21-02-1983 అవ్యక్త మురళి

21-02-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శాంతిశక్తి.

ఈరోజు బాప్ దాదా అమృతవేళలో నలువైపులా ఉన్న పిల్లలను చుట్టి వచ్చేందుకు వెళ్ళారు. అంతా చుట్టి వస్తూ బాప్ దాదా ఈరోజు తమ శక్తిసేన లేక పాండవ సేన ఎంతవరకు శక్తిశాలిగా, శస్త్రధారులుగా, ఎవర్రెడీగా అయ్యారు అని వారందరి ఏర్పాట్లను చూస్తున్నారు. సమయమును గూర్చి ఎదురు చూస్తున్నారా లేక స్వయం సదా సంపన్నంగా ఉండే ఏర్పాట్లను చేస్తున్నారా అని గమనిస్తున్నారు. కావున ఈరోజు బాప్ దాదా సేనాపతి రూపంలో సేనను చూసేందుకు వెళ్ళారు. విశేష విషయం ఏమిటంటే సైన్స్ శక్తిపై సైలెన్స్ శక్తి యొక్క విజయము. కావున సంఘటిత రూపంలోను, వ్యక్తిగత రూపంలోను సైలెన్స్ శక్తిని ఎంతవరకు పొందారు అన్నది చూస్తున్నారు. సైన్స్ శక్తి ద్వారా ప్రత్యక్షఫలం రూపంలో స్వపరివర్తన, వాయుమండలపు పరివర్తన, వృత్తి పరివర్తన, సంస్కార పరివర్తనలను ఎంతవరకు చేయగలరు లేక ఎంతవరకు చేసారు అని గమనించారు. కావున ఈరోజు సైన్యంలో ఉన్న ప్రతి ఒక్క సైనికుని సైలెన్స్ శక్తి యొక్క ప్రయోగశాలను ఎంతవరకు ప్రయోగించగలరు అని పరిశీలించారు.

