16-01-1985 అవ్యక్త మురళి

16-01-1985          ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా        మధువనము  

'' భాగ్యవంతమైన యుగంలో భగవంతుని ద్వారా వారసత్వము మరియు వరదానాల ప్రాప్తి ''
ఈ రోజు సృష్టి వృక్షానికి బీజరూపుడైన తండ్రి వృక్షానికి పునాది అయిన తమ పిల్లలను చూస్తున్నారు. ఈ పునాది ద్వారా మొత్తం వృక్షమంతటి విస్తారము జరుగుతుంది. విస్తారమును చేసే సార స్వరూపులైన విశేష ఆత్మలను అనగా వృక్షానికి ఆధారమూర్తులైన ఆత్మలను చూస్తున్నారు. బీజరూపుని ద్వారా నేరుగా ప్రాప్తించిన సర్వ శక్తులను ధారణ చేసే విశేష ఆత్మలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలోని సర్వ ఆత్మలలో కేవలం కొద్దిమంది ఆత్మలకే ఈ విశేష పాత్ర లభించింది. ఎవరికైతే బీజముతో సంబంధముంచడం ద్వారా శ్రేష్ఠ ప్రాప్తుల పాత్ర లభించిందో అటువంటి ఆత్మలు కొద్దిమందే ఉన్నారు.
ఈ రోజు బాప్దాదా అటువంటి శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లల భాగ్యమును చూస్తున్నారు. కేవలం 'భగవంతుడు మరియు భాగ్యము' అనే రెండు పదాలు గుర్తుండాలి. తమ కర్మల లెక్క అనుసారంగా భాగ్యము అందరికి లభిస్తుంది. ద్వాపరయుగం నుండి ఇప్పటి వరకు మీ ఆత్మలందరు కర్మ మరియు భాగ్యము అనే లెక్క-ఖాతాలోకి రావలసి ఉంటుంది. కాని వర్తమాన భాగ్యవంతమైన యుగంలో భగవంతుడు భాగ్యమునిస్తారు. శ్రేష్ఠమైన భాగ్యరేఖను గీసుకునే విధి అయిన శ్రేష్ఠ కర్మల రూపీ కలమును పిల్లలైన మీకు ఇచ్చేస్తారు. దాని ద్వారా ఎంత శ్రేష్ఠమైన, స్పష్టమైన జన్మ-జన్మాంతరాల భాగ్యరేఖను గీసుకోవాలనుకుంటే అంత గీసుకోగలరు. ఇక ఏ ఇతర సమయానికి ఈ వరదానము లేదు. ఈ సమయానికే ఈ వరదానము ఉంది. ఏది కావాలంటే, ఎంత కావాలంటే అంత పొందగలరు. ఎందుకు? భగవంతుడు భాగ్య భండారాన్ని విశాల హృదయంతో పిల్లలు శ్రమ పడకుండా ఇస్తున్నారు. భండారము తెరిచి ఉంది. తాళమూ లేదు, తాళం చెవీ లేదు. అంతేకాక ఎంత నిండుగా తరగనంతగా ఉందంటే ఎవరు ఎంత కావాలంటే, ఎంత తీసుకోవాలంటే అంత తీసుకోవచ్చు. బేహద్ భండారము భర్పూర్గా(నిండుగా) ఉంది. బాప్దాదా పిల్లలందరికి ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోండి, అన్న స్మృతిని ప్రతిరోజు కలిగిస్తున్నారు. యథాశక్తిగా కాదు, తీసుకోండి, విశాల హృదయంతో తీసుకోండి. కాని తెరిచి ఉన్న భండారము నుండి, నిండుగా ఉన్న భండారము నుండి తీసుకోండి. ఒకవేళ ఎవరైనా యథాశక్తిగా తీసుకుంటే తండ్రి ఏమంటారు? ఏ విధంగా కల్లాకపటమెరగని(అమాయక) పిల్లలు కొద్దిలోనే సంతుష్టులైపోతున్నారో, సాక్షిగా ఉండి చూస్తూ తండ్రి కూడా హర్షితమవుతూ ఉంటారు. ఎందుకు? కొద్దిలోనే సంతుష్టపడిపోయే 63 జన్మల భక్తి సంస్కారము ఉన్న కారణంగా ఇప్పుడు కూడా సంపన్న ప్రాప్తికి బదులు అల్పమునే అధికంగా భావించి, అందులోనే సంతోషపడ్తారు.
