19-12-1985 అవ్యక్త మురళి

19-12-1985          ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా        మధువనము  

"ఫాలో ఫాదర్"

ఈ రోజు స్నేహీ పిల్లలందరి స్నేహానికి బదులు ఇచ్చేందుకు బాప్ దాదా మిలనం జరుపుకునేందుకు వచ్చారు. విదేహీ అయిన బాప్ దాదా దేహాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? పిల్లలను కూడా విదేహులుగా చేసేందుకు. ఎలాగైతే తండ్రి విదేహీగా ఉన్నారో, దేహంలోకి వచ్చినా విదేహీ స్వరూపంలో విదేహీ స్థితిని అనుభవం చేయిస్తారో, అలా మీరంతా జీవితంలో ఉంటూ, దేహంలో ఉంటూ విదేహీ ఆత్మిక స్థితిలో స్థితియై ఈ దేహం ద్వారా కరావనహార్ (చేయించేవారుగా) అయి కర్మలు చేయించండి. ఈ దేహము కరనహార్ (చేసేది), దేహీ అయిన మీరు కరావనహార్ (చేయించేవారు). ఈ స్థితినే విదేహీ స్థితి అని అంటారు. దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. సదా తండ్రిని ఫాలో చేసేందుకు మీ బుద్ధిని రెండు స్థితులలో స్థితి చేసుకోండి. తండ్రిని ఫాలో చేసేందుకు స్థితి - సదా అశరీరి భవ, విదేహీ భవ, నిరాకారీ భవ. దాదా అనగా బ్రహ్మాబాబాను ఫాలో చేసేందుకు సదా అవ్యక్త స్థితి భవ, ఫరిస్తా స్వరూప భవ, ఆకారీ స్థితి భవ. ఈ రెండు స్థితులలో స్థితులై ఉండడమంటే ఫాలోఫాదర్ చేయడం. దీని కంటే క్రిందిది వ్యక్త భావము, దేహ భానము, వ్యక్తి భావము, ఇందులో క్రిందికి రాకండి. వ్యక్తి భావము లేక వ్యక్త భావము క్రిందికి తీసుకొచ్చేందుకు ఆధారము, అందుకే అన్నిటికీ అతీతంగా సదా ఈ రెండు స్థితులలో ఉండండి. మూడవ దాని కొరకు బ్రాహ్మణ జన్మ జరుగుతూనే బాప్ దాదా శిక్షణ లభించింది - సంకల్పంలో లేక స్వప్నంలో కూడా ఈ క్రింద పడే స్థితిలోకి వెళ్లకూడదు, ఇది పరాయి స్థితి. ఎలాగైతే ఎవరైనా ఆజ్ఞ లేకుండా పరదేశానికి వెళ్తే ఏమవుతుంది? బాప్ దాదా కూడా ఈ ఆజ్ఞ అనే గీత గీశారు, ఈ గీతను దాటి బయటకు వెళ్లకూడదు. ఒకవేళ ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే ఆందోళన చెందుతారు, పశ్చాత్తాప పడ్తారు కూడా, అందుకే సదా ఆత్మగౌరవంతో ఉండేందుకు సదా ప్రాప్తి స్వరూప స్థితిలో స్థితియై ఉండేందుకు సహజ సాధనము - “ఫాలో ఫాదర్”. ఫాలో చేయడం అయితే సహజమవుతుంది కదా! మీరు జీవితంలో బాల్యము నుండి ఫాలో చేయడంలో అనుభవీగా ఉన్నారు. బాల్యములో కూడా తండ్రి పిల్లలకు వేలు పట్టుకొని నడవడంలో, కూర్చుని లేవడంలో ఫాలో చేయిస్తారు. మళ్లీ గృహస్థలుగా అయినప్పుడు కూడా పతి, పత్నికి ఒకరి వెనుక ఒకరు అనుసరిస్తూ నడవడాన్ని నేర్పిస్తారు. ఇంకా ముందుకు వెళ్తే గురువులను ఆశ్రయిస్తారు, అప్పుడు గురువుకు అనుచరులుగా అవుతారు అనగా ఫాలో చేసేవారిగా అవుతారు. లౌకిక జీవితంలో కూడా ఆది మరియు అంతిమములో ఫాలో చేయడం జరుగుతుంది. అలౌకిక, పారలౌకిక తండ్రి కూడా ఒకే సహజ విషయాన్ని సాధనంగా తెలుపుతారు - ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇలా చేయాలా లేక అలా చేయాలా? - ఈ విస్తారము నుండి విడిపిస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానము - ఒకే ఒక్క మాట - “ఫాలో ఫాదర్”.

సాకార రూపంలో కూడా నిమిత్తంగా అయి కర్మలు నేర్పించేందుకు, పూర్తి 84 జన్మలు తీసుకునే బ్రహ్మా యొక్క ఆత్మ నిమిత్తంగా అయ్యారు. కర్మలో, కర్మబంధనాల నుండి ముక్తులవ్వడంలో, కర్మ సంబంధాన్ని నిభాయించడంలో, దేహంలో ఉంటూ విదేహీ స్థితిలో స్థితియై ఉండడంలో, శారీరిక బంధనాలను ముక్తి చేయడంలో, మనస్సు యొక్క తపనలో నిమగ్నమై ఉండే స్థితిలో, ధనములో ఒక్కొక్క పైసాను సఫలం చేయడంలో, సాకార బ్రహ్మా సాకార జీవితంలో నిమిత్తంగా అయ్యారు. కర్మ బంధన ఆత్మ కర్మాతీతంగా అయ్యే ఉదాహరణగా అయ్యారు. కనుక సాకార జీవితాన్ని ఫాలో చేయడం సహజమే కదా! ఈ పాఠమే ఫాలోఫాదర్ చేయడం. శరీరము గురించి గానీ, సంబంధాల గురించి గానీ, ధనము గురించి గానీ ప్రశ్నలు ఉండవచ్చు. అన్ని ప్రశ్నలకు జవాబు బ్రహ్మాబాబా జీవితమే. ఉదాహరణకు ఈ రోజుల్లో సైన్సువారు ప్రతి ప్రశ్నకు జవాబును కంప్యూటర్ను అడుగుతారు. ఎందుకంటే మనిషి బుద్ధి కంటే ఈ కంప్యూటర్ ఆక్యురేట్ అని భావిస్తారు. తయారుచేసేవారి కంటే తయారైన వస్తువే ఆక్యురేట్ అని భావిస్తున్నారు. కానీ సైలెన్స్ వారు అయిన మీకు బ్రహ్మాబాబా జీవితమే ఖచ్చితమైన కంప్యూటర్. అందువలన ఏమిటి? ఎందుకు? అనేందుకు బదులుగా వారి జీవితమనే కంప్యూటర్లో చూడండి. ఎలా? ఏమిటి? అనే ప్రశ్న 'ఇలా' లోకి పరివర్తన అయిపోతుంది. ప్రశ్నచిత్తులకు బదులుగా ప్రసన్నచిత్తులుగా అవుతారు. ప్రశ్నచిత్తులు అలజడి బుద్ధి గలవారు, అందుకే ప్రశ్న చిహ్నము కూడా వంకరగా ఉంటుంది. ప్రశ్న వ్రాస్తే వంకర టింకరగా ఉంటుంది కదా. ప్రసన్నచిత్తులంటే బిందువు. మరి బిందువులో ఏదైనా వంకరతనముందా? నలువైపులా ఒకే విధంగా ఉంటుంది. బిందువును ఎటువైపు నుండి చూసినా ఒకే రకంగా చూస్తారు మరియు ఒకే విధంగా చూస్తారు. నేరుగా చూసినా, తలక్రిందులుగా చూసినా ఒకే విధంగా ఉంటుంది. ప్రసన్నచిత్తులనగా ఏకరస స్థితిలో ఒక్క తండ్రినే అనుసరించేవారు. అయినా సారమేం లభించింది? సాకార రూపమైన బ్రహ్మా తండ్రిని ఫాలో చేయండి లేక ఆకార రూప బ్రహ్మా తండ్రిని ఫాలో చేయండి. బ్రహ్మా తండ్రినైనా ఫాలో చేయండి లేక శివబాబానైనా ఫాలో చేయండి కానీ మాట అయితే అదే - 'ఫాలో ఫాదర్'. అందుకే బ్రహ్మా మహిమ - 'బ్రహ్మా వందే జగద్గురుం' అని అంటారు. ఎందుకంటే ఫాలో చేయడంలో సాకార రూపంలో, సాకార జగత్తు కొరకు బ్రహ్మా నిమిత్తంగా అయ్యారు. మీరందరూ స్వయాన్ని శివకుమారుడు, శివకుమారి అని పిలుచుకోరు. బ్రహ్మాకుమార్-బ్రహ్మాకుమారి అని పిలువబడ్తారు. సాకార రచనకు నిమిత్తంగా, సాకార శ్రేష్ఠ జీవితానికి స్యాంపుల్ గా బ్రహ్మాయే అవుతారు. అందుకే సద్గురువు అని శివబాబాను అంటారు. నేర్పించేవారిని కూడా గురువని అంటారు. జగత్తు ముందు నేర్పించేందుకు బ్రహ్మాయే నిమిత్తంగా అవుతారు. కావున ప్రతి కర్మలో ఫాలో చెయ్యాలి. ఈ లెక్కన బ్రహ్మాను జగద్గురువని అంటారు, అందుకే జగత్తు బ్రహ్మాకు వందనం చేస్తుంది. జగత్పిత అనే టైటిల్ కూడా బ్రహ్మాకు ఉంది. విష్ణువును లేక శంకరుడిని ప్రజాపిత అని అనరు. వారిని యజమాని పరంగా పతి అని అంటారు కానీ వాస్తవానికి వారు తండ్రి. జగత్తుకు ఎంత ప్రియమైన వారో అంత జగత్తుకు అతీతంగా అయి ఇప్పుడు అవ్యక్త రూపంలో 'ఫాలో అవ్యక్త స్థితి భవ' అనే పాఠాన్ని చదివిస్తున్నారు. అర్థమయిందా? ఏ ఆత్మకు కూడా ఇటువంటి అతీతత్వము ఉండదు. ఈ అతీత బ్రహ్మా కథను తర్వాత వినిపిస్తాను.

ఈ రోజు శరీరాన్ని కూడా సంభాళించాలి. అద్దెకు తీసుకున్నప్పుడు శరీరాన్ని, స్థానాన్ని శక్తి ప్రమాణంగా కార్యములో వినియోగించేవారే మంచి యజమాని. అయినా బాప్ దాదా, ఇరువురి శక్తిశాలి పాత్రను రథాన్ని నడిపించేందుకు నిమిత్తంగా అయ్యారు. ఇది కూడా డ్రామాలో విశేష వరదానానికి ఆధారమయింది. చాలామంది పిల్లలకు ఈ రథమే నిమిత్తంగా ఎందుకు అయ్యింది? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. వేరేవారికే కాదు, ఈ ప్రశ్న గుల్జార్ దాదీకి కూడా వస్తుంది. కానీ ఎలాగైతే బ్రహ్మాకు కూడా వారి జన్మల గురించి తెలియదో అలా వీరు కూడా తన వరదానాన్ని మర్చిపోయారు. వీరికి ఈ విశేష వరదానం సాకార బ్రహ్మాకు ఆదిలో సాక్షాత్కారమైన సమయంలో లభించింది. బ్రహ్మాబాబాతో పాటు ఆది సమయంలో ఏకాంతంలో తపస్వీ స్థానంలో ఈ ఆత్మ యొక్క విశేషమైన సాక్షాత్కార పాత్రను చూసి, బ్రహ్మాబాబా వీరి సరళ స్వభావాన్ని, అమాయక జీవితం యొక్క విశేషతను చూసి – “ఎలాగైతే ఇప్పుడు ఈ పాత్రలో ఆదిలో బ్రహ్మా, శివబాబాకు సాథీగా అయ్యారు మరియు తోడుగా కూడా ఉన్నారో అలా ముందు-ముందు తండ్రికి సాథీగా అయ్యే, సమానంగా అయ్యే కర్తవ్యాన్ని కూడా సంభాళిస్తారు, బ్రహ్మాబాబా సమానంగా సేవలో పాత్ర అభినయిస్తారు” అనే వరదానమునిచ్చారు. కనుక అదే వరదానము భాగ్యపురేఖగా అయింది. బ్రహ్మాబాబా సమానంగా రథంగా అయ్యే పాత్ర చేయడం నిశ్చయింపబడింది. అయినా బాప్ దాదా ఈ పాత్రను అభినయించేందుకు ఈ బిడ్డకు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఇంత సమయం ఇంత శక్తిని అడ్జస్ట్ చేసుకోవడం, అడ్జస్ట్ చేసుకునే విశేషత అనే లిఫ్ట్ కారణంగా అదనపు గిఫ్ట్ ఉంది. అయినా బాప్ దాదాకు శరీర అవసరాలన్నీ చూడాల్సి వస్తుంది. వాయిద్యం పాతది, నడిపించేవారు శక్తిశాలిగా ఉన్నారు. అయినా హాజీ హాజీ అనే పాఠం కారణంగా బాగా నడుస్తోంది. కాని బాప్ దాదా కూడా విధి మరియు యుక్తి పూర్వకంగానే కార్యము నడిపిస్తున్నారు. కలుసుకునే ప్రతిజ్ఞ అయితే ఉంది కానీ విధి, సమయమనుసారంగా పరివర్తన అవుతూ ఉంటుంది. ఇప్పుడు 18వ సంవత్సరంలో అన్నీ వినిపిస్తాను. 17 అయితే పూర్తి చేయాల్సిందే. అచ్ఛా.

ఫాలో ఫాదర్ చేసే సహజ పురుషార్థీ పిల్లలందరికీ, సదా ప్రసన్న చిత్తులుగా ఉండే విశేష ఆత్మలకు, సదా చేయించేవారిగా అయ్యి దేహంతో కర్మలు చేయించే మాస్టర్ రచయితలైన పిల్లలకు - ఇటువంటి బాప్ దాదా స్నేహానికి జీవితం ద్వారా బదులు ఇచ్చే పిల్లలకు, స్నేహ సంపన్నమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.

టీచరు అక్కయ్యలతో -అవ్యక్త బాప్ దాదా కలయిక

1. టీచర్లు సదా స్వ స్థితి ద్వారా స్వయం కూడా ముందుకెళ్లేవారు, ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్లేవారు. ముందుకు వెళ్లాలి, ముందుకు తీసుకెళ్లాలి. ఇదే టీచర్ల విశేషమైన లక్ష్యము మరియు లక్షణం కూడా. సదా తండ్రి సమానంగా మాస్టర్ సర్వ శక్తివంతులైన ఆత్మలుగా అయి ముందుకు వెళ్తూ, ముందుకు తీసుకెళ్తూ వెళ్ళండి. మీరు త్యాగముతో భాగ్యాన్ని తయారు చేసుకునే శ్రేష్ఠమైన ఆత్మలు, సదా త్యాగమే భాగ్యము. శ్రేష్ఠమైన భాగ్యము, శ్రేష్ఠమైన కర్మ, శ్రేష్ఠమైన ఫలము - సదా ఈ ప్రత్యక్ష ఫలముతో స్వయాన్ని, ఇతరులను ఎగిరిస్తూ వెళ్లండి. స్వయాన్ని ప్రతి కర్మలో నిమిత్తంగా భావించడమే శ్రేష్ఠంగా అయ్యేందుకు సహజ సాధనము. సేవాధారిగా అవ్వడం కూడా ఈ సంగమ యుగంలో విశేషమైన భాగ్యానికి గుర్తు. సేవ చేయడం అనగా జన్మ జన్మలకు సంపన్నంగా అవ్వడం, ఎందుకంటే సేవ ద్వారా జమా అవుతుంది అంతేకాక జమా అయిన దానిని అనేక జన్మలు తింటూ ఉంటారు. ఒకవేళ సేవలో జమా అవుతూ ఉంది అనే స్మృతి ఉంటే సదా సంతోషంగా ఉంటారు. సంతోషము కారణంగా ఎప్పుడూ అలసిపోరు. సేవ అలసిపోకుండా చేస్తుంది. సంతోషాన్ని అనుభవం చేయిస్తుంది.

సేవాధారులంటే తండ్రి సమానమైనవారు. కనుక సమానతను చెక్ చేసుకొని తండ్రి సమానంగా అయి ఇతరులను కూడా తండ్రి సమానంగా చేస్తూ ఉండండి. సెంటర్లలోని వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసేందుకు ఒకటి రెండు సార్లు సెంటర్లు తిరుగుతూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేసే ప్రోగ్రాంలను తయారుచెయ్యండి. శక్తిశాలి వాతావరణం చాలా విషయాల నుండి స్వతహాగా దూరం చేస్తుంది. ఇప్పుడు స్వయం క్వాలిటీ వారిగా అయి క్వాలిటీ వారిని తయారు చేస్తూ వెళ్ళండి. అచ్ఛా.

2. అందరూ స్వయాన్ని ఎలాంటి మణిగా భావిస్తున్నారు? (సంతుష్ట మణి). ఈనాటి సమయంలో విశేషంగా సంతుష్టత యొక్క అవసరమే ఉంది. పూజలు కూడా ఎక్కువగా ఏ దేవికి జరుగుతాయి? "సంతోషి మాతకు". సంతోషి మాతను సంతోషపరచడం కూడా సహజంగా అవుతుంది. సంతోషి మాత త్వరగా సంతృప్తి చెందుతారు. సంతోషి మాతను ఎందుకు పూజిస్తారు? ఎందుకంటే ఈ రోజులలో టెన్షన్ చాలా ఉంది, వ్యాకులతలు చాలా ఉన్నాయి, వీటి కారణంగా అసంతుష్టత పెరుగుతూ ఉంది, అందుకే సంతుష్టంగా ఉండేందుకు సాధనాలను గురించి అందరూ ఆలోచిస్తారు. కానీ అలా ఉండలేరు. కావున ఇటువంటి సమయంలో మీరందరూ సంతుష్ట మణులుగా అయి సంతుష్టతా ప్రకాశాన్ని ఇవ్వండి. మీ సంతుష్టత యొక్క ప్రకాశంతో ఇతరులను కూడా సంతుష్టపరచండి. మొదట స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండండి, తర్వాత సేవలో సంతుష్టంగా ఉండండి, తర్వాత సంబంధాలలో సంతుష్టంగా ఉండండి. అప్పుడే సంతుష్టమణి అని అంటారు. సంతుష్టతకు కూడా మూడు సర్టిఫికెట్లు కావాలి. స్వయంతో, సేవతో, సాథీలు (తోడుగా ఉన్నవారు)తో - ఈ మూడు సర్టిఫికెట్లు తీసుకున్నారు కదా! మంచిది. అయినా ప్రపంచములోని ఆందోళన నుండి బయటపడి అచలంగా ఉన్న ఇంటికి చేరుకున్నారు. తండ్రి ఉండే ఈ స్థానము "అచల్ ఘర్" (చలించని గృహము). కనుక ఇక్కడకు చేరుకోవడం కూడా గొప్ప భాగ్యానికి గుర్తు. త్యాగం చేసినందుకు "అచల్ ఘర్" లోకి చేరుకున్నారు. భాగ్యశాలురుగా అయ్యారు. కానీ భాగ్యరేఖ ఇంకా ఎంత పొడవుగా గీసుకోవాలనుకుంటే అంత గీసుకోగలరు. భాగ్యవంతుల లిస్టులోకైతే వచ్చేశారు. ఎందుకంటే భగవంతునికి చెందినవారిగా అయ్యారంటే భాగ్యశాలురుగా అయ్యారు. ఇతర అన్నిటి నుండి దూరమై ఒక్కరినే మీ వారిగా చేసుకున్నారు - కనుక భాగ్యశాలురుగా అయ్యారు. బాప్ దాదా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషంగా ఉన్నారు. ఏం జరిగినా త్యాగము మరియు సేవ చేసే ధైర్యములో శ్రేష్ఠంగా ఉన్నారు. చిన్నవారైనా, కొత్తవారైనా మీరు చేసిన త్యాగానికి, ధైర్యానికి బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. అదే గౌరవంతో బాప్ దాదా మిమ్ములను చూస్తున్నారు. నిమిత్తంగా అయినందుకు కూడా మహత్వముంది. ఈ మహత్వంతో సదా ముందుకు వెళ్తూ విశ్వంలో మహాన్ ఆత్మలుగా అయి ప్రసిద్ధమవుతారు. కనుక మీ గొప్పతనము గురించి తెలుసు కదా! ఎంత మహాన్గా ఉన్నారో అంత నమ్రచిత్తులుగా ఉన్నారు. ఎలాగైతే ఫలదాయక వృక్షానికి గుర్తు – వంగి ఉండడమో, అలాగే ఎవరైతే నమ్రచిత్తులుగా ఉంటారో, వారే ప్రత్యక్ష ఫలాన్ని తినేవారు. సంగమయుగ విశేషత ఇదే. అచ్ఛా.

