07-01-1985 అవ్యక్త మురళి

07-01-1985          ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా        మధువనము  

'' కొత్త సంవత్సరంలో విశేష సంకల్పము - ''మాస్టర్ విధాతలుగా అవ్వండి ''
ఈ రోజు విధాత అయిన తండ్రి తమ మాస్టర్ విధాతలైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. విధాత అయిన తండ్రి ప్రతి పుత్రుని చార్టును చూస్తున్నారు. విధాత ద్వారా లభించిన ఖజానాల నుండి ఎంతవరకు విధాత సమానంగా మాస్టర్ విధాతలుగా అయ్యారు? జ్ఞాన విధాతలుగా ఉన్నారా? సర్వ శక్తుల విధాతలుగా ఉన్నారా? సమయానుసారంగా, ఆవశ్యకత అనుసారంగా ప్రతి శక్తి యొక్క విధాతలుగా అయ్యారా? గుణాల విధాతలుగా అయ్యారా? ఆత్మిక దృష్టి, ఆత్మిక స్నేహాల విధాతలుగా అయ్యారా? సమయానుసారంగా ప్రతి ఆత్మకు సహయోగమునిచ్చే విధాతలుగా అయ్యారా? నిర్బలురకు తమ శ్రేష్ఠ సాంగత్య విధాతలుగా, శ్రేష్ఠ సంపర్క విధాతలుగా అయ్యారా? అప్రాప్తి ఆత్మలను తృప్త ఆత్మలుగా చేసే ఉల్లాస-ఉత్సాహాల విధాతలుగా అయ్యారా? ఈ చార్టు ప్రతి మాస్టర్ విధాతకు ఎలా ఉందో చూస్తున్నారు.
విధాత అనగా ప్రతి సమయము, ప్రతి సంకల్పము ద్వారా ఇచ్చేవారు. విధాత అనగా విశాల హృదయులు. సాగరం సమానంగా ఇవ్వడంలో విశాల హృదయం గలవారు. విధాత అనగా తండ్రి నుండి తప్ప ఏ ఆత్మ నుండి ఏదీ తీసుకునే భావన ఉంచుకునేవారు కాదు. సదా ఇచ్చేవారు. ఒకవేళ ఎవరైనా ఆత్మిక స్నేహము ఇస్తున్నా, ఒకటికి బదులు పదమాల రెట్లు ఇచ్చేవారు. ఎలాగైతే తండ్రి తీసుకోరో, ఇచ్చేవారిగా ఉన్నారో అలా ఉండాలి. ఒకవేళ ఎవరైనా తమలో ఉన్న పాత పనికిరానివి ఇచ్చినా అందుకు బదులు ఎంత ఇస్తారంటే ఆ తీసుకోవడం ఇవ్వడంగా మారిపోతుంది. ఇటువంటి మస్టర్ విధాతలు అనగా ప్రతి సంకల్పములో, ప్రతి అడుగులో ఇచ్చేవారు. మహాదాతలు అనగా విధాతలు. సదా ఇచ్చేవారిగా ఉన్న కారణంగా, సదా నిస్వార్థంగా ఉంటారు. స్వంత స్వార్థానికి అతీతంగా, తండ్రి సమానం సర్వులకు ప్రియంగా ఉంటారు. విధాత ఆత్మల పట్ల స్వతహాగా అందరికీ గౌరవము యొక్క రికార్డు ఉంటుంది. విధాత స్వతహాగా అందరి దృష్టిలో దాత అనగా మహాన్గా ఉంటారు. అటువంటి విధాతలుగా ఎంతవరకు అయ్యారు? విధాత అనగా రాజవంశీయులు. విధాత అనగా పాలన చేసేవారు. తండ్రి సమానంగా సదా స్నేహము మరియు సహయోగాల పాలన ఇచ్చేవారు. విధాత అనగా సదా సంపన్నమైనవారు. కావున తీసుకునేవారిగా ఉన్నామా లేక మాస్టర్ విధాతలుగా అయ్యి ఇచ్చేవారిగా ఉన్నామా? అని మిమ్ములను మీరు చెక్ చేసుకోండి.
ఇప్పుడు సమయానుసారంగా మాస్టర్ విధాత పాత్రను అభినయించాలి. ఎందుకంటే సమయము సమీపంగా వస్తోంది. అనగా తండ్రి సమానంగా అవ్వాలి. ఇంకా ఇప్పటివరకు తమ కోసం తీసుకునే భావన గలవారిగానే ఉంటే విధాతలుగా ఎప్పుడు అవుతారు? ఇప్పుడు ఇవ్వడమే తీసుకోవడం. ఎంతగా ఇస్తారో అంత స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. ఏ విధమైన హద్దు విషయాలను తీసుకునేవారిగా అవ్వకండి. ఇప్పటివరకు తమ హద్దులోని ఆశలను పూర్తి చేసుకునే కోరిక ఉంటే విశ్వంలోని ఆత్మలందరి ఆశలు ఎలా పూర్తి చేస్తారు? కొద్దిగా పేరు కావాలి, కొద్దిగా గౌరవం కావాలి, రిగార్డు కావాలి, స్నేహము కావాలి, శక్తి కావాలి..... ఇలా ఇంతవరకు స్వార్థీ అనగా స్వయం కోసం ఇటువంటి కోరికలను ఉంచుకునేవారిగా ఉంటే కోరిక అంటే ఏమిటో తెలియని స్థితిని (ఇచ్ఛా మాత్రం అవిద్య స్థితిని) ఎప్పుడు అనుభవం చేస్తారు? ఈ హద్దులోని కోరికలు ఎప్పుడూ మంచిగా అవ్వనివ్వవు. ఈ కోరిక కూడా రాయల్ భికారీతనపు అంశము. అధికారుల వెనుక ఇవన్నీ స్వతహాగానే వస్తాయి(లభిస్తాయి). కావాలి, కావాలి అన్న పాటను పాడరు. బాబా లభించారు, తయారైపోయాము అన్న పాటనే పాడుతూ ఉంటారు. బేహద్ విధాత కొరకు ఈ హద్దులోని ఆశలు లేక కోరికలు స్వయంగా నీడ సమానంగా వారి వెనుక వెనుకనే నడుస్తాయి. పొందవలసింది పొందేశాము అనే పాట పాడుతున్నప్పుడు మళ్లీ ఈ హద్దులోని పేరు, గౌరవము, కీర్తి పొందాలని ఎలా ఉంటుంది? లేకపోతే పాటను మార్చేయండి. 5 తత్వాలు కూడా విధాతమైన మీ ముందు దాసిగా అయిపోయి, మీరు ప్రకృతిజీత్ మాయాజీత్లుగా అయినప్పుడు, మీ ముందు ఈ హద్దు కోరికలు ఎలాంటివంటే, సూర్యుని ముందు దీపము లాంటివి. ఎప్పుడైతే సూర్యునిగా అయిపోయారో మరి ఈ దీపాల అవసరమేముంది? కావల్సింది పొంది తృప్తి పొందేందుకు ఆధారము - ఏది కావాలో దానిని ఎక్కువలో ఎక్కువగా ఇస్తూ ఉండండి. గౌరవాన్ని ఇవ్వండి, తీసుకోకండి. రిగార్డు ఇవ్వండి, రిగార్డు తీసుకోకండి. పేరు కావాలంటే తండ్రి పేరును దానం చేయండి. అప్పుడు స్వతహాగా మీ పేరు ప్రసిద్ధమైపోతుంది. ఇవ్వడమే తీసుకునేందుకు ఆధారము. ఎలాగైతే భక్తిమార్గములో కూడా ఏదైనా వస్తువు లోటుగా ఉంటే దాని ప్రాప్తి కొరకు ఆ వస్తువును దానం చేయిస్తారు. ఈ ఆచారము నడుస్తూ వచ్చింది. అప్పుడు ఈ ఇవ్వడం తీసుకోవడంగా అయిపోతుంది. అలా దాత పిల్లలైన మీరు కూడా ఇచ్చే దేవతలుగా అయ్యేవారు. ఇచ్చే దేవతలు, శాంతి దేవతలు, సంపత్తి దేవతలు అని మీ అందరిని మహిమ చేస్తూ ఉంటారు. తీసుకునేవారని మహిమ చేయరు. కావున ఈ రోజు ఈ చార్టును చూస్తున్నారు. దేవతలుగా అయ్యేవారు ఎంత మంది ఉన్నారు, తీసుకునేవారు ఎంతమంది ఉన్నారు? లౌకిక ఆశలు, కోరికలు అయితే సమాప్తమైపోయాయి, ఇప్పుడివి అలౌకిక జీవితములోని బేహద్ కోరికలు, ఇవైతే జ్ఞానానికి చెందినవి కదా! అని అనుకుంటారు. ఇవైతే ఉండాలి కదా అని భావిస్తారు. కానీ హద్దులోని ఏ కోరికలు ఉంచుకునేవారూ మాయను ఎదుర్కోజాలరు. ఇవి అడిగితే లభించేవి కానే కావు. ఎవరితోనైనా నాకు గౌరవాన్ని ఇవ్వండి లేక గౌరవాన్ని కలిగింపజేయండి అని అడిగారనుకోండి, అడిగితే లభించే ఈ మార్గమే తప్పు. గమ్యము ఎక్కడ నుండి లభిస్తుంది. కనుక మాస్టర్ విధాతలుగా అవ్వండి. అప్పుడు స్వతహాగానే అందరూ మీకు ఇచ్చేందుకు వస్తారు. కీర్తిని కోరుకునేవారు వ్యాకులపడ్తారు. కావున మాస్టర్ విధాత స్వమానంలో ఉండండి. 'నాది-నాది' అని అనకండి. అంతా 'నీదే-నీదే' అని అనండి. మీరు 'నీది' గా చేస్తే అప్పుడు అందరు ''నీదే-నీదే'' అని అంటారు. నాది-నాది అని అనడం వలన ఏదైతే వస్తుందో అది కూడా పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉండదో అక్కడ ప్రాప్తి కూడా అప్రాప్తి సమానంగా ఉంటుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ కొద్దిగా(ప్రాప్తి) అయినా కూడా, అన్నిటి సమానంగా ఉంటుంది. కావున 'నీదే-నీదే' అనడం వలన ప్రాప్తి స్వరూపులుగా అవుతారు. ఎలాగైతే ఇక్కడ చిన్న గోపురం లోపల శబ్ధం చేసినట్లైతే అదే శబ్ధం తిరిగి వస్తుందో, అదే విధంగా ఈ బేహద్ గోపురంలో ఒకవేళ మనస్ఫూర్తిగా 'నాది' అని అన్నట్లయితే అన్నివైపుల నుండి అదే 'నాది' అనే శబ్ధమునే వింటారు.
మీరు కూడా 'నాది' అని అంటారు, వారు కూడా 'నాది' అనే అంటారు. కావున ఎంత హృదయపూర్వకమైన స్నేహముతో(స్వార్థంతో కాకుండా) 'నీది' అని అంటారో, అంతే హృదయపూర్వక స్నేహంతో మీ ముందున్న వారు 'నీదే' అని అంటారు. ఈ విధి ద్వారా 'నాది-నాది' అనే హద్దు బేహద్లోకి పరివర్తన అయిపోతుంది. అంతేకాక తీసుకునేవారికి బదులు మాస్టర్ విధాతలుగా అయిపోతారు. కావున ఈ సంవత్సరము సదా మాస్టర్ విధాతలుగా అవుతాము అనే విశేష సంకల్పమునే చేయండి. అర్థమయ్యిందా!
మహారాష్ట్ర జోన్ వారు వచ్చారు. కావున మహాన్గా అవ్వాలి కదా. మహారాష్ట్ర అనగా సదా మహాన్గా అయ్యి అందరికీ ఇచ్చేవారిగా అవ్వడం. మహారాష్ట్ర అనగా సదా సంపన్న రాష్ట్రము. దేశము సంపన్నంగా ఉన్నా లేకపోయినా మహాన్ ఆత్మలైన మీరు సంపన్నంగా ఉన్నారు. కావున మహారాష్ట్ర అనగా మహాదానీ ఆత్మలు. రెండవ వారు యు.పి వారు. యు.పిలో కూడా పతితపావని గంగానది మహత్వముంది. కావున సదా ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారు. అప్పుడే పతితపావనులుగా అవ్వగలరు. కావున యు.పి వారు కూడా పవిత్రతా భండారము. సదా సర్వుల పట్ల పవిత్రతా అంచలిని(దోసిలిని) ఇచ్చే మాస్టర్ విధాతలు. కావున ఇరువురూ మహాన్గా అయ్యారు కదా! బాప్దాదా కూడా మహాన్ ఆత్మలందరిని చూసి హర్షితమవుతారు.
డబల్ విదేశీయులంటే డబల్ నషాలో ఉండేవారు. ఒకటి స్మృతి నషా, రెండవది సేవ నషా. మెజారిటి ఈ డబల్ నషాలో సదా ఉండేవారు, ఈ డబల్ నషాయే అనేక నషాల నుండి రక్షిస్తుంది. కావున డబల్ విదేశీ పిల్లలు కూడా రెండు విషయాల రేస్లో మంచి నంబరు తీసుకుంటున్నారు. బాబా మరియు సేవల గురించిన పాటను స్వప్నంలో కూడా పాడుతూ ఉంటారు. కావున ఇది మూడు నదుల సంగమము. గంగ-యమున-సరస్వతి మూడూ ఉన్నాయి కదా. సత్యమైన అల్లా నివసించే స్థానములో మూడు నదుల సంగమము జరుగుతూ ఉంది. మంచిది.
సదా మాస్టర్ విధాతలందరికి, సదా అందరికీ ఇచ్చే భావనలో ఉండేవారికి, దేవతలుగా అయ్యేవారికి, సదా 'నీది-నిది' అనే పాటను గానం చేసేవారికి, సదా అప్రాప్తి ఆత్మలను తృప్తిగా చేసే సంపన్న ఆత్మలకు, విధాత వరదాత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
టీచర్లతో కలయిక - సేవాధారులు సేవ చేయడం వలన స్వయం కూడా శక్తిశాలిగా అవుతారు మరియు ఇతరులలో కూడా శక్తిని నింపేందుకు నిమిత్తంగా అవుతారు. సత్యమైన ఆత్మిక సేవ సదా స్వ ఉన్నతి మరియు ఇతరుల ఉన్నతికి నిమిత్తంగా తయారు చేస్తుంది. ఇతరుల సేవ చేసేందుకు ముందు స్వ సేవను చేసుకోవలసి ఉంటుంది. ఇతరులకు వినిపించడం అనగా ముందు స్వయం వినడం. ముందుగా తమ చెవులలోకి వెళ్తుంది కదా! వినిపించడం జరగదు. వినడం జరుగుతుంది. కావున సేవ ద్వారా డబల్ లాభం కలుగుతుంది. స్వయానికి మరియు ఇతరులకు కూడా లాభం కలుగుతుంది. సేవలో బిజీగా ఉండడం అనగా సహజంగా మాయాజీతులుగా అవ్వడం. బిజీగా లేనప్పుడే మాయ వస్తుంది. సేవాధారులు అనగా బిజీగా ఉండేవారు. సేవాధారులకు ఎప్పుడూ తీరిక ఉండదు. తీరిక లేకపోతే మాయ ఎలా వస్తుంది! సేవాధారులుగా అవ్వడం అనగా సహజమైన విజయులుగా అవ్వడం. సేవాధారులు మాలలో సహజంగా రాగలరు. ఎందుకంటే వారు సహజంగా విజయులుగా ఉంటారు. కావున విజయులు విజయ మాలలోకి వస్తారు. సేవాధారులు అనగా తాజాఫలము తినేవారు. తాజా ఫలాన్ని తినేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. తాజా ఫలాలను, తాజా కూరలను తినమని డాక్టర్లు కూడా చెప్తారు. కావున సేవ చేయడం అనగా విటమిన్లు లభించడం. మీరు అటువంటి సేవాధారులే కదా! సేవకు ఎంత మహత్వముంది! ఇప్పుడు ఈ విషయాలను చెక్ చేసుకోండి. అటువంటి సేవ అనుభవమవుతోంది కదా! ఎవరెంత చిక్కులలో ఉన్నా సేవ సంతోషంగా నాట్యం చేయిస్తుంది. ఎవరెంత రోగులుగా ఉన్నా సేవ ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. సేవ చేస్తూ చేస్తూ రోగగ్రస్థులుగా అయిపోతారని కాదు. రోగులను ఆరోగ్యంగా తయారు చేసేదే సేవ. అటువంటి అనుభవమవ్వాలి. మీరు అటువంటి విశేష సేవాధారీ విశేష ఆత్మలు. బాప్దాదా సేవాధారులను సదా శ్రేష్ఠ సంబంధంతో చూస్తారు. ఎందుకంటే సేవ కొరకు త్యాగులుగా, తపస్వీలుగా అయితే అయ్యారు కదా! త్యాగము మరియు తపస్సును చూసి బాప్దాదా సదా సంతోషంగా ఉన్నారు.
2) సేవాధారులనగా సదా సేవ కొరకు నిమిత్తంగా అయిన ఆత్మలని అర్థము. సదా స్వయాన్ని నిమిత్తంగా భావించి సేవలో ముందుకు వెళ్లండి. ''నేను సేవాధారిని'' - ఈ 'నేను' అనే భావమైతే రావడం లేదు కదా! తండ్రి చేయించేవారు నేను నిమిత్తంగా ఉన్నాను. చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు - ఈ శ్రేష్ఠ భావనతో సదా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. ఒకవేళ 'నేను చేసేవాడిని' అని అనుకుంటే అతీతంగా మరియు ప్రియంగా ఉండలేరు. కావున సదా అతీతంగా మరియు ప్రియంగా అయ్యేందుకు సహజ సాధనము - ''చేయించేవారు చేయిస్తున్నారు'' అనే స్మృతిలో ఉండడం. దీని ద్వారా సఫలత కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక సేవ కూడా సహజమవుతుంది. శ్రమ అనిపించదు. ఎప్పుడూ 'నేను' అన్న చక్రములోకి వచ్చేవారు కాదు. ప్రతి విషయంలో బాబా - బాబా అన్నట్లయితే సఫలత ఉంటుంది. అటువంటి సేవాధారులు సదా ముందుకు వెళ్తారు, ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తారు. లేకపోతే స్వయం కూడా ఒకసారి ఎగిరేకళ, ఒకసారి ఎక్కేకళ, ఒకసారి నడిచేకళ, అలా మారుతూ ఉంటారు. ఇతరులను కూడా శక్తిశాలిగా తయారుచేయలేరు. సదా బాబా - బాబా అనేవారు కూడా కాదు, చేసి చూపించేవారు. అటువంటి సేవాధారులు సదా బాప్దాదాకు సమీపంగా ఉంటారు. సదా విఘ్నవినాశకులుగా ఉంటారు. మంచిది.

Comments