10-11-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ముఖ్యమైన సోదరీ-సోదరుల మీటింగ్ సమయములో అవ్యక్త బాప్ దాదా ఉచ్ఛరించిన మధురమైన అమూల్య మహావాక్యాలు
ఈరోజు సర్వ శక్తుల సాగరుడైన బాబా శక్తి సేనను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకము మధ్యలో త్రిశూలము అనగా త్రిమూర్తి స్మృతి స్పష్టమైన గుర్తుగా కనిపిస్తుంది. శక్తుల గుర్తుగా త్రిశూలాన్ని చూపిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ త్రిశూలధారీ శక్తి సేన కదా! బాప్ దాదా మరియు మీరు. ఈ త్రిమూర్తి ఎల్లప్పుడూ స్పష్టరూపములో ఉంటుందా లేక ఒక్కోసారి మర్జ్ అయ్యి, ఒక్కోసారి ఇమర్జ్ అయ్యి ఉంటుందా? బాప్ దాదాతో పాటుగా నేను శ్రేష్ఠ శక్తిశాలీ ఆత్మను, ఇది కూడా గుర్తుంటుందా? ఈ త్రిమూర్తి స్మృతి ద్వారా శక్తులలో శివుడు కనిపిస్తాడు. చాలా మందిరాలలో బాప్ దాదా కంబైండ్ స్మృతిచిహ్నమైన శివుని ప్రతిమతో పాటు ఆ ప్రతిమలో మనుష్య ఆకారమును కూడా చూపిస్తారు. ఇది బాప్ దాదా కంబైండ్ స్మృతిచిహ్నము. దానితో పాటుగా శక్తిని కూడా చూపిస్తారు. కనుక ఈ త్రిమూర్తి స్మృతి స్వరూప స్థితి ద్వారా సహజంగానే సాక్షాత్కార మూర్తులుగా అయిపోతారు. ఇప్పుడు సేవాధారీ మూర్తులుగా, భాషణ కర్తా మూర్తులుగా, మాస్టర్ శిక్షకులుగా అయ్యారు. ఇప్పుడు సాక్షాత్ మూర్తిగా అవ్వాలి. సహజయోగిగా అయ్యారు కానీ శ్రేష్ఠ యోగిగా అవ్వాలి. తపస్వీలుగా అయ్యారు, ఇంకా మహా తపస్వీలుగా అవ్వాలి. ఈరోజు సేవ అనండి, తపస్సు అనండి, చదువు అనండి, పురుషార్థమనండి, పవిత్రత యొక్క అంచులు అనండి.... అవి ఏ అలలో ఉన్నాయి, తెలుసా? సహజయోగిలోని ''సహజ'' అన్న మాట యొక్క అలలో ముందుకు వెళుతున్నాయి. కానీ చివరి సమయము అనుసారంగా వర్తమాన మనుష్యాత్మలకు వాణి ద్వారా కాకుండా, శ్రేష్ఠ వైబ్రేషన్లు, శ్రేష్ఠ వాయుమండలముల ద్వారా సాక్షాత్కారము సహజమైపోవాలి, దీని ఆవశ్యకత ఉంది. అనుభవము కూడా సాక్షాత్కార సమానమైనది. వినిపించేవారైతే చాలామంది ఉన్నారు, ఎవరికైతే వినిపిస్తారో వారు కూడా వినిపించటంలో తక్కువైనవారేమీ కారు. కానీ సాక్షాత్కారము చేయించటములోనే లోటు ఉంది. వారు సాక్షాత్కారము చేయించలేరు. ఈ విశేషత, ఈ నవీనత, ఈ సిద్ధి శ్రేష్ఠ ఆత్మలైన మీలోనే ఉంది. ఈ విశేషతను స్టేజ్ పైకి తీసుకురండి. ఈ విశేషత ఆధారంగానే మేము చూసాము, మేము పొందాము, మేము కేవలము వినటము కాదు కానీ సాక్షాత్ బాబా యొక్క క్షణకాల దర్శనమును అనుభవము చేసాము అని అందరూ వర్ణిస్తారు. ఫలానా సోదరి లేక ఫలానా సోదరుడు మాట్లాడుతున్నారు, అని అనుభవము చెయ్యరు. కానీ వీరి ద్వారా ఏదో అలౌకిక శక్తి మాట్లాడ్తూ ఉంది అని అనుభవము చేస్తారు. ఆదిలో బ్రహ్మాకు విశేష శక్తి సాక్షాత్కారమైంది, అప్పుడు ఏమని వర్ణించారు! వీరు ఎవరు, ఏంటి! అలా వీరు ఎవరు అని వినేవారికి అనుభవమవ్వాలి. కేవలము పాయింట్స్ వినటము కాదు కానీ మస్తకము మధ్యలో పాయింట్ ఆఫ్ లైట్ కనిపించాలి. ఈ నవీనతయే అందరికీ గుర్తించటమనే కళ్ళను తెరిపిస్తుంది. ఇప్పుడు గుర్తించటమనే కళ్ళు తెరవలేదు. ఇప్పుడైతే ఇతరుల లైన్లోకి మిమ్మల్నికూడా తీసుకువస్తున్నారు.. ఇది-అది ఏదైతే ఉందో అలాగే ఇది కూడా, వారు ఏవిధంగా చెప్తున్నారో అలాగే వీరు కూడా చెప్తున్నారు, వీరు కూడా చేస్తారు అని అంటారు. కానీ మేము ఎవరినైతే ఆహ్వానిస్తున్నామో, ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నామో వారే వీరు అన్న ఇటువంటి అనుభూతి యొక్క ఆవశ్యకత ఉంది. ఇందుకు సాధనము - కేవలము ఒక్క మాటను మార్చండి. సహజయోగి అన్న అలను మార్చండి. సహజ అన్న మాటను ప్రవృత్తిలో ఉపయోగించకండి, కానీ సర్వ సిద్ధి స్వరూపులుగా అవ్వడములో ఉపయోగించండి. శ్రేష్ఠ యోగిగా అవ్వాలనే అల, మహాతపస్వీ మూర్తిగా అవ్వాలనే అల, సాక్షాత్కార మూర్తులుగా అవ్వాలనే అల, ఆత్మికత యొక్క అల..... ఇప్పుడు దీని అవసరము ఉంది. ఇప్పుడు ఈ రేస్ ను చెయ్యండి. ఎంతమందికి సందేశమును ఇచ్చాము, అన్నదైతే 7 రోజుల కోర్స్ చేయించేవారి పని. వారు కూడా ఈ సందేశమును ఇవ్వగలరు. కానీ ఎంతమందికి అనుభవము చేయించాము - అన్న ఈ రేస్ చెయ్యండి. అనుభవము చేయించాలి, అనుభవీలుగా చేయించాలి. ఇప్పుడు ఇటువంటి లహర్ నలువైపుల ఉండాలి. అర్థమైందా!
84వ సంవత్సరము వస్తోంది. 84 గంటల శక్తి ప్రసిద్ధమైనది. దేవతలందరికీ మహిమ ఉంది. 84లో గంటనైతే మ్రోగిస్తారు కదా, అప్పుడే గాయనమవుతుంది, 84యొక్క గంట. ఇప్పుడు మొదట్లో లాగా సాక్షాత్కారపు అలను వ్యాపింపచెయ్యండి. సందడి చెయ్యండి. మీరు సాక్షాత్ బాబాలా అయినట్లయితే సాక్షాత్కారము దానికదే అయిపోతుంది. ఇప్పుడు కాస్త-కాస్త అనుభవము చేస్తారు కానీ నలువైపులా ఈ అలను వ్యాపింపచెయ్యండి. ఉత్సవాల అలను వ్యాపింపచేస్తారు కదా? ఉత్సవాలను చాలా చేసారు, సమారోహాలు కూడా చాలా చేసారు. ఇప్పుడు మిలన సమారోహాలను జరపండి. నూతన సంవత్సరము కొరకు క్రొత్త ప్లాన్ తయారుచేసేందుకు వచ్చారు. అన్నింటికంటే మొట్టమొదటి ప్లాన్ - స్వయములోని అన్ని బలహీనతల నుండి ప్లైన్ గా అవ్వండి, అప్పుడే సాక్షాత్కారమవుతుంది. ఒకవేళ ఈ మీటింగ్ లో ఈ ప్లాన్ ప్రాక్టికల్లోకి వచ్చినట్లయితే సేవ మీ పాదాలపై వ్రాలుతుంది. బాప్ దాదా యొక్క ఈ ఆశను ఇప్పుడు పూర్తి చెయ్యాలి. ఆశ ఇప్పుడు పూర్తవ్వలేదు. మీటింగ్ అయితే అయిపోతుంది. బాప్ దాదా వద్ద అందరి చార్ట్ అయితే ఉంది కదా. కేవలము గౌరవాన్ని ఉంచిన కారణంగా బాప్ దాదా చెప్పరు. అచ్ఛా - ఈరోజు కాస్త కలిసేందుకు వచ్చాము, చార్ట్ గురించి చెప్పేందుకు రాలేదు. (దాదీతో) మీ మిత్రురాలు (దీదీ) ఎక్కడ? గర్భంలో ఉందా? నిమిత్తమాత్రము గర్భములో ఉంది కానీ ఇప్పుడు కూడా సేవా పరిక్రమణ చేస్తున్నారు. ఏవిధంగా బ్రహ్మాబాబాతో పాటు సాకార స్వరూపములో జగదంబ తరువాత సహచరురాలిగా ఉండేదో అలా ఇప్పుడు కూడా అవ్యక్త బ్రహ్మాతో పాటు ఉంది. సేవలో సహచరత్వపు పాత్రను పోషిస్తూ ఉంది. నిమిత్తంగా కర్మేంద్రియాల బంధనము ఉంది కానీ విశేషంగా సేవా బంధనము ఉంది. యజ్ఞ స్థాపన యొక్క కార్య వ్యవహారములను మొదట విశేషరూపములో జగదంబ ఎలా సంభాళించిందో, జగదంబ తరువాత విశేష నిమిత్తరూపములో ఈ ఆత్మ (దీదీ) భాధ్యత ఉండేది. తోడుగా వేరేవారు ఉన్నాగానీ విశేష స్టేజ్ పై సాకార బ్రహ్మాతో పాటు పాత్రలో ఉంది. ఇప్పుడు కూడా బ్రహ్మాబాబా మరియు దీదీల పరస్పరములో ఆత్మిక సంభాషణ, మనోరంజనము మరియు సేవ యొక్క భిన్న-భిన్న పాత్ర నడూస్తూ ఉంటుంది. నూతన సృష్టి స్ధాపనలో కూడా విశేషంగా బ్రహ్మాతో పాటుగా అనన్య ఆత్మల పాత్ర ఇప్పుడు చాలా ఎక్కువ వేగముతో నడుస్తూ ఉంది. సాకార దీదీ యొక్క విశేష సంస్కారము ఏమిటంటే సేవా ప్లాన్ ప్రాక్టికల్లోకి తీసుకురావటము, ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పించటముగా ఉండేది. అలాగే ఇప్పుడు కూడా అదే సంస్కారము నూతన ప్రపంచ స్థాపనా కార్యము కొరకు నిమిత్తంగా అయిన గ్రూప్ కు ఇంకా ఎక్కువ తీవ్రగతిని ఇచ్చే పాత్ర నడుస్తూ ఉంది. దీదీ యొక్క విశేషమైన మాటలు గుర్తున్నాయా? ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకువచ్చేందుకు విశేషమైన మాట ఏమనేవారు? ఏదైనా ఇంకా నూతనమైనది చెయ్యండి అని ఎల్లప్పుడూ ఇదే మాట అనేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏ నవీనతను తీసుకువచ్చారు అని పదే-పదే అడుగుతూ ఉండేది. ఇలాగే అవ్యక్త బ్రహ్మాతో కూడా పదే-పదే ఈ మాటలతోనే ఆత్మిక సంభాషణ చేసేది. అడ్వాన్స్ పార్టీలో కూడా ఉల్లాస-ఉత్సాహాలను తీసుకువస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏమేమి చేసారు, ఇప్పుడేం చేస్తున్నారు. ఆ సంస్కారమునే ప్రాక్టికల్లో తీసుకువస్తున్నారు. ఎవర్నీ కూర్చోనిచ్చేవారు కారు కదా. అడ్వాన్స్ పార్టీని కూడా ఇప్పుడు స్టేజ్ పైకి తీసుకువచ్చేందుకు బాణాలను సంధించే తయారీలో ఉన్నారు. కంట్రోలర్ సంస్కారము ఉండేది కదా. ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ కంటోలర్. ఇప్పుడు కూడా సేవా సంస్కారము ఇమర్జ్ రూపములో ఉంది. అర్థమైందా! ఇప్పుడు దీదీ ఎక్కడ ఉంది? ఇప్పుడైతే విశ్వ పరిక్రమణ చేస్తూ ఉంది. స్టీ తీసుకున్నప్పుడు తెలుపుతాము. ఇప్పుడు వారు కూడా మీకు సహయోగమును ఇచ్చేందుకు చాలా పెద్ద-పెద్ద ప్లాన్స్ తయారుచేస్తూ ఉన్నారు. ఆలస్యమవ్వదు. అచ్ఛా!
ఇటువంటి సదా శ్రేష్ఠ యోగులు, సదా మహా తపస్వీమూర్తులు, సాక్షాత్ బాబాలా అయ్యి బాబా సాక్షాత్కారమును చేయించేవారు, నలువైపుల ''మేము పొందాము, మేము చూసాము'' అన్న ఈ ప్రాప్తి అలను వ్యాపింపచేసేవారు అయిన మహా తపస్వీమూర్తులకు, దేశ-విదేశాలలోని సర్వ స్నేహీలకు, సేవలో మగనమై ఉండే పిల్లలందరికీ బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
మీటింగ్ లోని వారితో -
మీటింగ్ అయితే అయిపోయింది. కేవలము సందేశమును ఇచ్చేందుకు కాకుండా విశ్వమును బాబా సమీపంగా తీసుకువచ్చేందుకు మీటింగ్ జరుగుతుంది. సమీపంగా తీసుకువస్తే సాంగత్యపు ప్రభావము పడుతుంది కదా. ఎంతగా బాబా సమీపంగా వస్తారో అంతగా సాంగత్యపు ప్రభావము పడుతుంది. ఎక్కడైతే వినాలో అక్కడ కొంత వినటము ఉంటుంది, కొంత మర్చిపోవటమూ ఉంటుంది కానీ ఎవరైతే సమీపంగా వస్తారో వారు బాబాకు సమీపంగా ఉన్న కారణంగా ఆత్మిక రంగులో రంగరింపబడతారు. కనుక ఇప్పుడు ఏ సేవ ఉంది? సమీపంగా తీసుకువచ్చే సేవ ఉంది. సందేశమునైతే ఇచ్చేసారు. మెసెంజర్లుగా అయ్యి మెసేజ్ ఇచ్చే పాత్రనైతే పోషించేసారు. కానీ ఇప్పుడు ఎవరిలా అవ్వాలి? శక్తులను ఎల్లప్పుడూ ఏ రూపములో గుర్తు చేస్తారు? అందరూ శక్తిసేనయే కదా? శక్తులను ఎల్లప్పుడూ తల్లి రూపములో గుర్తు చేస్తారు, పాలనను తీసుకునే ఆలోచనతో గుర్తు చేస్తారు. మెసేజ్ అయితే చాలా ఇచ్చారు మరియు ఇప్పుడు మెసేజ్ ఇచ్చేవారు కూడా చాలామంది తయారయ్యారు. ఇప్పుడు పాలనను ఇచ్చేవారు కావాలి. ఎవరైతే విశేష నిమిత్తులుగా ఉన్నారో ఇప్పుడు వారి కార్యము - ప్రతి క్షణము బాబా పాలనలో ఉండటము మరియు అందరికీ బాబా పాలనను ఇవ్వటము. చిన్నపిల్లలు ఎల్లప్పుడు పాలనలో ఉన్న కారణంగా వారు ఎంత సంతోషంగా ఉంటారు! ఏమైనాగానీ పాలనలో ఉన్న కారణంగా ఎంత సంతోషంగా ఉంటారు. అలాగే మీరందరు కూడా సర్వాత్మలకూ ప్రభు పాలనలో నడిచే అనుభవమును చేయించండి. మేము ప్రభు పాలనలో నడుస్తున్నాము, వీరు మాకు ప్రభు పాలన యొక్క దృష్టిని ఇస్తున్నారు అని వారు భావించాలి. కనుక ఇప్పుడు పాలన యొక్క ఆవశ్యకత ఉంది. మరి మీరు పాలనను ఇచ్చేవారా లేక మెసేజ్ ఇచ్చేవారా? మెసెంజర్లుగా అయితే ఈరోజుల్లో చాలామంది పిలిపించుకుంటున్నారు. మెసెంజర్లుగా అవ్వటము చాలా సాధారణ విషయము. కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా గానీ వారు ఎలా అనుభవము చెయ్యాలంటే మేము ఈశ్వరీయ పాలనలోకి వచ్చేసాము అని భావించాలి. సంబంధములోకి తీసుకురావటము అని దీనినే అంటారు.
అందరూ అనన్య(విశిష్ట)మైనవారే కదా! అనన్యులు అనగా అన్యులు(ఇతరులు) ఏదైతే చెయ్యలేరో దానిని చేసి చూపించేవారు. అందరూ చేసేదాన్ని చెయ్యటము, అదేమంత పెద్ద విషయము కాదు. పాలనకు అర్థము - వారిని శక్తిశాలురుగా తయారుచెయ్యటము, వారి సంకల్పాలను, శక్తులను ఇమర్జ్చెయ్యటము, ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురావటము. ప్రతి విషయములో శక్తిరూపులుగా అవ్వటము. ఈ రూపములోని పాలన ఇప్పుడు ఎక్కువ కావాలి. నడుస్తున్నారు కానీ శక్తిశాలీ ఆత్మలుగా అయ్యి నడవటము, ఇది ఇప్పుడు అవసరము. క్రొత్తవారు వచ్చినా వారు కూడా ఈశ్వరీయ శక్తి యొక్క అనుభూతిని తప్పకుండా చెయ్యాలి. వాణి శక్తి యొక్క అనుభూతి అయితే జరుగుతూనే ఉంది కానీ ఇక్కడ ఈశ్వరీయ శక్తి ఉంది, అన్న ఈ అనుభూతిని చేయించండి. స్టేజ్ పైకి వచ్చినప్పుడు భాషణ చెయ్యాలి అని గుర్తుంటుంది, కానీ భాషణ నిమిత్తము, ఈశ్వరీయ శక్తి యొక్క భాసనను ఇవ్వాలి అన్నది ఎక్కువగా గుర్తుండాలి. వాణిలో కూడా ఈశ్వరీయ శక్తి యొక్క భాసన రావాలి. దీనినే అతీతత్వము అని అంటారు. స్పీచ్ చాలా బాగా ఇచ్చారు అని అంటే స్పీకర్ రూపంలో చూసారు కదా! వీరు ఈశ్వరీయ అలౌకిక ఆత్మలు, ఈ రూపములో చూడాలి. ఈ అనుభూతిని చేయించాలి. ఈ భాసనయే ఈశ్వరీయ బీజాన్ని వేస్తుంది. ఇక మళ్ళీ ఆ బీజము బయటకు రాలేదు. ఎవరికైనా క్షణకాలపు అనుభవము కలిగినా కూడా అంతిమము వరకూ కష్టపడాల్సిన అవసరము ఉండదు. ఈశ్వరుని క్షణకాలపు దర్శన దృశ్యమును ఎవరైతే రావటంతోనే చేస్తారో వారి నడవడిక, సేవ చెయ్యటము అవి వేరేగా ఉంటాయి. ఎవరైతే కేవలము విని ప్రభావితులౌతారో వారి నడవడిక వేరేగా ఉంటుంది, ఎవరైతే కేవలము ప్రేమలోనే నడుస్తూ ఉంటారో వారి నడవడిక వేరుగా ఉంటుంది. భిన్న-భిన్న ప్రకారాలు ఉన్నాయి కదా! కనుక ఇప్పుడు మొదటగా స్వయమును సదా ఈశ్వరీయ పాలనలో అనుభవము చేసుకున్నట్లయితే అప్పుడు ఇతరులకు అనుభవము అవుతుంది. సేవలో నడుస్తున్నారు కానీ సేవ కూడా పాలనయే. ఈశ్వరీయ పాలనలో నడుస్తున్నారు. సేవ శక్తిశాలురుగా తయారుచేస్తుంది కనుక ఇది కూడా ఈశ్వరీయ పాలన కదా! కానీ ఇది ఇమర్జ్ అయ్యి ఉండాలి. ఈ దృఢ సంకల్పమును చెయ్యాలి. అనన్యులు అనగా బాబా సమానంగా ఉదాహరణలు. అచ్ఛా!
విదేశీ పిల్లలకు ప్రియస్మృతులను ఇస్తూ
బాప్ దాదా విదేశీ పిల్లలందరికీ విశేష ప్రియస్మృతులను పదమాగుణాలుగా రిటర్న్ లో ఇస్తున్నారు. అందరూ ఏవైతే ఉత్తరాలు మరియు సమాచారాలను వ్రాసారో వాటికి రిటర్న్ గా పిల్లలందరికీ పురుషార్థమును తీవ్రము చేసినందుకు అభినందనలు మరియు దానితో పాటు పురుషార్థము చేస్తున్నప్పుడు ఒకవేళ ఏవైనా సైడ్ సీన్లు వచ్చినట్లయితే అందుకు గాభరా పడవలసిన అవసరము లేదు. ఏ సైడ్ సీన్లు వచ్చినా గానీ వాటిని స్మృతి మరియు సంతోషముల ద్వారా దాటుతూ నడవండి. విజయము లేక సఫలత అనేది మీ జన్మసిద్ధ అధికారము. సైడ్ సీన్లను దాటివేసారు మరియు గమ్యము దొరికింది, కనుక ఏ పెద్ద విషయాన్నైనా చిన్నదిగా చేసుకునేందుకు స్వయము అతి పెద్ద స్టేజ్ పై స్థితులైనట్లయితే పెద్ద విషయము కూడా స్వయమే చిన్నదిగా స్వతహాగనే అయిపోతుంది. కింది స్థితిలో ఉండి పైన ఉన్న వస్తువును చూసినట్లయితే అప్పుడు పెద్దదిగా అనిపిస్తుంది. కనుక ఉన్నత స్టేజ్ పై స్థితులై ఏ పెద్ద విషయాన్నైనా చూసినట్లయితే చిన్నదిగా అనుభవమవుతుంది. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా లేక ఏవిధమైనటువంటి విఘ్నము వచ్చినా అప్పుడు మీ శ్రేష్ఠ స్థితిలో, ఉన్నతోన్నతమైన స్థితిలో స్థితులవ్వండి. బాబాతో పాటు కూర్చున్నట్లయితే బాబా సాంగత్యపు ప్రభావము వలన కూడా సహజమనిపిస్తుంది. తోడు కూడా దొరుకుతుంది. మరియు ఉన్నతమైన స్థితి కారణంగా అన్ని విషయాలు చాలా చిన్న విషయాలుగా అనుభవమవుతాయి, కనుక గాభరా పడకండి. దుఃఖితులుగా అవ్వకండి, సదా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే సదాకాలమునకు సఫలత మీ ఎదురుగా వస్తుంది. సఫలత లభిస్తుందా, లభించదా అని ఆలోచించవలసిన అవసరము ఉండదు, కానీ సఫలత స్వయమే మీ ఎదురుగా వస్తుంది. సఫలతా హారాన్ని ప్రకృతి స్వయమే మీకు ధరింపచేస్తుంది. పరిస్థితులు మారిపోయి విజయహారంగా అయిపోతాయి కనుక చాలా ధైర్యము కలవారు, ఉల్లాసము కలవారు, ఉత్సాహములో ఉండేవారు, మధ్యమధ్యలో ఏదో కాస్త జరుగుతూ ఉంటుంది కూడా, కానీ వాటి గురించి ఆలోచించకండి. సమయము గడిచిపోయింది, పరిస్థితి గడిచిపోయింది, మరల వాటి గురించి ఆలోచించటము అనేది వ్యర్థమవుతుంది కనుక సమయము ఏవిధంగా గడిచిపోయిందో అలా మీ బుద్ధి నుండి కూడా గడిచినదేదో గడిచిపోయింది, ఎవరైతే గడిచినదేదో గడిచిపోయింది అని అనుకుంటారో వారు సదా నిశ్ఛింతులుగా ఉంటారు. సదాకాలము ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటారు కనుక బాప్ దాదా విశేషంగా ఇలా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేవారిని, ధైర్యమును ఉంచే పిల్లలను విశేషంగా అమృతవేళ స్మృతి చేస్తారు. మరియు విశేషమైన శక్తిని ఇస్తారు, ఆ సమయములో స్వయమును పాత్రులుగా భావించి ఆ శక్తిని తీసుకున్నట్లయితే చాలామంచి అనుభవమవుతుంది.
అమృతవేళ బద్ధకము వస్తుంది - సంతోషానికి చెందిన పాయింట్లను తక్కువగా మననము చేస్తారు. ఒకవేళ మొత్తము రోజంతా మననము జరుగుతూ ఉన్నట్లయితే అమృతవేళ కూడా మననము చేసిన ఆ ఖజానాలు ఎదురుగా రావటం వలన సంతోషము ఉంటుంది కనుక బద్ధకము రాదు. కానీ మొత్తము రోజులో మననము తక్కువగా ఉంటుంది, ఆ సమయములో మననము చేసేందుకు ప్రయత్నము చేసినా మననము జరగదు కనుక బుద్ధి ఫ్రెష్అవ్వదు. అప్పుడిక మననమూ ఉండదు, అనుభవమూ అవ్వదు, మళ్ళీ బద్ధకము వచ్చేస్తుంది. అమృతవేళను శక్తిశాలిగా తయారుచేసుకునేందుకు మొత్తము రోజంతటి కోసము ఏ శ్రీమతమైతే లభిస్తుందో దాని ప్రమాణంగా నడవటము చాలా అవసరము. కనుక మొత్తము రోజంతా మననము చేస్తూ పోండి. జ్ఞానరత్నాలతో ఆడుకుంటూ పోతున్నట్లయితే సంతోషకరమైన ఆ విషయాలే గుర్తు వస్తూ ఉండటంతో నిద్ర పోతుంది మరియు సంతోషములో ఎలా అనుభవము చేస్తారంటే ఇప్పుడే ప్రాప్తి గనులు తెరుచుకున్నాయి అని భావిస్తారు. మరి ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ నిద్ర రాదు. ఎక్కడైతే ప్రాప్తి ఉండదో అక్కడకు నిద్ర వస్తుంది లేక అలసటగా ఉంటుంది లేక బద్ధకము వస్తుంది. ప్రాప్తియొక్క అనుభవములో ఉండండి, అందుకు కనెక్షన్ మొత్తము రోజంతటిలో చేసే మననముపై ఉంటుంది. అచ్ఛా.
ఎవరైతే ప్రియస్మృతులతో కూడిన సందేశాన్ని పంపారో వారినైతే సమ్ముఖములో కలిసేది ఉంది కానీ దూరంగా కూర్చుని ఉన్నవారిని కూడా బాప్ దాదా సమ్ముఖంగా చూస్తున్నారు మరియు సమ్ముఖంగా చూస్తూనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా సమ్ముఖంగా ఉన్నారు, మరల కూడా సమ్ముఖంగా ఉంటారు. అందరికీ పేరుపేరునా, సమాచారమునకు రెస్పాండ్ సహితంగా ప్రియస్మృతులు. సదా తీవ్ర ఉల్లాసము, తీవ్ర పురుషార్థములో ఉండాలి మరియు ఇతరులకు కూడా తీవ్ర పురుషార్థపు వైబ్రేషన్లను ఇస్తూ వాయుమండలమునే తీవ్ర పురుషార్థమునకు చెందినదిగా తయారుచెయ్యాలి. పురుషార్థము కాదు, 'తీవ్ర పురుషార్థము'. నడిచేవారు కారు, ఎగిరేవారు. నడిచే సమయము పూర్తయిపోయింది. ఇప్పుడు ఎగరండి మరియు ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
Comments
Post a Comment