18-01-1985 అవ్యక్త మురళి

18-01-1985          ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా        మధువనము  

'' ప్రతిజ్ఞ ద్వారా ప్రత్యక్షత ''
సమర్థమైన ఈ రోజున సమర్థుడైన తండ్రి తమ సమర్థమైన పిల్లలను చూస్తున్నారు. ఈ రోజు విశేషంగా బ్రహ్మాబాబా ద్వారా విశేషమైన పిల్లలకు సమర్థతను వరదాన రూపంలో అర్పించే రోజు. ఈ రోజు బాప్దాదా తమ శక్తి సైన్యాన్ని విశ్వ వేదిక పైకి తీసుకొస్తారు కనుక ఈ రోజు సాకార స్వరూపంలో శివశక్తులు ప్రత్యక్ష రూపంలో(ప్రాక్టికల్గా) పాత్రను అభినయించే రోజు. శక్తుల ద్వారా శివబాబా ప్రత్యక్షమై స్వయం గుప్త రూపంలో పాత్రను అభినయిస్తూ ఉంటారు. శక్తులను ప్రత్యక్ష రూపంలో విశ్వము ముందు విజయులుగా ప్రత్యక్షం చేస్తారు. ఈ రోజు పిల్లలకు బాప్దాదా ద్వారా 'సమాన్ భవ' అను వరదానము లభించే రోజు. ఈ రోజు విశేషంగా స్నేహీ పిల్లలను తన కనులలో స్నేహ స్వరూపంతో ఇముడ్చుకునే రోజు. ఈ రోజు బాప్దాదా విశేషంగా సమర్థమైన స్నేహీ పిల్లలను మధురమైన మిలనము ద్వారా అవినాశి మిలనము చేసే వరదానమునిస్తారు. ఈ రోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలందరి మొదటి మనసా సంకల్పము - మధురమైన మిలనము జరుపుకొని, మధురాతి మధురమైన మహిమను హృదయపూర్వకంగా పాడి, విశేషమైన స్నేహ అలలను వ్యాపింపజేసే రోజు. ఈ రోజు అమృతవేళలో అనేక పిల్లల స్నేహ ముత్యాల మాలలు, ప్రతి ముత్యము మధ్యలో ''బాబా, మధురమైన బాబా'' అన్న పదాలు మెరిసిపోతూ ఉండడం చూస్తున్నారు. ఎన్ని మాలలుంటాయి! ఈ పాత ప్రపంచంలో నవరత్నాల మాల అని అంటారు. కాని బాప్దాదా వద్ద అనేక అలౌకిక సాటిలేని అమూల్యమైన రత్నాల మాలలున్నాయి. ఇటువంటి మాలలు సత్యయుగంలో కూడా ధరించరు. ఈ మాలలు కేవలం బాప్దాదా మాత్రమే ఈ సమయంలో పిల్లల ద్వారా ధరిస్తారు. ఈ రోజు అనేక బంధనాలలో ఉన్న గోపికల హృదయము నుండి వియోగము మరియు స్నేహముతో సంపన్నమైన మధురమైన గీతాలు వినే రోజు. బాప్దాదా ఇటువంటి లగ్నములో, ప్రేమలో మగ్నమై ఉండే అపురూపమైన స్నేహీ ఆత్మలకు ఇందుకు బదులుగా ఈ సంతోషకరమైన వార్తను వినిపిస్తున్నారు - ఇప్పుడు ప్రత్యక్షతా ఢంకా మ్రోగనే మ్రోగుతుంది. అందువలన ఓ సహజయోగీ పిల్లలూ, మిలనము చేయాలనే తపనతో ఉండే వియోగీ పిల్లలూ, ఈ కొద్ది రోజులు సమాప్తమవ్వనే అవుతాయి. సాకార స్వీట్ హోంలో మధురమైన మిలనము జరగనే జరుగుతుంది. ఆ శుభమైన రోజు సమీపానికి వస్తోంది.
ఈ రోజు ప్రతి పుత్రుడు హృదయపూర్వకంగా దృఢ సంకల్పము చేయడం ద్వారా సహజ సఫలత అనే ప్రత్యక్ష ఫలాన్ని పొందే రోజు. ఈ రోజు ఎంత మహోన్నతమైనదో విన్నారా! ఇటువంటి మహోన్నతమైన రోజున పిల్లలందరు ఎక్కడ ఉన్నా, దూరంగా ఉన్నా హృదయానికి సమీపంగా ఉన్నారు. ప్రతి పుత్రుని స్నేహానికి మరియు బాప్దాదాను ప్రత్యక్షము చేసే సేవ చేయాలనే ఉమంగ - ఉత్సాహాలకు రిటర్న్గా బాప్దాదా కూడా స్నేహభరిత అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే మెజారిటి పిల్లల ఆత్మిక సంభాషణలో విశేషంగా స్నేహము మరియు సేవ చేయాలనే ఉత్సాహాల అలలు ఉన్నాయి. ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షత ఈ రెండు విషయాలు విశేషంగా ఉన్నాయి. వింటూ వింటూ బాప్దాదా ఏం చేస్తారు? వినిపించేవారు ఎంతోమంది ఉంటారు కాని ఎంతమంది ఉన్నా హృదయాభిరాముడైన తండ్రి, పిల్లల హృదయాల నుండి వెలువడిన అంతమంది మాటలు ఒకే సమయంలో వినగలరు. ప్రతిజ్ఞలు చేసేవారికి బాప్దాదా అభినందనలు తెలుపుతారు. కాని ఈ ప్రతిజ్ఞను ప్రతిరోజు అమృతవేళలో సదా రివైజ్ చేస్తూ ఉండాలి. ప్రతిజ్ఞ చేసి వదిలేయరాదు. చేసే తీరాలి, అయ్యే తీరాలి అనే ఈ ఉమంగ - ఉత్సాహాలను సదా వెంట ఉంచుకోవాలి. దీనితో పాటు కర్మలు చేస్తూ ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ పద్ధతి ద్వారా స్మృతి స్థితిని నిరంతరం తయారు చేసుకోవడంలో సఫలతను పొందుతున్నారో అలా కర్మలు చేస్తూ మీ కొరకు మిమ్ములను మీరు చెక్ చేసుకునేందుకు సమయాన్ని ఫిక్ ్స చేసుకోండి. అలా చేసుకుంటే ఆ నిశ్చిత సమయం ప్రతిజ్ఞను సఫలతా స్వరూపంగా చేస్తూ ఉంటుంది.
ప్రత్యక్షము చేయాలనే ఉమంగ-ఉత్సాహాలు కలిగిన పిల్లలకు బాప్దాదా తన రైట్హ్యాండ్ రూపములో చూస్తూ స్నేహముతో షేక్హ్యాండ్ ఇస్తున్నారు. సదా అల్లారు ముద్దు పిల్లల నుండి తండ్రి సమానంగా అయ్యి, ఉత్సాహము వలన కలిగే ధైర్యముతో, బాప్దాదా నుండి పదమారెట్ల సహాయానికి పాత్రులుగా ఉండనే ఉన్నారు. సుపాత్రులు అనగా పాత్రులు(యోగ్యులు).
మూడవ రకం పిల్లలు - రాత్రింబవళ్లు స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. స్నేహమునే సేవగా భావిస్తారు. మైదానం పైకి రారు. కాని 'నా బాబా, నా బాబా' అనే పాటను తప్పకుండా పాడ్తూ ఉంటారు. తండ్రిని కూడా మధురమైన రూపంతో మోహింపజేస్తూ ఉంటారు. 'నేను ఎవరినైనా, ఎలా ఉన్నా మీ దానిని(జో హూ, జైసా హూ ఆప్కా హూ...)' అంటున్న విశేషమైన స్నేహీ ఆత్మలు కూడా ఉన్నారు. ఇటువంటి స్నేహీ పిల్లలకు బాప్దాదా వారి స్నేహానికి ప్రతిఫలంగా స్నేహమైతే తప్పకుండా ఇస్తారు కాని రాజ్య అధికారులుగా అవ్వాలనే ధైర్యాన్ని కూడా కలిగిస్తారు. రాజ్యములోకి వచ్చేవారిగా అయ్యేందుకు స్నేహీలుగా ఉన్నా సరిపోతుంది. రాజ్య అధికారులుగా అవ్వాలంటే స్నేహముతో పాటు అధ్యయన శక్తి అనగా జ్ఞాన శక్తి, సేవా శక్తి కూడా అవసరము. కావున ధైర్యము చేయండి. తండ్రి సహాయకారులుగా ఉండనే ఉన్నారు. స్నేహానికి బదులు సహయోగము తప్పకుండా లభిస్తుంది. కొంచెం ధైర్యముతో, అటెన్షన్తో రాజ్య అధికారులుగా అవ్వగలరు. ఈ రోజు ఆత్మిక సంభాషణలో బదులు ఏమిచ్చారో విన్నారా? వతనంలో దేశ - విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లల శోభను చూచారు. విదేశి పిల్లలు కూడా లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్లి(చివర్లో వచ్చినా వేగంగా వెళ్లి) ఫస్ట్లో రావాలనే ఉమంగ - ఉత్సాహాలతో బాగా ముందుకు వెళ్తున్నారు. విదేశాల లెక్కతో ఎంత దూరంగా ఉన్నామో అంత బాబా హృదయానికి సమీపంగా ఉన్నామని వారు భావిస్తారు. కనుక వారు ఈ రోజు కూడా మంచి ఉమంగ - ఉత్సాహాలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. చాలామంది పిల్లలు చాలా మధురంగా ఉన్నారు, తండ్రిని కూడా మధురాతి మధురమైన మాటలతో ఒప్పిస్తూ, ఊరడిస్తూ ఉంటారు. చాలా అమాయక రూపంతో మాట్లాడ్తారు కాని చాలా చతురులు. మీరు మాట ఇవ్వండి (ప్రామిస్ చేయండి) అని అంటారు. ఈ విధంగా ఒప్పిస్తారు. తండ్రి ఏమంటారు? సంతోషంగా ఉండండి, ఆనందంగా సంపన్నంగా ఉండండి(ఆబాద్ రహో), వృద్ధి చెందుతూ ఉండండి (బఢ్తే రహో) అని అంటారు. మాటలేమో చాలా విస్తారంగా ఉన్నాయి. ఎన్నని వినిపిస్తాను, కానీ మాటలు చాలా మంచిగా, మజాగా మాట్లాడ్తారు. మంచిది.
సదా స్నేహంగా మరియు సేవ చేయాలనే ఉమంగ-ఉత్సాహములో ఉండేవారు, సదా సుపాత్రులుగా అయ్యి సర్వ ప్రాప్తులకు పాత్రులుగా అయ్యేవారు, సదా స్వంత కర్మల ద్వారా బాప్దాదా శ్రేష్ఠమైన దివ్య కర్తవ్యాన్ని ప్రత్యక్షము చేసేవారు, తమ దివ్య జీవితము ద్వారా బ్రహ్మాబాబా జీవిత కథను స్పష్టము చేయువారు - ఇటువంటి సర్వ సాథీ (బాప్దాదాకు) పిల్లలకు సమర్థులైన బాప్దాదా యాద్ప్యార్ ఔర్ నమస్తే.
దాదీజీ మరియు జానకీ దాదీ బాప్దాదా ఎదురుగా కూర్చున్నారు
ఈ రోజు మీ స్నేహితురాలు(దీదీ) కూడా ప్రత్యేకంగా ప్రియస్మృతులను తెలియజేశారు. ఈ రోజున ఆమె కూడా వతనంలో ఇమర్జ్ అయ్యింది. కావున అమెకు కూడా అందరి స్మృతి ఉంది. ఆమె కూడా అడ్వాన్స్ పార్టీలో తన సమూహాన్ని(గ్రూప్ను) శక్తివంతంగా చేసుకుంటోంది. వారి కార్యం కూడా మీ అందరి కర్తవ్యంతో పాటే ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇప్పుడైతే సంబంధము మరియు దేశానికి సమీపంగా ఉంది. అందువలన వారిలో కూడా చిన్న చిన్న గ్రుపులు, కారణంగా అకారణంగా పరస్పరం పరిచయం లేకున్నా కలుసుకుంటూ ఉంటారు. సంపూర్ణ స్మృతి లేదు కానీ మేమంతా కలిసి ఏదైనా కొత్త కార్యము చేయాలని బుద్ధిలో టచింగ్ ఉంది. ప్రపంచంలోని పరిస్థితులేవైతే ఉన్నాయో వాటి అనుసారంగా ఏ కార్యమునైతే ఎవ్వరూ చేయలేరో ఆ కార్యాన్ని మేము కలిసి చేయాలన్న టచింగ్ ద్వారా పరస్పరం తప్పకుండా కలుస్తారు. కాని ఇప్పుడు కొందరు చిన్న గ్రుపులుగా, కొందరు పెద్ద గ్రుపులుగా ఉన్నారు. కాని అన్ని రకాల వారు అక్కడకు వెళ్లారు. కర్మణా సేవ చేసేవారు కూడా వెళ్లారు, రాజ్య స్థాపన చేసే ప్లానింగ్ బుద్ధి గలవారు కూడా వెళ్లారు, తోడుగా ధైర్యము ఉల్లాసము పెంచేవారు కూడా వెళ్లారు. ఈ రోజు ఈ పూర్తి గ్రూపులో ఈ మూడు రకాల పిల్లలను చూశారు. మూడు రకాల వారూ అవసరమే. కొందరు ప్లానింగ్ వారు, కొందరు కర్మలోకి తీసుకొచ్చేవారు, మరి కొందరు ధైర్యమును పెంచేవారు. గ్రూపు అయితే మంచిగానే తయారవుతోంది. కానీ రెండు గ్రూపులు కలిసి తోడుగా ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు ప్రత్యక్షత యొక్క విశేషత మేఘాల లోపలే ఉంది. మేఘాలు చెదిరిపోతున్నాయి కాని తొలగిపోలేదు. ఎంతెంత శక్తిశాలి మాస్టర్ జ్ఞాన సూర్యుని స్థితికి చేరుకుంటారో అంత ఈ మేఘాలు చెదిరిపోతాయి. ఇవి తొలిగిపోయినట్లైతే సెకండులో ఢంకా మ్రోగుతుంది. ఇప్పుడు చెదిరిపోతున్నాయి. ఆ పార్టీ కూడా తమ ఏర్పాట్లను బాగా చేసుకుంటోంది. ఎలాగైతే మీరు యూత్ ర్యాలీకి ప్లాను తయారు చేస్తున్నారో, అలా వారు కూడా ఇప్పుడు యువకులుగానే ఉన్నారు. వారు కూడా పరస్పరం తయారు చేస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు భారతదేశంలో అనేక పార్టీల విశేషత ఏదైతే ఉందో అది తగ్గిపోయి, ఒక్క పార్టీ ముందుకు వస్తోందో అలా బాహ్య ఐక్యతకు కూడా రహస్యముంది. అనేకత బలహీనమవుతోంది, ఒక్కటి శక్తిశాలిగా అవుతోంది. ఇది స్థాపనా రహస్యంలో సహయోగము యొక్క పాత్ర. వారు మనసుతో కలవలేదు, తప్పని పరిస్థితులలో విధి లేక కలుసుకున్నారు. కాని అలా కలుసుకోవడంలో కూడా రహస్యముంది. ఇప్పుడు స్థాపన అయ్యే గుహ్య పద్ధతి, ఆచారము స్పష్టమయ్యే సమయం సమీపంగా వస్తోంది. అప్పుడు మీకు అడ్వాన్స్ పార్టీ వారు ఏమి చేస్తున్నారో మరియు మీరేం చేస్తున్నారో తెలిసిపోతుంది. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు అని మీరు కూడా ప్రశ్నిస్తున్నారు, వారు కూడా మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కాని ఇరువురూ డ్రామానుసారంగా ముందుకు వెళ్తున్నారు.
జగదంబ అయితే చంద్రుని వంటిది. కావున చంద్రుని వంటి జగదంబతో పాటు దీదీకి కూడా ప్రారంభం నుండి విశేషమైన పాత్ర ఉంది. కార్యంలో తోడుగా ఉండే పాత్ర ఉంది. తాను (మమ్మా) చంద్రునిలా శీతలమైనది, కాని దీదీ తీవ్రమైనది. ఇరువురూ కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆమెను కొంచెం పెద్దగా పెరగనివ్వండి. జగదంబ అయితే ఇప్పుడు కూడా శీతలతా సకాశ్ను ఇస్తోంది. కాని ప్లానింగ్లో ముందుకు రావడంలో సహచరులు కూడా కావాలి కదా! పుష్పశాంత మరియు దీదీ వీరిరువురికి కూడా ప్రారంభంలో పరస్పరంతో లెక్క ఉంది. ఇక్కడ కూడా పరస్పరం ఇరువురి లెక్క సమీపంగా ఉంది. భావు(విశ్వకిశోర్) అయితే వెన్నెముకగా ఉన్నాడు. ఇందులో కూడా పాండవులు వెన్నెముకగా ఉన్నారు, శక్తులు ముందు ఉన్నారు. కావున అది కూడా ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకొచ్చే గ్రూపుగా ఉంది. ఇప్పుడు ప్లానింగ్ చేసేవారు కాస్త మైదానంలోకి వెళ్లినట్లయితే అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. మంచిది.
