01-12-1983 అవ్యక్త మురళి

01-12-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సుఖము, శాంతి మరియు పవిత్రతలకు చెందిన మూడు అధికారాలు

ఈరోజు బాప్ దాదా అతి స్నేహీలు మరియు చాలాకాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అతి స్నేహముతో మిలనమును జరుపుకునేందుకు తమ ఇంటికి చేరుకున్నారు. ఈ భూమిని మన ఇల్లు, దాత ఇల్లు అని అంటారు. ఈ మహిమ ఈ స్వీట్ హోమ్ దే. స్వీట్ హోమ్ లో స్వీట్ పిల్లలతో స్వీటెస్ట్ బాబా మిలనము చేస్తున్నారు. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకముపై ఈరోజు విశేషంగా అధికారమునకు చెందిన మూడు రేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకముపై మూడు రేఖలైతే ఉన్నాయి, ఎందుకంటే అందరూ పిల్లలే. పిల్లలుగా అయిన సంబంధముతో అందరూ అధికారులే, కానీ నంబర్వారీగా ఉన్నారు. కొందరు పిల్లల అదృష్టము, సుఖమునకు చెందిన అధికార రేఖ చాలా స్పష్టంగా మరియు లోతుగా ఉంది. ఎన్ని పరిస్థితులు వచ్చినాగానీ, దుఃఖపు అలను ఉత్పత్తి చేసే అల కానివ్వండి కానీ దుఃఖము అన్న మాటను గురించి అవిద్యులు(ఏమీ తెలియనివారు). దుఃఖ పరిస్థితులను సుఖసాగరుని ద్వారా మీకు ప్రాప్తించిన అధికారము ద్వారా, దుఃఖ పరిస్థితులలో కూడా ''వాహ్, మీఠా డ్రామా, వాహ్, ప్రతి ఒక్క పాత్రధారి పాత్ర'' - ఈ జ్ఞాన ప్రకాశము ద్వారా, అధికారపు సంతోషము ద్వారా దుఃఖాన్ని సుఖములోకి పరివర్తన చేస్తారు. అధికారము ద్వారా దుఃఖమనే అంధకారమును పరివర్తన చేసి, మాస్టర్ సుఖదాతలుగా అయ్యి స్వయమైతే సుఖపు ఊయలలో ఊగుతూనే ఉంటారు కానీ ఇతరులకు కూడా సుఖపు వైబ్రేషన్లను ఇచ్చేందుకు నిమిత్తులుగా అవుతారు. ఇటువంటి సుఖపు అధికారము యొక్క రేఖ స్పష్టంగా మరియు గాఢంగా ఉంది. దీనిని ఎవరూ తొలగించలేరు. తొలగించేవారు మారాలి గానీ గీత మారదు. మాస్టర్ సుఖదాత నుండి దోసిట నిండుగా సుఖాన్ని తీసుకోండి. ఇటువంటి రేఖ కలవారిని కూడా చూసారు. వీరినే నంబర్ వన్ భాగ్యవంతులు అని అంటారు. ''వన్ కు గుర్తు విన్'' అని వినిపించాము కదా!

