07-05-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
''బ్రాహ్మణుల ప్రపంచం - చింతలేని (దు:ఖములేని) పురం ''
ఈ రోజు నిశ్చింతపుర చక్రవర్తి తన మాస్టర్నిశ్చింతపుర చక్రవర్తులను కలుసుకునేందుకు వచ్చారు. ఇది సంగమ యుగ చక్రవర్తుల సభ. ఈ చక్రవర్తిత్వం ద్వారానే భవిష్య ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు. పిల్లలందరూ బే గమ్(దు:ఖము లేని) అనగా అన్ని రకాల గమ్అంటే దు:ఖాల నుండి అతీతమైన చక్రవర్తులుగా అయ్యారని బాప్దాదా చూస్తున్నారు. బ్రాహ్మణుల ప్రపంచం దు:ఖ రహితమైనది. సంగమయుగ బ్రాహ్మణుల ప్రపంచానికి అధికారీ ఆత్మలు అనగా దు:ఖరహిత పురానికి చక్రవర్తులు(నిశ్చింత చక్రవర్తులు). సంకల్పంలో కూడా గమ్అనగా దు:ఖపు అల ఉండరాదు. అలా తయారయ్యారా? నిశ్చింత చక్రవర్తులు సదా సుఖ శయ్య పైన, సుఖమయ ప్రపంచంలో స్వయాన్ని అనుభవం చేస్తున్నారా? బ్రాహ్మణుల ప్రపంచం లేక బ్రాహ్మణ జీవితంలో దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండరాదు. ఎందుకంటే బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ ఉండదు. అప్రాప్తి దు:ఖానికి కారణం. ప్రాప్తి సుఖానికి సాధనం. కావున సర్వ ప్రాప్తి స్వరూపము అనగా సుఖ స్వరూపము. ఇలా సదా సుఖ స్వరూపులుగా అయ్యారా? సంబంధాలు మరియు సంపద ఇవే విశేషంగా సుఖానికి సాధనాలు. అవినాశి సుఖ సంబంధం ప్రాప్తించింది కదా. ఆలోచించండి. సంబంధాలలో కూడా ఏ ఒక్క సంబంధము లోటు ఉన్నా దు:ఖపు అల వస్తుంది. బ్రాహ్మణ ప్రపంచంలో సర్వ సంబంధాలు తండ్రితో అవినాశిగా ఉంటాయి. ఏ ఒక్క సంబంధమైనా లోటుగా ఉందా? సర్వ సంబంధాలు అవినాశిగా ఉన్నట్లయితే దు:ఖపు అల ఎలా ఉంటుంది? సంపదలో కూడా సర్వ ఖజానాలు లేక సర్వ సంపదల శ్రేష్ఠ ఖజానా 'జ్ఞాన ధనము'. దీని ద్వారా అన్ని ధనాలు, అన్ని ప్రాప్తులూ స్వతహాగానే ప్రాప్తమవుతాయి. సంపద - సంబంధాలు అన్నీ ప్రాప్తమైనప్పుడు దు:ఖరహిత పురము అనగా దు:ఖరహిత ప్రపంచం ఉన్నట్లే. సదా సుఖ ప్రపంచానికి బాలకుల నుండి యజమానులు అనగా చక్రవర్తులు. చక్రవర్తులుగా అయ్యారా లేక ఇప్పుడు అవుతున్నారా? బాప్దాదా పిల్లల దు:ఖపు అలల విషయాలను విని లేక చూసి ఏమి ఆలోచిస్తారు? సుఖసాగరుని పిల్లలు దు:ఖరహిత పురానికి చక్రవర్తులు, మరి దు:ఖపు అల ఎక్కడి నుండి వచ్చింది? తప్పకుండా సుఖ ప్రపంచ సరిహద్దుల నుండి బయటకు వెళ్లిపోతారు. ఏదో ఒక కృత్రిమమైన ఆకర్షణ లేక నకిలీ రూపము వెనుక ఆకర్షితమైపోతారు. ఉదాహరణానికి కల్పక్రితపు స్మృతిచిహ్న కథల్లో సీత ఆకర్షితురాలయ్యింది, అంతేకాక మర్యాద రేఖను అనగా సుఖ ప్రపంచ సరిహద్దును దాటిందని చూపిస్తారు. అప్పుడు ఎక్కడికి చేరుకుంది? శోకవాటికలోకి. హద్దులో ఉంటే అడవిలో కూడా మంగళం (మంచే) జరుగుతుంది. త్యాగంలో కూడా భాగ్యముంది. చిల్లిగవ్వ లేకున్నా చక్రవర్తులుగా ఉన్నారు. భికారి జీవితంలో కూడా రాజకుమారుల జీవితముంటుంది. ఇటువంటి అనుభవముంది కదా! ప్రపంచానికి అతీతంగా మధువనంలోకి వచ్చినప్పుడు ఏం అనుభవం చేస్తారు? చిన్న స్థానం, ఒక మూలగా ఉంది. కాని చేరుకోవడంతోనే సత్యయుగ స్వర్గం కంటే శ్రేష్ఠమైన ప్రపంచంలోకి చేరుకున్నామని అంటారు. కావున అడవిలో కూడా మంగళం(శుభాన్ని) అనుభవం చేస్తున్నారు కదా. ఎండిపోయిన పర్వతాలను వజ్ర తుల్యమైన శ్రేష్ఠ సుఖ ప్రపంచంగా అనుభవం చేస్తారు. ప్రపంచమే మారిపోయింది. అలాంటి అనుభవం చేస్తారు కదా! అలాగే బ్రాహ్మణ ఆత్మలు ఎక్కడ ఉన్నా దు:ఖ వాయుమండలం మధ్యలో కూడా కమలపుష్ప సమానంగా దు:ఖానికి అతీతంగా, చింతలేని పురానికి చక్రవర్తులుగా ఉన్నారు. తనువు రోగం ద్వారా దు:ఖపు అల లేక మనసులో వ్యర్థమైన అలజడి ద్వారా దు:ఖపు అల లేక వినాశి ధనం యొక్క అప్రాప్తి లేక లోటు వలన కలిగే దు:ఖపు అల, స్వంత బలహీన సంస్కారాలు లేక స్వభావం లేక ఇతరుల బలహీన స్వభావం లేక సంస్కారాల దు:ఖపు అల, వాయుమండలం లేక వైబ్రేషన్ల ఆధారంగా దు:ఖపు అల, సంబంధ సంపర్కాల ఆధారంగా కలిగే దు:ఖపు అల తమ వైపుకు ఆకర్షించుకోవడం లేదు కదా! వాటికి అతీతంగా ఉన్నారు కదా. ప్రపంచం మారిపోతే సంస్కారాలు కూడా మారిపోయాయి, స్వభావం మారిపోయింది. అందువలన సుఖమయ ప్రపంచం వారిగా అయిపోయారు. నిరుపేదలుగా ఏమో అయిపోయారు. అనగా ఈ దేహ రూపీ ఇల్లు కూడా మనది కాదు. పేదవారిగా అయిపోయారు కదా! కాని తండ్రి సర్వ ఖజానాలకు యజమానిగా అయితే అయిపోయారు. స్వరాజ్య అధికారులుగా కూడా అయిపోయారు. ఇలాంటి నషా, సంతోషం ఉంటోందా? అలాంటి వారినే చింతలేని పురానికి మహారాజులు అని అంటారు. కావున అందరూ చక్రవర్తులే కూర్చొని ఉన్నారు కదా! చక్రవర్తుల స్థితి-గతులు బాగా నడుస్తున్నాయా? రాజ్యములోని కర్మచారులందరూ మీ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నారా? ఎవ్వరూ చక్రవర్తులైన మిమ్ములను మోసం చేయడం లేదు కదా! రాజ్య కర్మచారులందరూ జీ హాజిర్(అవునండి) జీ హుజూర్(అలాగే) అనే వారేనా! మీ దర్బారు(సభ)ను జరుపుతున్నారా? రాజులకైతే దర్బారు జరుగుతుంది. అయితే దర్బారులోని వారందరూ కార్యాన్ని యధార్థంగా చేస్తున్నారా? ఖజనాలతో భండారం నిండుగా ఉందా? అన్ని భండారాలు ఎంత నిండుగా ఉండాలంటే వాటిని సదా మహాదానిగా అయ్యి దానం చేస్తూ ఉన్నా తరగకుండా ఉండాలి. చెక్చేసుకుంటున్నారా? బ్రహ్మకుమారులుగా అయితే అయిపోయాము, యోగులుగా అయితే అయిపోయామనే నిర్లక్ష్యపు నషాలో చెకింగ్ను అయితే మర్చిపోవడం లేదు కదా! సదా మీ రాజ్య కార్యవ్యవహారాలను చెక్చేసుకుంటూ ఉండండి. అర్థమయ్యిందా? చెకింగ్చేసుకోవడమైతే వస్తుంది కదా! మెజారిటి పాతవారైన అనభవజ్ఞుల సమూహం ఉంది కదా! అనుభవజ్ఞులు అనగా అథారిటి(అధికారం) గలవారు. ఏ అథారిటి? స్వరాజ్య అథారిటి. ఇటువంటి అథారిటి కలిగిన వారే కదా! ఇప్పుడైతే ఈ రోజే వచ్చారు, మేము సరైన చక్రవర్తులమే అన్న సర్టిఫికెట్ను తీసుకునేందుకు, చెకింగ్చేయించుకునేందుకు వచ్చారు కదా! ఎలాంటి రాజులు? నామధారులుగా ఉన్నారా లేక కామధారులుగా(పని చేసేవారిగా) ఉన్నారా? ఈ సర్టిఫికెట్ను తీసుకొని వెళ్తారు కదా! ఇదంతా అద్దాల మహలులో మీకు మీరే చూసుకుంటారు. మంచిది.
సదా సుఖ ప్రపంచంలో ఉండేవారికి, నిశ్చింత పుర చక్రవర్తులకు, సదా రాజ్య అధికారులైన సమర్థ ఆత్మలకు, సదా సర్వ దు:ఖాల నుండి అతీతంగా మరియు సుఖదాత అయిన తండ్రికి ప్రియంగా ఉండే అనుభవ అథారిటి వారైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో - తండ్రి సమానమైన పిల్లలందరినీ చూసి బాప్దాదా హర్షిస్తున్నారు. సమాన ఆత్మలు సదా అతిప్రియమనిపిస్తారు. కావున ఈ సమూహమంతా సమానమైన ఆత్మలది. బాప్దాదా సదా సమానమైన పిల్లలను సహచరులుగా చూస్తారు. విశ్వ భ్రమణం చేస్తున్నప్పుడు కూడా తోడుగా మరియు పిల్లల స్థితి గతులను చూసేందుకు వెళ్లినప్పుడు కూడా తోడుగా ఉన్నారు. సదా తోడు తోడుగానే ఉన్నారు. అందువలన సమాన ఆత్మలు సదా యోగులుగానే ఉన్నారు. యోగాన్ని జోడించేవారు కాదు, లవలీనంగానే ఉన్నారు. వేరుగా లేనప్పుడు స్మృతి ఏం చేస్తారు! స్వతహాగా స్మృతి ఉండనే ఉంటుంది. జతలో ఉన్నప్పుడు స్మృతి స్వతహాగానే ఉంటుంది. కావున సమాన ఆత్మల స్థితి - తోడుగా ఉండేది, ఇమిడిపోయి ఉండేది. కావున సదా ప్రతి అడుగులో ముందు పిల్లలు, వెనుక తండ్రి. ప్రతి కార్యంలో సదా ముందు ఉన్నారు. పిల్లలు ముందు ఉన్నారు, తండ్రి సకాశ్ఇవ్వడమే కాక సదా తోడును అనుభవం చేయిస్తారు. ఎలాగైతే తండ్రి ఇతరులకు సకాశ్ఇస్తారో, అలా సమానమైన పిల్లలు కూడా సకాశ్ను ఇచ్చేవారిగా అయిపోయారు.
విశేష మణుల విశేష మాలగా ఉంది. మాల స్వతహాగానే తయారవుతోంది కదా. అలాంటి సమూహమే కదా! తయారు చేయవలసిన అనవసరముండదు కాని తయారవుతోంది. అలాగే ఒకవేళ నెంబరును తీసినప్పుడు లేక నెంబరు చెప్పినట్లయితే ప్రశ్న తలెత్తుతుంది. కానీ స్వతహాగా నెంబరువారీగా సెట్అవుతూ ఉన్నారు. మంచిది.
కుమారుల గురించి అవ్యక్త బాప్దాదా మహావాక్యాలు
ఇది గాడ్లీ యూత్గ్రూపు(ఈశ్వరీయ యువ వర్గం). లౌకిక రీతిలో ఆ యువ గ్రూప్తమ తమ బుద్ధి అనుసారంగా పనులు చేస్తున్నారు. కాని వారి పనులు నష్టపరచేవి. స్థాపనా కార్యంలో సదా సహయోగులుగా అవ్వడం మీ అందరి పని. ఎప్పుడైనా ఏదైనా కారణము లేక విఘ్నము వచ్చినట్లయితే దానిని సహజంగా నివారణ చేయగలరా? కుమారుల గ్రూపు పై బాప్దాదాకు సదా ఆశలు ఉంటాయి. ఇంతమంది యువత ధైర్యం మరియు ఉత్సాహాన్ని ఉంచుకొని సదా విజయులుగా అయిపోతే విజయ జెండాను పట్టుకొని మొత్తం విశ్వమంతా తిరగగలరు. సదా ఎగిరేకళలో వెళ్తున్నారు. ఆగిపోయే కళలో ఉండేవారెవ్వరూ లేరు కదా! యూత్గ్రూప్అనగా సదా శక్తిశాలి సేవ చేసేవారు. యువత ఏది కావాలనుకుంటే అది చేయగలదు. వారు వినాశకారులు, మీరు స్థాపనా కార్యం చేసేవారు. వారు అశాంతిని వ్యాపింపజేసేవారు, మీరు శాంతి స్వరూపులై శాంతిని వ్యాపింపజేయువారు. కుమారుల కొరకైతే చాలా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడూ అలజడిలోకి రానటువంటి పక్కా కుమారులే కదా! ఇక్కడ పేరు ప్రఖ్యాతమవుతూ మళ్లీ అక్కడి పాత ప్రపంచంలోకి వెళ్లిపోయేవారు కాదు కదా! చాలామంది కుమారులు మొదట చాలా ఉమంగ-ఉత్సాహాలతో సేవ చేస్తారు. తర్వాత కొద్దిగా ఘర్షణ జరిగినా పాత ప్రపంచంలోకి వెళ్లిపోతారు. వదిలేసిన వస్తువులను మళ్లీ వెనక్కి తీసుకుంటే అదేమైనా బాగుంటుందా! మీరందరూ పాత ప్రపంచాన్ని వదిలేశారు కదా! ఒకవేళ ఏదైనా తాడు బంధించి ఉన్నట్లయితే కదులుతూ(అలజడి చెందుతూ) ఉంటారు. కావున సదా తమను గాడ్లీ యూత్గ్రూప్గా భావించండి. ఇంతమంది కుమారులు రిఫ్రెష్అయ్యి ఖజానాలతో నిండుగా అయ్యి వెళ్లినట్లయితే చూసేవారు వీరు దేవాత్మగా అయ్యి వచ్చారని అంటారు. ఏదైనా అటువంటి అద్భుతమైన ప్లాను తయారుచేయండి. యువతను చూసి ప్రభుత్వం కూడా భయపడ్తుంది. మీరందరూ ప్రభుత్వానికి కూడా దారి చూపించేందుకు నిమిత్తంగా అవుతారు. కుమారులు సదా సేవ చేసేందుకు శక్తిశాలి ప్లాన్లు తయారు చేయాలి. కాని సదా స్మృతి మరియు సేవల బ్యాలన్స్(సమతుల్యత) ఉండాలి. మంచిది.
సదా నిర్విఘ్నంగా ఉండే శుభోదయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిర్విఘ్నంగా ఉంటారు కదా! సత్యయుగ శుభోదయం అయినప్పుడు నిర్విఘ్నంగా ఉంటారు. ఇప్పుడు అది నిర్విఘ్నంగా అయ్యేందుకు శుభోదయం. శుభదినమని అంటారు కదా. శుభోదయం అని అనడంతోనే శుభోదయమవుతుంది. శుభ దినము మరియు శుభ రాత్రి కూడా అవుతుంది. కావున సదా నిర్విఘ్నము అనగా శుభము. కావున 'నిర్విఘ్న భవ' యొక్క గుడ్మార్నింగ్(శుభోదయం). మంచిది.
కుమారీల గురించి అవ్యక్త బాప్దాదా మహావాక్యాలు –
కుమారీ జీవితం అనగా స్వతంత్ర జీవితం. ఈ స్వతంత్రత ద్వారా ఏమి లభిస్తుంది? శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసేవారి ద్వారా ఏమి లభిస్తుంది - ఇది సదా స్మృతిలో ఉంటోందా? లేక మేమైతే కాలేజీలో చదువుకునే అమ్మాయిలమని భావిస్తున్నారా! సదా తండ్రి ఎలా ఉన్నారో నేను అలాగే ఉన్నానని స్మృతిలో ఉంచుకోండి. తండ్రి ఎవరు? సేవాధారి. కావున అందరూ చేస్తున్నారు కదా! కుమారీలందరూ తండ్రి మాలలోని మణులుగా ఉన్నారా? పక్కాయేనా? ఇంకెవ్వరికీ కంఠహారంగా అవ్వరు కదా. ఎవరైతే తండ్రి కంఠహారంగా అయిపోయారో వారు ఇతరుల కంఠహారంగా అవ్వజాలరు. ఏ సంకల్పాన్ని చేశారు? స్వప్నంలో కూడా వేరే చోటుకు వెళ్లజాలరు. అంత పక్కాగా ఉన్నారా? ఒక్క తండ్రి వారిగా అయ్యారు, సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు. సర్వాధికారాలను వదిలి రెండు పైసల వెనుక వెళ్తారా ఏమిటి! ఆ రెండు పైసలు కూడా రెండు చెంప దెబ్బలు కొట్టించుకున్నప్పుడే లభిస్తాయి. ముందు దు:ఖము, అశాంతి అనే చెంపదెబ్బ తగుల్తుంది, తర్వాత రెండు రొట్టెలు తింటారు. అలాంటి జీవితం ఇష్టం లేదు కదా! కుమారీ జీవితం ఎలాగూ భాగ్యవంతమైనదే, ఇంకా డబల్భాగ్యవంతంగా అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టికల్ పేపర్లను(పరీక్షలు) వ్రాస్తారు కదా! ఆ కాగితం పేపరు కాదు. సదా శివశక్తిగా ఉన్నారు, కంబైండ్గా ఉన్నారు. ఈ స్మృతిని సదా ఉంచుకోండి. కుమారీలకైతే ఎక్కడో అక్కడికి వెళ్లడమైతే జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఇటువంటి శ్రేష్ఠమైన ఇల్లు లభించినట్లయితే ఇంకేం కావాలి! కుమారీలు మంచి వరుడు, సమృద్ధిగా ఉండే ఇల్లు కావాలని అనుకుంటారు. ఇదెంత పరిపూర్ణమైన(నిండుగా ఉన్న) ఇల్లు! ఇక్కడ ఏ అప్రాప్తీ ఉండదు. ఇలాంటి భాగ్యమైతే అందరికీ లభించాలి. ''వాహ్నా భాగ్యము'' అనే పాటను పాడండి. ఎలాగైతే చంద్రుని వెన్నెల అందరికీ ప్రియమనిపిస్తుందో అలా జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవారిగా అవ్వండి. జ్ఞాన చంద్రుని సమానంగా అవ్వండి. ఎలాగైతే మీ భాగ్య నక్షత్రం మెరిసిందో అలాగే సదా ఇతరుల భాగ్య నక్షత్రాన్ని కూడా మెరిపింపజేయండి. అప్పుడు అందరూ మీకు పదే పదే ఆశీర్వాదాలు ఇస్తారు.
కుమారీలందరూ స్కాలర్షిప్తీసుకుంటారు కదా! స్కాలర్షిప్తీసుకోవడం అనగా విజయ మాలలోకి రావడం. ఎలాంటి తీవ్ర పురుషార్థులుగా అవ్వాలంటే విజయ మాలలోకి వచ్చేయాలి. ఇంతటి పాలనను తీసుకుంటున్నారు, దానికి రిటర్న్అయితే ఇస్తారు కదా! పాలనకు రిటర్న్తండ్రి సమానంగా అవ్వడం, స్కాలర్షిప్తీసుకోవడం. కావున సదా విజయులుగా అయ్యి విజయమాలలో మణులుగా అయ్యేవారము అనే దృఢ సంకల్పాన్ని ఉంచుకోండి. అందరూ ఈ జీవితంలో సంతుష్టంగా ఉన్నారా? ఎప్పుడైనా ఆ జీవితంలోని తినడం, త్రాగడం, తిరగడం - ఇవైతే గుర్తు రావడం లేదు కదా! ఇతరులను చూసి మేము కూడా కొద్దిగా రుచి చూద్దామని బుద్ధిలోకి రావడం లేదు కదా! ఆ జీవితం పడిపోయే జీవితం, ఈ జీవితం పైకి ఎక్కే జీవితం. ఎక్కడం నుండి పడిపోయే వైపుకు ఎవరు వెళ్తారు! సదా ఎవర్రెడీగా ఉండండి. మీ ప్రకారంగా సదా తయారై ఉండండి. చదువు ప్రకారంగా ఏ ఆసక్తి యొక్క బంధన లేదు. ఎక్కడ కుమారీల సమూహం ఉందో అక్కడ సేవలో వృద్ధి ఉండనే ఉంది. ఎక్కడ శుద్ధమైన ఆత్మలు ఉన్నారో అక్కడ సదా శుభకార్యమే ఉంది. అందరూ పరస్పరం సంస్కారాలను కలుపుకునే సబ్జెక్టులో పాసై ఉన్నారు కదా! ఏ గందరగోళం లేదు. ఎక్కడికీ దృష్టి, వృత్తి వెళ్లదు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. విశేషంగా కుమారీలు ఈ విషయంలో సర్టిఫికెట్తీసుకోవాలి. ఎలాగైతే బాలబ్రహ్మచారిణి అన్న పేరు ఉందో అలా సంకల్పాలు కూడా అంత పవిత్రంగా ఉండాలి. దీనినే స్కాలర్షిప్తీసుకోవడమని అంటారు. మళ్లీ రైట్హ్యాండ్గా(కుడిభుజంగా) ఉన్నారు. '' సదా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు'' అటువంటి శివశక్తులు. ఇది గుర్తుంచుకున్నారంటే మాయ ఏ విధంగానూ యుద్ధం చేయదు. మంచిది.
వీడ్కోలు సమయంలో - సద్గురువు కృప మీ వారసత్వంగా అయిపోయింది. అందువలన కృప చూపించండి అనే సంకల్పాన్ని కూడా చేయవలసిన అవసరం లేదు. వృక్షపతి పిల్లలుగానే ఉన్నారు. కావున బృహస్పతి దశ, గురు కృప అంతా స్వతహాగానే ప్రాప్తించింది. వేడుకునే అవసరమే లేదు. వేడుకోవడం నుండి విడుదలైపోయారు. సంకల్పం చేయడం నుండి కూడా విడిపించారు. ఇప్పుడు అడిగేందుకు ఇంకా ఏమైనా మిగిలి ఉందా ఏమిటి! తండ్రికి కూడా శిరోకిరీటంగా అయిపోయారు. అటువంటివారు అడుగుతారా ఏమిటి! కావున వృక్షపతి రోజుకు, బృహస్పతి దశకు సదా పిల్లలకు అభినందనల సహితంగా ప్రియస్మృతులు. ఓంశాంతి
Comments
Post a Comment