18-02-1983 అవ్యక్త మురళి

18-02-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సదా ఉత్సాహ, ఉల్లాసాలలో ఉండేటందుకు యుక్తులు.

ఈరోజు పిల్లలందరి హృదయాభిరాముడైన బాబా పిల్లల హృదయం నుండి వెలువడే శబ్దాలను, హృదయపు మధురాతి మధురమైన మాటలకు బదులు ఇచ్చేందుకు పిల్లల మధ్యకు వచ్చారు. అమృతవేళ నుండి బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల భిన్న భిన్న రహస్యాలతో కూడిన సంగీతమును వింటూ ఉంటారు. రోజంతటిలో ఎంతమంది పిల్లల ఎన్నిరకాల సంగీతములను వింటూ ఉంటారు! పిల్లలు ప్రతి ఒక్కరివీ భిన్న, భిన్న సమయాలలో, భిన్న, భిన్న సంగీతములు ఉంటాయి. అన్నింటికన్నా ఎక్కువగా ఉండే సహజ సంగీతము ఏమి? ప్రకృతి సిద్ధమైనది సదా ప్రియముగా అనిపిస్తుంది. కావున పిల్లలందరి భిన్న, భిన్న సంగీతములను వింటూ బాప్ దాదా పిల్లలకు సారములో ముఖ్య విషయాలను వినిపిస్తారు.

పిల్లలందరూ యథాశక్తి లగనంలో మగనమై ఉండే స్థితిలో స్థితులై ఉన్న కారణంగా లేక మగన స్వరూపంలో అనుభవీమూర్తులుగా అయ్యేందుకు చాలా మంచి అటెన్షన్ ఉంచుతూ నడుస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయంలో నేను బాబా సమానంగా సమీప రత్నంగా అయి సదా సుపుత్రునిగా ఉండే ప్రమాణమును ఇవ్వాలి అన్న ఉల్లాసము, ఉత్సాహము ఉంది. ఈ ఉల్లాస, ఉత్సాహాలే అందరి ఎగిరే కళకు ఆధారము. ఈ ఉత్సాహము అనేకరకాలుగా వచ్చే విఘ్నాలను సమాప్తం చేసి సంపన్నంగా అవ్వడంలో ఎంతో సహయోగమును ఇస్తుంది. ఈ ఉత్సాహపు శుద్ధమైన మరియు దృఢమైన సంకల్పము విజయులుగా తయారుచేయడంలో విశేషంగా శక్తిశాలీ శస్త్రంలా అయిపోతుంది. కావున సదా హృదయంలో ఉల్లాస ఉత్సాహాలను లేక ఈ ఎగిరే కళ యొక్క సాధనమును నిలిపి ఉంచుకోవాలి. ఎప్పుడూ ఉల్లాస ఉత్సాహాలను తగ్గించుకోకూడదు. నేను బాబా సమానంగా సర్వశక్తులతో, సర్వగుణాలతో, జ్ఞానపు సర్వఖజానాలతో సంపన్నంగా అయి తీరాలి... ఎందుకంటే కల్పపూర్వం కూడా నేను శ్రేష్ఠ ఆత్మగా అయ్యాను. ఒక్క కల్పపు భాగ్యము కాదు అనేకసార్లు భాగ్యవిధాత ద్వారా భాగ్యరేఖను దిద్దుకున్నాను. ఈ ఉల్లాసము ఆధారంపై ఉత్సాహము స్వతహాగానే ఉంటుంది. ఉత్సాహము ఏముంటుంది? 'ఓహో నా భాగ్యము' బాప్దాదా భిన్న, భిన్న టైటిళ్ళను ఏవైతే ఇచ్చారో వాటి స్మృతి స్వరూపంలో ఉండడం ద్వారా ఉత్సాహము అనగా సంతోషము స్వతహాగా మరియు సదా ఉంటుంది. అన్నింటికన్నా అతిపెద్ద ఉత్సాహపు విషయం ఏమిటంటే అనేక జన్మలు తమ తండ్రిని వెదికారు. కాని, ఈ సమయంలో బాప్ దాదా మిమ్మల్ని వెదికారు. భిన్న, భిన్న పరదాల లోపల దాగి ఉన్నారు. ఆ పరదాల లోపలి నుండి కూడా వెదికారు కదా! తప్పిపోయి ఎంత దూరం వెళ్ళిపోయారు? భారతదేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? ధర్మము, కర్మ, దేశము, ఆచార వ్యవహారాలు ఇలా ఎన్ని పరదాల లోపలికి వచ్చేశారు. కావున సదా ఈ ఉల్లాస ఉత్సాహాలలోనే ఉంటారు కదా! బాబా తమవారిగా చేసుకున్నారా లేక మీరు బాబాను మీవారిగా చేసుకున్నారా? మొదటి సందేశమును బాబాయే పంపారు కదా! గుర్తించడంలో ఒక్కొక్కరూ ఒక్కోలా సమయమును తీసుకున్నారు. కావున సదా ఉల్లాస, ఉత్సాహాలలో ఉండే ఆత్మలకు ఒకే బలము, ఒకే విశ్వాసంలో ఉండే పిల్లలకు, పిల్లలు ధైర్యమును ఉంచితే బాబా సహాయం చేస్తారు అన్నది సదా అనుభవమవుతూ ఉంటుంది. 'అవ్వవలసిందే' అన్నది ధైర్యము. ఈ ధైర్యము ద్వారానే స్వతహాగానే సహాయానికి పాత్రులుగా అయిపోతారు మరియు ఈ ధైర్యపు సంకల్పానికి ముందు మాయ ధైర్యహీనంగా అయిపోతుంది. అవుతుందో లేదో తెలియదో, నేను చేయగలుగుతానో లేదో అన్న ఈ సంకల్పము చేయడం మాయను ఆహ్వానించడం. మీరు ఆహ్వానించినప్పుడు మరి మాయ ఎందుకు రాదు? ఈ సంకల్పము రావడము అనగా మాయకు దారిని ఇవ్వడము. మీరు దారి తెరిచి ఉంచినప్పుడు మరి అది ఎందుకు రాదు? అర్దకల్పం ప్రీతిని ఉంచిన మాయ దారి లభించాక మరి ఎందుకు రాదు? కావున సదా ఉల్లాస ఉత్సాహాలతో ఉండే ధైర్యవంతులైన ఆత్మలుగా అవ్వండి. విధాత మరియు వరదాత అయిన తండ్రి సంబంధంతో బాలకుల నుండి యజమానులుగా అయిపోయారు. సర్వ ఖజానాలకు యజమానులు. ఆ ఖజానాలలో అప్రాప్తి అన్న వస్తువేదీ లేదు. ఇటువంటి యజమానులు ఉల్లాస ఉత్సాహాలలో లేకపోతే మరి ఇంకెవరుంటారు? 'మేమే అలా ఉండేవారము, మేమే అలా ఉన్నాము, మళ్ళీ మేమే అలా ఉంటాము' అన్న స్లోగన్ ను సదా మస్తకంలో స్మృతిరూపంలో ఉంచుకోండి. ఇది గుర్తుంది కదా! ఈ స్మృతే ఇక్కడివరకు తీసుకువచ్చింది. సదా ఇదే స్మృతిలో ఉండండి. అచ్ఛా!

ఈరోజు డబల్ విదేశీయులు అందరికన్నా ఎక్కువ దూరదేశవాసులు. దూరం నుండి వచ్చే పిల్లలను విశేషంగా కలుసుకునేందుకు వచ్చారు. భారతదేశపు పిల్లలు కూడా అధికారీ పిల్లలే. అయినా ఛాన్స్ లర్ గా అయి చాన్స్ ఇస్తారు. కావున భారతదేశంలో మహాదానులుగా అయ్యే ఆచార వ్యవహారాలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. అందరూ తమ తమ రూపాలలో విశ్వసేవ యొక్క మహా యజ్ఞంలో సహయోగమునిచ్చారు. ప్రతిఒక్కరూ ఎంతో లగనంతో చాలా మంచి పాత్రను పోషించారు. సర్వుల యొక్క ఒకే ఒక్క సంకల్పం ద్వారా విశ్వంలోని అనేక ఆత్మలకు బాబా సమీపంగా తీసుకువచ్చే సందేశము లభించింది. అందరూ ఇదే సందేశం ద్వారా జాగృతులైన జ్యోతులలా అనేకులను మేల్కొల్పుతూ ఉంటారు. డబల్ విదేశీయులైన పిల్లలు తమ దృఢ సంకల్పమును సాకారంలోకి తీసుకువచ్చారు. భారతవాసులైన పిల్లలు కూడా పేరును వ్యాపింపజేసేవారు అనేకులు సందేశమును చేర్చే విశేష ఆత్మలను సమీపంగా తీసుకువచ్చారు. కలమధారులను(పత్రికేయులు) కూడా స్నేహము మరియు సంపర్కంతో సమీపంగా తీసుకువచ్చారు. కలము యొక్క శక్తి మరియు వాచాశక్తి ఈ రెండూ కలిసి సందేశపు జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు. దీనికొరకు డబల్ విదేశీయులైన పిల్లలకు మరియు దేశంలో సమీపంగా ఉండే పిల్లలకు ఇరువురికీ అభినందనలు. డబల్ విదేశీయులైన పిల్లలు శక్తిశాలీ శబ్దమును వ్యాపింపజేసేందుకు నిమిత్తులైన విశేష ఆత్మలకు, ఇరువురికీ అభినందనలు. డబల్ విదేశీయులైన పిల్లలు శక్తిశాలీ శబ్దమును వ్యాపింపజేసేందుకు నిమిత్తులైన విశేష ఆత్మలను తీసుకువచ్చారు, దాని కొరకు కూడా అభినందనలు. బాబా అయితే సదా పిల్లల సేవాధారి. మొదట పిల్లలు. బాబా వెన్నెముక కదా! ముందు మైదానంలోకి పిల్లలే వస్తారు. శ్రమ పిల్లలది, ప్రేమ బాబాది. అచ్ఛా,

