30-06-1977 అవ్యక్త మురళి

* 30-06-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ప్రతి బ్రాహ్మణ ఆత్మపై బాప్ దాదా యొక్క శ్రేష్ఠ కామనలు.

అదృష్టవంతులందరినీ సర్వశ్రేష్ఠ ఆత్మల యొక్క కళ్యాణము కొరకు నిమిత్తమై ఉన్న బాప్ దాదాలతో పాటు సదా సహయోగులుగా ఉండే పాత్రను అభినయించే సర్య ఆత్మలను చూసి బాప్ దాదా కూడా హర్షితమవుతారు. బాప్ దాదా యొక్క స్నేహములో లేక లగ్నములో ఉండే స్నేహీ ఆత్మలను మిలనము యొక్క ఉల్లాస ఉత్సాహమును కలిగి ఉండడం చూసి బాబా కూడా పిల్లలకు స్నేహము మరియు ఉల్లాసము యొక్క ప్రతిఫలమును ఇస్తున్నారు. పిల్లలందరిలోనూ స్నేహము, సహయోగము యొక్క భావన మరియు బాబా సమానంగా అవ్వాలి అన్న శ్రేష్ఠ సంకల్పము కూడా ఉండడం బాప్ దాదాకు తెలుసు. ఇవన్నీ చూసి బాప్ దాదా పిల్లలను స్వయం కన్నా సర్వ శ్రేష్ఠముగా, కిరీటము మరియు సింహాసనాధికారంతో, పరంధామంలో మెరుసున్న సితారలుగా మరియు విశ్వములోని సర్వాత్మల యొక్క హృదయాలకు ఆధారంగా, విశ్వములోన ఆత్మల ముందు సదా పూర్వజులుగా మరియు పూజ్యులుగా - ఇలా శ్రేష్ఠంగా చూడాలనుకుంటున్నారు. పిల్లలను శ్రేష్ఠంగా చూస్తూ బాబాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ప్రతి బ్రాహ్మణ ఆత్మ సదా ఉన్నతోన్నతుడైన తండ్రితో పాటు ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండాలి. పేరు ఎలా ఉన్నతమైనదో అలాగే కూడా అంత ఉన్నతంగా ఉండాలి. ఏ విధంగా విశ్వము ముందు ఉన్నతమైన పేరు ఉందో అలాగే స్వమానము లేక నషా సదా నిలిచి ఉండాలి. ఇదే ప్రతి బ్రాహ్మణ ఆత్మపై బాబాకు ఉన్న శ్రేష్ఠ కామన.

పిల్లలు ఏం చేయాలి? బాప్ దాదా ద్వారా ఏ జ్ఞానము యొక్క, గుణాల యొక్క, శక్తుల యొక్క సింగారము లభించిందో ఆ సింగారమును ధారణ చేయండి. ఏవిధంగా మీ జడచిత్రాలు సదా అలంకరింపబడి ఉంటాయో అలాగే చైతన్య రూపంలో కూడా అలంకరింపబడి బాప్ దాదా యొక్క హృదయ సింహాసనము యొక్క నషాలో అతీంద్రియ సుఖములో ఊయలలూగుతూ సదా ఫరిస్తా రూపము యొక్క నషాలో ఉండాలి. ఇదే బాప్ దాదాకు ఇవ్వవలసిన ప్రతిఫలం. ప్రతిఫలం ఇవ్వడం వస్తుందా? మీ హృదయంలో కోరుకోవడము మరియు కోరినది చేయడము సమానంగా ఉండాలి. కావాలని కోరుకుంటూ కూడా చేయకపోవడం కాదు. మీ సర్వశ్రేష్ఠ అథారిటీలను ధారణ చేశారా? అవి ఏ అథారిటీలు. సాకార కర్మేంద్రియాలు అనగా కర్మచారులను మరియు వాటితో పాటు మీ సూక్ష్మ శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలు అనగా కార్యకర్తలను యదార్థ రీతిగా నడిపించే అథారిటీని ధారణ చేశారా? మాస్టర్ సర్వశక్తివంతులుగా, మాస్టర్ ఆలమైటీ అథారిటీలుగా అయి మీ కర్మేంద్రియాలను నడుపుతున్నారా లేక బ్రాహ్మణ పరివారము యొక్క సహయోగీ కార్యకర్తలు అనగా సహాయక ఆత్మలు లేక సేవా సహచరులపై అథారిటీని నడుపుతున్నారా? బ్రాహ్మణ ఆత్మల యొక్క సంపర్కంలో స్నేహము మరియు సహయోగము యొక్క భావనను ఉంచాలే కానీ, అథారిటీని ఉపయోగించకూడదు మరియు కర్మేంద్రియాలపై, సూక్ష్మ శక్తులపై అథారిటీని ఉంచాలి. ఇందులో ఎప్పుడూ నా స్వభావము లేక సంస్కారము ఇలా ఉంది అంటూ ఆధీనులుగా అవ్వకూడదు. ఇవి ఆల్మైటీ అథారిటీ కలవారు మాట్లాడవలసిన మాటలు కావు. ఎవరైతే స్వయంపై అథారిటీని ఉంచరో వారు అథారిటీని దుర్వినియోగపరుస్తారు కావున అథారిటీని దుర్వినియోగపర్చకండి. 

బాప్ దా దా పిల్లలందరి మిలనము యొక్క మేళాలో పిల్లల యొక్క ఉల్లాస ఉత్సాహములనూ చూశారు, శ్రేష్ఠ భావనలనూ చూశారు, విశ్వకళ్యాణము యొక్క కామననూ చూశారు, అలాగే బాబా సమానంగా అవ్వాలన్న శ్రేష్ఠమైన కోరికనూ చూశారు. కానీ, వీటన్నింటినీ సంకల్పము మరియు వాణి వరకూ చూశారు. ప్రత్యక్షంగా సదా లక్ష్య ప్రమాణంగా లక్షణాలు స్వయానికి మరియు సర్వులకు కనిపించాలి. ఈ బ్యాలెన్స్ లోనే బాబా తేడాను చూశారు. బ్యాలెన్స్ చేసే కళ ఇప్పుడు పైకి ఎక్కే దశలో కావాలి. సంకల్పము ఉంది కానీ, సంకల్పము యొక్క సంపూర్ణ స్థితి దృఢ సంకల్పము. సంకల్పము ఉంది కానీ ఇప్పుడు దృఢత్వము కావాలి. స్వదర్శన ద్వారా మాయకు సదాకాలము కొరకు వీడ్కోలు లభిస్తుంది. కానీ, స్వదర్శనతో పాటు పరదర్శన యొక్క చక్రము కూడా తిరుగుతూ ఉంటోంది. పరదర్శన మాయను ఆహ్వానిస్తుంది, స్వదర్శన మాయను ఛాలెంజ్ చేస్తుంది. పరదర్శన లీల యొక్క అల కూడా బాగా కనిపిస్తోంది. అనంతమైన డ్రామా యొక్క ప్రతి పాత్రపై త్రికాలదర్శులుగా అయ్యే లక్ష్యమును కూడా చూశారు. కానీ, వ్యర్థ విషయాలలో కూడా త్రికాలదర్శులుగా ఎక్కువగా అవుతారు. మొదట కూడా ఇలా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది, ఇది అలా జరుగుతూనే ఉంటుంది - ఇలా త్రికాలదర్శులుగా అయ్యారు. ఇంకొక నవ్వు పుట్టించే విషయము - దీనిని భక్తి మార్గంలో కూడా మీ నుండి కాపీ చేశారు, అది ఏమిటి? కల్పిత కథలు గణేష్ లేక హనుమంతుడు నిజము కాదు కదా! కానీ, ఆ కథలు ఎంత రమణీయంగా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న విషయాల యొక్క భావాలను మార్చి మనోకల్పిత భావాలను వాటిలో నింపి కథలను తయారుచేస్తారు. వాటిని వినేవారు, వినిపించేవారు ఎంతో రుచితో సమయాన్ని ఇచ్చి వింటూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. ఇటువంటి అలను కూడా బాబా చూశారు. 