ఈ సమయం అవినాశి తండ్రి ద్వారా సర్వ ప్రాప్తులను పొందే సమయం. ఇది మర్చిపోతారు. అయినా బాప్దాదా పిల్లలకు సమర్థులుగా అవ్వండి అన్న స్మృతిని ఇప్పిస్తున్నారు. ఇప్పుడు కూడా టూలేట్ (చాలా ఆలస్యము) అవ్వలేదు. లేటు(ఆలస్యం)గా వచ్చారు. కాని టూ లేట్ సమయం ఇంకా అవ్వలేదు. అందువలన ఇప్పుడు కూడా రెండు రూపాలతో అనగా తండ్రి రూపంతో వారసత్వము, సద్గురువు రూపం ద్వారా వరదానాలు లభించే సమయం. కావున వరదానము మరియు వారసత్వ రూపాలలో సహజ శ్రేష్ఠ భాగ్యమును తయారు చేసుకోండి. భాగ్యవిధాత భాగ్యమును పంచారు, కాని నేను ఇంతే తీసుకున్నానని ఆలోచించవలసిన అవసరం రాకూడదు. సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలు యథాశక్తిగా అవ్వజాలరు. ఏది కావాలంటే దానిని తండ్రి ఖజానాల నుండి అధికార రూపంలో తీసుకోగల వారదానమిప్పుడు ఉంది. బలహీనంగా ఉన్నా, పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం లభిస్తుంది. వర్తమానము మరియు భవిష్యత్తును తండ్రి సహాయంతో శ్రేష్ఠంగా తయారు చేసుకోగలరు. తండ్రి సహయోగము మరియు తెరిచి ఉన్న భాగ్య భండారము లభించే సమయం ఇక కొద్దిగానే ఉంది.
ఇప్పుడు స్నేహం కారణంగా తండ్రి రూపంలో ప్రతి సమయం, ప్రతి పరిస్థితిలో స్నేహితునిగా ఉన్నారు. కాని ఈ కొద్ది సమయం తర్వాత స్నేహితునికి బదులు సాక్షిగా అయ్యి చూసే పాత్ర నడుస్తుంది. సర్వశక్తి సంపన్నంగా అవ్వాలంటే అవ్వండి, యథాశక్తిగా అవ్వాలనుకుంటే అవ్వండి. రెండిటినీ సాక్షిగా అయ్యి చూస్తారు. ఖావున ఈ శ్రేష్ఠ సమయంలో బాప్దాదా ద్వారా వారసత్వము, వరదానము, సహయోగము, వీటి జతలో ఈ భాగ్య ప్రాప్తి ఏదైతే కలుగుతూ ఉందో దానిని ప్రాప్తి చేసుకోండి. ప్రాప్తులను పొందడంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా అవ్వకండి. ఇప్పుడింకా ఇన్ని సంవత్సరాలు ఉన్నాయని, సృష్టి పరివర్తన సమయాన్ని, ప్రాప్తుల సమయాన్ని రెండిటినీ కలిపేయకండి. ఈ నిర్లక్ష్య సంకల్పాలతో ఆలోచిస్తూ ఉండిపోకండి. బ్రాహ్మణ జీవితంలో సర్వ ప్రాప్తులు,బహుకాలపు ప్రాప్తులను కలిగించే 'ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ లేదు' అన్న మాటను సదా గుర్తుంచుకోండి.
