15-05-1983 అవ్యక్త మురళి

15-05-1983        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఎగిరే కళలోకి వెళ్ళేందుకు విధి మరియు పుణ్య ఆత్మల లక్షణాలు

ఈరోజు తోటమాలి అయిన బాబా తమ ఆత్మిక పూలతోటలో సుగంధభరిత పుష్పాలను మరియు రేపటి యొక్క విశేష కల్యాణార్థము నిమిత్తమైన, ధైర్యము-ఉల్లాసములు కల మొగ్గలను కూడా చూస్తున్నారు. రేపటి భాగ్యపు చిత్రాలైన చిన్న-చిన్న పసివారిని చూస్తున్నారు. (ఈరోజు బాప్దాదా సమ్ముఖములో చిన్న-చిన్న పిల్లల గ్రూప్ కూర్చుని ఉంది) ఈ చిన్న-చిన్న పిల్లలను బాప్దాదా ఈ భూమిపై ప్రకాశించే నక్షత్రాలు అని అంటారు. ఈ లక్కీ నక్షత్రాలు విశ్వమునకు ఒక క్రొత్త ప్రకాశమును ఇచ్చేందుకు నిమిత్తులుగా అవుతారు. ఈ చిన్న-పెద్ద పిల్లలను చూసిన బాప్దాదాకు స్థాపన ఆదిలోని దృశ్యాలు గుర్తుకు వస్తున్నాయి. ఇఅటువంటి చిన్న-చిన్న పిల్లలు విశ్వ కల్యాణ కార్యములో ఉల్లాసము-ఉత్సాహములతో దృఢ సంకల్పమును చేసేవారిగా వెలువడ్డారు. చిన్న పిల్లలమైన మేము అన్నింటికంటే పెద్ద కార్యమును చేసి చూపిస్తాము, రాజ్యనేతలు, ధర్మనేతలు, వైజ్ఞానిక ఆత్మలు కోరుకుంటారు కానీ చెయ్యలేకపోతారు, ఆ కార్యమును చిన్న-చిన్నవారిమైన మేము చేసి చూపిస్తాము అని వారు అన్నారు. మరియు ఈరోజు ఆ చిన్న-చిన్న పిల్లల సంకల్పమును సాకార రూపములో చూస్తున్నారు. వారు చిన్నపిల్లలు కారు, ఈరోజు శివశక్తి పాండవసేన రూపములో కార్యమును చేస్తున్నారు. హిస్టరీ అయితే అందరికీ తెలుసు కదా. ఈరోజు వెలిగిన ఆ దీపాలద్వారా మీరందరూ దీపమాలగా అయ్యి బాబా మెడలోని హారంగా అయ్యారు. ఇప్పుడుకూడా చిన్న-పెద్ద పిల్లలందరినీ చూస్తుంటే ప్రతి పిల్లవానిలో విశ్వముయొక్క రేపటి భాగ్యపు చిత్రము కనిపిస్తుంది. పిల్లలందరూ స్వయమును ఏమని అనుకుంటున్నారు? లక్కీ సితారలు (అదృష్ట నక్షత్రాలు) కదా! ఈరోజు ఉన్నదే పిల్లల రోజుగా, పెద్దవారైతే గ్యాలరీలో కూర్చుని చూసేవారు. బాప్దాదాకూడా విశేషంగా పిల్లలను చూసి హర్షితులవుతారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మలకు బాబా పరిచయమును ఇచ్చి బాబా వారసత్వమునకు అధికారులుగా తయారుచేసేవారే కదా! మామూలుగా కూడా పిల్లలను మహాత్ములు అని అంటారు. మీరందరూ సత్యాతి సత్యమైన మహానాత్మలు అనగా శ్రేష్ఠ పవిత్ర ఆత్మలు కదా. ఇఅటువంటి మహానాత్మలు సదా ఒకే దృఢ సంకల్పములో ఉంటారా? సదా ఒక్క బాబా మరియు ఒక్కటే శ్రీమతముపై నడవటము. దీనిని దృఢంగా నిశ్చయము చేసుకున్నారు కదా! మీ-మీ స్థానాలకు వెళ్ళి ఇతరుల సాంగత్యములోనికైతే వెళ్ళేవారు కారు కదా? మీ అందరి ఫోటో ఇక్కడ తీసారు కనుక సదా మీ శ్రేష్ఠ జీవితమును గుర్తు పెట్టుకోవాలి. పిల్లలమైన మేము ప్రతి ఒక్కరమూ విశ్వములోని సర్వ ఆత్మల శ్రేష్ఠ పరివర్తనకు నిమిత్తులము - ఎల్లప్పుడూ దీనిని గుర్తుంచుకోవాలి. ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించేందుకు ధైర్యము ఉందా? పిల్లలందరూ అమృతవేళనుండి మీ సేవల బాధ్యతను నిర్వర్తించేవారేనా? ఎవరికైనా ఏదైనా విషయంలో బలహీనత ఉన్నట్లయితే దానిని ఇప్పటి నుండి సరిగా చేసుకోవాలి. మీ అందరిపైనా అందరి దృష్టి ఉంది, కనుక అమృతవేళనుండి రాత్రి వరకు సహజయోగి, శ్రేష్ఠ యోగి, శ్రేష్ఠ జీవితముకొరకు ఏ దినచర్య అయితే లభించిందో దాని ప్రమాణంగా అందరూ యథార్థరీతిలో నడవవలసి ఉంటుంది - ఈ అటెన్షన్ను ఇప్పటి నుండి దృఢ సంకల్పము రూపములో ఉంచుకోవాలి. యోగి లక్షణాల గురించి అందరికీ తెలుసా? (పిల్లలందరూ బాప్దాదా తెలిపే ప్రతి విషయానికీ జీ హా అంటూ రెస్పాండ్ చేస్తున్నారు) యోగి ఆత్మల కూర్చోవటము, నడవటము, దృష్టి ఎలా ఉంటుందన్నది అందరికీ తెలుసా? అలాగే నడుస్తారా లేక కాస్త కాస్త చంచలతను కూడా చేస్తున్నారా? అందరూ యోగీ ఆత్మలే కదా? ప్రపంచములోని వారు ఏదైతే చేస్తారో దానిని పిల్లలైన మీరు చెయ్యజాలరు. మహానాత్మలైన మీరు ఎంత శాంత స్వరూపులుగా ఉండాలంటే ఎంత పెద్ద-పెద్దవారైనాగానీ శాంత స్వరూప ఆత్మలైన మిమ్మల్ని చూసి శాంతి అనుభూతిని చెయ్యాలి మరియు వీరు సాధారణ పిల్లలు కారు, కానీ అందరూ అలౌకిక పిల్లలు అని కనిపించాలి. అతీతులు మరియు విశేష ఆత్మలు. మరి అలా నడుస్తారా? ఇప్పటి నుండి ఈ పరివర్తనను చెయ్యాలి. ఈరోజు పిల్లలందరినీ కలిసేందుకు బాప్దాదా విశేషంగా వచ్చారు. అర్థమైందా!

పిల్లలతోటి పెద్దలు కూడా వచ్చారు. వచ్చిన పిల్లలందరికీ బాప్దాదా విశేష ప్రియస్మృతిని ఇస్తున్నారు. దీనితోపాటుగా వర్తమాన సమయప్రమాణంగా బాప్దాదా పిల్లలందరినీ ఎగిరే కళవైపుకు తీసుకుపోతున్నారు అని అందరికీ తెలుసు. ఎగిరే కళకు శ్రేష్ఠ సాధనము తెలుసు కదా. ఒక్క మాట పరివర్తన ద్వారా సదా ఎగిరేకళను అనుభవము చెయ్యగలరు. ఆ ఒక్క మాట ఏంటి? కేవలము 'అన్నీ మీవే'. 'నాది' అన్నదానిని మార్చి 'మీది' అని చేసారు. మీది అన్న మాటయే మీవారిగా చేస్తుంది. ఈ ఒక్క మాటయే సదాకాలము కొరకు డబల్ లైట్ గా చేస్తుంది. మీవాడిని, అని అన్నట్లయితే ఆత్మ లైట్అయిపోతుంది. అన్నీ మీవే అన్నప్పుడుకూడా లైట్ (తేలిక)గా అయిపొయ్యారు కదా! కనుక ఒకటే మాట 'మీది'. డబల్లైట్ గా అవ్వటంద్వారా సహజంగానే ఎగిరేకళకు చెందినవారుగా అవుతారు. 'నాది' అనటం బహుకాలపు అభ్యాసమైపోయింది. ఈ నాది అన్న మాటయే అనేకప్రకారాల పరిక్రమణలలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ ఒక్క మాటను పరివర్తన చెయ్యండి. నాదినుండి నీదిగా అయిపోయింది. ఈ పరివర్తన కష్టమైతే కాదు కదా. కనుక సదా ఈ ఒక్క మాటయొక్క అంతర స్వరూపములో స్థితులై ఉండండి. ఏం చెయ్యాలో అర్థమైందా? సదా ఒక్కరి లగనములోనే మగనమై ఉండేవారు, ఇఅటువంటి శ్రేష్ఠ ఆత్మలు వర్తమానములోకూడా శ్రేష్ఠ జీవితమును అనుభవము చేస్తున్నారు మరియు భవిష్యత్తులోకూడా అవినాశీ శ్రేష్ఠులుగా అవుతున్నారు కనుక ఎల్లప్పుడూ ఈ ఒక్క మాటను గుర్తుంచుకోండి. ఈ ఆధారముతో ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళగలరు మరియు మీవద్ద ఎంత ఖజానాను జమ చేసుకోవాలనుకుంటే అంత ఖజానాను జమ చేసుకోగలరు. మామూలుగా కూడా లౌకిక జీవితములో ఎల్లప్పుడూ ప్రసిద్ధులైన మంచి కులమునకు చెందినవారు ఎవరైతే ఉంటారో వారు సదా తమ జీవితములో దానపుణ్యాలను చేసే లక్ష్యమును పెట్టుకుంటారు. మీరందరూ అతి పెద్ద కులానికి, శ్రేష్ఠ కులమునకు చెందినవారు. మరి శ్రేష్ఠ కులము కల బ్రాహ్మణ ఆత్మలు అనగా సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మలు, మరి వారికి కూడా ఉన్న లక్ష్యము ఏంటి? సదా మహాదానులుగా అవ్వండి. సదా పుణ్య ఆత్మగా అవ్వండి. ఎప్పుడూ సంకల్పములోకూడా ఏ వికారమునకైనా వశమై ఏ సంకల్పమునైనా చేసినట్లయితే దానిని ఏమంటారు? పాపమా లేక పుణ్యమా? పాపమని అంటారు కదా. స్వయమునకు కూడా సదా పుణ్యకర్తగా అవ్వండి. సంకల్పములోకూడా పుణ్య ఆత్మ, మాటలలో కూడా పుణ్య ఆత్మ మరియు కర్మలోకూడా పుణ్య ఆత్మ. పుణ్య ఆత్మగా అయినప్పుడు పాపముయొక్క నామరూపాలు ఉండజాలవు. కనుక మేము సర్వ బ్రాహ్మణ ఆత్మలము సదాకాలమునకు పుణ్య ఆత్మలము అని దీనినే సదా స్మృతిలో పెట్టుకోండి. ఏ ఆత్మపట్లనైనా సదా శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ఠ కామనలను పెట్టుకోవటము - ఇదే అన్నింకన్నా పెద్ద పుణ్యము. ఎఅటువంటి ఆత్మ అయినాగానీ, విరోధీ ఆత్మ అయిగానీ లేక స్నేహీ అత్మ అయినాగానీ పుణ్య ఆత్మల పుణ్యమే - విరోధీ ఆత్మకు కూడా శ్రేష్ఠ భావనయొక్క పుణ్య మూలధనముద్వారా ఆ ఆత్మను కూడా పరివర్తన చెయ్యాలి. పుణ్యమని దీనినే అంటారు, ఏ ఆత్మకు ఏ వస్తువుయొక్క అప్రాప్తి ఉంటుందో దానిని ప్రాప్తి చేయించే కార్యము చెయ్యటము - ఇదే పుణ్యము. విరోధీ ఆత్మ మీ ఎదురుగా వచ్చినట్లయితే పుణ్య ఆత్మ సదా ఆ ఆత్మను సహనశక్తినుండి వంచితమైన ఆత్మ అన్న ఈ దృష్టితో చూస్తారు. మరియు మీ పుణ్యముయొక్క మూలధనముద్వారా, శుభ భావనద్వారా, శ్రేష్ఠ సంకల్పముద్వారా ఆ ఆత్మను సహనశక్తి ప్రాప్తికి సహయోగీ ఆత్మగా చేస్తారు. వారికొరకు ఇదే పుణ్యకార్యమైపోతుంది. పుణ్య ఆత్మ సదా స్వయమును దాత పిల్లలుగా, ఇచ్చేవారుగా భావిస్తారు. ఏ ఆత్మద్వారానైనా అల్పకాలపు ప్రాప్తిని తీసుకునే కోరికనుండి దూరంగా ఉంటారు. ఈ ఆత్మ ఏదైనా ఇస్తే నేను ఇస్తాను, లేక వీరు కూడా ఏదైనా చేస్తే నేను కూడా చేస్తాను, ఇఅటువంటి హద్దు కోరికలను పెట్టుకోరు. దాత పిల్లలుగా అయ్యి అందరిపట్ల స్నేహము, సహయోగము, శక్తి