21-01-1985 అవ్యక్త మురళి

21-01-1985          ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా        మధువనము  

ఈశ్వరీయ జన్మదిన స్వర్ణిమ కానుక - '' దివ్యబుద్ధి ''

                 
ఈ రోజు విశ్వ రచయిత అయిన తండ్రి ప్రపంచానికి ప్రకాశమునిచ్చే పిల్లలు, తన కంటి పాపలైన పిల్లలను చూస్తున్నారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు, ప్రపంచానికి వెలుగు అనగా ప్రపంచానికి ప్రకాశం ఇచ్చేవారు. స్థూల ప్రకాశం లేకపోతే ప్రపంచం లేదు. ఎందుకంటే నూర్అనగా ప్రకాశం. ప్రకాశం లేకపోతే అంధకారం కారణంగా ప్రపంచమే లేదు. ప్రకాశమైన మీరు లేకపోతే ప్రపంచానికి వెలుగే లేదు. మీరు ఉన్నారు కనుక ప్రకాశం కారణంగా ప్రపంచం ఉంది. కావున బాప్దాదా ఇటువంటి ప్రపంచానికి వెలుగు అయిన పిల్లలను చూస్తున్నారు. ఇలాంటి పిల్లల మహిమను సదా గానం చేస్తారు, పూజిస్తారు. ఇలాంటి పిల్లలే విశ్వరాజ్య భాగ్యానికి అధికారులుగా అవుతారు. బాప్దాదా ప్రతి బ్రాహ్మణ పుత్రునికి జన్మ తీసుకుంటూనే, విశేష జన్మదినోత్సవానికి దివ్యమైన రెండు కానుకలు ఇస్తున్నారు. ప్రపంచంలో మనుష్యాత్మలు మనుష్యాత్మలకు కానుకలు ఇచ్చుకుంటారు. కాని బ్రాహ్మణ పిల్లలకు ఈ సంగమ యుగంలో స్వయంగా తండ్రియే దివ్యకానుకలను ఇస్తారు. ఏమిస్తారు? ఒకటి దివ్యబుద్ధి, రెండవది దివ్య నేత్రము అనగా ఆత్మిక ప్రకాశము. ఈ రెండు కానుకలు ప్రతి బ్రాహ్మణ పుత్రునికి జన్మదిన కానుకలు. ఈ రెండు కానుకలను సదా తోడుగా ఉంచుకొని వీటి ద్వారా సదా సఫలతా స్వరూపులుగా ఉంటున్నారా? దివ్యబుద్ధియే ప్రతి పుత్రుడిని దివ్యజ్ఞానం, దివ్య స్మృతి, దివ్య ధారణా స్వరూపంగా తయారు చేస్తుంది. దివ్య బుద్ధియే ధారణ చేసేందుకు విశేషమైన కానుక. కనుక దివ్య బుద్ధి సదా ఉంది అంటే ధారణా స్వరూపంగా ఉన్నారు. దివ్యబుద్ధిలో అనగా సతోప్రధాన బంగారు బుద్ధిలో కొంచెం రజో, తమో గుణం యొక్క ప్రభావం పడినట్లయితే ధారణా స్వరూపానికి బదులు మాయ ప్రభావంలోకి వచ్చేస్తారు. అందువలన సహజంగా ఉన్న ప్రతి విషయాన్ని కష్టంగా అనుభవం చేస్తారు. సహజ కానుక రూపంలో ప్రాప్తించిన దివ్యబుద్ధి బలహీనంగా ఉన్న కారణంగా శ్రమను అనుభవం చేస్తారు. ఎప్పుడైనా శ్రమ లేక కష్టం అనుభవం అవుతున్నట్లయితే దివ్యబుద్ధి తప్పకుండా ఏదో ఒక మాయ రూపంతో ప్రభావితమై ఉండటం వలన ఇలాంటి అనుభవం అవుతుంది. దివ్యబుద్ధి ద్వారా సెకండ్లో బాప్దాదా శ్రీమతాన్ని ధారణ చేసి సదా సమర్థంగా, సదా అచలంగా సదా మాస్టర్సర్వశక్తివాన్స్థితిని అనుభవం చేస్తారు. శ్రీమతం అనగా శ్రేష్ఠంగా తయారు చేసే మతము. వారు ఎప్పుడూ కష్టంగా అనుభవం చేయజాలరు. శ్రీమతము సదా సహజంగా ఎగిరింపజేసే మతము. కాని ధారణ చేసే దివ్యబుద్ధి తప్పకుండా కావాలి. కావున తమ జన్మదిన కానుక సదా తోడుగా ఉందా? అని పరిశీలించుకోండి. ఎప్పుడైనా మాయ తనదానిగా చేసుకొని