రెండవ రేఖ శాంతి - మీరందరూ శాంతిని స్వధర్మముగా భావిస్తారు కదా! దీనిని అందరికీ తెలియజేస్తుంటారు కదా! ధర్మము గురించి ఏ గాయనము ఉంది? ''ధరిత్రిని వదులు కానీ ధర్మాన్ని వదలకు'' తల తెగినాగానీ ధర్మము పోకూడదు. కనుక సుఖ శాంతుల వారసత్వానికి అధికారులు ఎప్పుడూ శాంతిని వదలజాలరు. ఇలా అశాంతిని శాంతిగా చేసేవారు, సదా శాంతి కిరణాలను స్వయము ద్వారా ఇతరులకు ఇచ్చేవారు ఏం జరిగినా గానీ శాంతి యొక్క ధర్మాన్ని, శాంతి యొక్క అధికారాన్ని వదలజాలరు. వీరినే రెండవ అధికార రేఖలో నంబర్ వన్ అని అంటారు. మూడవది - ప్యూరిటీ యొక్క అధికార రేఖ. పిల్లలందరూ పవిత్ర ఆత్మలే. అయినా కూడా నంబర్ వన్ అధికారమునకు భాగ్యవంతులైన పిల్లలు ఎవరు! వీరి నడవడిక ద్వారా, ముఖము ద్వారా ప్యూరిటీ(పవిత్రత)యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీ యొక్క అనుభవము ఉండాలి. లౌకిక జీవితములో లౌకికత కలవారి పర్సనాలిటీ, రాయల్టీ కనిపిస్తుంది, కానీ అధికారమునకు చెందిన భాగ్యవంతులైన పిల్లలలో ప్యూరిటీకి చెందిన అలౌకిక పర్సనాలిటీ మరియు రాయల్టీ కనిపిస్తుంది. పవిత్రతకు చెందిన నంబర్ వన్ భాగ్యరేఖ అని దీనినే అంటారు.

ఈరోజు పిల్లలందరి ఈ అధికార రేఖను చూస్తున్నారు. మీరందరు కూడా మీ మూడు రేఖలను చూస్తున్నారు కదా. మూడు అధికారాలను ప్రాప్తి చేసుకున్నామా అని పరిశీలించుకోండి. పూర్తి అధికారాన్ని తీసుకున్నారా లేక పర్సంటేజ్ లో తీసుకున్నారా? ఒకవేళ సంగమయుగములో కూడా పర్సంటేజ్ లో ఉన్నట్లయితే మొత్తము కల్పమంతా పర్సంటేజ్ లోనే ఉండిపోతారు. పూజ్య పదవిలోకూడా పర్సంటేజ్(శాతము) ఉంటుంది, పూర్తి పూజ జరగదు మరియు ప్రాలబ్ధములో కూడా పర్సంటేజ్ఉండిపోతుంది. అచ్ఛా 

ఈరోజు మెజారిటీ కొత్తవారైన పాత పిల్లలు వచ్చారు. క్రొత్త పిల్లలు అనండి లేక కల్పకల్పపు అధికారీ పిల్లలు అనండి, తమ అధికారమును తీసుకునేందుకు మరల తమ స్థానమునకు చేరుకున్నారు. అందరికంటే ఎక్కువ సంతోషము ఎవరికి ఉంది! నాకే ఉంది అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అలానే భావిస్తారా లేక కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువగా ఉందా! అధికారీ పిల్లలకు విశేష మిలనము యొక్క అధికారమును ఇచ్చేందుకు బాప్ దాదాకు కూడా రావలసి ఉంటుంది.

బాబాకు పిల్లలపై ఎక్కువ స్నేహము ఉందా లేక పిల్లలకు బాబాపై ఎక్కువ స్నేహము ఉందా? ఎడతెగని స్నేహము ఎవరికి ఉంది? బాప్ దాదా అయితే పిల్లలను తనకంటే ముందు ఉంచుతారు. ముందు పిల్లలు. ఒకవేళ పిల్లలు స్మృతి చెయ్యనట్లయితే లేక ప్రేమించనట్లయితే బాబా ఎవరికి రెస్పాండ్ ఇస్తారు! కనుక ముందు పిల్లలు, వెనుక బాబా. ఎల్లప్పుడు పిల్లలను ముందుకు నడిపించవలసి ఉంటుంది, బాబా వెనుక నడుస్తారు కనుక బాప్ దాదా కూడా అటువంటి పిల్లలను చూస్తూ చాలా సంతోషిస్తారు. ఎడతెగని స్నేహము ప్రేమలో ఇమిడిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఇటువంటి పిల్లల మాల కూడా ఉంది. భారతదేశములోగానీ లేక విదేశములోగానీ రెండువైపుల ఎటువంటి పిల్లలు ఉన్నారంటే వారికి బాబా మరియు సేవ తప్ప మరేదీ గుర్తు ఉండదు.

జగదీష్ భాయితో - మీరు అటువంటి పిల్లలను చూసారు కదా, బాగా తిరిగారు కదా! సాకారబాబా ద్వారా ఇవ్వబడిన వరదానమును సాకారములోకి తీసుకువచ్చారు. సఫలతను జన్మసిద్ధ అధికారముగా అనుభవము చేసారు కదా. అన్ని సఫలతలలోకీ విశేష సఫలత యొక్క గుర్తు ఏది? శ్రేష్ఠ సఫలత - బాప్ దాదా కనిపించాలి. మీలో బాబా కనిపించాలి, ఇదే శ్రేష్ఠ సఫలత. ఇదే ప్రత్యక్షతకు సాధనము. ఎవరైతే సేవకు బయటకు వెళ్ళారో వారు విశేషంగా బాబా సమాన స్థితిని అనుభూతి చేయించటమే సఫలతకు గుర్తు. ఇదే సఫలతకు గుర్తు. భవిష్యత్తులో ఇదే శబ్దము నలువైపుల వ్యాపిస్తూ ఉంటుంది. ధైర్యము పిల్లలదైతే బాబా సహాయము తప్పకుండా ఉంటుంది. చేయించేవారు చేయించుకుంటారు. అచ్ఛా.

ఇటువంటి సదా సంపూర్ణ భాగ్యవంతులకు, సంపన్న అధికారమును పొందే అధికారులకు, సదా బాబా మరియు స్వయము యొక్క కంబైండ్ రూపములో ఉండేవారికి, స్నేహ సాగరములో సదా మునిగి ఉండే లక్కీ మరియు లవ్లీ పిల్లలకు భాగ్యవిధాత, వరదాత యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

(జగదీష్ భాయి విదేశీ యాత్ర సమాచారాన్ని బాప్ దాదాకు తెలియజేసారు మరియు పేరు నహితంగా సోదరీ సోదరులందరి స్మృతులను ఇచ్చారు)

అందరి స్నేహ సమాచారాలైతే బాప్ దాదా వద్దకు చేరుకుంటూనే ఉంటాయి మరియు ఇప్పుడు కూడా చేరుకున్నాయి. విదేశములలో నలువైపుల ఉన్న పిల్లలందరికీ విశేషంగా ఒక విషయంలో అభినందలను కూడా ఇస్తారు. ఏ విషయములో? సంస్కారాలు, భాష, జీవనపద్ధతి అన్నింటినీ పరివర్తన చేసుకోవటంలో మెజారిటీ వారు చాలా తీవ్ర పురుషార్ధీలుగా అయ్యారు. ఏదో ఒక కొత్త ప్రపంచములోకి వచ్చినట్లుగా. ఇలా నూతన ఆచార వ్యవహారాలు, కొత్త సంబంధాలు, అయినా కూడా స్వయమును సదా కల్పపూర్వపు పాత అధికారీ ఆత్మలుగా భావించి నడుస్తున్నారు, కనుక స్వయమును పరివర్తన చేసుకునే విశేషతకు విశేష అభినందనలు. బాప్ దాదాను ఎంత ప్రేమగా గుర్తు చేస్తారు! అవి బాప్ దాదా వద్దకు ఎల్లప్పుడూ చేరుకుంటాయి. స్వయాన్ని మర్చిపోయి బాబానే ఎల్లప్పుడు ప్రతి విషయములో గుర్తు చేస్తారు, ఈ పరివర్తన విశేషమైనది. మరియు ఈ ప్రేమ అధికారముతో నడుస్తున్నారు. ఈ ప్రేమయే పాలన చేస్తూ ఉంది. సూక్ష్మ ప్రేమ యొక్క పాలనయే ముందుకు నడిపిస్తూ ఉంది. అచ్ఛా!

ఎవరైతే బాబాకు ప్రియస్మృతులను ఇచ్చారో, వారందరికీ ప్రేమసాగరుడైన బాబా నుండి ప్రేమతో కూడిన ఒడి ఎల్లప్పుడూ పూర్తిగా నిండిపోయేటట్లుగా ప్రియస్మృతులు. భారతవాసి పిల్లలు కూడా తక్కువైనవారు కారు. భారతదేశ భాగ్యాన్ని అయితే విదేశము వారు ఎప్పుడూ పాడుతూ సంతోషపడిపోతారు. భారతవాసులు మేల్కొన్నారు, అప్పుడు విదేశములోని వారు మేల్కొన్నారు. మేల్కొలిపేవారైతే భారతవాసులే. ఒకవేళ విదేశములో కూడా వీరందరూ లేనట్లయితే ఇన్ని విదేశీ సెంటర్లు ఎలా ఉంటాయి! వీరు నిమిత్తము అవ్వడము వలననే నలువైపుల వ్యాపించింది. ఎంతమందితో సెంటర్ తెరుస్తారు! జన్మించిన కొద్దిమంది పెద్దవారై సెంటర్ తెరిచారు. అది కూడా తమ కాళ్ళపై తాము నిలబడి, ఎవరిపై ఆధారపడి కాదు. నిమంత్రణ రావాలి అన్న ఈ ఆధారము కూడా ఆశించలేదు. స్థూలంగా, సూక్ష్మంగా రెండింటినీ పెట్టి ధైర్యమును వహించి సెంటర్ ని తెరుస్తారు. ఇకపోతే వారి పాలన చెయ్యటము, అదైతే మీ బాధ్యత. ధైర్యమును చూపించటములో వెనుకగా లేరు. సహాయమును ఇవ్వటము అనేది బాబాతో పాటుగా మీ కార్యము కూడా.

జ్ఞాన లోతులను విని సంతోషపడ్డారు. యోగము మరియు ప్రేమ ఆధారముపై నడుస్తున్నారు, కానీ ఇప్పుడు జ్ఞాన లోతులను తెలుసుకున్నారు, ఈ తెలుసుకోవటము అనేది ఇంకా వీరిని సేవకు నిమిత్తులుగా తయారుచేస్తుంది. మైండ్ తయారవ్వాలి, ఇందుకొరకు జ్ఞాన లోతులను తెలుసుకోవాలి. జ్ఞానము మరియు బాబా, ఈ రెండింటి అనుభూతిని ఇప్పించటము, ఈ రిజల్ట్ మంచిగా ఉంది. ఎవరైనా వెళ్తే ఎంత సంతోషపడ్తారు, ఆకాశము నుండి ఏదో సితార కిందకు వచ్చినట్లుగా అనుభూతిని చేస్తారు.

దాదీగారు మరియు జానకి దాదీలతో -

ఇద్దరిలో మూడవ మూర్తి (దీదీ) ఇమిడి ఉంది. బాబా సమానంగా ఉండనే ఉన్నారు, తయారవ్వాలి అనేది లేదు, తయారయ్యే ఉన్నారు. ఇటువంటి అనుభవము ఉంటుందా! బాబా బ్రహ్మా బాబా ఆధారమును తీసుకుని ఏవిధంగా సేవ చేస్తారో అలా మీరు కూడా బాబాకు మాథ్యములు. వర్తమాన సమయములో చేయించేవారైన బాబా మాథ్యమము ద్వారా తన కార్యమును చేస్తున్నారు. విశేష మాథ్యములు. బ్రహ్మా యొక్క ఆకారము ద్వారా మరియు మీ సాకారము ద్వారా కార్యము చేయిస్తున్నారు. చాలా-చాలా పదమాల కంటే కూడా ఎక్కువగా బాప్ దాదా ప్రతి క్షణము గుర్తు చేస్తారు మరియు ప్రేమిస్తారు. అలంకారములు మీరు. విశేషంగా బాబాకు మరియు మధువనమునకు అలంకారములు మీరు. ప్రతి సమయము మిమ్మల్ని అలాగే చూస్తూ బాప్ దాదా హర్షితులవుతారు. అచ్ఛా!

ధర్మనేతల సేవకు ప్లాన్

ధర్మనేతల కొరకైతే విశేష రూపము అవసరము ఎందుకంటే ధర్మానికి చెందిన విషయాలలో వారు కూడా చాలా తెలివైనవారు. ప్రేమగా వింటారు కూడా కానీ వారిలో ప్రాక్టికల్ విషయములో లోటును అనుభవము చేస్తారు. వారు ఇలా సాక్షాత్కారము చెయ్యాలి - ఈరోజు ఏదైతే వినిపించారో, మన ఎదురుగా ఉన్నవారు ఎవరో సాధారణ రూపులు కారు అని వారు దానిని ఇలా ప్రాక్టికల్ గా అనుభవము చెయ్యాలి, అప్పుడే వారు ఒంగుతారు. అనుభవమును చూసి ఒంగిపోతారు. వాణితో ఒంగరు. మీరు కూడా చాలా మంచి కార్యము చేస్తారు, మీకు కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉండాలి అని వారు అంటారు. ఇలా చెప్పి సంతోషపరుస్తారు, కానీ వీరు చాలా విశేషమైనవారు అని వారు భావించాలి. ఎవరిలో ఏ బలహీనత అయితే ఉంటుందో దాని ఆధారముతో వారికి బాణము వెయ్యటము - విజయమును పొందటము అంటే ఇదే. ఎప్పుడైతే తమలోని లోపాలను తెలుసుకున్నారో అప్పుడే దేవతలు విజయాన్ని ప్రాప్తి చేసుకున్నారు అని శాస్త్రాలలో గాయనము ఉంది. ఇది కూడా ఆధ్యాత్మికత విషయము. కనుక ధర్మనేతలు కూడా తప్పకుండా వస్తారు, కానీ ఏదైనా నవీనతను చూపించినప్పుడే వస్తారు. ఇప్పుడైతే మీ జ్ఞానము బాగుంది అని కేవలము ఇంతవరకే అంటారు. మీరుకూడా మంచి మార్గములో ఉన్నారు, మేము కూడా మంచి మార్గములో ఉన్నాము అని అంటారు కానీ ఇది ఒక్కటే మార్గము అని వారి నోటి నుండి వెలువడాలి. అనేక మార్గాలు ఉన్నాయి, వాటిలో మీది కూడా ఒక మార్గము అన్న వారి మాట మారిపోవాలి. ఇక్కడినుండే ముక్తి మరియు జీవన్ముక్తి లభించగలవు అని వారికి ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడే వారు ఒంగుతారు. కనుక ఇప్పుడు ఏదైనా నవీనత కావాలి.

ప్రవృత్తిలో చాలా మునిగిపోయి ఉన్నారు, కానీ ప్రవృత్తిలో కూడా ఉండాలి మరియు ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తిగా ఉండాలి అని మీరు ఇతరులకు మీరు వినిపిస్తారు కదా! మరి ఈ పాఠాన్నే మీరు రోజూ స్వయమునకు చదివించండి. ప్రవృత్తి అయితే పెరిగేదే ఉంది కానీ అందులో ఉంటూనే నివృత్తిగా ఉండటము, ఇది అవసరము. ఈ విషయంలో కాస్త అటెన్షన్ పెట్టాలి మరియు దీనికి అండర్ లైన్  చెయ్యవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి వారి సేవలలో బిజీ అయిపోయారు కానీ బేహద్ విశ్వ నషా కావాలి. వీటన్నింటినీ సంభాళిస్తూనే బేహద్ సేవ కొరకు బుద్ధి బిజీనుండి ఫ్రీగా ఉండాలి. తనువు-మనసు-ధనము, బుద్ధి అన్నింటినీ మీ రచనలో ఎక్కువగా పెట్తూ ఉంటారు. సాకార బాబాను చూసారు కదా, వారు కార్య వ్యవహారాలను నడిపిస్తూ కూడా సదా స్వయమును ఫ్రీగా ఉంచుకున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే రూపురేఖలు ముఖము పైకి రాలేదు. బాధ్యత బ్రాహ్మణ పరివారమునకు ఉన్నా గానీ బుద్ధిలో ఏముండింది? బేహద్! శక్తి ఇవ్వాలి, పాలన చెయ్యాలి. ఆత్మలను మేల్కొలపాలి, ఇదే తపన, చింత ఉండేది. మరి ఇప్పుడు అది కావాలి. దాని లోటు ఉంది. అనన్యులైన పిల్లలను కలిసి అటువంటి వాతావరణమును తయారుచెయ్యాలి. ప్రతి ఒక్కరూ బాబా సమానంగా లైట్ హౌస్లు. ఎక్కడకు వెళ్ళినా వారికి లైట్ లభించాలి, శక్తి లభించాలి, ఉల్లాస ఉత్సాహాలు లభించాలి. సాధారణ ఆత్మలు ఏవైతే చాస్తారో వాటిని చేయకూడదు. సాకార బాబా మాటలు, సంకల్పాలు, దృష్టి, వృత్తి అన్నీ అతీతంగా ఉండేవి కదా! అవి సాధారణమైనవి కావు. కనుక అటువంటి స్థితిని తయారుచెయ్యండి. ఇందుకొరకే సేవ ఆగి ఉంది. ఎక్కువ ఖర్చు, ఎక్కువ శ్రమ, తయారయ్యేది ఎంతమంది!

ఇప్పుడు సమయ ప్రమాణంగా అడ్వాన్స్ పార్టీ కూడా వేగముగా చేస్తూ ఉంది కనుక సాకారములోని వారైతే ఇంకా ఎక్కువ తీవ్రముగా చెయ్యాలి. అన్నీ అకస్మాత్తుగా అయ్యేదే ఉంది, డేట్ చెప్పబడదు. పరీక్ష తప్పకుండా వస్తుంది. మీ ఆలోచనలను పరిశీలించేవారు కూడా వస్తారు. పరీక్షించేందుకు వస్తారు. ఎంతగా ప్రత్యక్షత అవుతుందో అంతగా ఈ పరీక్షలన్నీ వస్తాయి. ఈ యోగము మరియు ఆ యోగము, ఈ జ్ఞానము మరియు ఆ జ్ఞానములో ఏ అంతరము ఉంది అని వారు జీవితాన్ని ప్రాక్టికల్ చెకింగ్ చేస్తారు. వాణి విషయము కాదు. అందుకొరకు మొదటి నుండే ఇంత ఏర్పాట్లు కావాలి. 84 వ సంవత్సరములో ఏదో జరిగేదే ఉంది. పరీక్ష వస్తుంది. శబ్దమును వ్యాపింపచేసేందుకు కావలసిన ఏర్పాట్లకు ఇది సాధనము. మొదట్లో ఏవిధంగా అభ్యాసము చేసేవారో, నడుస్తున్నారు కానీ స్థితి ఎలా ఉండాలంటే ఏదో ఒక ప్రకాశము పోతూ ఉంది అని ఇతరులు భావించాలి. వారికి శరీరము కనిపించకూడదు. మొదట్లో మిత్ర సంబంధీకుల వద్దకు వెళ్ళినప్పుడు ఏ పరీక్ష పెట్టారు, సంబంధీకులు శరీరాన్ని చూస్తూ లైట్ ను చూడాలి, కూతురు కనిపించకూడదు, దేవి కనిపించాలి. ఈ పరీక్షను ఇచ్చారు కదా! ఒకవేళ సంబంధము రూపములో చూసి, కూతురు-కూతురు అని అన్నట్లయితే ఫెయిల్. కనుక అటువంటి అభ్యాసము కావాలి. చాలా చెడు సమయము వస్తూ ఉంది కానీ మీ స్థితి ఎలా ఉండాలంటే ఇతరులకు ఎల్లప్పుడు లైట్రూపమే కనిపించాలి, ఇందులోనే రక్షణ ఉంది. లోపలకు వస్తే ప్రకాశవంతమైన కోటను చూడాలి. ఈశ్వరీయ సేవలో పెట్టబడే మీ సంపద ఊరికే అలా ఎందుకు పోవాలి, వారికి అలమారీ కనపించకూడదు కానీ ప్రకాశవంతమైన కోట కనిపించాలి. ఇంత అభ్యాసము కావాలి. శక్తిరూపము యొక్క మెరుపును పెంచుకోవాలి. సాధారణంగా కనిపించకూడదు, ఈ లక్ష్యము ఉండాలి. యుద్ధమైతే రకరకాలుగా ఉంటుంది - భ్రమిస్తున్న ఆత్మల యుద్ధము ఉంటుంది, చెడు దృష్టి కలవారి యుద్ధము ఉంటుంది, ప్రకృతి వైపరీత్యాల యుద్ధము ఉంటుంది, జబ్బుల యుద్ధము ఉంటుంది కానీ వీటన్నింటి నుండి రక్షింపబడేందుకు సాధనము - అనన్యులుగా అవ్వటము అనగా అన్యులు (ఇతరులు) చెయ్యలేనిదానిని చెయ్యటము. నేను అనన్యుడను అని కేవలము ఇది గుర్తు పెట్టుకున్నాకూడా ప్రియమైనవారిగా మరియు అతీతమైనవారిగా ఉంటారు. అచ్ఛా!

84లో జరగనున్న కాన్ఫరెన్స్ సఫలత కొరకు

ఎంతవీలైతే అంత సైలెన్స్ యొక్క వాతావరణము ఉండాలి. ఈశ్వరీయ జ్ఞానము, ఈశ్వరీయ స్థానము - ఇది అనుభవము చేసి వెళ్ళాలి. పూర్తిగా ఎటువంటి వాతావరణము ఉండాలంటే, అనుభూతిని చేయించే లక్ష్యము ఉండాలి. పాయింట్ల సంఘర్షణలోకి పోకుండా, చెప్తూ-చెప్తూ అనుభవము చేయిస్తూ పోండి. ఈ ఈశ్వరీయ మార్గము, ఈశ్వరుడు వచ్చారు అన్నది ప్రతి ఒక్కరి నోటి నుండి రావాలి అన్న లక్ష్యమును పెట్టుకోండి. చాలా బాగుంది అని అనైతే అంటారు కానీ ఈశ్వరుడు చదివిస్తూ ఉన్నారు, ఇలా అనాలి. జ్ఞానము మంచిగా ఉంది కానీ జ్ఞానదాత ఎవరు అన్నదానిని అనుభవము చెయ్యాలి. ఇప్పుడు ఈ పునాదిని వెయ్యండి. బీజము పైకి వచ్చినప్పుడు సమాప్తి అవుతుంది. బీజము పైకి రానట్లయితే వృక్షము ఎలా పరివర్తన అవుతుంది! ఈ స్థానముకు చాలా అభిరుచితో వస్తున్నారు, స్థానమునకు కల విశేషత ఏముందో దానిని వారు చూడాలి, ఆ అనుభవమును చెయ్యాలి. మీరు వారి వ్యూ(అభిప్రాయాన్ని)ని చూసి మీ వ్యూని మార్చుకోకండి కానీ మీ వ్యూని చూసి వారి వ్యూని మార్చుకోవాలి - ఇటువంటి ప్లాన్ ను తయారుచెయ్యండి. భాషణ చేసేది ఉన్నప్పుడు పాయింట్ల వైపుకే అటెన్షన్పోతుంది కానీ బాబాను ప్రత్యక్షము చేసే లక్ష్యము ఉంటే బాబానే కనిపిస్తారు. ఎటువంటి లక్ష్యము ఉంటుందో అటువంటి రిజల్ట్వెలువడుతుంది. అచ్ఛా!

Comments