07-04-1983 అవ్యక్త మురళి

07-04-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మాతలతో అవ్యక్త బాప్ దాదా చెప్పిన రెండు అమూల్య మాటలు.

ఈరోజు విశేషంగా నిమిత్తులైన డబల్ సేవాధారులు, బాప్దాదాల స్నేహీ మాతలకు విశేషంగా రెండు మాటలు చెబుతున్నారు. సదా బాబా ఇచ్చే ఈ శిక్షణల కానుకను తోడుగా ఉంచుకోండి.

ఒకటి- సదా లౌకికంలో అలౌకికం యొక్క స్మృతి, సదా సేవాధారిని అన్న స్మృతి, సదా ట్రసీట్తనపు స్మృతి. సర్వులపట్ల ఆత్మిక భావముతో శుభ కళ్యాణ భావన, శ్రేష్ఠముగా తయారుచేయాలనే శుభ భావన. ఏ విధంగా ఇతర ఆత్మలను సేవా భావనతో చూస్తారో, మాట్లాడతారో అలాగే నిమిత్తమై ఉన్న లౌకిక పరివారపు ఆత్మలను కూడా అదే ప్రేరణతో నడిపిస్తూ ఉండండి, హద్దులలోకి వెళ్ళకండి. నా పతి, నా పిల్లలు వీరి కళ్యాణం జరగాలని కాదు, సర్వుల కళ్యాణము జరగాలి. ఒకవేళ నాది అనేది ఉన్నట్లయితే ఆత్మిక దృష్టి, కళ్యాణ దృష్టిని ఇవ్వలేరు. మెజారిటీ బాప్దాదా ముందు పిల్లలు మారిపోవాలని, పతి తోడునివ్వాలని, ఇంటిలోనివారు సహచరులుగా అవ్వాలని కోరుకుటాంరు. కాని, కేవలం ఆ ఆత్మలను మాత్రమే మీవారిగా భావిస్తూ ఈ ఆశను ఎందుకు ఉంచుతున్నారు? ఈ హద్దులోని గోడల కారణంగా మీ శుభ భావన లేక కళ్యాణపు శుభ కోరిక ఆ ఆత్మలవరకు చేరుకోదు. కావున సంకల్పాలు బాగున్నాకాని సాధనాలు యథార్థంగా లేని కారణంగా రిజల్టు ఎలా వెలువడగలదు? కావున ఈ కంప్ల్ైం కొనసాగుతూ ఉంటుంది. కావున సదా బేహద్ ఆత్మిక దృష్టి, సోదరభావపు సంబంధం యొక్క వృత్తితో ఏ ఆత్మపట్లనైనా శుభభావనను ఉంచినట్లయితే ఫలము తప్పక ప్రాప్తమవుతుంది, కావున పురుషార్థంలో అలిసిపోకండి. ఎంతో కష్టపడ్డాము అని లేక వీరెప్పుడూ మారరే మారరు అని అంటూ ఇలా నిరుత్సాహులుగా అయిపోకండి. మీరు నిశ్చయబుద్ధి కలవారు, నేను అన్న సంబంధం నుండి అతీతంగా అయి నడుస్తూ ఉండండి. కొందరు ఆత్మలు ఈశ్వరీయ వారసత్వమును తీసుకునేందుకు భక్తి యొక్క లెక్కాచారాలు తీరడంలో కొద్ది సమయం పడుతుంది. కావున ఓర్పు వహించి సాక్షీతనపు స్థితిలో స్థితులై నిరాశ చెందకుండా ఉండండి. శాంతి మరియు శక్తి యొక్క సహయోగమును ఆత్మలకు ఇస్తూ ఉండండి. ఇటువంటి స్థితిలో స్థితులై లౌకికంలో అలౌకిక భావనను ఉంచే డబల్ సేవాధారీ ట్రసీట్ పిల్లల యొక్క మహత్వము ఎంతో గొప్పది. మీ మహత్వమును గూర్చి తెలుసుకోండి, కావున ఏ రెండు మాటలను గుర్తు ఉంచుకుటాంరు?

నష్టోమోహ, బేహద్ సంబంధం యొక్క స్మృతి స్వరూపము మరియు రెండవది- నేను బాబాకు చెంది ఉన్నాను. 'బాబా సదా తోడుగా ఉంటారు'. బాబాతో సర్వసంబంధాలను నిర్వర్తించాలి, ఇదైతే గుర్తుండగలదు కదా! కేవలం ఈ రెండు విషయాలనే గుర్తుంచుకోండి. బాప్దాదా ప్రతిఒక్క శక్తి లేక పాండవునితో పర్సనల్గా మాట్లాడుతున్నారని ప్రతిఒక్కరూ భావించండి. నాకొరకు వ్యక్తిగతంగా ఏముంది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా! సభలో ఉంటూ కూడా బాప్దాదా ప్రవృత్తివారందరితో విశేషంగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. పబ్లిక్లో కూడా ప్రైవ్ేగా మాట్లాడుతున్నారు, అర్థమైందా? పిల్లలు ఒక్కొక్కరికీ ఒకరికన్నా మరొకరికి ఎక్కువ ప్రేమను ఇస్తున్నారు కావుననే వస్తారు కదా! ప్రేమ లభిస్తుంది, సౌగాత్ (కానుక) లభిస్తుంది, దీనిద్వారానే రిఫ్రెష్ అవుతారు కదా! ప్రేమసాగరుడు స్నేహీ ఆత్మలైన ప్రతిఒక్కరికీ గనిని ఇస్తున్నారు. అది ఎప్పుడూ ఖాళీ అవ్వదు. ఇంకేమైనా మిగిలి ఉందా? కలుసుకోవడము, మాట్లాడడము మరియు తీసుకోవడము ఇదే కోరుకుంటున్నారు కదా! అచ్ఛా!

ఈ విధంగా హద్దులోని సంబంధాల నుండి అతీతంగా సదా ప్రభు ప్రేమకు పాత్రులుగా, నష్టోమోహులుగా, విశ్వకళ్యాణపు స్మృతి స్వరూపులుగా, సదా నిశ్చయబుద్ధి విజయులకు, అలజడి నుండి అతీతంగా అచలంగా ఉండేవారికి, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో, వేరు వేరు గ్రూపులతో మిలనము:-

సదా స్వయమును బాబాకు తోడుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎవరికైతే సర్వశక్తివంతుడైన తండ్రి సహచరునిగా ఉంటారో వారికి సదా సర్వప్రాప్తులు లభిస్తాయి, వారి ముందుకు ఎప్పుడు ఏ విధమైన మాయ రాజాలదు. మాయకు వీడ్కోలు చెప్పేసారా? ఎప్పుడూ మాయకు అతిధి సత్కారాలు చేయడంలేదు కదా! ఎవరైతే మాయకు వీడ్కోలు పలుకుతారో వారికి బాప్దాదా ద్వారా ప్రతి అడుగులోను అభినందనలు లభిస్తాయి. ఒకవేళ ఇప్పటి వరకు కూడా వీడ్కోలు చెప్పకపోతే ఏంచేయాలి, ఎలాచేయాలి అని అంటూ పదే, పదే ఆర్తనాదాలు చేయవలసి వస్తుంది. కావున సదా వీడ్కోలు పలికేవారిగా మరియు అభినందనలు పొందే భాగ్యశాలీ ఆత్మలుగా ఉండండి. ప్రతి అడుగులోను బాబా తోడుగా ఉన్నట్లయితే అభినందనలు కూడా తోడుగా ఉంటాయి. స్వయంగా భగవంతుడే ఆత్మలైన మనకు అభినందనలు తెలుపుతున్నారు అన్న స్మృతిలోనే సదా ఉండండి. ఏదైతే ఊహించనేలేదో దానిని పొందేసారు. బాబాను పొందడంతో సర్వస్వాన్నీ పొందారు. సర్వప్రాప్తీ స్వరూపులుగా అయిపోయారు. సదా ఇదే భాగ్యమును గుర్తుంచుకోండి.

2. అందరూ ఒక్క బాబా స్నేహంలో ఇమిడి ఉంటున్నారా? ఏ విధంగా సాగరంలో ఇమిడిపోతారో అలా సదా బాబా స్నేహంలో సదా ఇమిడి ఉండండి. ఎవరైతే సదా స్నేహంలో ఇమిడి ఉంటారో వారికి ప్రపంచంలోని ఏ విషయం యొక్క స్పృహ ఉండదు. స్నేహంలో ఇమిడి ఉన్న కారణంగా అన్ని విషయాల నుండి సహజంగానే అతీతంగా అయిపోతారు, కష్టపడవలసిన అవసరం ఉండదు. వీరైతే మైమరిచిపోయి ఉంటారు అని భక్తులను గూర్చి అంటారు. కాని పిల్లలను గూర్చి- సదా ప్రేమలో మునిగిపోయి ఉంటారు అని అంటారు. వారికి ప్రపంచపు స్మృతి ఉండదు. నా ఇల్లు, నా పిల్లలు, ఈ వస్తువు నాది... ఇలా నాది, నాది అనేదంతా సమాప్తమైపోతుంది. కేవలం ఒక్క బాబాయే నా వారు, ఇక మిగిలిన నావి అనేవన్నీ సమాప్తము. నావి అనే ఇతర విషయాలు మైలగా చేసేస్తాయి. ఒక్క బాబా నావారిగా అయినట్లయితే ఈ మైల అంతా సమాప్తమైపోతుంది.

3. బాబాకు పిల్లలు ప్రతిఒక్కరూ అతి ప్రియమైనవారు. అందరూ శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు. పేదవారైనా, షావుకార్లయినా, చదువుకున్నవారైనా లేక చదువుకోనివారైనా అందరూ ఒకరికన్నా ఒకరు అధికంగా ప్రియమైనవారు. బాబాకొరకు అందరూ విశేష ఆత్మలే. అందరిలోను ఏ విశేషత ఉంది? బాబాను తెలుసుకునే విశేషత. దేనినైతే పెద్ద, పెద్ద ఋషులు, మునులు తెలుసుకోలేకపోయారో దానిని మీరు తెలుసుకున్నారు, పొందేసారు. పాపం వారు నేతి, నేతి అంటూ వెళ్ళిపోయారు. మీరైతే అన్నీ తెలుసుకున్నారు. కావున బాప్దాదా ఇటువంటి విశేష ఆత్మలకు రోజూ ప్రియస్మృతులు తెలియజేస్తారు, రోజూ మిలనము జరుపుతారు. అమృతవేళ సమయము విశేషంగా పిల్లలకొరకు ఉంచబడిన సమయము. భక్తుల లైను తర్వాత వస్తుంది, మొదట పిల్లల లైను ఉంటుంది. విశేష ఆత్మలను కలుసుకునే సమయం కూడా తప్పకుండా విశేషంగా ఉంటుంది కదా! కావున సదా స్వయమును ఇటువంటి విశేష ఆత్మగా భావించండి మరియు సదా సంతోషంలో ఎగురుతూ ఉండండి.

4. బ్రాహ్మణ పిల్లలు తమ రోగమునకు స్వయమే వైద్యం చేసుకోగలరు. సంతోషమనే మందు క్షణంలో ప్రభావం చూపే మందు. ఏ విధంగా వారు శక్తిశాలీ ఇంజెక్షన్ను వేయడంతోనే మారిపోతారో అలా బ్రాహ్మణులు స్వయమునకు స్వయమే సంతోషపు మందును ఇచ్చేస్తారు లేక సంతోషపు ఇంజెక్షన్ను ఇచ్చేస్తారు. ఈ స్టాక్ అయితే ప్రతిఒక్కరి వద్దా ఉంది కదా! జ్ఞానము యొక్క ఆధారంపై శరీరమును నడపాలి. జ్ఞానము యొక్క ప్రకాశము మరియు శక్తి ఎంతో సహాయం చేస్తుంది. ఏదైనా రోగము వచ్చినట్లయితే అది కూడా బుద్ధికి విశ్రాంతిని ఇచ్చే సాధనమే. సూక్ష్మ వతనంలో అవ్యక్త బాప్దాదాతోపాటు రెండు రోజుల ఆహ్వానంపై అష్టలీలను చూసేందుకు వచ్చి చేరుకోండి, అప్పుడిక డాక్టర్ యొక్క అవసరం కూడా ఉండదు. ప్రారంభంలో సందేశీలు వెళ్ళేవారు. ఒకటి, రెండు రోజులైనా వతనంలోనే ఉండేవారు. అలాగే ఏమి జరిగినా కాని వతనంలోకి వచ్చేయండి. బాప్దాదా వతనం నుండి షైర్ చేయిస్తూ ఉంటారు. భక్తుల వద్దకు తీసుకువెళతారు. లండన్, అమెరికా తిపిప్పవస్తారు, విశ్వభ్రమణము చేయిస్తారు. కావున ఎప్పుడు ఏ రోగం వచ్చినా వతనం నుండి ఆహ్వానం వచ్చింది, రోగము కాదు అని భావించండి.

ప్రశ్న:- సహజయోగి జీవితపు విశేషత ఏమి?

జవాబు:- యోగి జీవితం అనగా సదా సుఖమయమైన జీవితము. కావున ఎవరైతే సహయోగులుగా ఉన్నారో వారు సదా సుఖపు ఊయలలో ఊగేవారిగా ఉంటారు. ఎప్పుడైతే సుఖదాత అయిన బాబాయే తమవారిగా అయిపోయారో అప్పుడిక అంతా సుఖమే సుఖముగా అయిపోతుంది కదా! కావున సుఖపు ఊయలలో ఊగుతూ ఉండండి. సుఖదాత అయిన తండ్రి లభించేసారు, సుఖపు జీవితం తయారైంది, సుఖపు ప్రపంచం లభించింది, ఇదే యోగి జీవితపు విశేషత. ఇందులో దు:ఖపు నామరూపాలు కూడా లేవు.

ప్రశ్న:- వృద్ధులైన మరియు చదువుకోని పిల్లలకు ఏ ఆధారంపై సేవ చేయాలి?

జవాబు:- తమ అనుభవం యొక్క ఆధారంపై వారి సేవ చేయాలి. అనుభవపు కథను అందరికీ వినిపించండి. ఏ విధంగా ఇంటో్ల బామ్మ లేక అమ్మమ్మ పిల్లలకు కథలను వినిపిస్తారో అలా మీరు కూడా అనుభవపు కథను వినిపించండి. ఏం లభించింది, ఏమి పొందారు ఇదే వినిపించాలి. ఇది అన్నింకన్నా పెద్ద సేవ, దీనిని ప్రతిఒక్కరూ చేయగలరు. స్మృతి మరియు సేవలోనే సదా తత్పరులై ఉండండి, ఇదే బాబా సమానమైన కర్తవ్యము.

Comments