అందుచేత కేవలం 'భగవంతుడు మరియు భాగ్యము' అన్న ఈ రెండు పదాలనైనా గుర్తుంచుకోండి అని అన్నారు. అప్పుడు సదా పదమాపదమ్ భాగ్యశాలురుగా ఉంటారు. పాత అలవాట్లతో ఎందుకు బలహీనంగా అవుతారని బాప్దాదా కూడా పరస్పరం ఆత్మిక సంబాషణ చేస్తారు. తండ్రి దృఢంగా చేస్తారు, అయినా పిల్లలు నిస్సహాయులైపోతారు. ధైర్యమనే కాళ్లను కూడా ఇస్తారు, రెక్కలు కూడా ఇస్తారు, తోడు-తోడుగా ఎగిరింపజేస్తారు కూడా, అయినా పైకి-క్రిందకి, క్రిందకి-పైకి ఎందుకు అయిపోతారు? ఆనందాల యుగంలో కూడా తికమక చెందుతూ ఉంటారు. దీనిని పాత అలవాట్లకు వశమవ్వడమని అంటారు. దృఢంగా ఉన్నారా లేక నిస్సహాయకులుగా(మజ్బూర్గా) ఉన్నారా? తండ్రి డబల్ లైట్గా చేస్తారు. మీ అన్ని భారాలను స్వయమే ఎత్తుకోవడానికి సహాయము చేస్తారు. అయినా భారము ఎత్తుకునే అలవాటుతో భారమునెత్తుకుంటారు. తర్వాత ఏ పాట పాడ్తారో తెలుసా? ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నల పాటలను పాడ్తారు. చేద్దాము, చేస్తాము..... అనే ఇంకో పాటను కూడా పాడ్తారు. ఇదైతే భక్తిమార్గములోని పాట. అధికారముతో పాడే పాట 'పొందేశాము'. అయితే ఏ పాట పాడ్తారు? మొత్తం రోజంతటిలో ఈ రోజు ఏ పాట పాడాను అని చెక్ చేసుకోండి. బాప్దాదాకు పిల్లలతో స్నేహముంది కావున స్నేహమున్న కారణంగా ప్రతి పుత్రుడు సదా సంపన్నంగా ఉండాలని, సమర్థంగా ఉండాలని, సదా పదమాపదమ్ భాగ్యశాలిగా ఉండాలనే అనుకుంటారు. అర్థమయిందా! మంచిది.
సదా సమయ ప్రమాణంగా వారసత్వము మరియు వరదానానికి అధికారులు, సదా తెరవబడిన భాగ్య భండారము నుండి సంపూర్ణ భాగ్యాన్ని తయారు చేసుకునేవారు, యథా శక్తిని సర్వశక్తి సంపన్నంగా పరివర్తన చేసుకునేవారు, శ్రేష్ఠ కర్మలనే కలము ద్వారా సంపన్న భాగ్యరేఖను గీచుకునే వారు, సమయ మహత్వాన్ని తెలుసుకున్న సర్వ ప్రాప్తి స్వరూప శ్రేష్ఠ ఆత్మలకు, సంపన్నంగా చేసే బాప్దాదా యాద్ప్యార్ ఔర్ నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్దాదా కలయిక :-
1. సదా తమ అలౌకిక జన్మ, అలౌకిక జీవితము, అలౌకిక తండ్రి, అలౌకిక వారసత్వము గుర్తుంటాయా? ఎలాగైతే తండ్రి అలౌకికమైనవారో, అలా వారసత్వము కూడా అలౌకికమైనదే. లౌకిక తండ్రి హద్దు వారసత్వమునిస్తారు. అలౌకిక తండ్రి అనంతమైన వారసత్వమునిస్తారు. కావున సదా అలౌకిక తండ్రి మరియు వారసత్వం స్మృతిలో ఉండాలి. ఎప్పుడైనా లౌకిక జీవితము యొక్క స్మృతిలోకైతే వెళ్లిపోవడం లేదు కదా! మరజీవులుగా అయిపోయారు కదా! ఎలాగైతే శరీరాన్ని వదిలి మరణించినవారు ఎప్పుడూ వెనుక జన్మను గుర్తు చేసుకోరో, అలా అలౌకిక జీవితంలో ఉన్నవారు, జీవించి ఉన్నవారు లౌకిక జన్మను గుర్తు చేసుకోజాలరు. ఇప్పుడైతే యుగమే మారిపోయింది. ప్రపంచము వారు కలియుగానికి చెందినవారు. మీరు సంగమ యుగానికి చెందినవారు. అంతా మారిపోయింది. ఎప్పుడైనా కలియుగంలోకైతే వెళ్లిపోవడం లేదు కదా! ఇది కూడా బార్డరు(సరిహద్దు). హద్దును దాటారంటే శత్రువుకు స్వాధీనమైపోతారు. కనుక బార్డరు దాటడం లేదు కదా! సదా సంగమయుగ అలౌకిక జీవితం గల శ్రేష్ఠ ఆత్మలము అనే స్మృతిలోనే ఉండండి. ఇప్పుడేమి చేస్తారు? చాలా గొప్ప బిజినెస్మాన్గా (వ్యాపారస్తునిగా) అవ్వండి. ఒక్క అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే బిజినెస్మాన్గా అవ్వండి. సదా బేహద్ తండ్రికి చెందినవారము కావున అనంతమైన సేవలో అనంతమైన ఉత్సాహ- ఉల్లాసాలతో ముందుకు వెళ్తూ ఉండండి.
2. డబల్లైట్ స్థితిని సదా అనుభవం చేస్తున్నారా? డబల్లైట్ స్థితికి గుర్తు సదా ఎగిరే కళ. ఎగిరే కళ వారెప్పుడూ మాయ ఆకర్షణలోకి రాజాలరు. ఎగిరేకళవారు సదా విజయులుగా ఉంటారు. ఎగిరేకళవారు సదా నిశ్చయ బుద్ధి గలిగి నిశ్చింతులుగా ఉంటారు. ఎగిరేకళ అంటే ఏమిటి? ఎగిరేకళ అనగా ఉన్నతమైన స్థితి. ఎగురుతున్నప్పుడు ఎత్తులోకి(పైకి) వెళ్తారు కదా! ఉన్నతోన్నతమైన స్థితిలో స్థితులై ఉండే ఉన్నతమైన ఆత్మలుగా భావించి ముందుకు వెళ్తూ ఉండండి. ఎగిరేకళవారు అనగా బుద్ధి రూపి పాదము ధరణి పై ఉండనివారు. ధరణి అనగా దేహభావానికి అతీతంగా ఉండేవారు. ఎవరైతే దేహభావమనే ధరణికి పైన ఉంటారో వారు సదా ఫరిస్తాలు. వారికి ధరణితో ఏ సంబంధము ఉండదు. దేహ భావము గురించి కూడా తెలుసుకున్నారు. రెండింటికి గల వ్యత్యాసాన్ని తెలుసుకుంటే దేహాభిమానంలోకి రాజాలరు. ఏదైతే మంచిగా అనిపిస్తుందో, అదే చేయడం జరుగుతుంది కదా! కావున 'నేను ఫరిస్తాను' అన్న స్మృతిలోనే సదా ఉండండి. ఫరిస్తా స్మృతి ద్వారా సదా ఎగురుతూ ఉంటారు. ఎగిరేకళలోకి వెళ్లిపోయినట్లయితే క్రింద ఉన్న ధరణి ఆకర్షించజాలదు. ఎలాగైతే అంతరిక్షంలోకి వెళ్లినట్లయితే భూమి ఆకర్షించదో, అలా ఫరిస్తాగా అయిపోయినట్లయితే దేహరూపీ ధరణి ఆకర్షించజాలదు.
3. సహయోగి, కర్మయోగి, స్వతహాయోగి, నిరంతర యోగి - ఇటువంటి స్థితిని సదా అనుభవం చేస్తున్నారా? ఎక్కడైతే సహజత్వం ఉంటుందో అక్కడ నిరంతరము ఉంటుంది. సహజంగా లేకపోతే నిరంతరము ఉండదు. కావున నిరంతర యోగులుగా ఉన్నారా లేక అంతరం వస్తోందా? యోగి అనగా సదా స్మృతిలో నిమగ్నమై ఉండేవారు. ఎప్పుడైతే సర్వ సంబంధాలు తండ్రితోనే ఉంచినామో, ఎక్కడ సర్వ సంబంధాలు ఉన్నాయో, అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది, సర్వ సంబంధాలు ఉన్నట్లయితే ఒక్కరి స్మృతియే ఉంటుంది. ఉన్నదే ఒక్కరు అయినప్పుడు సదా స్మృతి ఉంటుంది కదా! కావున సదా సర్వ సంబంధాలతో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే..... నిరంతర యోగిగా అయ్యేందుకు సహజ విధి ఇదే. ఎప్పుడైతే ఇతర సంబంధాలే లేనప్పుడు స్మృతి ఎక్కడకు వెళ్తుంది? సర్వ సంబంధాలతో సహజయోగి ఆత్మలమని సదా గుర్తుంచుకోండి. సదా తండ్రి సమానంగా ప్రతి అడుగులో స్నేహము మరియు శక్తి రెండింటి బ్యాలెన్సు ఉంచుకోవడం వలన సఫలత స్వతహాగానే ముందుకు వస్తుంది. సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. బిజీగా ఉండేందుకు పనినైతే చెయ్యాల్సిందే కానీ ఒకటేమో శ్రమతో కూడుకున్న పని. రెండవది ఆట సమానమైన పని. ఎప్పుడైతే తండ్రి ద్వారా శక్తుల వరదానము లభించిందో, ఎక్కడైతే శక్తులు ఉంటాయో అక్కడ అంతా సహజమవుతుంది. కేవలం పరివారం మరియు తండ్రి - ఇరువురి బ్యాలెన్సు ఉంటే స్వతహాగానే ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ఎక్కడైతే ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ ఎగిరే కళ ఉంటుంది. కోరుకోకపోయినా సహజమైన సఫలత ఉంటుంది.
4. సదా తండ్రి మరియు వారసత్వము రెండింటి స్మృతి ఉంటోందా? తండ్రి ఎవరు? వారి నుండి ఏ వారసత్వము లభించింది? అన్న ఈ స్మృతి స్వతహాగా సమర్థంగా చేస్తుంది. ఇటువంటి అవినాశి వారసత్వము ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధమును తయారు చేస్తుంది. ఇటువంటి వారసత్వము ఎప్పుడైనా లభించిందా? ఇప్పుడు లభించింది. మొత్తం కల్పంలో లభించదు కనుక సదా తండ్రి మరియు వారసత్వము ఈ స్మృతితో సదా ముందుకు సాగుతూ ఉండండి. వారసత్వాన్ని స్మృతి చేయడం వలన సదా సంతోషముంటుంది. అంతేకాక తండ్రిని స్మృతి చేయడం వలన సదా శక్తిశాలిగా ఉంటారు. శక్తిశాలి ఆత్మలు సదా మాయాజీతులుగా ఉంటారు మరియు సంతోషముంటే జీవితమున్నట్లు, జీవించినట్లు. ఒకవేళ సంతోషము లేకుంటే జీవితమేముంది? జీవిస్తూ కూడా జీవము లేనట్లే. జీవించి కూడా మరణించినవారితో సమానము. వారసత్వము ఎంతగా గుర్తు ఉంటుందో అంతగా సంతోషముంటుంది. కనుక సదా సంతోషము ఉంటోందా? 'అటువంటి వారసత్వం కోట్లలో కొద్ది మందికే లభిస్తుంది, అది మాకు లభించింది.' ఈ స్మృతిని ఎప్పుడూ మర్చిపోకండి. ఎంత స్మృతి ఉంటుందో, అంత ప్రాప్తి కలుగుతుంది. సదా స్మృతి మరియు సదా ప్రాప్తుల సంతోషముండాలి.
