15-02-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
విశ్వశాంతి సమ్మేళనంలో కలిసిన సోదరీ సోదరులకు అవ్యక్త బాప్ దాదా యొక్క మధురసందేశం .... (గుల్జార్ దాది ద్వారా)
ఈరోజు నేను వతనానికి వెళ్ళేసరికి బాప్ దాదా చాలా మధురాతి, మధురమైన దృష్టి ద్వారా పిల్లలందరికీ ప్రియస్మృతులు ఇస్తున్నారు. ఈరోజు బాబా యొక్క దృష్టి ద్వారా చాలా శాంతి, శక్తి, ప్రేమ మరియు ఆనందం యొక్క కిరణాలు వస్తున్నట్లుగా అనుభవం అవుతుంది. ఆత్మిక దృష్టి ద్వారా నాలుగు విషయాలు లభిస్తున్నాయి. మేము చాలా పొందుతున్నట్లు అనుభవం అవుతుంది. ఇలా బాప్ దాదా పిల్లలందరికీ స్వాగతం చెప్పారు మరియు మాట్లాడారు - బచ్చీ! అందరి ప్రియస్మృతులు తీసుకువచ్చావా? అని అడిగారు. నేను ప్రియస్మృతులైతే తీసుకువచ్చాను దానితో పాటు అందరి యొక్క ఆహ్వాన సంకల్పం కూడా తీసుకువచ్చాను అని చెప్పాను. అప్పుడు బాబా అన్నారు ఈ సమయంలో ఎవరైతే నా ప్రియాతిప్రియమైన పిల్లలు ఇప్పుడు తెలుసుకునేటందుకు వచ్చారు. తర్వాత కలుసుకునేటందుకు కూడా వస్తారు అని. బాప్ దాదా వతనంలో ఉంటూ కూడా పిల్లలందరి యొక్క దృశ్యం సదా చూస్తూ ఉంటారు. ఇలా అంటూ బాబా ఒక దృశ్యాన్ని చూపించారు - భారతదేశంలో ఎలా అయితే భక్తులు శివలింగం యొక్క ప్రతిమ తయారుచేస్తారో అదేవిధంగా వతనంలో కూడా ఒక ప్రతిమ ఉంది. అది గ్లోబ్ ఆకారంలో ఉంది. ఆ గ్లోబ్ పై మెరుస్తున్న అనేక రకాలైన వజ్రాలు నలువైపుల కనిపిస్తున్నాయి. ఆ మెరుస్తున్న వజ్రాలపై నాలుగు రకాలైన లైట్ పడుతుంది. 1.తెలుపురంగు 2. ఆకుపచ్చ 3.లేత నీలం 4. బంగారు రంగు. కొద్ది సమయంలో ఆ లైట్ మాటలలోకి మారిపోయింది. తెలుపు రంగుపై శాంతి అనే అక్షరాలు ఉన్నాయి. రెండవదానిపై ఉత్సాహం, మూడవదానిపై ఉల్లాసం, నాల్గవదానిపై సేవ. అప్పుడు బాబా అన్నారు - పిల్లలందరు చాలా ఉత్సాహ ఉల్లాసాలతో మరియు శాంతి సంకల్పం ద్వారా చాలా సేవ చేసారు. ఒక్కొక్క ఆత్మ సంఘటిత రూపంలో చూడండి ఎంతగా మెరుస్తుందో! మరలా బాబా అన్నారు - నన్ను వారి శక్తిననుసరించి తెలుసుకున్నారు. అయినప్పటికీ నా పిల్లలే. నా మధురాతి మధురమైనపిల్లలందరికీ ప్రియస్మృతులు ఇవ్వండి. ఏ పిల్లలైతే ఇక్కడికి వచ్చారో అందరి నోటి నుండి మా ఇంటికి వచ్చాము అనే మాట వచ్చింది. బాప్ దాదా పిల్లల యొక్క ఈ మాట విని నవ్వుకుంటున్నారు. పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు పూర్తి అధికారం తీసుకోవడానికి వస్తారా లేక కొద్దిగా తీసుకుంటారా? అప్పుడు బాబా అన్నారు - సాగరుని ఒడ్డుకి వచ్చి బిందె నింపుకుని వెళ్ళటం కాదు, మాస్టర్ సాగరులై వెళ్ళాలి. ఖజానా వద్దకు వచ్చి రెండు దోసిళ్ళు నింపుకుని వెళ్ళకూడదు. మరలా బాప్ దాదా మూడు రకాలైన పిల్లలకు మూడు రకాలైన కానుకలు ఇచ్చారు. బాబా అన్నారు - నా యొక్క కలంధారి పిల్లలు (ప్రెస్ వారు) ఎవరైతే వచ్చారో వారికి బాప్ దాదా కమలపుష్పం యొక్క కానుక ఇస్తున్నారు. నా యొక్క కలంధారి పిల్లలకు సదా కమల సమానంగా మొత్తం విశ్వం యొక్క తమోగుణి తరంగాలకు అతీతంగా మరియు పరమాత్మకు ప్రియంగా అవ్వండి అని చెప్పండి. ఈ విధమైన స్థితిలో కలం నడిపిస్తే మీ వ్యవహారం కూడా సిద్ధిస్తుంది మరియు పరమార్ధం కూడా సిద్ధిస్తుంది.
వి.ఐ.పి పిల్లలకు బాబా సింహాసనం కాదు కానీ హంసాసనం ఇచ్చారు. వి.ఐ.పి పిల్లలు ఎవరైతే వచ్చారో వారి మాటలో శక్తి ఉంది వీరికి నేను హంసాసనాన్ని ఇస్తున్నాను. ఈ ఆసనంపై కూర్చుని ఏ కార్యం అయినా చేయాలి. హంసాసనంపై కూర్చోవటం ద్వారా మీ యొక్క నిర్ణయశక్తి శ్రేష్టంగా ఉంటుంది మరియు ఏ కార్యం చేసినా దానిలో విశేషత ఉంటుంది. ఎలా అయితే కుర్చీపై కూర్చుని కార్యం చేస్తారో అలాగే బుద్ధి ఈ ఆసనంపై ఉంటే లౌకిక కార్యంతో కూడా ఆత్మలకు స్నేహము మరియు శక్తి లభిస్తుంది.
సమర్పణ అయిన పిల్లలకు బాప్ దాదా చాలా మంచి లైట్ తో తయారైన పూలహారం ఇచ్చారు. ప్రతి లైట్ పై ఏదోక దివ్యగుణం వ్రాసి ఉంది. బాబా అన్నారు - నా పిల్లలు సర్వగుణాలు ఆధారణ చేసే గుణమూర్తి పిల్లలు అని. పిల్లలందరు ఒకే బలం, ఒకే మతం వారిగా అయ్యి అనంతమైన సేవ చేసారు. దీనికి ఫలితంగా ఈ దివ్యగుణాల మాల పిల్లలకు కానుకగా ఇస్తున్నారు. మరియు చివరిగా పిల్లలందరికీ ఇదే మహావాక్యం వినిపించారు - సదా సంతోషంగా ఉండాలి, అదృష్టవంతులుగా అవ్వాలి మరియు అందరినీ సంతోషం యొక్క వరదానాలతో, ఖజానాలతో సంపన్నం చేస్తూ ఉండాలి. ఇలా మధుర మహావాక్యాలు వింటూ, ప్రియస్మృతులు ఇస్తూ మరియు తీసుకుంటూ నేను సాకారవతనానికి చేరుకున్నాను.
Comments
Post a Comment