స్మృతిలో ఉండడము, వర్ణన చేయడం అది కూడా అవసరమే. కాని వర్తమాన సమయానుసారంగా ఆత్మలందరూ ప్రత్యక్ష ఫలమును చూడాలనుకుంటున్నారు. ప్రత్యక్ష ఫలము అనగా ప్రాక్టికల్ ప్రూఫ్ చూడాలనుకుంటున్నారు. కావున తనువుపై సైలెన్స్ శక్తిని ప్రయోగిస్తారు అలాగే మనస్సు పైన, కర్మల పైన, సంబంధ సంపర్కాలలోకి రావడం ద్వారా సంబంధ సంపర్కాలలో ఏమి ప్రయోగం జరుగుతుంది, ఎంత శాతం జరుగుతుంది అన్నది విశ్వంలోని ఆత్మలు కూడా చూడాలనుకుంటున్నారు. అలాగే ప్రతి బ్రాహ్మణ ఆత్మ కూడా స్వయంలో ప్రత్యక్ష ప్రమాణ రూపంలో సదా విశేషమైన అనుభవాలను పొందాలనుకుంటారు. రిజల్టులో సైలెన్స్ శక్తికి ఎంత మహత్వమైతే ఉందో అంతగా దానిని విధిపూర్వకంగా ప్రయోగంలోకి తీసుకురావడంలో ఇప్పుడు ఇంకా తక్కువగా ఉన్నారు. కోరిక అయితే ఎంతగానో ఉంది, జ్ఞానం కూడా ఉంది. కాని ప్రయోగిస్తూ ముందుకువెళుతూ ఉండాలి. సైలెన్స్ శక్తిని ప్రాప్తించుకునే సూక్ష్మతను అనుభవం చేసుకుంటూ స్వయంపట్ల లేక ఇతరులపట్ల కార్యములో వినియోగించడము... ఈ విషయంలో ఇంకా విశేషమైన అటెన్షన్ కావాలి. విశ్వంలోని ఆత్మలకు లేక సంబంధ సంపర్కాలలోకి వచ్చే ఆత్మలకు శాంతి కిరణాలు ఈ విశేష ఆత్మ లేక విశేష ఆత్మల ద్వారా లభిస్తున్నాయి అని అనుభవమవ్వాలి. ప్రతిఒక్కరి ద్వారా నడుస్తూ తిరుగుతూ ఉన్న శాంతి యజ్ఞకుండము అనుభవమవ్వాలి. ఏవిధంగా మీ రచనలో చిన్నని మిణుగురు పురుగులు దూరం నుండే తమ ప్రకాశమును అనుభవం చేయిస్తాయో, వాటిని దూరం నుండి చూస్తూనే ఈ మిణుగురు పురుగులు వస్తున్నాయి లేక వెళుతున్నాయి అని అంటారో అలాగే ఈ బుద్ధి ద్వారా శాంతి అవతారమూర్తులు శాంతిని ఇచ్చేందుకు వచ్చారు అని అనుభవం చేసుకోవాలి. నలువైపులా ఉన్న అశాంత ఆత్మలు శాంతి కిరణాల ఆధారముపై శాంతికుండము వైపుకు ఆకర్షిస్తూ రావాలి. ఏవిధంగా దాహార్తితో ఉన్నవారు నీటి వైపుకు స్వతహాగానే ఆకర్షింపబడి వచ్చేస్తారో అలాగే శాంతి అవతారమూర్తులైన ఆత్మలైన మీ వైపు ఆకర్షింపబడుతూ రావాలి. ఈ శాంతి శక్తినే ఇప్పుడు ఇంకా అధికంగా ప్రయోగించండి. ఈ శాంతి శక్తి వైర్లెస్ కన్నా వేగంగా మీ సంకల్పాలను ఏ ఆత్మల వైపుకైనా చేర్చగలుగుతుంది. ఏవిధంగా సైన్స్ శక్తి పరివర్తన చేస్తుందో, వృద్ధిని కూడా కలుగజేస్తుందో, వినాశనాన్ని కూడా కలిగిస్తుందో, రచనను కూడా చేస్తుందో, హాహాకారాలను కూడా కలిగిస్తుందో అలాగే విశ్రాంతిని కూడా కలిగిస్తుందో, అలా ఈ సైలెన్స్ శక్తి యొక్క విశేష యంత్రము - 'శుభ సంకల్పము'. ఈ సంకల్పము యొక్క యంత్రము ద్వారా ఏది కావాలంటే అది సిద్దిస్వరూపంలో చూడగలుగుతారు. మొదట స్వయంపట్ల ప్రయోగం చేసి చూడండి. తనువు యొక్క వ్యాధిపై ప్రయోగం చేసి చూడండి అప్పుడు శాంతి శక్తి ద్వారా కర్మబంధన రూపములోకి, మధురమైన సంబంధము రూపంలోకి మారిపోతుంది. బంధన సదా చేదుగా అనిపిస్తుంది, సంబంధము మధురంగా అనిపిస్తుంది. ఈ కర్మభోగము, కర్మ యొక్క కఠినమైన బంధనములు సైలెన్స్ శక్తి ద్వారా నీటిపై రేఖలలా అనుభవమవుతాయి. భోగించేవారిగా కాకుండా, భారమును అనుభవం చేసుకున్నట్లుగా కాకుండా సాక్షీద్రష్టాగా అయి ఈ లెక్కాచారాల దృశ్యమును కూడా చూస్తూ ఉంటారు. కావున తనువుతో పాటు మనస్సు యొక్క బలహీనత, డబల్ రోగము ఉన్న కారణంగా కఠినమైన భోగాల రూపంలో కనిపిస్తాయి. వారు అతి అతీతంగా మరియు బాబాకు ప్రియమైనవారిగా ఉన్న కారణంగా డబల్ శక్తి అనుభవమవ్వడం ద్వారా కర్మభోగపు లెక్కాచారాల శక్తిపై ఆ డబల్ శక్తి విజయాన్ని పొందుతుంది. రోగము ఎంత పెద్దదైనా కాని దు:ఖము లేక బాధను అనుభవం చేసుకోరు. దీనినే వేరే పదాలలో మీరు శూలం నుండి ముల్లు సమానంగా అనుభవమవ్వడము అని అంటారు. ఇటువంటి సమయంలో ప్రయోగం చేసి చూడండి! ఎంతోమంది పిల్లలు ఇలా చేస్తారు కూడా. ఇదేవిధంగా తనువుపై, మనసుపై, సంస్కారంపై ప్రయోగంచేసి అనుభవం చేసుకుంటూ ముందుకువెళ్ళండి, ఇంకా ముందుకువెళుతూ ఉండండి, ఈ రిసెర్చ్ చేయండి. ఇందులో ఒకరినొకరు చూసుకోకండి. వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎక్కడ చేసారు, పాతవారు చేస్తున్నారా లేదా, పెద్దవాళ్ళు చేయడం లేదు, చిన్నవాళ్ళు చేస్తున్నారు అన్నది చూడకండి. మొదట నేను ఈ అనుభవంలో ముందుకు వచ్చేయాలి. ఎందుకంటే ఇది తమ ఆంతరంగిక పురుషార్థం యొక్క విషయము. ఎప్పుడైతే ఈ విధంగా వ్యక్తిగత రూపంలో ఇదే ప్రయోగంలో నిమగ్నమైపోతారో, వృద్ధిని పొందుతూ ఉంటారో అప్పుడు ఒక్కొక్కరి శాంతి శక్తి సంఘటిత శక్తి రూపంలో విశ్వం ముందు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మొదటి అడుగుగా విశ్వశాంతి సమ్మేళనం చేస్తూ ఆహ్వానమును ఇచ్చారు. కాని, సర్వుల శాంతి యొక్క మూలధనము ఎప్పుడైతే సంఘటిత రూపంలో ప్రఖ్యాతమవుతుందో అప్పుడు హే శక్తి, శాంతి అవతారమూర్తులారా, ఈ అశాంత స్థానం వైపుకు వచ్చి శాంతి దానమును ఇవ్వండి అన్న ఆహ్వానము వస్తుంది. ఏ విధంగా సేవలో ఇప్పుడు కూడా ఎక్కడైతే అశాంతితో కూడిన వాతావరణము అనగా మృత్యుసంతాప స్థానము ఉంటుందో అక్కడకు వచ్చి శాంతిని ఇవ్వండి అని మిమ్మల్ని పిలుస్తారు కదా! అలాగే మెల్లమెల్లగా బ్రహ్మాకుమారీలే శాంతిని ఇవ్వగలరు అని ప్రఖ్యాతమవుతూ ఉంది. అలాగే ప్రతి అశాంత సంఘటనలో మీకు ఆహ్వానము వస్తుంది. ఏవిధంగా రోగ సమయంలో డాక్టర్ తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురారో అలాగే అశాంతితో కూడిన ఎటువంటి విషయాలలోనైనా శాంతి అవతారమూర్తులైన మీరు తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. కావున ఇప్పుడు శక్తి సైన్యము, పాండవ సైన్యము విశేషముగా శాంతి శక్తిని ప్రయోగించండి. ప్రయోగం చేసి చూపించండి. శాంతి శక్తి కేంద్రాన్ని ప్రత్యక్షం చేయండి. ఏం చేయాలో అర్థమైందా?

ఈమధ్య డబల్ విదేశీ పిల్లల కారణంగా పిల్లలందరికీ కూడా ఖజానాలు లభిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుండో పిల్లలందరూ వచ్చారు. బాప్ దాదా అన్నివైపుల నుండీ వచ్చిన పిల్లల లగనమును చూసి సంతోషిస్తున్నారు. అన్ని ఖండాల నుండి, భిన్న, భిన్న దేశాల నుండి వచ్చిన పిల్లలను బాప్ దాదా చూస్తున్నారు. అందరూ అద్భుతం చేసారు. అందరూ ఏ లక్ష్యమునైతే ఉంచారో దాని అనుసారంగానే ప్రత్యక్ష పురుషార్థ రూపమును కూడా తీసుకువచ్చారు. విదేశం నుండి మొత్తం ఎంతమంది వి.ఐ.పి.లు వచ్చారు? (75). అలాగే భారతదేశం నుండి ఎంతమంది వి.ఐ.పి.లు వచ్చారు? (700). భారతదేశ విశేషత - వార్తాపత్రికల్లో బాగా వచ్చింది. మరియు విదేశాల నుండి 75 మంది రావడం అది కూడా తక్కువేమీ కాదు. ఎంతోమంది వచ్చినట్లే. మరు సంవత్సరంలో ఇంకా ఎంతోమంది వస్తారు. ఇప్పుడు వచ్చే ద్వారాలైతే తెరుచుకున్నాయి కదా! ఇంతకుముందు విదేశపు టీచర్లు వి.ఐ.పి.లను తీసుకురావడం చాలా కష్టం, అటువంటివారెవరూ కనిపించడం లేదు అని అనేవారు. కాని ఇప్పుడైతే కనిపిస్తున్నారు కదా! విఘ్నాలైతే వచ్చాయి. బ్రాహ్మణుల కార్యంలో విఘ్నాలు కలుగకపోతే లగనము కూడా కలుగజాలదు, నిర్లక్షులుగా అయిపోతారు. కావున డ్రామా అనుసారంగా లగనమును పెంచేందుకు విఘ్నాలు కలుగుతాయి. ఇప్పుడు ఒక్కొక్కరి ద్వారా శబ్దము వింటూ అనేకులలో ఉత్సాహము కలుగుతుంది.

పిల్లలు చాలా మంది అద్భుతమును చేసారు. సేవ ద్వారా మంచి ప్రమాణమును చూపించారు. సేవ యొక్క అవకాశమును ఇప్పించేందుకు నిమిత్తులుగా అయితే అయిపోయారు కదా! ఒక్కరి ద్వారా సహజంగానే అనేకుల వరకు ఈ శబ్దము వ్యాపించింది కదా! అమెరికావారు ఎంతగానో కష్టపడ్డారు, మంచి ధైర్యమును ఉంచారు. ఎంతో ఎక్కువగా శబ్దమును వ్యాపింపజేసే నిమిత్త ఆత్మలను డ్రామా అనుసారంగా విదేశం వారే తీసుకువచ్చారు కదా! భారతవాసులైన పిల్లలు కూడా ఎంతో శ్రమించారు, ఆ శ్రమ ఫలితంగా సంఖ్య మంచిగా వచ్చింది. ఇప్పుడు భారతదేశం యొక్క విశేష ఆత్మలు కూడా వస్తారు. అచ్ఛా!

ఈ విధంగా విదేశం నుండి వచ్చే పిల్లలందరికీ మరియు భారతదేశము నలువైపుల నుండి వచ్చిన పిల్లలకు ఒకే విశేషమైన శుద్ధ సంకల్పము ఉంది - మూల మూలలలోను బాబా ప్రత్యక్షత యొక్క జెండాను ఎగురవేయాలి - ఇటువంటి శుభ సంకల్పాన్ని చేపట్టేవారు, విశ్వ పరివర్తకులైన విశ్వ కళ్యాణులు, సర్వ శ్రేష్ఠ ఆత్మలు అయినవారికి బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదాల మిలనము:-

వరదానీ భూమి పైకి వచ్చి వరదానం తీసుకున్నారా? సదా బాబా ద్వారా బాబా తోడును స్వయమును అనుభవం చేసుకోవడం అన్నింటికన్నా పెద్ద వరదానము. సదా బాబా స్మృతిలో అనగా సదా తోడుగా ఉండాలి, అప్పుడు సదా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ఏ విషయము సంకల్పంలోకి వచ్చినా బాబా తోడులో అన్నీ సమాప్తమైపోతాయి మరియు సంతోషంలో తేలుతూ ఉంటారు. కావున సదా సంతోషంగా ఉండేందుకు ఈ విధానమును గుర్తుంచుకోవాలి మరియు ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉండాలి. ఇతరులకు కూడా సంతోషంలో ఉండే సాధనమును ఇవ్వాలి. కావున మిమ్మల్ని ఆత్మలందరూ సంతోషపు దేవతలుగా భావిస్తారు. ఎందుకంటే విశ్వంలో నేడు అన్నింటికన్నా ఎక్కువగా సంతోషము అవసరము. అది మీరు ఇస్తూ ఉండండి. నేను సంతోషపు దేవతను అని గుర్తుంచుకోండి. స్మృతి మరియు సేవ ఈ బ్యాలెన్స్ ద్వారా బాబా యొక్క దీవెనలు లభిస్తూ ఉంటాయి. బ్యాలెన్స్ అన్నింటికన్నా పెద్ద కళ. ప్రతి విషయంలోను బ్యాలెన్స్ ఉన్నట్లయితే సహజంగానే నెంబర్ వన్ అయిపోతారు. ఈ బ్యాలెన్సే అనేక ఆత్మల ముందు ఆనందమయమైన జీవితమును సాక్షాత్కరింపజేస్తుంది. బ్యాలెన్స్ ను సదా స్మృతిలో ఉంచుకుంటూ, సర్వప్రాప్తులను అనుభవం చేసుకుంటూ స్వయమూ ముందుకువెళ్ళండి మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళండి.

బాబాను తెలుసుకునేవారు, బాబాను పొందేవారు క్లోటాదిమందిలో ఏ ఒక్కరో ఉంటారు అని ఏ ఆత్మలను గూర్చి అయితే గానం చేయబడ్డదో ఆ ఆత్మలము మేమే అన్న ఈ సంతోషంలోనే ఉన్నట్లయితే మీ ఈ ముఖము నడుస్తూ, తిరుగుతూ ఉన్న సేవా కేంద్రంగా అయిపోతుంది. ఏ విధంగా సేవా కేంద్రానికి వచ్చి తండ్రి పరిచయమును తీసుకుంటారో అలాగే మీ హర్షితముఖం ద్వారా బాబా పరిచయం లభిస్తూ ఉంటుంది. బాప్ దాదా పిల్లలందరినీ అలాంటి యోగ్యులుగానే భావిస్తారు. ఇన్ని సేవా కేంద్రాలు ఉన్నాయి కావున సదా నడుస్తూ, తిరుగుతూ, తింటూ, తాగుతూ మా నడవడిక ద్వారా లేక ముఖము ద్వారా బాబా సేవను చేయాలి అని సదా భావించండి, అప్పుడు సహజంగానే నిరంతర యోగులుగా అయిపోతారు. ఏ పిల్లలైతే ఆది నుండి సేవలో ఉల్లాస, ఉత్సాహాల సహయోగమును అందిస్తూ వచ్చారో ఇటువంటి ఆత్మలకు బాప్ దాదా కూడా సహయోగమును అందిస్తూ 21 జన్మలు విశ్రాంతిగా ఉంచుతారు, కష్టపడవలసిన అవసరం ఉండదు. తినండి, తాగండి మరియు స్వరగరాజ్య భాగ్యాన్ని అనుభవించండి. అరకల్పం శ్రమ అన్న పదమే ఉండదు. ఇటువంటి భాగ్యమును తయారుచేసుకునేందుకు వచ్చారు.

కుమారులతో:- కుమార్ జీవితంలో ఎంతో శక్తి ఉంటుంది. కుమారులు ఏది కావాలనుకుంటే అది చేయగలరు. కావున బాప్ దాదా కుమారులను చూసి, వారు తమ ఎనర్జీని వినాశనానికి బదులుగా నిర్మాణ కార్యంలో వినియోగించడం చూసి బాప్ దాదా విశేషంగా సంతోషిస్తారు. ఒక్కొక్క కుమార్ విశ్వమును నవ్యంగా తయారుచేయడంలో తమ శక్తిని వినియోగిస్తున్నారు. ఎంత శ్రేష్ఠ కార్యమును చేస్తున్నారు! ఒక్కో కుమార్ 10 మంది కార్యమును చేయగలరు. కావుననే కుమారులను చూస్తే బాప్ దాదాకు ఎంతో గర్వంగా ఉంటుంది. కుమార్ జీవితంలో మీ జీవితమును సఫలం చేసుకున్నారు. మీరు ఇటువంటి విశేష ఆత్మలే కదా! చాలా మంచి సమయంలో మీ జీవిత నిర్ణయమును తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు ఏమీ చేయలేదు కదా! పక్కాయే కదా! ఎవరైనా ఇది తప్పు అంటూ మిమ్మల్ని లాగితే! ప్రపంచపు అక్షౌహిణి ఆత్మలు ఒకవైపు ఉండి మీరొక్కరూ ఇంకొకవైపు ఉన్నట్లయితే ఏమవుతుంది? నేను ఒంటరిని కాను ,తండ్రి నా తోడుగాఉన్నారు అని అనండి. స్వయం యొక్క జీవితమును తయారుచేసుకోవడమే కాదు, అనేకుల జీవితమును తయారుచేసేందుకు నిమిత్తులుగా అయ్యారు అని బాప్దాదా సంతోషిస్తారు. అచ్ఛా!

ఉత్తరాలకు జవాబునిస్తూ బాప్ దాదా పిల్లలందరికీ టేపులో ప్రియస్మృతులు నింపి పంపారు.

నలువైపులా ఉన్న, చాలాకాలం తర్వాత కలిసిన స్మేహి, సహయోగి, సర్వీసబుల్ పిల్లల ఉత్తరాలే కాదు వారి హృదయపు మధురాతి మధురమైన సంగీతముతో కూడిన మధురాతి మధురమైన గీతాలను బాప్దాదా విన్నారు. ఎంతగా పిల్లలు హృదయపూర్వకంగా స్మృతిచేస్తారో అంతకన్నా వేలాది రెట్లు ఎక్కువగా బాప్దాదా కూడా పిల్లలను స్మృతిచేస్తారు, ప్రేమిస్తారు మరియు వారిని తమ ముందు ఎమర్జ్ చేసుకొని టోలీ తినిపిస్తారు. ఇప్పుడు కూడా ముందు టోలీని పెట్టడం జరిగింది. పిల్లలందరూ బాబా ముందు ఉన్నారు. కేక్ కోసి ఇస్తున్నారు మరియు పిల్లలందరూ తింటున్నారు. పిల్లలు తమ స్థితి లేక సేవలను గూర్చి ఏ సమాచారములనైతే రాసారో వాటిని బాప్దాదా విన్నారు. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు ఎంతో బాగున్నాయి. ఇప్పుడు ఎంతో కొంత మాయ యొక్క విఘ్నాలనేవైతే చూస్తున్నారో అవి కూడా నథింగ్ న్యూ. మాయ కేవలం పరీక్ష తీసుకునేందుకు వస్తుంది. మాయను చూసి కంగారుపడకండి. దాన్ని ఒక ఆట బొమ్మగా భావిస్తూ ఆడినట్లయితే మాయ యుద్ధం చేయదు, శాంతిగా వీడ్కోలు తీసుకొని పడుకుంటుంది. కావున ఏం జరిగింది అని ఎక్కువగా ఆలోచించకండి. ఏది జరిగినా దానికి ఫుల్స్టాప్ పెట్టండి మరియు ముందు ముందు కోటానురెట్లుగా ఏదైతే మిగిలిపోయిందో అది నింపుకోండి. ముందుకు వెళుతూ ఉండండి మరియు తీసుకువెళుతూ ఉండండి. బాబాదాదా తోడుగా ఉన్నారు. మాయ యొక్క ఈ నాటకము నడవజాలదు కావున భయపడకండి. సంతోషంలో నాట్యం చేయండి, గానం చేయండి. ఇప్పుడిక మన రాజ్యము వచ్చేస్తోంది. హే స్వరాజ్యాధికారులారా ,విశ్వరాజ్యభాగ్యము మీకోసం ఎదురుచూస్తోంది. అచ్ఛా!

సర్వులకు అపారమైన ప్రియస్మృతులను మరియు నిర్విఘ్నభవ అన్న వరదానమును బాప్దాదా అందిస్తున్నారు. ఏ పిల్లలైతే స్థూలధనములోని లోటు కారణంగా చేరుకోలేకపోతున్నారో వారికి కూడా బాప్దాదా ప్రియస్మృతులను అందిస్తున్నారు. ధనము తక్కువ ఉన్నా కాని రాజ్యాధికారులుగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజుల్లోని రాజుల వద్ద ఏదైతే లేదో అది వీరివద్ద అవినాశిగా ఉంది మరియు జన్మజన్మలవరకు జమ అయి ఉంది. బాప్దాదా ఇటువంటి వర్తమాన నిశ్చింత చక్రవర్తులకు మరియు భవిష్య విశ్వ రాజ్యాధికారులకు అపారమైన ప్రియస్మృతులను తెలియజేస్తున్నారు. ఇటువంటి పిల్లలు హృదయంతో ఇక్కడ ఉన్నారు మరియు శరీరంతో అక్కడ ఉన్నారు. కావున బాప్దాదా పిల్లలను సమ్ముఖంగా చూస్తూ సమ్ముఖంగా ప్రియస్మృతులను తెలియజేస్తారు. అచ్ఛా! ఓంశాంతి.

Comments