విదేశీ సోదరీ - సోదరులతో - అందరూ చివర్లో వచ్చినా వేగంగా వెళ్లి ఫస్ట్లో వచ్చే ఉల్లాస - ఉత్సాహాలు గలవారే కదా! సెకండు నెంబరు వారైతే ఎవ్వరూ లేరు కదా! లక్ష్యము శక్తిశాలిగా ఉంటే లక్షణాలు కూడా స్వతహాగా శక్తిశాలిగా ఉంటాయి. అందరూ ముందుకు వెళ్లడంలో ఉల్లాస - ఉత్సాహాలు కలిగిన వారుగానే ఉన్నారు. బాప్దాదా కూడా పిల్లలందరికి సదా డబల్లైట్గా అయ్యి ఎగిరేకళ ద్వారా నెంబరువన్లోకి రావలసిందేనని చెప్తున్నారు. ఎలాగైతే తండ్రి ఉన్నతోన్నతమైన వారో, అలా పిల్లలు ప్రతి ఒక్కరూ ఉన్నతోన్నతమైన వారే.
సదా ఉల్లాస - ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరేవారే ఎగిరేకళను అనుభవం చేస్తారు. ఈ స్థితిలో స్థితులై ఉండేందుకు సహజ సాధనము - ఏ సేవ చేస్తున్నా దానిని కరన్ కరావన్హార్(చేసి చేయించే) తండ్రి చేయిస్తున్నారు అని భావించడం. నేను కేవలం నిమిత్తంగా ఉన్నాను, చేయించేవారు చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు, ఈ స్మృతి ద్వారా సదా తేలికగా ఉంటూ ఎగురుతూ ఉంటారు. ఇదే స్థితిని సదా ముందుకు తీసుకెళ్తూ ఉండండి.
వీడ్కోలు సమయంలో - ఈ సమర్థమైన దినము సదా సమర్థంగా చేస్తూ ఉంటుంది. ఈ సమర్థ దినాన ఎవరైతే వచ్చారో వారందరూ విశేషంగా 'సమర్థ భవ' అన్న వరదానాన్ని సదా తోడుగా ఉంచుకోండి. ఏదైనా విషయము వచ్చినా ఈ రోజును మరియు ఈ వరదానాన్ని స్మృతిలోకి తెచ్చుకుంటే ఆ స్మృతి సమర్థతను తీసుకొస్తుంది. క్షణములో బుద్ధి రూపీ విమానము ద్వారా మధువనానికి వచ్చి చేరుకోండి. ఏమి ఉండేదో, ఎలా ఉండేదో, ఏ వరదానం లభించిందో గుర్తు చేసుకోండి. క్షణంలో మధువన వాసులుగా అవ్వడం ద్వారా సమర్థత వచ్చేస్తుంది. మధువనంలోకి వచ్చి చేరుకోవడమైతే వస్తుంది కదా! ఇది సహజమైనది. సాకారంలో అయితే చూశారు కదా! పరంధామంలోకి వెళ్లడం కష్టమనిపించినా మధువనంలోకి చేరుకోవడమైతే కష్టం కాదు. కావున క్షణంలో టికెట్ లేకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా మధువన నివాసులుగా అయిపోండి. అప్పుడు మధువనం సదా ధైర్యాన్ని, ఉల్లాసమును ఇస్తూ ఉంటుంది. ఇక్కడ అందరూ ధైర్యము, ఉల్లాసంతో ఉన్నారు కదా! ఎవరి వద్ద ఏ విధమైన బలహీనతా లేదు కదా! కావున ఇదే స్మృతి మళ్లీ సమర్థంగా చేస్తుంది. మంచిది.

Comments