ఇలా సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండేవారికి, సదా బాప్ దాదాల సహాయానికి పాత్రులైన, ధైర్యవంతులైన పిల్లలకు, సదా సేవ యొక్క లగనంలో మగనమై ఉండేవారికి, సదా స్వయమునకు ప్రాప్తించిన సంతోషాల ద్వారా సర్వ ఆత్మలకు, శక్తులను ప్రాప్తింపజేసేవారికి, ఇటువంటి బాబా యొక్క సదా అధికారులకు లేక బాలకుల నుండి యజమానులుగా అయ్యే పిల్లలకు బాప్ దాదాల విశేష స్నేహ సంపన్న ప్రియస్మృతులు మరియి నమస్తే.

జానకి దాదీతో – బాబా సమాన భవ అన్న వరదానులే కదా! డబల్ సేవ చేస్తున్నావు, నీ మనసా సేవ యొక్క సఫలత చాలా బాగా కనిపిస్తోంది, నీవు సఫలతా స్వరూపం యొక్క ప్రత్యక్ష ప్రమాణానివి. అందరూ బాబాతో పాటు ఈ సంతానం యొక్క గుణాన్ని కూడా గానం చేస్తారు. బాబా మీ తోడుగా అంతా చ్టుటి వస్తారు కదా! నీవు చక్రవర్తీ రాజువు. ప్రకృతీజీత్ ఆత్మ యొక్క ప్రత్యక్ష పాత్రను పోషిస్తున్నావు. ఇప్పుడు సంకల్పం ద్వారా కూడా సేవాపాత్ర మంచిగా నడుస్తోంది. ప్రత్యక్ష ప్రమాణము బాగుంది. ఇప్పుడిక చాలా పెద్ద, పెద్దవారు వస్తారు. విదేశం వారి శబ్దము దేశం వారి వరకు చేరుకుంటుంది. విదేశీ పిల్లలు సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలకు మంచి ప్రత్యక్ష ప్రమాణమును చూపించారు, కావున అందరివైపు నుండి మీకు చాలా, చాలా అభినందనలు. మంచి మైక్ ను తీసుకువచ్చారు. స్మృతి స్వరూపులుగా అయి సేవ చేసారు, కావున సఫలత లభించింది. మంచి పూదోటను తయారుచేశారు. అల్లా తమ పూదోటను చూస్తున్నారు. జన్మించడం నుండే ఇంకా లక్కీగా, లవ్లీగా ఉన్నావు. జన్మయే అదృష్టంతో జరిగింది. ఎక్కడకు వెళ్ళినా ఆ స్థానము లక్కీగా అయిపోతుంది. చూడండి లండన్ భూమి ఎంత లక్కీగా అయిపోయింది! ఎక్కడ చ్టుటి వచ్చినా ఏ కానుకను ఇచ్చి వస్తావు? భాగ్యవిధాత ద్వారా భాగ్యం ఏదైతే లభించిందో ఆ భాగ్యాన్ని పంచివస్తావు, అందరూ నిన్ను ఏ దృష్టితో చూస్తారో తెలుసా? నీవు భాగ్యసితారవు. ఎక్కడైతే సితార మెరుస్తుందో అక్కడ అంతా ప్రకాశమయమైపోతుంది. ఇలా అనుభవం చేసుకుంటావు కదా! అడుగులు బిడ్డవి మరియు సహాయం బాబాది. బాబాను అనుసరించే విధముగా ఉన్నావు కాని సహచారిని బాగా అనుసరించావు (జానకి దాదీ). తాను కూడా సమానంగా అయ్యే రేసును మంచిగా చేస్తుంది. అచ్చా!

