11-04-1982 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
వ్యర్థమును త్యాగము చేసి సమర్ధులుగా అవ్వండి
ఈరోజు బాప్ దాదా తమ సర్వ వికర్మాజీత్ లను అనగా వికర్మ సన్యాస ఆత్మలను చూస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మగా అవ్వటము అనగా శ్రేష్ట కర్మలు చెయ్యటము మరియు వికర్మలను సన్యసించటము. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులుగా అవటంతోనే - ఇప్పుడు మేమందరమూ వికర్ముల నుండి సుకర్ములుగా అయ్యాము అన్న ఇటువంటి శ్రేష్ట సంకల్పమును చేసారు. సుకర్మ ఆత్మయే శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మగా పిలువబడుతుంది. కనుక సంకల్పము చేసిందే వికర్మాజీత్ లుగా అయ్యేందుకు. ఈ లక్ష్యమునే మొట్టమొదటగా అందరూ ధారణ చేసారు కదా! ఈ లక్ష్యమును ఎదురుగా ఉంచుకుంటూ శ్రేష్ట లక్షణాలను ధారణ చేస్తున్నారు. మరి - వికర్మలను సన్యసించి వికర్మాజీతునిగా అయ్యానా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మామూలుగా లౌకిక ప్రపంచములో కూడా ఉన్నతమైన రాయల్ కులానికి చెందిన ఆత్మలు ఎటువంటి సాధారమైన నడవడికను నడవలేరు, అలాగే సుకర్మ ఆత్మలైన మీరు వికర్మలను చెయ్యజాలరు. హద్దులోని వైష్ణవులు ఏవిధంగా ఎటువంటి తామసికమైన వస్తువును స్వీకరించలేరో, అలా వికర్మాజీత్ లు, విష్ణువంశీయులు వికర్మలు మరియు వికల్పాలనే ఈ తమోగుణీ కర్మలను లేక సంకల్పాలను చెయ్యజాలరు. బ్రాహ్మణ ధర్మము లెక్కలో ఇవి నిషేధము. సహజయోగుల కొరకు ఈ - ఈ విషయాలు నిషిద్ధము అని వచ్చే జిజ్ఞాసువుల కొరకు ఈ డైరెక్షన్లను కూడా వ్రాస్తారు కదా! అలా, బ్రాహ్మణుల కొరకు లేక మీకొరకు ఏమేమి నిషిద్ధము అన్నది బాగా తెలుసా? అందరికీ తెలుసు కూడా మరియు ఒప్పుకుంటారు కూడా కానీ వాటిపై నడిచేది నంబరువారిగా. ఇటువంటి పిల్లలను చూస్తుంటే బాప్ దాదాకు ఒక వినోదభరితమైన కథ గుర్తుకు వచ్చింది, దానిని మీరు వినిపిస్తూకూడా ఉంటారు. ఒప్పుకుంటారు కూడా, చెప్తారు కూడా కానీ చెప్తూ కూడా చేస్తుంటారు. ఈ సందర్భంగా ఇతరులకు చిలుక కథను వినిపిస్తుటాంరు కదా! చెప్తూ కూడా ఉన్నారు మరియు చేస్తూ కూడా ఉన్నారు. మరి ఇటువంటి వారిని ఏమంటారు! ఇలా ఉండటము బ్రాహ్మణ ఆత్మలకు శ్రేష్టమనిపిస్తుందా? ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలు అనగా శ్రేష్టము. మరి శ్రేష్టమైనది ఏది - సుకర్మనా లేక సాధారణ కర్మనా? బ్రాహ్మణులు సాధారణ కర్మను కూడా చెయ్యనట్లయితే ఇక వికర్మల విషయమే లేదు. వికర్మాజీత్ లు అనగా వికర్మల, వికల్పాల త్యాగులు. కర్మేంద్రియాల ఆధారంతో కర్మ లేకుండా ఉండలేరు. కనుక దేహ సంబంధము కర్మేంద్రియాలతో ఉంది మరియు కర్మేంద్రియాల సంబంధము కర్మలతో ఉంది. దేహము మరియు దేహ సంబంధాల త్యాగమును గూర్చిన విషయము నడుస్తూ ఉంది. కర్మేంద్రియాలకు కర్మలతో సంబంధము ఏదైతే ఉందో - ఆ కర్మల లెక్క ద్వారా వికర్మల త్యాగము. వికర్మలను త్యాగము చెయ్యకుండా సుకర్ములుగా లేక వికర్మాజీత్ లుగా అవ్వలేరు. వికర్మల నిర్వచనము గురించి బాగా తెలుసా? ఏ వికారమునకైనా అంశమాత్రమైనా వశీభూతమై కర్మ చెయ్యటము అనగా వికర్మ చెయ్యటము అని అర్థము. వికారాల సూక్ష్మ స్వరూపము, రాయల్ స్వరూపము – రెండింటి గురించి మంచిగా తెలుసుకున్నారు మరియు బ్రాహ్మణుల రాయల్ రూపపు వికారము యొక్క స్వరూపము ఏమి అన్నదానిపై మొదట కూడా వినిపించాము. ఒకవేళ రాయల్ రూపములో వికారము ఉన్నా లేక సూక్ష్మంగా అంశమాత్రము ఉన్నా కూడా అటువంటి ఆత్మ సదా సుకర్ములుగా అవ్వలేదు.
సుకర్మ చేసానా లేక వ్యర్థ కర్మ చేసానా లేక ఏదైనా వికర్మను కూడా చేసానా అని అమృతవేళ నుండి ప్రతి కర్మను చెక్ చేసుకోండి. సుకర్మ అనగా శ్రీమతము ఆధారంతో కర్మ చెయ్యటము. శ్రీమతము ఆధారంతో చెయ్యబడిన కర్మ స్వతహాగనే సుకర్మ ఖాతాలో జమ అవుతుంది. కనుక సుకర్మ మరియు వికర్మలను చెక్ చేసుకునే ఈ విధి సహజమైనది. ఈ విధి ప్రమాణంగా సదా చెక్ చేసుకుంటూపోండి. అమృతవేళ లేచే కర్మ మొదలుకుని రాత్రి నిద్రించేవరకు ప్రతి కర్మ కొరకు శ్రీమతము లభించి ఉంది. ఎలా లేవాలి, ఎలా కూర్చోవాలి, అన్నీ తెలియజేసి ఉన్నాయి కదా! ఒకవేళ అలా లేవనట్లైతే అమృతవేళ నుండి శ్రేష్ట కర్మల శ్రేష్ట ప్రాలబ్ధమును తయారుచేసుకోలేరు అనగా వ్యర్థము మరియు వికర్మల త్యాగిగా అవ్వలేరు. కనుక ఈ సంబంధమును కూడా త్యాగము. వ్యర్థమును కూడా త్యాగము చెయ్యవలసి ఉంటుంది. ఏ వికర్మలనూ చెయ్యటం లేదు కదా, ఏ తప్పునూ చెయ్యలేదు కదా, అలాంటి మాటలను మాట్లాడలేదు కదా అని కొందరు అనుకుంటారు. కానీ వ్యర్థ మాటలు సమర్ధునిగా అవ్వనివ్వవు అనగా శ్రేష్ట భాగ్యవంతులుగా అవ్వనివ్వవు. ఒకవేళ వికర్మ చెయ్యకపోయినాగానీ వ్యర్థ కర్మను చేసినా కూడా వర్తమానము మరియు భవిష్యత్తులో జమ అవ్వదు. శ్రేష్ట కర్మ చెయ్యటం ద్వారా వర్తమానములో కూడా శ్రేష్ట కర్మల ప్రత్యక్షఫలమైన సంతోషము మరియు శక్తుల అనుభూతి ఉంటుంది. స్వయమునకు కూడా ప్రత్యక్ష ఫలము లభిస్తుంది మరియు ఇతరులు కూడా శ్రేష్ట కర్మ చేసే ఆత్మలను చూసి మేము కూడా అలా అవ్వగలము అని పురుషార్థము యొక్క ఉల్లాస-ఉత్సాహములలోకి వస్తారు. కనుక మీకు ప్రత్యక్ష ఫలము మరియు ఇతరుల సేవ, డబల్ జమ అయిపోయింది. మరియు వర్తమానము లెక్కతో భవిష్యత్తులో అయితే జమ అవ్వనే అవుతుంది. ఒకవేళ వ్యర్థమును అనగా సాధారణ కర్మను చేసినాకూడా ఎంత నష్టము జరిగింది అని ఈ లెక్కను కూడా చూసుకోండి. కనుక నేను సాధారణ కర్మనే కదా చేసాను, ఇలా అయితే అవుతూనే ఉంటుంది కదా అని ఆలోచించకండి. శ్రేష్ట ఆత్మల ప్రతి అడుగు శ్రేష్టము, ప్రతి కర్మ శ్రేష్టము, ప్రతి మాట శ్రేష్టముగా ఉంటాయి. మరి త్యాగమునకు కల నిర్వచనము ఏమిటో అర్థమైందా! వ్యర్థమును అనగా సాధారణ విషయాలకు కూడా అండర్లైన్ చెయ్యండి. దీని నిర్లక్ష్యమును కూడా త్యాగము, ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీకందరికీ విశ్వ నాటకరంగస్థలముపై హీరో, హీరోయిన్ల పాత్ర ఉంది. హీరో పాత్రధారులైన ఇటువంటి ఆత్మల ఒక్కొక్క క్షణము, ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క మాట, ఒక్కొక్క కర్మ వజ్రము కంటే కూడా చాలా విలువైనది. ఒకవేళ ఒక్క సంకల్పమైనా వ్యర్థమైనట్లయితే వజ్రాన్ని పోగొట్టుకున్నట్లు. ఒకవేళ ఎవరిదైనా చాలా చాలా విలువైన వజ్రం పడిపోయినట్లయితే, పోగొట్టుకున్నట్లయితే పోగొట్టుకున్నాను అని వారు అనుకుంటారు కదా. అలా ఒక్క వజ్రము విషయము కాదు, ఒక్క క్షణము అనేక వజ్రాల విలువ చేస్తుంది. ఈ లెక్కతో ఆలోచించండి. సాధారణ రూపములో కూర్చునిపోయి సాధారణ విషయాలను మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపేయటము - ఇలా ఉండకూడదు. ఇంకా ఏమంటారు - చెడు విషయాలు ఏమీ మాట్లాడుకోవటం లేదు, ఏవో అలా మాట్లాడుకున్నాము, అలా కూర్చుండిపోయాము, మాడ్లాడుకుంటూ అలా ఉండిపోయాము అని అంటారు. ఈ అలా-అలా చేస్తున్నాకూడా ఎంత సమయము గడిచిపోతుంది! ఇలా ఉండకూడదు, వజ్రములా ఉండాలి. కనుక మీ విలువను తెలుసుకోండి. మీ జడచిత్రాలకు ఎంత విలువ ఉంది! క్షణకాలపు దర్శనమునకు కూడా విలువ ఉంది. మీ ఒక్క సంకల్పమునకు కూడా ఎంత విలువ ఉందంటే ఇప్పటివరకు కూడా దానిని వరదానము రూపముగా భావిస్తారు. క్షణకాలము కొరకు దర్శనము ఇవ్వండి అని భక్తులు అంటారు. దర్శన 'సమయము' యొక్క విలువ, వరదాన 'సంకల్పము' యొక్క విలువ, మీ మాట యొక్క విలువ - ఇప్పుడు కూడా రెండు మాటలు వినేందుకు తపిస్తారు. మీ దృష్టి విలువ ఎంతదంటే మీ దృష్టి ద్వారా పూర్తి సంతృప్తులుగా చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు. మీ ప్రతి కర్మకూ విలువ ఉంది. బాబాతోపాటు శ్రేష్ట కర్మల వర్ణన చేస్తూ గద్గదులవుతారు. కనుక మీ ప్రతి క్షణము, ప్రతి సంకల్పము అంత అమూల్యమైనవి. కనుక మీ విలువను తెలుసుకుని వ్యర్థము మరియు వికర్మలు లేక వికల్పములను త్యాగము చెయ్యండి. మరి ఈరోజు త్యాగము యొక్క పాఠములో దేనిని పక్కా చేసుకున్నారు? 'ఏదో అలా' అన్న పదము యొక్క నిర్లక్ష్యమును త్యాగము చేయండి. ఇది ఈరోజుల్లో నడిచే భాష అని అంటారు కదా. బ్రాహ్మణులది కూడా ఈరోజుల్లో నడిచే భాషగా అయిపోయింది. ఈ నడిచే భాషను వదలండి. ప్రతి క్షణము అలౌకికమైనదిగా ఉండాలి. ప్రతి క్షణము అలౌకికముగా ఉండాలి. ప్రతి సంకల్పము అలౌకికముగా అనగా అమూల్యముగా ఉండాలి. వర్తమానము మరియు భవిష్యత్తు డబల్ ఫలము కలదిగా ఉండాలి. మామూలుగా చూస్తుటాంరు కదా - అప్పుడప్పుడు ఒకేదాంట్లో రెండు పండ్లు కలిసి ఉంటాయి కదా! రెండు పండ్లు కలిసి వస్తాయి. మరి శ్రేష్ట ఆత్మలైన మీది సదా డబల్ ఫలము అనగా డబల్ ప్రాప్తి. భవిష్యత్తుకంటే ముందు వర్తమాన ప్రాప్తి మరియు వర్తమానము ఆధారముతో భవిష్య ప్రాప్తి. మరి అర్థమైందా - డబల్ ఫలాన్ని తినండి. సింగల్ పండు కాదు. అచ్ఛా!
సదా వికర్మాజీత్ లు, అమూల్యంగా అయ్యి ప్రతి క్షణమును అమూల్యంగా తయారుచేసుకునే సేవలో ఉండే డబల్ హీరోలు, డబల్ ఫలాన్ని తినేవారు, వ్యర్థము మరియు సాధారణముల మహాత్యాగులు, సదా బాబా సమానంగా శ్రేష్ట సంకల్పాలు మరియు కర్మలను చేసే మహా-మహా భాగ్యవాన్ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో -
1. నిండు ఆత్మల ముఖముద్వారా సేవ
సాగరుని సమీపంగా ఉండేవారందరూ సదా సాగరుని ఖజానాలను ఎల్లప్పుడు తమలో నింపుకుంటూ ఉన్నారా? సాగర గర్భములో ఎన్ని ఖజానాలు ఉంటాయి! మరి సాగరతీరములో ఉండేవారు, సమీపంగా ఉండేవారు - సర్వ ఖజానాలకు యజమానులుగా అయిపోతారు. మామూలుగా కూడా ఎవరికైనా ఏదైనా ఖజానా ప్రాప్తించినట్లయితే సంతోషములోకి వచ్చేస్తారు. అకస్మాత్తుగా ఎవరికైనా కొంచెము ధనము లభించినట్లయితే నషా ఎక్కిపోతుంది. పిల్లలైన మీకు ఎటువంటి ధనము లభించిందంటే దానిని ఎవ్వరూ, ఎప్పుడూ లాక్కోలేరు, దోచుకోలేరు. 21 తరాలు సదా ధనవంతులుగా ఉంటారు. సర్వ ఖజానాలకు తాళపు చెవి - ''బాబా''. బాబా అని అనగానే, ఖజానా తెరుచుకుంటుంది. కనుక తాళపుచెవి కూడా లభించింది, ఖజానా కూడా లభించింది. సదా మిక్కిలి ధనవంతులుగా అయిపోయారు. ఇటువంటి నిండుగా ఉన్న ఆత్మలు, అతి సంపన్నులైన ఆత్మల ముఖముపై సంతోషపు మెరుపు ఉంటుంది. వారి సంతోషమును చూసిన అందరూ - వీరికి ఏం దొరికిందో తెలియదు అని అంటారు, తెలుసుకోవాలన్న కోరికతో ఉంటారు. కనుక వారి సేవ స్వతహాగనే జరిగిపోతుంది.
2. మాయాజీత్ లుగా అయ్యేందుకు స్వమానమనే సీట్ పై ఉండండి.
సదా స్వయమును స్వమానమనే సీట్ పై కూర్చుని ఉన్నట్లుగా అనుభవము చేస్తున్నారా? పుణ్య ఆత్మలు, ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ ఆత్మలు, శ్రేష్ట ఆత్మలు, మహానాత్మలు, ఇలా స్వయమును శ్రేష్ట స్వమానపు సీట్ పై ఉన్నట్లుగా అనుభవము చేస్తున్నారా? ఎక్కడైనా కూర్చోవాలంటే సీట్ కావాలి కదా! కనుక సంగమయుగములో బాబా శ్రేష్ట స్వమానమనే సీట్ ను ఇచ్చారు, దానిపై స్థితులై ఉండండి.
స్మృతిలో ఉండటమే సీట్ లేక ఆసనము. కనుక ప్రతి అడుగులో పుణ్యము చేసే పుణ్య ఆత్మను, మహా సంకల్పములు, మహాన్ మాటలు, మహా కర్మలను చేసే మహానాత్మను అని సదా స్మృతిలో ఉండాలి. ఎప్పుడూ మిమ్మల్ని మీరు సాధారణులుగా భావించకండి. ఎవరికి చెందినవారిగా అయ్యారు మరియు ఎలా అయిపోయారు? ఈ స్మృతి అనే ఆసనముపై సదా స్థితులై ఉండండి. ఈ ఆసనముపై విరాజమానులై ఉన్నట్లయితే ఎప్పుడూ మాయ రాజాలదు. వచ్చేందుకు మాయకు ధైర్యము ఉండజాలదు. ఆత్మ ఆసనము స్వమానమనే ఆసనము, దానిపై కూర్చునేవారు సహజముగానే మాయాజీత్ లుగా అయిపోతారు.
3. సర్వ సంబంధాలు ఒక్కరితో జోడించి బంధనముక్తులుగా అనగా యోగయుక్తులుగా అవ్వండి.
సదా స్వయమును బంధనముక్త ఆత్మగా అనుభవము చేస్తున్నారా? స్వతంత్రులుగా అయ్యారా లేక ఇప్పుడు కూడా ఏదైనా బంధనము మిగిలి ఉందా? బంధనముక్తుల లక్షణము - సదా యోగయుక్తము. యోగయుక్తులుగా లేనట్లయితే తప్పకుండా బంధనము ఉందని అర్థము. బాబావారిగా అయిపోయినప్పుడు బాబా తప్ప ఇంకేం గుర్తుకు వస్తుంది? సదా ప్రియమైన వస్తువు లేక చాలా గొప్ప వస్తువు గుర్తుకు వస్తుంది కదా. మరి బాబా కంటే శ్రేష్ట వస్తువు లేక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బాబా తప్ప ఇతరులెవ్వరూ శ్రేష్టము కాదు అన్నది ఎప్పుడైతే బుద్ధిలో స్పష్టమవుతుందో అప్పుడు సహజయోగులుగా అయిపోతారు. బంధనముక్తులుగా కూడా సహజంగా అవుతారు, కష్టపడవలసిన అవసరము ఉండదు. అన్ని సంబంధాలు బాబాతో జోడింపబడ్డాయి. నాది-నాది అన్నదంతా సమాప్తము, సర్వ సంబంధాలు ఒక్కరితోనే అని దీనినే అంటారు.
4. సమీప ఆత్మల లక్షణము - సమానము.
సదా స్వయమును సమీప ఆత్మగా అనుభవము చేసుకుంటున్నారా? సమీప ఆత్మల లక్షణము సమానము. ఎవరు ఎవరి సమీపములో ఉంటారో వారిపై వారి సాంగత్యపు ప్రభావము స్వతహాగనే పడుతుంది. మరి బాబా సమీపము అనగా బాబా సమానము. బాబా గుణాలు ఏవో అవే పిల్లల గుణాలు, బాబా కర్తవ్యము ఏదో అదే పిల్లల కర్తవ్యము. బాబా ఎలా సదా విశ్వ కళ్యాణకారులో అలా పిల్లలు కూడా విశ్వ కళ్యాణకారులు. కనుక ఏ కర్మ చేసినా, ఏ మాటలు మాట్లాడినా అది బాబా సమానంగా ఉందా అని అన్నివేళలా చెక్ చేసుకోండి. బాబా ఏవిధముగా సదా సంపన్నులో, సర్వ శక్తివంతులో అలాగే పిల్లలు కూడా మాస్టర్లుగా అయిపోతారు. ఏ గుణముగానీ, శక్తి గానీ లోటుగా ఉండదు. సంపన్నంగా ఉన్నట్లయితే అచలంగా ఉంటారు, కింద, మీద అవ్వరు.
5. సేవలో పరుగులు పెట్టడము కూడా మనోరంజనకు సాధనము
అందరూ స్వయమును ప్రతి అడుగులో స్మృతి మరియు సేవలద్వారా పదమాల సంపాదనను జమ చేసుకునే పదమాపద భాగ్యవంతులుగా భావిస్తున్నారా? సంపాదనకు ఎంత సహజ విధానము లభించింది! హాయిగా, విశ్రాంతిగా కూర్చుని బాబాను గుర్తు చెయ్యండి మరియు సంపాదనను జమ చేసుకుంటూ ఉండండి. మనసు ద్వారా చాలా సంపాదనను జమ చేసుకోగలరు, కానీ మధ్య-మధ్యలో సేవ సాధనాలలో ఏదైతే పరుగులు పెట్టాల్సివస్తుందో అది కూడా ఒక మనోరంజనమే. మామూలుగా కూడా జీవితమంలో ఛేంజ్ కావాలనికోరుకుంటారు, ఛేంజ్ అయిపోతుంది. సంపాదనకు సాధనాలు అనేకం ఉన్నాయి, క్షణములో పదమాలు(అపారం)గా జమ అయిపోతుంది, స్మృతి చేయగానే ఇంకొక బిందువు(సున్నా) కలుస్తుంది..., కనుక సహజ అవినాశీ సంపాదనలో బిజీగా ఉండండి.
పంజాబ్ నివాసీ పిల్లలకు ప్రియస్మృతులను ఇస్తూ బాప్ దాదా ఇలా అన్నారు -
పంజాబ్ నివాసులైన సేవాధారి పిల్లలకు సేవలో ఉన్న ఉల్లాస-ఉత్సాహాలకు సదా అభినందనలు. ఎంత సేవనో అంత చాలా-చాలా మేవ(సేవకు ప్రతిఫలము)ను తినేవారుగా అవుతారు. ఈ మేళ అయితే విశేషంగా బేహద్ సేవ. మేళ అనగా ఆత్మలకు మిలనమును చేయించేందుకు నిమిత్తులుగా అవుతున్నారు. బేహద్ సేవ, బేహద్ ఉల్లాసాన్నీ ఉంచుకుని సేవ చేసారు మరియు సదా ఇటువంటి ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటూ ముందుకు పోతూ ఉండాలి. బాప్ దాదాకు తెలుసు, చాలా మంచి, పాత, పాలన తీసుకుని ఉన్న పిల్లలు నిమిత్తంగా అయ్యారు. పాత పిల్లల భాగ్యమునైతే ఇప్పటివరకు శాస్త్రములు కూడా గానము చేస్తున్నాయి మరియు చైతన్యములో ఎవరైతే కొత్త-కొత్త పిల్లలు వస్తారో వారు కూడా వారి వర్ణన చేస్తారు. మరి ఇటువంటి పదమాపదులుగా అయ్యే అవకాశము తీసుకునే సేవాధారీ పిల్లలకు కోటానురెట్లుగా ప్రియస్మృతులు. అచ్ఛా.
Comments
Post a Comment