03-12-1983 అవ్యక్త మురళి

03-12-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగ బ్రాహ్మణుల శ్రేష్ఠ భాగ్యము

రత్నాకరుడైన బాబా ఈరోజు తమ వ్యాపారీ పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ వ్యాపారమును చేసారు. ఎవరితో వ్యాపారము చేసారు మరియు ఎవరు చేసారు? ప్రపంచము లెక్కలో అయితే చాలా అమాయకమైన పిల్లలు కానీ అమాయకులైన పిల్లలు వివేకవంతుడైన బాబాను తెలుసుకున్నారు, కనుక అమాయకులయ్యారా లేక చతురులయ్యారా? ప్రపంచములోనివారెవరైతే స్వయమును అనేక విషయాలలో తెలివైనవారుగా భావిస్తారో వారితో పోలిస్తే మిమ్మల్నందరినీ అమాయకులుగా భావిస్తారు కానీ మీరందరూ వారిని అమాయకులు అని అంటారు - ఎందుకంటే వివేకవంతుడైన బాబాను తెలుసుకునే వివేకము, చతురత వారిలో లేవు. మీరు మూలమును తెలుసుకున్నారు మరియు వారు విస్తారములోకి పోతున్నారు. మీరందరూ ఒక్కరిలో పదమాలను పొందారు మరియు వారు లక్షలు, కోట్లు లెక్కించుకుంటూ మిగిలిపోయారు. గుర్తించే నేత్రము, శ్రేష్ఠ జ్ఞాన నేత్రము అని దేనిని అంటారు, అది కల్పకల్పము ఎవరికి ప్రాప్తిస్తుంది? అమాయక ఆత్మలైన మీకు ప్రాప్తిస్తుంది. వారు ఏంటి, ఎందుకు, అలా మరియు ఎలా.... అనే విస్తారములో వెతుకుతూనే ఉండిపోతారు మరియు మీరందరూ ''వారే మా బాబా'', మేరా బాబా అని అంటూ రత్నాకరునితో వ్యాపారము చేసారు. జ్ఞాన సాగరుడు అనండి, రత్నాకరుడు అనండి, వారు రత్నాలతో పళ్ళేలను నిండుగా నింపి ఇస్తున్నారు. ఆ రత్నాలతో ఆడుకుంటారు, రత్నాలతో పోషింపబడతారు, రత్నాలలో ఊగుతారు, రత్నాలే రత్నాలు, ఎన్ని రత్నాలు లభించాయి అన్నదానిని లెక్కించగలరా! అమృతవేళ కళ్ళు తెరవటంతోనే బాబాతో మిలనము చేస్తూ రత్నాలతో ఆడుకుంటారు కదా! మొత్తము రోజంతటిలో ఏ పని చేస్తారు? రత్నాల పనే చేస్తారు కదా! జ్ఞానరత్నాల పాయింట్లను బుద్ధిలో లెక్కిస్తారు కదా. కనుక మీరు రత్నాల వ్యాపారులు, రత్నాల గనులకు యజమానులు. ఎంతగా కార్యములో పెట్తూ ఉంటారో అంతగా పెరుగుతూ ఉంటాయి. వ్యాపారము చెయ్యటము అనగా అతి సంపన్నులుగా అవ్వటము. మరి వ్యాపారము చెయ్యటము వచ్చేసిందా! వ్యాపారము చేసేసారా లేక ఇప్పుడు చెయ్యాలా? వ్యాపారులు నంబర్ వారీగా ఉన్నారా లేక అందరూ నంబర్ వన్ లేనా? అందరి లక్ష్యమైతే నంబర్ వన్ దే ఉంది, కానీ నంబర్ వన్ లు ఎల్లప్పుడు రత్నాలతో ఎంత బిజీగా ఉంటారంటే ఇతర ఏ విషయాలను చూసేందుకు, వినేందుకు మరియు ఆలోచించేందుకు తీరికే ఉండదు. మాయ కూడా వీరి బిజీని చూసి తిరిగి వెళ్ళిపోతుంది. మాటిమాటికీ మాయను తరిమేసే శ్రమ చెయ్యవలసిన అవసరము ఉండదు. ఈరోజు బాప్ దాదా ఒకవైపు అతి పెద్దవారు, ప్రసిద్ధులుగా పిలవబడే పిల్లలను వారు ఏమేమి చేస్తున్నారు అని చూస్తున్నారు. అనేక విషయాల వివేకము ఉంది, ఒక్క విషయములోనే లేదు, ఆ విషయములో బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదా కూడా ఇరువురిలోని అంతరాన్ని చూసి గీతాన్ని గానము చేస్తున్నారు. మీరు కూడా ఆ పాటను పాడ్తారు. ఆ పాటంటే బ్రహ్మాబాబాకు చాలా ఇష్టము, బాప్ దాదా పిల్లల కొరకు పాడుతున్నారు, దానిని ఈరోజు బ్రాహ్మబాబా చాలా ఆనందములో గానం చేసారు,- 'కితనే భోలే కితనే ప్యారే మీఠే-మీఠే బచ్చే(ఎంత అమాయకులు, ఎంత ప్రియమైనవారు మధురాతి మధురమైన పిల్లలు!). మీరు బాబా కొరకు పాడుతారు కదా. బాబా కూడా పిల్లల కొరకు ఈ పాటనే పాడుతారు, అలా ఈ స్మృతి స్వరూపములో ఎవరికి ప్రియమైనవారు, ఎవరికి మధురమైనవారు, పిల్లల గీతమును ఎవరు గానం చేస్తున్నారు, ఈ స్మృతి సదా నిర్మాణులుగా తయారుచేసి స్వ-అభిమానపు నషాలో స్థితమయ్యేటట్లు చేస్తుంది. ఇటువంటి నషాలో ఎటువంటి నష్టము లేదు. ఇంత నషా ఉంటుందా? అర్థకల్పము మీరు భాగ్యవంతుని గీతమును గానం చేస్తారు మరియు ఇప్పుడు భగవంతుడు గానం చేస్తున్నారు. రెండువైపుల ఉన్న పిల్లలను చూసిన బాబాకు దయ మరియు స్నేహము రెండూ కలుగుతున్నాయి.

బ్రహ్మాబాబాకు ఈరోజు భారతదేశము మరియు విదేశములలో ఉన్న పరిచయమందని పిల్లలు విశేషంగా గుర్తుకు వస్తున్నారు. ప్రపంచములోనివారైతే వారిని వి.ఐ.పి.లు అని అంటారు, కానీ బాబా వారిని వి.ఐ.పి.లుగా అనగా వెరీ ఇన్నోసెంట్ పర్సన్స్(చాలా అమాయకులైన వారు) అన్న ఈ రూపములో చూస్తున్నారు. మీరు సెంట్ లు, వారు ఇన్నోసెంట్ లు కానీ ఇప్పుడు వారికి కూడా అంచలిని(రెండు చేతుల నిండుగా దానమును) ఇవ్వండి. అంచలిని ఇవ్వటము వస్తుందా? మీ లైన్లో వారి నంబర్ ఇప్పుడు వెనుక ఉందా లేక ముందు ఉందా? ఏమనుకుంటున్నారు? (సైలెన్స్డ్రిల్)

ఇటువంటి విశేష సైలెన్స్ శక్తిని ఆ ఆత్మలకు ఇవ్వండి. ఇప్పుడు ఏదైనా ఆధారము, ఏదైనా నూతన మార్గము దొరకాలి అని వారిలో సంకల్పము తలెత్తుతుంది. ఇప్పుడు కోరిక ఉత్పన్నమవుతుంది, ఇప్పుడు వారికి దారిని చూపించటము మీ అందరి కార్యము. ''ఐక్యత మరియు దృఢత''. దారిని చూపించేందుకు ఈ రెండూ సాధనాలు. సంగఠనలోని శుభ భావన అటువంటి ఆత్మలకు భావనా ఫలమును ఇప్పించేందుకు నిమిత్తముగా అవుతుంది. సర్వుల శుభ సంకల్పాలు ఆ ఆత్మలలో కూడా శుభ కార్యమును చేసే సంకల్పమును ఉత్పన్నము చేస్తాయి. ఈ విధిని ఇప్పటినుండే అమలుచెయ్యండి. ఎప్పుడైతే అందరి శుభ సంకల్పాల ఆహుతి పడుతుందో అప్పుడే పెద్ద కార్యము సఫలమవుతుంది. అర్థమైందా! ఏ పిల్లలూ వంచితులై మిగిలిపోకూడదు అన్న దీనినే బాప్ దాదా అందరి కొరకు చెప్తారు. మీరందరూ అయితే అతి సంపన్నులుగా అయిపోయారు కదా. అచ్ఛా-

ఇటువంటి శ్రేష్ఠ వ్యాపారము చేసే శ్రేష్ఠ వ్యాపారులు, సదా రత్నాలతో పోషింపబడే మరియు ఆడుకునే మాస్టర్ రత్నాకరులు, బాబాకు అతి స్నేహీలు, సదా సహయోగీలు, అతి ప్రియమైనవారు, గుర్తించే నేత్రధారులు, సదా సేవాధారులు, సదా మేరా బాబా అన్న గీతమును గానము చేసే విశేష ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో మిలనము

మద్రాసు నివాసీల కొరకు - అందరూ ఉల్లాస-ఉత్సాహాలలో ఉన్నారు కదా! బాబాను ఎలా ప్రత్యక్షము చెయ్యాలి అన్న ఒకే ఉల్లాస-ఉత్సాహము అందరి మనసులలో ఉంది కదా! ఇప్పుడైతే స్టేజ్ కూడా తయారుచేస్తున్నారు కదా. ప్రత్యక్షతా జెండాను ఎగురవేసేందుకు స్టేజ్ తయారుచేస్తున్నారు. స్ధూల జెండాను ఇతరులు కూడా ఎగురవేస్తారు, మీరందరూ ఏ జెండాను ఎగురవేస్తారు? వస్త్రంతో చేసిన జెండాను ఎగరవేస్తారా, ఏం చేస్తారు? అదైతే నిమిత్తమాత్రముగా జరిగింది, కానీ ఏ అసలైన జెండాను ఎగురవేస్తారు? బాబాను ప్రత్యక్షము చేసే జెండా. బాబా వచ్చేసారు అన్న ఈ శబ్దమును వ్యాపింపచేసే జెండాను ఎగురవేస్తారు. దీని ఏర్పాట్లు చేస్తున్నారు కదా. ఎవరైతే వంచితులుగా ఉన్నారో ఆ ఆత్మలందరికీ ప్రకాశము లభించాలి, మార్గము లభించాలి. ఈ పురుషార్థమును అందరూ చేస్తున్నారు మరియు ముందు ముందు కూడా చెయ్యాలి. ఇప్పటినుండే ఈ అలను వ్యాపింపచేస్తే అప్పుడు ఆ సమయములో నలువైపుల ఈ అల వ్యాపించగలదు. అటువంటి ఏర్పాట్లు చేసారు కదా. ఇప్పటివరకు ఎక్కడా ఏదైతే జరగలేదో దానిని మేము చేసి చూపిస్తాము అన్నదాని గురించే ఆలోచించండి. ఏదైనా కొత్తగా చెయ్యాలి. కొత్త విషయము ఇదే - సర్వాత్మలకు పరిచయము లభించాలి మరియు బాబా వచ్చారు అని వారు భావించాలి, వర్ణించాలి, అనుభవము చెయ్యాలి. అచ్ఛా-

ఆహ్వానముపై వచ్చిన సోదరీ సోదరుల గ్రూపుతో

అందరూ స్వయమును విశేష ఆత్మలుగా అయితే భావిస్తారు కదా. విశేష ఆత్మలా లేక అలా అవ్వాలా? చేస్తాములే, చూస్తాములే, ఇలా 'లే-లే' అన్న భాష కలిగినవారైతే కారు కదా! మా అందరి మహత్వము ఎంత గొప్పది అని మీ మహత్వమును తెలుసుకోండి. బాబాకు పిల్లల మహత్వము ఎంతైతే తెలుసో అంతగా పిల్లలు తమ మహత్వమును సదా గుర్తుంచుకోరు. తెలుసు కానీ గుర్తుంచుకోరు. ఒకవేళ గుర్తున్నట్లయితే సదా సమర్ధులుగా అయ్యి ఇతరులను కూడా సమర్ధులుగా తయారుచేసేందుకు, వారిలో ఉల్లాస-ఉత్సాహాలను పెంచేందుకు నిమిత్తులుగా అవుతారు. మరి నిమిత్తులే కదా? గతం గతః చేసారు. గడిచినదానిని మరిపింపచేసారు మరియు వర్తమానమును, భవిష్యత్తును సదా ఉల్లాస-ఉత్సాహాలు కలదిగా తయారుచేసుకున్నారు. నడుస్తూ-నడుస్తూ సాధారణ జీవితములో నడిచేవారుగా స్వయమును అనుభవము చేసుకుంటారు, కానీ మీరు సాధారణులు కారు. సదా శ్రేష్ఠులు. వ్యవహారము చేసారు, చదువుకున్నారు, వ్రవృత్తిని సంభాళించారు, ఇందులో విశేషత ఏమీ లేదు. ఇది కూడా సాధారణతయే. వీటినైతే చివరి నంబర్ కలవారు కూడా చేస్తారు. చివరి నంబర్లో ఉన్నవారు ఏదైతే చేస్తారో దానినే ఆదిరత్నాలు కూడా చేసినట్లయితే అందులో ఏం విశేషత ఉంది! ఆదిరత్నాలు అనగా ప్రతి సంకల్పము మరియు కర్మలో ఇతరుల కంటే విశేషత ఉండటము. ప్రపంచములోని వారి లెక్కలో అందరూ అతీతులైపోయారు, కానీ అలౌకిక పరివారములో కూడా ఎవరైతే సాధారణ పురుషార్థీలుగా ఉన్నారో వారి కంటే కూడా విశేషులు. ప్రపంచములోనివారి లెక్కలో చివరి నంబర్ కూడా విశేషమైనది కానీ ఈశ్వరీయ పరివారములో ఆదిరత్నాలు, విశేషమైనవారు. ఆ లెక్కతో మిమ్మల్ని చూసుకోండి. వృద్ధులు సదా చిన్నవారికి అతి మంచి సహజ సలహాను ఇచ్చేవారుగా ఉంటారు, మార్గాన్ని చూపించేవారుగా ఉంటారు. అలా మీరు ఊరికే నోటితో అనేవారు కారు, చేసి చూపించేవారు. కనుక మీ ప్రతి అడుగు, ప్రతి కర్మ ఎలా ఉండాలంటే ఈశ్వరీయ పరివారములోని ఆత్మలకు విశేషంగా కనిపించాలి. విశేష ఆత్మల కర్తవ్యము ఇదే కదా. విశేష ఆత్మలైన మిమ్మల్ని చూస్తే బాబా స్మృతి కలగాలి. చూడండి, ఇక్కడ మధువనములో ఇప్పుడు కూడా సాకార రూపములో దీదీ, దాదీలను చూసినప్పుడు వారి కర్మలలో విశేషంగా ఎవరు ఇమిడి ఉన్నట్లు కనిపిస్తారు? బాబా కనిపిస్తారు కదా! వీరు కూడా సాకార ఆత్మలే కదా. ఈ బ్రహ్మలాంటి విశేష పాత్రధారులైతే కాదు, నిరాకార శివబాబాలాగా కూడా కాదు, బ్రహ్మాలాగా కూడా కాదు. బ్రాహ్మణులు. మరి వారు కూడా బ్రాహ్మణులు, మీరు కూడా బ్రాహ్మణులు, ఆ విశేష నిమిత్త ఆత్మలు ఎలా నిమిత్తంగా అయ్యారు? బాధ్యత అనుకున్నారు కదా! బాధ్యతయే విశేషంగా తయారుచేసింది. అలాగే స్వయమును కూడా అనుభవము చేస్తారు కదా! మీరు కూడా బాధ్యులే కదా లేక దాదీ-దీదీలే బాధ్యులా! సేవాక్షేత్రములో అయితే మీరు కూడా నిమిత్తులే కదా. బాప్ దాదా నలువైపుల విశేష ఆత్మలందరినీ నిమిత్తులుగా తయారుచేసారు.

ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. స్మృతిలో ఎప్పుడూ ఇంత బాధ్యత ఉండాలి. ఏవిధంగా దీదీ, దాదీలను నిమిత్తులుగా చూస్తున్నారో అలాగే మీనుండి కూడా అందరికీ అనుభవము కలగాలి. వీరు ఆదిరత్నాలు, వీరి నుండి మాకు విశేష ఉల్లాస-ఉత్సాహాల ప్రేరణ లభిస్తుంది అని వారు భావించాలి. మేము దీదీ, దాదీలము, మమ్మల్ని గౌరవించండి అనైతే వారు అనరు కదా, కానీ కర్మ స్వతహాగనే ఆకర్షిస్తుంది. అలాగే మీ అందరి విశేష కర్మలు అందరినీ ఆకర్షించాలి. ఇంత బాధ్యత ఉంది. ఢీలాగా అయితే లేరు కదా. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, డబల్ భాధ్యత ఉంది, అని అనేవారిగా ఉండకూడదు. వదిలారు మరియు వదిలిపోయింది. ఇంత బేహద్ భాధ్యత ఉన్నాకూడా బాబాను చూడండి, స్థూల బాధ్యతలను కూడా చూసారు కదా. శివబాబా విషయమైతే పక్కన పెట్టండి, కానీ బ్రహ్మాబాబానైతే సాకారములో చూసారు కదా. బ్రహ్మాబాబాకు ఉన్నంత బాధ్యత స్థూలంలో కూడా ఎవరికీ లేదు. ఏం చెయ్యాలి, వాయుమండలములో ఉంటాము, వైబ్రేషన్లు చెడుగా ఉంటాయి, కొంగలు పొడుస్తూ ఉంటాయి, నలువైపుల అసురీ సంప్రదాయము ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ బ్రహ్మాబాబా ఆసురీ సంప్రదాయము మధ్యలో కూడా అతీతంగా-ప్రియంగా అయ్యి చూపించారు కదా! కనుక ఫాలో ఫాదర్.

ఇప్పుడేం చేస్తారు? ఇక్కడినుండి వెళ్ళిన తరువాత మిమ్మల్ని చూసిన అందరూ మా ఉల్లాస-ఉత్సాహాలను పెంపొందించే స్తంభము వచ్చింది అని అనుభవము చెయ్యాలి. అర్థమైందా. అలా బాబా ఆశల నక్ష్రత్రాలు మీరు. చిన్న చిన్న విషయాలనేవీ మనసులో పెట్టుకోకండి. వృద్ధుల మనసు విశాలహృదయంగా, పెద్ద మనసుగా ఉంటుంది. చిన్న మనసు ఉండదు. బ్రహ్మాబాబా ఏవిధంగా అందరి బలహీనతలను ఇముడ్చుకుని శ్రేష్ఠులుగా తయారుచేసారో అలా మీరు నిమిత్తులు. వీరు ఇలా చేస్తారు, వీరైతే విననే వినరు అని ఎప్పుడూ భావించకండి. వినని వారిని కూడా వినేవారిగా చెయ్యటము మీ పని. వారు చిన్నవారు, మీరు పెద్దవారు. పెద్దవారు మారాలి. చిన్నవాళ్ళు అల్లరివారుగానే ఉంటారు కనుక వారి బలహీనతలను చూడకండి - పెద్దవారుగా అయ్యి బలహీనతలను ఇముడ్చుకునేవారిగా, బాబా సమానంగా తయారుచేసేవారిగా అవ్వండి. మీపైన ఇంత బాధ్యత ఉంది. ఈ బాధ్యతను మరల గుర్తు చేసేందుకు పిలిపించాము. అర్థమైందా. సాగరుని పిల్లలు కదా. సాగరము ఏం చేస్తుంది? ఇముడ్చుకుంటుంది. అన్నింటినీ ఇముడ్చుకుని రిఫ్రెష్ చేసేస్తుంది. మరి మీరు కూడా అందరి విషయాలను ఇముడ్చుకుని అందరినీ రిఫ్రెష్ చేసేవారు. ఈ విశేష ఆత్మ సాంగత్యము ద్వారా విశేష ప్రభావము పడింది, సహయోగము లభించింది అని వచ్చినవారు అనుభవము చెయ్యాలి. మీరు కూడా ''సహయోగమును ఇవ్వండి, సహయోగమును ఇవ్వండి'' అని అనేవారైతే కారు కదా. సహయోగాన్ని ఇచ్చేవారు. ఆది నుండి సహయోగులుగా అయ్యారు కనుక అంతిమము వరకు సహయోగమును ఇచ్చే సహచరులుగా అవుతారు కదా. ఇంత సహయోగము ఇచ్చినట్లయితే చిన్నవారు ఎగుర్తారు. మీరు ఏ స్థానమునకు వెళ్ళినా ఆ స్థానము ఎగిరేవారి స్థానంగా అయిపోతుంది కదా. మీరు విమానంలా అయ్యి వెళ్ళండి. ఎవరు కూర్చున్నా, ఎవరు సంపర్కములోకి వచ్చినా వారు ఎగరాలి. బాప్ దాదాకు సంతోషము ఉంది, ఏ సంతోషము? ఎంతమంది సహచరులు! సమానులను చూసినప్పుడు, సమానమైన పిల్లలను చూసి బాబాకు సంతోషము కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడకు కొద్దిమందే వచ్చారు, ఇంకా ఉన్నారు, ఎంతమంది వచ్చారో అంతమందినీ చూసి బాబాకు సంతోషము కలుగుతుంది. ఇప్పుడైతే విమానములా అయ్యి అందరినీ ఎగిరించండి. మా సోదరులు ఎంత కష్టపడుతున్నారు, దయ కలుగుతుంది కదా. సహయోగమును ఇవ్వండి మరియు ఎగిరించండి. విశేష ఆత్మల సేవ ఇదే. జిజ్ఞాసువులకు అర్థం చేయించారు, కోర్స్చేయించారు, మేళ చేయించారు, చేసారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. మేళలో కూడా విశేష ఆత్మలైన మీ విశేషతను చూడాలి. మీరు అక్కడ నిలబడి ఉన్నా అందరికీ ఉల్లాసము వచ్చేస్తుంది. పని చేసేవారు విశేషంగా ఉల్లాస-ఉత్సాహాల సహయోగము కావాలని కోరుకుంటారు. పని చేసే మీ చిన్న చిన్న సోదరీ సోదరులు చాలామంది వచ్చారు. వృద్ధులైన మీ పని - ఆ సహచరులకు స్నేహ దృష్టిని ఇవ్వటము, ఉల్లాస-ఉత్సాహాల సహయోగమును ఇవ్వటము. మిమ్మల్ని చూస్తే బాబా గుర్తుకు రావాలి. వీరైతే బాబా స్వరూపులు అని అందరి నోటి నుండి రావాలి. ఏవిధంగా ఈ ఇద్దరి (దీదీ, దాదీల) గురించి- వీరు బాబా స్వరూపులు అని వెలువడుతుంది కదా! సేవలో ప్రాక్టికల్ కర్మ చేస్తున్నారు అని అందరూ అంటారు, అలాగే దృఢ సంకల్ప సమారోహమును తప్పకుండా జరుపుకోవాలి. అర్థమైందా? మీరు తుఫానులలోకైతే రాలేదు కదా. తుఫాన్లను దాటేవారు, తుఫానులలోకి వచ్చేవారు కారు. మీరు ఉదాహరణ కదా. మిమ్మల్ని చూసిన అందరూ ఇలాగే నడవాలి, ఇలాగే జరుగుతుంది అని అనుకుంటారు. కనుక ఇంత అటెన్షన్ ఉండాలి. అచ్ఛా!

Comments