శ్రేష్ఠ పదవిని పొందేందుకు లేక సర్వుల స్నేహులుగా అయ్యేందుకు ఎల్లప్పుడూ స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అన్న శిక్షణనే బాప్ దాదా ఇస్తూ ఉంటారు. కానీ, స్వయాన్ని పరివర్తన చేసేందుకు బదులుగా పరిస్థితులను లేక అన్య ఆత్మలను పరివర్తన చేసేందుకు ఆలోచిస్తూ ఉంటారు. వీరు మారితే నేను మారుతాను, పరిస్థితులు మారితే నేను మారుతాను, దీనికి సమాధానం దొరికితే నేను మారుతాను, సహయోగము లేక సహాయము లభిస్తే పరివర్తన చెందుతాను అని అంటారు. దీని రిజల్టు ఎలా ఉంటుంది? ఎవరైతే ఏదో ఒక ఆధారముపై పరివర్తన చెందుతారో వారికి జన్మ జన్మలలో ప్రారబ్దము కూడా ఆధారము పైనే ఉంటుంది. వారి సంపాదన యొక్క ఖాతా కూడా ఏయే విషయాలలో ఎవరెవరి ఆధారములను తీసుకుంటారో అంతంతగా వాటాలుగా అయిపోతుంది, స్వయం యొక్క ఖాతా జమా అవ్వదు కావున జమా అయ్యే శక్తి నుండి మరియు సంతోషం నుండి సదా వంచితులై ఉంటారు, కావున స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అని సదా లక్ష్యమును ఉంచండి. నేను స్వయం విశ్వం యొక్క ఆధారమూర్తిని. బాబా యొక్క ఆధారము తప్ప మిగిలిన అల్పకాలికమైన ఆధారములన్నీ సమయం వచ్చినప్పుడు వదిలివేస్తాయి. నశ్వరమైన, ఊగిసలాడే ఈ ఆధారాలు మిమ్మల్ని కూడా సదా ఏదో ఒక ఆలజడిలోకి తీసుకువస్తూ ఉంటాయి. ఒకటి సమాప్తమైతే ఇంకొకటి జన్మ తీసుకుంటుంది, ఇందులోనే ఉన్న శక్తులన్నీ వ్యర్థమవుతాయి. ఇంకొక విషయమేమిటంటే నడుస్తూ, నడుస్తూ నిర్లక్ష్యులుగా ఉన్న కారణంగా బలహీనమైన మాటలను ఎంతో గొప్పగా భావిస్తూ, మాట్లాడుతూ ఉంటారు, అలా మాట్లాడేందుకు సంకోచించరు, దానినే సత్యత, స్వచ్చత అని భావిస్తూ మాట్లాడతారు. ఏమంటారు? నేను అలజడి చెంది ఉన్నాను, ఏదో ఒకటి చేసి చూపిస్తాను అని అంటారు. "ఏం చేసి చూపిస్తారు? ఏదో ఒక గలాబా నాపై నేను ఏదో ఒకటి చేసుకొని చూపిస్తాను, డిస్ సర్వీస్ అవుతుంది చూసుకోండి, నేను బలహీనంగా ఉన్నాను, సంస్కారానికి వశమై ఉన్నాను, నేను మారలేను, నాకు మీరు ఈ పరిష్కారం ఇవ్వవలసిందే అని అంటారు. ఇటువంటి మాటలు ఎంతో సహజంగా ఏదో తమ వీరత్యాన్ని చూపించుకుంటున్నట్లుగా, వత్తిడి చేసే లేక భయపెట్టే రూపంలో ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. బాప్ దాదాకు ఇది చూసి దయ కలుగుతుంది. ఇటువంటి బలహీన ఆత్మలు సంకల్పం తర్వాత వాణి వరకు లేక కర్మల వరకు తీసుకొనివస్తే దానివల్ల ఎవరి అకళ్యాణము జరుగుతుంది? వారు ఎలా భావిస్తారంటే బాబా యొక్క లేక సేవ యొక్క అకళ్యాణము జరుగుతుందని భావిస్తారు, బాబాకు నష్టం కలుగుతుందనే అనుకుంటారు. కాని, ఇటువంటి విషయాలను తమ సంసారములుగా తయారుచేసుకొనేవారు తమ అకళ్యాణమును చేసుకొనేందుకే నిమిత్తులైపోతారు. డ్రామా అనుసారంగా విశ్వసేవ యొక్క కార్యము నిశ్చితముగానే సఫలమై ఉంది. దీనిని ఎవ్వరూ కదిలించలేరు. 

ఒక కర్మకు కోట్లాది రెట్ల ఫలితమును ఇచ్చేందుకు బాప్ దాదా నిమిత్తమై ఉన్నారు. పిల్లలను సేవార్థము నిమిత్తంగా చేస్తారు. సేవ చేస్తే కోట్లాది రెట్లుగా పొందుతారు కావున పిల్లల యొక్క భాగ్యమును తయారుచేసేందుకే నిమిత్తంగా చేయడం జరిగింది, అంతేగానీ ఎవరో కదిలినంత మాత్రాన కార్యము కదిలిపోదు. కల్పకల్పము యొక్క నిశ్చితమైన విజయము యొక్క పాత్ర రచింపబడి ఉంది, కావున ఇటువంటి బలహీనత యొక్క భాషను పరివర్తన చేయండి అనగా స్వయము యొక్క కళ్యాణమును చేసుకోండి. బాబా, కళ్యాణకారి సమయము మరియు విశ్వకళ్యాణము చేసే కార్యంలో సమర్థులుగా అయి స్వయం యొక్క భవిష్యత్తును తయారుచేసుకోండి. ఎంతో కష్టపడుతున్నారని, త్యాగము కూడా చేశారని, అలాగే ఎంతో సహిస్తున్నారని కూడా బాబాకు తెలుసు. కానీ, ఎవరిపైనైతే స్నేహము ఉంటుందో వారి చిన్న చిన్న బలహీనతలను కూడా చూడలేదు. సదా శ్రేష్ఠముగా తయారుచేయాలనే శుభభావన ఉంటుంది, కావున వీటన్నింటినీ చూస్తూ, వింటూ సంపన్నంగా తయారుచేసేందుకు సంజ్ఞ చేస్తున్నారు. బాప్ దాదా సదా పిల్లలతో పాటు ప్రతి అడుగులోనూ సహయోగులుగా ఉన్నారు మరియు అంతిమం వరకు అలా ఉంటారు. బాబాకు ఎవరిపైనా ద్వేషము కలుగదు, సదా అపకారిపై కూడా శుభచింతకులుగా ఉంటారు, కావున సదా సహయోగమును తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండండి. అమృతవేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని బాబా ద్వారా వరదానములు తీసుకుంటూ ఉండండి. సీజన్ యొక్క సమాప్తి అనగా సహయోగము యొక్క సమాప్తి అని కాదు. పిల్లలు ప్రతి ఒక్కరితోటి సర్వ స్వరూపాలతో, సర్వ సంబంధాలతో బాప్ దా దా యొక్క తోడు మరియు సహాయము సదా ఉంటుంది మరియు డ్రామానుసారంగా సమయం లభించింది. దీనిని మీ అదృష్టంగా భావిస్తూ ఈ సమయం యొక్క పూర్తి లాభాన్ని పొందండి. వినాశనము యొక్క గడియారానికి మీరు ముళ్ళు. మీరు సంపన్నమవ్వడం సమయం సంపన్నమవడమే కావున సదా స్వచింతకులుగా, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. అచ్ఛా

ఇటువంటి భవిష్య భాగ్యమును తయారుచేసుకొనేందుకు నిమిత్తులైన ఆత్మలకు, స్వయం ద్వారా రేపటి చిత్రమును చూపించేవారికి, సదా బాబాకు ప్రతిఫలాన్ని ఇచ్చే మాస్టర్ ఆల్మైటీ అథారిటీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా:- మహాదాని పిల్లలలో ఏ గుర్తులు కనిపిస్తాయి? మహాదానులుగా అవ్వడం ద్వారా లభించే లాభాలు ఏమేమిటి? మహాదాని అనగా బాబా మరియు సేవ తప్ప ఇంకే విషయమూ తనవైపుకు ఆకర్షించగలగకూడదు సదా ఇదే లగ్నములో మగ్నమై ఉండాలి. మహాదానులు అనగా అన్నివేళలలోనూ ఇస్తూనే ఉండేవారు. ఏ ఆత్మా వట్టి చేతులతో వెళ్ళకూడదు. మహాదానులుగా అవ్వకపోతే వరదానులుగా ఎలా అవ్వగలరు? ఎవరైతే మహాదానులుగా మరియు వరదానులుగా ఉంటారో వారే విశ్వకళ్యాణకారులు. ఎల్లప్పుడూ, ఏదైతే లభిస్తూ ఉంటుందో అది ఇవ్వడం ద్వారా పెరుగుతూ ఉంటుంది. మహాదానులైన పిల్లల యొక్క ఏ సమయము లేక దినము దానము చేయకుండా గడవకూడదు.

మహాదానులుగా అవ్వడం అనగా ఇతరుల యొక్క సేవను చేయడం. ఇతరుల యొక్క సేవను చేయడం ద్వారా స్వయం యొక్క సేవ స్వతహాగానే జరుగుతుంది. మహాదానులుగా అవ్వడం అనగా స్వయాన్ని సుసంపన్నం చేసుకోవడం, ఇతరులకు దానమును ఇస్తూనే ఉండడం. ఎంతమంది ఆత్మలకు సుఖము, శాంతి, శక్తి లేక జ్ఞానమును ఇస్తూ ఉంటారో అంతగా ఆ ఆత్మల ప్రాప్తి యొక్క మాటలు లేక ధన్యవాదాలు ఏవైతే వెలువడతాయో అవి మీ కొరకు ఆశీర్వాదాలుగా అవుతాయి. వారి ఆశీర్వాదాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతూ ఉంటాయి. ఇంతమంది ఆత్మల యొక్క ఆశీర్వాదాలు లభించడం ద్వారా అపారమైన సంతోషం ఉంటుంది, కావున నాలుగు సబ్జెక్టులలోనూ మహాదానులుగా అయ్యేందుకు అమృతవేళ మీ ప్రోగ్రాంను తయారుచేసుకోండి, ఒక్క సబ్జెక్టులోనూ తగ్గకూడదు. ఇతర సాంగత్యాలను వదలి ఒక్క సాంగత్యమునే జోడించాలి అన్న నానుడి ఎందుకు ప్రసిద్ధమైంది? ఎందుకంటే ఒక్క బాబాకు ప్రియమైనవా రిగా అయ్యేందుకు సర్వుల నుండీ అతీతంగా అవ్వవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కరితో సర్వసంబంధాల యొక్క ప్రాప్తి ఏర్పడుతుందో అప్పుడు సహజంగానే సర్వుల నుండి అతీతమైపోతారు కావున సర్వుల నుండి సంబంధాలను తెంచి ఒక్కరితోనే జోడించడం మీకు ఎంతో సహజం, ఎందుకంటే ఒక్కరి ద్వారా సర్వప్రాప్తులు కలగడంతో, బుద్ది భ్రమించేందుకు అసలు అప్రాప్తి అనే వస్తువే ఉండదు. మొదట ప్రేమ లభిస్తుంది ఆ తర్వాత అతీతంగా అవుతారు. అందువల్ల కూడా సహజతరం అవుతుంది కావున అందరి నుండి అతీతంగా ఒక్క బాబాకు ప్రియముగా అవ్వడమునే కమలపుష్ప సమానంగా ఉండడం అని అంటారు, కావున కమలపుష్ప సమానంగా ఉన్నానా అని పరిశీలించుకోండి. బురద యొక్క చిందులైతే పడడం లేదు కదా!

యోగ్య శిక్షకుని యొక్క గుర్తులేమిటి? యోగ్య టీచర్ అనగా ప్రతి క్షణము మరియు ప్రతి సంకల్పము ద్వారా సేవ చేసేవారు. ఒక్క క్షణము లేక సంకల్పము వ్యర్థమైనా వారిని శిక్షకులు అనే అంటారు కానీ, యోగ్య శిక్షకులు అని అనరు. యోగ్య శిక్షకులు అనగా యోగయుక్తంగా మరియు యుక్తి యుక్తంగా ఉండేవారు. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారి ప్రతి సంకల్పము సమర్థంగా ఉంటుంది. సంకల్పరూపీ బీజము సమర్థంగా ఉంటే ఫలము కూడా సమర్థంగా ఉంటుంది. నిమిత్తులుగా ఉంటారు అనగా ఉదాహరణ మూర్తులుగా ఉంటారు. ఉదాహరణ మూర్తులు ఎలా ఉంటారో అలాగే ఇతరులు కూడా ఉంటారు, అచ్చా! 

Comments