19-12-1983 అవ్యక్త మురళి

19-12-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

''పరమాత్మ ప్రేమ - నిస్వార్ధమైన ప్రేమ.''

ఈ రోజు స్నేహసాగరుడైన తండ్రి తన స్నేహీ పిల్లలను చూస్తున్నారు. అందరూ స్నేహీ పిల్లలే అయినా నెంబర్వారిగా ఉన్నారు. ఒకరు స్నేహం చేసేవారు, ఇంకొకరు స్నేహం నిలబెట్టుకొనేవారు. మూడవవారు సదా స్నేహం స్వరూపులుగా అయ్యి స్నేహ సాగరంలో ఇమిడి ఉన్నవారు. వీరిని లవలీన పిల్లలు అని అంటారు. లవ్లీ మరియు లవలీనము- రెండిటికి తేడా ఉంది. తండ్రి వారిగా అవ్వడం అనగా స్నేహీగా, లవలీనముగా అవ్వడం. మొత్తం కల్పంలో ఎప్పుడూ మరియు ఎవ్వరి ద్వారా కూడా ఈ ఈశ్వరీయ స్నేహం, పరమాత్మ ప్రేమ ప్రాప్తింపజాలదు. పరమాత్మ ప్రేమ అనగా నిస్వార్ధమైన ప్రేమ. పరమాత్మ ప్రేమ ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకు ఆధారము. పరమాత్మ ప్రేమ జన్మ-జన్మల పిలుపుకు ప్రత్యక్ష ఫలము. పరమాత్మ ప్రేమ క్రొత్త జీవితానికి ప్రాణదానము. పరమాత్మ ప్రేమ లేకుంటే జీవితము నీరసంగా, ఎండిపోయిన చెరుకులాగా ఉంటుంది. పరమాత్మ ప్రేమ తండ్రికి సమీపంగా తీసుకు వచ్చేందుకు సాధనము. పరమాత్మ ప్రేమ సదా బాప్దాదాతో జతలో అనగా పరమాత్మను తోడుగా అనుభవం చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ కష్టం నుండి విడిపించి సహజంగా మరియు సదా యోగిగా, యోగయుక్త స్థితిని అనుభవం చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ సహజంగానే మూడు గమ్యాలను దాటిస్తుంది.