కుమారులతో అవ్యక్త బాప్ దాదా యొక్క కలయిక:-

కుమారులు అనగా సదా కొరకు బలహీనతలకు విడాకులిచ్చేవారు. అర్థకల్పానికి బలహీనతకు విడాకులిచ్చేశారు కదా లేక ఇంకా ఇవ్వలేదా? ఎవరైతే సదా సమర్థులుగా ఉన్నారో వారి ముందుకు బలహీనత రాలేదు. సదా సమర్థంగా ఉండడం అనగా బలహీనతను సమాప్తం చెయ్యడం. ఇటువంటి సమర్థమైన ఆత్మలు తండ్రికి కూడా ప్రియమైనవారు, పరివారానికి కూడా ప్రియమైనవారు. కుమారులు అనగా తమ ప్రతి కర్మ ద్వారా అనేకమందికి శ్రేష్ఠ కర్మల రేఖను గీసేవారు. స్వయం యొక్క కర్మల రేఖలు, ఇతరుల కర్మల రేఖలను తయారు చేసేందుకు నిమిత్తులుగా అవ్వాలి. ఇటువంటి సేవాధారులుగా ఉన్నారా? కనుక ప్రతి కర్మలో - నా ప్రతి కర్మ స్పష్టంగా, ఇతరులకు కూడా కర్మ రేఖ స్పష్టంగా కనిపించేలా ఉందా అని చెక్ చేసుకోండి. ఇలా శ్రేష్ఠ కర్మల శ్రేష్ఠ ఖాతాను సదా జమా చేసుకునే విశేషాత్మలనే సత్యమైన సేవాధారులని అంటారు. స్మృతి మరియు సేవ - సదా ముందుకు వెళ్లేందుకు సాధనం ఇదే. స్మృతి శక్తిశాలిగా చేస్తుంది. సేవ ఖజానాలతో సంపన్నంగా చేస్తుంది. స్మృతి మరియు సేవ ద్వారా ముందుకు వెళ్తూ ఉండండి, ఇతరులను ముందుకు తీసుకెళ్తూ ఉండండి. అచ్ఛా.

Comments