21-01-1983 అవ్యక్త మురళి

21-01-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమ యుగంలో బాబా మరియు బ్రాహ్మణులు సదా తోడుగా ఉండాలి.

          ఈరోజు బాప్ దాదా తమ కుడిభుజాలతో కేవలం కరచాలనం చేసేందుకు వచ్చారు. కావున కరచాలనం ఎంతసేపటిలో జరుగుతుంది. అందరూ కరచాలనం చేసారా? అయినా ఒక దృఢసంకల్పం చేసి సత్యమైన ప్రియుడికి ప్రేయసులుగా అయితే అయిపోయారు. అప్పుడే విశ్వసేవా కార్యమును సంభాళించేందుకు నిమిత్తులుగా అయ్యారు. ప్రతిజ్ఞలో పక్కాగా ఉన్న కారణంగా బాప్ దాదా కూడా ప్రతిజ్ఞను నిలబెట్టుకోవలసి వచ్చింది. ప్రతిజ్ఞ అయితే పూర్తయ్యింది కదా! అందరికన్నా సమీపంగా ఉన్న భగవంతుని మిత్రులు ఎవరు? మీరందరూ భగవంతుని అతి సమీపమైన మిత్రులు ఎందుకంటే సమానమైన కర్తవ్యంలో ఉన్నారు. ఏ విధంగా బాబా బేహద్ సేవ కోసం ఉన్నారో అలాగే చిన్న, పెద్ద అందరూ బేహద్ సేవాధారులు. ఈ రోజు విశేషంగా చిన్న, చిన్న మిత్రులకోసం విశేషంగా వచ్చారు ఎందుకంటే చిన్నవారైనా బాధ్యతనైతే పెద్దగా తీసుకున్నారు కదా! కావున చిన్న మిత్రులు ఎక్కువ ప్రియంగా అనిపిస్తారు. ఇప్పుడు ఫిర్యాదులు ఏమీ లేవు కదా! అచ్ఛా! (ఏ ప్రతిజ్ఞనైతే చేసారో దానిని నిలబెట్టుకోవాలి... అని అక్కయ్యలు పాట పాడారు).
          బాప్ దాదా అయితే సదా పిల్లల సేవలో తత్పరులై ఉంటారు. ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు మరియు సదా తోడుగా ఉంటారు. వారు ఉన్నదే కంబైండుగా. కావున కంబైండుగా ఉన్నవారిని ఎవరైనా వేరు చేయగలరా? ఈ ఆత్మిక యుగల్ స్వరూపము ఎప్పుడూ పరస్పరం వేరవ్వజాలరు. ఏ విధంగా బ్రహ్మాబాబా మరియు దాదా కంబైండుగా ఉన్నారో, వారిని ఎవరైనా వేరుచేయగలరా? కావున బాబాను అనుసరించే శ్రేష్ఠ బ్రాహ్మణులు మరియు బాబా కంబైండుగా ఉన్నారు. ఈ రావడము, పోవడము ఇవన్నీ డ్రామాలోని డ్రామా. అనాది డ్రామా అనుసారంగా సంగమ యుగంలో కంబైండ్ స్వరూపంగా అయ్యే ఉన్నారు. ఎప్పటివరకైతే సంగమ యుగం ఉంటుందో అప్పటివరకు బాబా మరియు శ్రేష్ఠ ఆత్మలు సదా తోడుగా ఉంటారు. కావున ఆటలో ఆట ఆడుతూ పాటలు పాడండి, నాట్యం చేయండి, నవ్వండి, అహ్లాదంగా ఉండండి కాని కంబైండ్ రూపమును మర్చిపోకండి. బాప్ దాదా మాస్టర్ శిక్షకులను ఎంతో శ్రేష్ఠ దృష్టితో చూస్తారు. నిజానికి బ్రాహ్మణులందరూ శ్రేష్ఠాతిశ్రేష్ఠమైనవారే. కాని, ఎవరైతే మాస్టర్ శిక్షకులుగా అయి హృదయపూర్వకంగా, ప్రేమగా రాత్రింబవళ్ళు సత్యమైన సేవకులుగా అయి సేవ చేస్తారో వారు విశేషమైనవారు మరియు విశేషంలో కూడా విశేషమైనవారు. ఇంతగా మీ స్వమానమును స్మృతిలో ఉంచుకుంటూ సంకల్పము, వాక్కు మరియు కర్మలోకి రండి. మేము నయనాలలోని రత్నాలము అన్నది సదా స్మృతిలో ఉంచుకోండి. మస్తక మణులము, కంఠములోని విజయమాలలోని మణులము మరియు బాబా ముఖముపై ఉన్న మందహాసము మేము... ఈ విధంగా నలువైపుల నుండి వచ్చిన చిన్న, పెద్ద పిల్లలందరికీ మరియు ప్రియమైన పెద్ద మిత్రులగు పిల్లలెవరైతే వచ్చారో వారందరూ తమ తమ పేరు పేరునా ప్రియస్మృతులు స్వీకరించగలరు. క్రింద కూర్చున్నా లేక పైన కూర్చున్నా క్రింద కూర్చున్నవారు కూడా నయనాలలో ఉన్నారు మరియు పైన ఉన్నవారు నయనాల సమ్ముఖంగా ఉన్నారు. కావున ఇప్పుడు ప్రతిజ్ఞను నిర్వర్తించారు. ఇప్పుడు మిత్రులందరికీ, సర్వసహచరులకు ప్రియస్మృతులు మరియు నమస్తే. కొద్ది కొద్దిగా కలవడము మంచిది. మీరందరూ అంతే ప్రతిజ్ఞ చేసారు (గీతము:- ఇప్పుడు వదిలి వెళ్ళకండి, ఈ హృదయం ఇంకా నిండలేదు). మీ మనస్సు ఎప్పుడైనా నిండుతుందా? ఎంతగా కలుస్తూ ఉంటే అంతగా నిండుతూ ఉంటుంది. అచ్ఛా- (దాదీజీని చూస్తూ ఇలా అన్నారు) బాగున్నావు కదా! సాకారములో దాదీతో ప్రతిజ్ఞ చేసారు, కావున ఇలా కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. మనస్సు నిండిపోతే ఖాళీ చేయవలసి వస్తుంది కావున అలా నిండుతూనే ఉండడం మంచిది.
               (దాదీజీతో) వీరి సంకల్పము ఎక్కువగా వస్తోంది. చిన్న చిన్న అక్కయ్యలైన మీ అందరిపైన దాదీజీకి చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. దీదీ, దాదీలు ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారికి మీ పైన విశేషమైన ప్రేమ ఉంది. బాగా చేసారు, బాప్ దాదా కూడా అవకాశమును ఇస్తారు. ఏ ప్రేమతోనైతే మీ అందరికీ అవకాశం లభించిందో ఆ ప్రేమతో కలుసుకోవడం కూడా జరిగింది. నియమానుసారంగా రావడం ఏమంత పెద్ద విషయం కాదు. ఇది కూడా విశేష స్నేహానికి, విశేష ప్రేమకు ప్రతిఫలంగా లభిస్తోంది. ఏ ఉల్లాసముతోనైతే మీరు వచ్చారో డ్రామాలో మీ అందరికీ చాలా మంచి స్వర్ణిమ అవకాశం లభించింది. కావున అందరూ గోల్డెన్ ఛాన్సర్లు గా అయిపోయారు కదా! వారు కేవలం ఛాన్సర్లుగా ఉంటారు మీరు గోల్డెన్ ఛాన్సర్లు. అచ్ఛా.

Comments