(1) దేహ భావపు విస్మృతి (2) దేహ సర్వ సంబంధాల విస్మృతి (3) దేహము, దేహ ప్రపంచపు అల్పకాలిక ప్రాప్తుల ద్వారా ఆకర్షించే పదార్ధాల ఆకర్షణ సహజంగా సమాప్తి అయిపోతుంది. త్యాగం చెయ్యవలసిన అవసరం ఉండదు కానీ సర్వ శ్రేష్ఠ ప్రాప్తుల భాగ్యము స్వత:గానే త్యాగం చేయిస్తుంది. కావున ప్రభు ప్రేమికులైన పిల్లలైన మీరు త్యాగం చేశారా లేక భాగ్యం తీసుకున్నారా? ఏమి త్యాగం చేశారు? అనేక అతుకులు ఉన్న వస్త్రము, శిధిలమైన పాత అంతిమ జన్మలోని దేహము. దీనిని త్యాగమని అంటారా? దీనిని స్వయం కూడా విధిలేక నడిపిస్తున్నారు. దానికి బదులుగా ఫరిస్తా స్వరూపము యొక్క లైట్ఆకారము, దీనిలో ఏ వ్యాధీ లేదు, ఏ పాత సంస్కార స్వభావాల అంశమూ లేదు, దేహం యొక్క ఏ సంబంధమూ లేదు, ఏలాటి మానసిక చంచలతా లేదు, బుద్ధి భ్రమించే ఏ అలవాటూ లేదు. ఇలాంటి ఫరిస్తా స్వరూపం, ప్రకాశమయ శరీరం ప్రాప్తించిన తర్వాత పాతదానిని వదిలేయడం, వదిలేయడం అవుతుందా? తీసుకున్నది ఏమిటి ? ఇచ్చింది ఏమిటి? ఇది త్యాగమా లేక భాగ్యమా ? అలాగే దేహం యొక్క స్వార్ధ సంబంధాలు, సుఖం-శాంతుల ప్రశాంతతను లాక్కునే సంబంధాలు. ఇప్పుడు సోదరునిగా ఉంటాడు, ఇప్పుడిప్పుడే స్వార్ధానికి వశమై శత్రువుగా అయిపోతాడు. దు:ఖమిచ్చేవారిగా, మోసగించేవారిగా అయిపోతారు. మోహం అనే తాళ్ళతో బంధించే అనేక సంబంధాలు వదిలి ఒక్కరిలోనే సర్వ సుఖాలతో నిండిన సంబంధం ప్రాప్తిస్తున్నట్లయితే ఏమి త్యాగము చేశారు? సదా తీసుకొనే సంబంధాలు వదిలేశారు, ఎందుకంటే ఆత్మలందరు తీసుకునేవారే, ఇచ్చేవారు కాదు. ఒక్క తండ్రి మాత్రమే దాతృత్వ ప్రేమను ఇచ్చేవారు. తీసుకోవాలనే ఏ కోరిక ఉండదు. ఎలాంటి ధర్మాత్మ, మహాత్మ, పుణ్యాత్మ అయినా, గుప్తదానం చేసేవారైనా తీసుకుంటారు, ఇవ్వరు. స్నేహం కూడా శుభాన్ని తీసుకోవాలి అనే కోరిక కలిగిన వారిగా ఉంటారు. తండ్రి సంపన్న సాగరుడు అందువలన వారు దాత. పరమాత్మ ప్రేమయే దాతృత్వ ప్రేమ. అందువలన వారికి ఇవ్వడం కాదు, తీసుకోవడం. అలాగే వినాశీ పదార్థాలు, విషయ భోగం అనగా విషంతో నిండిన భోగాలు, నాది-నాది అనే వలలో చిక్కుకుపోయేలా చేసే వినాశీ పదార్థాలను భోగించి, భోగించి ఎలా అయిపోయారు? పంజరంలోని పక్షిగా అయిపోయారు కదా! ఏ పదార్థాలైతే మిమ్ములను భికారులుగా చేసేశాయో వాటికి బదులుగా సర్వ శ్రేష్ఠ పదార్ధాలను ఇస్తూ పదమా పదమ పతులుగా చేస్తున్నారు. కావున పదమాలను పొంది పనికిరాని చెత్తను వదిలి పెట్టడం త్యాగం అవుతుందా? పరమాత్మ ప్రేమ భాగ్నాన్ని ఇచ్చేది. త్యాగం స్వత:గానే అయ్యే ఉంది. సహజంగా సదాకాలం కొరకు ఇటువంటి త్యాగం చేసేవారే శ్రేష్ఠమైన భాగ్యశాలురుగా అవుతారు.

అప్పుడప్పుడు కొంతమంది అల్లారు ముద్దు పిల్లలు తండ్రి ముందు మేము ఇంత త్యాగము చేశాము, ఇంత వదిలి పెట్టాము, అయినా ఇలా ఎందుకు? అని తమ అల్లారు ముద్దు గారాబాన్ని చూపిస్తారు. బాప్దాదా నవ్వుతూ పిల్లలను అడుగుతున్నారు - వదిలింది ఏమిటి? పొందింది ఏమిటి? దీని లిస్ట్తీయండి. ఎటువైపు భారం ఎక్కువగా ఉంది? వదిలిపెట్టిందా? లేక పొందిందా? ఈ రోజు కాకపోతే రేపు అయినా వదిలిపెట్టాల్సిందే. విధిలేక అయినా వదిలి పెట్టవలసే వస్తుంది. కావున మొదటి నుండే తెలివిగల వారిగా అవ్వండి. ప్రాప్తి చేసుకున్న తర్వాత వదిలి పెట్టినట్లయితే అది వదలడం అవుతుందా? తండ్రి నుండి పొందిన భాగ్యం ముందు త్యాగం గుడ్డి గవ్వలాంటిది. భాగ్యం వజ్రం లాంటిదని భావిస్తున్నారు కదా? లేక చాలా త్యాగమ చేశాము, చాలా వదిలిపెట్టామని భావిస్తున్నారా? వదిలిపెట్టేవారా లేక తీసుకునేవారా? స్వప్నంలో కూడా ఎప్పుడైనా ఇలాంటి సంకల్పం చేసినట్లయితే ఏమవుతుంది? నా భాగ్య రేఖలు నేనే చేసుకున్నాను, నేనే చెరిపేశాను అని రేఖలను తొలగించుకునేందుకు నిమిత్తంగా అవుతారు. అందువలన స్వప్నంలో కూడా ఎప్పుడూ ఇలాంటి సంకల్పం చేయకండి.

ప్రభు ప్రేమ సదా సమర్పణ భావాన్ని స్వత:గానే అనుభవం చేయిస్తుంది. సమర్పణభావం తండ్రి సమానంగా తయారుచేస్తుంది. పరమాత్మ ప్రేమ తండ్రి సర్వ ఖజానాలకు తాళంచెవి. ఎందుకంటే ప్రేమ లేక స్నేహం అధికారి ఆత్మగా తయారు చేస్తుంది. వినాశీ స్నేహం, దేహం యొక్క స్నేహం రాజ్య భాగ్యాన్ని పోగొడ్తుంది. అనేకమంది రాజులు వినాశీ స్నేహం వెనుక రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. వినాశీ స్నేహం కూడా రాజ్యభాగ్యం కంటే శ్రేష్ఠమయిందిగా అంగీకరించడం జరిగింది. పరమాత్మ ప్రేమ పోగొట్టుకున్న రాజ్యభాగ్యాన్ని సదాకాలం కొరకు ప్రాప్తి చేయిస్తుంది. డబల్రాజ్యాధికారిగా చేస్తుంది. స్వరాజ్యం మరియు విశ్వరాజ్యాన్ని పొందుతారు. ఇలాంటి పరమాత్మ ప్రేమ ప్రాప్తి చేసుకునే మీరు విశేష ఆత్మలు. కావున ప్రేమించేవారు కాదు కాని ప్రేమలో సదా ఇమిడిపోయిన లవలీన ఆత్మలుగా అవ్వండి. ఇమిడిపోయి సమానంగా ఉన్నామని అనుభవం చేస్తున్నారు కదా!

కొత్త కొత్తవాళ్ళు వచ్చారు. వారు ముందుకు వెళ్లేందుకు కేవలం ఒక్క విషయం పై గమనముంచండి. సదా ప్రభు ప్రేమకు దాహముతో ఉన్నవారిగా కాక ప్రభు ప్రేమకు పాత్రులుగా అవ్వండి. పాత్రులుగా అవ్వడమే సుపుత్రులుగా అవ్వడం. సహజమే కదా! కావున ఇలా ముందుకు సాగండి. మంచిది.

ఇలాంటి పాత్రుల నుండి సుపాతులుగా ఉన్న పిల్లలకు, ప్రభు ప్రేమకు అధికారీ ఆత్మలకు, ప్రభు ప్రేమ ద్వారా సర్వ శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మలకు సదా స్నేహ సాగరంలో ఇమిడిపోయి తండ్రి సమానంగా ఉన్న పిల్లలకు సర్వప్రాప్తుల భండారంతో సంపన్నంగా ఉన్న ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

ఇప్పుడు సమయానుసారంగా సకాశ్ఇచ్చే సేవ చెయ్యండి (అవ్యక్త మహా వాక్యాలు)

సమయ ప్రమాణంగా ఇప్పుడు నలువైపులా సకాశ్నిచ్చే, వైబ్రేషన్లను ఇచ్చే, మనసు ద్వారా వాయుమండలాన్ని తయారుచేసే కార్యము చేయాలి. ఇప్పుడీ సేవయే అవసరంగా ఉంది. ఎందుకంటే సమయం చాలా సున్నితమైనది రానున్నది. అందువలన తమ ఎగిరించే కళ ద్వారా ఫరిస్తాలుగా అయ్యి నలువైపులా తిరగండి. అంతేకాక ఎవరికి శాంతి కావాలో, సంతోషం కావాలో, సంతుష్టత కావాలో వారికవి అనుభూతి చేయించండి. ఈ పరిస్తాల ద్వారా శాంతి, శక్తి సంతోషం లభించిందని వారు అనుభవం చెయ్యాలి. అంత:వాహకమనగా అంతిమ స్థితి, శక్తిశాలీ స్థితియే మీ అంతిమ వాహనము. మీ ఈ రూపాన్ని ఎదురుగా ఉత్పన్నం చేసుకొని ఫరిస్తాల రూపంలో తిరగండి. సకాశ్నివ్వండి. అప్పుడు శక్తులు వచ్చేశారు..... అని పాటలు పాడ్తారు. తర్వాత శక్తుల ద్వారా సర్వశక్తి వంతుడు స్వతహాగానే సిద్ధమైపోతారు.

ఉదాహరణానికి సాకార రూపాన్ని చూశారు - ఏదైనా అటువంటి సమయము వచ్చినపుడు రాత్రి-పగలు సకాశ్నిచ్చేవారు. బలహీన(నిర్బల) ఆత్మలలో శక్తిని నింపేందుకు విశేషమైన అటెన్షన్ఉంచేవారు. రాత్రికి రాత్రి సమయం తీసి ఆత్మలలో సకాశ్ను నింపే సేవ నడిచేది. కావున ఇప్పుడు మీరందరూ లైట్మైట్హౌస్గా అయ్యి ముఖ్యంగా ఈ సకాశ్నిచ్చే సేవ చెయ్యాలి. దీనితో నలువైపులా లైట్మైట్యొక్క ప్రభావం వ్యాపించాలి. ఈ దేహ ప్రపంచంలో ఏమి జరుగుతున్నా ఫరిస్తాలైన మీరు పైనుండి సాక్షిగా అయ్యి అందరి పాత్రను చూస్తూ సకాశ్ను ఇస్తూ ఉండండి. ఎందుకంటే మీరందరూ అనంతమైన విశ్వ కళ్యాణం కొరకు నిమిత్తంగా ఉన్నారు. కావున సాక్షిగా అయ్యి ఆటనంతా చూస్తూ సకాశ్అనగా సహయోగం ఇచ్చే సేవ చెయ్యండి. సీటు నుండి దిగి సకాశ్ను ఇవ్వకండి. ఉన్నతమైన స్థితిలో స్థితమై ఇస్తే ఏ విధమైన వాతావరణము యొక్క వేడి తగలదు.

ఎలాగైతే తండ్రి ఒకే స్థానమైన అవ్యక్త వతనంలో కూర్చొని నలువైపులా ఉన్న విశ్వంలోని పిల్లలను పాలన చేస్తున్నారో అలా పిల్లలైన మీరు కూడా ఒకే స్థానంలో కూర్చుని తండ్రి సమానంగా అనంతమైన సేవ చెయ్యండి. తండ్రిని అనుసరించండి. బేహద్లో సకాశ్నివ్వండి. అనంతమైన సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకుంటే బేహద్వైరాగ్యం స్వత:గానే వస్తుంది. ఈ సకాశ్నిచ్చే సేవ నిరంతరం చెయ్యవచ్చు. ఇందులో ఆరోగ్య విషయము, సమయం యొక్క విషయము అన్నీ సహజంగా అయిపోతాతాయి. రాత్రి-పగలు ఈ బేహద్సేవలో నిమగ్నం అవ్వగలరు. బేహద్లో సకాశ్ఇచ్చినప్పుడు దగ్గరగా ఉన్నవారు కూడా స్వత:గానే సకాశ్తీసుకుంటూ ఉంటారు. ఈ బేహద్సకాశ్ను ఇచ్చినందున వాయుమండం స్వత:గానే తయారవుతుంది.

బ్రాహ్మణులైన మీరు ఆదిరత్నాలు, విశేష కాండముగా ఉన్నారు. కాండముతో అందరికీ సకాశ్చేరుకుంటుంది. కావున బలహీనులకు బలం ఇవ్వండి. మీరు పురుషార్థం చేసే సమయాన్ని ఇతరలకు సహయోగం ఇవ్వడంలో వినియోగించండి. ఇతరులకు సహయోగం ఇవ్వడం అనగా తమ కొరకు జమ చేసుకోవడము. ఇప్పుడు ''ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాల్సిందే''అనే అలను వ్యాపింప చెయ్యండి. సమాధానం (పరిష్కారం) తీసుకోవడం కాదు, పరిష్కారం ఇవ్వాలి. ఇవ్వడంలో తీసుకోవడం ఇమిడి ఉంది. ఒకవేళ ఇప్పటి నుండే స్వకళ్యాణం కొరకు శ్రేష్ఠమైన ప్లాన్తయారు చేసుకోకుంటే విశ్వ సేవలో సకాశ్లభించజాలదు. అందువలన ఇప్పుడు సకాశ్ద్వారా అందరి బుద్ధులను పరివర్తన చేసే సేవ చెయ్యండి. అప్పుడు చూడండి - సఫలత తనంతకు తానే మీ ముందు స్వయంగా వంగుతుంది. మనసా-వాచాల శక్తితో విఘ్నాల తెరను తొలగించినట్లయితే లోపల కళ్యాణం యొక్క దృశ్యము కనిపిస్తుంది.

