13-04-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
పరచింతన లేదా పరదర్శనం ద్వారా కలిగే నష్టాలు.
శ్రేష్ఠ ఆత్మలందరూ సంగమ యుగం యొక్క వజ్రతుల్యమైన శ్రేష్ట మేళాను జరుపుకునేందుకు వచ్చారు అనగా వజ్ర సమానమైన అమూల్య జీవితమును నిరంతరము అనుభవం చేసుకునే విశేష సాధనమును మళ్ళీ స్మృతి స్వరూపంగా లేక సమర్థ స్వరూపంగా తయారుచేసుకునేందుక, దానిని బాబా ద్వారా లేక తమ పరివారం ద్వారా లేక వరదాన భూమి ద్వారా అనుభవం చేసుకునేందుకు వచ్చారు. వజ్ర సమానమైన జీవితము జన్మించడంతోనే ప్రాప్తమైంది. కాని వజ్రము సదా ప్రకాశిస్తూ ఉండేందుకు, ఏ విధమైన ధూళి లేక మచ్చ రాకుండా ఉండేందుకు మళ్ళీ మళ్ళీ పాలిష్ చేయించేందుకు వస్తారు. మీరు అందుకే వస్తారు కదా! కావున బాప్దాదా తమ వజ్ర సమానమైన పిల్లలను చూసి హర్షితులవుతారు మరియు ఇప్పటి వరకు ఏ పిల్లలకు ధూళి యొక్క ప్రభావము పడుతోంది లేక సాంగత్యపు రంగులోకి రావడం ద్వారా ఎవరెవరికి చిన్న లేక పెద్ద మచ్చలు కూడా పడుతున్నాయి అని పరిశీలిస్తున్నారు కూడా. ఏ సాంగత్యము మచ్చను కలిగిస్తుంది? దానికి ముఖ్యంగా రెండు కారణాలు లేక ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి:-
ఒకటి పరచింతన, రెండవది- పరదర్శన. పరచింతనలో వ్యర్థ చింతన కూడా వచ్చేస్తుంది. ఈ రెండు విషయాలు సాంగత్యపు రంగులో స్వచ్ఛమైన వజ్రాన్ని మచ్చ వజ్రంగా చేసేస్తుంది. ఈ పరదర్శన, పరచింతన యొక్క విషయాలపై కల్పపూర్వపు స్మృతిచిహ్నమైన రామాయణ గాథ తయారైంది. గీతాజ్ఞానమును మరిచిపోతారు. గీతాజ్ఞానము అనగా స్వచింతన, స్వదర్శన చక్రధారిగా అవ్వడము, నష్టోమోహ స్మృతి స్వరూపంగా అవ్వడము. గీతాజ్ఞాన సారమును మరిచిపోయి రామాయణ గాథను ప్రాక్టికల్లోకి తీసుకువస్తారు. ఎవరైతే మర్యాద రేఖ నుండి బైటికి వెళ్ళిపోతారో వారే సీతగా కూడా అవుతారు. సీతకు రెండు రూపాలు చూపిస్తారు. ఒకటి సదా తోడుగా ఉండే రూపము మరియు రెండవది- శోకవాటికలో ఉండే రూపము. కావున సాంగత్య దోషములోకి వచ్చి శోకవాటికలో ఉండే సీతగా అయిపోతారు. ఒకటేమో- ఫిర్యాదు రూపము మరియు ఇంకొకి స్మృతి రూపము. ఎప్పుడైతే ఫిర్యాదు రూపంలోకి వచ్చేస్తారో అప్పుడు ఫస్ట్ స్టేజ్ నుండి సెకండ్ స్టేజ్లోకి వచ్చేస్తారు. కావున సదా మచ్చలేని స్వచ్ఛమైన వజ్రంగా, మెరుస్తున్న వజ్రంగా, అమూల్య