02-05-1982 అవ్యక్త మురళి

02-05-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విశేష జీవితకథను తయారు చేసుకునేటందుకు ఆధారం-సదా ఎగిరేకళలో ఉండాలి.
                 
                      అవ్యక్త బాప్ దాదా శ్రేష్ట ఆత్మలతో మాట్లాడుతున్నారు -
                   బాప్ దాదా ప్రతి పిల్లవాని యొక్క జీవితకథను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితకథలో ఏయే అదృష్ట రేఖలు ఉన్నాయి అని చూస్తున్నారు. సదా ఏకరసంగా ఉన్నతివైపు వెళ్తున్నారా లేక ఎక్కుతూ - దిగుతూ ఉన్నారా అనేది చూస్తున్నారు. ఈవిధంగా రెండు రకాలైన రేఖలు అంటే జీవితం యొక్క లీల కనిపించింది. ఎక్కిన తర్వాత మరలా ఏదైనా కారణానికి వశం అయ్యి దిగిపోయే కళలోకి వస్తే ఆ ప్రభావం కూడా మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. చాలా సమయం యొక్క ఎగిరేకళ యొక్క ప్రభావం చాలా సమయం యొక్క ప్రాప్తిని ఇస్తుంది, సహజయోగి జీవితం కలిగిన వారు సదా బాబాకి సమీపంగా మరియు బాబా తోడు యొక్క అనుభవం చేసుకుంటారు. సదా స్వయాన్ని సర్వశక్తులలో మాస్టర్ గా భావించడం ద్వారా సహజంగా స్మృతిస్వరూపంగా అయిపోతారు. ఏ పరీక్షలు లేదా పరిస్థితులు వచ్చినా కానీ సదా తమని తాము విఘ్నవినాశకులుగా అనుభవం చేసుకుంటారు. ఏవిధంగా అయితే ఎగిరేకళలో ఉన్నప్పుడు చాలా సమయం శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుంటున్నారో అదేవిధంగా ఎగిరేకళ నుండి దిగిపోయే కళలోకి వచ్చిన తర్వాత ఈ అనుభూతి స్వతహాగా మరియు సహజంగా అవ్వదు. కానీ విశేష ధ్యాస మరియు విశేష శ్రమ చేసిన తర్వాత అనుభవం చేసుకుంటారు. సదా ఎగిరేకళలో ఉండేవారు అంటే సదా సర్వప్రాప్తులు పొందిన మూర్తులు. మరియు ఎక్కిన తర్వాత మరలా దిగుతూ ఎక్కుతూ ఉండేవారు అంటే పోగొట్టుకున్న వస్తువును మరలా పొందేవారు. కనుక ఎక్కుతూ, దిగుతూ ఉండేవారు. మేము పొందాము కానీ పోగొట్టుకున్నాము అని అనుభవం చేసుకుంటారు. కానీ ఒకసారి పొందిన అనుభవం ఉన్న కారణంగా మరలా ఆ స్థితిని పొందకుండా ఉండలేరు. అందువలనే మరలా విశేషధ్యాస పెట్టడం ద్వారా తిరిగి ఆ అనుభూతిని పొందుతారు కానీ సదాకాలికం మరియు సహజం యొక్క లిస్ట్ లోకి రావడానికి బదులు రెండవ నెంబర్ లిస్ట్ లోకి వస్తారు. మూడవ నెంబర్ వారి జీవిత కథ ఏమిటి అనేది మీకు మీరే ఆలోచించుకోవచ్చు. అసలు మూడవ నెంబర్ తయారుకాకూడదు కదా!
                    మీ యొక్క జీవితకథను ఉన్నతి దిశగా మళ్ళించుకునే విధంగా, సర్వశక్తులతో సంపన్నంగా, సదా ప్రాప్తి స్వరూపంగా, శ్రేష్టంగా తయారు చేసుకోండి. ఇప్పుడిప్పుడే పైకి వెళ్ళటం, ఇప్పుడిప్పుడే క్రిందకి రావటం, మరలా కొంచెం సమయం పైకి, కొంచెం సమయం క్రిందకి ఈ విధంగా ఎక్కడం మరియు దిగటం యొక్క ఆటలో సదాకాలిక అధికారాన్ని వదలకూడదు. ఈరోజు బాప్ దాదా అందరి యొక్క జీవితకథను చూస్తున్నారు. ఎగిరేకళలో ఉన్నవారు ఎంతమంది మరియు ఎవరు ఉన్నారు? స్వయానికి స్వయం అయితే తెలుస్తుంది కదా నేను ఏలిస్టులో ఉన్నాను? దింపేసే పరిస్థితులు, పరీక్షలు అందరి ఎదురుగా వస్తాయి, పరీక్ష లేకుండా ఎవరు పాస్ కాలేరు కానీ - 1. పరీక్షలో సాక్షి మరియు సాథీ స్థితి యొక్క స్మృతి ద్వారా ఫుల్ పాస్ అవ్వటం మరియు కష్టం మీద పాస్ అవ్వటం ఈ రెండింటిలో తేడా వచ్చేస్తుంది కదా! 2. పెద్ద పరీక్షను చిన్నదిగా భావించడం మరియు చిన్న పరీక్షను పెద్దదిగా భావించడం దీనిలో తేడా వచ్చేస్తుంది. 3. చిన్న విషయాన్ని ఎక్కువగా స్మరణ చేస్తూ మరియు వర్ణన చేస్తూ, వాతావరణంలో వ్యాపింపచేస్తూ పెద్దదిగా చేస్తారు. మరియు కొంతమంది పెద్ద విషయాన్ని కూడా పరిశీలన చేసుకుంటారు మరియు వెనువెంట పరివర్తన కూడా చేసుకుంటారు మరియు సదాకాలికంగా బలహీన విషయానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఫుల్ స్టాప్ పెట్టడం అంటే భవిష్యత్తుకి ఫుల్ స్టాక్ నింపుకోవడం అవుతుంది, ఇక ముందు ఫుల్‌ పాస్ అవ్వడానికి అధికారిగా అవుతారు. ఇలా చాలా సమయం ఎగిరేకళలో ఉండే అదృష్టవంతులుగా అవుతున్నారు. కనుక జీవితకథలో విశేషత ఏమి ఉంచుకోవాలో అర్థమైందా! దీని ద్వారా మీది విశేష జీవితకథ అవుతుంది. కొంతమంది జీవితచరిత్ర విశేష ప్రేరణ ఇస్తుంది, ఉత్సాహాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది. జీవన మార్గాన్ని స్పష్టంగా అనుభవం చేయిస్తుంది. అదేవిధంగా విశేష ఆత్మలైన మీ అందరి యొక్క జీవిత చరిత్ర అంటే ప్రతి కర్మ అనేక ఆత్మలకు ఈ విధమైన అనుభవం చేయించాలి. నిమిత్త ఆత్మలైన వీరు ఈవిధంగా చేయగలిగినప్పుడు, మేము కూడా చేస్తాం. మేము కూడా ముందుకు వెళ్తాం మరియు అందరినీ కూడా ముందుకి తీసుకువెళ్తాం అనే మాట అందరి నోటి నుండి లేదా మనస్సు నుండి రావాలి. ఈ విధంగా ప్రేరణాయోగ్యమైన జీవితకథను సదా తయారు చేసుకోండి. కనుక ఏమి చేయాలో అర్థమైందా! మంచిది.
                           ఈ రోజు విశేషంగా డబల్ విదేశీయుల కలయిక రోజు. ఒకవైపు విదేశీయుల యొక్క కలయిక మరియు రెండవవైపు చాలా సమీప పిల్లల (మధువన నివాసులు) యొక్క కలయిక, ఇద్దరి యొక్క విశేష కలయిక జరుగుతుంది. మిగిలినవారు చూడడానికి గ్యాలరీలోకి వచ్చారు. కనుక బాప్ దాదా వచ్చిన పిల్లలందరికీ గౌరవం ఇస్తూ మురళీ కూడా చెప్పారు. మంచిది. బాబాతో కలయిక జరుపుకుని, బాబా ద్వారా లభించిన సారాన్ని సదా జీవితంలోకి తీసుకువచ్చేవారికి, విశేష సైగలను తమ జీవితం యొక్క సదాకాలిక వరదానంగా భావించి వరదాని మూర్తులుగా అయ్యే పిల్లలకు, వినటం అంటే తయారవ్వటం, కలుసుకోవటం అంటే సమానంగా అవ్వటం ఈ స్లోగన్ సదా స్మృతి స్వరూపంలోకి తీసుకు వచ్చేవారికి, స్నేహానికి రిటర్నుగా సదా నిర్విఘ్నంగా తయారుచేసుకునే సహయోగం ఇచ్చేవారికి, సదా అనుభవీ మూర్తిగా అయ్యి అందరిలో అనుభవాల యొక్క విశేషతలను నింపేవారికి, ఈ విధంగా సదా బాబా సమానంగా, సంపన్నంగా అయ్యే శ్రేష్టఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments