09-03-1982 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
హోలీ జరుపుకునేందుకు మరియు హోలీగా చేసేందుకు అలౌకిక రీతి.
అవ్యక్త బాప్ దాదా ఈరోజు తమ హోలీహంసలతో కలిసేందుకు వచ్చారు. హోలీహంసలైన ప్రతి ఒక్కరి బుద్ధిలో జ్ఞానమునకు చెందిన ముత్యాలు, మాణిక్యాలు, రత్నాలు సదా నిండి ఉన్నాయి. ఇటువంటి హోలీహంసలు బాప్ దాదాకు కూడా మొత్తము కల్పములో ఒకేసారి లభిస్తారు. ఇటువంటి విశేష హోలీహంసలతో బాప్ దాదా మొత్తము సంగమయుగమంతా హోలీని జరుపుతూ ఉంటారు. ప్రపంచములోని వారు సంవత్సరములో ఒకటి, రెండు రోజులు హోలీని జరుపుకుంటారు. కానీ జరుపుకునేదానితో పాటుగా పోగొట్టుకుంటారు కూడా, హోలీహంసలైన మీరు జరుపుకుంటారు కూడా మరియు సంపాదిస్తారు కూడా, పోగొట్టుకోరు. దూరంలో కూర్చుని ఉన్న పిల్లలందరు కూడా బాప్ దాదాతో హోలీ జరుపుకుంటున్నారు. బాప్ దాదా వద్దకు దేశ-విదేశములలో ఉన్న పిల్లల శ్రేష్ట స్నేహమునకు చెందిన సంకల్పములు చేరుకుంటున్నాయి. పిల్లలందరి నయనాలు మరియు మస్తకములనే పిచికారీ ద్వారా ప్రేమధార, అతి స్నేహమునకు చెందిన సుగంధిత పిచికారీ వస్తూ ఉంది. బాప్ దాదా కూడా రిటర్న్ గా పిల్లలందరికీ నయనాల పిచికారీ ద్వారా అష్టశక్తులు అనగా అష్ట రంగుల పిచికారీతో ఆడుకుంటున్నారు. స్థూల రంగులద్వారా ఎరుపురంగుతో ఎరగ్రా తయారుచేస్తారు అన్న దానిని బాప్ దాదా చూస్తున్నారు. భిన్న - భిన్న రంగులతో భిన్న భిన్న రూపాలను తయారుచేస్తారు. అలా ప్రతి శక్తికి చెందిన ఆత్మికరంగు ద్వారా ప్రతి శక్తికి చెందిన స్వరూపంగా అయిపోతారు, ప్రతి గుణము స్వరూపమైపోతుంది. దృష్టి ద్వారా రూపము పరివర్తిన అయిపోతుంది. అటువంటి ఆత్మిక హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా?
పుష్ప వర్షాన్ని కురిపించి హోలీని జరిపేందుకు బదులుగా బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ సదాకాలము కొరకు ఆత్మిక నషా యొక్క శక్తిద్వారా ఆత్మిక గులాబీగా తయారుచేస్తారు. స్వయమే పుష్పంగా అవుతారు. ఇటువంటి హోలీని తండ్రి మరియు పిల్లలు తప్ప ఇతరులెవ్వరూ జరుపుకోలేరు. జన్మ తీసుకున్నప్పటినుండే బాబా హోలీని జరిపి హోలీగా తయారుచేసారు. కనుక వారైతే జరుపుకునేవారు మరియు మీరు సదా 'హోలీ'గా అయ్యేవారు. సదా ప్రతి గుణము యొక్క రంగు, ప్రతి శక్తి యొక్క రంగు, స్నేహము యొక్క రంగు వెయ్యబడే ఉంది కదా! ఇటువంటి హోలీ హంసలే కదా! తిలకమును దిద్దవలసిన అవసరము కూడా లేదు, సదా తిలకధారులుగా ఉన్నారు, అవినాశీ తిలకము దిద్దబడి ఉంది కదా! దానిని తొలగించుకోవాలన్నా తొలగిపోలేదు. అల్పకాలమునకు బదులుగా సదాకాలము జరుపుకుంటూ ఉంటారు మరియు ఇతరులను కూడా అలా తయారుచేస్తూ ఉంటారు. వారైతే మంగళ మిలనము కొరకు ఆలింగనం చేసుకుంటారు కానీ హోలీహంసలైన మీరు బాప్ దాదా మెడలోని హారంగానే అయిపోయారు. సదా మెడలోని హారంగా అయ్యి మెరుస్తున్న రత్నాలు విశ్వములో ప్రకాశమును వ్యాపింపచేస్తున్నారు. ఒకొక్క రత్నము మెరుస్తున్న లైట్స్ స్వరూపాలు, వేలాది బల్బులు కూడా ఇంత ప్రకాశమును ఇవ్వలేవు. ఇటువంటి మెరుస్తున్న రత్నాలు మీ లైట్ - మైట్ స్వరూపము తెలుసు కదా! మొత్తము విశ్వమును అంధకారమునుండి వెలుగులోకి తీసుకువచ్చేవారు, మెరిసే రత్నాలైన మీరే ఇటువంటి హోలీహంసలతో బాప్ దాదా విశేష దినమైన కారణంగా ఆత్మిక హోలీని జరుపుకుంటున్నారు.
హోలీని వెలిగించారు కూడా మరియు జరుపుకున్నారు కూడా. వెలిగించటము మరియు జరుపుకోవటము, రెండూ వస్తాయి కదా? వెలిగించిన తరువాతనే జరుపుకోవటము ఉంటుంది. సంకల్పమనే అగ్గిపుల్లతో స్వయములోగానీ లేక సేవలోగానీ ఏవైనా వ్యర్థ సంకల్పాలు అనగా బలహీనతకు చెందిన సంకల్పాల సంస్కారము ఉంటే, వాటన్నింటినీ ప్రోగుచేసి అగ్గిపుల్లను వెలిగించండి, వీటినే ఎండిపోయిన కట్టెపుల్లలు అంటారు. కనుక అన్నింటినీ ఒకచోటకు చేర్చి దృఢ సంకల్పమనే అగ్గిపుల్లను వెలిగించండి. అప్పుడు వెలిగించటము కూడా అయిపోయినట్లు. వెలిగించటమే జరుపుకోవటము మరియు తయారవ్వటము. అగ్గిపుల్లను వెలిగించటము వస్తుంది కదా? కనుక వెలిగించండి మరియు జరుపుకోండి, అనగా స్వయమును సదా 'హోలీ'గా తయారుచేసుకోండి. అగ్గిపుల్లను వెలిగించినా అంటుకోవటము లేదు అన్నది ఉండకూడదు. అగ్గిపుల్ల కూడా అగ్గిపెట్టెతో సంబంధము లేకుండా వెలగదు. కనుక బాబాతో సంపర్క సంబంధాలు ఉండాలి, అభ్యాసమనే అగ్గిపుల్లపై మందు ఉంటే, అప్పుడు క్షణకాలములో సంకల్పము చేసారు మరియు తయారైపోయారు. కనుక అన్ని సాధనాలు సరిగ్గా ఉండాలి, సంబంధము కూడా ఉండాలి, అభ్యాసము కూడా ఉండాలి. సంబంధము ఉండి అభ్యాసము తక్కువగా ఉన్నట్లయితే కష్టపడిన తరువాత సఫలత లభిస్తుంది. క్షణములో సంకల్పమునకు చెందిన స్వరూపంగా అవ్వలేరు. పదే పదే సంకల్పము చేస్తూ చేస్తూ కష్టపడిన తరువాత సఫలత లభిస్తుంది. మీ అందరి కష్ట సమయము అనగా భక్తి సమయము సమాప్తమైపోయింది కదా! భక్తి అంటేనే కష్టము! భక్తి సమయము సమాప్తమవ్వటము అనగా కష్టము సమాప్తమైనట్లు. ఇప్పుడు భక్తి ఫలితాన్ని తీసుకునే సమయము. భక్తి ఫలము 'జ్ఞానము' అనగా ప్రేమ, అంతేకానీ కష్టము కాదు. 63 జన్మలు కష్టించారు, కొంచెము చేసినా, ఎక్కువ చేసినా గానీ కష్టమునైతే చేసారు కదా! ఇప్పుడు అంతిమములోని ఈ ఒక్క జన్మలో ప్రేమ సమయములో కూడా కష్టపడ్తారా? ఇప్పుడు సదా బాబా యొక్క ప్రేమ ద్వారా ఫలాన్ని తినండి అనగా సదా ఫలీభూతులుగా అవ్వండి. ఫలాన్ని తినండి అనగా సదా సఫలురుగా ఉండండి. ఫలాన్ని తినటము అనగా సదా హోలీ జరుపుకోవటము మరియు హోలీగా అవ్వటము. ఇప్పుడు కష్టపడే, యుద్ధము చేసే సంస్కారమును సమాప్తము చెయ్యండి. ఇప్పుడైతే రాజ్య భాగ్యమును పొందారు, మరి ఇంకా యుద్ధము ఎందుకు? దేవపదవికంటే కూడా శ్రేష్టమైన భాగ్యాన్ని ఇప్పుడు పొందారు. స్వరాజ్యములోని మజా విశ్వ రాజ్యములో కూడా ఉండదు. మరి రాజ్య భాగ్యవంతులైన ఆత్మలు ఇప్పుడు కూడా యుద్ధము ఎందుకు చేస్తారు? కనుక కష్టపడే సంస్కారము, యుద్ధ సంస్కారాలు మరియు సంకల్పాలనే పాత కట్టె పుల్లలకు నిప్పు అంటించండి. ఇటువంటి హోలీని వెలిగించండి. పిల్లలు కష్టపడే సంస్కారమును చూసి బాప్ దాదాకు కూడా దయ కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా కష్టపడుతున్నట్లయితే ఫలాన్ని ఎప్పుడు తింటారు? దీని అర్థం కష్టపడాల్సిన అవసరము లేదని... నిర్లక్ష్యులుగా అవ్వకండి. సదా ప్రేమలో మగ్నమై ఉండాలి. లవలీనమై ఉండాలి. ఆలోచించారు మరియు జరిగింది – ఇటువంటి అభ్యాసకులుగా అవ్వండి. మాస్టర్ సర్వ శక్తివంతులు కనుక సంకల్పము చేసారు మరియు అనుభూతి జరిగింది - ఇటువంటి సహజ అభ్యాసకులుగా అవ్వండి. శ్రేష్ట సంకల్పాల ఖజానాను స్వరూపములోకి తీసుకురండి. ఏదైనా శ్రేష్ట కార్యమును చేసేటప్పుడు అలంకరిస్తారు కదా! నిన్న కూడా అలంకరించారు కదా? (నిన్న మధువనములో 5గురు కన్యల సమర్పణ సమారోహణ జరిగింది, అందులో చాలా బాగా అలంకరించటం జరిగింది) అలంకరించబడిన మూర్తి కూడా శుభమునకు గుర్తు. మరి మీరందరూ ఎల్లప్పుడూ శుభ కార్యములో ఉపస్థితులై ఉన్నారు కనుక సదా గుణాలనే నగలతో అలంకరించబడి ఉండండి. కానీ కేవలము బుద్ధి అనే ఇనప్పెట్టెలో బంధించి ఉంచకండి. సదా గుణాలనే నగలతో అలంకరించబడి ఉన్న మూర్తి, ఈ 16 అలంకారాలుగా అనగా 16 కళల సంపూర్ణులుగా, సర్వ గుణ సంపన్నులుగా అవ్వండి. ఇలా ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు సదా సౌభాగ్యవంతులు, సదా భాగ్యవంతులు అయిన ఆత్మలు అలంకారములు లేకుండా ఎలా అలంకరింపబడతారు.... సౌభాగ్యమునకు గుర్తు కూడా అలంకారము మరియు రాజ్య కులమునకు గుర్తు కూడా అలంకారము. మరి మీరు ఎవరు? రాజులకే రాజులుగా తయారుచేసే కులమునకు చెందినవారు మరియు సదా సౌభాగ్యవంతులు. కనుక గుణాలనే నగలతో అలంకరించబడి ఉన్న ఆత్మిక మూర్తులుగా ఎల్లప్పుడూ అవ్వండి. ఇటువంటి హోలీని జరుపుకున్నారా?
మధువనములో హోలీ జరుపుకున్నారు కదా? పాడారు కూడా, తిన్నారు కూడా. యోగాన్ని కూడా చేసారు, భోగ్ ను కూడా పెట్టారు. ఎల్లప్పుడూ మనసు కూడా మధురము, నోరు కూడా మధురము. కనుక హోలీ అయిపోయింది కదా! ఉన్నదే కల్పకల్పపు హోలీలుగా. ఇంకా ఏం చేస్తారు? పన్నీరు చల్లుతారా? గులాబీ రేకులను వేస్తారా? స్వయమే గులాబీలు. ఇంకా ఏదైనా ఆశ మిగిలి ఉన్నట్లయితే రేపు గులాబీ నీటిని వెయ్యండి. రంగులో అయితే రంగరించబడి ఉన్నారు. ఆ రంగునైతే పోగొట్టుకోవలసి ఉంటుంది మరియు ఈ రంగైతే ఎంత పడితే అంత మంచిది.
ఇటువంటి సదా ఆత్మిక గులాబీలు, సదా జ్ఞానమనే రంగులో రంగరింపబడినవారు, సదా ప్రభు మిలనమును జరుపుకునేవారు, సదా గుణాలనే నగలతో అలంకరించబడి ఉన్న మూర్తులు, బాప్ దాదాల సమీప మరియు సమాన రత్నాలకు, దూరములో ఉన్నవారైనా లేక సమ్ముఖములో ఉన్నవారైనాగానీ, హోలీహంసలందరికీ బాప్ దాదా అవినాశీ హోలీగా అయ్యేందుకు అభినందనలను ఇస్తున్నారు. తోడుతోడుగా లవలీన ఆత్మలందరికీ స్నేహమునకు రెస్పాండ్ గా ప్రియస్మృతులు మరియు సర్వ శ్రేష్ట ఆత్మలకు నమస్తే.
గుజరాత్ పార్టీవారితో మిలనము:- మీరందరూ అతి పెద్ద వ్యాపారులు కదా? మొత్తము విశ్వములో ఇంత పెద్ద బిజినెస్ ను ఎవ్వరూ చెయ్యలేరు. తెలివైన వ్యాపారులెవరైతే ఉంటారో వారు సంపాదనను పెంచుకుంటూ ఉంటారు. లౌకికములో వృద్ధి జరుగుతున్నప్పుడు ఒకటి, ఒకటి బిందువు(సున్నా)ను పెడుతూపోతారు. మీరుకూడా బిందువును పెట్టాలి. నేను కూడా బిందువును, బాబా కూడా బిందువు. అతి పెద్ద వ్యాపారులు కానీ పెట్టాల్సింది బిందువును. 6 లేక 8ని వ్రాయాలంటే కష్టమనిపించవచ్చు కూడా. కానీ బిందువునైతే అందరూ పెట్టగలరు. ఇది సహజమైనది కూడా మరియు శ్రేష్టమైనది కూడా. మొత్తము రోజంతటిలో ఎన్ని బిందువులను పెడ్తారు? ప్రశ్న వచ్చినప్పుడు బిందువు పోతుంది. బిందువు లేకుండా ప్రశ్నకూడా ఉండదు. మరి బిందువును పెట్టడంలో అందరూ తెలివైనవారే కదా? బిందువును పెట్టాడానికి సమయము కూడా పట్టదు. నేను కూడా బిందువు, బాబా కూడా బిందువు. కనుక బిందువును పెట్టడానికి సమయము లేదు అనికూడా ఎవ్వరూ అనలేరు. క్షణకాలపు విషయము. కనుక ఎన్ని క్షణాలు లభిస్తే అన్ని బిందువులను పెట్టండి, మరల రాత్రికి ఎన్ని బిందువులు పెట్టాను అన్న దానిని లెక్కించండి. ఏ విషయాన్నీ ఎక్కువగా ఆలోచించకండి, ఏ విషయాన్నైతే ఎక్కువగా ఆలోచిస్తారో ఆ విషయము ఎక్కువవుతూ ఉంటుంది. అన్ని ఆలోచనలను వదిలి ఒక్క బాబాను గుర్తు చెయ్యండి, ఇదే ఆశీర్వాదమైపోతుంది. స్మృతిలో చాలా లాభాలు నిండి ఉన్నాయి. ఎంత స్మృతి చేస్తారో అంతగా శక్తి నిండుతూ ఉంటుంది, సహయోగముకూడా ప్రాప్తిస్తుంది. సేవ కూడా జరుగుతుంది. అచ్ఛా.
వార్షిక మీటింగ్ కొరకు బాప్ దాదాల ప్రేరణలు:- మీటింగ్ లో ఏదో ఒక నవీనతనైతే ఆవిష్కరిస్తారు. కానీ ఒక విషయములో విశేష ధ్యానమును ఉంచాలి, ప్రతి జోన్ వారు సేవకు సహయోగులుగా ఉంటూ, సంపర్కములో ఉంటూ, సేవకు నిమిత్తులుగా అయ్యేవారెవరైతే ఉన్నారో అటువంటి పుష్పగుచ్ఛాన్ని తయారుచేసి తీసుకురండి అని బాప్ దాదా ముందు కూడా సూచించారు. ఏ వర్గానికి చెందినవారైనా సరే, కానీ వారు ఎటువంటి విశేష ఆత్మలుగా ఉండాలంటే సమయానుసారంగా సహయోగులుగా అయ్యేందుకు నిమిత్తులుగా అవ్వగలిగేవారుగా ఉండాలి. ఇలా సేవ చేయించేందుకు నిమిత్తులుగా అయిన ఆత్మలను ఎదురుగా తీసుకురండి. బాప్ దాదా వద్దకు కాదు, గ్రూపులుగా చేసి మొదట మధువనమునకు తీసుకురండి. తరువాత వారు ఎంతగా ముందుకు పోతారో అంత సమీపంగా వస్తారు. కనుక ఈ విషయముపై విశేషమైన అటెన్షన్ ను ఇచ్చి, నలువైపుల కల దేశ-విదేశములలో అన్నివైపుల కల గ్రూపులను ఎదురుగా తీసుకురావాలి. అందరూ చేస్తూ ఉండి ఉండవచ్చు, కానీ ఎదురుగా తీసుకురావాలి మరియు ఆ గ్రూపు ద్వారా మీ సేవ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే సంగటనలోకి రావటంద్వారా వారికి బలము లభిస్తుంది. ఫ్యామిలీ మెంబర్ గా అనుభవము చేస్తూ ఉంటారు మరియు తోడుతోడుగా మనసా సేవ గురించి విశేషంగా పరస్పరంలో గ్రూపులుగా తయారుచేసి, ఒకటేమో స్పష్టము చెయ్యాలి మరియు ఇంకొకటి, ఆ గ్రూప్ సమయానుసారంగా కలిసి మనసా సేవ యొక్క వృత్తిని గురించి ప్లాన్ తయారుచెయ్యాలి. రిజల్ట్ ను వెలువరించాలి. ఎందుకంటే సమయ ప్రమాణంగా, పరిస్థితుల ప్రమాణంగా ఇప్పుడు మనసా సేవకు చాలాచాలా ఆవశ్యకత ఉంటుంది. మీరుకూడా భిన్న-భిన్న వర్గాలను తయారుచేసారు, కానీ ప్రతి వర్గమునకు అటువంటి సహయోగ గ్రూపు తయారవ్వాలి, ఇప్పటివరకు ఏమేమి సేవలు చేసారు, ఎంతమందిలో పరివర్తన తెచ్చారు, ప్రాక్టికల్ రిజల్టు ఏం వెలువడింది - అన్నదానిని ప్రతి వర్గమువారు ఆ గవర్నమెంట్ ముందుకు తీసుకురావాలి. ఏ సేవలు జరిగినా వాటిని గవర్నమంట్ కు ఇచ్చినట్లయితే, గవర్నమెంట్ వారు గ్రూప్ రిజల్టును చూసి మీరు ఈ కార్యములో సహయోగులుగా అవ్వండి అని మీకు ఆఫర్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ముందు ప్రాక్టికల్ రాలేదు, సేవలైతే చాలా చేస్తున్నారు, కానీ అందరి కళ్లు తెరుచుకోవాలి, బ్రహ్మాకుమారీలు ఈ ఈ సేవల పరిణామాలను తీసుకుని గవర్నమెంట్ ముందుకు వచ్చారు అని టి.వి.లో, న్యూస్ పేపర్స్ లో రావాలి. కనుక ప్రాక్టికల్ పరిణామాన్ని తీసుకువచ్చి చూపించండి. ఈ చిన్న - చిన్న విఘ్నాలన్నీ సమాప్తమైపోతాయి. ఇది ధార్మిక సంస్థ అని ఇప్పటివరకు అనుకునేవారు, కానీ ఇది సోషల్ కూడా, ఎడ్యుకేషనల్ కూడా మరియు అన్ని వర్గాలకు నిమిత్తమైనది కూడా, మొత్తము సృష్టిలోని భిన్న-భిన్న వర్గాలను పరివర్తన చేసేది, ఇంతమందిలో త్రాగుడును మాన్పించారు, హెల్త్ మేళ చేస్తారు, గవర్నమెంట్ ముందు ఏ రిజల్టు ఉంది? ఇక్కడ రిపోర్ట్ ను ముద్రించి ఒక సమాచారాన్ని పంపించినంత మాత్రాన తెలియదు. ప్రాక్టికల్స్ సబ్జక్టుకి వచ్చే ప్లాన్ ను తయారుచెయ్యండి. ఫంక్షన్లు చెయ్యండి, ప్రదర్శనలను చెయ్యండి, అన్నీ బాగా చెయ్యండి కానీ వాటి రిజల్టు అందరి దృష్టిలోకి రావాలి. ఎంతగా మీ సేవ ఉంటుందో, ఎంత రిజల్టు ఉంటుందో దాని అనుసారంగా ఇతర సంస్థలు ఇంత సేవ చెయ్యరు. భిన్నభిన్న వర్గాలలో, భిన్నభిన్న ఊర్లల్లో, ఖర్చు లేకుండా హృదయపూర్వకంగా, స్నేహముతో సేవ చేస్తారు కానీ అది గుప్తము. అర్థమైందా. తెలివైనవారుగా ఉన్నారు. కనుకనే మీటింగ్ లోకి వస్తారు. అచ్ఛా.
Comments
Post a Comment