కుమారులతో :- కుమార జీవితము శక్తిశాలి జీవితము కావున బ్రహ్మకుమారులు అనగా ఆత్మిక శక్తిశాలురు. శారీరిక శక్తివంతులు కాదు, ఆత్మిక శక్తివంతులు. కుమార్లు జీవితంలో ఏది చేయాలనుకుంటే అది చేయగలరు. కావున కుమారులైన మీరంతా తమ కుమార జీవితంలో తమ వర్తమానాన్ని మరియు భవిష్యత్తును తయారు చేసుకున్నారు. ఏం తయారు చేసుకున్నారు? ఆత్మికంగా తయారు చేసుకున్నారు. ఈశ్వరీయ జీవితం గల బ్రహ్మకుమారులుగా అయ్యారు. కనుక మీరు ఎంత శ్రేష్ఠ జీవితం గలవారిగా అయ్యారు? సదా కాలానికి దు:ఖాల నుండి, మోసాల నుండి, భ్రమించడం నుండి దూరమైపోయారు. లేకుంటే శారీరిక శక్తి ఉన్న కుమారులు భ్రమిస్తూ ఉంటారు. పోట్లాడడం, జగడాలాడడం, దు:ఖమివ్వడం, మోసం చెయ్యడం..... ఇవే చేస్తారు కదా! కావున ఎన్ని విషయాల నుండి రక్షింపబడ్డారు! ఎలాగైతే స్వయం రక్షింపబడ్డారో, అలా ఇతరులను కూడా రక్షించాలనే ఉల్లాసము వస్తుంది. సదా తోటివారిని రక్షించేవారు. ఏ శక్తులైతే మీకు లభించాయో వాటిని ఇతరులకు కూడా ఇవ్వండి. తరగని శక్తులు లభించాయి కదా! కావున అందరిని శక్తిశాలిగా తయారు చేయండి. నిమిత్తంగా భావించి సేవ చేయండి. నేను సేవాధారిని అని కాదు. బాబా చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేస్తున్నాను. 'నాది' అనేవారు కాదు, ఎవరిలో 'నాది' అనేది ఉండదో వారు సత్యమైన సేవాధారులు.
యుగల్స్తో :- సదా స్వరాజ్య అధికారి ఆత్మలు కదా! 'స్వ' రాజ్యం అనగా సదా అధికారులు. అధికారులు ఎప్పుడూ అధీనమవ్వలేరు. అధీనులైతే అధికారులు కాదు. ఎలాగైతే రాత్రి ఉన్నపుడు పగలు ఉండదో, పగలు ఉన్నపుడు రాత్రి ఉండదో, అదే విధంగా అధికారి ఆత్మలు ఏ కర్మేంద్రియాలకు, వ్యక్తులకు, వైభవాలకు, అధీనులుగా అవ్వజాలరు. ఇటువంటి అధికారులుగా ఉన్నారా? మాస్టర్ సర్వ శక్తివంతులుగా అయినట్లయితే ఏ విధంగా అయ్యారు? అధికారులుగా అయ్యారు. కావున సదా స్వరాజ్య అధికారి ఆత్మలుగా ఉన్నారు. ఈ సమర్థ స్మృతి ద్వారా సదా సహజంగా విజయులుగా అవుతూ ఉంటారు. స్వప్నంలో కూడా ఓటమి సంకల్ప మాత్రంగా కూడా ఉండరాదు. వీరినే సదా విజయులని అంటారు. మాయ పారిపోయిందా లేక తరిమేస్తున్నారా? తిరిగిరాని విధంగా తరిమేశారా? ఎవరినైనా తిరిగి తీసుకురాకూడదు అని అనుకున్నపుడు వారిని చాలా చాలా దూరంగా వదిలేసి వస్తారు. కావున అంత దూరం వరకు తరిమేశారు. మంచిది.

Comments