కానుక అయిన దివ్యబుద్ధిని ఎప్పుడూ లాక్కోవడం లేదు కదా? పరమాత్మ ఇచ్చిన కానుకను కూడా పోగొట్టుకునే విధంగా మాయ ప్రభావంతో అప్పుడప్పుడు అమాయకులుగా అవ్వడం లేదు కదా? మాయకు కూడా ఈశ్వరీయ కానుకను తనదిగా చేసుకునే నేర్పరితనం వస్తుంది. కావున స్వయం నేర్పరిగా(చతురంగా) అవుతుంది, మిమ్ములను అమాయకులుగా చేసేస్తుంది. అందువలన భోలానాధ్తండ్రికి భోలా పిల్లలుగా (అమాయక పిల్లలుగా) భలే అవ్వండి కాని మాయకు అమాయకులుగా అవ్వకండి. మాయకు అమాయకులుగా అవ్వడం అనగా మర్చిపోయేవారిగా అవ్వడం. కానుక అయిన ఈశ్వరీయ దివ్యబుద్ధి సదా ఛత్రఛాయగా ఉంటుంది, మాయ తన నీడను వేస్తుంది. ఛత్రము ఎగిరిపోతుంది, నీడ ఉండిపోతుంది. అందువలన తండ్రి ఇచ్చిన కానుక స్థిరంగా ఉందా? అని సదా పరిశీలించుకోండి. దివ్య బుద్ధికి గుర్తు ఏమంటే ఈ కానుక(గిప్ట్) లిఫ్ట్లాగా పని చేస్తుంది. ఎవరైతే శ్రేష్ఠ సంకల్పమనే స్విచ్ఆన్చేస్తారో వారు ఆ స్థితిలో సెకండ్లో స్థితమవుతారు. దివ్యబుద్ధి మధ్యలో మాయ నీడ ఉన్నట్లయితే ఈ గిఫ్ట్యొక్క లిఫ్ట్పని చేయదు. ఉదాహరణానికి స్థూలమైన లిఫ్ట్కూడా చెడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? పైకి పోరు, క్రిందికి రారు, మధ్యలో వ్రేలాడ్తారు. గౌరవంలో ఉండేందుకు బదులు పరేశాన్అవుతారు, వ్యాకులపడ్తారు. స్విచ్ఎంతగా ఆన్చేసినా గమ్యానికి చేరుకునే ప్రాప్తి లభించదు (చేరుకోలేరు). కావున ఈ గిఫ్ట్యొక్క లిఫ్ట్ను పాడు చేసుకుంటారు. అందువలన శ్రమ అనే మెట్లు ఎక్కవలసి ఉంటుంది. తర్వాత ఏమంటారు? ధైర్యం అనే కాలు నడవడం లేదు. కావున సహజాన్ని కష్టంగా ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు? మిమ్ములను మీరు నిర్లక్ష్యంగా చేసుకున్నారు మాయ ఛాయలోకి వచ్చారు. అందువలన సెకండ్యొక్క సహజ విషయాన్ని చాలా సమయం యొక్క శ్రమగా అనుభవం చేస్తారు. దివ్యబుద్ధి అనే కానుక అలౌకిక విమానము. ఈ దివ్య విమానం ద్వారా, సెకండ్స్విచ్ఆన్చేయడం ద్వారా ఎక్కడకు కావాలంటే అక్కడకు చేరుకోగలరు. స్విచ్అనగా సంకల్పము. సైన్సు వారైతే ఒక లోకంలో విహరించగలరు. మీరు మూడు లోకాలలో విహారం చెయ్యగలరు. సెకండ్లో విశ్వకళ్యాణకారి స్వరూపంగా అయ్యి మొత్తం విశ్వానికి లైట్మైట్(ప్రకాశం - శక్తి ) ఇవ్వగలరు, కేవలం దివ్యబుద్ధి విమానం ద్వారా ఉన్నత స్థితిలో స్థితులవ్వండి. వారు విమానం ద్వారా హిమాలయ పర్వతం పై బూడిద వేశారు, నదిలో బూడిద వేశారు ఎందుకు? నలువైపులా వ్యాపింప చేసేందుకు కదా! వారైతే బూడిద వేశారు మీరు దివ్యబుద్ధి అనే విమానం ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన శిఖర స్థితిలో స్థితమై విశ్వంలోని సర్వాత్మల పట్ల లైట్మరియు మైట్ల శుభ భావన మరియు శ్రేష్ఠ కామనలనే సహయోగపు అలను వ్యాపింప చెయ్యండి. విమానం అయితే శక్తిశాలిగా ఉంది కదా? కేవలం ఉపయోగించడం రావాలి.
             
ఈ విమానానికి బాప్దాదా ఇచ్చే రిఫైన్శ్రేష్ఠ మతం అనే సాధనం కావాలి. ఉదాహరణానికి ఈ రోజులలో రిఫైన్కన్నా డబల్రిఫైన్నడుస్తోంది కదా! కావున ఇది బాప్దాదా ఇచ్చే డబల్రిఫైన్సాధనము. కొంచెం మన్మతం, పరమతం అనే చెత్త ఉన్నా ఏమవుతుంది? పైకి వెళ్తారా లేక క్రిందకు వెళ్తారా? కావున ఇది పరిశీలించుకోండి - దివ్య బుద్ధి అనే విమానంలో సదా డబల్రిఫైన్సాధనం ఉందా? మధ్యలో ఏదైనా చెత్త అయితే రావడం లేదు కదా? రాకుంటే ఈ విమానం సదా సుఖదాయిగా (సుఖమునిచ్చేదిగా) ఉంటుంది. సత్యయుగంలో ఎప్పుడూ ఏ ప్రమాదం జరగదు. ఎందుకంటే అది మీ శ్రేష్ఠ కర్మల శ్రేష్ఠమైన ప్రాలబ్ధము. అక్కడ కర్మభోగం లెక్కతో ఈ దు:ఖం అనుభవించాల్సి వచ్చే విధంగా ఏ కర్మలు జరగవు. సంగమయుగీ ఈశ్వరీయ కానుక అయిన దివ్యబుద్ధి సదా అన్ని రకాల దు:ఖం మరియు మోసాల నుండి ముక్తంగా ఉంది. దివ్యబుద్ధి గలవారు ఎప్పుడూ మోసపోరు. దు:ఖాన్ని అనుభవించరు. సదా సురక్షితంగా ఉంటారు. ఆపదల నుండి ముక్తులుగా ఉంటారు. అందువలన ఈ ఈశ్వరీయ కానుకకు గల మహత్వాన్ని తెలుసుకొని ఈ కానుకను సదా తోడుగా ఉంచుకోండి. ఈ కానుక యొక్క మహత్వం అర్థమయిందా? కానుక అందరికి లభించిందా? లేక ఎవరికైనా లభించలేదా? అందరికి లభించింది కదా! కేవలం సంభాళించడం వస్తుందా లేదా అనేది మీ పై ఉంది. సదా అమృతవేళ పరిశీలించుకోండి, కొంచెం లోపం ఉన్నా అమృతవేళలో సరిచేసుకుంటే మొత్తం రోజంతా శక్తిశాలిగా ఉంటుంది. స్వయం సరిగ్గా చేసుకోలేకుంటే సరిగ్గా చేయించుకోండి. కానీ అమృతవేళలోనే సరి చేసుకోండి. మంచిది. దివ్యదృష్టి గురించి తర్వాత వినిపిస్తాము. దివ్యదృష్టి అనండి దివ్య నేత్రం అనండి ఆత్మిక ప్రకాశం అనండి విషయం ఒక్కటే. ఈ సమయంలో దివ్యబుద్ధి అనే ఈ కానుక అందరి వద్ద ఉంది కదా! బంగారు పాత్రలాగా ఉన్నారు కదా! ఇదే దివ్యబుద్ధి. మధువనానికి అందరూ దివ్యబుద్ధి అనే సంపూర్ణ బంగారు పాత్రను తీసుకొచ్చారు కదా! సత్యమైన బంగారంలో వెండి లేక రాగి మిక్స్అవ్వలేదు కదా! సతోప్రధానము అనగా సంపూర్ణ బంగారు. దీనినే దివ్యబుద్ధి అని అంటారు. మంచిది - ఎటువైపు నుండి వచ్చినా అన్నివైపుల నుండి జ్ఞాన నదులు వచ్చి సముద్రంలో ఇమిడిపోయాయి. ఇది నది మరియు సముద్రాల కలయిక. ఈ మహాన్మేళా జరుపుకునేందుకు వచ్చారు కదా! మిలన మేళా జరుపుకునేందుకు వచ్చారు. బాప్దాదా కూడా సర్వ జ్ఞాన నదులను చూసి ఎక్కడెక్కడ నుండి ఎంత ఉత్సాహ-ఉల్లాసాలతో ఈ మిలన మేళాకు చేరుకున్నారు అని సంతోషిస్తున్నారు. మంచిది.
             
సదా దివ్యబుద్ధి అనే బంగారు కానుకను కార్యములోకి తీసుకొచ్చేవారు, సదా తండ్రి సమానంగా నేర్పరిగా అయ్యి మాయ నేర్పరితనాన్ని తెలుసుకునేవారు, సదా తండ్రి ఛత్రఛాయలో ఉంటూ మాయ ఛాయ (నీడ) నుండి దూరంగా ఉండేవారు, సదా జ్ఞాన సాగరునితో మధుర మిలనం జరుపుకునేవారు, ప్రతి కష్టాన్ని సహజంగా చేసుకునేవారు, విశ్వకళ్యాణకారులకు, శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉండే శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
1. దృష్టి మారడం వలన సృష్టి మారిపోయింది కదా! దృష్టి శ్రేష్ఠంగా అయినందున సృష్టి కూడా శ్రేష్ఠంగా అయ్యింది. ఇప్పుడు సృష్టియే తండ్రి. తండ్రిలో సృష్టి ఇమిడిపోయి ఉందని అనుభవం అవుతోంది కదా! ఎక్కడ చూసినా, విన్నా తండ్రి కూడా జతలో ఉన్న అనుభవం అవుతుంది కదా! ప్రతి సెకండ్ప్రతి సంకల్పంలో తోడు నిభాయించే స్నేహితుడు మొత్తం విశ్వంలో ఎవ్వరూ ఉండరు. లౌకికంలో ఎవరు ఎంత స్నేహితులైనా సదా జతలో ఉండరు. బాబా అయితే స్వప్నంలో కూడా తోడు ఇస్తారు. ఇలాంటి తోడు నిభాయించే స్నేహితుడు లభించాడు కావున సృష్టి మారిపోయింది. ఇప్పుడు లౌకికంలో కూడా అలౌకికాన్ని అనుభవం చేస్తున్నారు కదా! లౌకికంలో ఏ సంబంధాన్ని చూస్తున్నా సత్యమైన సంబంధం స్వత: స్మృతిలోకి వస్తుంది. దీనితో ఆ ఆత్మలకు కూడా శక్తి లభిస్తుంది. తండ్రి సదా తోడుగా ఉన్నప్పుడు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. బాగవుతుందా లేదా అని ఆలోచించే అవసరం లేదు. తండ్రి తోడుగా ఉంటే అన్నీ మంచిగానే ఉంటాయి కనుక తోడును అనుభవం చేస్తూ ఎగురుతూ వెళ్లండి. ఆలోచించడం కూడా తండ్రి పనే. మన పని తండ్రి జతలో మగ్నమై ఉండడం. అందువలన బలహీన ఆలోచన కూడా సమాప్తి, సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉండండి. ఇప్పుడూ చక్రవర్తులే, సదాకాలం కొరకూ చక్రవర్తులే.
             
2. సదా స్వయాన్ని సఫలతా నక్షత్రాలుగా భావించండి. ఇతర ఆత్మలకు కూడా సఫలత పొందే తాళంచెవి ఇస్తూ ఉండండి. ఈ సేవతో ఆత్మలందరు సంతోషించి మీకు హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తారు. తండ్రి ఆశీర్వాదాలు, సర్వుల ఆశీర్వాదాలే మిమ్ములను ముందుకు తీసుకెళ్తాయి.
             
విశేషంగా ఎన్నుకోబడిన అవ్యక్త మహావాక్యాలు - సహయోగిగా అవ్వండి మరియు సహయోగులను తయారు చెయ్యండి.
             
ఎలాగైతే ప్రజలు రాజుకు సహయోగులుగా, స్నేహితులుగా ఉంటారో అలా మొదట మీ ఈ సర్వ కర్మేంద్రియాలు, విశేష శక్తులు సదా స్నేహీ, సహయోగులుగా ఉండాలి. అప్పుడు దీని ప్రభావం సాకారంలో మీ సేవలో తోడుగా ఉన్నవారి పై లేక లౌకిక సంబంధీకుల పై, తోటివారి పై పడ్తుంది. ఎప్పుడైతే స్వయం తమ సర్వ కర్మేంద్రియాలను అధికారంలో ఉంచుకుంటారో అప్పుడు ఇతర సాథీలందరు మీ కార్యంలో తప్పకుండా సహయోగులుగా అవుతారు. ఎవరితో స్నేహముంటుందో వారి ప్రతి కార్యములో తప్పకుండా సహయోగులుగా అవుతారు. అతిస్నేహి ఆత్మల గుర్తు సదా తండ్రి శ్రేష్ఠ కార్యములో సహయోగులుగా ఉంటారు. ఎవరితో స్నేహముంటుందో వారి ప్రతి కార్యములో తప్పకుండా సహయోగులుగా అవుతారు. అతి స్నేహి ఆత్మల గుర్తు - సదా తండ్రి శ్రేష్ఠ కార్యంలో సహయోగులుగా ఉంటారు. ఎవరెంత సహయోగులో అంత సహజ యోగులుగా ఉంటారు. కావున రాత్రి పగలు బాబా మరియు సేవ తప్ప ఇంకేదీ లేదు అనే లగ్నము ఉండాలి. వారు మాయకు సహయోగులుగా అవ్వలేరు. మాయకు దూరంగా ఉంటారు.
             