ఇచ్చే పుణ్య ఆత్మగా ఉంటారు. పుణ్య ఆత్మ ఎప్పుడుకూడా పుణ్యము చెయ్యటమును తప్ప ప్రశంసలను పొందాలన్న కోరికను పెట్టుకోదు ఎందుకంటే ఈ హద్దు ప్రశంసలను స్వీకరించటము అనగా సదాకాలపు ప్రాప్తినుండి వంచితులవటము అని పుణ్య ఆత్మకు తెలుసు కనుక వారు సదా ఇవ్వటములో సాగరుని సమానంగా సంపన్నంగా ఉంటారు. పుణ్య ఆత్మ ఎల్లప్పుడూ తన మాటలద్వారా ఇతులను సంతోషములో, బాబా స్నేహములో, అతీంద్రియ సుఖములో, ఆత్మిక ఆనందమయ జీవితమును అనుభవము చేయిస్తుంది. వారి ప్రతి మాట సంతోషపు ఔషధంగా అవుతుంది, పుణ్య ఆత్మల ప్రతి కర్మ సర్వ ఆత్మలపట్ల సదా సహయోగపు ప్రాప్తిని కలిగించేదిగా ఉంటుంది మరియు ఈ పుణ్య ఆత్మ చేసే కర్మను చూస్తే ఎల్లప్పుడు ముందుకు ఎగిరేందుకు సహయోగము ప్రాప్తిస్తూ ఉంది అని ప్రతి ఆత్మ అనుభవము చేస్తుంది. పుణ్య ఆత్మల లక్షణాలు ఏవో అర్థమైందా! కనుక అఅటువంటి పుణ్యఆత్మగా అవ్వండి అనగా శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితపు ప్రత్యక్ష స్వరూపంగా అవ్వండి. పవిత్ర ప్రవృత్తి కలిగిన పుణ్య ఆత్మలుగా అవ్వండి, అప్పుడే పుణ్య ఆత్మల ప్రభావముతో పాపపు నామరూపాలు సమాప్తమైపోతాయి. అచ్ఛా!

ఇలా సదా ప్రతి సంకల్పముద్వారా పుణ్యము చేసే పుణ్య ఆత్మలు, సదా ఒక్క మాట పరివర్తనద్వారా ఎగిరేకళలోకి వెళ్ళేవారు, సదా దాత పిల్లలుగా అయ్యి అందరికీ ఇచ్చే విశేష ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

కుమారుల కొరకు అవ్యక్త బాప్దాదా మధుర మహావాక్యాలు

కుమారులందరూ ఫస్ట్ నంబర్లో వచ్చేవారే కదా. ఫస్ట్ నంబర్ ఒక్కటే ఉంటుందా లేక ఇన్ని ఉంటాయా? అచ్చా! ఫస్ట్ డివిజన్లో వచ్చేవారేనా? ఫస్ట్ వచ్చేవారి విశేషత ఏమిటో తెలుసా? ఫస్ట్లో వచ్చేవారు సదా బాబా సమానంగా ఉంటారు. సమానతయే సమీపతను తీసుకువస్తుంది. సమీపము అనగా సమానంగా అయ్యేవారే ఫస్ట్ డివిజన్లోకి రాగలరు. మరి బాబా సమానంగా ఎప్పటి వరకు అవుతారు? విజయమాలలోని నంబర్ అవ్ు అయిపోయినట్లయితే మరిక అప్పుడేం చేస్తారు. డ్ే కాదు, ఇప్పటి క్షణములో చేయాలి. ఇందులో కష్టముంటుందా? కుమారులకు ఏ కష్టముంటుంది? రెండు రొట్టెలు తినటము మరియు బాబా సేవలో ఉండిపోవటము, ఇదే పని కదా! రెండు రొట్టెల కొరకు నిమిత్తమాత్రగా ఏదో ఒక పని చేస్తారు కదా. అలాగే చేస్తారు, మోహముతో చెయ్యరు కదా! నిమిత్తులు అనటం వలన అవ్వదు, కుమారులు చెబితే చెయ్యరు, స్వతంత్రులు. కనుక బాబా సమానంగా అవ్వాలి అన్న లక్ష్యము ఎల్లప్పుడు ఉండాలి. బాబా ఏవిధంగా లైట్ గా ఉంటారో అలా డబల్ లైట్ . ఇతరులను చూస్తే బలహీనులవుతారు, సీ ఫాదర్, ఫాలో ఫాదర్ చెయ్యాలి. దీనినే సదా గుర్తుంచుకోండి. స్వయమును సదా బాబా ఛత్రఛాయలో ఉంచుకోండి. ఛత్రఛాయలో ఉండేవారు సదా మాయాజీతులుగా అవ్వనే అవుతారు. ఒకవేళ ఛత్రఛాయ లోపల లేనట్లయితే, ఒక్కోసారి లోపల, ఒక్కోసారి బయట ఉన్నట్లయితే ఓటమి కలుగుతుంది. ఛత్రఛాయ లోపల ఉన్నవారికి కష్టపడే అవసరము ఉండదు. స్వతహాగానే సర్వ శక్తుల కిరణాలు వారిని మాయాజీతులుగా తయారుచేస్తాయి. సర్వ సంబంధాలతో ఒక్క బాబానే నావారు - ఈ స్మృతి సమర్థ ఆత్మగా తయారుచేస్తుంది. 2950

అందరూ ఎఅటువంటి జీవతము కల మ్యాప్ను తయారుచేసి చూపించాలంటే నిర్విఘ్న ఆత్మలు ఎక్కడ అంటే ఇక్కడే ఉన్నారు అని అందరూ అనాలి. అందరూ విఘ్న వినాశకులుగా అవ్వండి. అలజడిలోకి వచ్చేవారు కారు, వాయుమండలమును పరివర్తన చేసేవారు. శక్తిశాలీ వాయుమండలమును తయారుచేసేవారుగా అవ్వండి. సదా విజయ పతాకము ఎగురుతూ ఉండాలి. అఅటువంటి విశేషమైన మ్యాప్ను తయారుచెయ్యండి. ఎక్కడైతే యూనిటీ (ఐకమత్యము) ఉంటుందో అక్కడ సహజ సఫలత ఉంటుంది. కానీ పడేయటంలో యూనిటీ ఉండకూడదు, ఎక్కడంలో ఉండాలి. సదా ఎగిరేకళలో వెళ్ళాలి మరియు అందరినీ తీసుకుపోవాలి - ఈ లక్ష్యమే ఉండాలి. కుమారులు అనగా సదా ఆజ్ఞాకారులు, నమ్మకస్థులు. ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేసేవారు. బాబా గుణాలు ఏవో అవే పిల్లల గుణాలు, బాబా కర్తవ్యము ఏదో అదే పిల్లల కర్తవ్యము, బాబా సంస్కారము ఏదో అదే పిల్లల సంస్కారము - దీనినే ఫాలో ఫాదర్ అంటారు. బాబా ఏదైతే చేసారో దానిని రిప్టీ చయ్యాలి, కాపీ చెయ్యాలి. ఈ కాపీ చెయ్యటంద్వారా ఫుల్ మార్క్స్ లభిస్తాయి. అక్కడ కాపీ చెయ్యటం వలన మార్కులు క్ అవుతాయి మరియు ఇక్కడ ఫుల్ మార్క్స్ వస్తాయి. కనుక ఏ సంకల్పము చేసినాగానీ, ఇది బాబా సమానంగా ఉందా అన్నదానిని మొదట పరిశీలించుకోండి. ఒకవేళ సమానంగా లేనట్లయితే మార్చుకోండి. సమానంగా ఉన్నట్లయితే ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఎంత సహజ మార్గము! బాబా ఏదైతే చేసారో దానినే మీరు చెయ్యండి. ఇలా సదా బాబాను ఫాలో చేసేవారే సదా మాస్టర్ సర్వ శక్తివంతమైన స్థితిలో స్థితులవ్వగలరు. బాబాయొక్క వారసత్వమే సర్వ శక్తులు మరియు సర్వ గుణాలు. కనుక బాబా వారసులు అనగా సర్వ శక్తులకు, సర్వ గుణాలకు అధికారులు. అధికారినుండి అధికారము ఎలా పోగలదు! ఒకవేళ నిర్ల్యకక్షులుగా అయినట్లయితే మాయ వాటిని దొంగలించేస్తుంది. మాయకుకూడా బ్రాహ్మణ ఆత్మలే మంచి గ్రాహకులుగా అనిపిస్తుంది, కనుక అది కూడా తన అవకాశాన్ని తీసుకుంటుంది. అర్థకల్పము దాని సహచరునిగా ఉన్నారు, కనుక దాని సహచరులను అది ఎలా వదుల్తుంది! మాయ పని రావటము, మీ పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవటము, గాభరా పడకూడదు. వేటగాని ముందుకు వేట వచ్చినప్పుడు వేటగాడు భయపడతాడా ఏంటి? మాయ వచ్చినట్లయితే విజయాన్ని ప్రాప్తి చేసుకోండి, గాభరా పడవద్దు. అచ్చా!

