05-04-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సర్వవరదానాలు మీ యొక్క జన్మసిద్ధ అధికారం.
సర్వ వరదానాలతో సంపన్నంగా శ్రేష్టభాగ్యం తయారుచేసే అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు-
బాబా మరియు పిల్లల కలయిక యొక్క మేళా చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ద్వాపరయుగం నుండి జరిగే మేళాలు విశేషరూపంలో ఉంటాయి. కొన్ని నది ఒడ్డున జరుగుతాయి, కొన్ని దేవీ దేవతా మూర్తుల ఎదురుగా జరుగుతాయి. శివరాత్రి ఒకటే బాబా యొక్క స్మృతిచిహ్న రూపంలో చేస్తారు. కానీ వారికి పరిచయం లేదు. ద్వాపరయగం యొక్క మేళాలు భక్తులు మరియు దేవీ దేవతలకు జరుగుతాయి. కానీ ఈ మేళా మహానది మరియు సాగరుని ఒడ్డున తండ్రి మరియు పిల్లలకు జరుగుతుంది. ఇటువంటి మేళా మొత్తం కల్పంలో ఎప్పుడు జరుగదు. మధువనంలో డబల్ మేళా చూస్తున్నారు. సాగరుడైన బాబా మరియు మహానది అయిన దాదా ఇద్దరి మేళా చూస్తున్నారు. వెనువెంట బాప్ దాదా మరియు పిల్లల మేళా చూస్తున్నారు. మేళా అయితే జరుపుకున్నారు కదా! ఈ మేళా వృద్ధిని పొందుతూనే ఉంటుంది. వృద్ది పొందాలి అని ఒకవైపు సేవ కూడా చేస్తున్నారు. వృద్ధి కూడా పొందవలసిందే మరియు మేళా కూడా జరుపుకోవలసిందే. బాప్ దాదాలు పరస్పరం ఆత్మికసంభాషణ చేసుకుంటున్నారు. బ్రహ్మాబాబా అన్నారు - బ్రాహ్మణుల యొక్క వృద్ధి అయితే అంతిమం వరకు అవుతూనే ఉంటుంది. కానీ సాకారసృష్టిలో, సాకారరూపం ద్వారా కలయిక జరుపుకునే విధి, వృద్ధితో పాటు పరివర్తన అవుతుంది. అద్దెకు తీసుకున్న వస్తువుకి మరియు సొంత వస్తువుకి తేడా ఉంటుంది కదా! అద్దెకు తీసుకున్న వస్తువుని చాలా జాగ్రత్తగా సంభాళించి కార్యంలో ఉపయోగించవలసి ఉంటుంది. సొంత వస్తువైతే ఎలా కావాలంటే అలా ఉపయోగించవచ్చు. బాబా అద్దెకు తీసుకున్న సాకార శరీరం అంతిమ జన్మ యొక్క శరీరం. అద్దెకు తీసుకున్న పాత శరీరాన్ని నడిపించే విధి కూడా చూడాలి కదా! అప్పుడు శివబాబా నవ్వుతూ అన్నారు - వృద్ధి అయ్యేకొలది మూడు సంబంధాలతో మూడు విధాలుగా విధి మారుతూ ఉంటుంది. అది ఎలా మారుతుంది?
తండ్రి రూపంతో కలయిక యొక్క విశేష అధికారం - విశేషంగా టోలీ ఇవ్వటం (ప్రసాదం ఇవ్వటం) మరియు శిక్షకుని రూపంలో - మురళి చెప్పటం. సద్గురువు రూపంలో - దృష్టి ద్వారా అద్భుతం చేయటం. అంటే అవ్యక్త కలయిక యొక్క ఆత్మిక స్నేహం యొక్క దృష్టి. ఈ విధి ప్రకారం వృద్ధి అయ్యే పిలల్లకు స్వాగతం మరియు కలయిక యొక్క మేళా జరుగుతుంది. మాకు ఏదోక వరదానం లభించాలి అని అందరికీ సంకల్పం ఉంటుంది. బాప్ దాదా చెప్పారు - ఎప్పుడైతే వరదాతకు పిల్లలుగా అయ్యారో వరదానాలు మీ యొక్క జన్మసిద్ద అధికారం. ఇప్పుడేమిటి, జన్మతోనే వరదాత వరదానాలు ఇచ్చారు. విధాత భాగ్యం యొక్క అవినాశి రేఖ జాతకంలో నిర్ణయించారు. లౌకికంలో కూడా జాతకం ముందుగానే తయారుచేస్తారు. భాగ్యవిధాత బాబా, వరదాత బాబా, బ్రహ్మాతల్లి జన్మతోనే బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మకుమారీ అనే నామసంస్కారానికి ముందే సర్వ వరదానాలు ఇచ్చారు మరియు అవినాశి భాగ్యరేఖ గీసారు. జాతకం తయారుచేసారు. కనుక సదా వరదానులు. స్మృతిస్వరూప పిల్లలకు సదా సర్వ వరదానాలు లభిస్తాయి. మీరు ప్రాప్తిస్వరూప పిల్లలు. ఏ ప్రాప్తి అయినా పొందడానికి మీకు అప్రాప్తి ఏది! ఈ రోజు బాప్ దాదాలకు ఈ ఆత్మికసంభాషణ నడిచింది. ఈ హాల్ ఎందుకు తయారుచేసారు! మూడు వేల మంది, నాలుగువేల మంది బ్రాహ్మణులు రావాలనే తయారుచేసారు కదా! మేళా పెరగాలి అని. వృద్ధిని పొందుతూ ఉండండి. మురళి చెప్పటం మాట్లాడటం కాదా! దృష్టి పడాలి అంటున్నారు, అన్ని విషయాలు పూర్తవుతాయి. ఇప్పుడైతే ఆబూ వరకు లైన్ రావాలి కదా! ఇంత వృద్ధి అయితే చేయాలి కదా! లేక మేము కొద్దిమంది ఉంటేనే బావుంది అనుకుంటున్నారా! సేవాధారులు సదా స్వయాన్ని, త్యాగం చేసి ఇతరుల సేవలో సంతోషిస్తారు. మాతలు సేవ యొక్క అనుభవీలు కదా! మీ నిద్రను కూడా త్యాగం చేసి పిల్లలను ఒడిలో వేసుకుని ఊపుతూ ఉంటారు. మీ ద్వారా ఏదైతే వృద్ధి జరుగుతుందో అది వారికి కూడా భాగం వస్తుంది కదా! మంచిది.
ఈసారి బాప్ దాదా భారతవాసీ పిల్లలందరి నిందని తొలగించారు. ఎంత వరకు అద్దెకు తీసుకున్న శరీరం నిమిత్తం అవుతుందో అంత వరకు నిందలను పూర్తి చేస్తూనే ఉంటాను. మంచిది.
ఆత్మిక స్నేహాన్ని మరియు ఆత్మిక కలయికను అనుభవం చేసుకునే వారికి, జన్మతోనే సర్వ వరదానాలతో సంపన్నంగా అయ్యే అవినాశి శ్రేష్టభాగ్యవాన్ ఆత్మలకు, ఈ విధంగా సదా మహాత్యాగి, త్యాగం ద్వారా భాగ్యం పొందే పదమాపదమ్ భాగ్యవాన్ పిల్లలకు, నలువైపుల ఉన్నటువంటి స్నేహానికి ఛాత్రకులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment