18-04-1982 అవ్యక్త మురళి

18-04-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కుల మర్యాదను కాపాడండి.

                    ఈరోజు బాప్ దాదా సర్వ స్నేహీలు మరియు మిలనపు భావన కలిగిన శ్రేష్ట ఆత్మలను చూస్తున్నారు. పిల్లలకు కల మిలన భావన యొక్క ప్రత్యక్షఫలమును బాప్ దాదాకు కూడా ఈ సమయములోనే ఇవ్వాలి. భక్తి భావన యొక్క ఫలముగా డైరెక్ట్ సమ్ముఖపు మిలనము లభించదు. కానీ ఒక్కసారి పరిచయము ఆధారముతో అనగా జ్ఞానము ఆధారముతో బాబా మరియు పిల్లల సంబంధము జోడింపబడినట్లయితే ఇటువంటి జ్ఞాన స్వరూపముగల పిల్లలకు అధికారము ఆధారముతో శుభ భావన, జ్ఞాన స్వరూప భావన, సంబంధము ఆధారముతో మిలనపు భావన యొక్క ఫలము సమ్ముఖంగా బాబాకు ఇవ్వవలసే ఉంటుంది. మరి ఈరోజు అటువంటి జ్ఞానవంతులైన మిలనపు భావనా స్వరూప ఆత్మలతో మిలనము చేసేందుకు బాప్ దాదా పిల్లల మధ్యకు వచ్చారు. చాలామంది బ్రాహ్మణ ఆత్మలు శక్తిస్వరూపులై, మహావీరులై సదా విజయీ ఆత్మలుగా అవ్వటంలో మరియు ఇంత ధైర్యమును పెట్టడంలో స్వయమును బలహీనురుగా భావించినాగానీ ఒక విశేషత కారణంగా విశేష ఆత్మల లిస్ట్ లోకి వచ్చేసారు. అది ఏ విశేషత? కేవలము బాబా మంచివారుగా అనిపిస్తారు, శ్రేష్ట జీవితము మంచిగా అనిపిస్తుంది. బ్రాహ్మణ పరివారపు సంగటన, నిస్వార్థ స్నేహము మనసును ఆకర్షితము చేస్తుంది. బాబా లభించారు, పరివారము లభించింది, పవిత్ర స్థానము లభించింది, జీవితమును శ్రేష్టముగా తయారుచేసుకునేందుకు సహజమైన ఆధారము లభించింది - ఇదే విశేషత. ఈ ఆధారము పైనే మిలనపు భావనలో స్నేహ ఆధారముతో నడుస్తూ పోతున్నారు. అయినాగానీ సంబంధాన్ని జోడించిన కారణంగా సంబంధము ఆధారముతో స్వర్గ అధికారము వారసత్వములో పొందనే పొందుతారు - ఎందుకంటే బ్రాహ్మణుల నుండి దేవతలు, ఈ విధి ప్రమాణంగా దేవ పదవి యొక్క ప్రాప్తి అధికారమును పొంది తీరుతారు. సత్యయుగమును దేవతల యుగము అని అంటారు. రాజులైనా, ప్రజలైనాగానీ ధర్మ దేవతలుగానే ఉంటారు - ఎందుకంటే ఉన్నతోన్నతుడైన బాబా తన పిల్లలుగా చేసుకున్నప్పుడు ఉన్నతమైన బాబా పిల్లలు ప్రతి ఒక్కరికీ స్వర్గ వారసత్వపు అధికారము, దేవతగా అయ్యే అధికారము జన్మ సిద్ధ అధికారములో ప్రాప్తి అవ్వనే అవుతుంది. బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీగా అవ్వటము అనగా స్వర్గ వారసత్వపు అధికారము యొక్క అవినాశీ స్టాంప్ పడటము. మొత్తము విశ్వమునుండి ఇటువంటి అధికారమును పొందే సర్వాత్మల నుండి కొందరు ఆత్మలే వెలువడతారు కనుక బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులుగా అవ్వటము అదేమీ సాధారణమైన విషయంగా భావించకండి. బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులుగా అవ్వటమే విశేషత మరియు ఈ విశేషత కారణంగా విశేష ఆత్మల లిస్ట్ లోకి వచ్చేస్తారు కనుక బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులుగా అవ్వటము అనగా బ్రాహ్మణ లోకమునకు, బ్రాహ్మణ ప్రపంచమునకు, బ్రాహ్మణ పరివారమునకు చెందినవారుగా అవటము. బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులుగా అయ్యి ఒకవేళ ఏదైనా సాధారణ నడవడిక లేక పాత నడవడికలో నడిచినట్లయితే దానవల్ల కేవలము మీ ఒక్కరికే నష్టము రాదు - ఎందుకంటే ఒంటరి బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులు కారు కానీ బ్రాహ్మణ కుల సభ్యులు. స్వయమునకూ నష్టము చేసుకుంటారు, ఇంకా కులమునకు చెడ్డపేరు తీసుకువచ్చిన భారము కూడా ఆ ఆత్మపై ఉంటుంది. బ్రాహ్మణ లోకము యొక్క గౌరవమును కాపాడటము కూడా ప్రతి బ్రాహ్మణుని కర్తవ్యము. లౌకిక కులమర్యాదలపై ఎంతో ధ్యానమును పెడతారు. లౌకిక కులమర్యాదలు పదమాపదమపతులుగా అవ్వటము నుండి కూడా వంచితము చేస్తుంది. దానిని స్వయము అనుభవము కూడా చేస్తారు మరియు చాలా కావాలి కానీ లోక మర్యాదలను కూడా పాటించవలసి వస్తుంది కదా అని కూడా అంటారు. ఇలా అంటారు కదా! మరి లోకులు (ప్రపంచము) అనేక జన్మల ప్రాప్తి నుండి వంచితులు చేసేవారు, వర్తమానములోని వజ్ర సమాన జన్మను గవ్వ సమానంగా వ్యర్థంగా చేసేవారు అన్న విషయము మంచిగా తెలుసు, అయినా కూడా ఆ కులమర్యాదలను పాటించటంలో చాలా బాగా ధ్యానమును చేస్తారు, సమయాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. మరి ఈ బ్రాహ్మణ కుల మర్యాదలకు ఎటువంటి విశేషతా లేదా! ఆ లోకపు మర్యాదల వెనుక మీ ధర్మమును అనగా ధారణలను మరియు శ్రేష్ట కర్మల స్మృతిని, ధర్మము మరియు కర్మ, ఈ రెండింనీ వదిలేస్తారు. ఒక్కోసారి వృత్తి యొక్క పత్యపు ధారణను అనగా ధర్మమును వదిలేస్తారు, ఒక్కోసారి శుద్ధ దృష్టి యొక్క ధర్మమును వదిలేస్తారు. ఒక్కోసారి శుద్ధ అన్నము యొక్క ధర్మమును వదిలేస్తారు. మళ్ళీ తమను తాము శ్రేష్టులుగా నిరూపించుకునేందుకు చాలా విషయాలను తయారుచేస్తారు. చెయ్యవలసి వస్తుంది అని అంటారు. కాస్తపాటి బలహీనత సదాకాలపు ధర్మాన్ని మరియు కర్మను వదిలించేస్తాయి. ఎవరైతే ధర్మము మరియు కర్మను వదిలేస్తారో అటువంటివారిని లౌకిక కులములో కూడా ఎటువంటివారిగా భావిస్తారు? తెలుసు కదా! ఇదేమీ సాధారణ కులపు ధర్మము మరియు కర్మ కాదు. బ్రాహ్మణ ధర్మము, ఉన్నతోన్నతమైన పిలక స్థానములోని కులము. మరి ఏ లోకము మరియు ఏ కులపు గౌరవమును కాపాడాలి! ఇంకా చాలా మంచి-మంచి విషయాలను వినిపిస్తారు - నాకు కోరిక లేదు, కానీ ఇతరులను సంతోషపరచానికి చేసాను! అజ్ఞానీ ఆత్మలు ఎప్పుడైనా సదా సంతోషంగా ఉండగలరా! ఇప్పుడిప్పుడే సంతోషము, ఇప్పుడిప్పుడే అసంతుష్టులుగా ఉండే ఇటువంటి ఆత్మల కారణంగా తమ శ్రేష్ట కర్మ మరియు ధర్మములను వదిలేస్తారు. ఎవరైతే ధర్మమునకు చెందినవారు కారో, వారు బ్రాహ్మణ ప్రపంచమువారు కారు. అల్పజ్ఞ ఆత్మలను సంతోషపరిచారు కానీ సర్వజ్ఞుడైన బాబా ఆజ్ఞను ఉల్లంఘించారు కదా! మరి పొందినది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి! ఈ లోకము ఇప్పుడు అంతమయ్యేదే ఉంది. నలువైపుల అగ్నికి కావలసిన కట్టెలు చాలా ఎక్కువగా జమ అయి ఉన్నాయి. కట్టెలు అనగా ఏర్పాట్లు. ఈ కట్టెలను వేరువేరు చేసి అగ్ని ఏర్పాట్లను అంతమొందించాలని ఎంతగా అనుకున్నాగానీ అంతగా నిప్పు కట్టెల తీవ్రత ఎక్కువ అవుతూనే ఉంటుంది. హోలికను వెలిగించేటప్పుడు పెద్దవారితోపాటుగా చిన్న-చిన్న పిల్లలు కూడా కట్టెపుల్లలను జమ చేస్తుంటారు. లేదంటే ఇంటినుండైనా కట్టెపుల్లలను తీసుకుని వస్తారు. చెయ్యాలన్న అభిరుచి ఉంటుంది. ఈరోజుల్లో కూడా చూడండి, చిన్న-చిన్న పట్టణాలు కూడా చాలా ఎక్కువ అభిరుచితో సహయోగులుగా అవుతూ ఉన్నాయి. మరి అటువంటి లోకుల గౌరవము కొరకు బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసే మీ అవినాశీ లోకపు మర్యాదను మర్చిపోతారా. విచిత్రంగా చేస్తున్నారు. ఇది నిర్వర్తించడమా లేక పోగొట్టుకోవటమా? కనుక బ్రాహ్మణ లోకపు మర్యాదను కూడా గుర్తుంచుకోండి.
                       చాలామంది పిల్లలు ఎంత తెలివైనవారుగా, హుషారుగా ఉంటారంటే తమ పాత ప్రపంచపు మర్యాదను కూడా కాపాడాలని కోరుకుంటారు మరియు బ్రాహ్మణ ప్రపంచములో కూడా శ్రేష్టులుగా అవ్వాలనుకుంటారు. లౌకిక కులము యొక్క కులమర్యాదలను పాటించండి దానినేమీ వద్దనము కానీ ధర్మ-కర్మలను వదలేసి లోకరీతిని పాటించడము, ఇది తప్పు. ఇంకా ఏ తెలివిని చూపిస్తారు? ఇంకా వారు ఏమనుకుంటారంటే - ఎవరికేం తెలుస్తుంది, నేను ఙ్ఞానీ ఙ్ఞానమూర్తిని(సర్వమూ తెలిసినవాడిని) కాను అని బాబానే చెప్తారు కదా. నిమిత్త ఆత్మలకు కూడా ఏం తెలుస్తుంది? ఇలా అయితే నడిచిపోతుందిలే అని భావిస్తారు. అలా నడుస్తూ నడుస్తూ మధువనమునకు కూడా చేరుకుంటారు. సేవాకేంద్రాలలో కూడా తమను తాము దాచుకుని సేవలలో ప్రసిద్ధులుగా కూడా అవుతారు. కాస్తంత సహయోగము ఇచ్చి సహయోగము ఆధారముతో చాలా మంచి సేవాధారి అన్న టైటిల్ ను కూడా ఖరీదు చేస్తారు. కానీ జన్మజన్మల శ్రేష్ట టైటిల్ - సర్వ గుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు.....ఈ అవినాశీ టైటిల్ ను పోగొట్టుకకుంటారు. కనుక ఇది సహయోగమును ఇవ్వటము కాదు కానీ 'లోపల ఒకటి - బయట ఒకటి', ఈ మోసము ద్వారా భారాన్నెత్తుకుంటారు. సహయోగి ఆత్మకు బదులుగా భారమును ఎత్తుకునేవారుగా అయిపోయారు. ఎంతో తెలివిని చూపించి స్వయమును నడిపించుకున్నాగానీ ఇటువంటి అతితెలివితో కూడుకున్న నడిపించుకోవటమంటే చలానా కాదు చిల్లానా (నడిపించుకోవటము కాదు బాధతో అరవటము.) ఈ సేవాకేంద్రము నిమిత్త ఆత్మల స్థానము అని భావించకండి. ఆత్మలనైతే నడిపించేయగలరు కానీ పరమాత్మ ముందు ఒకటికి లక్షరెట్ల లెక్కలో ప్రతి ఆత్మ కర్మ ఖాతాలో జమ అవ్వనే అవుతుంది. ఆ ఖాతాను నడిపించలేరు, కనుక బాప్ దాదాకు ఇటువంటి తెలివికల పిల్లలపై దయ కలుగుతుంది. అయినా కూడా ఒక్కసారి బాబా అని అన్నట్లైతే బాబా కూడా పిల్లల కళ్యాణము కొరకు సదా శిక్షణ ఇస్తూనే ఉంటారు. కనుక ఇటువంటి తెలివి కలవారిగా అవ్వకూడదు. సదా బ్రాహ్మణలోకము యొక్క గౌరవమును కాపాడాలి.
                 బాప్ దాదా అయితే కర్మ మరియు ఫలము - ఈ రెండింటి నుండి అతీతులు. ఈ సమయములో బ్రహ్మాబాబా కూడా ఇటువంటి స్థితిలో ఉన్నారు. మరల లెక్కాచారాలలోకి అయితే రావలసే ఉంటుంది కానీ ఈ సమయములో బాబా సమానులు కనుక ఎవరు చేస్తారో, ఎలా చేస్తారో అది అంతా తమకొరకే చేస్తారు. బాబా అయితే దాత. స్వయమే చేస్తారు మరియు స్వయమే ఫలాన్ని పొందుతారు అన్నప్పుడు ఏం చెయ్యాలి! బాప్ దాదా వతనములో పిల్లల వెరౖటీె ఆటను చూసి నవ్వుకుంటారు. అచ్ఛా!
                   ఇటువంటి బ్రాహ్మణకుల దీపకులు, సదా సత్యమైన లగ్నముతో స్నేహీలుగా మరియు సహయోగులుగా అయ్యేవారు, సదాకాలపు శ్రేష్ట ఫలమును పొందేవారు, సదా సత్యమైన బాబా యొక్క సత్యమైన స్నేహములో అల్పకాలిక ప్రాప్తులను బలిహారము చేసే ఇటువంటి స్నేహీ ఆత్మలకు, శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో -

1. కర్మబంధనము నుండి ముక్త స్థితిని అనుభవము చేసేందుకు కర్మయోగిగా అవ్వండి.
ప్రతి కర్మ చేస్తూ, కర్మ బంధనాల నుండి ఎల్లప్పుడూ అతీతంగా మరియు బాబాకు ప్రియంగా అయ్యే ఇటువంటి అతీతమైన మరియు ప్రియమైన ఆత్మలుగా మిమ్మల్ని మీరు అనుభవము చేసుకుంటున్నారా? కర్మయోగిగా అయ్యి కర్మ చేసేవారు ఎప్పుడూ కర్మ బంధనాలలోకి రారు, వారు సదా బంధనముక్తులుగా - యోగయుక్తులుగా ఉంటారు. కర్మయోగులు ఎప్పుడూ మంచి లేక చెడు కర్మ చేసే వ్యక్తి యొక్క ప్రభావములోకి రారు. ఎవరైనా మంచి కర్మ చేసేవారు కనెక్షన్ లోకి వచ్చినట్లయితే దాని సంతోషములోకి వచ్చి మరియు ఎవరైనా మంచి కర్మలు చెయ్యనివారి సంబంధములోకి వచ్చినట్లయితే కోపములోకి రావటము లేక వారిపట్ల ఈర్ష్య లేక ద్వేషము పెరగటము కాదు... ఇది కూడా కర్మ బంధనము. కర్మయోగి ముందుకు ఎవరు, ఎలా వచ్చినాగానీ - స్వయం సదా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. వీరిది ఈ పాత్ర నడుస్తూ ఉంది అని జ్ఞానము ద్వారా తెలుసుకుంటారు. ద్వేషించేవారిని స్వయము కూడా ద్వేషించటము - ఇది కర్మ బంధనమవుతుంది. ఇటువంటి కర్మబంధనములోకి వచ్చేవారు ఏకరసంగా ఉండలేరు. ఒకసారి ఒక రసం(స్థితి)లో ఉంటే, ఇంకోసారి ఇంకో రసంలో ఉంటారు, కనుక మంచివారిని మంచిగా భావించి సాక్షిగా అయ్యి చూడండి మరియు దయాహృదయులై చెడును దయాదృష్టితో, పరివర్తన చేసే శుభ భావనతో సాక్షిగా అయ్యి చూడండి. కర్మబంధనము నుండి అతీతము అని దీనినే అంటారు ఎందుకంటే జ్ఞానమునకు కల అర్థము వివేకము. మరి వివేకము ఏ విషయములో ఉండాలి? కర్మ బంధనాలనుండి ముక్తులుగా అయ్యే వివేకమునే జ్ఞానము అని అంటారు. జ్ఞాని ఎప్పుడూ బంధనాలకు వశమవ్వడు, సదా అతీతము. అప్పుడప్పుడు అతీతులుగా అవుతూ, అప్పుడప్పుడు కాస్త ప్రభావము పడటము కాదు. సదా వికర్మాజీత్ లుగా అయ్యే లక్ష్యమును పెట్టుకోండి. కర్మబంధనాలను జయించినవారుగా అవ్వాలి. ఈ బహుకాలపు అభ్యాసము బహుకాలపు ప్రాలబ్ధమునకు నిమిత్తముగా తయారుచేస్తుంది. మరియు ఇప్పుడు కూడా చాలా విచిత్రమైన అనుభవాలను పొందుతారు. కనుక సదా అతీతముగా మరియు సదాకాలమునకు ప్రియమైనవారిగా అవ్వండి. ఇదే బాబా సమానమైన, కర్మబంధనము నుండి ముక్త స్థితి.

పాత, పెద్ద అక్కయ్యలను చూసి బాప్ దాదా మాట్లాడారు -

                    ఈ గ్రూప్ ను ఏ గ్రూప్ అంటారు? మొదట ప్రారంభములో అయితే మీ-మీ పేర్లు ఉన్నాయి - ఇప్పుడు ఏ పేరును ఇవ్వాలి? సదా బాబా సాంగత్యములో ఉండేవారు, సదా బాబాకు రైట్ హ్యాండ్లు. అటువంటి గ్రూపే కదా! బాప్ దాదా కూడా హ్యాండ్స్ లేకుండా ఇంత పెద్ద స్థాపనా కార్యమును ఎలా చెయ్యగలరు! కనుక మీరు స్థాపనా కార్యములోని విశేషమైన భుజాలు (హ్యాండ్స్). విశేష భుజముగా రైట్ హ్యాండ్ ఉంటుంది. బాప్ దాదా ఎల్లప్పుడూ ఆది రత్నాలను రియల్ గోల్డ్ అని అంటారు. ఆది రత్నాలందరూ విశ్వ రంగస్థలముపై విశేషమైన పాత్రను అభినయిస్తున్నారు. ప్రతి విశేషఆత్మ యొక్క విశేష పాత్రను చూసి బాప్ దాదా కూడా హర్షిస్తారు. పాత్ర అయితే అందరిదీ వెరౖటీ పాత్రగా ఉంది కదా! ఒకరిలా ఒకరు ఉండలేరు, కానీ ఆదిరత్నాలకు డ్రామా అనుసారంగా విశేషమైన పాత్ర ఉంది అన్నది తప్పనిసరైనది. ప్రతి రత్నములో విశేషమైన విశేషత ఉంది, ఆ ఆధారముతోనే ముందుకు పోతున్నారు కూడా మరియు సదా ముందుకు పోతూనే ఉంటారు. అది ఏ విశేషత అన్నదానినైతే స్వయమునకు కూడా తెలుసు మరియు ఇతరులకు కూడా తెలుసు. మీరు విశేషతా సంపన్నమైన విశేషతా ఆత్మలు.
                ఇటువంటి ఆదిరత్నాలకు బాప్ దాదా లక్షలు, లక్షలుగా అభినందనలను ఇస్తారు ఎందుకంటే ఆది నుండి సహనము చేసి స్థాపనా కార్యమును సాకార స్వరూపములో వృద్ధిని ప్రాప్తి చేయించేందుకు నిమిత్తులుగా అయ్యారు. కనుక ఎవరైతే స్థాపనా కార్యములో సహనము చేసారో దానిని ఇతరులు చెయ్యలేదు. మీ సహనశక్తి బీజమే ఈ ఫలాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరూ ఏమేమి సహనము చేసారు మరియు ఎలా శక్తిరూపమును చూపించారు అని బాప్ దాదా ఆది-మధ్య-అంతములను చూస్తారు. ఆ సహించటమును కూడా ఆడుకుంట - ఆడుకుంటూ చేసారు. సహనము రూపంలో సహించలేదు, ఆడుకుంటూ - ఆడుకుంటూ సహించే పాత్రను పోషించేందుకు నిమిత్తులుగా అయ్యి తమ విశేష హీరో పాత్రను ఫిక్స్ చేసుకున్నారు, కనుక ఆదిరత్నాలు నిమిత్తంగా అయ్యే ఈ పాత్ర బాప్ దాదా ముందు ఉంటుంది. మరియు దీని ఫలస్వరూపంగా మీరు సర్వాత్మలూ సదా అమరులుగా ఉంటారు. మీ పాత్రను అర్థం చేసుకున్నారా? ఎవరు ఎంత ముందుకు పోయినాగానీ, అయినాగానీ, అయినాగానీ అని అంటారు. బాప్ దాదాకు పాత వస్తువుల విలువ తెలుసు. అర్థమైందా. అచ్ఛా!

ప్రశ్న - సంగమయుగ బ్రాహ్మణ పిల్లలు ఏ కర్తవ్యములో సదా తత్పరులై ఉండవలసి ఉంటుంది?
జవాబు - సమర్థులుగా అవ్వాలి మరియు ఇతరులను కూడా సమర్థులుగా తయారుచెయ్యాలి, ఈ కర్తవ్యములో సదా తత్పరులై ఉండాలి ఎందుకంటే వ్యర్థమునైతే అర్థకల్పము చేసారు, ఇప్పుడు సమర్థులుగా అయ్యే మరియు సమర్థులుగా చేసే సమయము, కనుక వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలు అన్నీ సమాప్తము, ఫుల్స్ స్టాప్. పాత ఖాతా సమాప్తము. జమ చేసుకునేందుకు సాధనము - సదా సమర్థముగా ఉండటము ఎందుకంటే వ్యర్థము వలన సమయము, శక్తులు మరియు జ్ఞానము నష్టపోతాయి.

Comments