స్వయాన్ని వారు మేము వేరే మార్గం వారమని ఎంత అనుకునా మీ ఈశ్వరీయ స్నేహం వారిని సహయోగులుగా చేసి పరస్పరం ఒకటిగా అయ్యి ముందుకు వెళ్ళే సూత్రంలో బంధిస్తుంది. స్నేహం మొదట సహయోగిగా చేస్తుంది. సహయోగిగా చేస్తూ చేస్తూ స్వత:గానే సమయానికి సహజయోగిగా చేసేస్తుంది. ఈశ్వరీయ స్నేహం పరివర్తనకు పునాది లేక జీవన పరివర్తనకు బీజ స్వరూపము. ఏ ఆత్మలలో ఈశ్వరీయ స్నేహానుభూతి అనే బీజం పడ్తుందో, ఆ బీజం వారిలో సహయోగిగా అయ్యే వృక్షమును స్వత:గానే ఉత్పన్నం చేస్తూ ఉంటుంది అంతేకాక సమయానికి సహజయోగిగా అయ్యే ఫలం కనిపిస్తుంది. ఎందుకంటే పరివర్తన అనే బీజము ఫలాన్ని తప్పకుండా చూపిస్తుంది. అందరి మానసిక శుభభావన మరియు శుభకామనల సహయోగము ఏ కార్యములోనైనా సఫలతను ఇప్పిస్తుంది. ఎందుకంటే ఈ శుభ భావన, శుభ కామనల కోట ఆత్మలను పరివర్తన చేసుకుంటుంది. వాయుమండలపు కోట సర్వుల సహయోగంతోనే తయారవుతుంది. ఈశ్వరీయ స్నేహం అనే సూత్రము ఒకటైనట్లయితే అనేక రకాల విచారాలు ఉన్నప్పటికీ సహయోగిగా అయ్యే ఆలోచన ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు సర్వ అధికారాలను సహయోగిగా చేయండి. అవుతున్నారు కూడా. కాని ఇంకా సమీపంగా, సహయోగులుగా తయారుచేస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షతా సమయం సమీపానికి వస్తూ ఉంది. మొదట మీరు వారిని సహయోగులుగా చేసుకునే శ్రమ చేసేవారు కానీ ఇప్పుడు స్వయం వారే సహయోగులుగా అవుతామని ఆఫర్చేస్తున్నారు. ఇకముందు కూడా చేస్తూ ఉంటారు.
             
సమయ సమయానికి సేవ యొక్క రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి ఇంకా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కువగా చెప్పవలసిన పని లేదు. కాని ఈ కార్యం శ్రేష్ఠమైనది, అందువలన మేము కూడా సహయోగులుగా అవ్వాల్సిందే అని వారే స్వయంగా చెప్తారు. ఎవరైతే సత్యమైన హృదయంతో, స్నేహంతో సహయోగం ఇస్తారో వారు తండ్రితో పదమా రెట్లు సహయోగం తీసుకునే అధికారిగా అవుతారు. తండ్రి సహయోగం లెక్కను పూర్తిగా తీరుస్తారు. పెద్ద కార్యాన్ని కూడా సహజంగా చేసే చిత్రము పర్వతానికి వ్రేలు ఇచ్చినట్లుగా చూపించారు. ఇది సహయోగానికి గుర్తు. కావున ప్రతి ఒక్కరూ సహయోగిగా అయ్యి ముందుకు రావాలి. సమయానికి సహయోగిగా అవ్వాలి. ఇప్పుడు ఈ అవసరం ఉంది. దీని కొరకు శక్తిశాలి బాణాలు వేయాల్సి ఉంటుంది. ఎవరికైతే సర్వాత్మల పట్ల సహయోగ భావన, సంతోష భావన, సద్భావన ఉంటుందో వారే శక్తిశాలి బాణాలు. మంచిది. ఓంశాంతి.

Comments