31-12-1981 అవ్యక్త మురళి

* 31-12-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

నిర్బలులకు బలమును ఇచ్చే మహాబలవానులుగా అవ్వండి.

బాప్ దాదా సదా ప్రతి అడుగులోనూ, ప్రతి సంకల్పములోనూ పైకి ఎగిరే కళలో ఉండే పిల్లలను చూస్తున్నారు. క్షణములో అశరీరీ భవ అన్న వరదానము లభించగానే క్షణములో ఎగిరిపోవాలి. అశరీరులుగా అవ్వడం అనగా ఉన్నతముగా ఎగరడం. శరీరము యొక్క అభిమానములోకి రావడం అనగా పంజరంలోని పక్షులుగా అవ్వడం. ఈ సమయంలో పిల్లలందరూ అవినాశీ భవ అనే వరదానము ద్వారా పైకి ఎగిరిపోయే పక్షుల్లా అయిపోయారు. ఈ సమూహము స్వతంత్ర ఆత్మలు అనగా పైకి ఎగిరే పక్షులది. అందరూ స్వతంత్రులే కదా! మీ మధురమైన ఇంటికి వెళ్ళిపోండి అని ఆర్డర్ లభిస్తే ఎంత సమయంలో వెళ్ళగలరు? క్షణములో వెళ్ళగలుగుతారు కదా! మీ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి ద్వారా మీ సర్వశక్తుల యొక్క కిరణాల ద్వారా అంధకారములో ప్రకాశమును తీసుకురండి, జ్ఞానసూర్యులుగా అయి అంధకారమును సమాప్తము చేయండి అని ఆర్డర్ లభిస్తే క్షణములో ఈ అనంతమైన సేవను చేయగలుగుతారా? ఇటువంటి మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయ్యారా? సైన్స్ యొక్క సాధనాలు క్షణములో అంధకారము నుండి ప్రకాశవంతముగా చేయగలుగుతున్నప్పుడు హే జ్ఞానసూర్యులైన పిల్లల్లారా! మీరు ఎంత సమయంలో ప్రకాశవంతం చేయగలుగుతారు? సైన్స్ కన్నా సైలెన్స్ యొక్క శక్తి అతి శ్రేష్టమైనది. మరి క్షణములో స్మృతి యొక్క స్విచ్ ను ఆన్ చేయడంతో అంధకారములో భ్రమిస్తున్న ఆత్మలను ప్రకాశములోకి తీసుకువస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారా? మీరేమి భావిస్తున్నారు?

ఏడు రోజుల ఏడు గంటల కోర్సును ఇచ్చి అంధకారము నుండి ప్రకాశములోకి తీసుకురాగలరా? లేక మూడు రోజుల యోగశిబిరముతో ప్రకాశములోకి తీసుకురాగలరా? లేక ఒక్క క్షణము యొక్క స్థితి వరకూ చేరుకున్నారా? ఏమి భావిస్తున్నారు? ఇప్పుడు సేవ యొక్క లెక్క గంటల్లో ఉందా లేక నిమిషాల్లో ఉందా లేక క్షణముల గతి వరకూ చేరుకున్నారా? మీరేమి భావిస్తున్నారు? ఇప్పుడు సమయం కావాలా లేక ఒక్క క్షణము వరకూ చేరుకున్నాము అని భావిస్తున్నారా? క్షణములో ముక్తి - జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ప్రాప్తించుకోండి అని ఏ ఛాలెంజ్ అయితే చేస్తారో దానిని ప్రత్యక్షతలోకి తీసుకువచ్చేందుకు తయారుగా ఉన్నారా? స్వపరివర్తన యొక్క గతి క్షణాల వరకూ చేరుకుందా? మీరేమంటారు? పాత సంవత్సరం సమాప్తమైపోతోంది, కొత్త సంవత్సరం వస్తోంది. ఇప్పుడు సంగమంలో కూర్చున్నారు. కావున పాత సంవత్సరంలో స్వపరివర్తన లేక విశ్వపరివర్తన యొక్క గతి ఎంతవరకూ చేరుకుంది? తీవ్రగతి ఉందా? రిజల్ట్ అయితే వెలువడుతుంది కదా! కావున ఈ సంవత్సరం యొక్క రిజల్ట్ ఎలా ఉంది? స్వయం ప్రతి, సంబంధ సంపర్కాల ప్రతి లేక విశ్వ సేవ ప్రతి ఈ సంవత్సరం యొక్క లక్ష్యము ఏమి లభించింది? అది మీకు తెలుసు కదా! ఎగిరే పక్షులుగా లేక ఎగిరే కళగా ఉండాలి. కావున ఇదే లక్ష్యానుసారముగా గతి ఎలా ఉంది? ఎప్పుడైతే అందరి యొక్క గతి ఒక్క క్షణములో అయ్యే విధముగా చేరుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? మీ ఇంటికి మరియు మీ రాజ్యానికి చేరుకుంటారు. ఇంటికి తిరిగివెళ్ళి రాజ్యములోకి తిరిగి వచ్చేస్తారు. 

కావున కొత్త సంవత్సరంలో కొత్త ఉల్లాసము. ప్రతి సంకల్పము మరియు ప్రతి క్షణములో, ప్రతి కర్మలోనూ ప్రాప్తి యొక్క సిద్ధి అనే నవీనత ఉండాలి. ఇప్పుడు రేపటి నుండి ఏమి ప్రారంభమవుతుంది? కొత్త సంవత్సరమైతే ప్రారంభమవుతుంది కానీ ఏమంటారు? కొత్త సంవత్సరం ఎక్కడినుండి ప్రారంభమవుతుంది? లౌకికములో కూడా ఒకటి, ఒకటి నుండి ప్రారంభమవుతుంది కదా! మరియు మీరు ఏమి ప్రారంభిస్తారు? వారిదైతే ఒకటినుండి ప్రారంభమవుతుంది మరి మీది ఎలా ఉంటుంది? 'వన్ మరియు విన్'. ప్రతి సంకల్పములోనూ విన్ అనగా విజయము ఉండాలి. ప్రతిరోజూ మీ మస్తకముపై ఈ సంవత్సరము యొక్క ఏ తిలకమును దిద్దుకుంటారు. 'విజయము యొక్క తిలకము'. ఏ స్లోగన్ను గుర్తుంచుకుంటారు? 'మేము విజయీ రత్నాలము, కల్పకల్పము యొక్క విజయీలము, విజయులుగా ఉన్నాము, విజయులుగా ఉంటున్నాము మరియు సదా విజయులుగానే ఉంటాము', ఏ కిరీటమును ధారణ చేస్తారు? 'లైట్ మరియు మైట్'. ఈ డబుల్ కిరీటమును ధారణ చేయాలి, ఎందుకంటే ప్రకాశము ఉండి శక్తి తక్కువగా ఉంటే సదా సిద్ధిస్వరూపులుగా అవ్వలేరు. ప్రకాశముతో పాటు శక్తి కూడా ఉంది, అప్పుడే సదా విజయులుగా అయిపోతారు. లైట్ మరియు మైట్ యొక్క డబుల్ కిరీటధారులుగా ఉంటారు.

ఏకంకణాన్ని కట్టుకుంటారు? కంకణం కూడా అవసరమే కదా! ఏ కంకణం నచ్చుతుంది పవిత్రత అనే కంకణం ఉండనే ఉంది కానీ ఈ విశేష సంవత్సరం యొక్క ఏ కంకణమును కట్టుకుంటారు? (ఒకరు సహయోగము యొక్క కంకణము అని, మరొకరు సంస్కారమిలనము యొక్క కంకణము అని ఇలా అనేక జవాబులు చెప్పారు). అలాగైతే మొత్తం చేతులంతా కంకణాలతోనే నిండిపోతాయి. 

ఈ సంవత్సరం 'సదా ఉత్సాహములో ఉండాలి మరియు ఉత్సాహములో సర్వులనూ సదా ముందుకు తీసుకువెళుతూ ఉండాలి' అన్న విశేషమైన కంకణమునే కట్టుకోవాలి. స్వయం యొక్క ఉత్సాహమునూ తగ్గించుకోకూడదు. అలాగే ఇతరుల యొక్క ఉత్సాహమును కూడా తగ్గించకూడదు, అందుకొరకు సదా కంకణమును దృఢముగా ఉంచుకునేందుకు లేక టైట్ గా ఉంచుకునేందుకు ఒకే విషయమును సదా గుర్తుంచుకోవాలి. ప్రతి విషయములోనూ స్వయం ప్రతి అయిన లేక ఇతరుల ప్రతి అయిన ముందుకు వెళ్ళేందుకు మరియు తీసుకు వెళ్ళేందుకు మౌల్డ్ అవ్వడమే రియల్ గోల్డ్ గా అవ్వడము' అన్నది గుర్తుంచుకోండి. అచ్చా! మంచి కంకణాన్ని కూడా ధరించారు. ఇప్పుడిక విశేషముగా ఏ సేవ యొక్క లక్ష్యాన్ని ఉంచుతారు? ఏ విధముగా ఈ రోజుల్లో గవర్నమెంట్ ప్రతి సంవత్సరానికి విశేషమైన కార్యమును తయారుచేస్తుందో ఈ సంవత్సరం ఆ గవర్నమెంట్ వికలాంగుల యొక్క కార్యమును తయారుచేసింది, అలా మరి మీరేమి చేస్తారు? బాబా యొక్క మహిమలో “నిర్బలులకు శక్తిని ఇచ్చేవారు“ అన్న గాయనమును చేస్తారు. ఏ విధముగా స్థూలముగా నిర్బల ఆత్మలను సైన్స్ యొక్క సాధనాల ద్వారా శక్తివంతులుగా చేసేస్తారో, కుంటివారికి నడిచే శక్తిని ఇచ్చేస్తారో, ఏవిధముగా ప్రతి ఒక్క బలహీనులకు శక్తి యొక్క సాధనాలను ఇచ్చేస్తారో అలాగే మీరందరూ కూడా బ్రాహ్మణ పరివారములో కానీ లేక విశ్వములోని ప్రతి ఆత్మకు, నిర్బలులకు, బలమును ఇచ్చే మహాశక్తివంతులుగా అవ్వండి. ఏ విధముగా వారు పేదరికాన్ని నిర్మూలించండి అని అంటారో అలాగే మీరు నిర్భలతను నిర్మూలించండి. 'ధైర్యము మరియు సహాయములను నిమిత్తముగా అయి బాబా నుండి ఇప్పించండి.' కావున ఈ సంవత్సరం యొక్క విశేషమైన స్లోగన్ ఏమిటి? 'నిర్బలతను నిర్మూలించండి. అప్పుడే సదా ఉత్సాహమును కలిగించాలి అనే స్లోగన్ ఏదైతే లభించిందో దానిని ప్రత్యక్షత లోకి తీసుకురాగలుగుతారు. మరి కొత్త సంవత్సరంలో ఏమిచేయాలో అర్ధమయ్యిందా?

డబుల్ విదేశీయులకు కొత్త సంవత్సరం యొక్క మహత్వము ఎక్కువగా ఉంటుంది. కావున కొత్త సంవత్సరం యొక్క మహత్వము ఈ మహానత ద్వారా సదా ఉంటుంది. కావున ఈ కొత్త సంవత్సరంలో సర్వ మహానతల ద్వారా సిద్ధిస్వరూపులుగా సిద్ధులను పొందేవారు, సర్వ కార్యాలనూ సిద్ధింపజేసుకునేవారు, సర్వులకు సిద్ధిని ప్రాప్తించుకునే క్షణము యొక్క విధిని తెలియజేయండి. ఇటువంటి సిద్ది  సంవత్సరమును జరుపుకోండి. కార్యములు కూడా అన్నీ సిద్ధించాలి. సంకల్పాలూ సిద్ధించాలి మరియు స్వరూపాలు కూడా సదా సిద్ధిస్వరూపముగా ఉండాలి. అప్పుడే ప్రత్యక్షత మరియు జయజయకారాల యొక్క నినాదాలు వినిపిస్తాయి. సైన్స్ ద్వారా సిద్ధి స్వరూపముగా అవ్వరు కానీ మీరందరూ సదా సిద్ధీస్వరూపులు (ఈ రోజు మధ్యమధ్యలో లైట్ పదే పదేపోతూ వస్తూ ఉంది). మీ రాజ్యములో ఈ అలజడి ఉంటుందా? మీ మధురమైన ఇంట్లో దీని అవసరమే ఉండదు. కావున ఎప్పుడూ మీ మధురమైన ఇల్లు మరియు మధురమైన రాజధానిని సమీపముగా తీసుకురండి, అనగా స్వయం సమీపముగా రండి. ఏం చేయాలో అర్ధమయ్యిందా? అచ్ఛా!

ఈ విధముగా సదా ఒక్కరి యొక్క స్మృతిలోనే ఉండేవారికి, ఒక్కరితో సర్వుల యొక్క సంబంధాన్ని జోడింపజేసేవారికి, సదా ఏకరస స్థితిలో ఉండేవారికి, ఇటువంటి బాబా సమానమైన, బాప్ దాదాను స్వయం మరియు సేవ ద్వారా ప్రత్యక్షము చేసేవారికి, ప్రత్యక్ష ఫల స్వరూపులకు, అతి స్నేహి మరియు సమీప పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

విదేశీ పిల్లలతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము:-

నైరోబీ పార్టీతో - పిల్లలందరూ అతి స్నేహి మరియు సహయోగీ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైతే స్నేహులుగా ఉంటారో వారు సహయోగులుగా అవ్వకుండా ఉండలేరు. లౌకికములో కూడా చూడండి, ఎక్కడైతే స్నేహము ఉంటుందో అక్కడ తనువు, మనస్సు, ధనముల ద్వారా స్వతహాగానే బలిహారమైపోతారు, అనగా సహయోగులుగా అయిపోతారు. కావున మీరందరూ బాబా యొక్క అతి స్నేహులు, కావున అన్నిరకాలుగా సహయోగీ ఆత్మలు కూడా. కావున బాప్ దాదా అతిస్నేహి మరియు సహయోగీ పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఏ విధముగా పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తున్నారో అలా పిల్లలను చూసి ఇంకా ఎన్నో రెట్లుగా సంతోషిస్తున్నారు. ఎందుకంటే, పిల్లలు ఎంత అదృష్టవంతులో, ప్రతి ఒక్కరి భాగ్యరేఖ ఎంత గొప్పగా ఉందో బాప్ దాదాకు తెలుసు.. కావున ఈ రోజుల్లోని మహాత్ములు మీ ముందు ఎందుకూ కొరగారు. నామమాత్రంగా ఉన్నారు మరియు మీరు ప్రత్యక్షమైన పనిని చేసేవారిగా ఉన్నారు. కావున మీరు ఎలా ఉన్నవారు ఎలా అయిపోయారు మరియు ఎలా అవ్వనున్నారు. ఈ సంతోషం ఉంటోందా? భూమిపై ఉంటున్నారా లేక సింహాసనముపై ఉంటున్నారా? భూమిపైనైతే ఉండడం లేదు కదా! భూమిని వదిలేసారు కదా! ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి రా! అని తండ్రిని పిలుస్తారు మరియు తండ్రి ఈ ధరిత్రి యొక్క సింహాసనాన్ని వదిలేయండి మరియు హృదయం యొక్క సింహాసనాన్ని అధిరోహించండి అని అంటారు. మరి అందరూ ఈ సింహాసనాన్ని తీసుకున్నారా? మళ్ళీ మీ భూమివైపుకైతే వచ్చేయడం లేదు కదా! భూమి యొక్క ఆకర్షణ అయితే ఆకర్షించడం లేదు కదా! ఎందుకంటే భూమిపై ఉంటూ భూమి యొక్క ఆకర్షణ ఎటువైపుకు తీసుకువెళ్ళిందో గమనించారు కదా! అది నరకము వైపుకు తీసుకువెళ్ళింది కదా! మరియు ఇప్పుడు హృదయ సింహాసనము ద్వారా విశ్వముయొక్క రాజ్య సింహాసనాధికారులుగా అయిపోయారు. కావున ఈ ఆకర్షణ స్వర్గము వైపుకు తీసుకువెళుతుంది. కావున ఒక్కసారి అనుభవజ్ఞులుగా అయిన వారు సదాకాలికముగా, తెలివైన వారిగా అయిపోయారు. మీకు లభించిన టైటిలే జ్ఞానస్వరూపము యొక్క టైటిల్. జ్ఞానస్వరూపులు ఎప్పుడూ మోసపోజాలరు. అచ్చా! అందరూ సదా సంతుష్టముగా ఉంటున్నారు కదా! ఎటువంటి ఫిర్యాదు లేదు కదా! స్వయం యొక్క లేక ఇతరుల యొక్క కంప్లయింట్ ఉన్నట్లయితే కంప్లీట్ గా (సంపూర్ణముగా) లేనట్లే. స్వయం ప్రతి కూడా ఫిర్యాదులు ఉంటాయి. యోగం కుదరడం లేదు, నష్టోమోహులుగా లేము, ఎలా ఉండాలో అలా లేము... ఇవన్నీ కంప్లయింట్లే కదా! కావున అన్ని కంప్లయింట్లను సమాప్తము చేయడము అనగా కంప్లీట్ గా సంపూర్ణముగా అవ్వడం. 

బాప్ దాదాకు సదా పిల్లలపై ఎంతో గర్వము ఉంటుంది. ఈ పిల్లలే కల్పకల్పము యొక్క అధికారులు, బాప్ దాదాకు ప్రతి రత్నము యొక్క విలువను గూర్చి తెలుసు కానీ పిల్లలు అప్పుడప్పుడూ తమ విలువను గూర్చి తక్కువగానే తెలుసుకుంటారు. బాబాకైతే పూర్తిగా తెలుసు. పిల్లలు ఎలా ఉన్నా స్వయాన్ని లాస్ట్ నెంబర్ వారీగా భావించినా వారు కూడా గొప్పవారే. ఎందుకంటే కోట్లాదిమందిలో ఏ కొందరో ఆ కొందరిలో ఏ ఒక్కరో. కావున కోట్లాదిమందిలో ఆ ఒక్కరూ కూడా గొప్పవారే కదా! కావున సదా మీ మహానతను తెలుసుకోండి. దీని ద్వారా మాననీయ ఆత్మగా అయి మళ్ళీ దేవతలుగా అయిపోతారు. నైరోబీవారు ఎంతవరకూ విస్తారం చేసారు? నైరోబీలోనే కూర్చున్నారా లేక చక్రవర్తులుగా అయ్యారా? ఎవరైతే స్వయం ఎగురలేరో వారికి శక్తిని ఇచ్చి ఎగిరించేవారిగా ఉన్నారు కదా! నైరోబి యొక్క విశేషత ఏమిటంటే - మొత్తం పరివారమంతా చిన్నవారినుండి పెద్దవారి వరకూ పరివర్తన అయిపోయారు, ఎందుకంటే గుజరాత్ యొక్క ఫౌండేషన్ ఉంది. ఆఫ్రికాలో కూడా ఎవరి భాగ్యము తెరుచుకుంది? ఆఫ్రికాలో ఉంటూ భారతవాసీయులు భాగ్యవంతులుగా అయ్యారు. కొద్దిగా పరిచయరూపీ నీళ్ళు పడడంతోనే బీజము బయటకు వెలువడింది. ఇప్పటి విశేష సేవ ఏమిటంటే మొదట అందరి యొక్క అవసరం ఏదైతే ఉందో దానిని పరిశీలించండి, గుర్తించిన తర్వాత ప్రాప్తి స్వరూపముగా అయి ప్రాప్తిని కలిగించండి. పరిశీలనా శక్తి ద్వారానే సేవ యొక్క సిద్ధి ఏర్పడగలదు, అచ్ఛా!

లండన్ పార్టీ:- లండన్ నివాసీయులు సేవ యొక్క ఫౌండర్లు, లండన్ సేవ యొక్క ముఖ్యస్థానము. అందరి యొక్క దృష్టి లండన్ పై ఉంది. లండన్ నుండి ఏ డైరెక్షన్ లభిస్తుంది! కావున మెయిన్ సేవ యొక్క సేవాస్థానము లండనే కదా! కావున లండన్ నివాసులు విశేష సేవాధారులు. బ్రాహ్మణ జీవితము యొక్క వృత్తి సేవయే. కావున సదా ఇదే సేవలో బిజీగా ఉంటున్నారా? వ్యాపారుల యొక్క బుద్ధిలో రాత్రి స్వప్నాలలో కూడా ఏముంటుంది? ఏ వ్యాపారమైతే ఉంటుందో అదే వస్తుంది కదా! రాత్రి స్వప్నములో కూడా గ్రాహకులు లేక వస్తువులే కనిపిస్తాయి. మరి మీకు స్వప్నములో ఏమి కనిపిస్తుంది? ఆత్మలను సుసంపన్నముగా చేస్తున్నారు. స్వప్నములోనూ సేవ, లేస్తూ సేవ, నడుస్తూ, తిరుగుతూ కూడా సేవయే. ఈ సేవ యొక్క ఆధారముపైనే స్వయమూ సదా సంపన్నముగా, నిండుగా ఉంటారు మరియు ఇతరులను కూడా సదా నిండుగా చేయగలుగుతారు. ప్రతి ఒక్కరూ అమూల్య రత్నాలే. లండన్ యొక్క రాజ భాగ్యాన్ని ఒకవైపు ఉంచి ఇంకొకవైపు మిమ్మల్ని ఉంచినట్లయితే మీ భాగ్యమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఆ రాజ్యము మట్టిపాలైపోతుంది.. మీరు సదా మూల్యవంతులు, సదా బాబా యొక్క అమూల్యరత్నాలు, బాప్ దాదా ఒక్కొక్క రత్నము యొక్క విశేషత యొక్క మాలను జపిస్తారు.  కావున సదా స్వయాన్ని ఈ విధముగా విశేష ఆత్మగా భావిస్తూ ప్రతి అడుగూ వేస్తూ ఉండండి. ఇప్పుడు అన్నిరకాల భారాలూ సమాప్తమైపోయాయి కదా! ఇప్పుడు పంజరములోని మైనాల నుండి ఎగిరే పక్షుల్లా అయిపోయారు. పంజరములోని చిలుకలు ఎగిరే చిలుకల్లా అయిపోయాయి. పంజరములోని వారు కారు, బాప్ దాదా యొక్క గీతాలను గానం చేస్తారు. లండన్ నివాసులలో హింది తెలిసినవారికి మొదటి అవకాశం లభించింది. ఎంతైనా నేరుగా మురళీ వినే అదృష్టవంతులుగా అయ్యారు. అనువాదం చేయవలసిన అవసరం రాదు కదా! దీనినే నేరుగా పెనము నుండి నోట్లోకి అని అంటారు. అనువాదం చేయడంలో కొద్దిగా రొట్టె ఎండుతుంది కదా! కావున మీ భాగ్యము మీది, వారి భాగ్యము వారిది. విదేశములో విదేశీయుల యొక్క మహిమయే ఉంది అని ఎప్పుడూ భావించకండి. మీ సంఘటన చూసే ఈ ఆత్మలు కూడా ప్రభావితమయ్యారు. మీరు నిమిత్తమయ్యారు. ఎంతైనా భారతవాసీయులకు తమ జన్మస్థానము యొక్క నషా ఉంది. అచ్చా,

కుమారులతో - కుమార్ గ్రూప్ అనగా డబుల్ స్వతంత్రులు. ఒకటేమో లౌకిక బాధ్యత నుండి స్వతంత్రులు మరియు ఇంకొకటి ఆత్మ సర్వబంధనాల నుండి స్వతంత్రమైనది. మాయ యొక్క బంధనాలు మరియు లౌకిక బంధనాల నుండి కూడా స్వతంత్రులు. ఇలా స్వతంత్రులుగా ఉన్నారా? డబుల్ స్వతంత్రులైన ఆత్మలు డబుల్ సేవను కూడా చేయవచ్చు. ఎందుకంటే కుమారులు స్వతంత్రులుగా ఉన్న కారణముగా వారికి ఎంతో సమయం ఉంటుంది, కావున సమయం యొక్క ఖజానా ద్వారా అనేకులను సంపన్నవంతులుగా చేయగలుగుతారు. అన్నింటికన్నా పెద్ద ఖజానా సంగమయుగ సమయం యొక్క ఖజానా, కావున కుమార్ గ్రూప్ అనగా సమయం యొక్క ఖజానాలు సంపన్నముగా గలవారు మరియు సమయం ఉన్న కారణముగా ఇతరుల యొక్క సేవలో కూడా సంపన్నముగా అవ్వగలుగుతారు. సేవ యొక్క సబ్జెక్ట్ లో కూడా శాతం తీసుకోవచ్చు. సదా బంధనముక్తులు అనగా సదా యోగయుక్తులు. బాబాయే ప్రపంచమైపోయారు కదా! కుమారుల ప్రపంచం ఏమిటి? బాప్ దాదాయే. ఇతరుల యొక్క ప్రపంచం హద్దుల్లో ఉంటుంది కానీ మీకైతే ఒకే అనంతమైన సంసారము. కావున సహయోగులుగానూ ఉన్నారు. ఎందుకంటే సంసారములోకే బుద్ధి వెళుతుంది కదా! బాబాయే ప్రపంచమైనప్పుడు బుద్ధి ఇక బాబాలోకే వెళుతుంది. కావున కుమారులకు సహజయోగులుగా అయ్యే లిఫ్ట్ ఉంది. కావున ఇప్పుడు అశాంత ఆత్మలకు శాంతిని ఇవ్వాలి. భ్రమించే ఆత్మలకు ఆధారమును ఇవ్వాలి. ఇది అన్నింటికన్నా గొప్ప పుణ్య కార్యము. దీనిని చేస్తూ ఉండండి. ఏ విధముగా దాహార్తితో ఉన్న ఆత్మకు నీరు అందించడం పుణ్యమో అలాగే ఈ సేవ చేయడం అనగా పుణ్య ఆత్మగా అవ్వడం. కావున ఎటువంటి అశాంత ఆత్మనైనా చూసినపుడు దయ కలుగుతుంది కదా! దయార్ద్ర హృదయుడైన బాబాకు పిల్లలైనప్పుడు మరి సదా పుణ్య కార్యాలను చేస్తూ ఉండండి, అచ్చా!

Comments