15-02-1983 అవ్యక్త మురళి

15-02-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విశ్వశాంతి సమ్మేళనం యొక్క సమాప్తి సమారోహంలో ప్రాణ అవ్యక్త బాప్ దాదా మాట్లాడిన మధుర మహావాక్యాలు.

               ఈరోజు అనంతమైన తండ్రి సేవకు నిమిత్తమైన సేవాధారి పిల్లలను చూస్తున్నారు. ఏ పిల్లవాడిని చూసినా ప్రతి ఒక పిల్లవాడు ఒకరికంటే ఒకరు శ్రేష్టమైనవారు. కనుక బాప్ దాదా ప్రతి ఒక శ్రేష్టాత్మ యొక్క సేవాధారి ఆత్మ యొక్క విశేషతను చూస్తున్నారు. ప్రతి ఒక పిల్లవాడు ఈ విశ్వపరివర్తనా కార్యంలో ఆధారమూర్తి మరియు ఉద్దారమూర్తి అని బాప్ దాదాకి సంతోషంగా ఉంది. పిల్లలందరు బాప్ దాదా యొక్క కార్యంలో సదా సహయోగి ఆత్మలు. ఇలా సహయోగి, సహజయోగి శ్రేష్టాత్మలను మరియు సేవకు నిమిత్తమైన పిల్లలను చూసి బాప్ దాదా చాలా స్నేహంతో బంగారు పుష్పాలతో పిల్లలకు స్వాగతం మరియు శుభాకాంక్షలు చెప్తున్నారు. బాప్ దాదా ప్రతి ఒక పిల్లవాడిని మస్తకమణిగా, సంతుష్టమణిగా, హృదయంలో మెరిసే మణిగా చూస్తున్నారు. బాప్ దాదా కూడా ఒక పాట పాడుతూ ఉంటారు ఏమి పాట పాడతారో తెలుసు కదా? ఓహో నా పిల్లలు ఓహో అనే పాట పాడతారు. ఓహో మధురమైన పిల్లలు ఓహో! ఓహో ప్రియమైన పిల్లలు ఓహో! ఓహో శ్రేష్టాత్మలు ఓహో! ఈ విధమైన నిశ్చయం మరియు నషా సదా ఉంటుంది కదా! భగవంతుడు పిల్లల యొక్క పాటలు పాడే భాగ్యం మొత్తం కల్పంలో ఎప్పుడు లభించదు. భక్తులు భగవంతుని పాటలు చాలా పాడతారు. మీరందరు చాలా పాటలు పాడారు. కానీ భగవంతుడు మా యొక్క పాటలు పాడతారు అని ఎప్పుడైనా ఆలోచించారా! ఏదైతే ఆలోచనలో కూడా లేదో అది ఇప్పుడు సాకారరూపంలో చూస్తున్నారు. విశ్వశాంతి యొక్క కాన్ఫెరెన్స్ చేసారు. పిల్లలందరు నోటి ద్వారా చాలా మంచి మంచి విషయాలు వినిపించారు మరియు మనస్సు ద్వారా సర్వాత్మల పట్ల శుభభావన, శ్రేష్టకామన యొక్క శుభసంకల్పాల యొక్క తరంగాలు కూడా నలువైపుల జ్ఞానసూర్యునిగా అయ్యి వ్యాపింపచేసారు. కానీ బాప్ దాదా ఉపన్యాసం చెప్పినవారి సారం వినిపిస్తున్నారు. మీరయితే నాలుగు రోజులు ఉపన్యాసం చెప్పారు. కానీ బాప్ దాదా ఒక సెకను యొక్క ఉపన్యాసం చెప్తారు. ఆ రెండు మాటలు - రీయలైజేషన్ (అనుభూతి) మరియు సొల్యూషన్ (ఉపాయం). మీరందరు ఏదైతే చెప్పారో దాని సారం అనుభూతియే. ఆత్మని అర్ధం చేసుకోలేకపోయినా మానవ విలువలను తెలుసుకున్నా కూడా శాంతి అయిపోతారు. మానవుడు విశేష శక్తిశాలి స్వరూపం. మానవునిగా అనుభవం చేసుకున్నా మానవ ధర్మం - 'స్నేహం'.  గొడవలు, దెబ్బలాటలు కాదు. దీనికి ఇంకా ముందుకు వెళ్ళండి - మానవ జీవితం లేదా మానవత్వం అనేది ఆత్మపై ఆధారపడి ఉంది. నేను ఏవిధమైన ఆత్మను, ఏమిటి అనేది అనుభవం చేసుకుంటే శాంతి స్వధర్మంగా అనుభవం అవుతుంది. మరలా ఇంకొంచెం ముందుకు వెళ్తే నేను శ్రేష్టాత్మను, సర్వశక్తివంతుని సంతానాన్ని ఈ అనుభూతి నిర్భలస్థితి నుండి శక్తిశాలిగా చేస్తుంది. శక్తి స్వరూప ఆత్మ మరియు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ఏది కావాలంటే, ఎలా కావాలంటే అలా అది ప్రత్యక్ష రూపంలో చేయగలుగుతుంది. అందువలనే మొత్తం ఉపన్యాసం యొక్క సారం " అనుభూతి" అని చెప్పాను. బాప్ దాదా అయితే అన్ని ఉపన్యాసాలు విన్నారు. బాప్ దాదా సదా పిల్లల వెంటే ఉంటారు. సేవలో సమర్పితం అయిన పిల్లలు, అన్ని జోన్ల నుండి వచ్చిన ఒక్కొక్కరు బాప్ దాదా నాకే చెప్తున్నారు అని భావించండి. ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. పిల్లలందరు ఏదైతే ప్రత్యక్ష ఉదాహరణ చూపించారో వారందరికీ తిరిగి బాబా ప్రతి పిల్లవానికి పేరు పేరున, రూపమైతే చూస్తున్నారు. కానీ పేరు పేరున శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు సమయ పరివర్తన యొక్క సూచన ఇస్తున్నారు కదా! అలాగే బాప్ దాదా యొక్క కలయిక కూడా పరివర్తన అవుతుంది కదా! పరివారం వృద్ధి అవ్వాలి పాతవారు త్యాగం చేయాలి అని మీ అందరి సంకల్పం కదా! కానీ ఈ త్యాగమే భాగ్యం. ఇతరులను ముందుకు తీసుకువెళ్ళడమే స్వయం ముందుకు వెళ్ళడం. బాప్ దాదాకి విదేశీ పిల్లలంటే ఇష్టం, దేశీ పిల్లలంటే ఇష్టం లేదు లేక విశేషమైన పిల్లలే బాబాకి ఇష్టం ఇలా ఎప్పుడు అనుకోకండి. బాప్ దాదాకి అయితే ప్రతి ఒక పిల్లవాడు మనస్సు యొక్క తోడు, మస్తక సింహాసనం యొక్క మణులు. అందువలనే బాబా అందరికంటే ముందు తన యొక్క కుడిభుజాలైన సహయోగి పిల్లలకు మనస్సుతో మరియు ప్రాణంతో, ప్రేమతో ప్రియస్మృతులు ఇస్తున్నారు. దూరం నుండి వచ్చినవారికి, సంప్రదింపుల్లోకి వచ్చినవారిని సంబంధంలోకి తీసుకురావడానికి మీరందరు సంతోషంతో వారిని ముందుకు తీసుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు ఇది అవసరం. ఈ సమయంలో అందరు సేవ కోసం వచ్చారు. కనుక ఇది కూడా సేవ అయ్యింది. ప్రతి జోన్ యొక్క పేర్లు తీసుకోనా? ఒకవేళ ఒకరి పేరు ఎవరిదైనా ఉండిపోతే? అందువలన అన్ని జోన్ల వారు బాప్ దాదా నన్ను మొదటి నెంబర్ లో పెట్టారు అని భావించండి. దేశవిదేశీ పిల్లలందరు ఇప్పుడు మధువనం నివాసీలు. అందువలన విశ్వశాంతి హాల్ లో ఉపస్థితులై ఉన్న పిల్లలకు, ఓంశాంతి భవన నివాసీ పిల్లలకు, సదా స్మృతిలో ఉండండి, స్మృతి ఇప్పిస్తూ ఉండండి. ప్రతి అడుగు స్మృతిచిహ్న చరిత్రగా చేసుకుని నడుస్తూ ఉండండి. ప్రతి సెకను మీ ప్రత్యక్షజీవితం యొక్క దర్పణం ద్వారా స్వయం యొక్క మరియు బాప్ దాదా యొక్క సాక్షాత్కారం చేయిస్తూ వెళ్ళండి. ఈ విధమైన వరదాని, మహాదాని, సదా సంపన్న పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments