14-01-1985 అవ్యక్త మురళి

14-01-1985          ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా        మధువనము  

'' శుభ చింతకులుగా అయ్యేందుకు ఆధారము - స్వ చింతన మరియు శుభ చింతన ''
ఈ రోజు బాప్దాదా నలువైపుల ఉన్న విశేషమైన పిల్లలను చూస్తున్నారు. ఎటువంటి విశేషతలు గల పిల్లలు ? సదా స్వ చింతనలో, శుభ చింతనలో ఉండుట వలన సర్వుల పట్ల శుభ చింతకులుగా ఉన్న పిల్లలు. ఎవరైతే సదా శుభ చింతనలో ఉంటారో వారు స్వతహాగానే శుభ చింతకులుగా అవుతారు. శుభచింతనకు ఆధారము - శుభచింతకులుగా అవ్వడం. మొదటి అడుగు - స్వచింతన. స్వచింతన అనగా బాప్దాదా 'నేను ఎవరు' అనే చిక్కుప్రశ్నకు తెలిపిన జవాబు. ఆ జవాబును సదా స్మృతిస్వరూపంలో ఉంచుకోవడం. ఎలాగైతే తండ్రి(బాప్) మరియు దాదా ఎవరో, ఎలా ఉన్నారో అలా వారిని తెలుసుకోవడమే యధార్థంగా తెలుసుకోవడం అంతేకాక ఇరువురిని తెలుసుకోవడమే తెలుసుకోవడమవుతుందో అలా స్వయాన్ని కూడా నేను ఎవరు, ఎలా ఉన్నాను అనగా ఆది, అనాది శ్రేష్ఠ స్వరూపమేదైతే ఉందో ఆ రూపముతో స్వయాన్ని తెలుసుకొని అదే స్వ చింతనలో ఉండుటనే స్వచింతన అని అంటారు. నేను బలహీనంగా ఉన్నాను, పురుషార్థిని, సఫలతా స్వరూపంగా లేను, మాయాజీత్గా లేను అని అనుకోవడం స్వచింతన కాదు. ఎందుకంటే సంగమయుగంలోని పురుషోత్తమ బ్రాహ్మణాత్మ అంటేనే శక్తిశాలి ఆత్మ. ఈ బలహీనత లేక పురుషార్థహీనత లేక ఢీలా పురుషార్థము దేహాభిమానము యొక్క రచన. స్వ అనగా ఆత్మ-అభిమాని- ఈ స్థితిలో బలహీనమైన మాటలు రాజాలవు. కావున ఇది దేహాభిమానము యొక్క రచనను గురంచి చింతన చేయడం. ఇది కూడా స్వచింతన కాదు. స్వచింతన అనగా '' తండ్రి ఎలాగైతే శ్రేష్ఠమైన వారో అలా నేను ఒక శ్రేష్ఠమైన ఆత్మను '' - ఇటువంటి స్వచింతన చేసేవారు శుభ చింతన చేయగలరు. శుభచింతన అనగా జ్ఞాన రత్నాలను మననం చేయడం. రచయిత మరియు రచనల గుహ్య రమణీయమైన రహస్యాలను రమణం చేయడం. ఒకటేమో కేవలం రిపీట్ చేయడం, రెండవది జ్ఞానసాగరుని అలలలో తేలియాడడం అనగా జ్ఞాన ఖజానాల యజమానిని అనే నశాలో ఉండి సదా జ్ఞానరత్నాలతో ఆడుకుంటూ ఉండడం. జ్ఞానములోని ఒక్కొక్క అమూల్యమైన మాటను అనుభవంలోకి తీసుకురావడం అనగా స్వయాన్ని అమూల్య రత్నాలతో సదా మహాన్గా చేసుకోవడం. ఇలా జ్ఞానములో రమించువారే శుభచింతన చేయువారు. ఇటువంటి శుభచింతన చేయువారు స్వతహాగానే వ్యర్థ చింతన, పరచింతనల నుండి దూరంగా ఉంటారు. స్వచింతన, శుభచింతన చేసే ఆత్మలు ప్రతి సెకండు తమ శుభచింతనలో ఎంత బిజీగా ఉంటారంటే వారికి వేరే చింతన చేసేందుకు ఒక సెకండు లేక ఒక శ్వాస కూడా తీరిక ఉండదు. అందువలన సదా పరచింతన మరియు వ్యర్థ చింతన నుండి సహజంగానే సురక్షితంగా ఉంటారు. అందుకు బుద్ధిలో స్థానముండదు, సమయం కూడా ఉండదు. వారి సమయం కూడా శుభచింతనలో ఉపయోగపడ్తుంది. బుద్ధి సదా జ్ఞానరత్నాలతో అనగా శుభ సంకల్పాలతో సంపన్నంగా అనగా నిండుగా ఉంటుంది. వేరే ఏ ఇతర సంకల్పము వచ్చే అవకాశమే ఉండదు. ఇటువంటి వారిని శుభచింతన చేయువారని అంటారు. ప్రతి జ్ఞానరత్నం రహస్యంలోకి వెళ్లేవారు. కేవలం శబ్ధాలను విని(సాజ్ విని) ఆనందించేవారు కాదు. సాజ్ అనగా మాటల రహస్యంలోకి వెళ్లేవారు. ఏ విధంగా స్థూల సాజ్(సంగీతం) కూడా వినేందుకు చాలా బాగుంటుందో అలా జ్ఞాన మురళి సాజ్(శబ్ధాలు) చాలా బాగుంటుంది. కానీ సాజ్తో పాటు రాజ్ను(రహస్యాన్ని) అర్థం చేసుకునే వారు జ్ఞానరత్నాల యజమానిగా అయ్యి మననం చేయడంలో మగ్నమై ఉంటారు. మగ్న స్థితిలో ఉన్నవారి ముందుకు ఏ విఘ్నాలు రాజాలవు. ఇలాంటి శుభచింతన చేయువారు స్వతహాగా సర్వుల సంపర్కములో శుభచింతకులుగా అవుతారు. స్వచింతన, శుభచింతన చేసే ఆత్మలు శుభచింతకులుగా అవుతారు ఎందుకంటే ఎవరైతే స్వయం రాత్రి-పగలు శుభచింతనలో ఉంటారో వారు ఇతరుల పట్ల ఎప్పుడూ అశుభం ఆలోచించరు, అశుభం చూడరు. వారి అసలు సంస్కార స్వభావాలు శుభంగా ఉన్నందున వారి వృత్తికి, దృష్టికి అందరిలో శుభాన్ని చూచే, శుభాన్ని ఆలోచించే అలవాటు స్వతహాగా వచ్చేస్తుంది. అందువలన ప్రతి ఒక్కరి పట్ల శుభ చింతకులుగా ఉంటారు. ఆత్మల బలహీన సంస్కారాలను చూస్తున్నా వారి పట్ల వీరు ఇటువంటి వారు, ఇలాగే ఉన్నారు అని అశుభము లేక వ్యర్థము ఆలోచించరు. అంతేకాక అటువంటిి బలహీన ఆత్మలకు సదా ఉమంగ-ఉత్సాహాలనే రెక్కలనిచ్చి శక్తిశాలిగా చేసి ఉన్నతానికి ఎగిరిస్తారు. సదా ఆ ఆత్మల పట్ల శుభభావన, శుభకామనల ద్వారా సహయోగులుగా అవుతారు. శుభచింతకులు అనగా నిరాశావాదులను ఆశావాదులుగా చేసేవారు. శుభచింతనల ఖజానా ద్వారా బలహీనుమైన వారిని కూడా భర్పూర్గా(సంపన్నంగా) చేసి ముందుకు తీసుకెళ్తారు. వీరిలో జ్ఞానమే లేదని, వీరు జ్ఞానానికి పాత్రులు కారని, వీరు జ్ఞానములో నడవలేరని అనుకోరు. శుభచింతకులు బాప్దాదా ద్వారా తీసుకున్న శక్తుల సహాయము అనే కాళ్లు ఇచ్చి కుంటివారిని కూడా నడిపించేందుకు నిమిత్తులుగా అవుతారు. శుభచింతక ఆత్మలు తమ శుభచింతక స్థితి ద్వారా వ్యాకులపడిన(దిల్షికిస్త్) ఆత్మలను దిల్ఖుష్ మిఠాయి ద్వారా వారిని కూడా ఆరోగ్యవంతులుగా చేస్తారు. మీరు దిల్ఖుష్ మిఠాయి తింటున్నారు కదా, ఇతరులకు కూడా తినిపించడం వస్తుంది కదా! శుభచింతక ఆత్మలకు ఇతరుల బలహీనతలు తెలిసినా ఆ ఆత్మల బలహీనతలను మర్చిపోయి తమ విశేషతల శక్తి ద్వారా సమర్థతను ఇప్పిస్తూ వారిని కూడా సమర్థంగా చేస్తారు. ఎవ్వరి పట్ల కూడా ఘృణా దృష్టి ఉండదు. సదా క్రింద పడిన ఆత్మలను పైకి ఎగిరించాలనే దృష్టి ఉంటుంది. కేవలం స్వయం శుభచింతనలో ఉండడం లేక శక్తిశాలి ఆత్మగా అవ్వడం కూడా ఫస్ట్క్లాస్ స్టేజ్ కాదు. వారిని కూడా శుభచింతకులని అనరు. శుభచింతకులు అనగా తమ ఖజానాలను మనసా ద్వారా, వాచా ద్వారా, తమ ఆత్మిక సంబంధ - సంపర్కాల ద్వారా ఇతర ఆత్మల పట్ల సేవలో ఉపయోగించడం. శుభచింతక ఆత్మలు నెంబర్వన్ సేవాధారులుగా, సత్యమైన సేవాధారులుగా ఉంటారు. ఇటువంటి శుభ చింతకులుగా అయ్యారా? సదా వారి కృతి శుభంగా, వృత్తి శుభంగా ఉంటుంది. కనుక శ్రేష్ఠమైన బ్రాహ్మణుల సృష్టి కూడా శుభంగా కనిపిస్తుంది. సాధారణంగా కూడా శుభం మాట్లాడండి అని అంటూ ఉంటారు. బ్రాహ్మణ ఆత్మలంటేనే శుభప్రదమైన జన్మ తీసుకున్నవారు, శుభప్రదమైన సమయంలో జన్మించినవారు. బ్రాహ్మణులు జన్మించిన ఘడియ అనగా వేళ(సమయం) శుభమైనది కదా! భాగ్య దశ కూడా శుభప్రదమైనదే. సంబంధాలు కూడా శుభమైనవే. వారి సంకల్పాలు, కర్మలు కూడా శుభమైనవే. అందువలన బ్రాహ్మణాత్మలకు సాకారంలోనే కాదు, స్వప్నంలో కూడా అశుభానికి నామ-రూపాలే ఉండవు. మీరు ఇటువంటి శుభచింతక ఆత్మలు కదా! విశేషంగా స్మృతిదినము సందర్భంగా వచ్చారు. స్మృతిదినము అనగా సమర్థమైన దినము. కనుక మీరు విశేషమైన సమర్థ ఆత్మలు కదా! బాప్దాదా కూడా అంటున్నారు - ''సదా సమర్థమైన ఆత్మలు సమర్థ దినాన్ని జరిపేందుకు భలే విచ్చేశారు, సమర్థుడైన బాప్దాదా సమర్థమైన పిల్లలను సదా స్వాగతిస్తున్నారు. అర్థమయ్యిందా! మంచిది.
సదా స్వచింతన చేస్తూ ఆత్మిక నశాలో ఉండువారు, శుభచింతన ఖజానాలతో సంపన్నంగా ఉండేవారు, శుభచింతకులుగా అయ్యి సర్వ ఆత్మలను ఎగిరించి, ఎగిరేవారు, సదా తండ్రి సమానంగా దాత, వరదాతలుగా అయ్యి అందరినీ శక్తిశాలిగా చేసేవారు, ఇటువంటి సమర్థమైన సమాన పిల్లలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో - మాతల గ్రూప్తో :-
1. మాతలు సదా తమ శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి సంతోషంగా ఉంటున్నారు కదా! చరణాల దాసిగా ఉన్నవారు శీరోకిరీటధారులుగా అయ్యారు, ఈ సంతోషం సదా ఉంటుందా? ఈ సంతోష ఖజానా ఎప్పుడూ దొంగిలించబడుట లేదు కదా? మాయ దొంగతనం చేయడంలో తెలివిగలది. సదా శక్తిశాలిగా తెలివిగలవారిగా ఉన్నట్లయితే మాయ ఏమీ చెయ్యలేదు, ఇంకా దాసిగా అయిపోతుంది. శత్రువు నుండి సేవాధారిగా అవుతుంది. ఇలాంటి మాయాజీత్లుగా ఉన్నారా? తండ్రి స్మృతిలో అనగా సదా సాంగత్యంలో ఉండేవారు. ఆత్మిక రంగు అంటుకునే ఉంది. తండ్రి సాంగత్యం లేకపోతే ఆత్మిక రంగు లేదు. అందరూ తండ్రి సాంగత్య రంగులో రంగరించబడి నిర్మోహులుగా ఉన్నారా? లేక కొంచెం కొంచెం మోహం ఉందా? పిల్లలలో లేదు కానీ మనవళ్లు, మునిమనవళ్ల మీద ఉంటుంది. పిల్లల సేవ పూర్తయ్యింది ఇంకొకరి సేవ ఆరంభం అయ్యింది. తక్కువ కాదు. ఒకదాని వెనుక ఒకటి లైను తయారైపోతుంది. వీటితో బంధన ముక్తులుగా ఉన్నారా? మాతలకు ఎంత శ్రేష్ఠమైన ప్రాప్తి జరిగింది? పూర్తి ఖాళీ చేతులుగా అయిపోయినవారు ఇప్పుడు సంపన్నంగా అయ్యారు. అన్నీ పోగొట్టుకున్నారు, ఇప్పుడు మళ్లీ తండ్రి ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తి చేసుకున్నారు. కావున మాతలు ఎలా ఉన్నవారు ఎలా అయ్యారు? నాలుగు గోడలలో ఉండేవారు విశ్వానికి యజమానిగా అయ్యారు. తండ్రి మమ్ములను తనవారిగా చేసుకున్నారు మాది ఎంత భాగ్యము అని నశా ఉంటుంది కదా! భగవంతుడు వచ్చి తనవారిగా చేసుకున్నారు. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం ఎప్పుడూ ండజాలదు. కనుక తమ భాగ్యాన్ని చూసి సదా సంతోషంగా ఉంటున్నారు కదా! ఈ ఖజానాను మాయ ఎప్పుడూ దొంగిలించరాదు.
2. అందరూ పుణ్యాత్ములుగా అయ్యారా? అన్నిటికంటే గొప్ప పుణ్యము ఇతరులకు శక్తిని ఇవ్వడము. కావున సదా సర్వాత్మల పట్ల పుణ్యాత్మ అనగా తమకు లభించిన ఖజానాకు మహాదానులుగా అవ్వండి. ఇలాంటి దానం చేసేవారు ఇతరులకు ఎంత ఇస్తారో, అంత వారి ఖజానాలు పదమాల రెట్లు పెరుగుతాయి. ఈ ఇవ్వడం అనగా తీసుకోవడం అవుతుంది. ఇలాంటి ఉత్సాహం ఉంటుందా? ఈ ఉత్సాహం యొక్క ప్రాక్టికల్ స్వరూపము సేవలో సదా ముందుకు వెళ్తూ ఉండండి. తనువు, మనసు, ధనం సేవలో ఎంతగా వినియోగిస్తారో అంత వర్తమానం కూడా మహాదాని పుణ్యాత్మగా అవుతారు అంతేకాక భవిష్యత్ కూడా సదాకాలం కొరకు జమ చేసుకుంటారు. తమకు ఉన్నదంతా జమ చేసుకునేందుకు అవకాశం లభించడం కూడా డ్రామాలో భాగ్యము. ఈ సువర్ణ అవకాశం తీసుకునే వారే కదా! ఆలోచించి చేస్తే వెండి అవకాశం. విశాల హృదయులుగా అయ్యి చేస్తే బంగారు అవకాశం. కావున అందరు నెంబర్వన్ ఛాన్స్లర్గా అవ్వండి.
డబల్ విదేశీ పిల్లలతో :-
బాప్దాదా రోజూ స్నేహీ పిల్లల స్నేహానికి బదులు ఇస్తారు. తండ్రికి పిల్లలతో ఎంత స్నేహం ఉందంటే పిల్లలు సంకల్పం చేస్తూనే నోటి వరకు కూడా రాకుండానే తండ్రి దానికి బదులు ముందే చేసి పెడ్తారు. సంగమ యుగంలో మొత్తం కల్పానికి ప్రియస్మృతులు ఇస్తారు. ఎంత ప్రియస్మృతలు ఇస్తారంటే జన్మ-జన్మలు ఈ ప్రియస్మృతులతో జోలె నిండి ఉంటుంది. బాప్దాదా స్నేహీ ఆత్మలకు సదా సహయోగం ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. తండ్రి ఏ స్నేహం ఇచ్చారో, ఆ స్నేహ స్వరూపంగా అయ్యి ఎవరిని స్నేహీగా చేసినా వారు తండ్రివారిగా అవుతారు. స్నేహీ ఆత్మలు అందరినీ ఆకర్షిస్తారు. పిల్లలందరి స్నేహం తండ్రి వద్దకు చేరుకుంటూ ఉంటుంది. మంచిది.
మొరీషియస్ పార్టీతో :-
అందరు అదృష్ట నక్షత్రాలు కదా? ఎంత భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు? ఇలాంటి గొప్ప భాగ్యం ఎవ్వరికీ ఉండజాలదు. ఎందుకంటే భాగ్యవిధాత అయిన తండ్రియే మీవారిగా అయ్యారు. మీరు వారి పిల్లలుగా అయ్యారు. భాగ్యవిధాత తమవారిగా అయితే దీని కంటే శ్రేష్ఠమైన భాగ్యం ఏముంటుంది? కనుక ఇలాంటి శ్రేష్ఠ భాగ్యశాలురు మెరుస్తున్న నక్షత్రాలు అంతేకాక అందరినీ భాగ్యశాలురుగా చేసేవారు. ఎందుకంటే ఎవరికైనా మంచి వస్తువు లభిస్తే అది ఇతరులకు ఇవ్వకుండా ఉండలేరు. ఎలాగైతే స్మృతి లేకుండా ఉండలేరో, అలా సేవ లేకుండా కూడా ఉండలేరు. ఒక్కొక్క పుత్రుడు అనేక దీపాలను వెలిగించి దీపమాలను తయారు చేయువారు. దీపమాల(దీపావళి) రాజ్యతిలకానికి గుర్తు. కనుక దీపమాలను తయారుచేసే వారికి రాజ్య తిలకం లభిస్తుంది. సేవ చెయ్యడం అనగా రాజ్య తిలకధారిగా అవ్వడం. సేవ యొక్క ఉమంగ-ఉల్లాసాలలో ఉండేవారు ఇతరులకు కూడా ఉత్సాహ-ఉల్లాసాల రెక్కలు ఇవ్వగలరు.
ప్రశ్న :- ఏ ముఖ్యమైన ధారణ ఆధారంతో సిద్ధిని సహజంగా ప్రాప్తి చేసుకోగలరు ?
జవాబు :- స్వయాన్ని నమ్రచిత్తులుగా, నిర్మాణంగా మరియు ప్రతి విషయంలో స్వయాన్ని గుణ గ్రాహకులుగా చేసుకుంటే సహజంగా సిద్ధిని పొందుతారు. ఎవరైతే స్వయాన్ని ఋజువు చేసుకుంటారో వారు మొండితనం చేస్తారు. అందువలన వారు ఎప్పటికి ప్రసిద్ధులుగా అవ్వలేరు. మొండితనం చేసేవారు ఎప్పుడూ సిద్ధిని పొందలేరు. వారు ప్రసిద్ధమయ్యేందుకు బదులు ఇంకా దూరంగా అవుతారు.
ప్రశ్న :- విశ్వం లేక ఈశ్వరీయ పరివారం పశంశకు హక్కుదారులుగా ఎప్పుడు అవుతారు?
జవాబు :- స్వయం పట్ల లేక ఇతరుల పట్ల ప్రశ్నలన్నీ సమాప్తి అయినప్పుడు. స్వయాన్ని ఒకరు ఇంకొకరి కంటే తక్కువగా భావించరు. అర్థం చేసుకోవడంలో స్వయాన్ని అథారిటీగా భావిస్తారు. ఈ విధంగా అర్థం చేసుకొని చెయ్యడంలో రెండిటిలో హక్కుదారులుగా అయినప్పుడు విశ్వానికి లేక ఈశ్వరీయ పరివారం ప్రశంశకు హక్కుదారులుగా అవుతారు. ఏ విషయం అయినా అడుక్కునేవారుగా అవ్వకండి. దాతలుగా అవ్వండి. మంచిది. ఓంశాంతి.

Comments