01-03-1983 అవ్యక్త మురళి

* 01-03-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విశ్వంలోని ప్రతి స్థానానికి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని, జ్ఞాన జలాన్ని అందివ్వండి ...

ఈరోజు బాప్ దాదా వతనంలో పరస్పరం ఆత్మిక సంభాషణ చేస్తూ పిల్లల రిమ్ ఝిమ్ (జ్ఞాన బిందువులను వెదజల్లుటను) కూడా చూస్తున్నారు. వర్తమాన సమయంలో మధువనం వరదాన భూమిపై పిల్లల రిమ్ ఝమ్ ఎలా జరుగుతోందో చూసి చూసి సంతోషిస్తున్నారు. మధువనం పవర్ హౌస్ నుండి నలువైపులా ఎన్ని కనెక్షన్లు వెళ్లి ఉన్నాయో బాప్ దాదా చూస్తూ ఉన్నారు. ఎలాగైతే స్థూలమైన పవర్ హౌస్ నుండి అనేక వైపులకు లైట్ కనెక్షన్లు వెళ్లాయో, అలా ఈ పవర్ హౌస్ నుండి ఎన్ని వైపులకు కనెక్షన్లు వెళ్లాయో, విశ్వంలోని ఎన్ని మూలలకు లైట్ కనెక్షన్లు వెళ్లాయో ఇంకా ఎన్ని మూలలకు ఇప్పుడు కనెక్షన్లు వెళ్లలేదో చూస్తున్నారు. ఉదాహరణానికి ఈ రోజులలో ప్రభుత్వం కూడా తమ రాజ్యంలోని అన్ని మూలలలో, అన్ని గ్రామాలలో నలువైపులా లైట(కరెంట్) మరియు నీటి సరఫరా ఏర్పాట్లు తప్పకుండా ఉండాలని ప్రయత్నం చేస్తోంది. పాండవ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారు? జ్ఞాన గంగలు నలువైపులకు వెళ్తున్నారు. పవర్ హౌస్ నుండి నలువైపులకు లైట్ కనెక్షన్ వెళ్తూ ఉంది. పై నుండి ఏ పట్టణాన్ని లేక గ్రామాన్ని చూసినా ఎక్కడెక్కడ వెలుగు ఉందో, ప్రకాశం దగ్గరగా ఉందా లేక దూరదూరంగా ఉందా అనే దృశ్యము స్పష్టంగా కనిపిస్తుంది కదా! ఎన్ని వైపులకు లైటు ఉంది, ఇంకా ఎన్ని వైపులకు లైటు చేరుకోలేదు అని బాప్ దాదా కూడా వతనం నుండి దృశ్యాన్ని చూస్తున్నారు. దేశ-విదేశాలలో ఇప్పటివరకు ఎన్ని స్థానాలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడింకా ఎన్ని కనెక్షన్లు ఇవ్వాలి? ఫలితాలు అయితే మీకు కూడా తెలుసు కదా! ఎలాగైతే కరెంట్ మరియు నీరు లేని స్థానాలకు విలువ ఉండదో అలాగే ఎక్కడ ఆధ్యాత్మిక ప్రకాశం మరియు జ్ఞాన జలం చేరుకోలేదో అక్కడి చైతన్య ఆత్మలు ఏ స్థితిలో ఉన్నారు? అంధకారంలో, దప్పికతో భ్రమిస్తూ ఉన్నారు, తపిస్తూ ఉన్నారు. ఇలాంటి ఆత్మల విలువ ఎంత అని చెప్తారు? గుడ్డిగవ్వతో సమానం మరియు వజ్రంతో సమానం అని చిత్రాలు తయారు చేస్తారు కదా! లైటు మరియు జ్ఞాన జలం లభించినట్లయితే గుడ్డిగవ్వ నుండి వజ్ర తుల్యంగా తయారవుతారు. అంటే విలువ పెరుగుతుంది కదా! దేశ-విదేశాల నుండి వచ్చిన పిల్లలు పవర్ హౌస్ నుండి విశేషమైన శక్తిని తీసుకొని తమ తమ స్థానాలకు వెళ్తున్నారని బాప్ దాదా చూస్తూ ఉన్నారు.

ఒకవైపు పిల్లల స్నేహంలో మధువనం అనగా బాప్ దాదా ఇంటి శృంగారం వెళ్లిపోతోందని బాప్ దాదా భావిస్తున్నారు. పిల్లలు మధువనంలోకి ఎప్పుడు వచ్చినా మధువనం మెరుపు లేక మధురమైన ఇంటి (స్వీట్ హెూమ్) మెరుపు ఎలా ఉంటుంది? మధువన ప్రకాశాన్ని పెంచే మా స్నేహీ, సహయోగులు వచ్చారని పిల్లలు కూడా భావిస్తారు. ఎలాగైతే మీరు అక్కడ గుర్తు చేసుకుంంటారో, నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ మధువనం స్మృతి సదా తాజాగా ఉంటుందో అలా బాప్ దాదా మరియు మధువన నివాసులు కూడా మీ అందరినీ గుర్తు చేసుకుంటారు. స్నేహంతో పాటు, సేవ కూడా విశేషమైన సబ్జెక్టు. అందువలన స్నేహంతో ఇక్కడే కూర్చుండిపోవాలని అనుకుంటారు. కాని సేవ లెక్కతో నలువైపులకు వెళ్లవలసే ఉంటుంది. ఎక్కడకూ వెళ్లకుండా ఉండే సమయం తప్పకుండా వస్తుంది. కానీ ఒకే స్థానంలో కూర్చుంటూ, కూర్చుంటూనే నలువైపులా ఉన్న దీపపు పురుగులన్నీ స్వతహాగానే దీపం వద్దకు వచ్చేస్తాయి. ఆబూ మనదే అని చిన్న స్యాంపుల్ చూశారు. ఇప్పుడైతే అద్దెకు ఇండ్లు (సూటళ్లు) తీసుకోవాల్సి వచ్చింది కదా. (ఫిబ్రవరిలో ప్రపంచ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మౌంట్ ఆబూలో అన్ని సూటళ్లు అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది). అయినా కొంచెం జ్ఞాన ప్రకాశాన్ని చూశారు. నలువైపులా ఫరిస్తాలే కనిపించే సమయము వస్తుంది. ఇప్పుడు నోటి ద్వారా సేవ చేసే పాత్ర నడుస్తోంది. ఇప్పుడింకా కొంచెం మిగిలి ఉంది.  అందువలన దూర-దూరాలకు వెళ్లవలసి ఉంటుంది. శ్రేష్ఠ సంకల్పాల శక్తిశాలీ సేవ గురించి ఇంతకుముందు కూడా వినిపించాను. అంతిమంలో ఆ సేవ స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో మమ్ములను పిలుస్తూ ఉన్నారు, దివ్య బుద్ధి ద్వారా ఎవరో మమ్మల్ను శుభ సంకల్పాలతో పిలుస్తూ ఉన్నారని అనుభవం చేస్తారు. కొంతమంది దివ్యదృష్టి ద్వారా తండ్రిని మరియు స్థానాన్ని (మధువనాన్ని) చూస్తారు. రెండు రకాల అనుభవాల ద్వారా చాలా తీవ్రగతితో తమ శ్రేష్ఠమైన గమ్యానికి చేరుకుంటారు. ఈ సంవత్సరం ఏం చేస్తారు?

ప్రయత్నం మంచిగా చేశారు ఈ సంవత్సరం మిగిలి ఉన్న స్థానాలకు ప్రకాశాన్ని(లైటును) అయితే తప్పకుండా ఇస్తారు. కానీ ప్రతి స్థానం యొక్క విశేషతను ఈ సంవత్సరం ఇదే చూపించండి - ప్రతి సేవాకేంద్రము అందులో కూడా విశేషించి పెద్ద పెద్ద సేవాకేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ లక్ష్యాన్ని ఉంచుకోండి. మీరు ధర్మ సమ్మేళనాలు చేసినప్పుడు అన్ని ధర్మాలవారిని ఒకచోట కలుపుతారు లేక రాజకీయ నాయకులను పిలుస్తారు, విశేషించి సైన్సువారిని పిలుస్తారు, ఇలా వేరు వేరు విధాలుగా స్నేహ మిలనాలు చేస్తారు. అలా ఈ సంవత్సరం ప్రతి స్థానంలో అన్ని రకాలైన విశేషమైన వృత్తుల వారిని, సంబందంలోకి వచ్చేవారిని తయారు చేయండి. ఎలాగైతే ఇప్పుడిక్కడ నల్లవారు, తెల్లవారు అన్ని రకాల వెరైటీలు ఉన్నారని, ఒకే స్థానంలో అన్ని రంగులు, దేశాలు మరియు ధర్మాలు కలిగినవారు ఉన్నారని అంటారు కదా. అలా ఇక్కడ అన్ని రకాల వృత్తులు కలిగినవారు ఉన్నారని అనాలి. విశేషమైన ఆత్మలు ఒకే పుష్పగుచ్ఛంలో వెరైటీ పుష్పాల వలె కనిపించాలి. ప్రతీ సెంటరులో ప్రతి వృత్తిని చేసే విశేష ఆత్మల సంఘటన ఉండాలి. అన్ని రకాల వృత్తుల వారికి ఇక్కడ ఒకే తండ్రి, ఒకే సత్యమైన జ్ఞానము, అది కూడా ఎంతో సహజమైన మరియు సరళమైన జ్ఞానమని ప్రపంచంలో ప్రసిద్ధమవ్వాలి అనగా ప్రతి సేవాస్థానంలో వేదిక పైన అన్ని రకాల వృత్తులు చేసేవారు కలిసి కనిపించాలి. ఏ వృత్తిలో ఉన్నవారూ మిగిలి పోరాదు. పేదవారి నుండి ధనవంతుల వరకు, గ్రామాల వారి నుండి పెద్ద పెద్ద పట్టణాలలో నివసించేవారి వరకు, శ్రామికుల నుండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల యజమానుల వరకు అన్ని రకాల విశేష ఆత్మల అలౌకిక ప్రకాశము(రౌనక్) కనిపించాలి. తద్వారా ఈ ఈశ్వరీయ జ్ఞానము కేవలం వీరి కొరకు మాత్రమే అని ఎవ్వరూ అనరాదు. అందరికీ తండ్రి, అందరి కొరకు ఈ జ్ఞానం ఉంది. పిల్లల నుండి తాత ముత్తాతల వరకు అందరూ విశేషించి ఈ జ్ఞానము మా కొరకే అని అనుభవం చేయాలి. ఎలాగైతే బ్రాహ్మణులైన మీ అందరి మనస్సులో, హృదయంలో బాబా అని ఒక్కటే శబ్దము వస్తుందో అలాగే విశ్వం మూల మూలల నుండి విశ్వంలోని ప్రతీ వృత్తి(పని) చేసే ఆత్మ మా కొరకే తండ్రి వచ్చారు, మా కొరకు ఈ జ్ఞానము ఆధారము(సహారా), శరణులాంటిది అని హృదయ పూర్వకంగా అనాలి. జ్ఞాన దాత మరియు జ్ఞానము రెండిటి గురించి అన్ని వైపుల నుండి అన్ని ప్రకారాల ఆత్మల నుండి ఇదే శబ్ధము రావాలి. ఇప్పుడు కూడా అన్ని వృత్తుల వారికి సేవ చేస్తూ కూడా ఉన్నారు కానీ ప్రతీ స్థానంలో అన్ని వెరైటీల వారు ఉండాలి అంతేకాక ఇలాంటి అన్ని వెరైటీ వృత్తులు చేసే వారి పుష్ప గుచ్చాన్ని బాప్ దాదా వద్దకు తీసుకురండి. అప్పుడు ప్రతీ సేవాకేంద్రము విశ్వంలోని సర్వాత్మల సంఘటన గల ఒక విశేషమైన చైతన్య మ్యూజియంగా తయారవుతుంది అర్థమయ్యిందా. ఎవరైతే సంపర్కములో ఉన్నారో వారిని సంబంధంలోకి తీసుకొస్తూ సేవ చేసే స్టేజి పైకి తీసుకురండి. సమయ ప్రతి సమయం ఏయే వి.ఐ.పిలు లేక పత్రికలవారు వచ్చారో వారిని కూడా సేవ యొక్క స్టేజి పైకి తీసుకొస్తూ ఉంటే వారి నోటితోనే మాట్లాడినందున వారి నోటి మాటలే ఆ ఆత్మల కొరకు(వారిని) ఈశ్వరీయ బంధనలో బంధించేందుకు సాధనంగా తయారవుతాయి. ఒక్కసారి చాలా బాగుంది అని అంటారు మళ్లీ సంబంధం నుండి దూరం అయిపోగానే మర్చిపోతారు కాని మాటి మాటికి చాలా మంచిది చాలా మంచిది అని అనేకుల ముందు చెప్తూ ఉంటే ఆ మాటలు కూడా వారిలో మంచిగా తయారయ్యే ఉత్సాహాన్ని పెంచుతాయి అంతేకాక దీనితో పాటు ఒక సూక్ష్మ నియమం కూడా ఉంది - ఎంతమందిపై ప్రభావం పడుందో ఆ ఆత్మల నుండి వీరికి వాటా లభిస్తుంది అనగా వారి ఖాతాలో పుణ్యం ఖాతా జమా అవుతుంది. అదే పుణ్య ఖాతా అనగా పుణ్యం యొక్క శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠంగా తయారయ్యేందుకు వారిని లాగుతూ ఉంటుంది. అందువలన ఇప్పుడు ఎవరైతే తండ్రి భూమి నుండి నేరుగా ఎంతో కొంత తీసుకెళ్లారో అది కొద్దిగా కావచ్చు, ఎక్కువగా కావచ్చు వారితో దానం తప్పకుండా చేయించండి అనగా సేవ చేయించండి. ఇలా చేయిస్తే ఎలాగైతే స్థూల ధనము దానం చేస్తే లభించే ఫలముగా అల్పకాలిక కోరికలతో కలిగిన రాజ్యము లభిస్తుందో అలా ఈ జ్ఞాన ధనాన్ని, అనుభవాల ధనాన్ని దానం చేయిస్తే కొత్త రాజ్యములోకి వచ్చేందుకు వారిని పాత్రులుగా చేస్తుంది. కాన్ఫరెన్స్ లో చాలా బాగా ప్రభావితులయ్యారు, ఇప్పుడు ఆ ప్రభావితులైన ఆత్మల ద్వారా సేవ చేయించి ఆ బలము ద్వారా ఆ ఆత్మలను కూడా ముందుకు తీసుకెళ్ళండి అంతేకాక అనేకుల పట్ల నిమిత్తంగా తయారు చేయండి ఏమి చేయాలో అర్థమయిందా. సేవ అయితే వృద్ధిని పొందుతూనే ఉంది ఇంకా పొందుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు క్లాసులకు వచ్చే విద్యార్థులలో అన్ని వెరైటీల వారిని తయారు చేయండి.

ఇప్పుడు విదేశాల వారిని కలుసుకునే సాకార రూపంలోని ఈ పాత్ర ఈ సంవత్సరం ఈ సీజన్లో పూర్తి అవుతోంది. కానీ దేశంలో ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు. సాకార వతనంలో అయితే సమయము గూర్చి నియమాన్ని తయారు చేయవలసి వస్తుందని వినిపించాను కదా.ఆకారీ వతనంలో ఈ బంధనం నుండి ముక్తులుగా ఉంటారు. మంచిది.

నలువైపులా ఉత్సాహ-ఉల్లాసాలు కలిగిన సేవాధారి పిల్లలకు, సదా తండ్రి తోడును అనుభవం చేసే సమీప ఆత్మలైన పిల్లలకు సదా ఒక్కరి సృతిలో ఏకరసంగా ఉండే శ్రేష్ఠమైన ఆత్మలకు బాప్ దాదా ప్రియసృతులు మరియు నమస్తే. 

Comments