02-01-1985 అవ్యక్త మురళి

02-01-1985          ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా        మధువనము  

''సర్వోత్తమ స్నేహము, సంబంధము మరియు సేవ''
               ఈ రోజు బాప్దాదా పిల్లలందరి స్నేహంతో నిండిన కానుకలను చూస్తున్నారు. ప్రతి ఒక్క పుత్రుని స్నేహ సంపన్నమైన స్మృతి కానుకలు భిన్న-భిన్న రకాలుగా ఉన్నాయి. ఒక్క బాప్దాదాకు అనేక పిల్లల కానుకలు, అనేక సంఖ్యలో లభించాయి. ఇటువంటి కానుకలు మరియు ఇన్ని కానుకలు విశ్వములో ఎవ్వరికీ లభించజాలవు. ఇవి హృదయరామునికి హృదయపూర్వకంగా ఇచ్చిన కానుకలు. ఇతర మనుష్య ఆత్మలందరూ స్థూలమైన కానుకలను ఇస్తారు, కానీ సంగమ యుగములో వీరు విచిత్రమైన తండ్రి మరియు ఇవి విచిత్రమైన కానుకలు. కావున బాప్దాదా అందరి స్నేహపూరిత కానుకలను చూసి హర్షిస్తున్నారు. అందరి కానుకలు చేరుకున్నాయి. కానుకలు తప్పకుండా భిన్న-భిన్న విలువలు కలిగి ఉన్నాయి. కొందరివి చాలా విలువ కలిగినవి, మరికొందరివి తక్కువ విలువ కలిగినవి. ఎంతగా ఎడతెగని మరియు సర్వ సంబంధాల స్నేహముందో అంత విలువైన కానుకలుగా ఉన్నాయి. ఈ హృదయపూర్వక కానుకలు నంబరువారీగా స్నేహము మరియు సంబంధాల ఆధారముతో ఉన్నాయి. ఇద్దరు తండ్రులు కానుకల నుండి నంబరువారీగా మూల్యవంతమైన మాలను తయారు చేస్తున్నారు. అంతేకాక మాలను చూసి విశేషంగా ఏ విషయంలో మూల్యములో తేడా ఉందో పరిశీలిస్తున్నారు. ఏం చూశారు? అందరికీి స్నేహముంది, సంబంధము కూడా అందరికీి ఉంది, సేవ కూడా అందరికీి ఉంది. కానీ స్నేహములో ఆది నుండి ఇప్పటి వరకు సంకల్పము ద్వారా లేక స్వప్నములో కూడా ఇతర వ్యక్తులు లేక వైభవాల వైపు బుద్ధి ఆకర్షించబడి ఉండరాదు. ఒకే తండ్రి పై ఏకరస ఎడతెగని స్నేహములో సదా ఇమిడి ఉండాలి. సదా స్నేహము యొక్క అనుభవాల సాగరములో ఎలా ఇమిడిపోయి ఉండాలంటే, ఆ ప్రపంచము తప్ప ఇతర వ్యక్తులు లేక వస్తువులు కనిపించరాదు. అనంతమైన స్నేహ ఆకాశములో అనంతమైన అనుభవాల సాగరములా ఉండాలి. ఈ ఆకాశము మరియు సాగరము తప్ప ఏ ఇతర ఆకర్షణ ఉండరాదు. అటువంటి ఎడతెగని స్నేహపు కానుక నంబరువారి విలువ కలిగినదిగా ఉంది. ఎన్ని సంవత్సరాలు గడిచాయో అన్ని సంవత్సరాల స్నేహము యొక్క విలువ ఆటోమేటిక్గా జమ అవుతూ ఉంటుంది మరియు అంత విలువైన కానుక బాప్దాదా ఎదురుగా ప్రత్యక్షమయ్యింది. అందరిలో మూడు విషయాల విశేషతలను చూశారు.
1. ఎడతెగని స్నేహము :- హృదయపూర్వకమైన స్నేహముందా లేక సమయానుసారంగా, ఆవశ్యకత కారణంగా తమ స్వార్థాన్ని సిద్ధి చేసుకునే కారణంగా ఉందా? అటువంటి స్నేహమైతే లేదు కదా! స్నేహ స్వరూపము సదా ప్రత్యక్ష రూపంలో ఉందా? లేక సమయానికి ప్రత్యక్షమై మిగిలిన సమయంలో గుప్తంగా ఉంటోందా? హృదయాన్ని సంతోషింపజేసే స్నేహముందా లేక గాఢమైన, హృదయపూర్వకమైన స్నేహముందా? కావున స్నేహములో ఈ విషయాలన్నీ చెక్చేశారు.
2. సంబంధములో :- మొదటి విషయంగా సర్వ సంబంధాలు ఉన్నాయా? లేక ఏవైనా విశేష సంబంధాలు ఉన్నాయా? ఒకవేళ ఏ ఒక్క సంబంధము యొక్క అనుభూతి తక్కువగా ఉంటే సంపన్నతలో లోటు ఉంటుంది మరియు సమయ ప్రతి సమయం లోటుగా ఉన్న ఆ సంబంధము తన వైపుకు ఆకర్షిస్తుంది. ఉదాహరణానికి తండ్రి - టీచర్- సద్గురువు ఈ విశేష సంబంధాలనైతే జోడించారు, కానీ చిన్నవైన మనవల, మునిమనవల సంబంధాలను జోడించకపోతే ఆ సంబంధాలు కూడా తమవైపుకు ఆకర్షిస్తాయి. కావున సర్వ సంబంధాలు ఉన్నాయా? అని పరిశీలించుకోవాలి. రెండవ విషయము - తండ్రితో ప్రతి సంబంధము100 శాతము ఉందా లేక ఏ సంబంధమైనా100 శాతము ఉంది, ఏదైనా 50 శాతము ఉందా లేక నంబరువారీగా ఉందా? శాతంలో కూడా పూర్తిగా ఉందా లేక కొంచెం కొంచెం అలౌకికంగా, కొంచెం లౌకికంగా రెండిటిలో శాతము పంచబడి ఉందా? మూడవ విషయము - సర్వ సంబంధాల అనుభూతి యొక్క ఆత్మిక రసము సదా అనుభవం చేస్తున్నారా? లేక అవసరమైనప్పుడే అనుభవం చేస్తున్నారా? సదా సర్వ సంబంధాల రసమును తీసుకునేవారా లేక అప్పుడప్పుడు తీసుకునేవారా?
3. సేవలో :- సేవలో విశేషంగా ఏం చెక్చేసి ఉంటారు? మొదటి విషయం - స్థూల రూపంలో మనసు, వాణి, కర్మలు లేక తనువు, మనసు, ధనము అన్ని రకాల సేవల ఖాతా జమ అయ్యిందా? రెండవ విషయం - తనువు-మనసు-ధనము, మనసు-వాణి-కర్మలు ఈ ఆరు విషయాలలో ఎంత చేయగలరో అంత చేశారా లేక ఎంత చేయగలరో అంత చేయకుండా యథాశక్తి స్థితిని అనుసరించి చేశారా? ఈరోజు స్థితి చాలా బాగుంటే, సేవ శాతము కూడా బాగా ఉండడం, కారణంగా గానీ, అకారణంగా గానీ రేపు బలహీనంగా ఉంటే సేవా శాతము కూడా బలహీనంగా ఉండడం, ఎంత అవ్వాలో అంత అవ్వకపోవడం దీని కారణంగా యథాశక్తిగా నంబర్వార్గా అయిపోయారు. మూడవ విషయం - బాప్దాదా ద్వారా జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, సంతోషాల ఖజానా, శ్రేష్ఠ సమయపు ఖజానా, శుద్ధ సంకల్పాల ఖజానాలు ఏవైతే లభించాయో ఆ ఖజానాలన్నిటి ద్వారా సేవ చేశారా లేక కొన్ని కొన్ని ఖజానాల ద్వారానే సేవ చేశారా? ఒకవేళ ఒక్క ఖజానాతో కూడా సేవ చేయడంలో లోటు ఉంటే లేక విశాల హృదయంతో ఖజానాలను కార్యంలో వినియోగించకుండా కొద్దో గొప్పో అనగా పిసినారిగా చేసినట్లయితే, దీనికి కూడా రిజల్టులో వ్యత్యాసం వచ్చేస్తుంది. నాలుగవ విషయం - హృదయ పూర్వకంగా చేశారా లేక డ్యూటీ అనుసారంగా చేశారా? సేవ సదా ప్రవహిస్తున్న గంగలా ఉందా లేక సేవలో ఒకసారి ప్రవహించడం, ఒకసారి ఆగిపోవడం, మూడ్ఉంటే సేవ చేసి, మూడ్లేకపోతే సేవ చేయకపోవడం, అటువంటి నిలిచి ఉండే చెరువులాగా అయితే లేరు కదా!
ఈ విధంగా మూడు విషయాల చెకింగ్అనుసరించి ప్రతి ఒక్కరి విలువను చెక్చేశారు. కావున ఆ విధంగా విధి పూర్వకంగా తమను తాము చెక్చేసుకోండి మరియు ఈ నూతన సంవత్సరములో లోపాలను సదా కాలికంగా సమాప్తం చేసి సంపన్నంగా అయ్యి నెంబర్వన్మూల్యవంతమైన కానుకను తండ్రి ముందు ఉంచుతామనే దృఢ సంకల్పము చేయండి. చెక్చేసుకోవడం, ఛేంజ్చేసుకోవడం వస్తుంది కదా! రిజల్టు అనుసారంగా ఇప్పుడు ఏదో ఒక విషయంలో మెజారిటీ యథాశక్తిగా ఉన్నారు. సంపూర్ణ శక్తి స్వరూపంగా లేరు కావున ఇప్పుడు గడిచిన దానిని గతింపజేసి వర్తమానంలో మరియు భవిష్యత్తులో సంపన్నంగా శక్తిశాలిగా అవ్వండి. మీ అందరి వద్ద కూడా కానుకలు పోగయినప్పుడు ఏ ఏ కానుకలు విలువైనవిగా ఉన్నాయని పరిశీలిస్తారు కదా! బాప్దాదా కూడా పిల్లలు ఆడే ఇదే ఆటను ఆడుతున్నారు, కానుకలైతే లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ స్థితి అనుసారంగా చాలా మంచి ఉల్లాస - ఉత్సాహాలు నిండిన సంకల్పాలను, శక్తిశాలి సంకల్పాలను తండ్రి ముందు ఉంచారు. ఇప్పుడు కేవలం యథాశక్తికి బదులు శక్తిశాలిగా ఉండే విధంగా పరివర్తన చేయాలి. అర్థమయ్యిందా! మంచిది.
సదా స్నేహంగా ఉండేవారందరికి, హృదయపూర్వక స్నేహితులుగా, సర్వ సంబంధాల స్నేహితులుగా ఉన్నవారికి, ఆత్మిక రసము యొక్క అనుభవీ ఆత్మలందరికి సర్వ ఖజానాల ద్వారా శక్తిశాలి సదా సేవాధారి, అన్ని విషయాలలో యథాశక్తిని సదా శక్తిశాలి స్థితిలోకి పరివర్తన చేసే విశేష స్నేహీ మరియు సమీప సంబంధీకులైన ఆత్మలకు బాప్దాదాల పియ్ర స్మృతులు మరియు నమస్తే.
జానకీ దాదితో :- మధువనము యొక్క శోభ మధువనములోకి వచ్చి చేరుకున్నారు. భలే విచ్చేశారు. మీరు బాప్దాదా మరియు మధువనానికి విశేష అలంకారముగా ఉన్నారు. విశేష అలంకారము వలన ఏమవుతుంది? మెరుపు, ప్రకాశము వస్తుంది కదా! కావున బాప్దాదా మరియు మధువనానికి విశేష అలంకారమును చూసి హర్షితమవుతున్నారు. సేవలో విశేషంగా తండ్రి స్నేహము మరియు సంబంధాన్ని ప్రత్యక్షం చేశారు. ఈ విశేష సేవ అందరి హృదయాలను సమీపంగా తీసుకొస్తుంది. రిజల్టు అయితే సదా బాగుంది. అయినా సమయ సమయానికి దాని రిజలు ఉంటుంది. కావున తండ్రి స్నేహమును తమ స్నేహీ ముఖము ద్వారా, నయనాల ద్వారా ప్రత్యక్షం చేశారు. వినేవారిగా తయారు చేయడం గొప్ప విశేషమేమీ కాదు కానీ స్నేహితులుగా తయారు చేయడమే గొప్ప సేవ. అది సదా జరుగుతూ ఉంటుంది. ఎన్ని దీపపు పురుగులు చూశారు? ఇప్పుడిది నయనాల దృష్టితో దీపపు పురుగులను దీపము వైపు సైగ చేసే విశేష సమయము. సూచన లభించగానే నడుస్తూ ఉంటారు, ఎగురుతూ చేరుకుంటారు. కావున ఈ విశేష సేవ కూడా అవసరమే. ఈ సేవ చేశారు కూడా. అటువంటి మంచి రిజల్టు ఉంది కదా! మంచిది. ప్రతి అడుగులో అనేక ఆత్మల సేవ ఇమిడి ఉంది. ఎన్ని అడుగులు వేశారు? ఎన్ని అడుగులు వేశారో అంతమంది ఆత్మల సేవ జరుగుతుంది. మంచిగా చుట్టి వచ్చారు. వారికి కూడా ఇప్పుడు ఉల్లాస-ఉత్సాహాల సీజను. ఏమి జరుగుతుందో అది మంచి కంటే మంచిగా జరుగుతుంది. బాప్దాదా అల్లారుముద్దు పిల్లల ప్రతి కర్మ రేఖ ద్వారా అనేకమంది భాగ్యరేఖలు మారిపోతాయి. కావున ప్రతి కర్మ యొక్క రేఖ ద్వారా అనేకమంది భాగ్య రేఖలను గీసారు. నడవడం అనగా భాగ్యమును గీయడం. కావున ఎక్కడెక్కడికి వెళ్తారో తమ కర్మల కలము ద్వారా అనేకమంది భాగ్యరేఖను గీసే సేవకు నిమిత్తంగా అయ్యారు. కావున ఇప్పుడు మిగిలిన అంతిమ శబ్ధము - ' వీరే, వీరే, వీరే. ' ఎవరినైతే వెతుకుతూ ఉన్నామో వారు వీరే అని అనాలి. ఇప్పుడు వీరా లేక వారా అని ఆలోచిస్తున్నారు. కానీ 'కేవలం వీరే' అనే ఒకే శబ్ధము వెలువడాలి. ఇప్పుడు ఆ సమయము సమీపంగా వస్తోంది. భాగ్యరేఖ పెరుగుతూ పెరుగుతూ బుద్ధి తాళము ఏదైతే కొద్దిగా మిగిలి ఉందో అది కూడా తెరుచుకుంటుంది. తాళం చెవినైతే పెట్టారు, తిప్పారు కూడా, తెరుచుకుంది కానీ ఇప్పుడు కొద్దిగా ఇరుక్కుని ఉంది. అది కూడా తెరిచే రోజు వచ్చేస్తుంది.
టీచరు అక్కయ్యలతో :- టీచర్లు అనగా సదా సంపన్నమైనవారు. కావున సంపన్నతను అనుభవం చేసేవారు కదా! స్వయం సర్వ సంబంధాలతో సంపన్నంగా ఉన్నప్పుడే ఇతరులకు సేవ చేయగలరు. తమలో సంపన్నత లేకుంటే ఇతరులకేమిస్తారు? సేవాధారి అనగా సర్వ ఖజానాలతో సంపన్నమైనవారు. సదా సంపూర్ణతా నషా మరియు సంతోషము కలిగినవారు. ఏ ఒక్క ఖజానా కూడా లోటు లేదు. శక్తులు ఉన్నాయి గుణాలు లేవు, గుణాలు ఉన్నాయి శక్తులు లేవు. ఈ విధంగా కాదు. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండేవారు ఏ సమయంలో ఏ శక్తిని ఆహ్వానిస్తారో ఆ శక్తి స్వరూపంగా అయిపోవాలి. దీనినే సంపన్నత అని అంటారు. అలా ఉన్నారా? ఒకసారి స్మృతి ఎక్కువగా ఉండడం, ఒకసారి సేవ ఎక్కువగా ఉండడం అలా కాదు. ఎవరైతే స్మృతి మరియు సేవల బ్యాలెన్సులో ఉంటారో, రెండిటిలో సమానంగా ఉంటారో వారే బ్యాలెన్సులో ఉండేవారు. వారే సంపన్నత యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా అవుతారు. అటువంటి సేవాధారులుగా ఉన్నారా? ఏ లక్ష్యమును ఉంచుకున్నారు? సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండాలి. ఒక్క గుణం తగ్గినా సంపన్నం కాదు. ఏ ఒక్క శక్తి తగ్గినా సంపన్నమని అనరు. సదా సంపన్నులు మరియు అన్నింటిలో సంపన్నులు రెండిటిలోనూ సంపన్నులు. అటువంటివారినే యోగ్య సేవాధారులని అంటారు. అర్థమయ్యిందా? ప్రతి అడుగులో సంపన్నత ఉండాలి. అటువంటి అనుభవీ ఆత్మలు అనుభవం యొక్క అథారిటీగా ఉంటారు. సదా తండ్రి తోడుగా ఉన్నారనే అనుభవముండాలి. కుమారీలతో :- సదా అదృష్టవంతులైన కుమారీలే కదా! సదా తమ మెరుస్తూ ఉన్న భాగ్య నక్షత్రాన్ని మస్తకం పై అనుభవం చేస్తున్నారా? మస్తకంలో భాగ్యసితార మెరుస్తోందా లేక మెరవనున్నదా? తండ్రివారిగా అవ్వడము అనగా సితార మెరవడము. కావున బాబావారిగా అయిపోయారా లేక ఇప్పుడింకా బేరం చేసుకునేందుకు ఆలోచిస్తున్నారా? ఆలోచించేవారా లేక చేసేవారా? ఏదైనా వ్యాపారము తెగతెంపులు చేసుకోవాలనుకుంటే తెంచకోగలరా? తండ్రితో వ్యాపారము చేసి మళ్లీ మరొక వ్యాపారము చేసినట్లయితే ఏమవుతుంది? అప్పుడప్పుడు తమ భాగ్యమును చూసుకోవలసి ఉంటుంది. ఎవరైనా లక్షాధికారులకు చెందినవారిగా అయ్యి పేదవారికి చెందినవారిగా అవ్వరు. తండ్రివారిగా అయిన తర్వాత సంకల్పము కూడా ఎక్కడికీ వెళ్లజాలదు. ఇంత పక్కాగా ఉన్నారా? ఎంతగా సాంగత్యము ఉంటుందో రంగు అంతగా పక్కాగా ఉంటుంది. సాంగత్యము కచ్ఛాగా(అపరిపక్వముగా) ఉంటే రంగు కూడా కచ్ఛాగా ఉంటుంది. చదువు మరియు సేవ రెండింటి సాంగత్యమూ ఉండాలి. అప్పుడు సదాకాలికంగా పక్కాగా అచలంగా ఉంటారు అలజడిలోకి రారు. పక్కా రంగు అంటుకుంటే ఇంతమంది భుజాల ద్వారా ఎన్ని సెంటర్లు తెరవచ్చు! ఎందుకంటే కుమారీలు నిర్బంధనులుగానే ఉన్నారు. ఇతరుల బంధనాలను కూడా సమాప్తం చేస్తారు కదా! సదా తండ్రితో పక్కా వ్యాపారం చేసేవారే కదా! ధైర్యముంటే తండ్రి సహాయము కూడా లభిస్తుంది. ధైర్యము తక్కువగా ఉంటే సహాయము కూడా తక్కువగా ఉంటుంది. మంచిది. ఓంశాంతి.

Comments