13-01-1986 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఈ రోజు బాప్ దాదా తమ హోలీ మరియు హ్యాపీ హంసల సభను చూస్తున్నారు. అందరూ హోలీగా ఉండడంతో పాటు సదా హ్యాపీగా కూడా ఉంటున్నారా? హోలీ అనగా పవిత్రతకు ప్రత్యక్ష గుర్తు - హ్యాపీ అనగా సంతోషం సదా ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. ఒకవేళ సంతోషం లేదంటే తప్పకుండా ఏదో అపవిత్రత అనగా సంకల్పం లేక కర్మ యథార్థంగా లేదు, అందుకే సంతోషం లేదు. కేవలం 5 వికారాలను అపవిత్రత అని అనరు. కాని సంపూర్ణ ఆత్మలకు, దేవాత్మలుగా అయ్యేవారికి అయథార్థమైన, వ్యర్థమైన, సాధారణమైన సంకల్పాలను, మాటలను లేదా కర్మలను కూడా సంపూర్ణ పవిత్రత అని అనరు. సంపూర్ణ స్థితికి సమీపంగా చేరుకుంటున్నారు. కావున వర్తమాన సమయానుసారంగా వ్యర్థమైన మరియు సాధారణమైన కర్మలు జరగకూడదు, వీటిని కూడా చెక్ చేసుకుని చేంజ్(పరివర్తన) అవ్వాలి. సంకల్పాలు, మాటలు మరియు కర్మలు ఎంత సమర్థంగా మరియు శ్రేష్ఠంగా ఉంటాయో, అంతగా సంతోషపు ప్రకాశం, అదృష్టపు నషా సదా అనుభవం అవుతాయి మరియు అనుభవం చేయిస్తాయి. బాప్ దాదా పిల్లలందరిలో ఈ రెండు విషయాలు చెక్ చేస్తున్నారు, ఎంతవరకు పవిత్రతను ధారణ చేశారు! ఇప్పుటికీ కూడా వ్యర్థం మరియు సాధారణత ఎంతవరకు ఉన్నాయి? మరియు ఆత్మిక సంతోషం, అవినాశి సంతోషం, ఆంతరిక సంతోషం ఎంతవరకు ఉంది! బ్రాహ్మణ పిల్లలందరూ బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేయడానికి లక్ష్యమే, సదా సంతోషంగా ఉండటం. సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకే బ్రాహ్మణులుగా అయ్యారు, అంతేకాని శ్రమతో కూడిన పురుషార్థం చేసేందుకు లేక ఏదో ఒక అలజడిలో ఉండేందుకు బ్రాహ్మణులుగా అవ్వలేదు.
కల్పం మొత్తంలో ప్రాప్తించని ఆత్మిక ఆంతరిక సంతోషాన్ని మరియు అతీంద్రియ సుఖాన్ని ప్రాప్తి చేసుకునేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. కాని చెక్ చేసుకోండి - ఏదైనా సాధనం ఆధారంపై, ఏదైనా హద్దు యొక్క ప్రాప్తి ఆధారంపై, లేక కొంత సమయపు సఫలత ఆధారంపై, గౌరవం లేక పేరు ప్రతిష్టల ఆధారంపై, మనసు యొక్క హద్దు కోరికల ఆధారంపై సంతోషం కలుగుతుందా లేక ఇవే బాగా అనిపిస్తున్నాయా - వ్యక్తి లేదా స్థానం లేదా వైభవం, ఈ మనసుకు ఇష్టమైన వాటిపై సంతోషపు ప్రాప్తి ఆధారపడిలేదు కదా? ఈ ఆధారాలతో సంతోషం ప్రాప్తించడం - ఇదేమీ వాస్తవిక సంతోషం కాదు. అవినాశీ సంతోషం కాదు. ఆధారం కదిలిందంటే సంతోషం కూడా కదులుతుంది. ఇటువంటి సంతోషాన్ని ప్రాప్తి చేసుకునేందుకు బ్రాహ్మణులుగా అవ్వలేదు. అల్పకాలిక ప్రాప్తి ద్వారా కలిగే సంతోషం ప్రపంచంలోని వారి దగ్గర కూడా ఉంది. వారి స్లోగన్ కూడా - తినండి, తాగండి, ఆనందంగా ఉండండి అని ఉంది. కాని ఆ అల్పకాలిక ఆధారం సమాప్తమయిందంటే సంతోషం కూడా సమాప్తమైపోతుంది. అలానే బ్రాహ్మణ జీవితంలో కూడా ఈ ఆధారాల ద్వారా సంతోషం ప్రాప్తిస్తే ఇక వ్యత్యాసం ఏముంది? సంతోషాల సాగరుని పిల్లలుగా అయ్యారు కనుక ప్రతి సంకల్పంలో, ప్రతి సెకండు సంతోషపు అలలలో తేలియాడేవారు. సదా సంతోషాల భాండాగారంగా ఉండాలి. ఇటువంటివారినే హోలీ మరియు హ్యాపీ హంసలు అని అంటారు. బాప్ దాదా చూస్తున్నారు - ఎలాంటి హద్దు యొక్క ఆధారం లేకుండా సదా ఆంతరిక సంతోషంలో ఉండాలనే లక్ష్యమేదైతే ఉందో ఆ లక్ష్యానికి బదులుగా హద్దు ప్రాప్తులనే చిన్న-చిన్న సందులలో చిక్కుకుపోయిన కారణంగా చాలామంది పిల్లలు లక్ష్యం అనగా గమ్యం నుండి దూరమైపోతారు. హైవేను విడిచిపెట్టి సందులలో చిక్కుకుంటారు. తమ లక్ష్యాన్ని, సంతోషాన్ని విడిచిపెట్టి హద్దు యొక్క ప్రాప్తుల వెనుక వెళ్తారు. ఈ రోజు పేరు వచ్చింది లేక పని జరిగింది, కోరిక పూర్తి అయింది అంటే సంతోషముంటుంది. మనసుకు ఇష్టమైన, సంకల్పాలకు ఇష్టమైన ప్రాప్తి లభించిందంటే చాలా సంతోషముంటుంది. కొంచెం తక్కువైనా కూడా లక్ష్యం అక్కడే ఆగిపోతుంది. లక్ష్యం హద్దు లక్ష్యంగా అవుతుంది, అందువలన అనంతమైన అవినాశి సంతోషం నుండి దూరమైపోతారు. కనుక బాప్ దాదా పిల్లలను అడుగుతున్నారు, దీనికోసమేనా బ్రాహ్మణులుగా అయ్యారు? దీనికోసమేనా ఈ ఆత్మిక జీవితాన్ని తమదిగా చేసుకున్నారు? ఇదైతే సాధారణ జీవితం. దీన్ని శ్రేష్ఠమైన జీవితమని అనరు.
ఏ కర్మ చేసినా కూడా, ఎంత పెద్ద సేవ యొక్క కార్యం అయినా కానీ ఏ సేవ అయితే ఆంతరిక సంతోషం, ఆత్మిక ఆనందం, అనంతమైన ప్రాప్తి నుండి కిందికి తీసుకొస్తుందో అనగా హద్దులోకి తీసుకొస్తుందో, ఈ రోజు ఆనందం రేపు తికమక కలిగిస్తుందో, ఈ రోజు సంతోషం రేపు వ్యర్థమైన చిక్కుల్లో వేస్తుందో, సంతోషం నుండి వంచితం చేస్తుందో, అటువంటి సేవను విడిచిపెట్టండి కాని సంతోషాన్ని విడిచిపెట్టకండి. సత్యమైన సేవ సదా అనంతమైన స్థితిని, అనంతమైన సంతోషాన్ని అనుభవం చేయిస్తుంది. ఒకవేళ ఇటువంటి అనుభూతి కలగలేదంటే అది మిక్స్ సేవ. సత్యమైన సేవ కాదు. సేవ ద్వారా స్వఉన్నతి, స్వప్రాప్తి, సంతుష్టత మరియు మహానతల అనుభూతి కలిగిందా? అని సదా ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎక్కడైతే సంతుష్టత యొక్క మహానత ఉంటుందో అక్కడ అవినాశి ప్రాప్తి యొక్క అనుభూతి కలుగుతుంది. సేవ అనగా పుష్పాల తోటను సస్యశ్యామలంగా చేయడం. సేవ అనగా పుష్పాల తోటను అనుభవం చేయడం, ముళ్ళ అడవిలో చిక్కుకోవడం కాదు. చిక్కులు, అప్రాప్తి, మనసు యొక్క తికమక, ఇప్పుడిప్పుడే ఆనందం, ఇప్పుడిప్పుడే తికమకపడటం, ఇవన్నీ ముళ్ళు. ఈ ముళ్ళ నుండి దూరంగా ఉండటం అనగా అనంతమైన సంతోషాన్ని అనుభవం చేయడం. ఏం జరిగినా కానీ - హద్దు ప్రాప్తులను త్యాగం చేయవలసి వచ్చినా కూడా, చాలా విషయాలను విడిచిపెట్టాల్సి వచ్చినా కూడా, విషయాలను విడిచిపెట్టండి కాని సంతోషాన్ని విడిచిపెట్టకండి. దేనికోసం వచ్చారో ఆ లక్ష్యం నుండి దూరమవ్వకండి. ఈ సూక్ష్మమైన చెకింగ్ చేసుకోండి. సంతోషంగా ఉన్నారు కానీ అల్పకాలిక ప్రాప్తుల ఆధారంతో సంతోషంగా ఉండడం దీనినే సంతోషమని భావించడం లేదు కదా? సైడ్ సీన్స్ నే గమ్యమని భావించడం లేదు కదా? ఎందుకంటే సైడ్ సీన్స్ కూడా ఆకర్షించేవిగా ఉంటాయి. కాని గమ్యాన్ని చేరుకోవడం అనగా అనంతమైన రాజ్యానికి అధికారిగా అవ్వడం. గమ్యం నుండి దూరంగా ఉండేవారు విశ్వం యొక్క రాజ్యాధికారిగా అవ్వలేరు. రాయల్ ఫ్యామిలీలోకి కూడా రాలేరు కావున లక్ష్యాన్ని, గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. నడుస్తూ-నడుస్తూ ఎక్కడైనా ఏదైనా హద్దు యొక్క సందులోకి చేరుకోవడం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. అల్పకాలిక ప్రాప్తి యొక్క సంతోషం, సదాకాలపు అదృష్టం నుండి దూరం చేయడం లేదు కదా? కొంచెంలో సంతోషపడేవారు కాదు కదా? ఎలా ఉన్నానో అలా బాగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని స్వయానికి స్వయం సంతోషపర్చుకోవడం లేదు కదా? అవినాశి సంతోషానికి గుర్తు - వారికి ఇతరుల నుండి కూడా సదా సంతోషపు ఆశీర్వాదాలు తప్పకుండా ప్రాప్తిస్తాయి. బాప్ దాదా మరియు నిమిత్తంగా ఉన్న పెద్దల యొక్క స్నేహపూర్వక ఆశీర్వాదాలు, ఆంతరిక అలౌకిక ఆత్మిక సంతోషం యొక్క సాగరంలో తేలియాడే అనుభవం చేయిస్తాయి. నేను బాగానే ఉన్నాను కానీ ఇతరులకు నా గురించి తెలియదు అని నిర్లక్ష్యంగా అనుకోకండి. సూర్యుని ప్రకాశం దాగి ఉండగలదా? సత్యత యొక్క సుగంధం ఎప్పుడూ నశించదు. దాగి ఉండవు కావున ఎప్పుడూ మోసపోకండి. ఈ పాఠం పక్కా చేసుకోండి. మొదట తమ అనంతమైన అవినాశి సంతోషం, తర్వాతనే ఇతర విషయాలు. అనంతమైన సంతోషమనేది, సేవ యొక్క, సర్వుల స్నేహం యొక్క, సర్వుల ద్వారా అవినాశీ గౌరవం ప్రాప్తించడం యొక్క అదృష్టాన్ని అనగా శ్రేష్ఠ భాగ్యాన్ని స్వతహాగా అనుభూతి చేయిస్తుంది. ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారు అదృష్టవంతులు. శ్రమ లేకుండా, కోరిక లేకుండా మరియు అడగకుండానే సర్వ ప్రాప్తులు సహజంగా లభిస్తాయి. ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నారా?
దేనికోసం వచ్చారో, ఎక్కడికి వెళ్ళాలో మరియు ఎక్కడికి వెళ్తున్నారో బాప్ దాదా చూస్తున్నారు. హద్దును విడిచిపెట్టి మళ్ళీ హద్దులోకే వెళ్తున్నట్లయితే అనంతమైన అనుభవాన్ని ఎప్పుడు చేస్తారు! బాప్ దాదాకు కూడా పిల్లలపై స్నేహం ఉంటుంది. దయ అని అనరు ఎందుకంటే మీరు బికారులు కారు, దాత, విధాత యొక్క పిల్లలు. దుఃఖితులపై దయ చూపించడం జరుగుతుంది. మీరైతే సుఖ స్వరూపులు, సుఖదాత యొక్క పిల్లలు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమయిందా? బాప్ దాదా ఈ సంవత్సరం పదే-పదే భిన్న-భిన్న విషయాలపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఈ సంవత్సరం విశేషంగా స్వయంపై అటెన్షన్ పెట్టుకునేందుకు సమయం ఇవ్వబడుతుంది. ప్రపంచంలోనివారు కేవలం తినండి, తాగండి, ఆనందించండి అని అంటారు. కాని బాప్ దాదా అంటున్నారు - తినండి మరియు తినిపించండి, ఆనందంగా ఉండండి మరియు ఆనందంలోకి తీసుకురండి. అచ్ఛా -
సదా అవినాశి అనంతమైన సంతోషంలో ఉండేవారు, ప్రతి కర్మలో అదృష్టాన్ని అనుభవం చేసేవారు, సదా సర్వులకు సంతోషం యొక్క ఖజానాను పంచేవారు, సదా సంతోషమనే సుగంధాన్ని వ్యాపింపజేసేవారు, సదా సంతోషమనే ఉల్లాస, ఉత్సాహాల అలలలో తేలియాడేవారు, ఇటువంటి సదా సంతోషం యొక్క ప్రకాశం మరియు నషాలో ఉండేవారు, శ్రేష్ఠమైన లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క సదా హోలీ మరియు హ్యాపీగా ఉండే ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో:-
1. ప్రవృత్తిలో ఉంటూ సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉన్నారు కదా! ఎప్పుడూ కూడా ప్రవృత్తి పట్ల ఆకర్షణ కలగడం లేదు కదా? ఒకవేళ ఎక్కడైనా కూడా ఎవరి పట్ల అయినా మోహం ఉన్నట్లయితే వారు సదా కోసం తమ జీవితానికి విఘ్నంగా అవుతారు కావున సదా నిర్విఘ్నంగా అయ్యి ముందుకు వెళ్తూ ఉండండి. కల్పక్రితం వలె అంగదునిగా అయ్యి అచల్-అడోల్ గా (చలించనివారిగా-స్ధిరంగా) ఉండండి. అంగదునికి ఏం విశేషత చూపించారు? పాదం కూడా ఎవ్వరూ కదిలించలేనంత నిశ్చయబుద్ధి ఉండాలి. మాయ నిశ్చయం రూపీ పాదాన్ని కదిలించేందుకు రకరకాలుగా వస్తుంది. కాని మాయ కదిలిపోవాలి, మీ నిశ్చయం రూపీ పాదం కదలకూడదు. స్వయం మాయ సరెండర్ అవుతుంది. మీరైతే సరెండర్ అవ్వరు కదా! తండ్రి ఎదుట సరెండర్ అవ్వండి, మాయ ఎదుట కాదు, ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు సదా నిశ్చింతగా ఉంటారు. ఒకవేళ కొంచెమైనా కూడా ఏదైనా చింత ఉన్నట్లయితే నిశ్చయంలో లోపముంది. ఎప్పుడైనా ఏ విషయం గురించైనా కొంచెం చింత కలిగినా - దానికి కారణమేమిటి, తప్పకుండా ఏదో ఒక విషయంలో నిశ్చయంలో లోపముంది. డ్రామా పట్ల నిశ్చయంలో లోపం కావచ్చు, స్వయంపై స్వయం నిశ్చయంలో లోపం కావచ్చు, తండ్రి పట్ల నిశ్చయంలో లోపం కావచ్చు. మూడు రకాల నిశ్చయాలలో ఏ కొంచెం లోపమున్నా కూడా నిశ్చింతగా ఉండలేరు. అన్నిటికంటే పెద్ద అనారోగ్యం చింత. చింత అనే అనారోగ్యానికి మందు డాక్టర్ల వద్ద కూడా లేదు. తాత్కాలికంగా నిద్ర పుచ్చేందుకు మందు ఇస్తారు కాని సదా కోసం చింతను తొలగించలేరు. చింత ఉన్నవారు ఎంతగా ప్రాప్తి వెనుక పరుగెడతారో అంతగా ప్రాప్తి ముందుకు పరుగెడుతుంది కావున సదా నిశ్చయమనే పాదం అచలంగా ఉండాలి. సదా ఒకే బలం, ఒకే భరోసా ఇదే పాదము. నిశ్చయమనండి, భరోసా అనండి, విషయం ఒక్కటే. ఇటువంటి నిశ్చయబుద్ధి పిల్లల విజయం నిశ్చితం.
2. సదా తండ్రిపై బలహారమయ్యేవారే కదా? ఏదైతే భక్తిలో ప్రతిజ్ఞ చేశారో - అది నిలబెట్టుకునేవారే కదా? ఏం ప్రతిజ్ఞ చేశారు? సదా మీపై బలిహారమవుతాము. బలిహారమంటే సదా సమర్పితమై శక్తిశాలిగా అయ్యేవారు. కనుక బలిహారం అయిపోయారా లేక అయ్యేటువంటివారా? బలిహారమవ్వడం అనగా నాదంటూ ఏదీ లేదు. మేరాపన్ (నాది) అనేది సమాప్తం. శరీరం కూడా నాది కాదు. మరి ఎప్పుడైనా దేహాభిమానంలోకి వస్తారా? నాది అనేది ఉంటే అప్పుడు దేహ-భానం వస్తుంది. దీని నుండి కూడా అతీతంగా ఉండేటటువంటివారు దీన్నే బలిహారమవ్వడం అని అంటారు. కనుక మేరాపన్ (నాది)ని సదా కొరకు సమాప్తం చేస్తూ వెళ్ళండి. అంతా మీదే అనే ఈ అనుభవం చేస్తూ ఉండండి. ఎంత ఎక్కువగా అనుభవీలుగా అవుతారో అంత అథారిటీ స్వరూపులుగా ఉంటారు. వారు ఎప్పుడూ మోసపోలేరు. దుఃఖపు అలలలోకి రాలేరు. కనుక సదా అందరికీ అనుభవం యొక్క కథలు వినిపిస్తూ ఉండండి. అనుభవీ ఆత్మలు కొద్ది సమయంలో ఎక్కువ సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. అచ్ఛా.
వీడ్కోలు సమయం -14 జనవరి మకర సంక్రాంతి యొక్క ప్రియస్మృతులు
ఈ రోజు యొక్క మహత్వాన్ని సదా తినే మరియు తినిపించే మహత్వంగా చేసేశారు. కొంత తింటారు, కొంత తినిపిస్తారు. వారు నువ్వులు దానం చేస్తారు లేక తింటారు. నువ్వులు అనగా చాలా చిన్న బిందువు, ఏ విషయం వచ్చినా - అది చిన్నదిగా ఉంటే ఇది నువ్వుగింజతో సమానమని అంటారు మరియు విషయం పెద్దదైతే పర్వత సమానమని అంటారు. కనుక పర్వతానికి మరియు నువ్వుగింజకు చాలా వ్యత్యాసం ఉంది కదా. మీరు అతి సూక్ష్మమైన బిందువులుగా అవుతారు కనుక నువ్వులకు మహత్వం ఉంటుంది. ఎప్పుడైతే బిందు రూపంగా అవుతారో అప్పుడు ఎగిరేకళ యొక్క గాలిపటంలా అవుతారు. కనుక నువ్వులకు కూడా మహత్వముంది. మరియు నువ్వులను సదా తీపితో కలుపుతారు, నువ్వులను అలాగే తినరు. మధురత అనగా స్నేహంతో సంగఠిత రూపంలోకి తీసుకురావడానికి గుర్తు. ఎలాగైతే నువ్వులకు తీపి కలిపితే బాగా అనిపిస్తుంది, నువ్వులను అలాగే తింటే చేదుగా అనిపిస్తాయి కాని తీపి కలిపితే చాలా బాగుంటుంది. అలా ఆత్మలైన మీరు కూడా ఎప్పుడైతే మధురతతోపాటు సంబంధంలోకి వస్తారో, స్నేహంలోకి వస్తారో, అప్పుడు శ్రేష్ఠంగా అయిపోతారు. కనుక ఈ సంగఠన మధురతకు స్మృతిచిహ్నము. దీనికి కూడా గుర్తు ఉంది. కనుక సదా స్వయాన్ని మధురత ఆధారంతో సంగఠిత శక్తిలోకి తీసుకురావడం, బిందు రూపంగా అవ్వడం మరియు గాలిపటంగా అయ్యి ఎగిరేకళలో ఎగరడం, ఇది ఈ రోజుకు గల మహత్వము. కనుక జరుపుకోవడం అనగా తయారవ్వడం. మరి మీరు తయారయ్యారు మరియు వారు కేవలం కొంచెం సమయం కొరకు జరుపుకుంటారు. ఇందులో దానమివ్వడం అనగా ఏవైనా బలహీనతలుంటే వాటిని దానంగా ఇచ్చేయండి. చిన్న విషయంగా భావించి ఇచ్చేయండి. నువ్వు గింజ సమానంగా భావించి ఇచ్చేయండి. పెద్ద విషయంగా భావించకండి - విడిచిపెట్టాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది అని భావించకండి. నువ్వుగింజ సమానంగా ఉన్న చిన్న విషయాన్ని దానమివ్వండి, చిన్న విషయంగా భావించి చాలా సంతోషంగా ఇచ్చేయండి. ఇది దానానికి గల మహత్వం. అర్థమయిందా!
సదా స్నేహీగా అవ్వండి, సదా సంగఠిత రూపంలో నడవండి మరియు సదా పెద్ద విషయాన్ని చిన్నదిగా భావించి సమాప్తం చెయ్యండి. అగ్నిలో కాల్చేయాలి, ఇదే మహత్వం. మరి జరుపుకున్నారు కదా. దృఢ సంకల్పమనే నిప్పును అంటించారు. ఈ రోజు మంటలు వేస్తారు కదా. కనుక సంస్కార పరివర్తన దినం, వారు సంక్రాంతి అని అంటారు, మీరు సంస్కార పరివర్తన అని అంటారు. అచ్ఛా - అందరికీ స్నేహం మరియు సంగఠన యొక్క శక్తిలో సదా సఫలమయ్యే ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
Omshanthi Baba todayas Ayaktha Murali wonderful Thankyou Mera Baba
ReplyDelete