30-11-1979 అవ్యక్త మురళి

30-11-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వమానంలో స్థితమై ఉన్న ఆత్మల లక్షణాలు.

బాప్ దాదా ప్రతి పుత్రుని పదమాపదమ్ భాగ్యశాలీ ఆత్మగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరి శ్రేష్ఠమైన ప్రాలబ్ధం సదా తండ్రి ఎదురుగా ఉంది. ఇంతమంది పిల్లలు విశ్వం ఎదుట పరమ పూజ్యులుగా ఉన్నారని బేహద్ తండ్రికి పిల్లలపై గర్వంగా ఉంది. నంబర్ వార్ పురుషార్థులుగా ఉన్నా చివరిలో వచ్చిన పుత్రుడు కూడా ప్రపంచం ఎదుట కీర్తనకు యోగ్యులుగా, పూజ్యనీయులుగా ఉన్నారు. చివరిలో ఉన్న బిడ్డకు కూడా ఇప్పటి వరకు కీర్తన మరియు పూజ నడుస్తూ ఉంది. ఒక్క అనంతమైన తండ్రికి పిల్లలైన ఇంతమంది ఇంత యోగ్యులుగా అవుతున్నారు. అందరూ ఎంత పదమా పదమ్ భాగ్యశాలురుగా ఉన్నారో ఇప్పుడు ఆలోచించండి. ఇప్పటి వరకు భక్తులు నంబర్ వార్‌గా ఉన్న దేవతా ధర్మపు ఆత్మల దర్శనం కొరకు దప్పికగొని ఉన్నారు. అందువలన బాప్ దాదాకు 16,000 మాలలో చివరి పూసపై కూడా గర్వంగా, సంతోషంగా ఉంది. ఎలా అయినా ఉండవచ్చు. సోమరి పురుషార్థి కావచ్చు, మధ్యమ పురుషార్థి కావచ్చు, తీవ్ర పురుషార్థి కావచ్చు అయినా తండ్రి వారిగా అయ్యారు. పూజ్యనీయులుగా, కీర్తనకు యోగ్యులుగా అయ్యారు. ఎందుకంటే పారసనాథుడైన తండ్రి సాంగత్యములో ఇనుము నుండి బంగారుగా అయిపోయారు. బంగారానికి విలువ తప్పకుండా ఉంటుంది. అందువలన స్వమానములో ఎప్పుడు కూడా తమను తక్కువగా భావించకండి. దేహాభిమానములోకి రాకండి. స్వమానములో ఉండేవారు ఎప్పుడూ అభిమానములోకి రాలేరు. వారు సదా నిరహంకారులుగా ఉంటారు. ఎంత గొప్ప స్వమానమో అంతగా (హాజీ) అలాగే అనడంలో నిరహంకారిగా ఉంటారు. స్వమానములో ఉండేవారు అందరికీ గౌరవాన్ని ఇచ్చే దాతగా ఉంటారు. చిన్న - పెద్ద, జ్ఞానీ- అజ్ఞానీ, మాయాజీతులు లేక మాయకు వశమైనవారు, గుణవంతులు లేక ఏవైనా ఒకటి రెండు అవగుణాలు కలిగిన వారైనా కావచ్చు అనగా గుణవంతులుగా అయ్యే పురుషార్థులు కావచ్చు కానీ స్వమానములో ఉన్నవారు అందరికీ గౌరవాన్ని ఇచ్చే దాతగా ఉంటారు. అనగా స్వయం సంపన్నంగా ఉన్న కారణంగా సదా దయాహృదయులుగా ఉంటారు. దాత అనగా దయాహృదయులు. ఎప్పుడూ ఏ ఆత్మల పట్ల సంకల్ప మాత్రము కూడా అధికార దర్పాన్ని చూపరు. దయ కలుగుతుందా? అహం వస్తుందా? ఇది ఇలా ఎందుకు? ఇలా చేయకూడదు, ఇలా జరిగి ఉండకూడదు, జ్ఞానం ఇదే చెప్తుందా? అని అనడం కూడా సూక్ష్మ అహంకారము(దర్పము) యొక్క అంశమే. అందువలన దయాహృదయులైన దాతలు, స్వమానములో ఉండేవారు అందరికీ గౌరవాన్ని ఇస్తారు. గౌరవాన్ని ఇచ్చి వారిని కూడా పైకి లేపుతారు. ఏ పురుషార్థి అయినా తన బలహీనతల వలన లేక సోమరితనం కారణంగా క్రింద పడిపోతే అనగా తమ స్థితి నుండి క్రిందకు వస్తే స్వమానధారీ పుణ్యాత్మలైన మీ పని పడిపోయిన వారిని పైకి లేవనెత్తటం. వారిని సహయోగులుగా తయారుచేయాలి. అంతేగానీ "ఎందుకు పడిపోయావు', "పడిపోవాల్సిందే" కర్మల ఫలము అనుభవిస్తున్నారు, చేసిన దానికి తప్పక పొందుతారు - ఇలాంటి ఆలోచనలు స్వమానధారుల సంకల్పములో కూడా ఎవరి పట్ల కూడా సంకల్పములో లేక మాటలో రాజాలవు. ఇటువంటి పుణ్యాత్మ పరవశులను కూడా స్వతంత్రులుగా చేస్తారు. వారిలో ఆవేశము యొక్క అంశం కూడా ఉండదు. వీరిని స్వమానధారులని అంటారు. ఇలాంటి వారికి దేహాభిమానము ఎప్పుడూ రాదు. బాప్ దాదా ప్రతి పుత్రుని ఇలాంటి పుణ్యాత్మ దృష్టితో చూస్తారు. ఫాలో ఫాదర్, తండ్రిని అనుసరిస్తారు.

బొంబాయి నివాసులు ఫాలో ఫాదర్ చేయుటలో తెలివిగలవారిగా ఉన్నారు కదా. బొంబాయి బాబాదే కదా, అందువలన సాకార బాబా కూడా ఎక్కువగా బొంబాయికే వచ్చేవారు. ఎన్నిసార్లు సాకారములో వచ్చారో అంత పాలన లభించింది. కనుక ఇటువంటి భూమిపై నివసిస్తున్న పుణ్యాతులైన మీరు ఎవరి పాపాలనైనా పరివర్తన చేయగలగాలి. ఎవరి లోపాలనూ చూడకుండా అద్భుతాన్ని చూడండి. అప్పుడు వారి లోపం కూడా అద్భుతంలోకి మారిపోతుంది. పుణ్య భూమిలో ఉన్న మీరు ఇలాంటి మహాత్ములుగా ఉన్నారా? బొంబాయి నివాసులు నంబరువన్, ఎవరెడీగా ఉంటారు. ఏ ఘడియలో వినాశజ్వాల ప్రజ్వలితమైనా దానికంటే ముందే ఎవరెడీగా ఉంటారు కదా? ఆ సమయంలో ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నం అవ్వరు కదా? ఇప్పుడు ఇంకా సంపన్నులుగా కాలేదు. ప్రజలను తయారు చేసుకోలేదు అని ఆలోచించడం లేదు కదా? మొదటి నుండే అన్నింటిలో సంపన్నులుగా అవ్వాలి. మీ దాసిగా సేవ చేయుటకు ప్రకృతి కూడా ఎదురు చూస్తోంది కదా. దాసి యజమాని కొరకు తప్పక ఎదురు చూస్తుంది కదా. అందువలన సదా యజమాని స్థితిలో ఉండండి.

కుమారులతో- కుమారులు మరియు బ్రహ్మకుమారులు, ప్రవృత్తి జీవితంలో కుమారులు, బ్రాహ్మణ జీవితంలో బ్రహ్మకుమారులు. కేవలం కుమారులు కాదు కానీ బ్రహ్మకుమారులు. కేవలం కుమారులుగా ఉంటే మాయ వచ్చేస్తుంది. బ్రహ్మకుమారులుగా ఉంటే మాయ పారిపోతుంది. బ్రహ్మ ఆదిదేవ్ గా ఎలా ఉన్నారో బ్రహ్మకుమారులు కూడా ఆదిరత్నాలుగా ఉంటారు. ఆదిదేవుని పిల్లలు మాస్టర్ ఆదిదేవులు. ఆదిరత్నాలుగా భావిస్తే మీ జీవిత విలువను తెలుసుకుంటారు. మీరందరూ ప్రభువు యొక్క రత్నాలు, ఈశ్వరుని రత్నాలు కనుక మీకు ఎంత గొప్ప విలువ ఉంటుంది. సదా తమను ఆదిదేవుని పిల్లలు మాస్టర్ ఆదిదేవులు, అది రత్నాలుగా భావిస్తే ఏ కార్యం చేసినా అది సమర్థంగా ఉంటుంది, వ్యర్థంగా ఉండదు. కుమారులు ఎంతగా సేవలో నిమగ్నమై ఉంటారో అంతగా మాయాజీతులుగా ఉంటారు. తమను ఫ్రీగా(పని లేకుండా) ఉంచుకోకండి.

