09-01-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
వ్యర్ధం వదిలి సమర్ధ సంకల్పంలో ఉండండి.
సర్వ ఖజానాలను నింపేవారు, పదమాపదమ్ భాగ్యశాలిగా తయారు చేసే శివబాబా చెప్తున్నారు-
ఈరోజు బాప్ దాదా తన యొక్క గారాభమైన పిల్లలందరినీ కలుసుకునేటందుకు విశేషంగా వచ్చారు. డబల్ విదేశీ పిల్లలు బాబాని కలుసుకోవడానికి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. అందువలన బాప్ దాదా ఈరోజు డబల్ విదేశీ పిల్లలలో ఒక్కొక్క విశేషతను మననం చేస్తూ వచ్చారు. ఒక్కొక్క స్థానానికి వాటి వాటి విశేషత ఉంటుంది. ఎక్కడైనా సరే సంఖ్య ఎక్కువైనా కానీ, తక్కువైనా కానీ అమూల్య రత్నాలే. విశేష రత్నాలను కొద్దిగా ఎన్నుకున్నా సరే వారి యొక్క ఎంతో శ్రేష్ట పాత్రను వారు చేస్తారు. అటువంటి పిల్లల యొక్క ఉల్లాస ఉత్సాహాలను సేవను చూసి బాప్ దాదా హర్షితం అయ్యారు. విదేశాలలో నలువైపులా అన్ని మూలలా తండ్రిని ప్రత్యక్షం చేయటానికి ప్లాన్ వేసి దానిని ఆచరణలో పెట్టి విశేషరూపంలో సఫలత పొందారు. సర్వధర్మాలకు చెందిన ఆత్మలను తండ్రితో మిలనం చేయటానికి బాగా ప్రయత్నిస్తున్నారు. సేవపై సంలగ్నత కూడా ఉంది. భ్రమించే ఆత్మలుగా ఉండే మీకు గమ్యం లభించిన కారణంగా ఇతరాత్మల పట్ల కూడా దయ వస్తుంది. దూరదూరాల నుండి వచ్చిన వారికి ఒకే ఉల్లాసం ఉంది - వెళ్ళాలి మరియు అందరినీ తీసుకురావాలి అని. ఈ దృఢ సంకల్పం పిల్లలందరూ దూరంగా ఉన్నా కానీ సమీపంగా ఉన్నట్లు అనుభవం చేయిస్తుంది. అందువలన సదా మిమ్మల్ని మీరు బాప్ దాదా యొక్క వారసత్వానికి అధికారి ఆత్మగా భావించి నడుస్తున్నారా? ఎప్పుడు ఏ వ్యర్ధ సంకల్పం ఆధారంగా మీకు మీరు అలజడిలోకి రాకండి. కల్పకల్పానికి పాత్రులు మీరు, మంచిది. ఈరోజు పార్టీలతో కలుసుకోవాలి. అమెరికా వారు అందరూ కలిసి సేవలో అందరికంటే మొదటి నెంబర్ అద్భుతం చూపిస్తారు కదా! ఇప్పుడు బాప్ దాదా చూస్తారు. ఈ సమ్మేళనంలో అందరికంటే పెద్ద గొప్ప వ్యక్తిని ఎవరు తీసుకువస్తారో మొదటి నెంబర్ గొప్పవ్యక్తి (వి.ఐ.పి) ఎక్కడ నుండి వస్తారు? (అమెరికా నుండి). మీరు బాబా పిల్లలు చాలా గొప్ప ఆత్మలు (వి.వి.ఐ.పి) మీ కంటే గొప్పవారు ఎవరూ లేరు. కానీ ప్రపంచంలోని గొప్పవారికి సందేశం ఇవ్వటానికి ఇది అవకాశం. వారి భాగ్యం తయారు చేయటానికి ఈ పురుషార్థం చేయవలసి వస్తుంది. ఎందుకంటే వారు తమని తాము ఈ పాత ప్రపంచంలో గొప్పవారిగా భావిస్తున్నారు. చిన్న చిన్న కార్యక్రమాలకి రావటం, వారు తమ గౌరవంగా భావించరు. అందువలన పెద్ద కార్యక్రమాలలో పెద్దవారిని పిలిచే అవకాశం ఉంది. అలాగే బాప్ దాదా కూడా పిల్లలతోనే కలుసుకుంటారు మరియు ఆత్మిక సంభాషణ చేస్తారు. వచ్చేది కూడా విశేషంగా పిల్లల కోసమే. వారు సాకులు చెప్పకూడదు మాకు సరైన ఆహ్వానం రాలేదని, దానిని పూర్తి చేయటానికి కార్యక్రమాలు పెట్టవలసి వస్తుంది. బాప్ దాదాకు పిల్లలంటే ప్రీతి. పిల్లలకి బాప్ దాదా అంటే ప్రీతి.
డబల్ విదేశీయులందరూ తనువు ద్వారా మరియు మనస్సు ద్వారా సంతుష్టంగా ఉన్నారా? కొంచెం కూడా ఎవరికీ ఏ సంకల్పం లేదు కదా! తనువు యొక్క, మనస్సు యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయా? శరీరం రోగంగా ఉంటే మనస్సు అలజడి అవ్వకూడదు. సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటే శరీరం కూడా బాగుగా ఉంటుంది. మానసిక సంతోషంతో శరీరాన్ని కూడా నడిపించాలి. అప్పుడు రెండు వ్యాయామాలు జరుగుతాయి. సంతోషమనే ఆశీర్వాదాలు మరియు వ్యాయామం అనే మందు. ఆశీర్వాదాలు మరియు మందు రెండూ ఉంటే అన్నీ సహజమైపోతాయి. (ఒకరు అన్నారు రాత్రి నిద్ర పట్టటం లేదు అని) నిద్రపోయే ముందు యోగంలో కూర్చోండి. అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. యోగంలో కూర్చున్న సమయంలో బాప్ దాదా యొక్క గుణగానం చేయండి. ఆ సంతోషంతో బాధను మర్చిపోతారు. సంతోషం లేకుండా కేవలం నేను ఆత్మను అని ప్రయత్నం చేస్తే ఆ శ్రమలో బాధ అనిపిస్తుంది. సంతోషంగా ఉండండి. బాధను కూడా మరిచిపోతారు.
ఏ విషయంలోనైనా ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే లేక చిన్న విషయంలో తొందరగా అలజడి అయిపోతే ఆ చిన్న చిన్న విషయాలను వెంటనే స్పష్టం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఎక్కువగా ఆలోచించే అభ్యాసిగా అవ్వకండి. ఏది ఆలోచించినా అది అక్కడే సమాప్తి చేయండి. ఒకటి ఆలోచించిన తర్వాత అనేకం ఆలోచిస్తే దాని ద్వారా స్థితి పైన, శరీరం పైన కూడా ప్రభావం పడుతుంది. అందువలన డబల్ విదేశీ పిల్లలు ఆలోచించే విషయంలో డబల్ ధ్యాస పెట్టుకోవాలి. ఎందుకంటే ఒంటరిగా ఉండి ఆలోచించే సహజ అభ్యాసకులు కదా! ఆ అభ్యాసం ఉంది. అందువల్లనే ఇక్కడ కూడా చిన్న చిన్న విషయాలలో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించటం వలన సమయం వ్యర్ధమైపోతుంది. మరలా సంతోషం కూడా మాయమైపోతుంది. దాని ద్వారా శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. అందువలన మరలా ఆలోచనలు నడుస్తాయి. అందువలన తనువు మరియు మనస్సు రెండింటిని సదా సంతోషంగా ఉంచుకునేటందుకు తక్కువ ఆలోచించండి. ఆలోచించాలంటే జ్ఞానరత్నాలనే ఆలోచించండి. వ్యర్ధ సంకల్పాలకి బదులుగా ప్రతీ విషయంలో సమర్ధ సంకల్పాలు చేయండి. మీ స్థితి లేదా యోగం గురించి వ్యర్థసంకల్పాలు నడవటం అంటే నా పాత్ర ఇంతే ఉంది, యోగం కుదరటం లేదు, అశరీరిగా కాలేకపోతున్నాను. ఇవి వ్యర్ధ సంకల్పాలు. వాటికి బదులుగా సమర్ధ సంకల్పాలు చేయండి. స్మృతి అనేది నా స్వధర్మం అని భావించండి. పిల్లల యొక్క ధర్మమే తండ్రిని జ్ఞాపకం చేయటం. ఎందుకు అవ్వదు? తప్పక అవుతుంది? నేను యోగిగా కాకపోతే ఎవరు అవుతారు? నేనే కల్పకల్పంలో సహయోగిని. వ్యర్ధ సంకల్పాలకు బదులుగా ఇలా సమర్ధ సంకల్పాలు చేయండి. ఈ అంతిమ జన్మలో బాబా తనవారిగా చేసుకున్నారు. అద్భుతం కదా! ఈ అంతిమ శరీరాన్ని బలిహారం చేయాలి. ఈ పాత శరీరం ద్వారానే జన్మజన్మల వారసత్వం తీసుకుంటున్నాము. మనస్సుని బలహీనంగా చేసుకునే సంకల్పాలు చేయకండి. సంతోషం యొక్క సంకల్పాలు చేయండి. ఓహో! నా పాత శరీరం. ఇది బాబాను కలుసుకోవటానికి నిమిత్తం అయ్యిందని ఓహో! ఓహో! అని అనుకుంటూ ఉండండి. ఎలాగయితే గుర్రాన్ని ప్రేమతో చేతితో నిమిరితే చాలా బాగా నడుస్తుంది. మాటిమాటికీ కొడుతుంటే ఇంకా గొడవ చేస్తుంది. అలాగే ఈ శరీరం కూడా మీరు మాటిమాటికీ ఇది పాతది, పనికిరాని శరీరం అని అనుకుంటూ ఉంటే దానికి కొట్టినట్లుంటుంది. చాలా సంతోషంతో దీని పాటలు పాడుకుంటూ ముందుకు వెళ్ళండి. అప్పుడు ఈ పాత శరీరం ఎప్పుడూ అలజడి చేయదు. చాలా సహయోగం ఇస్తుంది. (ఒకరు అన్నారు - ప్రతిజ్ఞ చేసి వెళ్తున్నాం అయినా కానీ మాయ వస్తుంది). మాయతో ఎందుకు భయపడుతున్నారు? మాయ మీకు పాఠం చదివించటానికి వస్తుంది. భయపడకండి, పాఠం చదువుకోండి. ఒకసారి సహనశీలత పాఠం, ఒకసారి ఫకీరు స్థితిలో స్థితులయ్యే పాఠం చదివిస్తుంది. ఒకసారి శాంతి స్వరూపంగా అయ్యే పాఠం పక్కా చేయటానికి వస్తుంది. అందువలన మాయని ఆ రూపంతో చూడకండి. మాయ వస్తుంది అని భయపడిపోతున్నారు. కానీ మాయ కూడా మన సహయోగిగా అయ్యి బాబా ద్వారా చదువుకున్న పాఠాన్ని పక్కాగా చేయించటానికి వస్తుంది అని భావించండి. మాయని సహయోగి రూపంలో భావించండి. శత్రువుగా కాదు. పాఠం పక్కా చేయించటానికి సహయోగి అవుతుంది. అప్పుడు మీ ధ్యాస మొత్తం ఆ విషయంలో వెళ్ళిపోతుంది. అప్పుడు భయం తక్కువైపోతుంది. ఓడిపోరు. పాఠం పక్కా చేసుకుని అంగదుని సమానంగా అయిపోతారు. అందువలన మాయతో భయపడకండి. చిన్న పిల్లలని భయపెట్టటానికి తల్లి తండ్రి బూచి వస్తుంది అంటారు కదా! అలాగే అందరూ కూడా మాయని బూచిగా తయారుచేస్తారు. అలాగే మాయ కూడా మీ దగ్గరకు రావటానికి భయపడుతుంది. కానీ మీరు బలహీనం అయిపోయి మాయని ఆహ్వాస్తున్నారు. లేకపోతే అది రానే రాదు. మాయ వీడ్కోలు కోసం ఆగి ఉంది. అది ఎదురు చూస్తుంది నా అంతిమ తారీఖు ఏదని, ఇప్పుడు మాయకి వీడ్కోలు ఇస్తారా లేక భయపడతారా?
డబల్ విదేశీయులకి ఒక విశేషత ఉంటుంది. ఎగరటం కూడా చాలా వేగంగా ఎగురుతారు. కానీ చిన్న ఈగకి కూడా భయపడిపోతారు. ఒకరోజు చాలా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు, రెండవరోజు మరలా ముఖం మారిపోతుంది. ఈ సంస్కారాన్ని మార్చుకోండి. దీనికి కారణం ఏమిటి? ఈ కారణాలు అన్నింటికీ పునాది - సహనశక్తి యొక్క లోపం. సహించే సంస్కారం మొదటి నుండీ లేదు. అందువలన తొందరగా భయపడిపోతారు. స్థానం మార్చేస్తారు. లేదా గొడవపడిన వారిని మార్చేస్తారు కానీ తమని మార్చుకోరు. ఈ సంస్కారాన్ని మార్చుకోవాలి. నేను మారాలి అనుకోవాలి. స్థానాన్ని లేదా ఇతరులను మార్చకోవటం కాదు. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఇది ఎక్కువగా స్మృతిలో ఉంచుకోండి. అర్ధమైందా? ఇప్పుడు విదేశీ నుండి స్వదేశీ సంస్కారాన్ని తయారు చేసుకోండి. సహనశీలతా అవతారంగా అవ్వండి. దీనినే మీరు అంటారు స్వయాన్ని సర్దుకోవాలి (ఎడ్జస్ట్ అవ్వాలి) అని. వేరుగా అయిపోకూడదు. వదిలేయకూడదు. హంస మరియు కొంగ విషయం వేరు. వాటికి పరస్పరం పడదు. అయినా కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు వారి పట్ల శుభ భావనతో ప్రయత్నం చేయటం మీ కర్తవ్యం. కొంతమంది పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. కానీ శుభభావన వల్ల నిమిత్తమైనవారి కన్నా పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు. అందువలన శుభ భావనతో ఫుల్ ఫోర్సుగా ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆవిధంగా అవ్వలేకపోతే ఎవరి సలహా అయినా తీసుకుని అడుగు వేయండి. ఎందువలన అనగా చాలా సమయాలలో ఈవిధమైన హద్దులో ఉండటం వల్ల అకళ్యాణం అవుతుంది. ఇలా కూడా జరుగుతుంది - బ్రాహ్మణాత్మల లోపం కారణంగా ఇతరాత్మలు కూడా భాగ్యం తీసుకోవటం నుండి వంచితులవుతారు. అందువలన మొదట స్వయం ప్రయత్నం చేసి చూడండి. ఒకవేళ అది పెద్ద సమస్య అని భావించినట్లయితే నిమిత్త ఆత్మలతో పరిశీలన చేయించుకోండి. ఒకవేళ వారు కూడా వేరు అయిపోవటమే మంచిది అంటే దాని యొక్క బాధ్యత మీకు ఉండదు. మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఆవేశంలో వదిలి పెట్టేశారు కానీ పొరపాటు కారణంగా ఆ ఆత్మ ఆకర్షిస్తూ ఉంటుంది. అటువైపు బుద్ధి వెళ్తూ ఉంటుంది. తనువు ద్వారా వేరయ్యారు. కానీ మనస్సు అటువైపు ఉండటం వల్ల అటువైపే ఆలోచిస్తూ ఉంటారు. అందువలన నిమిత్తమైన ఆత్మలతో పరిశీలన చేయించుకోండి. ఎందువలన అంటే అది కర్మల యొక్క గుహ్యగతి. బలవంతంగా వచ్చేసినా సరే మనస్సు మాటిమాటికీ అటువైపే వెళ్తుంది. కర్మల యొక్క రహస్యాన్ని జ్ఞాన స్వరూపంతో తెలుసుకుని తర్వాత పరిశీలన చేయించుకోండి. తర్వాత కర్మ బంధనను కూడా జ్ఞానయుక్తంగా సమాప్తి చేసుకోండి. బ్రాహ్మణాత్మలలో కూడా విశేషతల కారణంగా ఈర్ష్య ఉత్పన్నం అవుతుంది. ఈర్ష్య కారణంగా సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. దీనిలో విశేష విషయం ఆలోచించాలి. విశేషతలున్నాయి కానీ నిమిత్తం చేసింది ఎవరు? వారిని చూడకండి. ఫలానావారిది ఈ బాధ్యత. ఫలానా టీచర్ నెంబర్ వన్ సేవాధారి అని. కానీ ఇది ఆలోచించండి - ఆ ఆత్మను నిమిత్తంగా చేసినవారు ఎవరు? ఇలా ఎప్పుడైతే మధ్యలో బాబా ఉంటారో అప్పుడు మాయ పారిపోతుంది. ఈర్ష్య పారిపోతుంది. అంటారు కదా ఉంటే బాబా ఉంటారు లేకపోతే పాపం ఉంటుంది. ఈర్ష్య కూడా పాప కర్మ కదా! బాబా నిమిత్తం చేసారు అని భావిస్తే, బాబా ఏదైతే చేయిస్తారో దానిలో కళ్యాణం నిండి ఉంది. ఒకవేళ వారు మంచి విషయం చేయకపోయినా తప్పు చేస్తున్నా, ఎందుకంటే అందరూ పురుషార్థులే! అందువలన వారు తప్పు చేస్తున్నా కానీ శుభ భావనతో ఉండాలి. ఈర్ష్యకు వశం కాకూడదు. కానీ బాబా సేవయే మా సేవ అనే శుభ భావనతో శ్రేష్ట బాధ్యతను ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత స్వయం నిశ్చింత అయిపోండి. మరలా వీరికి ఇచ్చాను ఏమవుతుందో, ఏమి అవ్వదు కదా అని ఆలోచించకండి. అయినా కాకపోయినా అది పెద్దవారి బాధ్యత. మీరు శుభ భావనతో ఇచ్చారు. మీ పని మిమ్మల్ని ఖాళీ చేసుకోవటం. అది పెద్దవారి ధ్యాసలోకి రాలేదు అనుకోండి. అప్పుడ రెండవసారి రాయండి. కానీ సేవాభావంతో నిమిత్తంగా అయినవారు ఈ విషయాలను వదిలేయండి. అంటే మీ సంకల్పాలను మరియు సమయాన్ని వ్యర్ధం చేసుకోకండి. ఈర్ష్య పడకండి. కానీ ఎవరి పని? మరియు ఎవరు నిమిత్తంగా చేసారో అది జ్ఞాపకం ఉంచుకోండి. ఏ విశేషత కారణంగా వారిని విశేషంగా తయారుచేసారో ఆ విశేషతలు మీలో ధారణ చేయండి. అప్పుడు పరుగు పెడతారు. ఈర్ష్య ఉండదు.
ఎప్పుడూ తలక్రిందులు (అప్ సెట్) అవ్వకూడదు. ఎవరైనా ఏదైనా అంటే వారిని అడగాలి - మీరు ఏ భావనతో అన్నారు అని. ఒకవేళ వారు స్పష్టం చేయకపోతే నిమిత్తమైన వారిని అడగాలి. దీనిలో నా పొరపాటు ఏమిటి అని. మరలా మీరు పరిశీలన చేసుకుని నిశ్చింత అయిపోండి. ఒక విషయం అందరూ అర్ధం చేసుకోండి. బ్రాహ్మణాత్మల ద్వారా ఇక్కడే కర్మలఖాతా పూర్తవుతుంది. ధర్మరాజపురి నుండి రక్షించుకునేందుకు అక్కడక్కడా బ్రాహ్మణులు నిమిత్తం అవుతారు. అందువలన బ్రాహ్మణ పరివారంలో ఇలా జరుగుతుంది ఏమిటి? అని భయపడకండి. బ్రాహ్మణుల కర్మలఖాతా బ్రాహ్మణుల ద్వారానే పూర్తి అవుతుంది. అందువలన కర్మలఖాతా పూర్తి అయిపోతుందని సంతోషంలో ఉండండి. అప్పుడే ఉన్నతి జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేయండి - "చిన్న చిన్న విషయాలలో అయోమయం అవ్వము. సమస్యగా అవ్వము. కానీ సమస్యను పరిష్కరించేవారిగా అవుతామని" అర్ధమైందా?
Comments
Post a Comment