06-01-1983 అవ్యక్త మురళి

06-01-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

నిరంతరం సహజయోగిగా అయ్యేటందుకు సహజయుక్తి.

                       స్మృతి మరియు సేవ యొక్క సంలగ్నతలో ఉండేవారు, సదా స్నేహం యొక్క బంధనలో బంధించే తల్లి తండ్రి తమ గారాభమైన పిల్లలతో మాట్లాడుతున్నారు -
                   ఈరోజు తోటమాలి అయిన శివబాబా రకరకాల సువాసనలని కలిగిన తన యొక్క పూలతోట చూసి హర్షిస్తున్నారు.బాప్ దాదా రకరకాల ఆత్మిక పూల యొక్క సువాసన మరియు రూపాన్ని చూసి ప్రతి ఒక్కరి విశేషతని పాడుతూ ఉన్నారు. ఎవరిని చూసినా కానీ ఒకరి కంటే ఒకరు ప్రియమైనవారు మరియు శ్రేష్టమైనవారు. నెంబర్ వారీగా అయినా కానీ అంతిమ నెంబర్ కూడా బాబాకి అతి ప్రియం. ఎందుకంటే శక్తిననుసరించి మాయాజీతులుగా అవ్వటంలో బలహీనంగా ఉన్నా కానీ బాబాని గుర్తించి మనస్సు ద్వారా ఒక్కసారి అయినా నా బాబా అని అంటే దయాసాగరుడు కనుక అటువంటి పిల్లలను కూడా దానికి ఫలితంగా కోటి రెట్లు ఆత్మిక ప్రేమతో చూస్తారు. నా పిల్లవాడు విశేషాత్మ అని. బాబావారిగా అయ్యారు కదా అనే దృష్టితో చూస్తారు. బాప్ దాదా అటువంటి పిల్లలను కూడా దయ మరియు స్నేహం యొక్క దృష్టితో ముందుకు తీసుకువెళ్తుంటారు. ఎందుకంటే నావారు అనే భావన ఉంటుంది. ఈ ఆత్మిక నావారు అనే స్మృతి పిల్లలలో సమర్ధతని నింపే ఆశీర్వాదంగా అవుతుంది. బాప్ దాదాకి నోటి ద్వారా ఆశీర్వాదం ఇచ్చే అవసరం ఉండదు. ఎందుకంటే వాణీ ద్వారా లేదా మాటల ద్వారా ఇవ్వటం రెండవ నెంబర్. కానీ స్నేహం యొక్క సంకల్పం శక్తిశాలిగా ఉంటుంది. మరియు మొదటి నెంబర్ ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. బాప్ దాదా ఈ సూక్ష్మ స్నేహం యొక్క సంకల్పంతో తల్లి, తండ్రి రూపంలో ప్రతి పిల్లవాడిని పాలన చేస్తున్నారు. ఎలాగైతే లౌకికంలో గారాభమైన పిల్లలని తల్లి తండ్రి గుప్తరూపంలో చాలా శక్తిశాలి వస్తువులతో పాలన చేస్తారు. దీనిని గారాభం అని అంటారు. అలాగే బాప్ దాదా వతనంలో కూడా పిల్లలందరిని గారాభం చేస్తున్నారు. ఎలాగైతే మధువనంలో రావటం విశేషమైన మర్యాద కదా! బాప్ దాదా వతనంలో ప్రతి పిల్లవాడిని ఫరిస్తా ఆకారి రూపంలో ఆహ్వానం చేసి ఎదురుగా పిలుస్తున్నారు. మరియు ఆకారి రూపంలో తన సంకల్పం ద్వారా సూక్ష్మంగా సర్వశక్తుల యొక్క విశేషబలం నింపే గారాభం చేస్తున్నారు. 1. స్వయం పురుషార్ధం ద్వారా శక్తిని పొందటం. కానీ ఇది తల్లి తండ్రి స్నేహంతో ఇచ్చే విశేషమైన గారాభం. ఎలాగయితే ఇక్కడ విశేషంగా మర్యాద చేస్తారు కదా! నియమపూర్వకంగా రోజు భోజనంలో విశేషమైన పదార్థాన్ని తినిపిస్తారు, ఎక్కువ ఇస్తారు. అలాగే బ్రహ్మ తల్లికి కూడా పిల్లలంటే విశేష స్నేహం. బ్రహ్మ తల్లి కూడా వతనంలో పిల్లల యొక్క మెరుపు లేకుండా ఉండలేరు. ఆత్మిక మమత ఉంటుంది. అందువలన సూక్ష్మ స్నేహం యొక్క ఆహ్వానంతో పిల్లలని విశేషంగా చూస్తారు. సాకారంలో జ్ఞాపకం ఉంది కదా! ప్రతి గ్రూపుకి విశేష స్నేహ స్వరూపంలో తన చేతులతో తినిపించేవారు మరియు సంతోష పెట్టేవారు. ఆ స్నేహ సంస్కారం ఇప్పటికీ ప్రత్యక్షంగా నడుస్తుంది. దీనిలో కేవలం పిల్లలు బాబా సమానంగా ఆకార రూపధారిగా అయ్యి అనుభవం చేసుకోవాలి. అమృతవేళ బ్రహ్మ తల్లి తండ్రి రండి పిల్లలూ! రండి పిల్లలూ! అంటూ విశేష శక్తులు అనే భోజనం పిల్లలకు తినిపిస్తారు. ఎలాగైతే ఇక్కడ నేతిని త్రాగిస్తూ, వ్యాయామం చేయిస్తారు కదా! వతనంలో కూడా నేతిని త్రాగిస్తారు అంటే సూక్ష్మ శక్తుల యొక్క శక్తిశాలి పదార్థాలు పెడతారు. అభ్యాసం అనే వ్యాయామం చేయిస్తారు. బుద్ధిబలం ద్వారా విహారం చేయిస్తారు. ఇప్పుడిప్పుడే పరంధామం, మరలా ఇప్పుడిప్పుడే సూక్ష్మ వతనం, ఇప్పుడిప్పుడే సాకార సృష్టిలో బ్రాహ్మణ జీవితం మూడు లోకాలలో పరుగుపోటీ చేయిస్తారు. దీని ద్వారా విశేష గారాభం జీవితంలో నిండుతుంది. విన్నారా బ్రహ్మ తల్లి ఏం చేస్తారో? డబల్ విదేశీయులకి సెలవు రోజుల్లో దూరానికి వెళ్ళిపోయి విహారం చేసే అలవాటు ఉంటుంది. బాప్ దాదా కూడా డబల్ విదేశీ పిల్లలకి విశేష ఆహ్వానం ఇస్తున్నారు. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే వతనానికి రండి. సాగరం యొక్క ఒడ్డులోని మట్టిలోకి వెళ్ళకండి. జ్ఞాన సాగరం యొక్క ఒడ్డుకు రండి. ఖర్చు లేకుండా ప్రాప్తి కూడా ఉంటుంది. సూర్యుడి నుండి కిరణాల ద్వారా వెలుగును తీసుకోండి. చంద్రుని నుండి వెన్నెల తీసుకోండి. పిక్నిక్ చేసుకోండి. ఆడుతూ పాడుతూ ఉండండి. కానీ ఇవన్నీ బుద్ధిరూపీ విమానం ద్వారా చేయాలి. అందరి యొక్క బుద్దిరూపీ విమానం ఎవరెడీగా ఉందా? సంకల్పరూపీ స్విచ్ ని నొక్కగానే చేరుకోవాలి. విమానం అందరి దగ్గర రెడీగా ఉంది కదా! లేదా అప్పుడప్పుడు స్టార్ట్ అవ్వటం లేదా లేక పెట్రోల్ తక్కువ అయ్యిందా? ఆదా చేస్తున్నారా? ఇప్పుడు ఒక్క సెకనులో చేరుకోవాలి. అందువలన డబల్ రిఫైన్ (పూర్తి స్వచ్ఛమైన) పెట్రోల్ కావాలి. డబల్ రిఫైన్ పెట్రోల్ ఏది? అది ఒకే మాట, నిరాకారి, నిశ్చయంలో " నేను ఆత్మనై ఉన్నాను". అంతేగాని తండ్రి పిల్లల సంబంధం కాదు. కానీ ప్రవృత్తి మార్గం యొక్క పవిత్ర పరివారం కావాలి. అందువలన తండ్రి ద్వారా సర్వ సంబంధాల యొక్క రసానుభూతి యొక్క నషా సాకార రూపంలో నడుస్తూ తిరుగుతూ అనుభవం చేసుకోవాలి. ఇదే నషా మరియు సంతోషం నిరంతర సహజయోగీలుగా తయారుచేస్తుంది. దీని కారణంగా నిరాకారి మరియు సాకారి ఈ రెండు డబల్ రిఫైన్ అవ్వటానికి సాధనాలుగా మనకు అవసరం. మంచిది.
                    ఈరోజు పార్టీల యొక్క మిలనం. కనుక మరొకసారి సాకారి నిరాకారి నషా కోసం వినిపిస్తాను. డబల్ విదేశీ పిల్లల యొక్క సర్వీస్ ప్రత్యక్ష ఫలానికి, ఆజ్ఞపాలనకు విశేషంగా శుభాకాంక్షలు బాప్ దాదా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు మంచి పెద్ద గ్రూపులను తెచ్చారు. బాప్ దాదా ముందు మంచి మంచి పుష్పగుచ్చాలు కానుకలుగా ఉన్నాయి. వాటి వలన బాప్ దాదా నమ్మకదారి పిల్లల యొక్క మనస్సు తెలుసుకుని ప్రేమతో వరదానం ఇస్తున్నారు. సదా జీవిస్తూ ఉండండి - దృష్టి పొందుతూ ఉండండి.
                    అచ్ఛా! నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలకు, నలువైపులా స్మృతి మరియు సేవ యొక్క సంలగ్నతలో నిమగ్నం అయ్యి ఉండేవారికి, బాబాను ప్రత్యక్షం చేయటానికి నిమిత్తంగా ఉన్న ముద్దు బిడ్డల యొక్క సేవకు బదులుగా ప్రీతి మరియు స్మృతి యొక్క బదులుగా అవినాశి స్మృతి, అవినాశి నిశ్చయం ఉన్న వారికి అవినాశి ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments