19-03-1982 అవ్యక్త మురళి

                        * 19-03-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఆత్మదర్శన గావించే దర్పణము కర్మయే

ఈరోజు సర్వశక్తివంతుడైన తండ్రి తమ శక్తిసేనను చూస్తూ హర్షితమవుతున్నారు. మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మలు ప్రతి ఒక్కరూ సర్వశక్తులను ఎంతవరకూ తమలో ధారణ చేసారు? విశేష శక్తులను గూర్చి మీకు బాగా తెలుసు మరియు తెలవడం యొక్క ఆధారము పైనే చిత్రాలను తయారుచేస్తారు. ఈ చిత్రాలు శ్రేష్ఠత లేక మహానత యొక్క చైతన్య స్వరూపానికి గుర్తులు. ప్రతి కర్మా శ్రేష్ఠముగా మరియు మహాన్‌గా ఉన్నాయి. దీని ద్వారా శక్తులను చరిత్రలోకి అనగా కర్మలోకి తీసుకువచ్చారని నిరూపింపబడుతుంది. నిర్బల ఆత్మలా లేక శక్తిశాలీ ఆత్మలా, సర్వశక్తి సంపన్నులా లేక శక్తిస్వరూపులా?... అన్న వాటిని కర్మ ద్వారానే గుర్తించగలం. ఎందుకంటే కర్మ ద్వారానే వ్యక్తులు మరియు పరిస్థితుల యొక్క సంబంధంలోకి లేక సంపర్కంలోకి వస్తారు, కావుననే కర్మ క్షేత్రము, కర్మ సంబంధం, కర్మేంద్రియాలు, కర్మ భోగము, కర్మయోగము అన్న పేర్లు ఉన్నాయి. కావున ఈ సాకారవతనము యొక్క విశేషత కర్మయే. ఏ విధంగా నిరాకారవతనము యొక్క విశేషత కర్మల నుండి అతీతముగా ఉండడమో అలాగే సాకార వతనము అనగా కర్మ, కర్మ శ్రేష్ఠముగా ఉన్నట్లయితే శ్రేష్ఠ ప్రారబ్ధము ఉంటుంది. కర్మలు భ్రష్టమైన కారణముగా దుఃఖము యొక్క ప్రారబ్ధము ఉంది, కానీ రెండింటి యొక్క ఆధారము కర్మయే. కర్మ ఆత్మను దర్శింపజేసే దర్పణము. కర్మరూపీ దర్పణము ద్వారా మీ శక్తిస్వరూపమును తెలుసుకోగలరు. కర్మ ద్వారా ఏ శక్తి యొక్క ప్రత్యక్ష రూపమూ కనిపించకపోతే, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అని ఎవరు ఎంతగా అన్నాకానీ కర్మ క్షేత్రములో ఉంటూ దానిని కర్మలో చూపించకపోతే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరైనా చాలా చురుకైన యోధుడు యుద్ధములో చాలా చురుకుగా ఉంటూ, యుద్ధమైదానములో శత్రువు ముందు యుద్ధం చేయలేకపోతే, ఓడిపోతే తాను ఒక గొప్ప యోధుడు అని ఎవరైనా అంగీకరిస్తారా? అలాగే నేను శక్తిస్వరూపమును అని మీ బుద్ధిలో భావిస్తూ పరిస్థితుల సమయంలో, సంపర్కములోకి వచ్చిన సమయంలో ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో ఆ శక్తిని కర్మలోకి తీసుకురాకపోతే, వీరు శక్తి స్వరూపులు అని ఎవరైనా అంగీకరిస్తారా? కేవలం బుద్ధి వరకూ తెలుసుకోని, ఇంట్లో కూర్చుని ఉంటూ తమను తాము గొప్పగా భావిస్తూ, కానీ సమయం వచ్చినప్పుడు స్వరూపమును చూపించకపోతే, సమయం వచ్చినప్పుడు శక్తిని కార్యములో వినియోగించకపోతే, సమయం గతించిపోయాక ఆలోచించినట్లయితే దానిని శక్తి స్వరూపము అని అంటారా? కర్మలో ఈ శ్రేష్ఠతే కావాలి. సమయాన్ని బట్టి అటువంటి శక్తిని కర్మ ద్వారా కార్యములో వినియోగించాలి. కావున రోజంతటి కర్మలీల నేను మాస్టర్ సర్వశక్తివంతునిగా ఎంతవరకూ అయ్యాను? అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.

విశేషముగా ఏ శక్తి సమయానుసారముగా విజయులుగా తయారుచేస్తుంది మరియు విశేషముగా ఏ శక్తి యొక్క బలహీనత పదే, పదే ఓటమిని చవిచూపింపజేస్తుంది? కొంతమంది పిల్లలకు తమ ఏ శక్తి బలహీనముగా ఉందో తెలుసు. ధారణాయుక్తమైన సంఘటనలో లేక తమ స్వపురుషార్థుల యొక్క వాయుమండలం ఉన్నప్పుడు దానిని గూర్చి వర్ణన కూడా చేస్తారు, కానీ సాధారణ రీతిలో వర్ణన చేస్తారు. మెజారిటీ తమ బలహీనతను ఇతరుల నుండి దాచేందుకు ప్రయత్నిస్తారు. సమయం వచ్చినప్పుడు వినిపిస్తారు కూడా! అయినా ఆ బలహీనత యొక్క బీజమును తక్కువ మందే గుర్తిస్తారు, పైపైన వర్ణన చేస్తారు. బాహ్యరూపము యొక్క విస్తారమును వర్ణన చేస్తారు. కానీ బీజము వరకూ వెళ్ళరు, కావున దాని రిజల్టు ఎలా ఉంటుంది? ఆ బలహీనత యొక్క పైపైన ఉండే శాఖలనైతే ఖండించేస్తారు, కావున కొద్ది సమయం వరకూ సమాప్తమైనట్లుగా అనుభవమవుతుంది. కానీ బీజము అలాగే ఉన్న కారణముగా కొద్ది సమయం తర్వాత పరిస్థితులు అనే నీరు తగలడంతో మళ్ళీ అదే బలహీనత యొక్క శాఖ వెలువడుతుంది. ఈ రోజుల్లోని వాయుమండలంలో ప్రపంచంలో రోగాలు అంతమవ్వడంలేదు. ఎందుకంటే రోగాల యొక్క బీజమును గూర్చి డాక్టర్లు తెలుసుకోవడం లేదు. కావున రోగం అణచిపోతుంది కానీ అది సమాప్తమవ్వదు, అలాగే ఇక్కడ కూడా బీజమును తెలుసుకొని ఆ బీజమును సమాప్తం చేయండి. చాలామందికి బీజమును గూర్చి కూడా తెలుసు కానీ తెలిసి ఉంటూ కూడా నిర్లక్ష్యము యొక్క కారణముగా అయిపోతాములే, ఒక్కసారిగా అంతమైపోదు కదా, సమయం అయితే పడుతుంది కదా... అని అంటారు. ఇలా అతి తెలివితేటలు చూపుతారు. ఏ సమయంలో శక్తిశాలిగా అవ్వవలసి ఉంటుందో ఆ సమయంలో కేవలం జ్ఞానస్వరూపులుగా అయిపోతారు, కావున జ్ఞానము యొక్క శక్తి ఉంటుంది కానీ ఆ జ్ఞానమును శక్తిరూపములో ఉపయోగించరు, పాయింట్ల రూపములో ఉపయోగిస్తారు. ప్రతి జ్ఞానము యొక్క పాయింట్ ఒక శస్త్రము, వాటిని ఆ శస్త్రము యొక్క రూపములో ఉపయోగించరు. కావున బీజమును తెలుసుకోండి, నిర్లక్ష్యులుగా అయి మీ సంపన్నతలో లేక సంపూర్ణతలో లోపమును రానివ్వకండి.

బీజమునుగూర్చి తెలుసుకున్న తర్వాత, స్వయములో దానిని గూర్చి తెలుసుకునే శక్తిని మాత్రమే కలిగియుండి, దానిని భస్మం చేసే శక్తి లేకపోతే అప్పుడు ఇతర జ్వాలా స్వరూపులైన శ్రేష్ఠ ఆత్మల యొక్క సహయోగమును కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే బలహీన ఆత్మగా ఉన్న కారణముగా నేరుగా తండ్రి ద్వారా కనెక్షన్ ను మరియు కరెక్షన్ ను తీసుకోలేరు. కావున రెండవ నెంబర్ లో ఉండే శ్రేష్ఠ ఆత్మల యొక్క సహయోగమును తీసుకొని స్వయమును వారిచే వెరిఫై చేయించుకోండి. వెరిఫై అవ్వడం ద్వారా సహజముగా ప్యూరిఫై అయిపోతారు. కావున ఏమి పరిశీలించుకోవాలో మరియు ఎలా పరిశీలించుకోవాలో అర్ధం చేసుకున్నారా?

ఒకటేమో దాచకండి, ఇంకొకటి తెలిసి ఉంటూ కూడా నిర్లక్ష్యము చేయకండి, అలా నడిపించేయకండి. అలా మీరు నడిపించేస్తే మళ్ళీ ఆర్తనాదాలు చేస్తారు. కావున ఈ రోజు బాప్ దాదా శక్తిసేన యొక్క శక్తిని చూస్తున్నారు. ఇప్పుడు ప్రాప్తించిన శక్తిని కర్మలోకి తీసుకురండి, ఎందుకంటే విశ్వంలోని సర్వాత్మల ముందు కర్మయే మీ యొక్క పరిచయమును ఇస్తుంది. కర్మ ద్వారా వారు సహజముగా తెలుసుకుంటారు. కర్మ అన్నింటికన్నా స్థూలమైనది. సంకల్పము సూక్ష్మమైన శక్తి. ఈ రోజుల్లోని ఆత్మలు స్థూలమైన బాహ్యరూపాన్ని త్వరగా తెలుసుకోగలరు. నిజానికి సూక్ష్మ శక్తి స్థూలం కన్నా చాలా శ్రేష్ఠమైనది కానీ మనుష్యులు సూక్ష్మశక్తి యొక్క వైబ్రేషన్లను అందుకోగలగడం ఇప్పుడు కష్టం. కర్మ శక్తి ద్వారా మీ సంకల్ప శక్తిని కూడా తెలుసుకుంటూ ఉంటారు. మనసా సేవ కర్మణా కన్నా శ్రేష్ఠమైనది. వృత్తి ద్వారా ఇతరుల వృత్తులను, వాయుమండలమును పరివర్తన చేయడం అనే సేవ కూడా అతి శ్రేష్ఠమైనది. కానీ దీని కన్నా సహజమైనది కర్మ. దాని పరిభాషను ఇంతకుముందు కూడా వినిపించాము కానీ ఈ రోజు, కర్మ ద్వారా శక్తి స్వరూపం యొక్క దర్శనము లేక సాక్షాత్కారమును చేయించండి అని ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కర్మ ద్వారా సంకల్ప శక్తి వరకూ చేరుకోవడం సహజమైపోతుంది లేకపోతే బలహీనమైన కర్మ సూక్ష్మశక్తియైన బుద్ధిని కూడా, సంకల్పాలను కూడా కిందకు తీసుకువస్తుంది. ఏ విధంగా ధరణి యొక్క ఆకర్షణ పైన ఉన్న వస్తువును కిందకు తీసుకువస్తుందో ఇదీ అలాగే. కావున చిత్రమును చరిత్రలోకి తీసుకురండి, అచ్చా!

ఈ విధంగా ప్రతి శక్తినీ కర్మ ద్వారా ప్రత్యక్షముగా చూపించేవారికి, తమ శక్తి స్వరూపము ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షము చేసేవారికి, సదా పరిశీలించే మరియు పరివర్తన చేసే శక్తి స్వరూపులకు, సదా చరిత్ర ద్వారా విచిత్రుడైన తండ్రి యొక్క సాక్షాత్కారమును చేయించేవారికి, ఇటువంటి మాస్టర్ సర్వశక్తివంతులకు, శ్రేష్ఠ కర్మ కర్తలకు, శక్తి స్వరూప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము - 

1. మాయకు అతిథి సత్కారాలు చేస్తున్నారన్న దానికి గుర్తు - ఉదాసీనత. సదా స్వయమును బాప్ దాదా యొక్క తోడుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎప్పుడైతే సదా బాబా యొక్క తోడు అనుభవమవుతుందో దానికి గుర్తు - సదా విజయులుగా ఉంటారు. ఎక్కువ సమయం యుద్ధంలో గడుస్తోందంటే, కష్టము అనుభవమవుతోందంటే తండ్రి యొక్క తోడు లేదని స్పష్టమవుతోంది. ఎవరైతే సదా తోడు యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారో వారు ప్రేమలో లవలీనమై ఉంటారు. ప్రేమ సాగరములో లీనమై ఉన్న ఆత్మ ఏ ప్రభావములోకీ రాజాలదు. మాయ రావడం పెద్ద విషయమేమీ కాదు కానీ అది తన రూపాన్ని చూపించకూడదు. మాయకు అతిథి సత్కారాలు చేస్తున్నారంటే మెల్లగా నడుస్తూ, నడుస్తూ ఇక ఉదాసీనత అనుభవమవుతుంది. దానివల్ల ముందుకు వెళుతున్నట్లు అనుభవమవ్వదు, వెనుకకు వెళుతున్నట్లూ ఉండదు. వెనుకకూ వెళ్ళలేరు, ముందుకూ వెళ్ళలేరు. ఇది మాయ యొక్క ప్రభావము. మాయ యొక్క ఆకర్షణ పైకి ఎగురనియ్యదు, అలాగే వెనుకకు వెళ్ళే ప్రశ్నాలేదు... కానీ ముందుకు వెళ్ళడం లేదంటే దానికి బీజమేమిటో దానిని గుర్తించండి మరియు దానిని భస్మం చేసేయండి. నడుస్తున్నాములే, వస్తున్నాము కదా! వింటున్నాములే, యధాశక్తి సేవ చేస్తున్నాములే అని భావించడం కాదు, మీ స్పీడు మరియు స్థితి యొక్క ఉన్నతి ఎంతవరకూ ఉంది అని పరిశీలించండి.

2. ఎవరైతే ఒక్కవేటుతో బాబాపై బలిహారమవుతారో వారే మహా ప్రసాదముగా అవుతారు. పిల్లలందరూ జీవన్ముక్త స్థితి యొక్క విశేష వరదానమును అనుభవం చేసుకుంటున్నారా? జీవన్ముక్తులుగా ఉన్నారా లేక జీవనబంధనులుగా ఉన్నారా? ట్రస్టీ అనగా జీవన్ముక్తులు, కావున మరి మీరు మరజీవాలుగా అయ్యారా లేక ఇంకా మరణిస్తున్నారా? ఇలా ఎన్ని సంవత్సరాలు మరణిస్తారు? భక్తిమార్గంలో కూడా జడచిత్రం ముందు ఏ ప్రసాదము స్వీకరింపబడుతుంది? ఒక్క వేటుతో బలి అయ్యేదే ప్రసాదమవుతుంది. కానీ ఆర్తనాదాలు చేస్తూ బలి అయ్యేది ప్రసాదముగా స్వీకరింపబడదు. బాబా ముందు ఎవరైతే ఒక్క వేటుతో బలి అవుతారో వారే ప్రసాదముగా అవుతారు. ఒకరేమో ఒక్క వేటుతో బలి అయ్యేవారు. బాబా నా వారు, నేను బాబాకు చెందినవాడిని అని సంకల్పం చేయడంతో అది ఒక్క వేటుతో బలి అయిపోవడం అవుతుంది. సంకల్పం చేయడం వెంటనే వేటు వేయడం. ఇక సమాప్తం. అవుతాములే, అయిపోతాములే అని ఆలోచించినట్లయితే.. ఇలా లే, లే... అనడం అనగా అరుస్తూ బలి అవ్వడం. అలా అనేవారు జీవన్ముక్తులు కారు. బాబా అని అనడంతో బాబా ఎలా ఉన్నారో పిల్లలూ అలా ఉండాలి. తండ్రి సాగరునిగా ఉంటూ పిల్లలు బికారులుగా ఉండడం జరుగజాలదు. మీరు నావారిగా అవ్వండి అని బాబా ఆఫర్ చేసారు. ఇందులో ఆలోచించే విషయమే లేదు. అచ్ఛా!

బాప్దాదా ద్వారా దేశ -విదేశముల సమాచారము:-

ఈరోజు బాప్దాదా పిల్లలతోటి షికారు చేసేందుకు వెళ్ళారు. మొత్తము సృష్టిని చ్టుటిరావానికి బాప్దాదాకు ఎంత సమయము పట్టి ఉండవచ్చు? ఎంత సమయములో కావాలంటే అంత సమయములో పరిక్రమణను పూర్తి చెయ్యగలరు. విస్తారముతోనైనా చెయ్యండి, సారములోనైనా చెయ్యండి. ఈరోజు డబల్విదేశీయులను కలిసే రోజు కదా, కనుక షికారు చేసిన సమాచారాన్ని వినిపిస్తారు. విదేశములో ఏం చూసారు మరియు దేశములో ఏం చూసారు?

కొద్ది సమయము ముందు విదేశముయొక్క విశేషతకు చెందిన అల భారతదేశమునకు చేరింది - అది ఏది? విదేశాలలో అల్పకాలికమైన సుఖ సాధనాల నషాలో సదా మస్త్గా ఉండేవారు, అలా భారతవాసులు కూడా విదేశీ సుఖ సాధనాలను చాలా ఎక్కువగా తమ కొరకు కార్యములో వినియోగించారు. చాలా ఎక్కువ విదేశీ సాధానాలద్వారా అల్పకాలిక సుఖాలలో మస్త్అయిపోయిన అనుభూతిని చేసారు మరియు ఇప్పుడుకూడా చేస్తున్నారు. భారతదేశమువారు అల్పకాలిక సాధనాలను కాపీ చేసారు మరియు కాపీ చేసిన కారణంగా తమ అసలైన శక్తిని పోగొట్టుకున్నారు. ఆత్మికతను దూరం చేసారు మరియు విదేశీ సుఖ సాధానాలను ఆధారం చేసుకున్నారు. మరి విదేశీయులు ఏం చేసారు? వివేకవంతమైన పని చేసారు. భారతదేశమునకు చెందిన అసలైన ఆత్మిక శక్తి వారిని విదేశములో ఆకర్షితము చేసింది. దీని పరిణామంగా నామధారీ ఆత్మికశక్తి కలిగిన ప్రతి ఒక్కరి వద్ద మరియు నిమిత్త గురువుల వద్ద విదేశీ ఫాలోయర్స్ను ఎక్కువగా చూడవచ్చు. విదేశీ ఆత్మలు నకిలీ సాధనాలను వదిలి అసలు వైపుకు, ఆత్మికత వైపుకు ఎక్కువగా ఆకర్షితమవుతున్నారు మరియు భారతవాసులు నకిలీ సాధానాలలో మస్త్అయిపోయారు. తమదానిని వదిలి పరాయిదానివైపుకు వెళ్తున్నారు మరియు విదేశీ ఆత్మలు అసలు వస్తువును వెతికేందుకు, పరిశీలించేందుకు మరియు పొందేందుకు కోరిక కలిగి ఉన్నారు.

మరి ఈరోజు బాప్దాదా దేశ-విదేశముల షికారు చేసారు. ఆ షికారులో భారతవాసులు ఏం చేస్తున్నారు మరియు విదేశీయులు ఏం చేస్తున్నారు అన్నదానిని చూసారు. భారతవాసులను చూసిన బాప్దాదాకు వీరు ఇంత ఉన్నతమైన కులమునకు చెందిన నంబర్వన్ధర్మముయొక్క ఆత్మలు, తరువాత ధర్మము వారు వదిలిన వస్తువును సొంతం చేసుకోవటంలో ఎంత మునిగిపోయారంటే తమ విశేష వస్తువును మర్చిపోయారు అని దయ కలుగుతుంది. ఈ కారణంగా భారతదేశమనే ఇంటిలో కూర్చుని, భారతదేశమనే ఇంటికి వచ్చిన శ్రేష్ఠ అతిధి అయిన బాబాను కూడా తెలుసుకోలేదు మరియు విదేశమునకు చెందిన ఆత్మలు దూరములో కూర్చుని ఉన్నాకూడా కేవలము సందేశమును వినగానే తెలుసుకుని చేరుకున్నారు. డబల్విదేశీ పిల్లల పరిశీలనా నేత్రాలు చాలా తీక్షణమైనవని బాప్దాదా చూస్తున్నారు. దూరమునుండే పరిశీలనా నేత్రాలద్వారా, అనుభవముద్వారా చూసారు మరియు పొందారు. కానీ భారతవాసులు, వారిలో కూడా ఆబు నివాసులపై బాబాకు ఎక్కువ దయ వస్తుంది, వీరు దగ్గరగా ఉన్నాగానీ పరిశీలించే కళ్ళు లేవు. పరిశీలనా నేత్రాలు లేక అంధులైపోయారు కదా! అటువంటి పిల్లలను చూస్తే దయ అయితే కలుగుతుంది కదా! మరి బాబా డబల్విదేశీ పిల్లల అద్భుతమును చూస్తున్నారు.

రెండో విషయము ఏం చూసారు - ఈరోజుల్లో భారతదేశము ఏవిధంగా పేదగా ఉందో అలా ఇప్పుడు చివరి సమయము దగ్గరగా ఉన్న కారణంగా విదేశీయులలో కూడా సంపన్నత తక్కువైంది. వృక్షము పచ్చపచ్చగా ఉన్నప్పుడు ఫలపుష్పాలతో కళకళలాడుతుంటుంది కానీ వృక్షము ఎండిపోవటం మొదలుపెట్టినప్పుడు ఫలాలు, పుష్పాలు కూడా ఎండిపోవటం మొదలవుతుంది. మరి ఈ దేశముయొక్క ప్రాప్తి రూపీ విశేషత ఏదైతే ఉందో దానివలన ప్రజలు సుఖంగా ఉన్నారు, శాంతి వాతావరణము ఉండింది, ఆ ఫల పుష్పాలు ఎండిపోవటము ప్రారంభమైంది. ఇప్పుడు విదేశములో కూడా ఉద్యోగము సులభంగా లభించదు. మొదట్లో విదేశాలలో ఎప్పుడూ ఈ ప్రాబ్లం ఉండేది కాదు? కనుక సుఖ సాధానాలు మరియు శాంతి అనే ఫలాలు ఎండిపోతున్నాయి అన్నదానికి ఇది కూడా గుర్తు. భారతరూపీ ముఖ్య కాండము ఎండిపోతుంది, దాని ప్రభావము ముఖ్య శాఖలపై పడటము కూడా ప్రారంభమైంది. ఈ క్రిస్టియన్ధర్మము చివరిలోని ముఖ్యమైన పెద్ద శాఖ. వృక్షము చిత్రములో క్రిస్టియన్ధర్మము ఏ శాఖగా ఉంది? ఏ ముఖ్య శాఖలనైతే చూపిస్తారో వాటిలోకూడా చివర్లో ఉంది కదా. ఆ శాఖ వరకు సంపన్నతయొక్క ప్రాప్తికి చెందిన పచ్చదనము ఎండిపోయింది. మొత్తము వృక్షముయొక్క జడజడీభూతావస్థకు ఇది గుర్తు. కనుక మొత్తము వృక్షములో అల్పకాలిక ప్రాప్తిరూపీ ఫలపుష్పాలు ఎండిపోయి ఉండటమును చూసారు. ఇకపోతే, కేవలము రెండు విషయాలు ఉన్నాయి –

ఒకటి - మనసుతో, నోటితో అరవటము మరియు రెండవది, ఎలా అయినా సరే కష్టంగా అయినా, జీవితాన్ని, దేశాన్ని నడిపించటము. చిల్లానా (అరవటము) మరియు కార్యమును చలానా(నడిపించటము). ఈ రెండు పనులు మిగిలిపోయి ఉన్నాయి. సంతోషంగా-సంతోషంతో నడిపించటం అనేది సమాప్తమైపోయింది. ఎలాగైనా సరే నడిపించాలి, ఇది ఉండిపోయింది. విదేశములో కూడా ఈ రూపురేఖలు తయారయ్యాయి. మరి ఇదికూడా దేనికి గుర్తు? కష్టంగా నడిపించటము అనేది ఎంతవరకు నడుస్తుంది! ఇప్పుడు ఎవరైతే అరుస్తున్నారో అటువంటి వారు కలిగిన విశ్వమునకు ఏం చెయ్యాలి? కష్టంగా నడిపించేవారికి ప్రాప్తి అనే రెక్కలను ఇచ్చి ఎగిరింపచెయ్యాలి. ఎవరు ఎగిరించగలరు? ఎవరైతే స్వయం ఎగిరే కళలో ఉంటారో వారు ఎగిరించగలరు. మరి మీరు ఎగిరే కళలో ఉన్నారా? ఎగిరే కళ మరియు ఎక్కే కళ - ఏ కళలో ఉన్నారు? ఎక్కే కళ కూడా కాదు, ఇప్పుడు ఎగిరే కళ కావాలి. ఎంతవరకు చేరుకున్నారు? డబల్విదేశీయులు ఏమని భావిస్తారు? మెజారిటీ అయితే బాబా సమానంగా శిక్షక క్వాలిటీవారు కదా. కనుక టీచర్అనగా ఎగిరేకళ కలిగినవారు. అటువంటి వారే కదా? అచ్ఛా –

ఈరోజు కేవలము షికారు చేసిన సమాచారాన్ని వినిపించారు. ఇప్పుడు దేశ-విదేశములలోనివారు ప్రాక్టికల్గా స్పష్టంగా గుర్తులను చూస్తున్నారు. ఈరోజుల్లో ఏదన్నా విషయము జరిగినట్లయితే 100 సంవత్సరాల క్రితం జరిగింది కదా అని అంటారు. అన్నీ విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఈ విచిత్ర తండ్రిని ప్రత్యక్షము చేస్తాయి. అందరి నోటినుండి ఇప్పుడు ఏమవుతుంది? అన్న మాటలే వెలువడుతున్నాయి. ఈ ప్రశ్నార్థకము అందరి బుద్ధిలో స్పష్టమైపోయింది. ఏది జరిగేది ఉందో అది జరిగింది అని ఇప్పుడు ఈ మాటలే వెలువడుతాయి. బాబా వచ్చారు. ప్రశ్నార్థకము సమాప్తమై, ఫుల్స్టాప్పడిపోతుంది. ఏవిధంగా మజ్జిగ చిలికే కుండనుండి వెన్నను వేరుచేసినప్పుడు ముందు అలజడి ఉంటుంది తరువాత వెన్న వెలువడుతుంది. కనుక ఈ ప్రశ్నార్థకము రూపీ అలజడి తరువాత ప్రత్యక్షత అనే వెన్న వెలువడుతుంది. ఇప్పుడు అలజడి చాలా ఎక్కువగా ప్రారంభమైపోయింది. నలువైపుల ఇప్పుడు ప్రత్యక్షతరూపీ వెన్న విశ్వము ముందు కనిపిస్తుంది. కానీ ఈ వెన్నను తినేవారు ఎవరు? తినేందుకు తయారుగా ఉన్నారు కదా? ఫరిస్తాలైన మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. అచ్ఛా –

అప్రాప్తి ఆత్మలందరికి సర్వ ప్రాప్తులను చేయించేవారు, సర్వులకు పరిశీలించే నేత్రాలను దానము చేసే మహాదానులకు, సర్వులకు సంతుష్టత అనే వరదానమును ఇచ్చే వరదానీ సంతుష్ట ఆత్మలకు, సదా స్వయముయొక్క ప్రాప్తి అనే రెక్కలద్వారా ఇతర ఆత్మలను ఎగిరింపచేనేవారు, సదా ఎగిరే కళ కలిగినవారికి, సదా స్వయముద్వారా బాబాను ప్రత్యక్షము చేసేవారికి, విశ్వము ముందు ప్రఖ్యాతమయ్యే శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

విదేశీ పిల్లలతో - అవ్యక్త బాప్దాదాల వ్యక్తిగత మిలనము

సదా స్వయమును సర్వ ప్రాప్తి సంపన్నులుగా అనుభవము చేస్తున్నారా? సర్వ ప్రాప్తుల అనుభూతి ఉందా? ఏ ఆత్మకైతే సర్వ ప్రాప్తుల అనుభూతి ఉంటుందో దానికి గుర్తుగా ఏం కనిపిస్తుంది? వారు సదా సంతుష్టంగా ఉంటారు. వారి ముఖముపై సదా ప్రసన్నతా గుర్తులు కనిపిస్తాయి. వీరు అన్నింటినీ పొందిన ఆత్మ అని వారి ముఖముద్వారా కనిపిస్తుంది. మామూలుగాకూడా చూడండి, లౌకికరీతిలో రాజకుమారులు, రాజకుమారీలు ఎవరైతే ఉంటారో లేక ఉన్నత కులమునకు చెందినవారెవరైతే ఉంటారో వారిని చూస్తే వీరు నిండుగా ఉన్న ఆత్మలు అని ముఖముద్వారా తెలిసిపోతుంది. అలా ఆత్మిక కులానికి చెందిన ఆత్మలైన మీ ముఖము ద్వారా ఇది కనిపించాలి - ఎవరికీ లభించనిది వీరికి లభించింది. మా నడవడిక మరియు ముఖము మారిపోయాయి, ముఖముపై ప్రాప్తికి చెందిన మెరుపు వచ్చింది అన్న అనుభవము మీకు కలుగుతుందా? డబల్విదేశీయులకు డబల్ఛాన్స్లభించింది కనుక సేవ కూడా డబల్గా చెయ్యాలి. డబల్సేవ ఎలా చేస్తారు? కేవలము వాణిద్వారానే కాదు కానీ నడవడిక ద్వారా కూడా మరియు ముఖముద్వారాకూడా. ఏవిధంగా స్వయం దీపపు పురుగులయ్యారో అలా అనేక దీపపు పురుగులను దీపము వద్దకు తీసుకువచ్చే ఆత్మలు. మరి మీరు ఎగరటము చూడటంతోనే ఇతర దీపపు పురుగులుకూడా మీ వెనక-వెనకనే ఎగరటం మొదలుపెట్తారు. ఏవిధంగా మీరు ప్రతి విషయములో లోతులలోకి వెళ్తారో, అలా ప్రతి గుణమునకు చెందిన అనుభూతి యొక్క లోతులలోకి వెళ్ళండి. ఎంత లోతుగా వెళ్తారో అంతగా ప్రతిరోజూ నూతన అనుభవమును చెయ్యగలరు. ఏవిధంగా శాంత స్వరూప అనుభవమును ప్రతిరోజూ చేస్తారో అలా ప్రతిరోజు నవీనతకు చెందిన అనుభవమును చెయ్యండి. ఏకాంతవాసులుగా ఉన్నప్పుడే నూతన అనుభవము కలుగుతుంది. ఏకాంతవాసి అనగా సదా స్థూలమైన ఏకాంతముతోపాటుగా ఒక్కరి అంతములో సదా ఉండటము.

ఎవరైతే ఒక్క ''బాబా'' అన్న మాటను పదేపదే అంటారో, వారికి ప్రతిసారీ నూతన అనుభవము ఉండాలి. మొదట్లో వచ్చినప్పుడు, అప్పుడుకూడా బాబా అన్న మాటను అనేవారు, మధువనమునకు వచ్చినప్పుడుకూడా ఇదే అన్నారు మరియు ఇప్పుడు వెళ్తున్నప్పుడుకూడా బాబా అన్న మాటనే మాట్లాడ్తారు కానీ మొదట అనటంలో మరియు ఇప్పుడు అనటంలో ఎంత తేడా ఉంది! ఈ అనుభవమైతే ఉంది కదా! బాబా అన్న పదమైతే అదే, కాని లోతైన ప్రాప్తుల ఆధారముపై ఆ అనుభవము పెరుగుతూ పోయింది! కావున తేడా ఉంటుంది కదా! ఇలా అన్ని గుణాలలోకూడా ప్రతిరోజు నూతన అనుభవమును చెయ్యండి. శాంతస్వరూపులుగా అయితే ఉన్నారు కానీ శాంతి అనుభూతి ఏ పాయింట్ ఆధారంతో ఉంటుంది అన్నదానిని చూడండి, ఏవిధంగా అయితే నేను ఆత్మను, పరంధామనివాసిని అన్న దీనితోకూడా శాంతియొక్క అనుభూతి ఉంటుంది మరియు నేను ఆత్మను, సత్యయుగములో సుఖశాంతి స్వరూపముగా ఉంటాను, దీనిని అనుభవము చూసినట్లయితే అది మరొకరకంగా ఉంటుంది, అలాగే కర్మ చేస్తూ, అశాంతి వాతావరణములో ఉన్నాకూడా నేను ఆత్మను, శాంత స్వరూపమును అన్న అనుభూతిని చేసినట్లయితే దాని అనుభవము వేరేగా ఉంటుంది. మూడింటిలో తేడా అయితే ఉంది కదా! ఉన్నదైతే శాంత స్వరూపముగా. అలా ప్రతిరోజు ఆ శాంత స్వరూపపు అనుభూతిలోకూడా ప్రోగ్రెస్ఉండాలి. ఒకసారి ఒక పాయింట్తో శాంత స్వరూపపు అనుభూతిని చేస్తే, మరొకసారి మరొక పాయింట్తో చేసినట్లయితే ప్రతి రోజూ నూతన అనుభవము ఉంటుంది మరియు కొత్తకొత్తవి లభించాలి అని ఎల్లప్పుడూ ఇందులోనే బిజీగా ఉంటారు. లేదంటే ఏమవుతుందంటే నడుస్తూ-నడుస్తూ స్మృతియొక్క విధి, అదే మురళిని వినే మరియు వినిపించే విధి, మరల అదే విషయము అప్పుడప్పుడు సాధారణ అనుభవమనిపిస్తుంది కనుక మరల ఉల్లాసము కూడా ఏవిధంగా ఎప్పుడూ ఉంటుందో అలాగే ఉంటుంది, ముందుకు వెళ్ళరు. మరియు దీనికి రిజల్టుగా మరల ఎప్పుడో అప్పుడు నిర్లక్ష్యముకూడా వస్తుంది. ఇదైతే నాకు రానే వస్తుంది, ఇదైతే తెలుసు! కనుక ఎగిరే కళకు బదులుగా ఆగే కళ అయిపోతుంది కనుక స్వయం మరియు ఏ ఆత్మలకైతే నిమిత్తులుగా అవుతారో వారికి సదా నవీనతను అనుభవము చేయించేందుకు ఈ విధి తప్పనిసరిగా కావాలి. అర్థమైందా! మీరందరూ మెజారిటీ సేవకు నిమిత్తులైన ఆత్మలు కదా, కనుక ఈ విశేషతను తప్పకుండా ధారణ చెయ్యాలి. ప్రతిరోజూ ఏదో ఒక పాయింట్ను తియ్యండి - శాంత స్వరూప అనుభూతికి చెందిన పాయింట్లు ఏమిటి? అలాగే ప్రేమ స్వరూపము, ఆనంద స్వరూపము, అన్నింటి విశేష పాయింట్లు బుద్ధిలో ఉంచుకుంటూ ప్రతిరోజూ కొత్త కొత్త అనుభవమును చెయ్యండి. ఈరోజు కొత్త అనుభవమును చేసి ఇతరులకుకూడా ఆ అనుభవమును చేయించాలి అని సదా అనుకోండి. అప్పుడు మరల అమృతవేళ కూర్చోవటంలో కూడా చాలా రుచి ఉంటుంది. లేనట్లయితే అప్పుడప్పుడు సోమరితనమునకు చెందిన అల వస్తుంది. ఎక్కడైతే కొత్త వస్తువు లభిస్తుందో అక్కడ సోమరితనము ఉండదు. అదే అదే విషయము అయినట్లయితే సోమరితనము రావటం మొదలుపెట్తుంది. మరి ఏం చెయ్యాలో అర్థమైందా? విధి అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ప్రశ్నను అడగాలంటే అడగండి - విదేశీయులకు మామూలుగా కూడా వెరైటీ మంచిగా అనిపిస్తుంది. పిక్నిక్లో స్వీటూ కావాలి, హాటూ కావాలి. ఇంకా వెరైటీ రకాలు కూడా కావాలి కనుక అనుభవము చెయ్యాలని ఎప్పుడు కూర్చున్నా ఇప్పుడు బాప్దాదాతో వెరైటీ పిక్నిక్చెయ్యానికి వెళ్తున్నాము అని భావించండి. పిక్నిక్అన్న పేరును వినటంతోనే హుషారైపోతారు. సోమరితనము పారిపోతుంది. మామూలుగా కూడా మీకు పిక్నిక్చెయ్యటము, బయటకు వెళ్ళటము మంచిగా అనిపిస్తుంది కదా! మరి బయటకు వెళ్ళండి, ఒక్కోసారి పరంధామానికి వెళ్ళండి, ఒక్కోసారి స్వర్గములోకి వెళ్ళండి, ఒక్కోసారి మధువనములోకి రండి, ఒక్కోసారి లండన్సెంటర్కు వెళ్ళండి, ఒక్కోసారి ఆస్ట్రేలియాకు చేరుకోండి. వెరైటీ ఉన్న కారణంగా రమణికతలోకి వస్తారు. అచ్ఛా –

Comments