19-04-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంగమయుగం యొక్క ప్రభుఫలం తినటం ద్వారా సర్వప్రాఫులు లభిస్తాయి.
ఈ రోజు బాప్దాదా తన సర్వ స్నేహీ పిల్లలకు స్నేహానికి బదులు ఇవ్వడానికి, మిలనం చేసేందుకు, స్నేహానికి ప్రత్యక్ష ఫలం, స్నేహ భావనకు శ్రేష్ఠ ఫలాన్ని ఇచ్చేందుకు పిల్లల సంఘటనలోకి వచ్చారు. భక్తిలో కూడా స్నేహం మరియు భావన భక్త-ఆత్మల రూపంలో ఉండేది. కనుక భక్తుల రూపంలో భక్తి ఉండేది కానీ శక్తి ఉండేది కాదు. స్నేహం ఉండేది కానీ తండ్రి పరిచయం మరియు తండ్రితో సంబంధం శ్రేష్ఠంగా ఉండేవి కాదు. భావన ఉండేది కానీ అల్పకాలిక కోరికలతో నిండిన భావన ఉండేది. ఇప్పుడు కూడా స్నేహం మరియు భావన ఉంది కానీ స్నేహం సమీప సంబంధం ఆధారంతో ఉంది. అధికారీతనపు శక్తి ఉంది, అనుభవం అధారిటీతో శ్రేష్ఠ భావన ఉంది. భికారీ తనపు భావన మారి, సంబంధం మారి, అధికారిననే నిశ్చయం మరియు నశా పెరిగింది. ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు సదా ప్రత్యక్ష ఫలం ప్రాప్తించింది. అందరూ ప్రత్యక్ష ఫలాన్ని అనుభవము చేసిన అనుభవీ ఆత్మలుగా ఉన్నారా? ప్రత్యక్ష ఫలం తిని చూశారా? ఇతర ఫలాలు అయితే సత్యయుగంలో కూడా లభిస్తాయి ఇప్పుడు కలియుగం యొక్క ఫలాలు కూడా చాలా తిన్నారు. కానీ సంగమ యుగంలోని ప్రభు ఫలము, ప్రత్యక్ష ఫలము ఇప్పుడు తినకపోయినట్లయితే మొత్తం కల్పంలో ఎప్పుడూ తినలేరు. బాప్దాదా పిల్లలందరినీ అడుగుతున్నారు - ప్రభుఫలం, అవినాశీ ఫలం అయిన సర్వ శక్తులు, సర్వ గుణాలు, సర్వ సంబంధాల స్నేహ రసంతో నిండిన ఫలం తిన్నారా? అందరూ తిన్నారా లేక ఎవరైనా మిగిలిపోయారా? ఇది ఈశ్వరీయ ఇంద్రజాలపు ఫలము. ఈ ఫలాన్ని తింటే ఇనుము నుండి బంగారము కంటే ఎక్కువ వజ్రంగా తయారైపోతారు. ఈ ఫలంతో ఏ సంకల్పము చేస్తే అది ప్రాప్తి చేసుకోగలరు. ఇది అవినాశీ ఫలం, అవినాశీ ప్రాప్తి. ఇలాంటి ప్రత్యక్ష ఫలం తినేవారు సదా మాయ రోగాల నుండి ఆరోగ్యంగా ఉంటారు. దు:ఖం నుండి, అశాంతి నుండి, సర్వ విఘ్నాల నుండి సదా దూరంగా ఉండే అమర ఫలం లభించింది! తండ్రివారిగా అవ్వడం మరియు ఇలాంటి శ్రేష్ఠ ఫలము ప్రాప్తించడం. ఇది ఎంత అద్భుతం!
ఈ రోజు బాప్దాదా ఇప్పుడు వచ్చిన విశేష పాండవ సైన్యాన్ని చూసి హర్షితమైతే అవుతున్నారు. హర్షితమవ్వడంతో పాటు బ్రహ్మాబాబా సహచరులతో(హంజిన్స్తో) సదా పార్టీ చేసుకుంటారు. పిక్నిక్కూడా జరుపుకుంటారు. కావున ఈ రోజు ఈ ప్రభు ఫలంగా పిక్నిక్జరుపుతున్నారు. లక్ష్మీ-నారాయణులు కూడా ఇటువంటి పిక్నిక్జరుపుకోరు. ఇది బ్రహ్మాబాబా మరియు బ్రాహ్మణుల అలౌకిక పిక్నిక్. బ్రహ్మాబాబా సహచరులను చూసి సంతోషిస్తారు కానీ సహచరులుగానే అవ్వాలి. సహచరులు అనగా ప్రతి అడుగులో తండ్రిని అనుసరించేవారు, సమాన సాథీలు. ఇటువంటి సహచరులు కదా? లేక ఇంకా ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అని ఆలోచిస్తున్నారా? ఆలోచించేవారా? లేక సమానంగా చేసేవారిగా ఉన్నారా? సెకండులో వ్యాపారం చేసేవారా? లేక ఇంకా ఆలోచించేందుకు సమయం కావాలా? వ్యాపారం చేసి వచ్చారా లేక వ్యాపారం చేసేందుకు వచ్చారా? అనుమతి ఎవరికి లభించింది? అందరూ ఫారాలు నింపారు కదా? లేక చిన్న-చిన్న బ్రాహ్మణీలకు మాటలు చెప్పి చేరుకున్నారా? ఇటువంటి మధురాతి మధురమైన మాటలు చాలా మాట్లాడ్తారు, బాప్దాదా వద్దకు అందరి మానసిక స్వచ్ఛత చతురతలు రెండూ చేరుతాయి. నియమ ప్రమాణంగా వ్యాపారము చేసి రావాలి. కానీ మధువనానికి చాలామంది వ్యాపారం చేసేవారు కూడా వచ్చేస్తారు. చేసి వచ్చేందుకు బదులు ఇక్కడకు వచ్చి వ్యాపారం చేస్తారు. అందువలన బాప్దాదా క్వాంటిటీ(సంఖ్య)లో క్వాలిటీ(నాణ్యత)ని చూస్తున్నారు. క్వాంటిటీకి తన విశేషత ఉంది, క్వాలిటీకి కూడా తన విశేషత ఉంది. రెండూ కావాలి కదా! పుష్పగుచ్ఛంలో వెరైటీ(రకరకాల) రంగు, రూపం కల్గిన పుష్పాలతో అలంకరణ ఉంటుంది. అందులో ఆకులు కూడా లేకపోతే పుష్పగుచ్ఛం శోభించదు. కావున బాబా ఇంటికి అందరూ శృంగారముగా అయితే అయ్యారు. అందరి నోటి నుండి 'బాబా' అనే శబ్ధం తప్పకుండా వెలువడుతుంది. పిల్లలు ఇంటికి శృంగారంగా ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ఈ ఓంశాంతి భవనంలోని హాలు మీ అందరూ రావడం వలన శృంగారించబడింది కదా! కావున ఇంటికి శృంగారం తండ్రికి శృంగారం అయిన మీరు సదా మెరుస్తూ ఉండండి. క్వాంటిటీ నుండి క్వాలిటీలోకి పరివర్తన అయిపోండి. అర్థమయ్యిందా - ఈ రోజు కేవలం కలుసుకునే రోజు అయినా బ్రహ్మాబాబాకు సహచరులంటే ఇష్టమైపోయింది. అందువలన పికినిక్చేశారు. మంచిది.