గాయత్రి అక్కయ్యతో (న్యూయార్క్) గాయత్రి కూడా తక్కువేమీ కాదు, చాలా మంచి సేవాసాధనాన్ని ఉపయోగిస్తుంది. ఏ ఆత్మలైతే నిమిత్తంగా అయి మధువనంవరకు చేర్చారో ఆ నిమిత్తమైనవారిపై కూడా బాప్ దాదా మరియు పరివారపు శుభ స్నేహపు పుష్ప వర్షము జరుగుతూ ఉంటుంది. ఎంతగా అయితే శైలి మంచి ఆత్మగా ఉందో అంతగానే ఈ సంతానము(రాబర్ట్ ముల్లరి) కూడా ఎంతో మంచిగా సేవాక్షేత్రంలో సహయోగి ఆత్మగా ఉన్నారు. సత్యమైన హృదయంపై తండ్రి సంతుష్టమవుతారు. స్వచ్ఛ హృదయం కలవారు కావుననే బాబా స్నేహమును, బాబా శక్తిని సహజంగా క్యాచ్ చేయగలగుతున్నారు. ఉల్లాస ఉత్సాహాలు మరియు సంకల్పాలు చాలా బాగున్నాయి. సేవలో మంచిగా ముందుకువెళతారు. బాప్ దాదా కూడా నిమిత్తులైన పిల్లలను చూసి హర్షిస్తారు. సేవలో ఎగిరేకళలో వెళ్ళే ఫరిస్తా స్వరూపానివి అని అతడికి చెప్పండి మరియు ఇలాగే అనుభవం చేసుకుంటూ ఉండమని చెప్పండి. అచ్ఛా- అందరి సహయోగం ద్వారా సఫలత మధువనం వరకు వచ్చి చేరుకుటోంంది. ఎవరి పేరును తీసుకోవడం లేదు కాని నా గురించే బాబా చెబుతున్నారు అని అందరూ భావించండి, ఎవరూ తక్కువ కాదు. మేము మొదట సేవలోకి వచ్చాము అని భావించండి. చిన్న, పెద్ద అందరూ తనువు, మనస్సు, ధనము, సంకల్పాలు, సమయము అన్నింనీ సేవలో వినియోగించారు.

మురళి అన్నయ్య మరియు రజని అక్కయ్యలతో:-

బాప్ దాదాల స్నేహపు దారము ఇక్కడకు లాక్కొచ్చింది కదా! సదా ఇప్పుడు ఏమి గుర్తుంటుంది? శ్వాస శ్వాసలోను, క్షణ క్షణము ఏమి గుర్తుంటుంది? సదా హృదయం నుండి బాబా అన్న పదమే వెలువడుతుంది కదా! మనస్సు యొక్క సంతోషమును స్మృతి యొక్క అనుభవం ద్వారా అనుభవం చేసుకున్నారు. ఇప్పుడు ఏకాగ్రులై ఏదైతే ఆలోచిస్తారో అదంతా ముందుకువెళ్ళేందుకు సాధనంగా అయిపోతుంది. కేవలం ఒకే బలము, ఒకే విశ్వాసంతో ఏకాగ్రులై ఆలోచించండి. నిశ్చయంలో ఒకే బలము, ఒకే విశ్వాసము ఉన్నట్లయితే ఏదైతే జరుగుతుందో అదంతా మంచియే జరుగుతుంది. బాప్ దాదా సదా తోడుగా ఉంటారు మరియు సదా అలా ఉంటారు. మీరు ధైర్యవంతులు కదా! బాప్ దాదా పిల్లల ధైర్యము మరియు నిశ్చయమును చూసి ఆ ధైర్యానికి అభినందనలు తెలియజేస్తారు. నిశ్చింత చక్రవర్తి పిల్లలు నిశ్చింత చక్రవర్తులే కదా! డ్రామా యొక్క రచన అయితే సమీప రత్నాలుగా చేసేసింది. తోడు కూడా చాలా మంచిగా లభించింది. సాకారములోని తోడు కూడా శక్తిశాలిగా ఉంది. ఆత్మకు తోడుగా బాబా అయితే ఉండనే ఉన్నారు. డబల్ లిఫ్ట్ లభించింది. కావున నిశ్చింత మహారాజులు. సమయానికి పుణ్యాత్మగా అయి పుణ్య కార్యమును చేశారు. కావున బాప్ దాదాల సహయోగానికి సదా పాత్రులుగా ఉన్నారు. ఎంతగా పుణ్యానికి అధికారులుగా అయ్యారు! పుణ్య స్థానానికి నిమిత్తులుగా అయ్యారు. ఏవిధంగానైనా పిల్లల భాగ్యాన్ని తయారుచేసే తీరారు కదా! పుణ్యపు మూలధనము పోగైంది. మురళీధరుని మురళీకి మీరు మాస్టర్ మురళి. బాబా చేయి సదా చేతిలో ఉంది. కావున సదా స్మృతి చేస్తూ శక్తిని తీసుకుంటూ ఉండండి. బాబా ఖజానాలేవైతే ఉన్నాయో అవి మీ ఖజానాలు కూడా. బాప్ దాదా అయితే ఇంటిపిల్లలను ఇంటికి యజమానులుగా భావిస్తారు. పరమార్థము మరియు వ్యవహారము రెండూ జతలో ఉండాలి. వ్యవహారంలో కూడా తోడుగా ఉండాలి. అచ్ఛా!

యు.కె.గ్రూపుతో:- అందరూ స్వయమును స్వరాజ్యాధికారులుగా, విశ్వరాజ్యాధికారులుగా భావిస్తున్నారా? లండన్ రాజధాని కదా! కావున రాజధానిలో ఉంటూ మీ రాజ్యము సదా గుర్తుంటుంది కదా! రాణిమహలును చూస్తూ మీకు మీ మహళ్ళు గుర్తుకువస్తున్నాయా? మీ మహళ్ళు ఎంత సుందరంగా ఉంటాయో మీకు తెలుసు కదా! మీ రాజ్యము ఎలా ఉంటుందంటే ఇప్పటివరకు కూడా అటువంటి రాజ్యము లేదు, ఉండజాలదు. ఇటువంటి నషా ఉందా? ఇప్పుడైతే అంతా వినాశనమైపోతుంది కాని మీరైతే భారతదేశంలోకి వచ్చేస్తారు కదా! ఇది పక్కాయే కదా! ఎక్కడెక్కడైతే బ్రాహ్మణ ఆత్మలు ఎంతగా సేవ చేశారో ఆ స్థానాలన్నీ పిక్నిక్ స్థానాలుగా తప్పకుండా ఉంటాయి. జనాభా తక్కువగా ఉంటుంది. ఇంతి విస్తారం యొక్క అవసరం ఉండదు. అచ్ఛా! మీ ఇల్లు, మీ రాజ్యము, మీ తండ్రి, మీ కర్తవ్యము అన్నీ గుర్తుండాలి.

ప్రశ్న:- సదా ముందుకు వెళ్ళేందుకు సాధనం ఏమి?

జవాబు:- జ్ఞానము మరియు సేవ. ఏ పిల్లలైతే జ్ఞానమును బాగా ధారణ చేస్తారో మరియు సేవ చేయాలనే అభిరుచి ఎంతగానో ఉంటుందో వారు ముందుకువెళుతూ ఉంటారు. వేలాది భుజాలు కలిగిన తండ్రి మీకు తోడుగా ఉంటారు కావున సహచరుని సదా తోడుగా ఉంచుకుంటూ ముందుకువెళుతూ ఉండండి.

ప్రశ్న:- ప్రవృత్తిలో ఎవరైతే సదా సమర్పితులై ఉంటారో వారి ద్వారా ఏ సేవ స్వతహాగా జరుగుతుంది?

జవాబు:- ఇటువంటి ఆత్మల శ్రేషఠసహయోగం ద్వారా సేవారూపీ వృక్షము ఫలీభూతమౌతుంది. అందరి సహయోగమే వృక్షానికి నీరుగా అయిపోతుంది. ఏ విధంగా వృక్షానికి నీరు లభిస్తే వృక్షం నుండి ఫలము మంచిగా వెలువడుతుందో అలాగే శ్రేష్ఠ సహయోగి ఆత్మల సహయోగం ద్వారా వృక్షము ఫలీభూతమౌతుంది. కావున ఈ విధంగా బాప్దాదాల హృదయ సింహాసనాధికారులు, సేవ యొక్క ధునిలో సదా ఉండేవారు, ప్రవృత్తిలో కూడా సమర్పితులై ఉండే పిల్లలే కదా! అచ్ఛా! ఓం శాంతి.

Comments