07-12-1983 అవ్యక్త మురళి

07-12-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శ్రేష్ఠ పదవి యొక్క ప్రాప్తికి ఆధారము - ''మురళి''

మురళీధరుడైన బాబా ఈరోజు, మురళీధరుడైన బాబాపై ఎంత స్నేహము ఉంది మరియు మురళిపై ఎంత స్నేహము ఉంది అని తమ మురళీపై స్నేహము ఉన్న పిల్లలను చూస్తున్నారు. మురళి వింటూ మగ్నమైపోతారు, తమ దేహముపై ధ్యాసను మర్చిపోయి దేహీలుగా అయ్యి విదేహీ తండ్రినుండి వింటారు. దేహధారుల స్మృతియొక్క ధ్యాస ఏమాత్రమూ ఉండదు, ఈ విధిద్వారా అమితానందులై సంతోషముతో నాట్యము చేస్తారు. స్వయమును భాగ్యవిధాత అయిన బాబా సమ్ముఖములో ఉంచుకుంటూ పదమాపదమ భాగ్యవంతులుగా భావించి ఆత్మికనషాలో ఉంటారు. ఈ ఆత్మిక నషా, మురళీధరుని మురళిపై నషా ఎంతెంతగా ఎక్కుతూ ఉంటుందో అంతగానే స్వయమును ఈ ధరణినుండి మరియు దేహమునుండి పైన ఉన్నట్లుగా, ఎగురుతున్నట్లుగా అనుభవము చేస్తారు. మురళీ రాగముతో అనగా మురళి వాయిద్యముతో మరియు అందులోని నిగూఢమైన రహస్యములతో మురళీధరుడైన బాబాతోటి అనేక అనుభవాలతో నడుస్తుటాంరు. ఒక్కోసారి మూలవతనము, ఒక్కోసారి సూక్ష్మవతనములోకి వెళ్ళిపోతారు, ఒక్కోసారి తమ రాజ్యములోకి పోతారు. ఒక్కోసారి లైట్ హౌస్, మైట్హౌస్గా అయ్యి దుఃఖ, అశాంతమయమైన ఈ ప్రపంచములోని ఆత్మలకు సుఖ-శాంతుల కిరణాలను ఇస్తూ, ప్రతిరోజు మూడు లోకాల షికారు చేస్తారు. ఎవరితోటి? మురళీధరుడైన బాబాతోటి. మురళిని వింటూ-వింటూ అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతారు. మురళీధరుని మురళి రాగమునుండి అవినాశీ వరదానాల ఔషధం లభించటంతోనే తనువు ఆరోగ్యంగా, మనసు ఆరోగ్యంగా అయిపోతాయి. అమితానందములో తేలియాడుతూ చింతలేని చక్రవర్తులుగా అవుతారు, నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. స్వరాజ్య అధికారులుగా అవుతారు. మురళిపై ఇటువంటి విధిపూర్వక స్నేహము ఉన్న పిల్లలను చూస్తున్నారు. ఒకటే మురళిద్వారా కొందరు రాజులుగా, కొందరు ప్రజలుగా అవుతారు ఎందుకంటే విధిద్వారా సిద్ధి కలుగుతుంది, ఎవరు ఎంత విధిపూర్వకంగా వింటారో అంతగానే సిద్ధి స్వరూపులుగా అవుతారు.

ఒకరేమో విధిపూర్వకంగా వినేవారు అనగా ఇముడ్చుకునేవారు రెండవవారు నియమపూర్వకంగా వినేవారు, కొంత ఇముడ్చుకునేవారు, కొంత వర్ణన చేసేవారు. మూడవవారి విషయమే లేదు. యధార్థ విధిపూర్వకంగా వినేవారు మరియు ఇముడ్చుకునే స్వరూపులుగా అవుతారు. వారి ప్రతి కర్మ మురళీ స్వరూపంగా ఉంటుంది. నేను ఏ నంబర్లో ఉన్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మొదిద్లాటోంనా లేక రెండవద్లాటోంనా? మురళీధురడైన బాబాపై గౌరవము అనగా మురళిలోని ఒక్కొక్క మాటపై గౌరవము. ఒక్కొక్క వరదానము (మహావాక్యము) 2500 సంవత్సరాల సంపాదనకు ఆధారము, పదమాల సంపాదనకు ఆధారము. ఆ లెక్క ప్రకారం ఒక్క వరదానము మిస్ అయిందంటే పదమాల సంపాదన మిస్ అయినట్లు. ఒక్క వరదానము ఖజానాల గనిగా తయారుచేస్తుంది. మురళీలోని ప్రతి మాటను ఇలా విధిపూర్వకంగా వినేవారు మరియు దానినుండి ప్రాప్తించే సిద్ధియొక్క జమాఖర్చుల గతిని తెలుసుకునేవారు శ్రేష్ఠ గతిని ప్రాప్తింపచేసుకుంటారు. కర్మల గతి ఏవిధంగా గుహ్యమైనదో అలా విధిపూర్వకంగా మురళిని విని ఇముడ్చుకునే గతికూడా అతి శ్రేష్ఠమైనది. మురళియే బ్రాహ్మణ జీవితమునకు శ్వాస. శ్వాస లేనట్లయితే జీవితము లేదు - అటువంటి అనుభవీ ఆత్మలు కదా! ఈ మహత్వపూర్వకమైన మురళిని ఈరోజు విధిపూర్వకంగా విన్నానా అని మిమ్మల్ని మీరు ప్రతిరోజూ చెక్ చేసుకోండి. అమృతవేళలోని ఈ విధి మొత్తము రోజులోని ప్రతి కర్మలో సిద్ధి స్వరూపులుగా స్వతహాగా మరియు సహజంగా తయారుచేస్తుంది. అర్థమైందా!

కొత్త-కొత్తవారు వచ్చారు కదా! అందుకని లాస్ట్నుండి ఫస్ట్కు వెళ్ళే విధిని వినిపిస్తున్నాము. దీనివలన ఫాస్ట్గా వెళ్తారు. ఈ విధిద్వారా అతి వేగంగా పరుగెత్తి సమయపు దూరాన్ని తగ్గించగలరు. సాధనాన్నైతే బాప్దాదా వినిపిస్తారు, దీనివలన, చివరిలో ఎందుకు వచ్చాము లేక ఎందుకు పిలిచారు... అని ఏ పిల్లల ఫిర్యాదూ ఉండదు. కానీ ముందుకు పోగలరు, ముందుకు పోండి, శ్రేష్ఠ విధిద్వారా శ్రేష్ఠ నంబర్ను తీసుకోండి. ఫిర్యాదులైతే ఉండవు కదా! రిఫైన్ దారిని తెలుపుతున్నారు. అంతా తయారైయున్న సమయములో వచ్చారు. వచ్చిన వెన్నను తినే సమయములో వచ్చారు. ఒక శ్రమనుండైతే ముందునుండే ముక్తులయ్యారు. ఇప్పుడు కేవలము తినండి మరియు అరిగించుకోండి. సహజము కదా! అచ్ఛా!

ఇటువంటి సర్వ విధి సంపన్నులు, సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకునేవారు, మురళీధరుని మురళిద్వారా దేహ ధ్యాసను మర్చిపోయేవారు, సంతోషపు ఊయలలో ఊగేవారు, ఆత్మిక నషాలో అమితానందమును పొందే యోగులుగా అయినవారు, మురళీధరునిపై మరియు మురళిపై గౌరవమును ఉంచేవారు అయిన ఇటువంటి మురళీధరులు, మురళి మరియు మురళీధర స్వరూప పిల్లలకు, బాప్దాదాయొక్క సాకారీ మరియు ఆకారీలైన రెండురకాల పిల్లలకు స్నేహ సంపన్నమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్దాదా మిలనము...

1. సదా ఒక్క బాబా స్మృతిలో ఉండే, ఏకరస స్థితిలో స్థితులై ఉండే శ్రేష్ఠ ఆత్మలే కదా! ఎల్లప్పుడూ ఏకరస ఆత్మలా లేక మరే ఇతర రసమైనా తనవైపుకు లాగుతుందా? ఏదైనా ఇతర రసము తనవైపుకు లాగటమైతే లేదు కదా? మీకందరికీ అయితే ఉన్నదే ఒక్కరు. ఒక్కరిలోనే అన్నీ ఇమిడియున్నాయి. ఉన్నదే ఒక్కరైనప్పుడు, ఇతరులెవ్వరూ ఉండరు, మరి ఇక వెళ్ళేది ఎక్కడకు? పెదనాన్న, మామయ్య, బాబాయిలైతే లేరు కదా! మీరందరూ ఏమని ప్రమాణము చేసారు? సమస్తమూ మీరే అని ప్రమాణము చేసారు కదా! కుమారీలు దృఢ ప్రతిజ్ఞ చేసారా? దృఢ ప్రతిజ్ఞ చేసారు మరియు వరమాల మెడలో పడింది. ప్రతిజ్ఞ చేసారు, వరుడు లభించాడు. వరుడుకూడా లభించాడు మరియు ఇల్లుకూడా లభించింది కనుక వరుడు మరియు ఇల్లు రెండూ లభించేసాయి. కుమారీల గురించి తల్లిదండ్రులు ఏమని ఆలోచించవలసివస్తుంది! వరుడు మరియు ఇల్లు మంచివి లభించాలి అని అనుకుంటారు. మీకు ఎటువంటి వరుడు లభించాడంటే జగమంతా అతనిని మహిమ చేస్తుంది. ఇల్లుకూడా ఎటువంటిది లభించిందంటే అక్కడ ఏ వస్తువుకూ అప్రాప్తి అన్న మాటే ఉండదు. మరి పరిపూర్ణమైన వరమాలను ధరించారా? ఇటువంటి కుమారీలనే వివేకవంతులు అని అంటారు. కుమారీలు ఉన్నదే వివేకవంతులుగా. కుమారీలను చూసి బాప్దాదాకు సంతోషము కలుగుతుంది ఎందుకంటే రక్షింపబడ్డారు. ఎవరైనా పడిపోకుండా రక్షింపబడితే సంతోషము కలుగుతుంది కదా! మాతలు ఎవరైతే పడిపోయారో వారిగురించి పడిపోయినవారిని రక్షించాము అని అంటారు, కానీ కుమారీలైతే పడిపోవటమునుండి రక్షింపబడ్డారు. కనుక మీరెంత అదృష్టవంతులు! మాతల అదృష్టము మాతలది, కుమారీల అదృష్టము కుమారీలది. మాతలుకూడా అదృష్టవంతులు, ఎందుకంటే అలా అయినాగానీ వారు గోపాలుని గోవులుగా అయ్యారు.

2. సదా మాయాజీతులుగా ఉన్నారా? ఎవరైతే మాయాజీతులుగా ఉంటారో వారికి విశ్వ కల్యాణకారులము అన్న నషా తప్పకుండా ఉంటుంది. అటువంటి నషా ఉంటుందా? బేహద్ సేవ అనగా విశ్వ సేవ. మేము అనంతమైన యజమానికి బాలకులము అన్న ఈ స్మృతి సదా ఉండాలి. ఎలా అయ్యాము, ఏం లభించింది అన్న ఈ స్మృతి ఉంటుందా! ఇంతే, ఈ సంతోషములో సదా ముందుకు పోతూ ఉండండి, ఉన్నతి చెందేవారిని చూసి బాప్దాదా హర్షితులవుతారు.

సదా బాబా స్మృతి అనే మస్తీలో (ఆనందములో) మస్త్గా (అమితానందులై) ఉండండి. ఈశ్వరీయ మస్తీ ఎలా తయారుచేస్తుంది? భూ నివాసులనుండి ఒక్కసారిగా ఆకాశ (స్వర్గ) వాసులుగా చేసేస్తుంది. మరి ఎల్లప్పుడూ ఆకాశములో ఉంటారా లేక భూమిపై ఉంటారా ఎందుకంటే ఉన్నతోన్నతమైన బాబాకు పిల్లలుగా అయ్యారు, మరి క్రింద ఎలా ఉంటారు! భూమి అయితే క్రింద ఉంది. ఆకాశము పైన ఉంది, మరి కిందకు ఎలా వస్తారు! ఎప్పుడూ మీ బుద్ధిరూపీ పాదము భూమిపై ఉండకూడదు, పైన ఉండాలి. వీరినే ఉన్నతోన్నతమైన బాబాయొక్క ఉన్నతమైన పిల్లలు అని అంటారు. ఈ నషా ఉండాలి. సదా అచల్అడోల్గా ఉంటూ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండండి. కొంచెమైనా మాయలోకి వచ్చి కిందమీద అయినట్లయితే సర్వ ఖజానాల అనుభవము ఉండదు. బాబాద్వారా ఎన్ని ఖజానాలు లఙభించాయి, ఆ ఖజానాలను ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచుకునేందుకు సాధనము - సదా అచల్అడోల్గా(స్థిరంగా-దృఢంగా) ఉండండి. అచలంగా ఉండటం వలన ఎల్లప్పుడూ సంతోషపు అనుభూతి కలుగుతూ ఉంటుంది. వినాశీ ధనం గురించికూడా సంతోషము ఉంటుంది కదా! వినాశీ నేత యొక్క కుర్చీ లభించినా, పేరు-గౌరవం లభించినా ఎంత సంతోషము ఉంటుంది! ఇదైతే అవినాశీ సంతోషము. ఎవరైతే అచల్అడోల్గా ఉంటారో వారికే ఈ సంతోషము ఉంటుంది.

బ్రాహ్మణులందరికీ స్వరాజ్యము ప్రాప్తించింది. మొదట బానిసలుగా ఉండేవారు, నేను బానిసను, నేను బానిసను....... అని పాడేవారు, ఇప్పుడు స్వరాజ్యధారులుగా అయ్యారు. బానిసలనుండి రాజులుగా అయ్యారు. ఎంత తేడా ఉంది! రాత్రి-పగలుకు ఉన్న అంతరము ఉంది కదా! బాబాను స్మృతి చెయ్యటము మరియు బానిసలనుండి రాజులుగా అవ్వటము. ఇటువంటి రాజ్యము మొత్తము కల్పములో మరెప్పుడూ ప్రాప్తించజాలదు. ఈ స్వరాజ్యముద్వారా విశ్వ రాజ్యము లభిస్తుంది. కనుక ఇప్పుడు మేము స్వరాజ్య అధికారులము అన్న ఈ నషాలో ఎల్లప్పుడూ ఉన్నట్లయితే ఈ కర్మేంద్రియాలు స్వతహాగనే శ్రేష్ఠ మార్గములో నడుస్తాయి. పొందాల్సినదేదో పొందాము... ఎటువంటివారము ఎలా తయారయ్యాము... ఎక్కడ ఉండేవాళ్ళము మరియు ఎక్కడకు చేరుకున్నాము... అని సదా ఈ సంతోషములో ఉండండి.

అవ్యక్త బాప్దాదాల మహావాక్యాలనుండి ఎన్నుకోబడిన ప్రశ్నోత్తరాలు

ప్రశ్న - పురుషార్థముయొక్క అంతిమ లక్ష్యము ఏంటి? దేనిపై విశేష అటెన్షన్ పెట్టుకోవాలి?

జవాబు - అవ్యక్త ఫరిస్తాగా అయ్యి ఉండటము - ఇదే పురుషార్థముయొక్క అంతిమ లక్ష్యము. ఈ లక్ష్యమును ఎదురుగా ఉంచుకోవటంద్వారా లైట్ యొక్క కార్బ్ (వలయము)లో నా ఈ ప్రకాశమయ శరీరము ఉంది అని అనుభవము చేస్తారు. వ్యక్తము ఏవిధంగా పంచతత్వాల కార్బ్లో ఉందో అలా అవ్యక్తము లైట్ యొక్క కార్బ్లో ఉంది. లైట్ యొక్క రూపమైతే ఉంది, కానీ చుట్టుప్రక్కల ప్రకాశమే ప్రకాశము. ఆత్మనైన నేను జ్యోతి రూపమును - ఈ లక్ష్యమైతే ఉండనే ఉంది, కానీ నేను ఆకారములోకూడా కార్బ్లో ఉన్నాను.

ప్రశ్న - ప్రతి కార్యమును చేస్తూ ఏ స్మృతిని ఎక్కువగా పెంచుకున్నట్లయితే నిరాకారీ స్థితి సహజంగా తయారవుతుంది?

జవాబు - ప్రతి కార్యము చేస్తూకూడా నేను ఫరిస్తాను, నిమిత్తంగా ఈ కార్యార్థము భూమిపై పాదాన్ని మోపి ఉన్నాను, కానీ నేను ఉన్నది అవ్యక్త దేశవాసిగా, నేను ఈ కార్యార్థము వతనమునుండి పృధ్వి పైకి వచ్చాను, పని పూర్త కావటంతోనే మరల తిరిగి వతనమునకు వెళ్తాను అన్న ఈ స్మృతి ఉండాలి. ఈ స్మృతిద్వారా సహజంగానే నిరాకారీ స్థితి తయారవుతుంది.

ప్రశ్న - సాకార స్వరూపపు నషాకు చెందిన పాయ్స్టింతోపాటుగా ఏ అనుభవములో ఉండటంద్వారా సాక్షాత్కారమూర్తులుగా అవ్వగలరు?

జవాబు - నేను శ్రేష్ఠ ఆత్మను, నేను బ్రాహ్మణ ఆత్మను, నేను శక్తిని అన్న ఈ స్మృతిలో ఉండటంద్వారా నషా మరియు సంతోషపు అనుభవము ఉంటుంది. కానీ ఎప్పుడైతే అవ్యక్తరూపములో, లైట్ యొక్క కార్బ్లో స్వయమును అనుభవము చేసుకుంటారో అప్పుడు సాక్షాత్కారమూర్తులుగా అవుతారు ఎందుకంటే సాక్షాత్కారము లైట్లేకుండా అవ్వదు, కనుక మీ లైట్రూపముయొక్క ప్రభావముద్వారానే వారికి దైవీ స్వరూపముయొక్క సాక్షాత్కారము కలుగుతుంది.

ప్రశ్న - వర్తమాన సమయప్రమాణంగా మీకు ఏ స్వరూపము కావాలి? ఇప్పుడు ఏ పాత్ర సమాప్తమైంది?

జవాబు - వర్తమాన సమయ ప్రమాణంగా మీకందరికీ జ్వాలాముఖి స్వరూపము కావాలి. సాధారణ స్వరూపము, సాధారణ మాటలు కనిపించకూడదు, ఈ దేవి నాకొరకు ఏ ఆకాశవాణి పలుకు పలుకుతుందో అని అనుభవము చెయ్యాలి. ఇప్పుడు మీ గోపీతనపు పాత్ర సమాప్తమైంది. ఎప్పుడైతే మీరు శక్తిస్వరూపములో ఉంటారో అప్పుడు మీద్వారా అందరికీ వీరు ఎవరో అవతారమూర్తులు, వీరు సాధారణ శరీరధారులు కారు అన్న అనుభవము కలుగుతుంది, అవతారము ప్రత్యక్షమైంది, మహావాక్యాలను మాట్లాడారు మరియు మాయమైపోయారు. ఇప్పటి స్థితి మరియు పురుషార్థముయొక్క లక్ష్యము ఇదే ఉండాలి.

ప్రశ్న - నిమిత్తంగా అయిన ముఖ్య సేవాయోగ్యులు, రాజ్యభాగ్య సింహాసనమును తీసుకునే అనన్య రత్నాల సేవ ఏంటి?

జవాబు - వారు లైట్ హౌస్లా తిరుగుతూ నలువైపుల లైట్ ను ఇస్తూ ఉంటారు. ఒక్కరు అనేకులకు లైట్ ను ఇస్తారు. స్థూల వ్యవహారాలనుండి దూరమౌతూ ఉంటారు. సూచనలతోనే విన్నారు, డైరెక్షన్ ఇచ్చారు మరల అవ్యక్త వతనములోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బాధ్యతలు మరియు సేవల విస్తారమైతే నలువైపుల ఇంకా పెరుగుతుంది. రకరకాల సేవలేవైతే జరుగుతున్నాయో అవి ఇంకా పెరుగుతాయి.

ప్రశ్న - చక్రవర్తి మహారాజులుగా ఎవరు అవుతారు, వారి లక్షణాలను వినిపించండి?

జవాబు - ఎవరైతే ఇప్పుడు చక్రధారులో వారే చక్రవర్తి మహారాజులుగా అవుతారు. ఎవరిలో అయితే లైట్యొక్క చక్రముకూడా ఉంటుందో మరియు సేవలో ప్రకాశమును వ్యాపింపచేసే చక్రముకూడా ఉంటుందో, అప్పుడే వారిని చక్రధారులు అని అంటారు. ఇటువంటి చక్రధారులే చక్రవర్తులుగా అవ్వగలరు. మీ లైట్రూపము మరియు ప్రకాశ కిరీటము ఎంత మామూలైపోవాలంటే నడుస్తూ-తిరుగుతున్న మిమ్మల్ని చూసి వీరు లైట్ యొక్క కిరీటధారులు అని అందరికీ కనిపించాలి.

ప్రశ్న - ఏ అభ్యాసముద్వారా శరీర లెక్కాచారము తేలికైపోతుంది, శరీరమునకు నిద్ర అనే ఔషధము లభిస్తుంది?

జవాబు - అవ్యక్త లైట్ రూపములో స్థితులై ఉండే, శరీరమునుండి దూరమై ఉండే అభ్యాసము ఉన్నట్లయితే 2-4 నిమిషాల అశరీరీ స్థితిద్వారా శరీరమునకు నిద్ర అనే ఔషధము లభిస్తుంది. శరీరమైతే పాతదిగానే ఉంటుంది. లెక్కాచారాలు కూడా పాతవిగానే ఉంటాయి. కానీ లైట్స్వరూపపు స్మృతిని ధృఢతరం చేసుకోవటంద్వారా లెక్కాచారాలను సమాప్తము చేసుకోవటంలో లైట్ రూపులుగా అయిపోతారు, ఇందుకొరకు అమృతవేళ విశేషంగా ఈ అభ్యాసమును చెయ్యండి - నేను అశరీరిని మరియు పరంధామ నివాసిని మరియు అవ్యక్తరూపములో అవతరించాను.

ప్రశ్న - మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనము ఏంటి?

జవాబు - మాయాజీతులుగా అయ్యేందుకు మీ చెడుపై క్రోధమును చూపండి. కోపము వచ్చినప్పుడు ఇతరులపై చూపకుండా, చెడుపై క్రోధము చూపండి, మీ బలహీనతలపై క్రోధము వహించినట్లయితే సహజంగా మయాజీతులవుతారు.

ప్రశ్న - పల్లెటూరివారిని చూసి బాప్దాదా విశేషంగా సంతోషపడిపోతారు, ఎందుకని?

జవాబు - ఎందుకంటే పల్లెటూరివారు చాలా అమాయకులుగా ఉంటారు. బాబానుకూడా భోలానాధుడు(అమాయకుడు) అని అంటారు. భోలానాధుడైన తండ్రి ఎలానో అలా అమాయకులైన పల్లెటూరివారు కనుక మేము విశేషంగా భోలానాధునికి ప్రియమైనవాళ్ళము అన్న ఈ సంతోషము ఎల్లప్పుడు ఉండాలి. అచ్ఛా!

Comments