సదా ప్రభుఫలం తినేందుకు అధికారులకు, సదా బ్రహ్మాబాబా సమానంగా సెకండులో వ్యాపారము చేసేవారు ప్రతి కర్మలో కర్మయోగులుగా ఉన్నవారు, బ్రహ్మాబాబాను అనుసరించేవారు, ఇటువంటి బాప్సమానంగా ఉన్న విశేష ఆత్మలకు, నలువైపులా ఉన్న క్వాలిటీ మరియు క్వాంటిటీ పిల్లలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్దాదా కలయిక
అధర్కుమారులతో :- 1. సదా స్వయాన్ని విశ్వంలో కోట్లలోని కొద్దిమందిలో మేము ఉన్నామని అనుభవం చేస్తున్నారా? కోటానుకోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా నేను ఒకడిని అనే మాట విన్నప్పుడంతా ఆ ఒక్కరు నేనే అని భావిస్తున్నారా? యథా విధంగా(ఉన్నదున్నట్లుగా) పాత్ర రిపీట్అవుతున్నట్లయితే ఆ రిపీట్అయ్యే పాత్రలో ప్రతి కల్పము విశేషంగా మీరే ఉంటారు కదా! ఇలాంటి స్థిరమైన విశ్వాసం ఉండాలి. సదా నిశ్చయబుద్ధి గలవారుగా ఉన్నవారు అన్ని విషయాలలో నిశ్చింతగా ఉంటారు. నిశ్చయానికి గుర్తు నిశ్చింతత. మొత్తం చింతలన్నీ తొలగిపోయాయి. తండ్రి చింతలనే చితి నుండి రక్షించారు కదా! చింతలనే చితి నుండి పైకి తీసి హృదయ సింహాసనము పై కూర్చోబెట్టుకున్నారు. తండ్రితో లగ్నము (ఏకాగ్రత) కుదిరింది మరియు ఈ లగ్నము ఆధారంతో ఏకాగ్రత అనే(లగ్నమనే) అగ్నిలో చింతలన్నీ అసలు లేనే లేవు అన్నట్లుగా సమాప్తమైపోయాయి. ఒక్క సెకండులో సమాప్తమైపోయాయి కదా! ఇలాంటి శుభ చింతక ఆత్మలుగా స్వయాన్ని అనుభవం చేస్తున్నారా? ఎప్పుడూ చింత ఉండడం లేదు కదా! శరీరం గురించిన చింతా లేదు, మనసులో ఎలాంటి వ్యర్థ చింతా లేదు. మరియు ధనం గురించి చింత కూడా లేదు, ఎందుకంటే పప్పు, రొట్టె అయితే తినాలి మరియు తండ్రి గుణాలను గానం(కీర్తన) చెయ్యాలి. పప్పు, రొట్టె అయితే తప్పకుండా లభిస్తుంది కావున ధనం గురించిన చింత లేదు, మనసు గురించిన చింతా లేదు అంతేకాకా శరీరం యొక్క కర్మభోగం గురించిన చింత కూడా లేదు. ఎందుకంటే ఇది అంతిమ జన్మ, అంతిమ సమయమని తెలుసు. దీనిలోనే అన్నీ సమాప్తమవ్వాలని తెలుసు. అందువలన సదా శుభ చింతకులుగా ఉంటారు. ఏమవుతుంది అనే చింత ఏదీ ఉండదు. జ్ఞానశక్తితో అంతా తెలుసుకున్నారు. అంతా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ప్రశ్నలు సమాప్తమైపోతాయి ఎందుకంటే ఏది జరిగినా మంచి కంటే మంచిగానే(చాలా మంచిగా) జరుగుతుంది అనే జ్ఞానం ఉంది. కావున సదా శుభ చింతకులుగా, సదా అన్ని చింతలతో అతీతంగా ఉన్న నిశ్చయబుద్ధి గల నిశ్చింత ఆత్మలుగా ఉంటారు. జీవితం అంటే ఇదే కదా! ఒకవేళ జీవితంలో నిశ్చింతత లేకుంటే ఆ జీవితం జీవితమే కాదు. ఇటువంటి శ్రేష్ఠ జీవితాన్ని అనుభవం చేస్తున్నారా? పరివారం గురించిన చింత కూడా లేదు కదా? ప్రతి ఒక్క ఆత్మ తమ లెక్కాచారాలను సమాప్తి కూడా చేసుకుంటున్నారు, అంతేకాక తయారు కూడా చేసుకుంటున్నారు. ఇందులో మనం దేనిని గురించి చింత చెయ్యాలి? ఏ చింతా లేదు. మొదట చితి పైన కాలిపోతూ ఉండేవారు. ఇప్పుడు తండ్రి అమృతం పోసి కాలిపోతున్న చితి నుండి మరజీవులుగా తయారు చేశారు, జీవింపజేశారు. ఉదాహరణానికి చనిపోయిన వారిని బ్రతికించారని అంటారు కదా! కనుక తండ్రి అమృతం త్రాగించి అమరులుగా చేశారు. చనిపోయిన శవంలాగా ఉండేవారు ఇప్పుడు ఎలా అయ్యారో చూడండి శవంలాగా ఉన్నవారు మహోన్నతంగా అయిపోయారు. మొదట ఏ ప్రాణమూ లేదు కావున శవం సమానమనే అంటారు కదా! భాష కూడా ఏ భాష మాట్లాడేవారు, అజ్ఞానీ మనుషులు చచ్చిపోండి అని అనేవారు లేక మేము చచ్చిపోతే చాలా బాగుంటుంది అని అనేవారు కదా! ఇప్పుడైతే మరజీవులుగా అయిపోయారు, విశేష ఆత్మలుగా అయిపోయారు. ఈ సంతోషం ఉంది కదా. కాలిపోయే చితి నుండి అమరులుగా అయిపోయారు. ఇదేమైనా తక్కువ విషయమా? ఇంతకు ముందు భగవంతుడు చనిపోయిన వారిని బ్రతికిస్తారు అని వినేవారు కదా! కాని ఎలా చేస్తారో అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు మనమే జీవితులుగా అయ్యామని అర్థం చేసుకున్నారు. కనుక సదా నశా మరియు సంతోషంలో ఉండండి.
టీచర్లతో :- సేవాధారుల విశేషత ఏమిటి? సేవాధారులనగా(మూడవ) కన్ను తెరుచుకోవాలి, అంతేకాక సదా తండ్రి జతలో తండ్రి సమాన స్థితిని అనుభవం చేయాలి. అమృతవేళ మహత్వాన్ని తెలుసుకున్న విశేష సేవాధారులు. విశేషమైన సేవాధారుల మహిమ - విశేష వరదాన సమయాన్ని తెలుసుకొని విశేషమైన వరదానాలను అనుభవం చెయ్యాలి. ఒకవేళ అనుభవం లేకుంటే సాధారణ సేవాధారులు, విశేషమైనవారు కాదు. విశేష సేవాధారులుగా అవ్వాలనుకుంటే విశేష అధికారాన్ని తీసుకొని విశేషంగా అవ్వగలరు. ఎవరికైతే అమృతవేళ గురించి, సంకల్పాల గురించి, సమయం మరియు సేవల గురించిన మహత్వం ఉంటుందో ఇలా అన్నిటి మహత్వాలను తెలిసినవారు విశేష సేవాధారులుగా ఉంటారు. కావున ఈ మహత్వాన్ని తెలుసుకొని మహోన్నతంగా అవ్వాలి, ఈ మహత్వాన్ని తెలుసుకొని స్వయం మీరూ మహాత్మలుగా అవ్వండి. ఇతరులకు కూడా మహత్వం గురించి తెలిపి అనుభవం చేయించి మహాన్గా(శ్రేష్ఠంగా) తయారు చెయ్యండి. మంచిది, ఓంశాంతి.
పర్సనల్(వ్యక్తిగత) అవ్యక్త మహావాక్యాలు
సఫలం చేయండి, సఫలతా మూర్తులుగా అవ్వండి - ఎలాగైతే బ్రహ్మాబాబా నిశ్చయం ఆధారంతో, ఆత్మిక నశా ఆధారంతో నిశ్చితమైన భవిష్యత్తు తెలిసిన జ్ఞాతగా సెకండులో అన్నీ సఫలం చేసుకున్నారు. స్వంతానికి ఏదీ ఉంచుకోలేదు. అంతా సఫలం చేసుకున్నారో ప్రత్యక్ష ఋజువును చూశారు. అంతిమ రోజు వరకు శరీరంతో లెటర్స్, వ్యవహారం ద్వారా సేవ చేయడం చూశారు. నోటితో మహావాక్యాలు ఉచ్ఛరించారు. చివరి రోజు కూడా సమయాన్ని, సంకల్పాన్ని, శరీరాన్ని సఫలం చేసుకున్నారు. సఫలం చేసుకోవడం అనగా మంచి వైపు అన్నీ వినియోగించడం. ఇలా సఫలం చేసుకునేవారికి సఫలత స్వతహాగానే ప్రాప్తిస్తుంది. సఫలత ప్రాప్తి చేసుకునేందుకు విశేష ఆధారము - ప్రతి సెకండు, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసుకోవాలి. సంకల్పం, మాట, కర్మ, సంబంధ-సంపర్కము ఎందులోనైనా సఫలతను అనుభవం చేసుకోవాలంటే వీటిని స్వయం పట్ల, ఇతర ఆత్మల పట్ల సఫలం చేసుకుంటూ వెళ్ళండి. వ్యర్థంగా పోనివ్వకుంటే స్వత:గానే సఫలత ద్వారా లభించిన సంతోషాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సఫలం చేయడం అనగా వర్తమానం కొరకు సఫలతా మూర్తులుగా అవ్వడం, భవిష్యత్కొరకు జమ చేసుకోవడం.
సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సమర్పణ భావం మరియు నిశ్చింత స్థితి అవసరము. సేవలో కొంచెం కూడా నాది అనే భావం మిక్స్అవ్వరాదు. ఏ విషయం గురించీ చింత ఉండరాదు. ఎందుకంటే చింత చేసేవారు సమయం కూడా పోగొట్టుకుంటారు. శక్తి కూడా వ్యర్థంగా పోతుంది, అంతేకాక పని కూడా పోగొట్టుకుంటారు. వారు ఏ కార్యము కొరకు చింత చేస్తారో ఆ పనే పాడైపోతుంది. రెండవది - సదా సఫలతా మూర్తులుగా అయ్యేందుకు సాధనం - ఒకే బలం, ఒకే నమ్మకం. నిశ్చయం సదా నిశ్చింతగా తయారుచేస్తుంది అంతేకాక నిశ్చింత స్థితి ఉన్నవారు ఏ కార్యం చేసినా అందులో తప్పకుండా సఫలమవుతారు. ఎలాగైతే బ్రహ్మాబాబా దృఢ సంకల్పంతో ప్రతి కార్యంలో సఫలతను ప్రాప్తి చేసుకున్నారో దృఢత సఫలతకు ఆధారం అయ్యిందో అలా తండ్రిని అనుసరించండి. ప్రతి ఖజానాను, గుణాలను, శక్తులను, కార్యంలో వినియోగించినట్లయితే అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. పొదుపు చేసే విధిని, జమ చేసుకునే విధిని స్వంతం చేసుకుంటే వ్యర్థ ఖాతా స్వతహాగానే పరివర్తన జరిగి సఫలమైపోతుంది. తండ్రి ద్వారా లభించిన ఖజానాలను దానం చెయ్యండి. ఎప్పుడూ స్వప్నంలో కూడా ప్రభువు ఇచ్చిన వాటిని నాది అని పొరపాటున కూడా భావించకండి. ఇది నా గుణము, నా శక్తి, ఈ 'నాది' అనేది రావడం అనగా ఖజానాలను పోగొట్టుకోవడం అవుతుంది. తమ ఈశ్వరీయ సంస్కారాలను కూడా సఫలం చేసుకుంటే వ్యర్థ సంస్కారాలు స్వత:గానే వెళ్ళిపోతాయి. ఈశ్వరీయ సంస్కారాలను బుద్ధి అనే లాకర్లో ఉంచుకోకండి. కార్యంలో వినియోగించండి, సఫలం చేయండి. సఫలం చేయడం అనగా రక్షించుకోవడం లేక పెంచుకోవడం. మనసు ద్వారా సఫలం చేయండి. వాణి ద్వారా సఫలం చేయండి. సంబంధ-సంపర్కంతో, కర్మతో తమ శ్రేష్ఠ సాంగత్యముతో, తమ శక్తిశాలీ వృత్తితో సఫలం చేయండి. సఫలం చేయడమే సఫలతకు తాళంచెవి. మీ వద్ద సమయం మరియు సంకల్పం అనే శ్రేష్ఠ ఖజానాలు ఏవైతే ఉన్నాయో వాటిని 'తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం' అనే విధానం ద్వారా సఫలం చెయ్యండి. సంకల్పాల ఖర్చు తక్కువగా ఉండాలి కాని ప్రాప్తి ఎక్కువగా ఉండాలి. సాధారణ వ్యక్తి రెండు, నాలుగు నిమిషాలు సంకల్పం నడిపించిన తర్వాత, ఆలోచించిన తర్వాత ఏ సఫలతను లేక ప్రాప్తిని చేసుకోగలరో, దానిని మీరు ఒకటి, రెండు సెకండ్లలో చేయగలరు. అలాగే వాణి మరియు కర్మలు(మాటలు, కర్మలు)తక్కువగా ఖర్చు అయ్యి సఫలత ఎక్కువగా ఉన్నప్పుడే అద్భుతం అని గాయనం చెయ్యబడ్తుంది. కనుక మీ వద్ద ఏదైతే సంపద, సమయం, సంకల్పం, శ్వాస, తనువు-మనసు-ధనం ఉన్నాయే అన్నీ సఫలం చేయండి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. రాబోయే సమయం కొరకు దాచి ఉంచుకోండి. జ్ఞాన ధనం, శక్తుల ధనం, గుణాల ధనము అన్నిటిని 'నాది' అనే దాని నుండి అతీతంగా అయ్యి ప్రతి సమయం సఫలం చేసుకుంటే జమ అవుతూ ఉంటుంది. సఫలం చేయడం అనగా కోటాను రెట్ల(పదమా గుణాల) సఫలతను అనుభవం చెయ్యడం.
ఈ బ్రాహ్మణ జీవితంలో :-
- ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకుంటారో, వారు సమయాన్ని సఫలం చేసుకున్న ఫల స్వరూపంగా వారు పూర్తి సమయం రాజ్య భాగ్యానికి రాజ్యాధికారిగా అవుతారు.
- ఎవరైతే శ్వాసలు సఫలం చేసుకుంటారో, వారు అనేక జన్మలు సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ నడుస్తూ నడుస్తూ శ్వాస ఆగి గుండె ఆగిపోదు(హార్ట్ఫెయిల్అవ్వదు).
- ఎవరైతే జ్ఞాన ఖజానాను సఫలం చేసుకుంటారో, వారు ఎటువంటి వివేకవంతులుగా అవుతారంటే వారు భవిష్యత్తులో అనేక మంత్రుల సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. స్వయం వారే వివేకవంతులై రాజ్యాన్ని నడిపిస్తారు.
- ఎవరైతే సర్వ శక్తుల ఖజానాను సఫలం చేసుకుంటారో అనగా వాటిని కార్యంలో వినియోగిస్తారో, వారు సర్వ శక్తి సంపన్నంగా అవుతారు. వారి భవిష్య రాజ్యంలో ఏ శక్తీ లోపంగా ఉండదు. సర్వ శక్తులు స్వత:గానే అఖండంగా, స్థిరంగా, నిర్విఘ్న కార్యాలు జరిగే సఫలతను అనుభవం చేయిస్తాయి.
- ఎవరైతే సర్వ గుణాల ఖజానాను సఫలం చేసుకుంటారో, వారు గుణమూర్తులుగా అవుతారు. ఈ రోజు అంతిమ సమయములో కూడా వారి జడ చిత్రాలను ''సర్వగుణ సంపన్న దేవత'' రూపంలో మహిమ జరుగుతుంది.
- ఎవరైతే స్థూల ధనం యొక్క ఖజానాను సఫలం చేసుకుంటారో వారు 21 జన్మలకు సంపన్నంగా ఉంటారు కనుక సఫలం చేయండి, సఫలతా మూర్తులుగా అవ్వండి. మంచిది.
Comments
Post a Comment