07-03-1982 అవ్యక్త మురళి

                   *  07-03-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంకల్పముల యొక్క గతి నెమ్మదిగా ఉండడం ద్వారా లాభాలు.

ఈ రోజు బాప్ దాదా, తమ 'ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు' అని భావించే ఇటువంటి ఏకనామి, ఏకరస స్థితిలో స్థితులై ఉండే స్మృతిస్వరూపులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లల ప్రతి ఒక్కరి మరజీవా జన్మ యొక్క శ్రేష్ఠ రేఖలను బాప్ దాదా చూస్తున్నారు. ఈనాటి ప్రపంచంలో విశేషముగా హస్తరేఖలను చూడడం ద్వారా ఆత్మ యొక్క భాగ్యమును వర్ణన చేస్తారు లేక గుణ కర్తవ్యాల యొక్క శ్రేష్ఠతను వర్ణన చేస్తారు. కానీ బాప్ దాదా హస్తరేఖలను చూడరు. పిల్లల ప్రతి ఒక్కరి ముఖము, నయనాలు మరియు మస్తకము వీటి ద్వారా ప్రతి ఒక్కరి వేగము మరియు స్థితి యొక్క రేఖలను చూస్తున్నారు. ముఖము ద్వారానే మనుష్యులు ఆత్మను పరిశీలించే ప్రయత్నం చేస్తారు. వారు దేహాభిమానులుగా ఉన్న కారణముగా స్థూల విషయాలను పరిశీలిస్తారు. బాప్ దాదా మస్తకము ద్వారా స్మృతిస్వరూపమును చూస్తారు. నయనాల ద్వారా జ్వాలారూపమును చూస్తారు, ముఖము యొక్క మందహాసం ద్వారా అతీతమైన మరియు ప్రియమైన, కమలపుష్ప సమానమైన స్థితిని చూస్తారు. ఎవరైతే సదా స్మృతిస్వరూపులుగా ఉంటారో వారి మస్తకములో సంకల్పము యొక్క గతి నెమ్మదిగా ఉంటుంది వారి రేఖలు అలా ఉంటాయి. ఎటువంటి భారము వారిపై ఉండదు. ప్రెషర్ ఉండదు. ఒక్క నిముషములో ఒక్క సంకల్పము ద్వారా వారు అనేక సంకల్పాలకు జన్మనివ్వరు. ఏ విధముగా శరీరములోని ఏదైనా రోగమును నాడి యొక్క గతి ద్వారా పరిశీలిస్తారో అలాగే సంకల్పాల యొక్క గతి మస్తకము యొక్క రేఖలకు గుర్తు. సంకల్పాల యొక్క గతి చాలా తీవ్రగతిలో ఉన్నట్లయితే ఒకదాని నుండి ఇంకొకటి. అలా సంకల్పాలు వెలువడుతూనే ఉన్నట్లయితే ఇలా సంకల్పాల యొక్క గతి అతి తీవ్రముగా ఉండడం కూడా భాగ్యము యొక్క శక్తిని వ్యర్ధము చేయడమే. ఏ విధముగా ముఖము ద్వారా అతి తీవ్రగతితో మరియు సదా మాట్లాడుతూనే ఉంటే శరీరము యొక్క శక్తి వ్యర్ధమైపోతూ ఉంటుంది. ఎవరైనా సదా మాట్లాడుతూ ఉంటే, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే, గట్టిగా మాట్లాడుతూ ఉంటే వారితో ఏమంటారు? మెల్లగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి అని అంటారు. అలాగే సంకల్పాల యొక్క గతి ఆత్మిక శక్తిని వ్యర్ధం చేస్తుంది. పిల్లలందరూ అనుభవజ్ఞులే. ఎప్పుడైతే వ్యర్ధ సంకల్పాలు వస్తాయో అప్పుడు సంకల్పాల యొక్క గతి ఎలా ఉంటుంది మరియు ఎప్పుడైతే జ్ఞానము యొక్క మననము జరుగుతూ ఉంటుందో అప్పుడు సంకల్పాల యొక్క గతి ఎలా ఉంటుంది? అక్కడ శక్తిని వ్యర్ధం చేస్తే ఇక్కడ శక్తి తయారవుతుంది. వ్యర్ధ సంకల్పాల యొక్క గతి తీవ్రముగా ఉన్న కారణముగా తమను తాము ఎప్పుడూ అనుభవం చేసుకోరు. ఏ విధముగా శరీరము యొక్క శక్తి పోవడం వల్ల, ఈ రోజు మా బుర్ర ఖాళీ ఖాళీగా ఉంది అని అంటారో అలాగే ఆత్మ సర్వశక్తుల నుండి తనను తాను వ్యర్ధ సంకల్పాల వల్ల ఖాళీగా అనుభవం చేసుకుంటుంది. ఏ విధంగా శారీరిక శక్తి కొరకు ఇంజెక్షన్ ఇచ్చి లేక గ్లూకోజ్ ను ఎక్కించి శక్తిని నింపుతారో అలాగే ఆత్మికత ద్వారా బలహీన ఆత్మ, 'నేను సర్వశక్తివంతుడను' అంటూ ఆత్మ పురుషార్ధం యొక్క విధిని స్మృతిలోకి తెచ్చుకుంటుంది. ఈ రోజు మురళలో బాప్ దాదా ఏయే పాయింట్లను వినిపించారు? అని స్మృతిని కలిగించుకుంటుంది. వ్యర్ధ సంకల్పాలకు బ్రేక్ ఏమిటి? బిందువును పెట్టే ప్రయత్నం చేయడం. కావున ఇది ఇంజెక్షన్ ఇచ్చుకోవడం వంటిది. ఇలా పురుషార్ధం యొక్క విధి అనే ఇంజెక్షన్ ద్వారా కొంత సమయం శక్తిశాలిగా అయిపోతారు లేక విశేషమైన స్మృతి యొక్క కార్యక్రమాల ద్వారా లేక విశేష సంఘటిత శక్తి మరియు సాంగత్యము ద్వారా గ్లూకోజ్  ఎక్కించుకుంటారు. కానీ సంకల్పము యొక్క గతిని ఆపగలిగే అభ్యాసం చేసి వారు కొద్ది సమయం శక్తిని నింపడం ద్వారా కొద్ది సమయం తమను తాము శక్తివంతముగా అనుభవం చేసుకుంటారు. కానీ మళ్ళీ బలహీనులుగా అయిపోతారు, కావున బాప్ దాదా మస్తకము యొక్క రేఖల ద్వారా రిజల్టును చూస్తూ మళ్ళీ పిల్లలకు, సంకల్పము యొక్క గతిని అతి తీవ్రముగా చేసుకోకండి అని శ్రీమతమును గుర్తు చేయిస్తున్నారు. ఏ విధంగా నోటితో పది మాటలు మాట్లాడేందుకు బదులుగా రెండు మాటలే మాట్లాడండి అని అంటారో ఆ రెండు మాటలూ ఎంత సమర్ధముగా ఉండాలంటే అవి వందమాటల పనిని చేసి చూపించాలి అని అంటారో అలాగే సంకల్పము యొక్క గతి కూడా కేవలం అవసరమైన సంకల్పాలు మాత్రమే రావాలి, సంకల్పరూపీ బీజము సఫలత యొక్క ఫలములతో సంపన్నముగా ఉండాలి. ఫలములు వెలువడనట్టి ఖాళీ బీజములు ఉండకూడదు. కావున సదా సమర్ధ సంకల్పాలే ఉండాలి. వ్యర్ధము ఉండకూడదు అని అనడం జరుగుతుంది. సమర్ధ సంకల్పాల యొక్క సంఖ్య స్వతహాగానే తక్కువగా ఉంటుంది, కానీ అది శక్తిశాలిగా ఉంటుంది. కానీ వ్యర్ధము యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది కానీ ప్రాప్తి ఏమీ ఉండదు. వ్యర్థ సంకల్పాలు వెదురు అడవి వంటివి. ఒకదాని నుండి అనేకం స్వతహాగానే ఉత్పన్నమవుతూ ఉంటాయి మరియు అవి ఒకదానికొకటి రాజుకొని తగులబడిపోతాయి. అవి స్వయమే తమ అగ్నిలో తామే భస్మమైపోతాయి. అలాగే వ్యర్ధ సంకల్పాలు కూడా ఒకదానికొకటి తగిలి ఏదో ఒక వికారము యొక్క అగ్నిని ప్రజ్వలింపజేస్తాయి మరియు స్వయమే వ్యాకులత చెందుతారు! కావున సంకల్పాల యొక్క గతిని తగ్గించండి.

ఈ మరజీవా జన్మ యొక్క ఖజానా లేక విశేషమైన శక్తి సంకల్ప శక్తియే. మరజీవా జన్మ యొక్క ఆధారమే శుద్ధ సంకల్పాలు “నేను శరీరమును కాను, ఆత్మను", అన్న ఈ సంకల్పము గవ్వతుల్యముగా ఉన్న వారిని వజ్రతుల్యముగా చేసేసింది కదా! నేను కల్పపూర్వపు బాబా యొక్క సంతానమును, వారసుడను, అధికారిని అన్న ఈ సంకల్పము మాస్టర్ సర్వశక్తివంతులుగా చేసింది. కావున ఇదే ఖజానా, ఇదే శక్తి మరియు సంకల్పము కూడా ఇదే. విశేషమైన ఖజానాలను ఏ విధముగా ఉపయోగిస్తారో అలా మీ సంకల్పాల యొక్క శక్తిని గుర్తించి, ఆ విధముగా కార్యములో వినియోగించండి. అప్పుడే సర్వ సంకల్పాలు సిద్ధిస్తాయి మరియు సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. కావున ఈ రోజు ఏ రేఖలను చూసారో అర్ధం చేసుకున్నారా. తక్కువగా ఆలోచించండి అనగా సిద్ది స్వరూప సంకల్పాలను చేయండి. ఇటువంటి రేఖలు కలవారు సదా దుఃఖ రహిత పూర్వపు మహారాజులుగా ఉంటారు. మీ నోటి ద్వారా సదా మహావాక్యాలనే మాట్లాడండి. మహావాక్యాలు లెక్కింప దగ్గవిగా ఉంటాయి. మహాన్ ఆత్మలు కూడా లెక్కింప దగ్గవారిగా ఉంటారు. ఆత్మలు అనేకం ఉంటారు మరియు పరమాత్మ ఒక్కరే ఉంటారు. కావున రెండు శక్తులనూ, సంకల్పాల యొక్క మరియు వాక్కు యొక్క శక్తిని వ్యర్ధంగా ఖర్చు చేయకండి. మహావీరులు, మహారథులు అనగా ముఖము ద్వారా మహావాక్యాలు మాట్లాడేవారు, బుద్ధి ద్వారా సిద్ధి స్వరూప సంకల్పాలనే చేసేవారు - ఇవే మహావీరులు లేక మహారథుల యొక్క గుర్తులు. ఎవరు ముందుకు వచ్చినా ఈ మహాన్ ఆత్మ, నా కొరకు శ్రేష్ఠ సంకల్పాలను వినిపించాలి, ఆశీర్వాదముతో కూడుకున్న రెండు వచనాలు వినిపించాలి అని భావించే విధముగా అటువంటి మహారథులుగా అవ్వండి. ఆశీర్వాదాలతో కూడుకున్న మాటలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి. కావున మీరు మహారథులు, మహావీరులు, దేవాత్మలు, భక్తుల యొక్క పూజ్య ఆత్మలు సదా సంకల్పము మరియు మాటల ద్వారా ఆశీర్వాదము యొక్క సంకల్పాలు మరియు మాటలే మాట్లాడండి. అమృత వాణినే పలకండి కాని లౌకిక వాణిని కాదు.

అచ్చా! సదా మహాన్ సంకల్పము ద్వారా స్వయమును మరియు సర్వులను శీతలముగా చేయువారికి, వాణి ద్వారా సదా ఆశీర్వాదముతో కూడుకున్న మాటలను పలికేవారికి, ఇటువంటి శ్రేష్ఠ రేఖలు గలవారికి, సదా శ్రేష్ఠ ఆత్మలకు, మహాన్ ఆత్మలకు, దేవ అత్మలకు, పూజ్య ఆత్మలకు బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

విదేశీ పిల్లలతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము:- మీరు బాప్ దాదా యొక్క సదా స్నేహీ, సదా సహయోగీ మరియు సదా సేవాధారులైన సర్వీసబుల్ రత్నాలే కదా. ప్రతి ఒక్క రత్నము ఎంత విలువైనది! మీరు విశ్వము యొక్క షోకేసులో మధ్యలో పెట్టతగిన వారు. ఎంత ఎత్తైన అనేక రకాల పెద్ద పెద్ద గోడలను దాటి బాబాకు చెందిన వారిగా అయ్యారో బాప్ దాదాకు తెలుసు. ధర్మము యొక్క గోడలు, ఆచార వ్యవహారాల యొక్క గోడలు ఇలా ఎన్ని గోడలను దాటారు! కాని బాబా యొక్క సహయోగమున్న కారణముగా ఇంత పెద్ద పెద్ద గోడలను కూడా ఒక్క అడుగును దాటేసినట్లుగా దాటేసారు. ఎటువంటి కష్టము లేదు. ఎంత సహజమనిపించిందంటే, మేము బాబాకు చెందినవారిమే అని భావించారు. మీరందరూ బాబాకు చెందిన వారిగా అవ్వకపోతే, విదేశాలలో ఇన్ని సెంటర్లు ఎలా తెరుచుకుంటాయి? సేవార్ధము మీమీ స్థానాలకు చేరుకున్నారు. మళ్ళీ తండ్రి వచ్చి తమ వారిగా చేసుకున్నారు. కావున ఇప్పుడు ఏమి భావిస్తున్నారు? మీరు మధువన నివాసులే కదా! మీ అందరి యొక్క స్థానము మధువనమే... మధువన నివాసులమైన మేము సేవ కోసం అక్కడకు వెళ్ళాము అని భావిస్తున్నారా? ఏ విధముగా భారత వాసీయులైన పిల్లలు కూడా వివిధ స్థానాలకు వెళ్లారో అలాగే మీరు కూడా వెళ్లారు. పిల్లలు ప్రతి ఒక్కరికి భిన్న భిన్న సేవల యొక్క పాత్ర ఉంది. మీ సహచరులను మేల్కొలిపేందుకు ఎంత సహజముగా సేవ కొరకు నిమిత్తమైపోయారు. బాప్ దాదా వెరైటీ స్థానాల యొక్క వెరైటీ పుష్పాలను చూసి ఎంతో హర్షిస్తున్నారు. వెరైటీ పుష్పాల యొక్క వృక్షమును ఎప్పుడైనా చూసారా? ఒకే వృక్షానికి భిన్న భిన్న రకాల గులాబి పూలు, ఇతర పువ్వులు ఉండటం చూసారా? మీరు సదా సిద్ధి స్వరూపులు, ఎందుకంటే బాప్ దాదా ద్వారా వరదానీ ఆత్మలుగా అయిపోయారు. మూడు పదాలను సదా గుర్తుంచుకోండి. 1. సదా బాలెన్స్ ఉంచడం. 2. సదా ఆనందముగా ఉండడం. 3. సదా సర్వులకు దీవెనలను ఇవ్వడం. సేవ మరియు స్వయం యొక్క సేవా, రెండింటి యొక్క బాలెన్స్ సదా ఉండాలి. బాలెన్స్ ద్వారా ఎన్ని కళలను చూపిస్తారు! మీరు కూడా బుద్ధి యొక్క బ్యాలన్స్ ద్వారా పదాహారు కళ్ళ సంపన్నంగా, స్వరూపముగా అయ్యిపోతారు. మీ ప్రతి కర్మ కళగా అయిపోతుంది. చూడడమూ కళయే, ఎందుకంటే మీరు ఆత్మగా అయ్యి వింటారు కదా. ఇలా మాట్లాడడం, నడవడం, ప్రతి అడుగులోను, ప్రతి కర్మలోనూ కళయే. కాని వీటన్నింటికీ ఆధారము - బుద్ధి యొక్క బ్యాలెన్స్. అలాగే సదా బ్లిస్ ఫుల్ అనగా ఆనంద స్వరూపముగా ఉండండి. ఆనంద సాగరుని పిల్లలు సదా ఆనంద స్వరూపులు.

అచ్చా ! ఇంకా ముందుముందు కలుస్తూనే ఉంటాము. సంగమయుగమే ఒక మేళా. కావున సదా కలుస్తూనే ఉంటాము. ఒక్కరోజు కూడా బాబా మరియు పిల్లల మిలనము జరగకుండా ఉండడము అన్నది జరగజాలదు. అలా అనుభవం చేసుకుంటున్నారు కదా. సదా బాబాతో పాటు కంబైండ్ గా ఉంటున్నారు కదా? ఈ కంబైన్డ్ రూపం నుంచి వేరు చేసే ధైర్యం కూడా ఎవ్వరికి లేదు. ఎవ్వరికీ ఆ శక్తి లేదు. అచ్చా !

ప్రశ్న - బాబాలోనే ప్రపంచముంది అటారు, దాని భావమేంటి?
బుద్ధి ప్రపంచములోకే వెళ్తుంది కదా, ప్రపంచములో రెండు ఉంటాయి. ఒకటి వ్యక్తులు ఇంకొకటి వస్తువులు. బాబాయే ప్రపంచము అనగా సర్వ వ్యక్తుల నుండి ఏవైతే ప్రాప్తిస్తాయో, అవి ఒక్క తండ్రి నుండి ప్రాప్తిస్తాయి మరియు అన్ని వస్తువుల నుండి ఏ తృప్తి అయితే లభిస్తుందో అది ఒక్క తండ్రి నుండి లభిస్తుంది. మరి అప్పుడు బాబాయే ప్రపంచమైనట్లు కదా, సంభంధమూ తండ్రితోనే, సంపర్కమూ తండ్రితోనే. లేవడము, కూర్చోవడమూ కూడా తండ్రితోనే, మరి అప్పుడు తండ్రియే ప్రపంచము కదా ! అచ్చా!

ఆస్ట్రేలియా పార్టీతో- ఈ రోజు అందరూ ఏం సంకల్పము చేసారు? అందరూ మాయకు వీడ్కోలు చెప్పారా? ఎవరైతే ఇంకా ఇప్పుడు కూడా ఆలోచించాలనుకుంటున్నారో వారు చేతులెత్తండి. ఇప్పటినుండే ఆలోచిస్తాము అని అంటున్నారంటే మరి అది కూడా బలహీనమైన పునాదే కదా. అలోచిస్తాము అనగా బలహీనత, బ్రహ్మాకుమారీ కుమారుల యొక్క వృత్తియే మాయజీతులుగా అవ్వడము మరియు తయారు చేయడము. కావున మీ స్వభావికమైన వృత్తి ఏదైతే ఉంటుందో, దానిని గూర్చి ఏమైనా ఆలోచిస్తారా? అది ముందే అయి ఉంది అని చెప్పండి... పోయిన సంవత్సరం అనేక స్థానాలలో సేవా కేంద్రాలు తెరుస్తాము అని సంకల్పం చేసి వెళ్ళారు మరి అవన్నీ తెరువబడ్డాయి కదా! ఇప్పుడు ఎన్ని సెంటర్లు ఉన్నాయి? 17. ఏవిధముగా ఈ సంకల్పం చేయగానే పూర్తయ్యిందో అలాగే మాయాజీతులుగా అయ్యే సంకల్పము కూడా చేయండి. బాప్ దాదా పిల్లల యొక్క ధైర్యానికి పదే పదే అభినందనలు తెలుపుతారు. ఇంకా ముందు ముందు కూడా సేవలో వృద్ధినొందుతూ ఉంటారు. అందరూ బాప్ దాదాకు ప్రియమైన పిల్లలే, బాప్ దాదా కూడా తోటి వారైన మీరు లేకుండా ఏమి చేయలేరు. మీరు చాలా చాలా విలువైనవారు. అచ్చా!

Comments