జ్ఞాన మననంతో పాటు శుభభావన శుభకామనల సంకల్పము చేసేందుకు, సకాశ్ఇచ్చే అభ్యాసము చేసేందుకు, మానసిక మౌనము కొరకు లేక ట్రాఫిక్కంట్రోల్కొరకు మధ్యమధ్యలో సమయాన్ని నిశ్చితం చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా సెలవు లభించక పోయినా వారంలో ఒకరోజు సెలవు లభిస్తుంది కదా. దాని అనుసారంగా తమ తమ స్థానంలో కార్యక్రమాన్ని నిశ్చితం చేసుకోండి. కానీ విశేషంగా ఏకాంతవాసిగా మరియు ఖజానాలను పొదుపు చేసే కార్యక్రమాన్ని తప్పకుండా తయారు చెయ్యండి ఎందుకంటే ఇప్పుడు నలువైపులా మానసిక దు:ఖము మరియు అశాంతి మానసిక బాధలు చాలా తీవ్ర వేగంతో పెరుగుతూ ఉన్నాయి. బాప్దాదాకు విశ్వంలోని ఆత్మలపై దయ కలుగుతుంది కావున ఎంత తీవ్ర గతితో దు:ఖం యొక్క అల పెరుగుతూ ఉందో సుఖదాత పిల్లలైన మీరు అంత తీవ్రగతితో తమ మనసా శక్తితో, మనసా సేవ లేక సకాశ్నిచ్చే సేవతో, వృత్తితో నలవైపులా సుఖం యొక్క దోసిలిని అనుభవం చేయించండి. ఓ దేవాత్మలారా! పూజ్య ఆత్మలారా! మీ భక్తులకు సకాశ్నివ్వండి.

సైన్సువారు కూడా దు:ఖం సమాప్తి అయ్యే విధంగా సాధనాలు కనుక్కోవాలి అని ఆలోచిస్తారు. సాధనాలు సుఖంతో పాటు దు:ఖాన్ని కూడా ఇస్తాయి. దు:ఖం కలగరాదు కేవలం సుఖం మాత్రమే ప్రాప్తించాలి అని తప్పకుండా ఆలోచిస్తారు. కానీ స్వయం తమ ఆత్మలోనే అవినాశీ సుఖం యొక్క అనుభవం లేకుంటే ఇతరులకు ఎలా ఇవ్వగలరు. మీ అందరి వద్ద సుఖం, శాంతి, నిస్వార్ధమైన సత్యమైన ప్రేమ యొక్క స్టాకు జమ ఉంటే దానిని దానమివ్వండి. మేము నలువైపులా శక్తిశాలి స్మృతి వైబ్రేషన్లను వ్యాపింప చెయ్యాలి అని విశేష గమనముంచండి. ఉదాహరణానికి ఎత్తైన టవర్ఉంటే అది సకాశ్ను ఇస్తుంది. దానితో లైట్మైట్ను వ్యాపింప చేస్తారు. అలాగే ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉంటూ రోజులో తక్కువలో తక్కువ నాలుగు గంటలు మేము ఉన్నతోన్నతమైన స్థానంలో కూర్చొని విశ్వానికి లైట్మైట్ఇస్తున్నాను అని భావించండి. ఇప్పుడు తీవ్రమైన (ఫాస్ట్) సేవ మొదలు పెట్టమని బాప్దాదా పిల్లలను కోరుతున్నారు. ఇంతవరకు ఏదైతే జరిగిందో అది చాలా బాగుంది. ఇప్పుడు సమయ ప్రమాణంగా ఇతరులకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఇతరులను మైక్గా తయారు చెయ్యండి. మీరు మైట్గా అయ్యి సకాశ్ఇవ్వండి. అప్పుడు మీ సకాశ్మరియు వారి వాణి, డబల్పని చేస్తాయి.

పార్టీలతో -

ప్రశ్న :- మహా తపస్సు అంటే ఏది? ఆ తపస్యా బలము విశ్వాన్ని పరివర్తన చెయ్యగలదా?

జవాబు :- ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు - దీనినే మహా తపస్సు అని అంటారు. ఇలాంటి స్థితిలో స్థితమై ఉండేవారు మహా తపస్వీలు. తపస్సు యొక్క బలాన్ని శ్రేష్ఠ బలము అని గాయనం చేయడం జరుగుతుంది. ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేరు అనే తపస్సులో ఉండేవారిలో చాలా బలం ఉంటుంది. ఈ తపస్యా బలం విశ్వాన్ని పరివర్తన చేస్తుంది. హఠయోగులు ఒంటి కాలి పై నిలబడి తపస్సు చేస్తారు కాని పిల్లలైన మీరు ఒక్క కాలి పై కాదు ఒక్కరి స్మృతిలోనే ఉంటారు. ఒక్కరంటే ఒక్కరు అంతే. ఇలాంటి తపస్సు విశ్వాన్ని పరివర్తన చేస్తుంది. కనుక ఇలాంటి విశ్వ కళ్యాణకారులుగా అనగా మహా తపస్వీలుగా అవ్వండి. మంచిది.

Comments