2)కుమారులు అన్ని విధాలుగా నిర్భంధనులుగా ఉన్నారు. లౌకిక బాధ్యతల నుండి కూడా నిర్థంధనులే, మాయ బంధనాలతో కూడా నిర్జంధనులే. ఏ బంధనానికి ఆధీనులు కాదు. బంధనముక్తులకు గుర్తు - సదా యోగయుక్తులుగా ఉంటారు. యోగయుక్తులుగా ఉండేవారు తప్పకుండా బంధనముక్తులుగా ఉంటారు. మానసిక బంధనము కూడా ఉండదు. లౌకిక బాధ్యత ఒక ఆటగా ఉంటుంది. బంధనం వలె కాక డైరెక్షన్ ప్రమాణంగా ఆటగా భావించి నవ్వుతూ ఆడుకుంటే చిన్న చిన్న విషయాలలో అలసిపోరు. ఒకవేళ బంధనంగా భావిస్తే విసిగిపోతారు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. కానీ డైరెక్షన్ ప్రమాణంగా ఆటగా భావించి ఆడుతూ ఉంటే అలసట లేనివారిగా ఉంటారు. బాధ్యత తండ్రిది. మీరు నిమిత్తులుగా ఉన్నారు. కుమారులు డబల్ నిర్బంధనులు. ఏ తోకా లేదు. సదా అదృష్టవంతులుగా ఉండండి, భయపడకండి. తమ చేతులతో భోజనం తయారు చేసుకోవడం చాలా మంచిది. తమ కొరకు, తండ్రి కొరకు ప్రేమతో తయారు చేసుకోండి. మొదట తండ్రికి తినిపించండి. స్వయాన్ని ఒంటరిగా భావిస్తే అలసిపోతారు. సదా జంటగా భావించండి. ఇతరుల కొరకు తయారు చేయాలంటే విధి పూర్వకంగా ప్రేమగా తయారు చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కుమారులు పరస్పరం గ్రూప్ గా ఉండండి. ఎప్పుడైనా ఎవరైనా రోగిగా అయితే వారిని చూసుకునేందుకు ఏ ఒక్కరికైనా డ్యూటీ ఇవ్వాలి. ఒకరు ఇంకొకరికి సహాయం చేసుకొని సేవ చేయండి. ఎప్పుడు కూడా తోక తగిలించుకోవాలనే సంకల్పం చెయ్యకండి లేకపోతే చాలా బాధపడతారు. బయటకు అర్థము కాదు కానీ తోకను తగిలించుకున్నారంటే చాలా కష్టపడ్డారు. ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నారు. తర్వాత బాధ్యత పెరుగుతుంది. అందరూ తండ్రిని స్నేహితునిగా చేసుకున్నారు కదా? ఒక స్నేహితుని వదిలి ఇంకొక స్నేహితుని చేసుకుంటారా ఏమిటి? ఇది లౌకికంలో కూడా మంచిది కాదు. కనుక కుమారులు ఎప్పుడూ తమను ఒంటరిగా భావించకండి. ఒకవేళ ఒంటరిగా భావిస్తే ఉదాసీనులుగా అవుతారు. 

కుమారులు జ్వాలారూపులై జ్వాలను వెలిగిస్తే త్వరగా వినాశనమవుతుంది. యోగాగ్నిని ఎంత తేజంగా చెయ్యాలంటే వినాశజ్వాల తేజమైపోవాలి. ఎప్పుడూ ఏ విషయంలోనూ ఎందుకు, ఏమిటి అనేవారు కాదు కదా? ఏ విషయం అయినా ఎందుకు, ఏమిటి అని అంటున్నారంటే వారు మాస్టర్ త్రికాలదర్శులు కారు. ఎవరైతే మూడు కాలాలను తెలుసుకుంటారో వారు "ఎందుకు, ఏమిటి" అని అనరు. ఎందుకు - ఏమిటి అనేవారు చిన్న పిల్లలుగా ఉంటారు. మీరందరూ వానప్రస్థ స్థితికి చేరుకున్నారు కదా. వానప్రస్థ స్థితిలో ఉంటే మాయకు అతీతంగా ఉంటారు. ఎంతగా లైన్ క్లియర్ గా ఉంటుందో, అంతగా పురుషార్థము యొక్క స్పీడు వేగంగా ఉంటుంది. అందరి లైను క్లియర్ గా ఉందా? కుమారులు చాలా అద్భుతం చెయ్యగలరు. ఆత్మిక యువా(యూత్) గ్రూప్ కదా! ఈ రోజుల్లో యువకులు గవర్నమెంట్ ను కూడా మార్చాలనుకుంటే మార్చేస్తారు. వారు వినాశనం చేస్తారు, నష్టపరుస్తారు. మీరు స్థాపన చేస్తారు. మీరు వినాశనం చెయ్యరాదు. మీరు స్థాపన చేసినట్లయితే వినాశనం దానంతకదే అయిపోతుంది.

కుమారీలను 100 మంది బ్రాహ్మణుల కంటే ఒక కన్య ఉత్తమమైనదని అంటారు. మరి కుమారులు ఎంతమంది కంటే శ్రేష్ఠమైనవారు. ఏడుగురు శీతలా దేవీలతో ఒక కుమారుని చూపిస్తారు. కావున మీరు 700 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తములు. కుమారులు బాగా కష్టపడ్డారు. ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యగలరు. ప్రతి ఒక్క కుమారుడు తమ గ్రూపును తయారు చేసుకోవాలి. పరస్పరంలో(రీస్) ఈర్ష్య పడకండి కానీ పరుగు తీయండి. మాయ ఎంత కదిలించాలని ప్రయత్నించినా మీరు అంగదుని వలె కొంచెం కూడా కదలకండి. గోర్లను కూడా కదిలించలేరు. కొంచెమైనా బలహీన సంస్కారం ఉంటే మాయ తనవారిగా చేసుకుంటుంది. అందువలన మరజీవులుగా కండి, పాత సంస్కారాలతో మరజీవులుగా కండి. ఏ విఘ్నమైనా అది మీ కోసం ఒక పాఠం. మీరు వాటి అనుభవీలుగా అవుతూ అవుతూ గౌరవనీయంగా పాసవుతారు. ఏది జరిగినా దానితో పాఠం నేర్చుకోవాలి. ఎందుకు, ఏమిటి అనే దానిలోకి వెళ్లకండి.

కుమారులు సదా సేవాధారులుగా ఉంటారు. ఆల్ రౌండ్ సేవ చేయువారు - మనసా - వాచా - కర్మణా అన్నింటిలో సేవాధారులుగా ఉంటారు. ఒకవేళ ఇంతమంది ఆల్ రౌండ్ సేవాధారులుగా అయితే చాలామంది భుజాలు తయారవుతారు. మీరందరూ చాలా అద్భుతం చెయ్యగలరు.

అధర్ కుమారులతో - అర్థ కల్పం మీరు దర్శనం చేసుకోవడానికి వెళ్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను చూడటానికి పరంధామము నుండి వస్తారు. అది దర్శనం కాదు, చూచుటను దర్శనం అంటారు. తండ్రి పిల్లలను చూచుటకు వస్తారు. ఈ దర్శనం అనగా కలుసుకోవడం. ఇలాంటి దర్శనంతో ప్రసన్నులుగా అవుతారు. అధర్ కుమారులు అనగా సదా పవిత్ర ప్రవృత్తిలో ఉండేవారు. బేహద్ ప్రవృత్తిలో సదా సేవాధారులు. హద్దు ప్రవృత్తితో అతీతంగా ఉంటారు. అధర్ కుమారుల గ్రూపు - " కమలపుష్పాల గుచ్ఛము." 

ప్రవృత్తిలో ఉంటూ విఘ్న వినాశక స్థితిలో ఉంటున్నారు కదా? విఘ్న వినాశక స్థితి అనగా సదా తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉండుట. ఈ స్థితిలో ఉంటే విఘ్నాలు దాడి చెయ్యలేవు. సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉండకపోతే అప్పుడప్పుడు విఘ్నాలకు వశమవుతారు. అప్పుడప్పుడు విఘ్న వినాశకులుగా ఉంటారు. ఎంత సమయం విఘ్నాలకు వశమవుతారో అంత సమయం లక్ష రెట్లు నష్టపోతారు. ఎలాగైతే ఒక గంట సఫలం చేసుకుంటే లక్ష రెట్లు జమ అవుతుందో అలా ఒక గంట వృథా చేస్తే లక్ష రెట్లు నష్టపోతారు. అందువలన ఇప్పుడు వ్యర్థ ఖాతాను సమాప్తము చేయండి. ప్రతి సెకండు అటెన్షన్ ఉండాలి. అత్యంత గొప్ప తండ్రికి పెద్ద పిల్లలైనందున సదా ఈ అటెన్షన్(ఏకాగ్రతను) ఇవ్వండి. ప్రవృత్తిలో ఉంటూ సదా మాయతో నివృత్తులుగా ఉండండి. అతీతంగా, ప్రియంగా ఉండండి. అతీతంగా అయ్యి ప్రవృత్తి కార్యంలోకి వస్తే సదా మాయాప్రూఫ్ గా అనగా అతీతంగా ఉంటారు. అతీతంగా ఉండేవారు సదా ప్రభువుకు ప్రియంగా ఉంటారు. అతీతత్వం అనగా ట్రస్టీ. ట్రస్టీకి ఎవరి పైనా మోహము ఉండదు. ఎందుకంటే నాది అనేది లేదు. అందరూ ట్రస్టీలుగా ఉన్నారు కదా. గృహస్థిలుగా భావిస్తే మాయ వస్తుంది. ట్రస్టీలుగా భావిస్తే మాయ పారిపోతుంది. 'నాది' అనే దానితో మాయ జన్మ తీసుకుంటుంది. 'నాది' అనేది లేనప్పుడు మాయకు జన్మనే లేదు. ఎలాగైతే మురికిలో పురుగులు జన్మిస్తాయో అలా 'నాది' వచ్చిందంటే మాయ జన్మిస్తుంది. కావున మాయాజీతులుగా కావడానికి సహజ పద్ధతి - సదా ట్రస్టీలుగా భావించండి. ఇందులో వివేకవంతులుగా ఉన్నారు కదా? బ్రహ్మకుమారులు అనగా ట్రస్టీలు(నిమిత్తులు). ప్రవృత్తిలో ఉండినా బ్రహ్మకుమారులే కానీ ప్రవృత్తి కుమారులు కాదు - బ్రహ్మాకుమారులు అని స్మృతి ఉంటే ప్రవృత్తిలో కూడా అతీతంగా ఉండగలరు. బ్రహ్మకుమారులకు బదులు ఇంకే సంబంధంగా భావించినా మాయ వచ్చేస్తుంది. అందువలన తమ అలౌకిక ఇంటి పేరును సదా జ్ఞాపకం ఉంచుకోండి.

ఎలాగైతే లాకికంలో అన్నీ విషయాల అనుభవీలుగా ఉన్నారో అలా మాస్టర్ జ్ఞానసాగరులై జ్ఞాన లోతుల్లో కూడా అనేక అనుభవాలనే రత్నాలను ప్రాప్తి చేసుకుంటూ వెళ్తున్నారు కదా? ఎంత సముద్రపు అంతర భాగములోకి వెళ్తారో అంత ఏమి లభిస్తాయి? రత్నాలు. అలాగే ఎంత జ్ఞాన లోతుల్లోకి వెళ్తారో అంత అనుభవాలనే రత్నాలు లభిస్తాయి. తమ అనుభవాలను చూసి ఇతరులు కూడా అనుభవీలుగా అయ్యేటంత అనుభవీ మూర్తులుగా అవుతారు. ఇలాంటి అనుభవీలుగా అయ్యారా? ఒకటి జ్ఞానం వినడం, వినిపించడం. రెండవది అనుభవీ మూర్తులుగా అగుట. “వినుట లేక వినిపించుట" ఇది మొదటి స్థితి. అనుభవీ మూర్తులుగా అగుట - ఇది అంతిమ స్థితి. ఎంత అనుభవీలుగా ఉంటారో, అంత అవినాశిగా, నిర్విఘ్నులుగా ఉంటారు. అనుభవాలను వృద్ధి చేసుకుంటూ వెళ్లండి. ప్రతి గుణంలో అనుభవీ మూర్తులుగా కండి. ఏది మాట్లాడితే అది అనుభవం కావాలి. పాండవులందరూ అనుభవీ మూర్తులుగా ఉన్నారు కదా? అనుభవీలను ఎంత కదిలించాలనుకున్నా కదిలించలేరు. అనుభవం ఎదుట మాయ యొక్క ఏ ప్రయత్నం కూడా సఫలం కాదు. మాయ విఘ్నాలలో కూడా అనుభవీలుగా అయ్యారు కదా. అనుభవీలు ఎప్పుడూ మోసపోరు. అనుభవం యొక్క పునాది దృఢంగా ఉండాలి.

సదా పురుషార్థమును తీవ్ర వేగంతో చేస్తూ పోండి. శుద్ద సంకల్పాల స్టాకు ఉంటే వ్యర్థం సమాప్తమై పోతుంది. ప్రతిరోజూ ఏదైతే జ్ఞానం వింటున్నారో దానిలో నుండి ఏదో ఒక విషయంపై మననం చేస్తూ ఉండండి, వ్యర్థ సంకల్పాలు నడవటం అనగా మనన శక్తి తక్కువగా ఉన్నది. మననం చెయ్యడం నేర్చుకోండి. ఒకే శబ్ధం తీసుకొని దాని గుహ్యతలోకి వెళ్లండి. తమకు తాము రోజూ ఆలోచించుకోవడానికి ఏదో ఒక టాపిక్(విషయం) ఇచ్చుకోండి. వ్యర్థ సంకల్పాలు సమాప్తమైపోతాయి. ఎప్పుడు వ్యర్థ సంకల్పాలు వచ్చినా బుద్ధితో మధువనానికి చేరుకోండి. ఇక్కడి వాతావరణం, ఇక్కడి శ్రేష్ట సాంగత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా వ్యర్థం సమాప్తమైపోతుంది. లైన్ పరివర్తనైపోతుంది. అధర్ కుమారులు బ్రహ్మకుమారులుగా కాకపోతే ముందుకు వెళ్లలేరు. 

తమను సదా పదమాపదమ్ భాగ్యశాలీ ఆత్మగా భావిస్తూ కర్మ చేసినట్లయితే ప్రతి కర్మ శ్రేష్ఠంగా ఉంటుంది. తమ ద్వారా చాలామందికి సందేశం లభిస్తూ ఉంటుంది. మీరందరూ సందేశ వాహకులు. ఎక్కడకు వెళ్లినా, ఎవరు సంపర్కంలోకి వచ్చినా వారికి తండ్రి పరిచయం ఇస్తూ ఉండండి. బీజం వేస్తూ వెళ్లండి. ఇంతమందికి చెప్పినా ఇద్దరూ - ముగ్గురే వచ్చారని ఆలోచించకండి. కొన్ని బీజాల ఫలాలు త్వరగా వస్తాయి. కొన్ని బీజాల ఫలాలు సీజన్లోనే వస్తాయి. ఇది అవినాశి బీజం కనుక తప్పక ఫలము నిస్తుంది. అందువలన బీజము వేస్తూ పోండి అనగా సందేశం ఇస్తూ వెళ్లండి. సదా స్మృతి మరియు సేవల బ్యాలన్స్ ఉంచుకుంటూ సుఖదాతలుగా కండి.

Comments