01-06-1983 అవ్యక్త మురళి

01-06-1983       ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

'కొత్త జ్ఞానమును మరియు జ్ఞానదాతను అథారిటీతో ప్రత్యక్షం చేయండి అప్పుడు ప్రత్యక్షత యొక్క ఢంకా మోగుతుంది'.

(మీటింగ్లో బాప్దాదాల ఆగమనము)

ఇది కిరీటమును మరియు సింహాసనమును ధారణ చేసిన విశేష ఆత్మల సభ కదా! అందరూ స్వయమును కిరీటమునకు లేక సింహాసనమునకు అధికారులుగా భావిస్తున్నారు కదా! అందరూ బేహద్ సేవల యొక్క బాధ్యతకు కిరీటధారులే కదా! బేహద్ కిరీటము అనగా బేహద్ స్మృతి స్వరూపంలో స్థితులవ్వడము, బేహద్ బాధ్యతలకు కిరీటధారులు. బేహద్ కిరీటధారులైన పిల్లలు ప్రతిఒక్కరి ప్రకాశము మరియు శక్తి యొక్క కిరణాలు బేహద్లో వ్యాపించి ఉన్నాయి. హద్దు నుండి వైదొలగి బేహద్ రాజ్యాధికారులుగా అయిపోయారు కదా! ఎప్పుడైతే దేహపు హద్దుల యొక్క స్మృతుల నుండి కూడా అతీతంగా అయిపోయారో అప్పుడు దేహసహితంగా దేహపు సర్వహద్దుల నుండి కూడా అతీతంగా అయిపోయారు. హద్దు నుండి బేహద్దులోకి తీసుకువెళ్ళడమే విశేష సేవ. బ్రహ్మాబాబా అవ్యక్తంగా ఎందుకయ్యారు? హద్దు నుండి తొలగించి బేహద్లోకి తీసుకువెళ్ళేందుకే కదా! బ్రహ్మాబాబా స్నేహమునకు ప్రత్యక్ష స్వరూపము బ్రహ్మాబాబాను అనుసరించడము. బ్రహ్మాబాబా తమ కుడిభుజాలైన పిల్లలను తమ విశేష భుజాలను అవ్యక్తవతనం నుండి, బేహద్ సేవాస్థానం నుండి చేతిలో చేయి కలిపేందుకు చేతులుచాచి పిలుస్తున్నారు. బ్రహ్మాబాబాకు పిల్లలపై స్నేహము ఉంది. కావున పిల్లలూ బేహద్లోకి వచ్చేయండి అని బ్రహ్మాబాబా పిలుస్తున్నారు. ఈ శబ్దము వింటున్నారా? బ్రహ్మాబాబాకు సదా ఒకే ఒక్క అల ఉంటుంది- నా సమానంగా బేహద్ కిరీటధారులుగా అయి నలువైపులా ప్రత్యక్షత యొక్క ప్రకాశమును మరియు శక్తిని ఎలా వ్యాపింపజేయాలంటే ఇక సర్వ ఆత్మలకు నిరాశ నుండి ఆశా కిరణాలు కనిపించాలి. అందరి వేళ్ళు ఆ విశేష స్థానమువైపుకు ఉండాలి. ఎవరైతే ఆకాశంకన్నా పైన వేలుతో వెదుకుతున్నారో వారికి ఈ ధరణిపై, వరదాన భూమిపై ఈ ధరిత్రి సితారలు ప్రత్యక్షమైపోయారు అని అనుభవమవ్వాలి. ఈ సూర్య, చంద్ర, తారా మండలాలు ఇక్కడే అనుభవమవ్వాలి. ఏ విధంగా సైన్స్వారు సైన్స్ యొక్క ఆధారంపై ఆకాశములోని తారా మండలమును అనుభవం చేయిస్తారో అలా ఈ ధరిత్రి యొక్క చైతన్య తారా మండలము దూరంగా ఉన్నవారికి కూడా అనుభవమవ్వాలి. ఈ శుభ ఆశను పూర్ణంచేసే మీరందరూ నిమిత్త ఆత్మలు. ఇటువంటి బేహద్ ప్లానును తయారుచేసారు కదా! ప్లానులను యథాశక్తిగా తయారుచేసారు. ఇప్పుడు బాప్దాదా సమయ ప్రమాణంగా పిల్లల నుండి ఏ మిగిలిపోయిన సేవను కోరుకుంటున్నారు?

బాప్దాదా ఈరోజు పరస్పరం సంభాషించుకుంటున్నారు. వారు సంభాషించిందేమి? నా నిమిత్తులైన శ్రేష్ఠులైన పిల్లలు, చాలాకాలం తరువాత కలిసిన పిల్లలు, ప్రియమైన, సదా బాబా సహచరులైన పిల్లలు ఇటువంటి పిల్లలు వరదాన భూమిపై సేవాప్లానులను తయారుచేసేందుకు కలుసుకున్నారు. మీటింగ్లో ఏ ప్లాన్లైతే వెలువడ్డాయో అవన్నీ చాలా బాగున్నాయి. కాని, ముఖ్యమైన ఒక్క సేవ ఇప్పటి మిగిలి ఉంది అని బ్రహ్మాబాబా అన్నారు. మీరు ఎంత పెద్ద అథారిటీ కలవారు మరియు మీకు ఎన్ని అథారిటీలు ఉన్నాయి! జ్ఞానపు అథారిటీ, యోగశక్తి యొక్క అథారిటీ, శ్రేష్ఠ ధారణా స్వరూపపు అథారిటీ, డైరెక్ట్ బాబా వారసత్వపు అథారిటీ, విశ్వపరివర్తన చేసేందుకు నిమిత్తులుగా అయ్యే అథారిటీ ఇలా ఎన్ని అథారిటీలు ఉన్నాయి! ఏ విధంగా ఒక్క శాస్త్రపు అథారిటీ కలవారు ఎంతోకొంత త్యాగము చేసి పవిత్రంగా అయ్యే అథారిటీ గలవారు కేవలం ఈ ఒక్క అథారిటీయే ఉంది, అది కూడా సత్యతతో కూడుకున్న అథారిటీగా లేదు, మహాన్ ఆత్మలుగా ఉన్నాకాని పరమాత్మ అయిన తండ్రి సంబంధంలో యథార్థ జ్ఞానపు అథారిటీ లేదు. ఇలా ఒక్క అథారిటీ గలవారు కూడా విశ్వంలోని సర్వాత్మలను తమవైపుకు ఆకర్షింపజేసుకొని అసత్యమును సత్యముగా నిరూపణ చేస్తూ ముందుకువెళుతూ ఉన్నారు. ఎంతకాలంగా తమ అథారిటీని చూపిస్తూ వస్తున్నారు! ఎంత నషాతో, అల్పకాలిక ప్రాప్తి యొక్క ప్రకాశముతో తమ ప్రభావమును కలిగిస్తారు! కావున సర్వ అథారిటీగల శ్రేష్ఠ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు ఏంచేయాలి? ఇంకా ఏమి మిగిలి ఉందో మీకు తెలుసా? సమాప్తికొరకు ఇంకా ఎంత సమయము ఉంది అని భావిస్తున్నారు? 1984 వరకా లేక 2000 వరకా? ఎంతవరకు అని అందాజా వేస్తున్నారు? 2000 సంవత్సరాలు పూర్తవుతాయా లేక దానికన్నా ముందే జరగాలా? మీ ఏర్పాట్ల లెక్కలో మీరు ఏం భావిస్తున్నారు? ఏ విషయము ఇంకా ఇప్పుడు మిగిలి ఉంది? కొత్త ప్రపంచంకొరకు ధరణినైతే తయారుచేస్తున్నారు కాని కొత్త ప్రపంచానికి ఆధారము ఈ కొత్త జ్ఞానము. మొట్టమొదటి మహిమ ఏమిటి? జ్ఞానసాగరుడు అని అంటారు కదా! కావున జ్ఞానం యొక్క మొదటి మహిమ ఏదైతే ఉందో ఆ కొత్త జ్ఞానమును ప్రపంచం ముందు ప్రత్యక్షం చేసారా? ఎప్పటి వరకైతే ఇది కొత్త జ్ఞానము అన్న విషయము ప్రత్యక్షమవ్వదో అప్పటి వరకు జ్ఞానదాత ఎలా ప్రత్యక్షమవుతారు. మొదట జ్ఞానము అన్న పదము వస్తుంది, ఆ తరువాత దాత అన్న పదము వస్తుంది. కావున జ్ఞానదాత ఉన్నతోన్నతమైనవారు లేక వారొక్కరే జ్ఞానదాత... అన్నది ఎలా నిరూపణ అవుతుంది? ఈ కొత్త జ్ఞానం ద్వారానే నిరూపణ అవుతుంది కదా! ఆత్మ ఏమంటుంది మరియు పరమాత్మ ఏమంటారు? ఈ ఆంతర్యము ఎప్పటి వరకైతే మనుష్యుల బుద్ధిలోకి రాదో అప్పటి వరకు ఎవరెవరైతే గడ్డిపోచలను ఆధారం చేసుకొని పట్టుకు కూర్చున్నారో వారు వాటిని ఎలా వదులుతారు మరియు ఒక్కరి ఆధారమును ఎలా తీసుకుంటారు? ఇప్పుడు చిన్న, చిన్న గడ్డిపోచల ఆధారంపై నడుస్తున్నారు, వాటినే తమ ఆధారంగా భావిస్తున్నారు. ఎప్పటి వరకైతే వారికి జ్ఞానము ద్వారా జ్ఞానదాత యొక్క ఆధారము అనుభవమవ్వదో అప్పటి వరకు ఈ హద్దులోని బంధనాల నుండి ముక్తులుగా అవ్వలేరు. ఇప్పటి వరకు ధరణిని తయారుచేసే, వాయు మండలమును పరివర్తనచేసే సేవ జరిగింది. ఇది మంచి కార్యము. పరివారపు ప్రేమ ఉంది. ఈ ప్రేమ యొక్క గుణము వాయుమండలమును పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అయింది. ధరణి అయితే తయారైంది మరియు తయారవుతూనే ఉంటుంది. కాని పునాది ఏదైతే ఉందో, నవీనత మరియు బీజము ఏదైతే ఉందో అది ఈ కొత్త జ్ఞానమే. నిస్వార్ధ ప్రేమ ఉంది, ఆత్మిక ప్రేమ ఉంది ఇదైతే అనుభవం చేసుకుంటారు. కాని ఇప్పుడు ప్రేమతోపాటు వీరు జ్ఞానపు అథారిటీగల ఆత్మలు, ఇది సత్యా జ్ఞానపు అథారిటీ అన్నది ప్రత్యక్షమవ్వడం ఇంకా మిగిలి ఉంది. ఎవరెవరైతే వస్తారో వారందరూ ఇది కొత్త జ్ఞానము, కొత్త విషయము అని అర్థం చేసుకోవాలి. ఏదైతే ఎవ్వరూ వినిపించలేదో అది ఇక్కడ విన్నాము. వీరు ఇచ్చే అథారిటీ అని వర్ణించాలి. పవిత్రత ఉంది, శాంతి ఉంది, ప్రేమ ఉంది, స్వచ్ఛత ఉంది... ఈ విషయాలన్నీ పునాదులే. ఆ పునాది ఆధారంపైనే ధరణి పరివర్తన జరిగింది. ఇది కూడా నాలుగు స్తంభాలు. మొదట ఎవరి బుద్ధి ఇటువైపు నిలిచేది కాదు. కాని, ఇప్పుడు ఈ నాలుగు స్తంభాల ఆధారంపై బుద్ధి యొక్క ఆకర్షణ కలుగుతోంది. ఈ పరివర్తన అయితే జరిగింది కాని, ఇది కొత్త జ్ఞానము అన్న శబ్దము ప్రఖ్యాతమవ్వాలి. ఈనాటివరకు ఏ విషయాలైతే అందరికీ స్వీకార యోగ్యంగా ఉన్నాయో వాటిని బి.కె.ల ఆల్మైటీ అథారిటీ వద్దు అని నిరూపించి చెబుతున్నారు. వేటినైతే వారు అవును అంటున్నారో వాటిని మీరు కాదు అని అంటున్నారు. మరి ఈ కాదు మరియు అవును అని అనడానికి రాత్రింబవళ్ళ తేడా ఉంది కదా! కావున మీరు ఈ మహాన్ తేడాను నిరూపించే మహాన్ ఆత్మలు. ఈ పేరును ఇప్పుడు ప్రత్యక్షం చేయండి, అప్పుడు జయ జయకారాలు మోగుతాయి. ఆత్మజ్ఞానము యథార్ధరూపంగా లేకపోయినాకాని జనులు ఎంతోకొంత విని, అవును అక్కడ కూడా ఇలాగే చెబుతారు అని మిక్స్ చేసేస్తుటాంరు. కాని ప్రపంచమంతా ఒకవైపు ఉంది, కాని బి.కె.లు ఇంకొకవైపు ఉన్నారు అన్న శబ్దము ప్రఖ్యాతమవ్వాలి. వీరు ఈ కొత్త జ్ఞానమును ఇచ్చే అథారిటీలు... ఈ అథారిటీ ప్రసిద్ధమవ్వాలి. దీనిద్వారానే శక్తిశాలీ ఆత్మలు ముందుకువస్తారు మరియు మీవైపు నుండి దండోరా మోగింపజేస్తారు. మీరు దండోరా మోగించవలసిన అవసరం ఉండదు కాని ఇటువంటి ఆత్మలు తృప్తి చెంది కొత్త విషయాన్ని తెలుసుకొని కొత్త ఉత్సాహంలోకి వచ్చి దండోరా మోగిస్తారు. ధర్మయుద్ధం కూడా ఇంకా మిగిలి ఉంది కదా! ఇప్పుడు ఇంకా గురువుల గద్దెను ఎక్కడ కదిలించారు? ఇప్పుడు ఇంకా శాఖోపశాఖలు మొదలైనవన్నీ ఎంతో విశ్రాంతిగా తమ తమ ధునిలో నిమగ్నమై ఉన్నాయి. బీజము ఎప్పుడు ప్రత్యక్ష స్వరూపంలోకి వస్తుంది? ఎప్పుడైతే చిన్న, చిన్న శాఖోపశాఖలు పూర్తిగా ఆకులు రాలిపోయి ఎండిపోయిన కొమ్మలుగా మిగిలిపోతాయో అప్పుడు బీజము పైన ప్రత్యక్షమవుతుంది కావున దాని ప్లానును తయారుచేసారు. ఎప్పుడైతే తమ స్టేజీపైకి వస్తారో అప్పుడు తమ ఒరిజినల్ జ్ఞానం యొక్క ప్రత్యక్షత అయితే జరగాలి కదా! వరదాన భూమిలోకి వచ్చి కూడా శాంతి చాలా బాగుంది, ప్రేమ చాలా బాగుంది అని అంటూ ఎంతోకొంత ఈ జోలెను నింపుకొని వెళ్ళిపోతే వరదాన భూమిలోకి వచ్చి విశేషముగా ఏమి తీసుకొని వెళ్ళినట్లు? కొత్త జ్ఞానమును కూడా నిరూపించాలి కదా! ఈ కొత్త జ్ఞానపు అథారిటీ ద్వారానే ఆల్మైటీ అథారిటీ యొక్క నిరూపణ జరుగుతుంది. ఇచ్చేవారు ఎవరు? ప్రేమ మరియు శాంతి లభించడం ద్వారా వీరిని తయారుచేసే శ్రేష్ఠులైనవారు మరెవరో ఉన్నారు అని తప్పకుండా అర్థం చేసుకుంటారు. కాని వీరు స్వయంగా భగవంతుడే అన్నది ఏ కొందరో అర్థం చేసుకుంటారు. కావున ఏమి మిగిలి ఉందో అర్థం చేసుకున్నారా? ఇప్పుడు కొత్త ప్రపంచంకొరకు కొత్త జ్ఞానమును నలువైపులా వ్యాపింపజేయండి, అర్థమైందా? క్లోటాదిమందిలో ఏ ఒక్కరో వెలువడతారు, కాని ఎటువంటి శబ్దము వెలువడాలంటే నలువైపులా వార్తాపత్రికల్లో ఈ బి.కె.లు ఈ ప్రపంచంలోకెల్లా కొత్త జ్ఞానమును ఇస్తున్నారు అన్న శబ్దము వెలువడాలి. ఏ జ్ఞానమును ఇస్తారు, దాని ఆధారమును ఎలా భావిస్తారు, దానిని ఎలా నిరూపించాలి అన్నవన్నీ వార్తాపత్రికల్లో రావాలి అప్పుడే జ్ఞానదాత యొక్క ఢంకా మోగింది అని భావించగలరు. అర్థమైందా? జ్ఞానపు ప్రభావంలో ప్రభావితులవ్వాలి. జ్ఞానపు ప్రభావశాలులుగా అవ్వడంలో మరియు ప్రేమ యొక్క ప్రభావశాలులుగా అవ్వడంలో తేడా ఏముంది? బ్రాహ్మణులలో కూడా రెండు భాగాలను చూసారు కదా! బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కాని, కొందరు ప్రేమ యొక్క ఆధారంపై, మరికొందరు జ్ఞానము మరియు ప్రేమ రెండింటి ఆధారంపై అలా అయ్యారు. కావున రెండు స్థితులలోను తేడా అయితే ఉంది కదా! ఎవరైతే ప్రేమను కూడా జ్ఞానంతో అర్థం చేసుకుంటారో వారు నిర్విఘ్నంగా నడుచుకుంటారు. ఎవరైతే కేవలం ప్రేమ ఆధారంపై నడుస్తారో వారు శక్తిశాలీ ఆత్మలుగా ఉండరు. జ్ఞానబలము తప్పకుండా కావాలి. ఎవరికైతే చదువుపై ప్రేమ ఉంటుందో, మురళిపై ప్రేమ ఉంటుందో మరియు ఎవరికైతే కేవలం పరివారంపై ప్రేమ ఉంటుందో వీటన్నింకీ ఎంత తేడా ఉంది! బ్రాహ్మణ జీవితము మంచిగా అనిపిస్తుంది, పవిత్రత మంచిగా అనిపిస్తుంది దీని ఆధారంపై వచ్చేవారు మరియు జ్ఞానపు శక్తి యొక్క ఆధారంపై వచ్చేవారు వీరిరువురిలోకి ఎంత తేడా ఉంది! జ్ఞానం యొక్క ఆనందము, అలౌకికంగా నిరాధారంగా ఉండే ఆనందము... అలాగే ప్రేమ యొక్క శక్తి కూడా ఉంది. కాని ప్రేమ శక్తి మాత్రమే కలవారు ఆధారం లేకుండా నడుచుకోలేరు. వారికి ఏదో ఒక ఆధారము తప్పకుండా కావాలి. మనన శక్తి జ్ఞానశక్తి కలవారిలో ఉంటుంది. ఎంతగా మనన శక్తి ఉంటుందో అంతగా బుద్ధి ఏకాగ్రత యొక్క శక్తి దానంతట అదే వస్తుంది మరియు ఎక్కడైతే బుద్ధి యొక్క ఏకాగ్రత ఉంటుందో అక్కడ పరిశీలించే మరియు నిర్ణయము తీసుకునే శక్తి స్వతహాగానే వస్తుంది. ఎక్కడైతే జ్ఞానం యొక్క పునాది ఉండదో అక్కడ పరిశీలించే శక్తి, నిర్ణయం తీసుకునే శక్తి బలహీనంగా ఉంటుంది ఎందుకంటే ఏకాగ్రత ఉండదు. అచ్ఛా!

బాప్దాదా అయితే అన్నీ వింటూ ఉంటారు. నవ్వు కూడా వస్తుంది అలాగే స్నేహంలో బలిహారమవుతుంటారు కూడా. అలాగే పిల్లల ధైర్యమును చూసి సంతోషిస్తుటాంరు కూడా. వీరు నా సమానంగా, బేహద్ యజమానులుగా అయిపోవాలి అని బ్రహ్మా బాబాకు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. వీరు పిల్లలకోసం ఆగిపోయి ఉన్నారు కదా! మరియు రాత్రింబవళ్ళు పిల్లల సేవలో తత్పరులై ఉంటారు. వతనంలో అయితే రాత్రి, పగలు ఉండవు... కాని స్థూల ప్రపంచంలో అయితే ఉంటాయి కదా! పిల్లలు ఒక్కొక్కరినీ విశేష ఆత్మగా, సంపూర్ణ ఆత్మగా, సంపన్న ఆత్మగా, సమాన ఆత్మగా చూడాలనుకుంటారు. బాబా బ్రహ్మాబాబాకు కాస్త ఓర్పు వహించమని చెబుతూ ఉంటారు. కాని బ్రహ్మాబాబాకు ఎంతో ఉత్సాహము ఉంటుంది కదా! కావున వారు పిల్లలు నా చేతిలో చేయివేసి నా సమానంగా అయిపోవాలి అని బాబాతో చెబుతూ ఉంటారు. బ్రహ్మాబాబా యొక్క సాకార జీవితంలోని ప్రారంభం నుండి ఏ విశేషతను చూసారు? ఎప్పుడో కాదు ఇప్పుడే చేయాలి అని అనేవారు. ఎప్పుడో అనే పదమును వినే లేక వినిపించే సంస్కారాలు ఎప్పుడైనా ఉన్నాయా? పిల్లలు ఎప్పుడైనా ఒక గంట తరువాత చేస్తాము అని అంటే బాబా ఆ గంట తరువాత చేయనిచ్చేవారా? రైలు వెళ్ళడానికి 5, 10 నిమిషాలే ఉంది మేము ఎలా చేరుకోగలవు అని ఎవరైనా అంటే వారిని ఆగనిచ్చేవారా? గడియారం ఆగిపోతుంది కాని పిల్లలు తప్పకుండా చేరుకుంటారు. నడుస్తున్న రైలు కూడా ఆగిపోతుంది కాని పిల్లలు చేరుకోవలసిందే. ఇది ప్రత్యక్షంగా చూసారు కదా! అలాగే పిల్లలు కూడా ఏ విషయంలోను స్వపరివర్తనలోనైనా లేక విశ్వపరివర్తనలోనైనా ఈ ఎప్పుడు అన్న పదమును పరివర్తనచేసి ఇప్పుడు అన్న ప్రత్యక్షతలోకి వచ్చేయాలి. బ్రహ్మాబాబా యొక్క ఈ ఉత్సాహము సదా ఉండేది. కావున మరి బాబాను అనుసరించాలి కదా! అచ్ఛా!

(ఇద్దరు, నలుగురు అన్నయ్యలు, అక్కయ్యలు బాప్దాదా నుండి సెలవు తీసుకునేందుకు వచ్చారు)

స్నేహానికి బదులు లభించింది కదా! స్వచ్ఛమైన హృదయంపై తండ్రి ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆది నుండి సత్యమైన లగనంలో ఉండే ఆత్మలు మీరు. కావున బాబా కూడా సత్యమైనవారికి సదా స్నేహం యొక్క జవాబును ఇస్తారు. సదా హృదయంలో బాబాయే ఇమిడి ఉన్నారు. కావున మంచిగా తీవ్ర పురుషార్ధంలో ముందుకు వెళుతున్నారు. మీరు కర్మయోగీ ఆత్మలు కాదా! కర్మ మరియు యోగము కంబైండ్గా ఉన్నాయి కదా! సదా బ్యాలెన్స్ను ఉంచి బాబా నుండి దీవెనలు తీసుకునేవారు మరియు సదా ఆనందకరమైన జీవితంలో ఉండే అటువంటి శ్రేష్ఠ ఆత్మలు మీరు. బాబా సదా పిల్లలు ప్రతిఒక్కరిపైనా వీరు విజయమాలలోని మణులు అన్న శుభ ఆశనే ఉంచుతారు. అచ్ఛా!

Comments