వజ్రంగా అవ్వండి. ఈ రెండు విషయాల నుండి సదా దూరంగా ఉన్నట్లయితే ధూళి మరియు మచ్చలు అంటుకోజాలవు. మీరు అలా కోరుకోరు కాని చేసేస్తారు. చాలా రమణీకమైన క్రొత్త క్రొత్త విషయాలను చెబుతూ ఉంటారు. ఆ విషయాలను విన్నట్లయితే చాలా పెద్ద శాస్త్రాలుగా అయిపోతాయి. కాని కారణం ఏమి? తమ బలహీనత. కాని తమ బలహీనతకు తెల్లని రంగును పులుముతారు మరియు దాచేందుకు ఇతరుల కారణాల కథలను పెద్దగా చేసేస్తారు. దీనిద్వారా పరదర్శన, పరచింతన ప్రారంభమవుతుంది. కావున ఈ విశేష మూల ఆధారమును, మూల బీజమును సమాప్తం చేయండి. ఈ విధంగా వీడ్కోలు అభినందన సమారోహమును జరపండి. మేళాలలో సమారోహాలు జరుపుతారు కదా! ఈ సమారోహాలను జరుపుకోవడమే కలుసుకోవడము అనగా బాబా సమానంగా అవ్వడము అని అంటారు. అచ్ఛా- మీ మహిమనైతే ఎంతో విన్నారు. మహిమలో కూడా ఎటువంటి లోపము లేదు, ఎందుకంటే బాబా మహిమ ఏదైతే ఉందో అదే పిల్లల మహిమ కూడా. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా, సంపన్నంగా అయిపోవాలి, సమయానికి ముందే నెంబర్ వన్ వజ్రంగా అయిపోవాలి అన్నదే బాప్దాదాల విశేషమైన స్నేహము. ఇప్పుడు ఇంకా రిజల్ట్ అవుటవ్వలేదు. మీరు ఎలా అవ్వాలనుకుంటే అలా, ఎంత నెంబర్లోకి రావాలనుకుంటే అంతగా ఇప్పుడు వచ్చేందుకు మార్జిన్ ఉంది. కావున ఎగిరే కళ యొక్క పురుషార్థమును చేయండి. మచ్చలేని నెంబర్ వన్ మెరుస్తున్న వజ్రంగా అయిపోండి. ఏం చేయాలో అర్థమైందా! కేవలం మధువనానికి వెళ్ళి వచ్చాము, ఎంతో సంతోషించి వచ్చాము అని మాత్రమే చెప్పడం కాదు, తయారై వచ్చాము అని చెప్పాలి. సంఖ్యలో వృద్ధి జరుగుతున్నప్పుడు పురుషార్థపు విధిలో కూడా వృద్ధిని పొందండి. అచ్ఛా, ఈ విధంగా ఎగిరే కళ యొక్క పురుషార్థులకు, సర్వ వ్యక్త సాంగత్యాల నుండి దూరంగా ఉండేవారికి, ఒకే సంపూర్ణత రంగులో రంగరింపబడి ఉన్న ఆత్మలకు, సమయానికి ముందే స్వయమును సంపన్నంగా చేసుకునే, ప్రాప్తీస్వరూపులైన విశేష ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో మిలనము:-
1. సర్వ సంబంధాలతో బాబాను మీవారిగా చేసుకున్నారా? ఏ సంబంధంలోనూ ఇప్పుడు ఆకర్షణ లేదు కదా! ఎందుకంటే ఏ ఒక్క సంబంధమైనా బాబాతో జోడించకపోతే నష్టోమోహులుగా, స్మృతి స్వరూపులుగా అవ్వలేరు, బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. బాబాను స్మృతి చేసేందుకు కూర్చుటాంరు కాని మనుమలు, మనుమరాళ్ళు గుర్తుకువస్తూ ఉంటారు. దేనిపైనైతే మోహం ఉంటుందో అదే గుర్తుకువస్తూ ఉంటుంది. కొందరికి డబ్బుపై ఉంటుంది, కొందరికి నగలపై ఉంటుంది, కొందరికి సంబంధాలలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందో అక్కడకు బుద్ధి వెళుతుంది. పదే పదే బుద్ధి అటువైపుకి వెళుతూ ఉంటే ఏకరసముగా ఉండలేరు. అరకల్పం భ్రమిస్తూ, భ్రమిస్తూ ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూశారు కదా! అంతా పోగొట్టుకున్నారు. తనువు కూడా పోయింది, మనస్సు యొక్క సుఖశాంతులు కూడా పోయాయి, ధనం కూడా పోయింది. సత్యయుగంలో ఎంత ధనం ఉండేది! బంగారు మహళ్ళలో ఉండేవారు. ఇప్పుడు ఇటుకల ఇళ్ళలో ఉంటున్నారు, రాళ్ళ ఇళ్ళలో ఉంటున్నారు కాబట్టి అంతా పోగొట్టుకుంటున్నారు కదా! కావున ఇప్పుడు భ్రమించడం సమాప్తం చేయండి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, మనస్సుతో ఇదే గీతమును గానం చేయండి. వీరు మారరు, వీరు నడవరు అని ఎప్పుడూ అనకండి. ఎలా నడవాలి, ఎలా నడవను, ఏమి చేయను... ఈ భారం నుండి కూడా తేలికగా ఉండండి. వీరు నడవాలని, వీరి రోగం నయమవ్వాలి, వీరు బాగా నడవాలి అన్న భావన అయితే బాగుంది కాని ఇలా అనడంతో జరగదు కదా! ఇలా అనేందుకు బదులుగా స్వయం తేలికగా అయి ఎగిరే కళ యొక్క అనుభవంలో ఉన్నట్లయితే వారికి కూడా శక్తి లభిస్తుంది అంతేకాని ఇలా ఆలోచించడము లేక అనడము వ్యర్థము. నా పతి సరిగ్గా అయిపోవాలి, పిల్లలు సరిగ్గా అయిపోవాలి అని మాతలు అంటారు. వ్యాపారం సరి అయిపోవాలి అన్న విషయాలను గూర్చే ఆలోచిస్తారు లేక మాట్లాడుతుటాంరు. కాని ఎప్పుడైతే స్వయం తేలికగా అయిపోతారో, బాబా నుండి శక్తిని తీసుకుంటారో అప్పుడే ఈ కోరిక పూర్తవుతుంది. దీనికొరకు బుద్ధిరూపీ పాత్ర ఖాళీగా ఉండాలి. ఏమౌతుంది, ఎప్పుడవుతుంది, ఇప్పుడింకా జరగనేలేదు... ఈ విషయాల నుండి ఖాళీ అయిపోండి. అందరి కళ్యాణమును కోరుకుంటున్నట్లయితే స్వయం శక్తి స్వరూపంగా అయి, సర్వశక్తివంతుని సహచరునిగా అయి శుభభావనను ఉంచి నడుస్తూ ఉండండి. చింతన లేక చింతను చేయకండి. బంధనంలో చిక్కుకోకండి. బంధనము ఉన్నట్లయితే దానిని తెంచే విధానము స్మృతి, అది అనడం ద్వారా అంతమవ్వదు. స్వయమును వదిలించుకోవడం ద్వారా విముక్తులైపోతారు.
2. సంగమ యుగపు సర్వ ఖజానాలు ప్రాప్తమయ్యాయా? ఎప్పుడూ స్వయమును ఏ ఖజానాలోను ఖాళీగా అయితే భావించడం లేదు కదా! ఎందుకంటే ఖాళీ అయ్యే సమయం ఇప్పుడు గతించిపోయింది. ఇప్పుడు ఇది నింపుకునే సమయం. ఖజానా లభించింది, దీని అనుభవం కూడా ఇప్పుడే జరుగుతుంది. అప్రాప్తి నుండి ప్రాప్తిలోకి వచ్చారు, దీని నషా ఉంటుంది, కావున నిండైన ఆత్మలుగా అయ్యారు. సర్వశక్తులూ ఉన్నాయి కాని సహనశక్తి లేదు, శాంతిశక్తి లేదు. కొద్దిగా క్రోధము లేక కొద్దిగా ఆవేశము వచ్చేస్తుంది అనైతే అనడం లేదు కదా! నిండుగా ఉన్న దానిలోకి ఇంకే వస్తువూ రాజాలదు. మాయ యొక్క అలజడి జరుగుతోంది అంటే ఖాళీ ఉంది. ఎంతగా నిండుగా ఉంటారో అంతగా అలజడి ఉండదు. కావున క్రోధము, మోహము అన్నింకీ వీడ్కోలు చెప్పేసారా లేక శత్రువును అతిధిగా చేసుకుటాంరా? ఎప్పుడైతే నిర్లక్షంగా ఉంటారో అప్పుడే ఈ శత్రువు కూడా బలవంతంగా లోపలికి వచ్చేస్తాడు. తాళం దృఢంగా ఉన్నట్లయితే శత్రువు రాజాలడు. ఈ రోజుల్లో సురక్షితంగా ఉండేందుకు గుప్తమైన తాళాలను వేస్తారు కదా! ఇక్కడ కూడా డబల్ లాక్ ఉంది. స్మృతి మరియు సేవ, ఇది డబల్ లాక్, దీనిద్వారానే సురక్షితంగా ఉంటారు. డబల్ లాక్ అనగా డబల్ బిజీ. బిజీగా ఉండడం అనగా సురక్షితంగా ఉండడము. పదే పదే స్మృతిలో ఉండడము, ఇదే లాక్ వేయడము. నేను ఉన్నదే బాబాకు చెందిన ఆత్మగా అని భావించకండి, పదే పదే స్మృతి స్వరూపులుగా అవ్వండి. మీరు ఉన్నదే బాబాకు చెందినవారిగా అయినప్పుడు స్మృతి స్వరూపులుగా ఉండాలి కదా, ఆ సంతోషం ఉండాలి. అలా ఉన్నట్లయితే మరి వారసత్వం లభించాలి. మేము ఉన్నదే బాబాకు చెందినవారిగా అంటూ నిర్లక్ష్యంలో ఉండకండి. ప్రతి క్షణము స్వయమును నిండుగా, సమర్థవంతులుగా అనుభవం చేసుకోండి. దీనినే స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా అవ్వడము అని అంటారు. మాయ యుద్ధం చేసేందుకు రాకూడదు, నమస్కరించేందుకు రావాలి.
3. అందరూ స్వయము పూజ్య ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? పూజారుల నుండి పూజ్యులుగా అయిపోయారు కదా! పూజ్యులను సదా ఉన్నత స్థానంలో ఉంచుతారు. ఏదైనా పూజించే మూర్తి ఉన్నట్లయితే దానిని క్రింద నేలపై ఉంచరు. కావున పూజ్య ఆత్మలైన మీరు ఎక్కడ ఉంటారు? పైన ఉంటున్నారా? భక్తులు కూడా పూజ్య ఆత్మలపై ఎంతగా గౌరవమును ఉంచుతారు! ఇప్పుడు జడమైన మూర్తుల పైనే ఇంతి గౌరవం ఉన్నప్పుడు మరి మీపై ఎంత గౌరవం ఉంటుంది! మీ గౌరవమును గూర్చి మీకు స్వయం తెలుసా? ఎందుకంటే ఎంతగా తమ గౌరవమును గూర్చి తెలుస్తుందో అంతగా ఇతరులు కూడా వారికి గౌరవమును ఇస్తారు. తమపై గౌరవమును ఉంచడం అనగా స్వయమును మహాన్ శ్రేష్ఠ ఆత్మగా అనుభవం చేసుకోవడం. కావున ఎప్పుడూ మహాన్ ఆత్మ నుండి సాధారణ ఆత్మగా అయిపోవడం లేదు కదా! పూజ్యులు సదా పూజ్యులుగానే ఉంటారు కదా! ఈ రోజు పూజ్యులుగా ఉంటూ రేపు పూజ్యులుగా లేకుండా ఉండడం లేదు కదా! సదా పూజ్యులు అనగా సదా మహాన్, సదా విశేషంగా ఉండడం. చాలామంది పిల్లలు తాము ముందుకు వెళుతున్నాము కాని ఇతరులు తమకు ముందుకు వెళుతున్నందుకు గౌరవమును ఇవ్వడం లేదు అని భావిస్తారు. దీనికి కారణం ఏమి? సదా స్వయం తమ గౌరవంలో ఉండరు. ఎవరైతే తమ గౌరవంలో ఉంటారో వారు గౌరవమును యాచించరు. అది స్వతహాగా లభిస్తుంది. ఎవరైతే సదా పూజ్యులుగా ఉండరో వారికి సదా గౌరవం లభించజాలదు. ఒకవేళ మూర్తి తన ఆసనమును వదిలేస్తే లేక ఆ మూర్తిని భూమిపై పెట్టినట్లయితే ఇక విలువ ఏముంటుంది? మూర్తిని మందిరంలో పెట్టినట్లయితే అందరూ మహాన్ రూపంలో చూస్తారు. కావున సదా మహాన్ స్థానంపై అనగా ఉన్నతమైన స్థితిలో ఉండండి, క్రిందకు రాకండి. ఈ రోజుల్లో ప్రపంచంలో ఏ విశేషతను చూపిస్తున్నారు? చావండి మరియు చంపండి. వారు ఇదే విశేషతగా చూపిస్తారు కదా! కావున ఇక్కడ కూడా క్షణంలో మరణించేవారిగా అవ్వండి, మెల్లమెల్లగా మరణించేవారిగా కాదు. ఈరోజు మోహాన్ని విడిచిప్టోము, ఒక నెల తర్వాత క్రోధాన్ని వదులుతాము, సంవత్సరం తర్వాత మోహాన్ని వదులేస్తాము ఇలా కాదు. ఒక్క వేటుతో బలిహారమయ్యేవారిగా అవ్వండి. కావున అందరూ ఒక్క వేటుతో మరజీవాగా అయ్యారా లేక కాసేపు జీవిస్తూ, కాసేపు మరణిస్తూ ఉంటారా? కొందరు చితిమంటలలోంచి కూడా లేచి వస్తారు, మళ్ళీ మేల్కొటాంరు. మీరందరూ ఒక్క వేటుతో మరజీవాగా అయిపోయారు కదా! ఏ విధంగా లౌకిక ప్రపంచంలో వారు తమ షో చూపిస్తారో అలా అలౌకిక ప్రపంచంలో కూడా మీ షోను చూపించండి. సదా శ్రేష్ఠులు, సదా పూజ్యులు, సదా ప్రతి కర్మను, ప్రతి గుణమును అందరూ కీర్తనగా గానం చేయాలి. కీర్తన అన్న పదానికి అర్థమే కీర్తిని గానం చేయడం అని. సదా శ్రేష్ఠ కర్మలు అనగా కీర్తి కలిగిన కర్మలు ఉన్నట్లయితే జనులు మీ కీర్తనను సదా గానం చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏ స్థానంలోనైనా గొడవ జరిగితే ఆ గొడవ సమయంలో శాంతి శక్తి యొక్క అద్భుతమును చూపించండి. ఇక్కడ శాంతి యొక్క కుండము ఉంది అని అందరి బుద్ధిలోకి రావాలి. శాంతి కుండముగా అయి శాంతి శక్తిని వ్యాపింపజేయండి. నలువైపులా అగ్ని ఉన్నట్లయితే మరియు ఒకమూల శీతల కుండముగా ఉన్నట్లయితే అందరూ అటువైపుకే పరిగెడుతూ వెళతారు. ఈ విధంగా శాంతి స్వరూపంగా అయి శాంతి కుండమును అనుభవం చేయించండి. ఆ సమయంలో వాచా సేవను చేయలేరు. మనసా ద్వారా మీ శాంతికుండం యొక్క ప్రత్యక్షతను చేయగలుగుతారు. ఎక్కడెక్కడైతే శాంతిసాగరుని పిల్లలు ఉంటారో ఆ స్థానాలు శాంతికుండముగా అవ్వాలి. వినాశీ యజ్ఞ కుండములు తమవైపుకు ఆకర్షించగలిగినప్పుడు మరి ఈ శాంతికుండములు తమవైపుకు ఆకర్షించకుండా ఉండడమన్నది జరుగజాలదు. ఇక్కడినుండే శాంతి లభిస్తుంది అని అందరికీ వైబ్రేషన్లు రావాలి. ఇటువంటి వాయుమండలమును తయారుచేయండి. అక్కయ్యగారూ, శాంతిని ఇవ్వండి అని అందరూ అడిగేందుకు రావాలి, ఇటువంటి సేవను చేయండి.
సేవాధారులైన టీచర్ అక్కయ్యలతో:-
టీచర్లు అనగా సేవాధారులు. సేవాధారులు అనగా త్యాగమూర్తులు మరియు సఫలతామూర్తులు. ఎక్కడైతే త్యాగము, తపస్సు ఉండదో అక్కడ సఫలత ఉండదు. త్యాగము మరియు తపస్సు , రెండింటి సహయోగంతో సేవలో సదా సఫలత లభిస్తుంది. తపస్సు అంటేనే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరని. ఇది నిరంతరము చేసే తపస్సు. కావున ఎవరు వచ్చినా వారు కుమారీగా చూడకూడదు, తపస్వీ కుమారీగా చూడాలి. ఏ స్థానంలోనైతే ఉంటారో ఆ స్థానము తపస్యాకుండంగా అనుభవమవ్వాలి. ఇది మంచి స్థానము, పవిత్ర స్థానము, ఇది కూడా సరైనదే. కాని, తపస్యాకుండముగా అనుభవమవ్వాలి. తపస్యాకుండములోకి ఎవరు వచ్చినా వారు స్వయము తపస్విగా అయిపోతారు. కావున తపస్సు యొక్క ప్రాక్టికల్ స్వరూపంలోకి వెళ్ళండి, అప్పుడు జయజయకారాలు జరుగుతాయి. తపస్సు ముందు తలవంచుతారు. బి.కె.ల ముందు మహిమ చేస్తారు. కాని తపస్వీ కుమారీ, కుమారుల ముందు తలవంచుతారు. తపస్యాకుండమును తయారుచేయండి ఆ తర్వాత ఎంతమంది దీపపు పురుగులు తమకుతామే వచ్చేస్తారో చూడండి! తపస్సు కూడా జ్యోతి వంటిది. జ్యోతివైపుకు దీపపు పురుగులు తమకు తామే వస్తాయి. సేవాధారులుగా అయ్యే భాగ్యము తయారైంది ఇప్పుడు తపస్వీ కుమారీలుగా అయ్యే నెంబర్ను తీసుకోండి. సదా శాంతి దానమును ఇచ్చే మహాదానీ ఆత్మలుగా అవ్వండి. బాప్దాదా వర్తమాన సమయంలో మనసా సేవపై విశేషమైన అటెన్షన్ను కలిగిస్తున్నారు. వాచా సేవ ద్వారా ఇంతి శక్తిశాలీ ఆత్మలు ప్రత్యక్షమవుతారు. వాణి అయితే కొనసాగుతూనే ఉంటుంది. కాని ఇప్పుడు శుద్ధ సంకల్పాల సేవ యొక్క ఎడిషన్ కావాలి. కావున స్వరూపంగా అయి స్వరూపమును తయారుచేసే సేవ చేయాలి. ఇప్పుడు దీని అవసరమే ఉంది. ఇప్పుడు అందరి అటెన్షన్ ఈ పాయింట్ పైనే ఉండాలి. దీని ద్వారానే పేరు ప్రఖ్యాతమవుతుంది. అనుభవీమూర్తులు అనుభవం చేయించగల్గుతారు. దీనిపైనే విశేషమైన అటెన్షన్ను ఉంచుతూ ఉండండి. దీని ద్వారానే శ్రమ తక్కువగా, సఫలత ఎక్కువగా లభిస్తుంది. మనసా సేవ ధరణిని పరివర్తన చేసేస్తుంది. సదా ఇదేవిధంగా వృద్ధి చేస్తూ ఉండండి. వృద్ధినొందేందుకు ఇప్పుడు విధి ఇదే. అచ్ఛా!
12 గంటలు పిల్లలతో మిలనము జరిపిన తర్వాత ఉదయం 6 గంటలకు బాప్దాదా సద్గురువారపు ప్రియస్మృతులను పిల్లలందరికీ అందించారు.
బృహస్పతి కలిగిన, శ్రేష్ఠ భాగ్యపు రేఖలు కలిగిన శ్రేష్ఠ ఆత్మలందరికీ బాప్దాదా ఈరోజు వృక్షపతివారము యొక్క ప్రియస్మృతులను తెలియజేస్తున్నారు. వృక్షపతి అయిన బాబా పిల్లలందరి శ్రేష్ఠ భాగ్యమును అవినాశిగా చేసేసారు. ఈ అవినాశీ భాగ్యం ద్వారా సదా స్వయము సంపన్నంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంపన్నంగా తయారుచేస్తూ ఉంటారు. వృక్షపతివారము పిల్లలందరి శిక్షణలో సంపన్నంగా అయ్యే విశేష స్మృతిచిహ్న దివసము. ఈ శిక్షణ యొక్క స్మృతిచిహ్న దినంనాడు శిక్షకుని రూపంలో బాప్దాదా పిల్లలందరికీ అన్ని సబ్జెక్టులలోను సదా ఫుల్పాస్గా అయ్యే లక్ష్యమును ఉంచుతూ పాస్ విత్ హానర్గా అయ్యే మరియు ఇతరులను కూడా ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువచ్చే శిక్షకుని రూపంలో శిక్షణలో సంపన్నంగా అయ్యే ప్రియస్మృతులను అందిస్తారు మరియు బృహస్పతి యొక్క భాగ్యపు రేఖను దిద్దే భాగ్యవిధాత తండ్రి రూపంలో సదా శ్రేష్ఠ భాగ్యపు అభినందనలు తెలియజేస్తారు. అచ్ఛా- ప్రియస్మృతులు మరియు నమస్తే.
ప్రశ్న:- ఏ స్మృతి సదా ఉన్నట్లయితే జీవితంలో ఎప్పుడూ నిరుత్సాహులుగా అవ్వజాలరు?
జవాబు:- నేను సాధారణ ఆత్మను కాను, నేను శివశక్తిని, నేను బాబాకు చెంది ఉన్నాను మరియు బాబా నా వారు అన్న ఇదే స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ ఒంటరితనం అనుభవమవ్వదు, ఎప్పుడూ నిరుత్సాహులుగా అవ్వరు, సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉంటారు. 'శివశక్తి' యొక్క అర్థమే శివుడు మరియు శక్తి కంబైండ్గా ఉండము. ఎక్కడైతే సర్వశక్తివంతుడు మరియు వేలాది భుజాలు కలిగిన తండ్రి ఉంటారో అక్కడ సదా ఉల్లాస ఉత్సాహాలు తోడుగా ఉంటాయి.
Comments
Post a Comment