17-05-1983 అవ్యక్త మురళి

17-05-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగము - ఆనంద దృశ్యాల యుగము.

ఈ రోజు బాప్దాదా తన చిన్న-పెద్ద నిశ్చింత చక్రవర్తులను చూస్తున్నారు. సంగమయుగములోనే ఇంతటి అతి పెద్ద చక్రవర్తుల సభ ఉంటుంది. ఏ యుగములోనూ ఇంతమంది చక్రవర్తుల సభ ఉండదు. ఈ సమయములోనే నిశ్చింత చక్రవర్తుల సభ అనండి లేక స్వరాజ్య సభ అనండి, అందరూ చూస్తున్నారు. మనమందరమూ ఈ శరీరానికి యజమానులమైన శుద్ధ ఆత్మలము అని చిన్నవారు, పెద్దవారు అందరూ దీనినే తెలుసుకుని, అంగీకరించి మరియు నడుచుకుంటారు. ఆత్మ ఎవరైంది? యజమాని. స్వరాజ్య అధికారి. నేను చక్రవర్తిని అని అతి చిన్న పిల్లవాడు కూడా ఒప్పుకుటాండు. కనుక చక్రవర్తుల సభ లేక స్వరాజ్య సభ ఎంత పెద్దదిగా ఉంది! చక్రవర్తులకే చక్రవర్తి లేక రాజులకు కూడా రాజుగా తయారుచేసేవారు - వర్తమానములోని రాజులనుండి భవిష్య రాజులు, ఇఅటువంటి రాజులను చూస్తుంటే, సర్వ నిశ్చింత చక్రవర్తులను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది! లక్షలాది పిల్లలు చక్రవర్తులుగా ఉన్న ఇఅటువంటి తండ్రి మొత్తము కల్పములో మరెవరైనా ఉంటారా? ఎవరినైనా అడిగితే ఏమంటారు? పసి పిల్లవాడు కూడా ''నేను లక్ష్మీనారాయణునిగా అవుతాను'' అని అంటాడు. పిల్లలందరూ ఇలాగే అనుకుంటారు కదా! ఇఅటువంటి తండ్రికి ఇఅటువంటి రాజా పిల్లలను చూసి ఎంత గర్వంగా ఉంటుంది! మీకందరికికూడా మేము కూడా రాజా ఫ్యామిలీకి చెందినవారము అని ఈ ఈశ్వరీయ నషా ఉంటుంది. రాజ్యవంశీయులేనా? మరి ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్క పిల్లవానిని చూస్తున్నారు. బాబాయొక్క ఎంతటి భాగ్యవంతమైన పిల్లలు! పిల్లలు ప్రతి ఒక్కరూ భాగ్యవంతులు. తోడుతోడుగా సమయముయొక్క సహయోగము ఉంది, ఎందుకంటే ఈ సంగమయుగము ఎంతచిన్న యుగమో అంతగా విశేషతలతో నిండి ఉన్న యుగము. సంగమయుగములో ఏ ప్రాప్తులైతే ఉన్నాయో అవి మరే ఇతర యుగములో ఉండజాలవు. సంగమయుగము ఉన్నదే ఆనంద దృశ్యాల యుగముగా. ఆనందాలే ఆనందాలు కదా! తిన్నాకూడా బాబాతోటి ఆనందంలో తినండి. నడిచినాకూడా భాగ్యవిధాత అయిన బాబా చేతిని పట్టుకుని నడవండి. జ్ఞాన అమృతాన్ని త్రాగుతున్నాకూడా జ్ఞాన దాత బాబా తోడుతోడుగా త్రాగండి. కర్మ చేస్తున్నాకూడా చేయించే బాబాతోపాటు నిమిత్తంగా చేసేవారుగా భావించి చెయ్యండి. నిద్రిస్తున్నాకూడా స్మృతి ఒడిలో నిద్రించండి. లేచినా కూడా భగవంతునితో ఆత్మిక సంభాషణ చెయ్యండి. మొత్తము దినచర్య అంతా బాబా మరియు మీరు. బాబా ఉన్నట్లయితే పాపము ఉండదు. అప్పుడేమవుతుంది? ఆనందాలే ఆనందాలు కదా! పిల్లలందరూ ఆనందాలలో ఉండటాన్ని బాప్దాదా చూస్తుండినారు. ఈ చిన్మ జన్మను తీసుకున్నదే ఆనందాలను జరుపుకోవానికి. తినండి, త్రాగండి, స్మృతి ఆనందంలో ఉండండి. ఈ అలౌకిక జన్మయొక్క ధర్మము అనగా ధారణ ''ఆనందము''లో ఉండటము. దివ్య కర్మ - సేవ ఆనందములో ఉండటము. జన్మ లక్ష్యమే ఆనందాలలో ఉండటము మరియు మొత్తము విశ్వమును అన్ని ఆనందాలు కల ప్రపంచముగా తయారుచెయ్యటము. మరి ఉదయమునుండి రాత్రి వరకు ఆనందపు దృశ్యాలలో ఉంటారు కదా! నిశ్చించ చక్రవర్తులై రాత్రింబవళ్ళను గడుపుతారు కదా! మరి ఈరోజు వతనములో ఏం చూసామో విన్నారా? నిశ్చింత చక్రవర్తుల సభ. చక్రవర్తులు ప్రతి ఒక్కరూ తమ స్మృతి ఆనందములో బాబా యొక్క హృదయ సింహాసనాధికారపు స్మృతి కలిగిన తిలకధారులుగా ఉన్నారు. అచ్ఛా - ఈరోజు మిలనము చేసే రోజు కనుక తమ చక్రవర్తులతో కలిసేందుకు వచ్చారు. అచ్ఛా-

సదా నిశ్చింత చక్రవర్తులు, ఆనందాల జీవితములో ఆనందపు దృశ్యాలను చూసేవారు, సదా భాగ్యవంతుడైన తండ్రితోపాటు ఉండేవారు అయిన ఇఅటువంటి స్వరాజ్య అధికారులు, హృదయ సింహాసనాధికారులు, పదమాపదమ భాగ్యశాలీ పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

చిన్న పిల్లలతో -

పిల్లలందరూ స్వయమును మహానాత్మలుగా భావించుకుంటూ చదువుకుంటున్నారా, ఆడుకుంటున్నారా, నడుస్తున్నారా? మేము మహానాత్మలము అన్న ఈ సంతోషమును ఎల్లప్పుడూ పెట్టుకోండి. మేము ఉన్నతోన్నతమైన భగవంతుని పిల్లలము అన్న ఈ నషాను ఉంచుకోండి. భగవంతుని చూసారా? ఎక్కడ చూసారు? మమ్మల్నికూడా భగవంతునితో కలిపించండి అని ఎవరైనా అన్నట్లైతే కలిపించగలరా? అందరూ భగవంతుని పిల్లలైనప్పుడు మరి భగవంతుని పిల్లలు ఎప్పుడూ పోట్లాడుకోరు కదా? చంచలత చేస్తారా? భగవంతుని పిల్లలు యోగులుగా ఉంటారు. మరి మీరు చంచలత ఎందుకు చూపిస్తున్నారు? సదా స్వయమును మహాన్ఆత్మలుగా యోగీ ఆత్మలుగా భావించండి. ఏమవుతారు? లక్ష్మి-నారాయణులుగా ఒకేసారవుతారా? లేక ఒకసారి లక్ష్మిగా అయితే, మరొకసారి నారాయణునిగా అవుతారా! లక్ష్మిగా అవ్వటము ఇష్టమా? అచ్ఛా - సదా నారాయణునిగా అవ్వాలనుకున్నట్లైతే సదా శాంతయుతమైన యోగీ జీవితములో ఉండాలి మరియు ప్రతిరోజూ ఉదయమే లేచి గుడ్మార్నింగ్ తప్పకుండా చెప్పాలి. ఆలస్యంగా లేవటము మరియు త్వరత్వరగా తయారై వెళ్ళటము, ఇలా ఉండకూడదు.3 నిముషాలైనా స్మృతిలో కూర్చుని తప్పకుండా గుడ్మార్నింగ్ చెప్పాలి, మాట్లాడాలి, తరువాత తయారవ్వండి... ఈ వ్రతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకవేళ గుడ్మార్నింగ్ చెప్పనట్లయితే భోంచెయ్యకూడదు. భోజనం గుర్తున్నట్లయితే మొదట గుడ్మార్నింగ్ చెప్పటం గుర్తుంటుంది. గుడ్మార్నింగ్ చెప్పి, అప్పుడు భోంచెయ్యాలి. జ్ఞాన చదువును గుర్తుంచుకోండి, మంచి గుణాలను ధారణ చేసినట్లయితే విశ్వములో మీరు ఆత్మిక గులాబీలుగా అయ్యి సుగంధాన్ని వ్యాపింపచేస్తారు. గులాబీ పుష్పము ఎల్లప్పుడూ వికసించి ఉంటుంది మరియు సదా సుగంధాన్ని ఇస్తుంది. మరి మీరు కూడా అఅటువంటి సుగంధభరిత పుష్పాలే కదా! ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారా లేక ఎప్పుడైనా కాస్త దుఃఖము కూడా కలుగుతుంటుందా? ఎప్పుడైనా ఏదైనా వస్తువు దొరకకపోతే అప్పుడు దుఃఖము కలుగుతుండవచ్చు లేక మమ్మీ-డాడీ ఏదైనా అంటే అప్పుడు దుఃఖము కలుగుతుండవచ్చు. మమ్మీ-డాడీ ఏదైనా అనేవిధంగా మీరు అస్సలు చెయ్యనే చెయ్యకండి. ఫరిస్తాలు కదతొ నడుస్తున్నారు అన్నట్లుగా నడవండి. ఫరిస్తాల వద్ద శబ్దము ఉండదు. మనుష్యులెవరైతే ఉంటారో వారు శబ్దం చేస్తారు. బ్రాహ్మణులనుండి ఫరిస్తాలైన మీరు శబ్దము చెయ్యకండి. ఎవ్వరికీ అసలు తెలియనే తెలియనివిధంగా నడవండి. ఫరిస్తాలుగా అయ్యి తినండి, త్రాగండి, నడవండి. బాప్దాదా పిల్లలందరికీ చాలా-చాలా అభినందనలను ఇస్తున్నారు. చాలా మంచి పిల్లలు మరియు ఎల్లప్పుడూ మంచివారుగానే అయ్యి ఉండాలి. అచ్ఛా.

అమ్మాయిలతో - కుమారీ జీవితమునకు ఏ మహిమ ఉంది? కుమారీలను పూజిస్తారు, ఎందుకని? పవిత్ర ఆత్మలు. మరి పవిత్ర ఆత్మలందరూ పవిత్ర స్మృతిద్వారా ఇతరులను కూడా పవిత్రులుగా చేసే సేవలో ఉంటారు కదా! చిన్నవారుగానీ లేక పెద్దవారుగానీ, బాబా పరిచయమునైతే అందరికీ ఇవ్వగలరు కదా! చిన్నవారు కూడా చాలా మంచిగా భాషణ చేస్తారు. బాప్దాదా అందరికంటే అతి చిన్న కుమారీని పెద్ద స్టేజ్పై భాషణ చెయ్యమని చెప్పినట్లయితే సిద్ధముగా ఉన్నారా? సంకోచించరు కదా! భయపడరు కదా! సదా స్వయమును విశ్వములోని సర్వాత్మల కల్యాణమును చేసే విశ్వ కల్యాణకారీ ఆత్మగా భావించండి. మామూలు సాధారణ కుమారీలు కారు కానీ శ్రేష్ఠ కుమారీలు. శ్రేష్ఠ కుమారీలు శ్రేష్ఠమైన పని చేస్తారు కదా! అన్నింటికంటే శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన కార్యము - బాబా పరిచయమును ఇచ్చి బాబావారిగా తయారుచెయ్యటము. ప్రపంచములోని వారు భ్రమిస్తూ ఉన్నారు. వెతుకుతూ ఉన్నారు మరియు మీరు తెలుసుకున్నారు, పొందారు, ఎంతటి అదృష్టవంతులు, భాగ్యవంతులు! భగవంతునికి చెందినవారుగా అయిపోయారు, దీనికంటే పెద్ద భాగ్యము మరేదైనా ఉంటుందా! కనుక సదా భాగ్యవంతమైన ఆత్మను - ఈ సంతోషములో ఉండండి. ఒకవేళ ఈ సంతోషము పోయినట్లయితే మరల ఒక్కోసారి ఏడుస్తారు, ఒక్కోసారి చంచలత చేస్తారు. పరస్పరములో కూడా ఎల్లప్పుడూ ప్రేమతో ఉండండి మరియు లౌకిక తల్లిదండ్రులు చెప్పినవాటికి ఆజ్ఞాకారులుగా ఉండండి. పారలౌకిక తండ్రి స్మృతిలో ఎల్లప్పుడూ ఉండండి, అప్పుడే శ్రేష్ఠ కుమారీలుగా అవ్వగలరు. కనుక సదా స్వయమును శ్రేష్ఠ కుమారిగా, పూజ్య కుమారిగా భావించండి. మందిరాలలో శక్తుల పూజ జరుగుతుంది, వారు మీరే కదా! ఒక్కొక్క కుమారి చాలా పెద్ద కార్యమును చెయ్యగలదు. విశ్వ పరివర్తిన చేసేందుకు నిమిత్తముగా అవ్వగలదు. విశ్వ పరివర్తన చేసే కార్యమును బాప్దాదా పిల్లలకు ఇచ్చారు. కనుక సదా బాబా మరియు సేవల స్మృతిలో ఉండండి. విశ్వ పరివర్తన చేసేందుకు ముందు మీ పరివర్తన చేసుకోండి. మొదటి జీవితము ఏదైతే ఉందో దానినుండి పూర్తిగా మారిపోయి, శ్రేష్ఠ ఆత్మను, పవిత్ర ఆత్మను, మహానాత్మను, భాగ్యవాన్ ఆత్మను, అన్న ఈ స్మృతిలోనే ఉండండి, అంతే. స్కూల్ లేక కాలేజ్కు వెళ్ళినప్పుడు ఈ స్మృతినైతే మర్చిపోరు కదా. సాంగత్యపు ప్రభావమైతే పడదు కదా! తినేవైపుకు, త్రాగేవైపుకు ఆకర్షణ అయితే పోదు కదా. కాస్త బిస్క్ తింము, కొంచెం ఐస్క్రీమ్ తింము అన్న ఈ కోరికలైతే ఉండవు కదా! ఎల్లప్పుడూ స్మృతిలో ఉంటూ తయారుచెయ్యబడిన బ్రహ్మాభోజనాన్ని తినేవారు – ఇంతటి దృఢత్వము ఉన్నవారే కదా? అక్కడకు వెళ్ళి సాంగత్యములోకి రాకూడదు అన్నది చూసుకోవాలి. కుమారీలు ఎంత భాగ్యమును తయారుచేసుకోవాలనుకుంటే అంత భాగ్యమును తయారుచేసుకోగలరు. చిన్నతనమునుండే సేవ అభిరుచిలో ఉండండి. చదువుకూడా చదువుకోండి మరియు చదివించచటమును కూడా నేర్చుకోండి. చిన్నతనములో తెలివైనవారుగా అయినట్లయితే పెద్దవారైనప్పుడు నలువైపుల సేవకు నిమిత్తులుగా అయిపోతారు. స్థాపన సమయములో కూడా చిన్న-చిన్నవారుగా ఉండేవారు. వారు ఇప్పుడు ఎంత పెద్ద సేవలను చేస్తున్నారు! మీరు వారికంటే తెలివైనవారుగా అవ్వాలి. రేపి అదృష్టవంతులు మీరు. రేపు భారతదేశము స్వర్గముగా అయిపోనప్పుడు రేపి అదృష్టవంతులు మీరే. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు వీరు సాధారణమైనవారు కారు, విశేష కుమారీలు అని అనుభవము చెయ్యాలి.

ఆ చదువు చదువుకుంటూ కూడా మనస్సుయొక్క లగనము జ్ఞాన చదువులో ఉండాలి. చదివిన తరువాత కూడా ఏ లక్ష్యము ఉంది? శ్రేష్ఠ ఆత్మగా అయ్యి శ్రేష్ఠ కార్యమును చేసే లక్ష్యము. నౌకరీ అనే బుట్టను ఎత్తుకునేదైతే లేదు కదా! ఒకవేళ వేరే ఏదైనా కారణము ఉన్నట్లయితే అది వేరే సంగతి. తల్లిదండ్రుల వద్ద సంపాదనకు వేరే సాధనము లేనట్లయితే అది తప్పనిసరి అవుతుంది. కానీ మీ వర్తమానము మరియు భవిష్యత్తును సదా గుర్తుంచుకోండి. పనిలో ఏమొస్తుంది? ఈ జ్ఞాన చదువే 21 జన్మలకు పనికొస్తుంది కనుక నిమిత్తమాత్రముగా ఒకవేళ లౌకిక కార్యము చెయ్యవలసివచ్చినాకూడా మనసుయొక్క లగనము బాబా మరియు సేవలో ఉండాలి. కనుక అందరూ రైట్హ్యాండ్స్గా అవ్వాలి, లెఫ్డ్ హ్యాండ్స్గా కాదు. ఒకవేళ ఇంతమంది అందరూ రైట్ హ్యాండ్స్గా అయినట్లయితే వినాశనము అవ్వనే అవుతుంది. ఇంతమంది శక్తులు విజయపతాకాన్ని తీసుకుని వచ్చినట్లయితే రావణరాజ్య సమయము సమాప్తమైపోవాలి. బ్రహ్మాకుమారిగా అవ్వాలనుకుంటే ఇక డిగ్రీని ఏం చేస్తారు? ఇదైతే నిమిత్తమాత్రముగా జనరల్ నాలెడ్జ్ద్వారా బుద్ధిని విశాలము చేసుకునేందుకు ఈ చదువును చదువుతారు. మనసుయొక్క లగనముతో చదవరు, ఈ సంవత్సరము ఈ డిగ్రీ తీసుకుటాంము, మరల ఇంకో సంవత్సరము ఈ డిగ్రీని తీసుకుటాంము... అని ఇలా కాదు. ఇలా చేస్తూ చేస్తూ కాలుడు వచ్చేసినట్లయితే... కనుక ఇంకా ముందుకు చదవాలా, వద్దా అని ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారినుండి సలహా తీసుకుంటూ ఉండండి. చాలామంది చదువు పైన అభిరుచితో తమ వర్తమానము మరియు భవిష్యత్తును వదిలేస్తారు, మోసపోతారు. జీవితానికి సంబంధించిన తీర్పును స్వయానికి స్వయమే తీసుకోవాలి. తల్లిదండ్రులు చెప్పాలి, అని కాదు. స్వయమే జడ్జ్గా అవ్వండి. మీరు శివశక్తులు, మిమ్మల్ని ఏ బంధనములోనూ బంధించలేరు. మేకలను బంధనములో బంధించగలరు, శక్తులను కాదు. సింహముపై శక్తుల సవారీ ఉంటుంది. సింహము బంధనములో ఉండదు, బయటే ఉంటుంది, కనుక మేము ఎల్లప్పుడూ బాబాయొక్క రైట్హ్యాండ్స్మి - అన్న దీనిని గుర్తు పెట్టుకోవాలి. అచ్ఛా!

టీచర్లతో -

మేము నిమిత్త సేవాధారులము అని సదా ఇదే స్మృతిలో ఉంటుంది కదా! చేయించేవారు నిమిత్తంగా చేసారు, చేస్తున్నారు కనుక చేయించేవారు బాధ్యులయ్యారు కదా. నిమిత్తంగా అయినవారు సదా తేలికగా ఉంటారు. డైరెక్షన్ లభించింది, కార్యము చేసారు మరియు సదా తేలికగా ఉంటారు. ఇలా ఉంటారా లేక ఎప్పుడైనా సేవాభారాన్ని అనుభవిస్తారా? ఎందుకంటే ఒకవేళ భారము ఉన్నట్లయితే సఫలత ఉండదు. భారము అని భావించటం వలన ఏ కార్యముకూడా యథార్థంగా అవ్వదు. స్థూలముగా కూడా ఏదైనా కార్యభారము ఉన్నట్లయితే కొన్ని విరుగుతాయి, కొన్ని పగులుతాయి, భేధాభిప్రాయాలు ఉంటాయి, డిస్టర్బ్ అవుతారు. కార్యము కూడా సఫలమవ్వదు. అలాగే ఈ అలౌకిక కార్యము కూడా భారము అని భావిస్తూ చేసినట్లయితే యథార్థముగా అవ్వదు. సఫలమవ్వజాలదు. ఇంకా భారము పెరుగుతూ ఉంటుంది కనుక తేలికగా అయ్యి ఎగిరే సంగమయుగ శ్రేష్ఠ భాగ్యము ఏదైతే ఉందో దానిని తీసుకోలేరు. ఇక సంగమయుగ బ్రాహ్మణులుగా అయ్యి చేసిందేటిం! కనుక సదా తేలికగా అయ్యి నిమిత్తంగా భావిస్తూ ప్రతి కార్యమును చెయ్యటము - వీరినే సఫలతామూర్తులు అని అంటారు. ఇప్పటి కాలంలో కాళ్ళకు చక్రాలు తగిలించుకుని పరిగెత్తుతారు, వారు ఎంత తేలికగా ఉంటారు! వారి వేగము చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎప్పుడైతే బాబా నడిపిస్తున్నారో అప్పుడిక శ్రీమతమనే చక్రాలు ఉన్నట్లే కదా. శ్రీమతమనే చక్రాలను తగిలించుకోవటంద్వారా స్వతహాగనే పురుషార్థపు వేగము తీవ్రమైపోతుంది. సదా అఅటువంటి సేవాధారులుగా అయ్యి నడవండి. ఏ కొంచెము కూడా భారాన్ని అనుభవము చెయ్యకండి. చేయించేవారు బాబా అయినప్పుడు ఇక భారమెందుకు? ఈ స్మృతిద్వారా సదా ఎగిరే కళలో పోతూ ఉండండి. సదా ఎగరుతూ పోండి, అంతే. వీరినే నంబర్వన్ యోగ్య సేవాధారులు అని అంటారు. బాబా, బాబా మరియు బాబా, ఇంతే. ప్రతి క్షణము ఈ ప్రణవరాగము మ్రోగుతూ ఉండాలి. ''బాబా మరియు నేను'' ఇంతే. ఎల్లప్పుడూ ఇలా కలిసిపోయి ఉన్నట్లయితే మూడవవారు మధ్యలోకి రాజాలరు. ఎక్కడైతే సదా కలిసిపోయి ఉంటారో, ఇరువురూ అనుకూలంగా ఉంటారో అప్పుడు మధ్యలోకి ఎవ్వరూ రారు. వీరినే శ్రేష్ఠ సేవాధారి అని అంటారు. అలాటింవారేనా? వేరే ఇతరమైన దేనినీ చూడకండి, దేనినీ వినకండి. వినటం వలన కూడా ప్రభావము పడుతుంది. బాబా మరియు నేను, ఇంతే. ఎల్లప్పుడూ ఆనందాలను అనుభవిస్తూ ఉండండి. చాలా కష్టపడి చేసారు ఇప్పటి వరకు, ఇప్పుడు ఆనందాన్ని అనుభవించే సమయము. ఆనందాలే ఆనందాలు..... అని ఒక పాటకూడా ఉంది కదా. లేవండి, నడవండి, సేవ చెయ్యండి, నిద్రించండి...అన్నీ ఆనందముతో చెయ్యండి. బాగా డ్యాన్స్ చెయ్యండి, పాడండి, సంతోషంలో ఉండండి. సేవను కూడా సంతోషం-సంతోషంగా నాట్యం చేస్తూ చెయ్యండి. అంతేగానీ పడుతూ, ఎక్కుతూ చెయ్యకండి. సంగమయుగములో సర్వ సంబంధాలలో ఆనందము ఉంది. కనుక బాగా ఆనందాలను జరుపుకోండి. సదా ఆనందానికి చెందిన దృశ్యములోనే ఉండండి. అచ్ఛా...

Comments