టీచర్లతో - నిమిత్త సేవాధారులు. నిమిత్తము అని అనటం వలన ఎవరు నిమిత్తంగా చేసారు అని సహజంగానే స్మృతి వస్తుంది. సేవాధారి అని ఎప్పుడు అన్నాగానీ దానికి ముందు నిమిత్తము అని తప్పక అనాలి. ఇంకొకి, నిమిత్తముగా భావించటంద్వారా స్వతహాగానే నిర్మానులుగా అయిపోతారు. ఎవరు ఎంత నిర్మానులుగా అవుతారో అంతగా ఫలదాయకులుగా అవుతారు. నిర్మానులుగా అవ్వటము అనగా ఫల స్వరూపులుగా అవ్వటము. మరి నిమిత్త సేవాధారులందరూ స్వయమును నిమిత్తంగా భావించుకుని నడుచుకుటాంరా? నిమిత్తంగా భావించేవారు సదా తేలికగా మరియు సదా సఫలతామూర్తులుగా అవుతారు. ఎంత తేలికగా అవుతారో అంతగా సఫలత తప్పకుండా ఉంటుంది. సేవ ఒక్కోసారి తక్కువగా, ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది, మరి భారంగా అనిపించదు కదా. ఏమవుతుంది, ఎలా అవుతుంది అన్న భారమైతే లేదు కదా. చేయించేవారు చేయిస్తున్నారు మరియు నేను కేవలము నిమిత్తంగా అయ్యి కార్యము చేస్తున్నాను - ఇదే సేవాధారి విశేషత. ఎల్లప్పుడు స్వ పురుషార్థముతో మరియు సేవతో సంతుష్టంగా ఉండండి, అప్పుడే ఎవరికైతే నిమిత్తులుగా అవుతారో వారిలో సంతుష్టత ఉంటుంది. సదా సంతుష్టంగా ఉండటము మరియు ఇతరులను సంతుష్టంగా ఉంచటము - ఇదే విశేషత.

వర్తమాన సమయపు లెక్కతో సేవాధారుల సేవ ఏంటి? సర్వులను తేలికగా చేసే సేవ. ఎగిరే కళలోకి తీసుకువెళ్ళే సేవ. ఎప్పుడైతే స్వయము తేలికగా ఉంటారో అప్పుడే ఇతరులను ఎగిరేకళలోకి తీసుకుపోతారు. అన్నిరకాల భారములను స్వయానికి కూడా తేలిక చేసేవారు మరియు ఇతరుల భారాన్ని కూడా తేలికగా చేసేవారు. ఏ ఆత్మలయొక్క నిమిత్త సేవాధారులుగా అయ్యారో వారిని గమ్యము వరకు చేర్చాలి కదా! అకస్మాత్తుగా ఆగిపోవటము లేక ఇరుక్కుపోవటము ఉండకూడదు కానీ తేలికగా అయ్యి తేలికగా చెయ్యాలి. తేలికగా అయినట్లయితే గమ్యమునకు స్వతహాగనే చేరుకుంటారు. వర్తమాన సమయములో సేవాధారల సేవ ఇదే. ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అందరికీ సేవ లాటరీ లభించింది, ఈ లాటరీని సదా కార్యములో వినియోగిస్తూ ఉండండి. ప్రతి క్షణములో, శ్వాస శ్వాసలో సేవ నడుస్తూ ఉండాలి. ఇందులోనే సదా బిజీగా ఉండండి. అచ్చా!

Comments