రజలు ఎంతగా భయపడుతున్నారంటే కేవలం సెకనులు లేదా నిమిషాల యొక్క విషయం అంతే.
                          ఈ రోజుల్లో అనేక రకాలైన దుఃఖాలు, చింతలు, సమస్యల యొక్క రకరకాల గాయాలు ఆత్మలకు తగులుతున్నాయి. ఈ అగ్ని జీవిస్తూనే కాలిపోతున్నట్లు అనుభవం చేయిస్తుంది. జీవించలేరు, చనిపోలేరు, వదలలేరు, తయారు చేసుకోలేరు. అటువంటి జీవితంలోకి వచ్చారు. అందువలన సదా సర్వులపై దయ వస్తుంది కదా! అందువలనే ఇంటింట్లో సేవాకేంద్రాన్ని తయారుచేసుకున్నారు. చాలా మంచి సేవాలక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడైతే ప్రతి గ్రామగ్రామంలోను, పట్టణాలలోను ఉన్నాయి. కానీ సందుసందులోను జ్ఞానస్థానం ఉండాలి. భక్తిలో దేవస్థానాలు తయారుచేస్తారు. కానీ ఇక్కడ ఇంటింట్లో బ్రాహ్మణాత్మ ఉండాలి. ఎలాగైతే ఇంటింట్లోను ఏమీ లేకపోయినా కానీ దేవతాచిత్రాలైతే తప్పక ఉంటాయి. అదేవిధంగా ఇంటింట్లో చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలి. సందుసందులోను జ్ఞానస్థానం ఉండాలి. అప్పుడు ప్రతి సందులో ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతుంది. ఇప్పుడైతే సేవ చాలా ఉంది. అయినా కానీ పిల్లలు ధైర్యం ఉంచుకుని ఎంత సేవ చేశారో అటువంటి ధైర్యవంతులైన పిల్లలకు బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు సదా సహాయాన్ని తీసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని శుభ ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు మరియు ఇంటింట్లో దీపాన్ని వెలిగించి దీపావళిని జరుపుకుని వస్తే బహుమతి కూడా ఇస్తారు. మహానాత్మలకు కూడా శపధం చేసే పవిత్ర ప్రవృత్తి యొక్క రుజువును చూపించేవారు, హద్దులోని ఇంటిని బాబా యొక్క సేవాకేంద్రంగా తయారుచేసుకునే సుపుత్రులుగా ప్రత్యక్ష పాత్రను అభినయిస్తున్నారు, ఇది చూసి బాప్ దాదాకి సంతోషంగా ఉంది. అందువలన బాప్ దాదా అటువంటి సేవాధారి పిల్లలను చూసి హర్షితంగా ఉంటారు. వీరిలో కూడా ఎక్కువ మంది మాతలు ఉన్నారు. పాండవులు ఏ విషయంలోనైనా ముందుకి వెళ్తుంటే శక్తులకు సదా సంతోషంగా ఉంటుంది, బాప్ దాదా కూడా పాండవులను ముందు పెడ్తారు. పాండవులు కూడా శక్తులను ముందు పెట్టడం అవసరంగా భావిస్తారు. మొదట ఏమి ప్రయత్నిస్తారు? మురళీ ఎవరు చెప్తారు? దీనిలో కూడా బ్రహ్మాబాబాను అనుసరిస్తారు. శివబాబా బ్రహ్మా తల్లిని ముందు పెట్టారు, బ్రహ్మాతల్లి, సరస్వతి తల్లిని ముందు పెట్టారు. అంటే తల్లితండ్రిని అనుసరించినట్లే కదా! ఇతరులను ముందుకి తీసుకువెళ్ళటంలోనే మనం ముందుకు వెళ్ళటం ఇమిడి ఉంది అనేది సదా స్మృతిలో ఉంచుకోండి. ఎప్పుడైతే బాప్ దాదా మాతలపై దృష్టి వేశారో అప్పటి నుండే ప్రపంచం వారు కూడా " 'స్త్రీలు ముందు” అనే సూక్తి పెట్టారు. సూక్తి అయితే పెడుతూనే ఉంటారు కదా! భారతదేశం యొక్క రాజనీతిలో కూడా పురుషులందరు నారీల మహిమ చేస్తారు కదా! అలా అయితే పాండవులు కూడా ఒక లెక్కతో చూస్తే నారీలే. అంటే ఆత్మ నారి మరియు పరమాత్మ పురుషుడు. అంటే ఏమి అయ్యింది? ఆత్మ అంటుంది అని అంటారే కానీ ఆత్మ అన్నాడు అని అనరు కదా! ఏవిధంగానైనా కానీ నారీలే. పరమాత్మ ముందు ఆత్మ నారి, ప్రేయసి కదా? సర్వసంబంధాలు ఒకే బాబాతో నిలుపుకునేవారు, ఇది అయితే ప్రతిజ్ఞ కదా! బాప్ దాదా పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు - గారాభ పిల్లలందరు సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభవంలో సదా ఉండేవారు, అటువంటి పిల్లలే బాబా సమానంగా శ్రేష్టాత్మలుగా అవుతారు. మంచిది.
                      ఈవిధంగా సదా సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలలో ఉండేవారికి, సదా సర్వాత్మల పట్ల శ్రేష్ట కళ్యాణ భావన పెట్టుకునేవారికి, శ్రేష్ట ధైర్యం ద్వారా బాప్ దాదా యొక్క సహాయానికి పాత్రులైన ఆత్మలకు - ఈ విధంగా సేవాస్థానాలకు నిమిత్తమైన మహానాత్మలకు పరమాత్మ యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments