11-04-1983 అవ్యక్త మురళి

11-04-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సహజ పురుషార్ధి యొక్క లక్షణాలు.

బాప్దాదా తమ స్నేహి, సహయోగి పిల్లలను చూసి హర్షితులవుతున్నారు. స్నేహము మరియు మిలనము యొక్క భావన. ఈ రెండు శక్తుల ఆధారంపై నిరాకార మరియు ఆకార తండ్రిని తమ సమానంగా సాకార రూపంలోకి, సాకార సృష్టిలోకి తీసుకువచ్చేందుకు నిమిత్తులుగా అయిపోతారు. బాబాను కూడా పిల్లలు స్నేహము మరియు భావన యొక్క బంధనలో బంధించేస్తారు. మెజారిటీ ఇప్పుడు కూడా మాతలదే. భగవంతుడిని కూడా బంధించారు అని మాతల చరిత్రను మరియు చిత్రాలను చూపించారు. ఏ వృక్షానికి కట్టేసారు? ఈ అనంతమైన కల్పవృక్షంలో స్నేహము మరియు భావన అనే తాళ్ళతో కల్పపూర్వం కూడా బంధించారు మరియు ఇప్పుడు కూడా అది రిప్టీ అవుతోంది. బాప్దాదా ఇటువంటి పిల్లలకు స్నేహానికి జవాబుగా ఏ తాడుతోనైతే బాబాను బంధిస్తారో ఈ స్నేహము మరియు భావన యొక్క రెండు తాళ్ళతో హృదయ సింహాసనమనే ఆసనమును ఇచ్చి, ఊయలగా తయారుచేసి పిల్లలకు ఇచ్చేస్తారు. ఈ కల్పవృక్షంలోపల పాత్రను అభినయించే మీరు ఇదే ఊయలలో సదా ఊగుతూ ఉండండి. అందరికీ ఊయల లభించింది కదా! ఆసనమును చూసి చలించిపోవడం లేదు కదా! స్నేహము మరియు భావన యొక్క తాళ్ళు సదా దృఢముగా ఉన్నాయి కదా! పైకీ క్రిందికీ అవ్వడం లేదు కదా! ఊయల ఊగుతుంది కూడా అలాగే పైకి కూడా వెళుతుంది మరియు కాస్త పైకీ క్రిందికీ అయినా క్రింద పడేస్తుంది కూడా. బాప్దాదా అయితే అందరికీ ఊయలను ఇచ్చారు. కావున సదా ఊగుతూ ఉంటారా? మాతలకు ఊగే మరియు ఊగించే అనుభవమైతే ఉంది కదా! ఏ విషయంలో మీరు అనుభవజ్ఞులో ఆ విషయాలనే బాప్దాదా చెబుతున్నారు, ఇది క్రొత్త విషయమేమీ కాదు కదా! అనుభవం చేసుకున్న విషయాలు సహజంగా ఉంటాయా లేక కష్టంగా ఉంటాయా? ఈనాటి ఈ సభ ఏ సభ? అందరూ సహయోగులు, సహజ పురుషార్థులు, సహజ ప్రాప్తీ స్వరూపులా లేక కాసేపు సహజంగా, కాసేపు కష్టంగా ఉండే యోగులా! సహజ పురుషార్థులు అనగా తమముందు వచ్చిన హిమాలయ పర్వతం వంటి సమస్యను కూడా ఎగిరే కళ యొక్క ఆధారంపై క్షణంలో దాటివేసేవారు. దాటివేయడం అనగా ఏదైనా అవరోధం ఉన్నప్పుడే కదా దాన్ని దాటేది. ఈ విధంగా సహజంగా దాటుతూ ఎగురుతూ వెళుతున్నారా లేక ఎప్పుడైనా పర్వతం నుండి దిగిపోతూ, మరోసారి నదిలోకి దిగిపోతూ, మరోసారి ఏదైనా అడవిలోకి దిగిపోతూ ఉంటారా? మళ్ళీ ఏంచేస్తారు బైటకు తీయండి లేక రక్షించండి అని అంటూ ఉంటారు. ఇలాగైతే చేయడం లేదు కదా! మాతలు ఇప్పటికీ ప్రతి విషయంలోను ఇలా పిలువడం లేదు కదా! భక్తి సంస్కారాలైతే సమాప్తమైపోయాయి కదా! ద్రౌపది పిలుపులు పూర్తయ్యాయా లేక ఇప్పటికీ కొనసాగుతున్నాయా? ఇప్పుడైతే అధికారులుగా అయిపోయారు కదా! పిలిచే సమయం సమాప్తమైపోయింది. సంగమ యుగము ప్రాప్తి యొక్క సమయమే కాని పిలిచే సమయం కాదు. సహజ పురుషార్థులు అనగా అన్నింటినీ దాటి అన్ని సహజ ప్రాప్తులను పొందేవారు. సహజ పురుషార్థులు సదా వర్తమానము మరియు భవిష్య ప్రాలబ్ధమును పొందే అనుభవజ్ఞులుగా ఉంటారు. ప్రాలబ్ధము సదా ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే స్థూల నేత్రాల ద్వారా స్థూల వస్తువు స్పష్టంగా కనిపించినట్లుగా కనిపిస్తుంది. ఈ విధంగా బుద్ధి యొక్క అనుభవపు నేత్రాల ద్వారా అనగా మూడవ దివ్యనేత్రం ద్వారా ప్రాలబ్ధము కనిపిస్తుంది. సహజ పురుషార్థులు ప్రతి అడుగులోను కోటానురెట్లకన్నా ఎక్కువగా సంపాదనను అనుభవం చేసుకుంటారు. ఈ విధంగా స్వయమును సదా సంగమ యుగపు సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మగా అనుభవం చేసుకుంటారు. ఎటువంటి శక్తిలోనైనా, ఏ గుణము యొక్క ఖజానాలోనైనా, జ్ఞానపు ఎటువంటి పాయింటు యొక్క ఖజానా నుండైనా, సంతోషం నుండైనా, నషా నుండైనా ఎప్పుడూ ఖాళీ అవ్వరు. ఖాళీ అవ్వడము క్రింద పడిపోయేందుకు సాధనము. అక్కడ గుంట ఏర్పడుతుంది కదా! కావున ఆ గుంతలో పడిపోతారు. కొద్దిగా బెణికినా ఎంతో వ్యాకులత చెందుతారు. ఇది కూడా బుద్ధి యొక్క బెణుకుగా అయిపోతుంది. సంకల్పాలు వంకరగా అయిపోతాయి. శక్తిశాలిగా, సుసంపన్నంగా ఉండేందుకు బదులుగా బలహీనంగా మరియు ఖాళీగా అయిపోతారు. కావున సంకల్పాలలో బెణుకు వచ్చేసింది కదా! ఇలా ఎందుకు అంటారు? ఆ తర్వాత దారి వంకరగా ఉంది అని అంటారు. మీరు వంకరగా లేరా? వంకరగా ఉన్న దారిని అయితే తిన్నగా చేసారు కదా! ఎందుకు శక్తి అవతారాలుగా ఉన్నారు? వంకరగా ఉన్నవారిని తిన్నగా చేసేందుకే కదా! ఏ కాంటాక్టును తీసుకున్నారు? ఈ హాలును వంకరగా ఉన్నదానిని తిన్నగా చేసారు, కావుననే ఇప్పుడు విశ్రాంతిగా కూర్చోగలిగారు కదా! ఈ హాలు యొక్క కాంటాక్టర్ను అడగండి. తాను వంకరగా ఉంది, బెణుకుతుంది అని ఏమైనా ఆలోచించాడా? తాను దానిని సరిచేసాడా లేక వంకరగా ఉన్నదానిని గూర్చే ఆలోచిస్తూ ఉన్నాడా? ఒకచోట రాళ్ళను పగులగ్టొటాడు, ఇంకొకచోట రాళ్ళను వేసాడు, కష్టపడ్డాడు కదా! కావున మీ అందరికీ స్వర్గమును తయారుచేసే కాంటాక్టు ఉంది కదా! వంకరగా ఉన్నదానిని తిన్నగా చేసే కాంటాక్ట్ ఉంది కదా! ఈ విధంగా కాంటాక్ట్ తీసుకునేవారు దారి వంకరగా ఉంది అని అనజాలరు. అకస్మాత్తుగా పడిపోవడం, ఇది కూడా అటెన్షన్ యొక్క లోపమే. సాకార రూపంలో గుర్తుంది కదా! ఎవరైనా పడిపోతే ఏం చేసేవారు? వారి టోలీని ఆపేసేవారు, ఎందుకు? భవిష్యత్తులో సదా అటెన్షన్ను ఉంచేందుకు. టోలీ ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. టోలీ ఉన్నదే పిల్లలకొరకు, కాని ఇది కూడా స్నేహమే. టోలీ ఇవ్వడం కూడా స్నేహము, టోలీని ఆపివేయడం కూడా స్నేహమే. ఆ తర్వాత ఏమి ఆలోచించారు? అకస్మాత్తుగా పడిపోతారా లేక దారి వంకరగా ఉంది అని అంటారా? ఇప్పుడు ఈ పురుషార్థపు మార్గంలో ఇంతగా తండోపతండాలుగా ఎక్కడ వచ్చారు! ఇప్పటికీ ఇంకా 9 లక్షల ప్రజలు కూడా తయారవ్వలేదు. ఇప్పుడైతే ఒక లక్ష మందికే సంతోషపడిపోతున్నారు. (83లో ఒక లక్ష సంఖ్య ఉన్నారు). ఈ పురుషార్థ మార్గము బేహద్ మార్గము. కావున సహజ పురుషార్థము అని దేనిని అంటారో అర్థమైందా? కాలు బెణికి పడిపోకుండా ఉండాలి... ఇంకా ఇతరులకొరకు స్వయం గైడ్గా, పండాగా అయి సహజముగా మార్గాన్ని పూర్తిచేయించాలి. సహజ పురుషార్థులు కేవలం ప్రేమలో ఉండటం కాదు, ప్రేమలో లీనమై ఉంటారు. ఇటువంటి లవలీన ఆత్మలు సహజంగానే నలువైపులా వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం నుండి దూరముగా ఉంటారు. ఎందుకంటే లీనమై ఉండడం అనగా బాబా సమానంగా శక్తిశాలిగా అన్ని విషయాల నుండి సురక్షితంగా ఉండడం. కావున సమానత అన్నింకన్నా పెద్ద సేఫ్. ఉన్నదే మాయాప్రూఫ్గా, సురక్షితంగా... కావున సహజ పురుషార్థం ఏమిటో అర్థమైందా? సహజ పురుషార్థము అనగా నిర్లక్ష్యం లేకుండా ఉండడం. చాలామంది నిర్లక్షాన్ని కూడా సహజ పురుషార్థంగా భావిస్తూ నడుచుకుంటారు, వారు సదా సుసంపన్నంగా ఉండరు. నిర్లక్ష్యంగా ఉండే పురుషార్థుల యొక్క అన్నింకన్నా పెద్ద విశేషత లోపల మనస్సు తింటూ ఉంటుంది మరియు బైట నుండి గానం చేస్తూ ఉంటారు. ఏమని గానం చేస్తారు? తమ మహిమ యొక్క గీతాలను గానం చేస్తూ ఉంటారు మరియు సహజ పురుషార్థులు అన్నివేళలా బాబా తోడును అనుభవం చేసుకుంటారు. మరి మీరు ఇటువంటి సహజ పురుషార్థులేనా? సహజ పురుషార్థులు సదా సహజయోగి జీవితమును అనుభవం చేసుకోగలరు. మరి మీకు ఏమిష్టము? సహజ పురుషార్థమా లేక కష్టమైన పురుషార్థమా? సహజ పురుషార్థమే ఇష్టము కదా! మనస్సుకు ఇష్టమైనదానిని తండ్రి ఇస్తున్నప్పుడు మరి ఎందుకు తీసుకోరు? వద్దనుకుంటున్నా కూడా అయిపోతుంది అన్న పదాలు కూడా మాస్టర్ సర్వశక్తివంతుల మాటలు కావు. కోరుకునేదొకి, కర్మలు మరొకిదిగా ఉన్నట్లయితే వారిని శివశక్తులు అని అంటారా?

శివశక్తులు అనగా అధికారులు, ఆధీనులు కారు. కావున ఈ మాటలు కూడా బ్రాహ్మణుల భాషకు సంబంధించినవి కావు కదా! మన బ్రాహ్మణ భాషను గూర్చయితే తెలుసు కదా! సంగమయుగము యొక్క సహజ ప్రాప్తి యొక్క సమయము ఎంతగానో పోయింది, ఇప్పుడు కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. ఇందులో కూడా సమయము యొక్క వరదానమును, బాబా యొక్క వరదానమును ప్రాప్తించుకొని స్వయమును సహజ పురుషార్థులుగా తయారు చేసుకోవచ్చు. బ్రాహ్మణులు అంటేనే కష్టమును సహజతరం చేసేవారు, బ్రాహ్మణుల ధర్మము, కర్మ అంతా ఇదే, కావున జన్మ యొక్క, కర్మ యొక్క బ్రాహ్మణ ఆత్మలు అనగా సహజ యోగులు, సహజ పురుషార్థులు. ఇప్పుడు ఇక్కడినుండి ఎలా తయారై వెళతారు?

మధువనమును పరివర్తన భూమి అని అంటారు కదా! కష్టము అన్న పదమును తపో భూమిలో భస్మం చేసి వెళ్ళండి మరియు సహజ పురుషార్థపు వరదానమును తీసుకొని వెళ్ళండి. పరివర్తన యొక్క పాత్ర అనగా దృఢసంకల్పం యొక్క పాత్రను ధారణ చేసి వెళ్ళండి, అప్పుడు వరదానమును ధారణ చేయగల్గుతారు లేకపోతే వరదానమునైతే బాబా ఇచ్చారు కాని ఆబూలోనే ఉండిపోయింది అని ఎందరో అంటూ ఉంటారు. అక్కడకు వెళ్ళి చూసుకున్నప్పుడు వరదానము తోడుగా రానేలేదని గుర్తిస్తారు. వరదాత యొక్క వరదానమును యోగ్యమైన పాత్రలో తీసుకువెళ్ళారా? ఒకవేళ తీసుకోనే తీసుకోకపోతే అది ఎక్కడ ఉంటుంది? ఎవరైతే ఇచ్చారో వారివద్దే ఉండిపోతుంది కదా! ఇలా చేయకండి. చాలా తెలివైనవారిగా అయిపోయారు, తమ దోషము అని భావించరు. బాబా ఇలా ఎందుకు చేసారో తెలియదు అని అంటారు. తమ బలహీనతలనన్నింటినీ బాబాపై మోపుతారు. బాబా కావాలనుకుంటే చేయగలరు కాని అలా చేయరు... బాబా దాతయా లేక తీసుకునేవారా? దాత అయితే ఇస్తారు కాని తీసుకునేవారు తీసుకోవాలి కూడా లేక ఇచ్చేది, తీసుకునేది రెండూ తండ్రియేనా? బాబాయే తీసుకున్నట్లయితే మీరు సుసంపన్నంగా ఎలా అవుతారు కావున తీసుకోవడమైతే నేర్చుకోండి. అచ్ఛా- మిలనమైతే జరిగిపోయింది కదా! అందరితో నవ్వారు, సంతోషించారు, అందరి ముఖాలు చూశారు. ఈ సమయంలో అయితే చాలా హర్షితముఖులుగా ఉన్నారు. అందరూ సంతోషపు ఊయలలో ఊగుతున్నారు కావున ఇది కలుసుకోవడం కాదా! కలుసుకోవడం అనగా ముఖాన్ని చూడడం మరియు చూపించడం. చూసారు కదా! పాత్ర కూడా లభించింది, వరదానము కూడా లభించింది, ఇంకేం మిగిలి ఉంది? టోలీ అయితే దాదీ, దీదీల నుండి తీసుకున్నారు. వ్యక్తరూపంలో నిమిత్తంగా చేసేసాక అవ్యక్తుడిని వ్యక్తునిగా ఎందుకు తయారుచేస్తున్నారు? దీదీ, దాదీలు కూడా బాబా సమానమే కదా! దాదీ, దీదీల నుండి టోలీ తీసుకునేటప్పుడు ఏమని భావిస్తూ తీసుకుంటారు? బాప్దాదా టోలీ ఇస్తున్నారు అని భావిస్తారు కదా! దీదీ, దాదీగా భావిస్తూ తీసుకున్నట్లయితే ఇది కూడా పొరపాటైపోతుంది. అచ్ఛా! ఇంకా టోలీ తీసుకోవాలనే కోరిక ఉంది. టోలీ తీసుకుంటే ముందుకైతే వస్తాము కదా అని భావిస్తారు. కావున ఈరోజే అందర్నీ క్యూలో నిలబెట్టండి మరియు టోలీ తినిపించండి, ఈ హృదయమైతే ఎప్పుడూ నిండదు. హృదయము అలా నిండుతూనే ఉండాలి. ఎప్పుడూ నిండిపోకూడదు, ఎంతోకొంత మిగిలి ఉండడం సరైనదే, అప్పుడే స్మృతి చేస్తూ ఉంటారు మరియు నింపుకుంటూ ఉంటారు. ఇక నిండిపోయిందంటే- ఇక నిండిపోయింది కదా, తినండి, తాగండి, సంతోషించండి అని అంటారు. అచ్ఛా!

సదా సహజ యోగులకు, సహజ పురుషార్థులకు, సదా సర్వుల కష్టాలను సహజం చేసేవారికి ఇటువంటి బాబా సమానమైన మాస్టర్ సర్వ శక్తివంతులకు, సదా సుసంపన్నంగా, సర్వ ఖజానాలతో స్వసహితంగా విశ్వ సేవను చేసేవారికి, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో (మాతలతో):-

1. అందరూ తమ కల్పపూర్వపు చిత్రమును చూస్తూ ఉన్నారా? ఏ చిత్రములో బాబా తోడు కూడా ఉంది మరియు సేవను కూడా చూపించారు? గోవర్ధన పర్వతమును ఎత్తే చిత్రములో. ఈ చిత్రంలో బాబాతోపాటు పిల్లలు కూడా ఉన్నారు మరియు ఇరువురూ సేవ చేస్తున్నారు. పర్వతమునకు వేలును ఇవ్వడం కూడా సేవయే కదా! సహయోగిగా అయ్యే స్మృతిచిహ్నము కూడా తయారైంది అని మనస్సులో ఉత్సాహము కలుగుతుంది కదా! వేలు సహయోగానికి గుర్తు. అందరూ బాప్దాదాల సహయోగులే కదా! ఈ జన్మనే ఎందుకు తీసుకున్నారు? సహయోగులుగా అయ్యేందుకు తీసుకున్నారు. కావున మేము జన్మించడంతోనే సహయోగి ఆత్మలము అని సదా స్మృతిలో ఉంచుకోండి. తనువు, మనస్సు, ధనము ఇంతకుముందు తెలియదు కాబట్టి భక్తిలో వినియోగించాము మరియు ఇప్పుడు ఏదైతే మిగిలిందో దానినే సత్యమైన సేవలో బాబాకు సహయోగిగా అయి వినియోగిస్తున్నాము. 99 శాతం పోగొట్టుకున్నాము, ఇంకొక్క శాతం మిగిలింది, ఇక దానిని కూడా సహయోగంలో వినియోగించకపోతే మరింక ఎక్కడ వినియోగిస్తారు? చూడండి, సత్యయుగపు రాజులు ఎక్కడ మరియు ఈరోజు ఎలా ఉన్నారు? తనువులో కూడా శక్తి ఎక్కడ ఉంది? ఈనాటి యువకులు కూడా వృద్ధులుగా ఉన్నారు. ఎంతగా వృద్ధులు పనిచేయగల్గుతున్నారో అంతగా ఈనాటి యువకులు చేయలేకపోతున్నారు. ఇది కేవలం నామమాత్రపు యవ్వనము మరియు ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు. దేవతల నుండి వ్యాపారం చేసే వైశ్యులుగా అయిపోయారు మరియు మనస్సు యొక్క శక్తి కూడా ఎక్కడ ఉంది? భ్రమిస్తూ ఉన్నారు. కావున మనస్సు యొక్క శాంతిని, తనువును, ధనమును అన్నింటినీ పోగొట్టుకున్నారు, ఇక మిగిలింది ఏమి? సంతోషించండి, ఒక్క శాతము తనువు, మనస్సు, ధనము ఏదైతే మిగిలిందో దానిని ఈశ్వరీయ కార్యంలో వినియోగించడం ద్వారా 21 జన్మలు 2,500 సంవత్సరాల వరకు జమ అయిపోతుంది. ఇటువంటి సహయోగి పిల్లలకు బాబా కూడా సదా స్నేహమునిస్తారు, సహయోగమునిస్తారు మరియు ఈ సహయోగం యొక్క చిత్రమును ఇప్పుడు ఇంకా చూస్తున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా చేస్తున్నారు కూడా మరియు చిత్రమును కూడా చూస్తున్నారు. ఎవరైనా మరణించిన తరువాత తమ చిత్రాన్ని చూడరు. కాని మీరు చైతన్యంగా మీ కల్పపూర్వపు చిత్రాన్ని చూస్తున్నారు. ఇంతకుముందు మీ చిత్రాన్నే పూజించేవారు, మీకు అది తెలిసి ఉన్నట్లయితే గాయనం చేసి ఉండేవారు కాదు, అలా తయారైపోయేవారు. కావున ఈ విధంగా అందరూ సహయోగులే కదా! సదా ప్రతి కార్యంలోను సహయోగమును ఇచ్చే శుభ సంకల్పము ఎప్పుడూ ఏ విధమైన వాతావరణమునైనా శక్తిశాలిగా తయారుచేయడంలో సదా సహయోగులుగా ఉంటారు. వాతావరణమును కూడా పైకీ క్రిందికీ అవ్వనివ్వకండి. సహయోగులుగా అయ్యేందుకు బదులుగా ఎప్పుడూ అలజడిని చేసేవారిగా అయిపోకండి. సదా సహయోగులు అనగా సదా సంతుష్టులు. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. నడుస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఏ సంకల్పం కలిగినా దానిని పైకి ఇచ్చేసి స్వయం నిర్సంకల్పులుగా అయి ముందుకువెళుతూ ఉండండి. మీ అభిప్రాయాన్ని చెప్పడం, సూచనను ఇవ్వడం వేరే విషయం, అలజడిలోకి రావడం వేరే విషయం కావున సదా ఏకరసముగా అవ్వండి. సంకల్పమును ఇచ్చి నిర్సంకల్పులుగా అవ్వండి. సదా స్వఉన్నతి మరియు సేవ యొక్క ఉన్నతిలో బిజీగా ఉండండి మరియు సర్వులపట్ల శుభభావనను ఉంచండి. ఆ శుభభావన ద్వారా ఏ సంకల్పములనైతే ఉంచుతారో అవన్నీ పూర్తయిపోతాయి. శుభ సంకల్పాలు పూర్తయ్యేందుకు సాధనము ఏకరస స్థితి. శుభ చింతన, శుభ చింతక స్థితి దీనిద్వారానే అన్ని విషయాలు సంపన్నమైపోతాయి. నలువైపులా ఉన్న వాతావరణమును శక్తిశాలిగా తయారుచేయడమే శక్తిశాలీ శ్రేష్ఠ ఆత్మల కర్తవ్యము. అచ్ఛా!

Comments