16-04-1982 అవ్యక్త మురళి

16-04-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగి స్వరాజ్య సభయే సర్వ శ్రేష్ట సభ.

                ఈ రోజు బాప్ దాదా ఏ సభలోకి వచ్చారు? ఈనాటి ఈ సభలో బాప్ దాదా తన యొక్క విశ్వం యొక్క రాజ్య స్థాపనా కార్యంలో, రాజ్య సహయోగి ఆత్మలను అంటే తమ రాజ్యకారోభారం యొక్క రాజ్యాధికారి పిల్లలను చూస్తున్నారు. సంగమయుగి స్వరాజ్య సభను చూస్తున్నారు. స్వరాజ్యసభలో, నలువైపుల ఉన్న సర్వ రకాల సహయోగి ఆత్మలను చూస్తున్నారు. ఈ స్వరాజ్యసభ యొక్క శిరోమణి రత్నాలు బాప్ దాదాకి ఎదురుగా లేకపోయినా, దూరంగా ఉన్నా కానీ మాల రూపంలో రాజ్యాధికారి సింహాసనంపై ఎదురుగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క రాజ్యాధికారి సహయోగి ఆత్మ తన యొక్క విశేషతల యొక్క మెరుపుతో మెరుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు రకరకాల గుణాల రూపి నగలతో అలంకరించబడి ఉన్నారు. రాజ్య సింహాసనాధికారికి గుర్తు ఏమి ఉంటుంది? అందరు సభలో కూర్చున్నారు కదా! కొంతమంది ముందు ఉన్నారు, కొంతమంది వెనుక ఉన్నారు. కానీ సభలో ఉన్నారు కదా! రాజ్యసింహాసనాధికారికి గుర్తుగా ఛత్ర ఛాయ యొక్క గొడుగు (రాజచత్రం) మంచిగా మెరుస్తూ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు డబల్ ఛత్రధారులు. 1. ప్రకాశ కిరీటం అంటే ఫరిస్తా స్వరూపానికి గుర్తు, వెనువెంట 2. విశ్వకళ్యాణం యొక్క బేహద్ సేవ యొక్క కిరీటధారిగా ఉన్నారు, కిరీటం అయితే అందరి తలపై ఉంది. కానీ నెంబర్ వారీగా ఉన్నారు. కొందరికి రెండు కిరీటాలు సమానంగా ఉన్నాయి. కొంతమందికి ఒకటి పెద్దదిగా, ఒకటి చిన్నదిగా ఉంది, కొంతమందికి రెండూ చిన్నగా ఉన్నాయి. వెనువెంట ప్రతి రాజ్యాధికారి యొక్క పవిత్రతా వ్యక్తిత్వం ఎవరిది వారిది. అదేవిధంగా ఆత్మీయత యొక్క వ్యక్తిత్వం కూడా ఎవరిది వారిది. నెంబర్ వారీగా కనిపిస్తుంది. ఈ విధమైన స్వరాజ్యాధికారి సహయోగి ఆత్మల యొక్క సభను చూస్తున్నారు. సంగమయుగీ శ్రేష్టసభ, భవిష్య రాజ్యసభ రెండింటిలో ఎంత తేడా ఉంది. ఇప్పటి సభయే జన్మజన్మాంతరాల సభకి పునాది. ఇప్పటి సభ యొక్క రూపురేఖయే భవిష్యసభ యొక్క రూపురేఖను తయారు చేస్తుంది. ఇప్పుడు రాజ్యాధికారి సహయోగి సభలో నా స్థానం ఎక్కడ ఉంది అని మీకు మీరు చూసుకుంటున్నారా? అందరి దగ్గర పరిశీలన చేసుకునే యంత్రం ఉందా? విజ్ఞానం యొక్క క్రొత్తక్రొత్త యంత్రాల ద్వారా భూమికి పైన ఉన్న ఆకాశం యొక్క చిత్రాలను తీస్తున్నారు, అక్కడి వాయుమండలం యొక్క సమాచారం చెప్తున్నారు. ప్రకృతి తత్వాల యొక్క, అలజడి యొక్క సమాచారం ముందుగానే చెప్తున్నారు. అయితే మీరు సర్వశక్తివాన్ బాబా ఇచ్చిన అధికారం కలిగిన ఆత్మలు. కనుక మీ దివ్యబుద్ధి యొక్క యంత్రం ద్వారా, మూడు కాలాల జ్ఞానం ఆధారంగా మీ యొక్క వర్తమాన కాలాన్ని మరియు భవిష్యకాలాన్ని తెలుసుకోలేకపోతున్నారా? అందరి దగ్గర యంత్రం ఉంది కదా? దివ్యబుద్ధి అందరికీ లభించింది. ఈ దివ్యబుద్ధిరూపి యంత్రాన్ని ఏవిధంగా ఉపయోగించాలి, ఏ స్థానంలో అంటే ఏ స్థితిలో స్థితులై ఉపయోగించాలి అనేది కూడా తెలుసు. త్రికాలద్మరిస్థితి యొక్క స్థానంలో స్థితులై మూడు కాలాల యొక్క జ్ఞానం ద్వారా యంత్రాన్ని ఉపయోగించండి. ఉపయోగించడం వస్తుందా? మొదట స్థానంలో స్థితులవ్వటం అయితే వస్తుందా అంటే స్థితిలో స్థితులవ్వటం వస్తుందా? ఈ యంత్రం ద్వారా నా నెంబర్ఏ మిటి? అని మీకు మీరు పరిశీలన చేసుకోండి. అర్థమైందా! ఈరోజు సర్వస్వత్యాగుల యొక్క విషయం గురించి చెప్పటంలేదు. ఇప్పుడు ఇంకా చివరికి కోర్స్ మిగిలిపోయింది. ఈరోజు బాప్ దాదా తన యొక్క రాజ్యసభ యొక్క సహాయోగులను చూస్తున్నారు. అందరు ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు సభలో స్నేహి ఆత్మలు ఎక్కువగా ఉన్నారు. కనుక స్నేహి ఆత్మలకు కూడా బాప్ దాదా స్నేహం యొక్క రిటర్నులో స్నేహం ఇవ్వడానికి స్నేహసభలోకి వచ్చారు. కలయిక యొక్క మేళా జరుపుకోవాలి అనే ఉత్సాహ, ఉల్లాసాలు కలిగిన ఆత్మలు ఉన్నారు. కనుక బాప్ దాదా కూడా కలయిక జరుపుకోవాలి అనే ఉత్సాహ, ఉల్లాసాలతో కూడిన ఉత్సవానికి వచ్చారు. ఇది కూడా స్నేహసాగరుడు మరియు నదుల యొక్క కలయిక. మేళా జరుపుకోవటం, అంటే ఉత్సవం జరుపుకోవటం. ఈరోజు బాప్ దాదా కూడా మేళా యొక్క ఉత్సవంలోకి వచ్చారు. బాప్ దాదా మేళా జరుపుకునే ఆత్మలను మరియు స్నేహం పొందే భాగ్యశాలి ఆత్మలను చూసి సంతోషిస్తున్నారు. మొత్తం ఈ విశాల విశ్వంలో లెక్కలేనంత జనసంఖ్యలో ఎటువంటి ఆత్మలు కలయిక యొక్క భాగ్యాన్ని పొందుతున్నారు అనేది బాబా చూసి చాలా సంతోషిస్తున్నారు. ప్రపంచంలో ముందు నిరాశావాదులుగా ఉన్నవారు తమ యొక్క సర్వ ఆశలను పూర్తి చేసుకునే భాగ్యం తీసుకున్నారు. విశ్వంలో ప్రసిద్ధమైన, ఆశావాదులు కూడా ఆలోచిస్తూ మరియు వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ వెతుకుతూ అన్వేషణలోనే నిమగ్నం అయిపోయారు. కానీ స్నేహీ ఆత్మలైన మీరు స్నేహం యొక్క ఆధారాన్ని పొందారు. కనుక ఎవరు శ్రేష్టమైనవారు? కొంతమంది రాష్ట్ర చర్చలతో శాస్త్రాలలోనే ఉండిపోయారు. కొంతమంది మహాత్మలుగా అయ్యారు కానీ ఆత్మ మరియు పరమాత్మల విషయంలో చిన్న భ్రాంతి కారణంగా భాగ్యం నుండి వంచితం అయిపోయారు. పిల్లలుగా అయ్యింది భాగ్యం యొక్క అధికారం నుండి వంచితం అయిపోయారు. గొప్ప గొప్ప వైజ్ఞానికులు పరిశోధనలు చేస్తూ దానిలోనే నిమగ్నమైపోయారు. రాజకీయనాయకులు ప్రణాళికలు తయారు చేస్తూ చేస్తూ ఉండిపోయారు. అమాయక భక్తులు అణువణువులో భగవంతుడు ఉన్నారు అని అణువణువు వెతకడంలోనే ఉండిపోయారు. కానీ పొందినది ఎవరు? భోళానాధుని భోళా పిల్లలు పొందారు. గొప్పబుద్ధి కలిగినవారు పొందలేదు కానీ సత్యమైన మనస్సు కలిగినవారు పొందారు. అందువలనే సత్యమైన మనస్సుకే యజమాని రాజీ అవుతారు అంటారు. సత్యమైన మనస్సు ద్వారా అందరూ బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా కాగలరు. సత్యమైన మనస్సు ద్వారానే మనోభిరాముడైన బాబాని మీ వారిగా చేసుకోవచ్చు. సత్యమైన మనస్సు లేకుండా సత్యమైన బాబా యొక్క స్మృతి నిలవదు. సత్యమైన మనస్సు కలిగిన పిల్లల సర్వశ్రేష్ట సంకల్పరూపీ ఆశలు సహజంగా సంపన్నం అవుతాయి. సత్యమైన మనస్సు కలిగినవారు సదా బాబాని సాకారంగా, ఆకారంగా మరియు నిరాకారంగా మూడు రూపాలలో సదా తోడుని అనుభవం చేసుకుంటారు. మంచిది.
                 ఈ విధంగా సదా స్నేహసాగరం ద్వారా కలయిక జరుపుకునే గంగా ప్రవాహాలకు, సదా స్నేహం ఆధారంగా బాప్ దాదాని సర్వసంబంధాలలో అనుభవం చేసుకునేవారికి, భోళానాథుడైన బాబాతో సదా వ్యాపారం చేసేవారికి, ఈ విధంగా సత్యమైన మనస్సు కలిగిన శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే,

Comments